gopalakrishna gandhi
-
మతరహిత దేశం.. గాంధీ స్వప్నం
గాంధీకి సంబంధించినంతవరకు 1947 ఆగస్టు 15.. శాంతిని కోరుకుంటూ ఉపవాసం పాటించాల్సిన దినం. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 1947 ఆగస్టు 16న స్టాటిష్ చర్చి కాలేజి ప్రిన్సిపాల్ జాన్ కెల్లాస్ ఆయనను కలిసి అడిగారు. ‘ఒక జాతికి, మతానికి ఉండే సంబంధం ఏమిటి?’ మతంపేరుతో తన కళ్లముందు జరుగుతున్న పరస్పర మారణకాండకు సాక్షీభూతుడైన గాంధీ.. శ్రీరాముని భక్తుడు.. ఈశ్వరుడు, అల్లా ఇద్దరూ ఒకే నాణానికి రెండు వైపుల వంటివారు అని విశ్వసించిన గాంధీ.. ఏడు దశాబ్దాలు గడిచిన తర్వాత ఈరోజుకూ వర్తించేటటువంటి, జాతి అంతరాళంలో ప్రతిధ్వనిస్తున్నటువంటి ఘనమైన సమాధానం ఇచ్చారు. ’ఒక జాతి లేక దేశం అనేది ఏ ప్రత్యేక మతానికి, మత శాఖకూ చెంది ఉండదు. అది పూర్తిగా ఈ రెండింటికి దూరంగా స్వతంత్రంగా ఉండాలి’. అది 1946 నవంబర్ 6 నడిరాత్రి. దశాబ్దాలుగా మహాత్మాగాంధీ కాంక్షించిన స్వాతంత్య్రం మరికొన్ని నెలల్లో సిద్ధించబోతోంది. అప్పుడే దేశ విభజన శాపంలా ముందుకు వచ్చి అరాచకం, హత్యాకాండ రగులుకున్నాయి. ఆ నేపథ్యంలో ఆ రాత్రి మహాత్మాగాంధీ ఒక పెర్రీ బోట్లో చాంద్‌పూర్ చేరుకున్నారు. క్రూర హింసాకాండకు గురైన హిందువుల పిలుపునందుకుని ఆయన నాటి తూర్పు బెంగాల్‌లోని నౌఖాలి మాగాణిప్రాంతంలో పూర్తిగా నాలుగు నెలల కాలం గడపదలిచారు. తన పర్యటనలో తొలి మజిలీలో అడుగుపెట్టిన వెంటనే బీహార్‌లో ముస్లింలపై పాశవిక ప్రతిదాడి మొదలైందన్న వార్తలు గాంధీ చెవిన పడ్డాయి. తీవ్ర విషాదంతో, అవమానంతో గాంధీ చెప్పారు. ‘ఈరోజు భారత స్వాతంత్య్రం బెంగాల్, బిహార్లలో ప్రమాదంలో పడింది. బిహారీలు పిరికిపందల్లా వ్యవహరించారు. బిహారీలు నిజంగా ఎదురుదెబ్బ తీయాలని భావించి ఉంటే వారు నౌఖాలికి వచ్చి అక్కడ ప్రాణాలివ్వడానికి సిద్ధపడి ఉండాలి’. ఆ మరుసటి రోజు రెండు ప్రతినిధి బృందాలు గాంధీని కలిశాయి. మొదట ముస్లిం ప్రతినిధులు వచ్చి, చాంద్‌పూర్‌లో ఎలాంటి అలజడులూ జరగకుండా చూస్తున్నామని చెప్పారు. తర్వాత హిందూ ప్రతినిధులు వచ్చారు. తమకు పోలీసు, మిలటరీ రక్షణ కావాలని చెప్పారు. ఆ సాయంత్రం చాంద్‌పూర్‌లో 15 వేలమంది (ఎక్కువమంది ముస్లింలే) హాజరైన సభలో గాంధీ ప్రసంగించారు. ‘ఇక్కడ బలవంతపు మత మార్పిడిలు జరిగాయని విన్నాను. బలవంతంగా గొడ్డుమాంసం తిని పించారని విన్నాను. బలవంతంగా పెళ్లిళ్లు జరిపిం చారని విన్నాను. ఇక హత్యలు, లూటీలు, దోపిడీల విషయం చెప్పాల్సిన పని లేదు. ప్రజలు విగ్రహాలు కూల్చేశారు. ముస్లింలు విగ్రహారాధన చేయరు. నేను కూడా పాటించను. కానీ ఆ విగ్రహాలను పూజిస్తున్న వారి వ్యవహారాల్లో వీరు ఎందుకు తల దూర్చినట్లు? ఇలాంటి ఘటనలు ఇస్లాం పేరుకు కళంకం తెస్తున్నాయి’. తూర్పు బెంగాల్లో దహనకాండ పూర్తిగా అంతం కాకున్నా కాస్త చల్లారింది. తర్వాత గాంధీ 1947 మార్చి 3న ప్రత్యర్థి యుద్ధరంగమైన బిహా ర్కు వెళ్లారు. అక్కడ బిర్ అనే గ్రామంలో అమాయక ముస్లింలపై పాశవిక హింసాకాండ గురించి తెలుసుకుని ఆ గ్రామాన్ని సందర్శించారు. ఆ గ్రామంలో హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించిన గాంధీ తన ఆగ్రహాన్ని నియంత్రించుకోలేకపోయారు. ‘110 సంవత్సరాల వయసు ఉన్న ఒక వృద్ధ మహిళను మీ కళ్లముందే నరికిపారేస్తుంటే మీరు చూస్తూ ఇంకా ఎలా బతికి ఉన్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను. నేను ఇక విశ్రాంతి తీసుకోను, ఇతరులను విశ్రాంతిగా ఉంచను. ఈ ప్రాంతమంతటా కాలినడకతోనే తిరుగుతాను. ఏం జరిగిందని ఇక్కడ పడి ఉన్న అస్థిపంజరాలను అడుగుతాను. ఈ మొత్తం ఘటనలన్నింటికీ పరిష్కారం కనుగొనేదాకా నేను శాంతిగా ఉండలేను. నాలో మంటలు రేగుతున్నాయి’ అని గాంధీ పేర్కొన్నారు. రెండు భూభాగాల్లో అధికార మార్పిడికి చర్యలు తుదిరూపం తీసుకుంటున్న సందర్భంలో గాంధీ ఆ తతంగానికి పూర్తిగా దూరంగా ఉండిపోయారు. ఆయన హృదయం చెబుతున్న చోటికే ఆయన పాదాలు అడుగేశాయి. హింసాకాండ బాధితులు ఎక్కడుంటే అక్కడికల్లా ఆయన వెళ్లిపోయారు. ఇక ఆగస్టు మొదట్లో ఆయన బిహార్ నుంచి బెంగాల్‌కు తిరిగి వెళ్లిపోయారు. ఇంకా వ్యవస్థ విఫలం స్పష్టంగా కనబడుతున్న నౌఖాలీకి తిరిగి వెళ్లాలన్నదే ఆయన ఉద్దేశం. కలకత్తాలో, అతిపెద్ద ముస్లిం ప్రతినిధి బృందం గాంధీని కలిసి అల్లర్లు జరగనున్నట్లు కనిపిస్తున్న నగరంలోనే ఉండిపోవాలని కోరారు. అయితే రెండు షరతులపై గాంధీ అందుకు అంగీకరించారు. ఒకటి. నగరంలో శాంతి పరిరక్షణకోసం తనను ఉండిపోవాలని కోరుతున్న కలకత్తా ముస్లింలు నౌఖాలీలో హిందువుల భద్రతకోసం ప్రయత్నం చేయాలి. రెండు, నగరంలో ముస్లిం నివాసుల భద్రతకు హిందువులు హామీ ఇచ్చేటటువంటి ముస్లిం ప్రాంతంలోనే తాను ఉంటాడు. గాంధీ ఎక్కడ విడిది చేయాలో నిర్ణయించారు. అది బెలియాఘట్ శివార్లలోని హైదరి మంజిల్. అది ఎంతో పాడుపడిన ఇల్లు అని మను గాంధీ నమోదు చేశారు. ‘ఆ ఇంటిలో ఏ సౌకర్యమూ లేదు. అన్ని వైపులా తెరుచుకునే ఉంటుంది. ఒకే మరుగుదొడ్డి ఉంది. ఆ ఇంటిలోని ప్రతి అంగుళం దుమ్ముతో నిండివుంది. ఇంటినిండా వర్షధారలు కాస్త సౌకర్యంగా ఉన్నట్లు కనిపించే ఒక్క గదిలోనే బాపూతో సహా అందరూ గడిపారు’.ఆగస్టు 9న సమాచార శాఖకు చెందిన ఒక అధికారి గాంధీని కలిసి ఆగస్టు 15న జాతినుద్దేశించి సందేశం ఇవ్వాలని కోరారు. కానీ గాంధీ నిరాకరించారు. మీరు సందేశం ఇవ్వకపోతే ఆనాటి కార్యక్రమం పాడైపోతుందని ఆ అధికారి ఒత్తిడి చేశారు. దానికి గాంధీ ప్రత్యుత్తరం ఇచ్చారు. ‘నేను సందేశం ఇవ్వను.. ఆ కార్యక్రమం పాడు కానివ్వండి’. ఆగస్టు 14న అక్కడ వాతావరణంలో కాస్త మార్పు కలిగినట్లు కనిపించింది. ప్రీమియర్ హెచ్ఎస్ సుహ్రావర్ధికి ఆరోజు తన కార్యాలయంలో చివరి రోజు. దాంతో స్వాతంత్య్ర ఉత్సవ కార్యక్రమాలను చూపించడానికి, చివరి బ్రిటిష్ గవర్నర్ నిష్క్రమించడాన్ని, భారత తొలి గవర్నర్ పదవీ స్వీకారాన్ని, పీసీ ఘోష్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటును గాంధీకి చూపించడానికి తన వాహనంలో తీసుకుపోయే అవకాశాన్ని పొందారాయన. ఆ రోజు నగరంలో పరిస్థితులను చూసిన తర్వాతే గాంధీ తన సందేశం ఇచ్చారు. అది నాటి పరిస్థితులను ప్రతిధ్వనించిన సందేశం. ‘రేపు బ్రిటిష్ బంధనాలనుంచి విముక్తి పొందుతున్నాం. కానీ ఈ అర్ధరాత్రి నుంచే హిందూస్తాన్ రెండు ముక్కలవుతోంది. కాబట్టి రేపు అటు ఆనందాన్ని, విషాదాన్ని కలిగించే రోజుగా ఉండబోతోంది’ అని గాంధీ ఆ సందేశంలో పేర్కొన్నారు. గాంధీకి సంబంధించినంతవరకు 1947 ఆగస్టు 15 ఉపవాసం పాటించాల్సిన దినం. ఆయన హృదయంలో ఆనాడు ఆగ్రహజ్వాలలు రేగుతూ ఉండిపోయాయి. 1942లో ఆ రోజునే మరణించిన తన పుత్రసమానుడైన కార్యదర్శి మహదేవ్ దేశాయి గురించి తల్చుకున్నారు. బెలియాఘటలో తాను ఉంటున్న చోటుకు వేలాదిమంది జొరబడ్డారు. ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రులు కూడా వారిలో ఉన్నారు. ఆయన వారితో ఇలా అన్నారు. ‘ఊరించే సంపదల మాయలో పడవద్దు’. ఆ మరుసటి దినం 1947 ఆగస్టు 16న స్టాటిష్ చర్చి కాలేజి ప్రిన్సిపాల్ జాన్ కెల్లాస్ ఆయనను కలిసి అడిగాడు. ’ఒక జాతికి, మతానికి ఉండే సంబంధం ఏమిటి?’ మతంపేరుతో తన కళ్లముందు జరుగుతున్న పరస్పర మారణకాండకు సాక్షీభూతుడైన గాంధీ.. శ్రీరాముని భక్తుడు.. ఈశ్వరుడు, అల్లా ఇద్దరూ ఒకే నాణానికి రెండు వైపులవంటివారు అని విశ్వసించిన గాంధీ.. ఈరోజుకూ వర్తిస్తూ జాతి అంతరాళంలో ప్రతిధ్వనిస్తున్న ఘనమైన సమాధానం ఇచ్చారు. ‘ఒక జాతి లేక దేశం అనేది ఏ ప్రత్యేక మతానికి, మత శాఖకూ చెంది ఉండదు. అది పూర్తిగా ఈ రెండింటికి దూరంగా స్వతంత్రంగా ఉండాలి’. (హిందూస్తాన్ టైమ్స్ సౌజన్యంతో) వ్యాసకర్త మాజీ గవర్నర్, మాజీ దౌత్యవేత్త గోపాలకృష్ణ గాంధీవిశ్లేషణ -
గోపాల్‌కృష్ణ గాంధీకి ‘సద్భావన అవార్డు’
న్యూఢిల్లీ: జాతీయ సమగ్రత, మతసామరస్యం, శాంతి కోసం పాటుపడేవారికి ఏటా ప్రదానం చేసే ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డుకు పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, మహాత్మాగాంధీ మనవడు గోపాల్‌కృష్ణ గాంధీ ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ సభ్య కార్యదర్శి మోతీలాల్ వోరా తెలిపారు. ఈ నెల 20న రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా అవార్డును ప్రదానం చేయనున్నారు. అవార్డు కింద జ్ఞాపికతో పాటు రూ.10 లక్షల నగదు ఇవ్వనున్నారు. -
ప్రారంభమైన ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ శనివారం ప్రారంభమైంది. పార్లమెంట్ సభ్యులు ఉప రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పార్లమెంట్ హౌస్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఓటింగ్ జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు ఫలితం వెలువడనుంది. కాగా ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్య నాయుడు, విపక్షాల అభ్యర్థి, మహాత్మాగాంధీ మనవడు, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ ఉప రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్నారు. అయితే లోక్‌సభలో మెజారిటీ ఉన్నఎన్డీఏ అభ్యర్థి వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ఎన్నికకవడం లాంఛనమే. కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు తెలిపిన బీజేడీ, జేడీయూ ఇప్పుడు గాంధీకి మద్దతిస్తున్నాయి. లోక్‌సభలో మొత్తం సభ్యులు 545. బీజేపీ సభ్యులు 281. బీజేపీతో కలిపి ఎన్డీఏ బలం 338. ఇక 243 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీకి 58 మంది సభ్యులు.. కాంగ్రెస్‌కు 57 మంది సభ్యులు ఉన్నారు. ఈ నెల 10వ తేదీతో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీ కాలం యుగియనుంది. -
నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక
► సాయంత్రానికి ఫలితం వెల్లడి ► ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్యకే విజయావకాశాలు న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమయ్యింది. శనివారం(నేడు) పార్లమెంట్ సభ్యులు ఉప రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే విషయం శనివారం సాయంత్రానికి తేలిపోనుంది. లోక్‌సభలో మెజారిటీగల ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికకవడం లాంఛనమే. ఆయనపై విపక్షాలు మహాత్మాగాంధీ మనవడు, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీని రంగంలోకి దించాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు తెలిపిన బీజేడీ, జేడీయూ ఇప్పుడు గాంధీకి మద్దతిస్తున్నాయి. సాయంత్రానికి ఫలితం: పార్లమెంట్ హౌస్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఓటింగ్ జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు ఫలితం వెల్లడిస్తారు. రహస్య ఓటింగ్ పద్ధతిలో ఈ ఎన్నిక జరుగుతున్నందున పార్టీలు విప్ జారీ చేయలేదు. రెండుసార్లు ఉపరాష్ట్రపతిగా కొనసాగిన హమీద్ అన్సారీ పదవీకాలం ఈ నెల 10తో ముగియనుంది రాజ్యసభ ఎక్స్–అఫీషియో చైర్మన్, లోక్‌సభ, రాజ్యసభలకు ఎన్నికైన, నామినేట్ అయిన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ఉపరాష్ట్రపతిని ఎన్నుకోనుంది. ఉభయ సభల్లో మొత్తం సభ్యుల సంఖ్య 790. అయితే లోక్‌సభలో రెండు, రాజ్యసభలో ఒక స్థానం ఖాళీగా ఉన్నాయి. అలాగే కోర్టు తీర్పు కారణంగా లోక్‌సభలో బీజేపీ ఎంపీ చేడీ పాశ్వన్ ఓటు హక్కును వినియోగించుకోలేరు. 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి ఎన్నికలో గెలుస్తారు. లోక్‌సభలో మొత్తం సభ్యులు 545. బీజేపీ సభ్యులు 281. బీజేపీతో కలిపి ఎన్డీఏ బలం 338. ఇక 243 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీకి 58 మంది సభ్యులు.. కాంగ్రెస్‌కు 57 మంది సభ్యులు ఉన్నారు. కాగా, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఒకే కుటుంబం(బీజేపీ) నుంచి వస్తుండటంతో 2017–2022 మధ్య ఉజ్వల భవిత దిశగా దేశం పయనిస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యకు మద్దతిస్తున్న వివిధ పార్టీల ఎంపీలతో నిర్వహించిన భేటీలో ఆయన మాట్లాడారు. -
జేడీయూ మద్దతు గాంధీకే!
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికలో విపక్ష అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకే మద్దతిస్తున్నట్లు జేడీయూ స్పష్టం చేసింది. గాంధీకి మద్ధతివ్వాలన్న నిర్ణయం జేడీయూ బీజేపీతో కలవకముందు బిహార్ సీఎం నితీశ్ తీసుకున్నదేనని, దానికి కట్టుబడి ఉంటామని పార్టీ సీనియర్ నేత కేసీ త్యాగి ఆదివారం స్పష్టం చేశారు. ఇటీవల మహాకూటమి నుంచి వైదొలగి బీజేపీతో చేతులు కలిపి బిహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని జేడీయూ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా ఆగస్ట్ 5న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. -
గోపాలకృష్ణ గాంధీ నామినేషన్
హాజరైన మన్మోహన్, సోనియా, రాహుల్ న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల సమక్షంలో ఆయన పార్లమెంట్ హౌస్‌లో రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు. శరద్ యాదవ్(జేడీయూ), సీతారాం ఏచూరి(సీపీఎం), డి.రాజా(సీపీఐ), తారిక్ అన్వర్, ప్రఫుల్ పటేల్(ఎన్సీపీ), ఫరూక్ అబ్దుల్లా(ఎన్సీ), కనిమొళి(డీఎంకే) కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీ విలేకర్లతో మాట్లాడుతూ.. ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ను ఉరిశిక్ష నుంచి కాపాడటానికి తాను చేసిన యత్నాలను సమర్థించుకున్నారు. మరణశిక్ష తప్పు అని, అది మధ్యయుగాల నాటి శిక్ష అని వ్యాఖ్యానించారు. మరణశిక్షను వ్యతిరేకించి, దాన్ని రద్దు చేయాలని కోరుకున్న మహాత్మాగాంధీ, బాబాసాహేబ్ అంబేడ్కర్ల స్ఫూర్తితో ఆ పని చేశానని తెలిపారు. మెమన్ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణపై పునరాలోచించాలని అప్పట్లో తాను రాష్ట్రపతికి పంపిన పిటిషన్‌పై శివసేన చేసిన తాజా విమర్శలపై గాంధీ స్పందించారు. ‘మెమన్ కేసులో వాస్తవాలను ప్రణబ్ ముఖర్జీ ముందుంచాలని అనుకున్నాను. గత రాష్ట్రపతులు కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలాంలా ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకున్నా.. శివసేన తన పని తాను చేసింది. మరణశిక్ష తప్పు అనేది నా విశ్వాసం.. ఒక సామాన్య, స్వతంత్ర పౌరుడిగా నా విశ్వాసాలను పాటించడం నా విధి’ అని పేర్కొన్నారు. పాకిస్తాన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కులభూషణ్ జాధవ్ కోసం కూడా ఇలాంటి పిటిషన్ పంపానని వెల్లడించారు. ప్రస్తుతం దేశాన్ని విడగొట్టే శక్తి క్రియాశీలంగా పనిచేస్తోందని వ్యాఖ్యనించారు. తాను ఏ పార్టీకీ కాకుండా ఈ దేశ సామాన్య పౌరుడికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని, ప్రజలకు, రాజకీయాలకు మధ్య ఉన్న ఖాళీని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. రాజకీయాలపై ప్రజలు కోల్పోయిన విశ్వాసం పునరుద్ధరణ కావాలని కోరుకుంటున్నానన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో గెలుపోటములపై స్పందిస్తూ.. కొన్నిసార్లు అంకెలతో సబంధం లేని విశ్వాసాల కోసం ముందుకు రావాల్సి ఉంటుందన్నారు. బీజేడీ మద్దతు.. భువనేశ్వర్: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ప్రకటించిన బీజేడీ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం విపక్ష అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకి మద్దతు తెలిపింది. ఈమేరకు పార్టీ నేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మంగళవారం వెల్లడించారు. గాంధీ తనకు పాతమిత్రుడని, తాను రాజకీయాల్లోకి రాకముందే తాము స్నేహితులమని నవీన్ 2012లో చెప్పారు. -
నితీష్ కుమార్ ఓటెవరికి?
న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి పదవికి ఉమ్మడి అభ్యర్థిగా జాతిపిత మహాత్మాగాంధీ మనుమడు గోపాలకృష్ణ గాంధీని ఎంపిక చేయడంలో విజయం సాధించిన ప్రతిపక్షాలు జేడీయూ నాయకుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మద్దతును కూడగట్టడంలో విజయం సాధిస్తాయా? అన్నదే ఇప్పుడు ముఖ్యమైన అంశం. ప్రతిపక్షాల ఐక్యతకు గత ఏప్రిల్ నెలలోనే అన్నీ తానై చొరవ తీసుకున్న నితీష్ కుమార్ తమతో చేతులు కలుపుతారనే ఆశ ప్రతిపక్షాలకు లేకపోలేదు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలోనే నితీష్ కుమార్ కలసివస్తారని కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్ష పార్టీలు ఆశించాయి. ఆయన అనూహ్యంగా ప్రతిపక్షాల సమావేశానికి హాజరుకాకపోవడం, అదేరోజు ప్రధాని నరేంద్ర మోదీతో విందు సమావేశంలో పాల్గొనడం విపక్ష పార్టీలను విభ్రమపర్చాయి. అనుమానించినట్లుగానే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నోథ్ కోవింద్‌ను బలపర్చి ప్రతిపక్ష పార్టీలను నితీష్ కుమార్ నిరాశ పర్చారు. అలాగే రాష్ట్రపతి పదవికి ఉమ్మడి అభ్యర్థిని ఎన్నుకోవడం కోసం మంగళవారం జరిగిన విపక్షాల సమావేశానికి నితీష్ కుమార్ ఎగనామంపెట్టి ఇప్పుడు కూడా అనుమానం బీజాలు నాటారు. బీజేపీలో ఉన్నప్పుడు కూడా లౌకికభావాలు కట్టుబడి రాజకీయవేత్తగా రాణించిన నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ప్రధాని మోదీ పక్షాన చేరాల్సిన అవసరమే లేదు. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు జరిపితే దాన్ని ఇబ్బందికర పరిణామంగా భావించి లాలూతో నితీష్ తెగతెంపులు చేసుకుంటారని బీజేపీ పెద్ద నేతలు ఆశించి ఉండవచ్చు. దర్యాప్తు దశలో లాలూతో సంబంధాలు తెంపుకోవాల్సిన అవసరం నితీష్‌కు లేదు. ఎందుకంటే అంతకంటే అపకీర్తి కలిగిన నేతల మద్దతుతో నితీష్ ప్రభుత్వ పాలన సాగించిన రోజులు ఉన్నాయి. కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌గా ముద్రపడిన సూరజ్ భాన్ సింగ్ లాంటి వారి మద్దతుతోనే ఆయన ప్రభుత్వాని నిలబెట్టుకున్నారు. 1989లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి వీపీ సింగ్ ప్రభుత్వం ఏర్పాటవడానికి ముఖ్యకారకుడు నాటి హర్యానా ముఖ్యమంత్రి దేవీలాల్. ఆయనే అన్ని విపక్షాలను ఏకం చేశారు. సరిగ్గా ఇప్పుడు అలాంటి మహత్తర పాత్రను నిర్వహించే అవకాశం నితీష్ కుమార్‌కు వచ్చింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదిగే అవకాశం కూడా ఉంది. ఈ అవకాశాన్ని ఆయన ఉపయోగించుకుంటారా? 1966లో జ్యోతిబసు ప్రధాన మంత్రయ్యే అవకాశాన్ని వదులుకొని చారిత్రక తప్పిదం చేశామంటూ పశ్చాత్తామం పడతారా? అన్నది నితీష్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.