
గతేడాది క మూవీతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. కొత్త ఏడాదిలోనూ సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నటించిన ప్రేమకథా చిత్రం దిల్ రుబా. లవర్స్ డే కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఊహించని విధంగా వాయిదా పడింది. ఇటీవల దిల్ రుబా మూవీ కొత్త తేదీని మేకర్స్ ప్రకటించారు. దీంతో కిరణ్ అబ్బవరం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అరుణాచలం ఆలయం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.
కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. 'అరుణాచలం మొదటిసారి వెళ్లా. చాగంటి వారి మాటలు వినేవాడిని. ఇటీవల అనుకోకుండా కుదిరింది. అక్కడ నాకు చాలా పాజిటిల్ ఫీలింగ్ కలిగింది. అక్కడ గిరి ప్రదక్షణ 14 కిలోమీటర్లు నడిచాం. కానీ గిరి ప్రదక్షణ ఎప్పుడు చేయాలనేది తెలియదు. మార్నింగ్ 6కు మొదలు పెడదాం అనుకున్నాం. దర్శనం చేసుకున్నాకే గిరి ప్రదక్షణ చేయాలన్నారు. టిఫిన్ చేసిన ఎనిమిది గంటలకు బయలుదేరాం. 14 కిలోమీటర్లు తిరిగి వచ్చేసరికి నాలుగు గంటలు పట్టింది. ఎండలో వెళ్లడంతో చుక్కలు కనిపించాయి. ఎవరైనా అరుణాచలం వెళ్లకపోతే ఇప్పుడైనా వెళ్లండి. చాలా అద్భుతంగా ఉంటుంది'అని అన్నారు.
అయితే కిరణ్ అబ్బవరం ఇటీవలే అభిమానులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తన మూవీ దిల్ రుబా కథేంటో చెబితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బైక్‌ను బహుమతిగా ఇస్తామని తెలిపారు. బైక్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు రిలీజ్ నాడు వాళ్లతో కలిసి బైక్ పై థియేటర్ కి వెళ్లి సినిమా కూడా చూస్తానని కిరణ్ చెప్పాడు. ఇప్పటివరకు జరిగిన ప్రమోషన్లలో కథ గురించి తాము పలు హింట్స్ ఇచ్చామని వెల్లడించారు. ఈ సినిమా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment