'లవర్స్‌ డే రోజున దిల్‌ రూబా'.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన కిరణ్ అబ్బవరం | Tollywood Hero Kiran Abbavaram Latest Movie Dilruba Postponed | Sakshi
Sakshi News home page

Dilruba Movie: 'లవర్స్‌ డే రోజున దిల్‌ రూబా'.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన కిరణ్ అబ్బవరం

Published Wed, Feb 12 2025 7:26 PM | Last Updated on Wed, Feb 12 2025 7:50 PM

Tollywood Hero Kiran Abbavaram Latest Movie Dilruba Postponed

'క' మూవీ సూపర్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం (Kiran Abbavaraam) నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ దిల్‌రూబా (Dil Ruba). ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లవర్స్ డే కానుకగా సినీ ప్రియులను అలరించనుందని మేకర్స్ ప్రకటించారు. తాజాగా దిల్‌రూబా మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ నెల 14న సినిమాను రిలీజ్ చేయడం లేదని ప్రకటించారు. ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం ఎక్స్ ద్వారా వెల్లడించారు. కొంచెం ఆలస్యంగా వస్తున్నాం.. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. 

కిరణ్ హీరోగా నటించిన ఈ లవ్ ఎంటర్‌టైనర్‌లో రుక్సర్‌ థిల్లాన్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీతో విశ్వ కరుణ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అయితే ప్రేమికుల దినోత్సవం రోజున విడుదవుతుందని భావించిన ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు అభిమానుల నుంచి అద్భతమైన రెస్పాన్స్ వచ్చింది.  కాగా.. ఈ సినిమాకు సామ్‌ సీఎస్‌ సంగీతం అందించారు. ఈ మూవీలో నజియా కీలక పాత్రలో నటిస్తోంది.

విశ్వక్‌ సేన్ లైలా రిలీజ్..

అయితే ఈ లవర్స్ డే కానుకగా మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్ నటించిన లైలా మూవీ విడుదల కానుంది.  ఈ చిత్రంలో విశ్వక్‌ లేడీ గెటప్‌లో అభిమానులను అలరించనున్నారు. ఈ మూవీకి రామ్ నారాయణ దర్శకత్వం వహించారు. 
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement