నేపాల్ దేశపు చివురి రాజా జ్ఞానేంద్ర వీర్ విక్రమ్ సాహా దేవ్
భువనేశ్వర్: తూర్పు భారత దేశపు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేపాల్ దేశపు చివురి రాజా జ్ఞానేంద్ర వీర్ విక్రమ్ సాహా దేవ్ దేశానికి విచ్చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఒడిశా రాష్ట్ర పర్యటన కూడా ఖరారైంది. భారతీయుల పవిత్ర గోమాత పూజా దుల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొం టారు. గోమాత సంరక్షణ కో సం నిర్వహిస్తున్న అంతర్జాతీయ గోసంవర్ధన మహోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఖుర్దా జిల్లాలోని జట్నీ రత్తిపూర్ గ్రామంలో గోమాత మందిరం నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేస్తారు.
అనంతరం నగరంలోని లింగరాజ దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజాదుల్లో పాల్గొంటారు. సాక్షి గోపాల్ దేవస్థానాన్ని సందర్శిస్తారు. పూరీ జగన్నాథుని దేవస్థానంలో ప్రత్యేక పూజాదులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జగన్నాథుని సంస్కృతితో నేపాల్ రాజవంశానికి సంబం ధాలు ఉన్నందున శ్రీ మందిరంలో చతుర్థా మూర్తులు కొలువు దీరిన రత్నవేదికపైకి వెళ్లి ఆయనకు పూజాదులు నిర్వహించే యోగ్యత ఉంది. ఈ నేపథ్యంలో 36 నియోగుల సంఘం ప్రత్యేక షెడ్యూలు ఖరారు చేసింది. రాష్ట్ర పర్యటన ముగించుకుని ఆయన పశ్చిమ బెంగాల్‌ను సందర్శిస్తారు. 2001 నుంచి 2008 సంవత్సరాల
Comments
Please login to add a commentAdd a comment