న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ శనివారం ప్రారంభమైంది. పార్లమెంట్ సభ్యులు ఉప రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పార్లమెంట్ హౌస్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఓటింగ్ జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు ఫలితం వెలువడనుంది.
కాగా ఎన్‌డీఏ అభ్యర్థి వెంకయ్య నాయుడు, విపక్షాల అభ్యర్థి, మహాత్మాగాంధీ మనవడు, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ ఉప రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్నారు. అయితే లోక్‌సభలో మెజారిటీ ఉన్నఎన్‌డీఏ అభ్యర్థి వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ఎన్నికకవడం లాంఛనమే.
కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు తెలిపిన బీజేడీ, జేడీయూ ఇప్పుడు గాంధీకి మద్దతిస్తున్నాయి. లోక్‌సభలో మొత్తం సభ్యులు 545. బీజేపీ సభ్యులు 281. బీజేపీతో కలిపి ఎన్‌డీఏ బలం 338. ఇక 243 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీకి 58 మంది సభ్యులు.. కాంగ్రెస్‌కు 57 మంది సభ్యులు ఉన్నారు. ఈ నెల 10వ తేదీతో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీ కాలం యుగియనుంది.