![Liger Producer Charmme Kaur Opens Ip On Film Failure Says Its Depressing - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/29/Charmir_650x400.jpg.webp?itok=UscFgeVV)
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'లైగర్'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్‌లో ఒకటిగా లైగర్ నిలుస్తుందని అంతా భావించినా అందుకు భిన్నంగా డిజాస్టర్ టాక్‌ని మూటగట్టుకుంది. మైక్ టైసన్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ ఉన్నా కంటెంట్ లేకుంటే థియేరట్లకు జనాలు రారని లైగర్ మరోసారి ప్రూవ్ చేసినట్లయ్యింది. ఫలితంగా భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు నష్టాల్ని మిగిల్చిందని అంటున్నారు సినీ విశ్లేషకులు.
తాజాగా ఈ సినిమా ఫెయిల్యూర్‌పై నిర్మాత ఛార్మి స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. 'జనాలు ఇంట్లో కూర్చొని ఒక్క క్లిక్‌తో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చూసే యాక్సిస్ ఉంది. కుటుంబం మొత్తం ఇంట్లోనే భారీ బడ్జెట్ సినిమాలు చూడగలరు. కాబట్టి సినిమాలు వారిని ఎగ్జైట్ చేయనంత వరకు థియేటర్లకు రావడానికి వాళ్లు ఇష్టపడటం లేదు. తెలుగులో ఇటీవల బింబిసార, సీతారామం, కార్తికేయ 2 వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి.
సుమారు రూ 150 కోట్ల నుంచి రూ. 170కోట్ల వరకు వసూలు చేశాయి. కానీ బాలీవుడ్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 2019నుంచి లైగర్ కోసం కష్టపడ్డాం. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత లైగర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. ఎన్నో అడ్డంకులను దాటి థియేటర్‌లో విడుదల చేశాం. కానీ సినిమా ఫెయిల్యూర్ అవడం బాధగా అనిపిస్తుంది' అంటూ ఛార్మి ఆవేదన వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment