
గోపాల్‌కృష్ణ గాంధీ
న్యూఢిల్లీ: జాతీయ సమగ్రత, మతసామరస్యం, శాంతి కోసం పాటుపడేవారికి ఏటా ప్రదానం చేసే ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డుకు పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, మహాత్మాగాంధీ మనవడు గోపాల్‌కృష్ణ గాంధీ ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ సభ్య కార్యదర్శి మోతీలాల్ వోరా తెలిపారు. ఈ నెల 20న రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా అవార్డును ప్రదానం చేయనున్నారు. అవార్డు కింద జ్ఞాపికతో పాటు రూ.10 లక్షల నగదు ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment