విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారని సమాచారం. విజయ్ దేవరకొండ కెరీర్‌లో 12వ సినిమా ఇది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాను తొలుత మార్చి 28న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్.
అయితే ఆ డేట్‌కి రిలీజ్ వాయిదా పడిందని తెలిసింది. మే 30న రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్రయూనిట్ ఉందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ చిత్రంలో విజయ్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారని, రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కానుందనే టాక్ ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత దర్శకులు రాహుల్ సంకృత్యాన్ , రవికిరణ్ కోలా సినిమాల్లో విజయ్ దేవర కొండ నటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment