
కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దిల్ రూబా’. ఈ లవ్ ఎంటర్‌టైనర్‌ను విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో దూసుకెళ్తున్నారు మన యంగ్ హీరో.
ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఏకంగా బైక్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు కిరణ్ అబ్బవరం ప్రకటించాడు. సినిమాలో కిరణ్ ఉపయోగించిన బైక్‌నే బహుమతిగా ఇవ్వబోతున్నట్లు తెలిపారు. 'దిల్ రుబా' కథని ఎవరైతే ఊహించి తమకు చెబుతారో వాళ్లకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ బైక్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు రిలీజ్ నాడు వాళ్లతో కలిసి బైక్ పై థియేటర్ కి వెళ్లి సినిమా కూడా చూస్తానని కిరణ్ చెప్పాడు.
అయితే ఇవాళ దిల్ రూబా మూవీ నుంచి నాలుగో సింగిల్ కేసీపీడీ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సాయంత్రం 05:01 గంటలకు రిలీజ్ చేస్తామని వెల్లడించారు. కానీ ఊహించని విధంగా ఈ సాంగ్ రిలీజ్ వాయిదా పడింది. మంగళవారం ఉదయం 09:06 గంటలకు విడుదల చేస్తామని కిరణ్ అబ్బవరం తెలిపారు. బెస్ట్ ఇవ్వడానికి పాటను వాయిదా వేసినట్లు ట్వీట్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దిల్ రుబా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
Best ivvandaniki team still working on KCPD song . Tomorrow sharp 9:06am song release aipotundi ❤️
Song 🔥#DilRuba #KCPD— Kiran Abbavaram (@Kiran_Abbavaram) March 10, 2025
Comments
Please login to add a commentAdd a comment