టూనిస్: నేపాల్ లో విమానం కూలి 18 మంది ప్రయాణికులు మృతి చెందిన ఘటన మరువముందే మరో విమానం ప్రమాదానికి గురైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. అయితే ప్రమాద గురైన ఈ విమానం మాత్రం రక్షణ విభాగానికి చెందినది. లిబియన్ మిలటరీ దళాలు సహాయక చర్యల్లో పాల్గొన్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. టునిషియాకు అత్యంత సమీపంలో సంభవించిన విమాన ప్రమాదంలో 11 మంది మృతి చెందినట్లు టునిషియా రక్షణ శాఖ అధికారి ప్రకటించారు.
మృతి చెందిన వారిలో ముగ్గురు రోగులు కూడా ఉన్నట్లు తెలిపారు. కాగా ప్రమాదానికి జరిగిన కారణాలు మాత్రం ఇంకా తెలియలేదని పేర్కొన్నారు. ఈ విమానం నుంచి చివరి కాల్ టూనిస్-కార్తేజ్ ఎయిర్ పోర్ట్ కు వచ్చినట్లు నమోదైందన్నారు.