
సాక్షి, హైద్రాబాద్ : ఉపరాష్రపతి పీఏగా చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడు విజయనగరం జిల్లాకు చెందిన నవీన్ అలియాస్ అర్జున్ రావ్‌గా గుర్తించారు.
ఉపరాష్రపతి పీఏను అంటూ మెడికల్ సీట్లు, బదిలీల్లో సహాయం చేయాలని సంబంధిత అధికారులను నవీన్ బెదిరించాడు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఈ నెల 13న సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో అప్రమత్తమైన సీసీఎస్ పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment