టొరంటో విమానాశ్రయంలో అదుపుతప్పిన విమానం | Plane loses control at Toronto airport | Sakshi
Sakshi News home page

టొరంటో విమానాశ్రయంలో అదుపుతప్పిన విమానం

Published Tue, Feb 18 2025 4:44 AM | Last Updated on Tue, Feb 18 2025 4:44 AM

Plane loses control at Toronto airport

8 మంది ప్రయాణికులకు గాయాలు

టొరంటో: కెనడాలో సోమవారం ఓ విమానం అదుపుతప్పింది. టొరంటోలోని పియర్సన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండ్‌ అవుతుండగా రన్‌వే పైనుంచి జారిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు స్థానిక అధికారులను ఉటంకిస్తూ మీడియా తెలిపింది. 

ప్రమాద సమయంలో విమానంలో 80 మంది ఉన్నట్లు సమాచారం. ఈ విమానం మిన్నెపోలిస్‌ నుంచి టొరంటోకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం నేపథ్యంలో ఎయిర్‌పోర్టును మూసివేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement