చిమటా రమేష్ బాబు, రిషిత, మేఘన హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "నేను-కీర్తన". ఈ సినిమా ద్వారా చిమటా రమేష్ బాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా జ్యోతిర్మయి సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి "కొంచెం కొంచెం.. గుడుగుడు గుంజం" అనే లిరికల్ వీడియో ఐటమ్ సాంగ్‌ను నటుడు మురళిమోహన్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా మురళి మోహన్ మాట్లాడుతూ..'ఏ భాషలోనైనా డైరెక్టర్స్ కమ్ హీరోస్ చాలా అరుదుగా ఉంటారు. చిమటా రమేష్ బాబు హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన నేను - కీర్తన మూవీ ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను విడుదల చేసిన ఐటమ్ సాంగ్ థియేటర్లో కచ్చితంగా విజిల్స్ వేయిస్తుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అని అన్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని దర్శకుడు రమేష్ బాబు తెలిపారు. ఈ చిత్రంలో సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment