వరుణ్ రాజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం పోకిరి. ఈ మూవీలో మమతా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు వికాస్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇవాళ హీరో వరుణ్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రం నుంచి నా గుండె జారిపోయిందే అంటూ సాగే మొదటి పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు సినిమా గురించి విశేషాలు పంచుకున్నారు.
డైరెక్టర్ వికాస్ మాట్లాడుతూ.. 'మేము స్టోరీ లైన్ రాసుకున్నప్పటి నుంచి పోకిరి అనే టైటిల్ అనుకున్నాం. వేరే టైటిల్స్ పెడదాం అనుకున్నా పోకిరినే సెట్ అవుతుందని ఫిక్స్ చేసుకున్నాం. కథ రాసుకున్నప్పటి నుంచి ఈ సినిమా మీద చాలా కేర్ తీసుకున్నాం. ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకముంది' అని అన్నారు. హీరోయిన్ మమత మాట్లాడుతూ.. "ఇది నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. డైరెక్టర్ వికాస్, వరుణ్ సర్‌కు థ్యాంక్స్. ఈ సినిమా గురించి చెప్పాలంటే యూనిటీనే గుర్తొస్తుంది. ఇదొక మంచి సినిమా. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
హీరో వరుణ్ రాజ్ మాట్లాడుతూ.. 'ఈ సినిమాతో గట్టిగా హిట్ కొడతాం. మూవీ హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ ఉంది. నేను చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కల్యాణ్‌కు అభిమానిని. ఈ సినిమా టైటిల్ పోకిరికి ఓనర్ మహేష్ బాబు గారే. మేమంతా అభిమానులం అంతే' అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ..'ఈ సినిమా కి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను మాట్లాడటం కన్నా నా మ్యూజిక్ మాట్లాడితే బాగుంటుందని ఆశిస్తున్నా. మా సినిమా హిట్ అవుతుందన్న నమ్మకముంది' అనిఅన్నారు.
Comments
Please login to add a commentAdd a comment