Orissa tour
-
25న ఉపరాష్ట్రపతి పర్యటన
భువనేశ్వర్ ఒరిస్సా : భారత ఉపరాష్ట్రపతి ఈ నెల 25న రాష్ట్ర పర్యటనకు విచ్చేస్తున్నారు. స్థానిక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) తొలి కాన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విచ్చేస్తున్నారు. లోగడ ఈ కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అనివార్య కారణాలతో కార్యక్రమం వాయిదా పడడంతో ఈ నెల 25వ తేదీన నిర్వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి రాష్ట్ర పర్యటనను పురస్కరించుకుని బ్లూ బుక్ మార్గదర్శకాల మేరకు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి నగరంలో సుమారు 4 నుంచి 5 గంటలు మాత్రమే పర్యటిస్తారు. ఈ వ్యవధిలో అవాంఛనీయ సంఘటనల నివారణ దృష్ట్యా 25 ప్లాటూన్ల పోలీసు దళాల్ని ప్రత్యేకంగా మోహరిస్తున్నారు. న్యూ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విచ్చేసే ఉప రాష్ట్రపతి ప్రత్యక్షంగా రాజ్ భవన్‌కు వెళ్లి కార్యక్రమం వేదిక ప్రాంగణం ఎయిమ్స్‌కు చేరుకుంటారని జంట నగరాల పోలీస్ కమిషనర్ సత్యజిత్ మహంతి తెలిపారు. కార్యక్రమం ముగియడంతో స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి న్యూ ఢిల్లీ తిరిగి వెళ్తారని ఉపరాష్ట్రపతి కార్యక్రమం వివరాల్ని సంక్షిప్తంగా వివరించారు. -
ఉప రాష్ట్రపతి పర్యటన వాయిదా
భువనేశ్వర్ : రాష్ట్ర పర్యటనకు విచ్చేయుచున్న ఉప రాష్ట్రపతి పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నట్లు అధికారిక వర్గాలు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తొలుత ఆగస్టు 16వ తేదీన రాష్ట్ర పర్యటనకు వస్తున్నట్లు అధికారులు గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఈ నెల 25వ తేదీకి ఉప రాష్ట్రపతి పర్యటన వాయిదా పడినట్లు అధి కారులు వెల్లడించారు. ఇదే విషయమై రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి అశిత్ త్రిపాఠి నుంచి తమకు సమాచారం వచ్చిందని అధికారులు తెలిపారు. స్థానిక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) కాన్వొకేషన్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు ఉప రాష్ట్రపతి విచ్చేస్తున్న విష యం తెలిసిందే. ఆగస్టు 25న ఉదయం 8 గం టలకు న్యూ ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరి, ఉదయం 10 గంటలకు స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారన్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కాన్వొకేషన్ ప్రోగ్రాంలో పాల్గొంటారని అధికారులు వివరించారు. కార్య క్రమానంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి న్యూ ఢిల్లీకి పయనమవుతారని అధికారులు పేర్కొన్నారు. -
నేడు రాష్ట్రానికి నేపాల్ రాజు
భువనేశ్వర్: తూర్పు భారత దేశపు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేపాల్ దేశపు చివురి రాజా జ్ఞానేంద్ర వీర్ విక్రమ్ సాహా దేవ్ దేశానికి విచ్చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఒడిశా రాష్ట్ర పర్యటన కూడా ఖరారైంది. భారతీయుల పవిత్ర గోమాత పూజా దుల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొం టారు. గోమాత సంరక్షణ కో సం నిర్వహిస్తున్న అంతర్జాతీయ గోసంవర్ధన మహోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఖుర్దా జిల్లాలోని జట్నీ రత్తిపూర్ గ్రామంలో గోమాత మందిరం నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేస్తారు. అనంతరం నగరంలోని లింగరాజ దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజాదుల్లో పాల్గొంటారు. సాక్షి గోపాల్ దేవస్థానాన్ని సందర్శిస్తారు. పూరీ జగన్నాథుని దేవస్థానంలో ప్రత్యేక పూజాదులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జగన్నాథుని సంస్కృతితో నేపాల్ రాజవంశానికి సంబం ధాలు ఉన్నందున శ్రీ మందిరంలో చతుర్థా మూర్తులు కొలువు దీరిన రత్నవేదికపైకి వెళ్లి ఆయనకు పూజాదులు నిర్వహించే యోగ్యత ఉంది. ఈ నేపథ్యంలో 36 నియోగుల సంఘం ప్రత్యేక షెడ్యూలు ఖరారు చేసింది. రాష్ట్ర పర్యటన ముగించుకుని ఆయన పశ్చిమ బెంగాల్‌ను సందర్శిస్తారు. 2001 నుంచి 2008 సంవత్సరాల -
కాంగ్రెస్‌ను కాపాడేందుకే తృతీయ ఫ్రంట్
భువనేశ్వర్, న్యూస్‌లైన్: కాంగ్రెస్‌ను కాపాడేందుకే తృతీయ ఫ్రంట్‌కోసం పావులు కదుపుతున్నారని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆరోపించారు. స్వరాష్ట్రాల్లో ముఖాలు చెల్లని నాయకులంతా కలిసి మూడోఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒడిశా పర్యటనలో భాగంగా స్థానిక బొరొముండా గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సభలో మంగళవారం ఆయన ప్రసంగించారు. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన భువనేశ్వర్‌లో పర్యటించడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా తృతీయఫ్రంట్ కోసం వివిధ పార్టీల నేతలు చేస్తున్న ప్రయత్నాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన ఏమన్నారంటే.. - యూపీలో సమాజ్‌వాదీ పార్టీ కావచ్చు.. పశ్చిమబెంగాల్లో లెఫ్ట్ కావచ్చు లేదా ఒడిశాలో బీజేడీ కావచ్చు.. తృతీయ ఫ్రంట్‌కు చెందిన సభ్యులంతా తమ తమ పాలిత రాష్ట్రాలను ధ్వంసం చేసినవారే. - తృతీయఫ్రంట్ ఏర్పాటుకోసం ఆరాట పడుతున్న 11 పార్టీల్లో 9 కాంగ్రెస్ తొత్తులుగా వ్యవహరించేవే. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇవన్నీ తృతీయఫ్రంట్ ముసుగు కప్పుకున్నాయి. వీటి ఏకైక లక్ష్యం కాంగ్రెస్‌ను కాపాడడమే. బీజేపీ పాలనలోని పశ్చిమ రాష్ట్రాలు అభివృద్ధిలో నడుస్తుం టే.. కాంగ్రెస్, తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు తాపత్రయ పడుతున్న నేతల పాలనను చవిచూసిన యూపీ, ఒడిశా,బెంగాల్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయి. - {పజలు కాంగ్రెస్ పాలన, కమ్యూనిస్టుల పాలన, ప్రాంతీయ పార్టీల పాలన, బీజేపీ పాలనలను చూశారు. వీటిలో ఎవరు ప్రజలకోసం పనిచేశారో గుర్తించాలి. అభివృద్ధి కావాలంటే బీజేపీ పాలన సరైందని నేను ఘంటాపథంగా చెప్పగలను. దేశ సమగ్రాభివృద్ధికి నాకు 60 నెలలు అవకాశమివ్వండి. - బీజేపీ మాజీ మిత్రపక్షమైన బీజేడీపైన, ఆ పార్టీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌పైన మోడీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను, పట్నాయక్ 14 ఏళ్లుగా సీఎంలుగా కొనసాగుతున్నామని, తన పర్యవేక్షణలో గుజరాత్ అభివృద్ధి పథంలో నడవగా.. చెప్పుకోదగిన వనరులున్నప్పటికీ ఒడిశా ఇంకా పేద రాష్ట్రంగానే మిగిలిందన్నారు.