ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
భువనేశ్వర్ : రాష్ట్ర పర్యటనకు విచ్చేయుచున్న ఉప రాష్ట్రపతి పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నట్లు అధికారిక వర్గాలు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తొలుత ఆగస్టు 16వ తేదీన రాష్ట్ర పర్యటనకు వస్తున్నట్లు అధికారులు గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఈ నెల 25వ తేదీకి ఉప రాష్ట్రపతి పర్యటన వాయిదా పడినట్లు అధి కారులు వెల్లడించారు.
ఇదే విషయమై రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి అశిత్ త్రిపాఠి నుంచి తమకు సమాచారం వచ్చిందని అధికారులు తెలిపారు. స్థానిక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) కాన్వొకేషన్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు ఉప రాష్ట్రపతి విచ్చేస్తున్న విష యం తెలిసిందే. ఆగస్టు 25న ఉదయం 8 గం టలకు న్యూ ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరి, ఉదయం 10 గంటలకు స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారన్నారు.
అనంతరం అక్కడి నుంచి నేరుగా కాన్వొకేషన్ ప్రోగ్రాంలో పాల్గొంటారని అధికారులు వివరించారు. కార్య క్రమానంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి న్యూ ఢిల్లీకి పయనమవుతారని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment