వైఎస్సార్‌సీపీ ‘ఫీజు పోరు’ వాయిదా | YSRCP Protest On No Fee Reimbursement In AP Postponed | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ‘ఫీజు పోరు’ వాయిదా

Published Mon, Feb 3 2025 8:16 PM | Last Updated on Mon, Feb 3 2025 8:26 PM

YSRCP Protest On No Fee Reimbursement In AP Postponed

సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ నిర్వహించతలపెట్టిన ఫీజు పోరు నిరసన కార్యక్రమం వాయిదా పడింది. ఫిబ్రవరి 5న జరగాల్సిన కార్యక్రమాన్ని మార్చి 12కి వాయిదా వేసింది. ఈ మేరకు పార్టీ సోమవారం(ఫిబ్రవరి3) ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో  ఫీజుపోరు వాయిదా నిర్ణయం తీసకున్నట్లు తెలిపింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున తమ ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని ఆదివారమే ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్‌సీపీ కోరింది. అయితే ఈసీ నుంచి స్పందన లేకపోవడంతో నిరసనను వాయిదా వేయాలని నిర్ణయించారు. 

దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు ప్రవేశపెట్టిన పీజు రీయింబర్స్‌మెంట్‌ స్కీమ్‌తో ఎందరో ఐటీ నిపుణులుగా, ప్రొఫెషనల్‌ కోర్సులు చదువుకున్నారు. తర్వాత వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలోనూ ఈ స్కీమ్‌ విజయవంతంగా కొనసాగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఈ స్కీమ్‌ అమలు చేయకుండా పేద, మధ్య తరగతి విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్థులు,వారి తల్లిదండ్రుల పక్షాన ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఫీజుపోరు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్‌ కారణంగా ఈ కార్యక్రమం మార్చి 12కి వాయిదా పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement