ఘనంగా రాజీవ్‌గాంధీ జయంతి
Published Sat, Aug 20 2016 10:20 PM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM
మందమర్రి : దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 72వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజీవ్‌గాంధీ ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్ల రమేశ్, సంగి సంతోశ్ మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకువచ్చి దేశం ప్రగతి మూల కారకుడయ్యాడని పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ స్ఫూర్తిని ప్రతీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కలిగి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దుర్గం ప్రభాకర్, రాజబాబు, నరేందర్, అనిల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్ : రాజీవ్‌గాంధీ 72వ జయంతిని శనివారం రామకృష్ణాపూర్‌లో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్‌చౌక్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపర్చడానికి రాజీవ్ చేసిన కృషిని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గోపతి రాజయ్య, వార్డు సభ్యులు గోపతి బానేష్, సురేశ్, నాయకులు శ్రీనివాస్, లచ్చన్న, సంపత్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement