
వెంకయ్యపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీమంత్రి, ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడుపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేశ్ సోమవారం తీవ్ర ఆరోపణలు చేశారు.
వెంకయ్యనాయుడు కుటుంబం నిర్వహించే స్వర్ణభారత్ ట్రస్టుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి మినహాయింపులు పొందారని రమేశ్ తెలిపారు. ఫలితంగా ఈ ట్రస్టు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవెలప్‌మెంట్ అథారిటీకి రూ.రెండు కోట్ల చార్జీలు చెల్లించలేదన్నారు.
వెంకయ్యనాయుడు కుమారుడికి చెందిన హర్ష టయోటా నుంచి తెలంగాణ ప్రభుత్వం టెండర్ లేకుండానే వాహనాలు కొనుగోలు చేసిందని జైరామ్ రమేశ్ ఆరోపించారు. వెంకయ్య చైర్మన్‌గా ఉన్న బోపాల్‌లోని ఖుషాబావు ఠాక్రే స్మారక ట్రస్టుకు కూడా రూ.100 కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని కేవలం రూ.25 లక్షలకు కట్టబెట్టారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఈ కేటాయింపును రద్దు చేసిందని రమేశ్ వివరించారు.