
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ 'జనగణమన' (JGM). రౌడీ హీరో విజయ్ దేవరకొండతో జగన్ తెరకెక్కిస్తున్న రెండో చిత్రమిది. ఇదివరకే పాన్ ఇండియాగా 'లైగర్' మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు 25, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా పూరీ జగన్నాథ్-విజయ్ దేవరకొండ క్రేజీ కాంబోగా వస్తోన్న ఈ 'జనగణమన' చిత్రం పోస్టర్, విడుదల తేదిని ప్రకటించారు. ఈ పోస్టర్ లాంచ్‌ను మంగళవారం (మార్చి 29) ముంబైలో గ్రాండ్‌గా జరిగింది.
ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ ఆర్మీ డ్రెస్‌లో ప్రత్యేక ఛాపర్‌లో ముంబై చేరుకున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సైనికుడిగా కనిపించనున్నాడు రౌడీ హీరో. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ 'నేను ఈ సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. నేను చూసిన స్క్రిప్ట్‌లలో ఇది చాలా ఛాలెంజింగ్ కథ. ఈ సినిమా కథ ప్రతీ భారతీయుడికి హత్తుకుంటుంది. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను. నేను ఎప్పుడూ చేయని పాత్రను జెజీఎంలో చేస్తున్నాను. ఆ పాత్ర ప్రభావం ప్రేక్షకులపై కచ్చితంగా ఉంటుందని విశ్వవిస్తున్నాను.' అని తెలిపాడు.
'మా తర్వాతి ప్రాజెక్ట్ జెజీఎం పోస్టర్‌ను నాకు చాలా సంతోషంగా ఉంది. విజయ్‌తో మళ్లీ కలిసి పనిచేయడం గొప్పగా అనిపిస్తుంది. ఇది ఒక బలమైన కథ, కథనంతో ఉన్న అల్టిమేట్ యాక్షన్ ఎంటర్‌టైనర్.' అని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు.ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ బాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ఆగస్టు 3, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 2022లో షూటింగ్ ప్రారంభంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment