Mike Tyson And Vijay Devarakonda Remuneration For Liger Movie, Details Inside - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda Remuneration: 'లైగర్‌' కోసం విజయ్‌ అన్ని కోట్లు తీసుకున్నాడా?

Published Tue, Aug 16 2022 12:20 PM | Last Updated on Tue, Aug 16 2022 1:49 PM

Mike Tyson To Get Paid More Than Vijay Devarakonda For Liger Movie - Sakshi

టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ-పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా లైగర్‌. ఈ సినిమా అనౌన్స్‌ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాక్సింగ్‌ స్టార్‌ మైక్‌ టైసన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.

చదవండి: హీరో కాకముందు విజయ్‌ దేవరకొండ ఏం చేశాడో తెలుసా?



ప్రస్తుతం వరుస ప్రమోషన్స్‌తో మూవీ టీం ఫుల్‌ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. లైగర్‌ కోసం విజయ్‌ దేవరకొండ భారీ రెమ్యునరేషన్‌ అందుకున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం విజయ్‌ దాదాపుగా రూ. 35కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అనన్య పాండేకు మాత్రం కేవలం రూ. 3కోట్ల రూపాయాలే అప్పజెప్పారట. మరో ఇంట్రెస్టింగ్‌ వార్త ఏంటంటే ఈ సినిమాలో నటించిన మైక్‌ టైసన్‌కు విజయ్‌ కంటే ఎక్కువగా సుమారు రూ. 40కోట్ల వరకు రెమ్యునరేషన్‌ అందించినట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement