Varun
-
తైక్వాండోలో హర్షప్రదకు రజతం... వరుణ్‌కు కాంస్యం
డెహ్రాడూన్: 38వ జాతీయ క్రీడల్లో శుక్రవారం తెలంగాణ ఖాతాలో ఒక పతకం... ఆంధ్రప్రదేశ్ ఖాతాలో ఒక పతకం చేరాయి. మహిళల తైక్వాండో (క్యోరుగీ) అండర్–73 కేటగిరీలో తెలంగాణకు చెందిన పాయం హర్షప్రద రజత పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో హర్షప్రద 0–2 తేడాతో ఇతిషా దాస్ (చండీగఢ్) చేతిలో పరాజయం పాలైంది.ప్రస్తుతం తెలంగాణ ఆరు పతకాలతో (1 స్వర్ణం, 1 రజతం, 4 కాంస్యాలు) 28వ స్థానంలో ఉంది. మరోవైపు పురుషుల తైక్వాండో అండర్–68 కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టి.వరుణ్ కాంస్య పతకం గెలిచాడు. సెమీఫైనల్లో వరుణ్ 0–2తో మహేంద్ర పరిహార్ (ఉత్తరాఖండ్) చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 10 పతకాలతో (4 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలు) 18వ స్థానంలో ఉంది. మరిన్ని క్రీడా వార్తలుసెమీస్లో మాయ ముంబై: తన సంచలన ప్రదర్శన కొనసాగిస్తూ భారత టీనేజ్ టెన్నిస్ స్టార్ మాయ రాజేశ్వరన్ రేవతి ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 15 ఏళ్ల మాయ 6–4, 3–6, 6–2తో ప్రపంచ 285వ ర్యాంకర్ మి యామగుచి (జపాన్)పై గెలిచింది. రెండు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో మాయ ఐదు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. స్పెయిన్‌లోని రాఫెల్ నాదల్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మాయ నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 117వ ర్యాంకర్ జిల్ టెచ్‌మన్ (స్విట్జర్లాండ్)తో తలపడుతుంది.భారత మూడో ర్యాంకర్, తెలంగాణకు చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక పోరాటం ఈ టోరీ్నలో ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో రష్మిక 2–6, 2–6తో జిల్ టెచ్‌మన్ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైన రష్మికకు 3,450 డాలర్ల (రూ. 3 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 27 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రాజస్తాన్ రాయల్స్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బహుతులేజైపూర్: భారత మాజీ లెగ్‌స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో మరోసారి జత కట్టనున్నాడు. టీమ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బహుతులేను మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కోచ్‌లలో ఒకడిగా ఉన్న బహుతులే 2018–21 మధ్య కాలంలో కూడా రాజస్తాన్ రాయల్స్ సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్నాడు.టీమ్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బౌలింగ్ కోచ్ షేన్ బాండ్లతో కలిసి అతను పని చేస్తాడు. భారత జట్టు హెడ్ కోచ్‌గా ద్రవిడ్ ఉన్న సమయంలో రెండు వేర్వేరు సిరీస్‌లలో బహుతులే కోచింగ్ బృందంలో ఉన్నాడు. బహుతులే భారత్ తరఫున 2 టెస్టులు, 8 వన్డేలు ఆడి 5 వికెట్లు తీశాడు. -
మహేశ్ బాబు టైటిల్‌తో మూవీ.. హీరోగా ఎవరంటే?
వరుణ్ రాజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం పోకిరి. ఈ మూవీలో మమతా హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు వికాస్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇవాళ హీరో వరుణ్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం నుంచి నా గుండె జారిపోయిందే అంటూ సాగే మొదటి పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు సినిమా గురించి విశేషాలు పంచుకున్నారు.డైరెక్టర్ వికాస్ మాట్లాడుతూ.. 'మేము స్టోరీ లైన్ రాసుకున్నప్పటి నుంచి పోకిరి అనే టైటిల్ అనుకున్నాం. వేరే టైటిల్స్ పెడదాం అనుకున్నా పోకిరినే సెట్ అవుతుందని ఫిక్స్ చేసుకున్నాం. కథ రాసుకున్నప్పటి నుంచి ఈ సినిమా మీద చాలా కేర్ తీసుకున్నాం. ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకముంది' అని అన్నారు. హీరోయిన్ మమత మాట్లాడుతూ.. "ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. డైరెక్టర్ వికాస్, వరుణ్ సర్‌కు థ్యాంక్స్. ఈ సినిమా గురించి చెప్పాలంటే యూనిటీనే గుర్తొస్తుంది. ఇదొక మంచి సినిమా. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.హీరో వరుణ్ రాజ్ మాట్లాడుతూ.. 'ఈ సినిమాతో గట్టిగా హిట్ కొడతాం. మూవీ హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ ఉంది. నేను చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కల్యాణ్‌కు అభిమానిని. ఈ సినిమా టైటిల్ పోకిరికి ఓనర్ మహేష్ బాబు గారే. మేమంతా అభిమానులం అంతే' అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ..'ఈ సినిమా కి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను మాట్లాడటం కన్నా నా మ్యూజిక్ మాట్లాడితే బాగుంటుందని ఆశిస్తున్నా. మా సినిమా హిట్ అవుతుందన్న నమ్మకముంది' అనిఅన్నారు. -
నిశ్చితార్థం ఒకరితో-పెళ్లి మరొకరితో.. మలయాళ నటి వివాహం (ఫొటోలు)
-
అత్యంత అరుదైన వరుణదేవుడి ఆలయం..!
మన పురాణాల్లో ప్రతి దేవుడికి ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మ, అష్టదిక్పాలకులతో సహా అక్కడక్కడ అరుదైన దేవాలయాలు ఉన్నాయి. కానీ వర్ష దేవుడికి ప్రత్యేకంగా ఆలయం ఉన్నట్లు విన్నారా..?. మహా అయితే వర్షాలు రావాలని యజ్జ యాగాదులు వంటిటి చేయడం చూశాం. కానీ ప్రత్యేకంగా ఆలయం నిర్మించి ఆరాధించడం గురించి విన్నారా..?. మరీ ఇది ఎక్కడుందంటే..?అత్యంత అరుదైన వరుణదేవుడి ఆలయం ఇది. ఈ ఆలయం మనదేశంలో లేదు. పాకిస్తాన్‌లోని కరాచీ తీరంలోని మనోరా దీవిలో ఉంది. ఇక్కడి సింధీ ప్రజలు వరుణదేవుడిని భక్తిగా ‘ఝూలేలాల్’ పేరుతో కొలుచుకుంటూ ఉంటారు. ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందో తెలిపే ఆధారాలేవీ లేవు. సింధ్ రాష్ట్రంలోనిభిరియా పట్టణానికి చెందిన సేఠ్ హర్చంద్మల్ దయాల్ దాస్ ఈ ఆలయానికి జీర్ణోద్ధరణ చేసినట్లు ఇక్కడి శిలాఫలకం ద్వారా తెలుస్తోంది.(చదవండి: ఉజ్జీవన్ బ్యాంకు రంగురంగుల పూలతో అతిపెద్ద బతుకమ్మ..!) -
టాలీవుడ్ ముందుకు... కథలు వెనక్కి..!
తెలుగు సినిమా వెయ్యి కోట్ల వసూళ్లతో ముందు ముందుకెళుతోంది. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి’ వంటి చిత్రాలు ఇందుకు నిదర్శనం. ఇలా వసూళ్ల పరంగా ముందుకు వెళుతున్న టాలీవుడ్ కథల పరంగా వెనక్కి వెళుతోంది. అవును... ఇప్పుడు పలువురు స్టార్ హీరోలు పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో పదికి పైగా పీరియాడికల్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. 20వ శతాబ్దపు కథలతో రూపొందుతున్న ఆ చిత్రాల్లో నటిస్తున్న హీరోల గురించి తెలుసుకుందాం.ఓ వైపు రాజాసాబ్...మరోవైపు ఫౌజీ యుద్ధానికి సరికొత్త నిర్వచనం ఇవ్వనున్నారు ప్రభాస్. ఇందుకోసం ఈ హీరో దాదాపు 80 ఏళ్లు వెనక్కి వెళ్లనున్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటించనున్నారు. 1940 నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది చివర్లోప్రారంభం కానుంది. కాగా ఈ చిత్రం పోస్టర్‌పై కనిపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’, ‘హైదరాబాద్ చార్మినార్’, ‘ఆపరేషన్ జెడ్’, ‘పవిత్రాణాయ సాధూనాం’ వంటి అంశాలు సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి కలిగేలా చేస్తున్నాయి. కొన్ని వాస్తవ ఘటనలకు కొంత కాల్పనికతను జోడించి ఈ సినిమా కథ తయారు చేశారట హను రాఘవపూడి. మాతృభూమి కోసం పోరాడే ఓ యోధుడి నేపథ్యంలో సాగే సినిమా అనే ప్రచారం కూడా జరుగుతోంది. ‘ఆధిపత్యం కోసమే యుద్ధాలు జరుగుతున్న సమయం అది. అలాంటప్పుడు ఆ యుద్ధానికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు ఓ యోధుడు’’ అంటూ ఈ సినిమా కథ గురించి ఇటీవల పేర్కొన్నారు హను రాఘవపూడి. జయప్రద, మిధున్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2026ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా 1990 నాటి కథేనని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్‌ను చూపించ నున్నట్లుగా చిత్రయూనిట్ చెబుతోంది. ఇందులో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధీ కుమార్ మరో హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలిసింది. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ‘రాజా సాబ్’ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది.ఇటు డ్రాగన్... అటు దేవరఎన్టీఆర్ను ‘డ్రాగన్’గా మార్చారట ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 8న ఈ సినిమాప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా విడుదలైన ఈ సినిమా పోస్టర్ ఆసక్తికరంగా మారింది. పోస్టర్‌పై 1969, గోల్డెన్ ట్రయాంగిల్, చైనా, భూటాన్, కోల్‌కతా అని పేర్కొంది చిత్రయూనిట్.దీంతో 1969 నేపథ్యంలోనే ఈ సినిమా కథనం ఉంటుందని, ఆ సమయంలో జరిగిన ఓ వాస్తవ ఘటనకు కల్పిత అంశాలను జోడించి, ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అంతేకాదు... ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుంది. ఇటీవల జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఎన్టీఆర్ చేతికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ గాయం నుంచి కోలుకున్న తర్వాత ఈ సినిమా సెట్స్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కె. హరికృష్ణ నిర్మించనున్న ఈ సినిమా 2026 జనవరి 9న రిలీజ్ కానుంది. అలాగే ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న మరో చిత్రం ‘దేవర’. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దేశంలో విస్మరణకు గురైన తీరప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమాను కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపిస్తారు. రెండు భాగాలుగా ‘దేవర’ రిలీజ్ కానుంది. తొలి భాగం సెప్టెంబరు 27న విడుదల కానుంది.పెద్ది!రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ అనుకుంటున్నారని, ఇందులో అన్నదమ్ముల్లా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నారు రామ్‌చరణ్. కొంచెం బరువు పెరగాలనుకుంటున్నారు. రా అండ్ రస్టిక్‌గా ఆయన లుక్ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాదిలోనేప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం.రాయలసీమ నేపథ్యంలో...హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో 2018లో వచ్చిన ‘టాక్సీవాలా’ హిట్ మూవీగా నిలిచింది. దాదాపు ఐదేళ్ల తర్వాత విజయ్, రాహుల్‌ల కాంబినేషన్లో మరో సినిమా రానుంది. రాయలసీమ నేపథ్యంలో 1854–1878 మధ్య కాలంలో జరిగే కథగా ఈ చిత్రం రానుంది. ఈ పీరియాడికల్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ చిత్రంలో తండ్రీ కొడుకుగా విజయ్ దేవరకొండ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని, ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. అలాగే విజయ్ హీరోగా రవికిరణ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఓ సినిమా నిర్మించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్‌గా ఈ చిత్రం ఉంటుందని తెలిసింది.అసాధారణ ప్రయాణంఓ సాధారణ వ్యక్తి జీవితంలో జరిగిన అసాధారణ ఘటనల నేపథ్యంలో రూపొందిన సినిమా ‘లక్కీ భాస్కర్’. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించిన సినిమా ఇది. 1980 నేపథ్యంలో ‘లక్కీ భాస్కర్’ సినిమా ఉంటుంది. ఇందులో ఓ బ్యాంక్ క్యాషియర్‌గా దుల్కర్ సల్మాన్ కనిపిస్తారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబరు 31న రిలీజ్ కానుంది.క.. సస్పెన్స్కిరణ్ అబ్బవరం నటించిన పీరియాడికల్ యాక్షన్ అండ్ సస్పెన్స్ డ్రామా ‘క’. దర్శకత్వ ద్వయం సుజిత్– సందీప్ తెరకెక్కిస్తున్నారు. కృష్ణగిరి పట్టణం, అక్కడ ఉన్న ఓ పోస్ట్‌మేన్, అతని జీవితంలోని మిస్టరీ ఎపిసోడ్ అంశాల నేపథ్యంలో ‘క’ సినిమా కథనం ఉంటుంది. చింతా గోపాలకృష్ణా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘క’ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఈ చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్నాయి.బచ్చల మల్లి ‘బచ్చల మల్లి’గా మారిపోయారు ‘అల్లరి’ నరేశ్. ఆయన టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా యాక్షన్ చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు. సుబ్బు మంగాదేవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 1990 నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ ఓ ఊరి చుట్టూ ఉంటుందని తెలిసింది. ఇందులో ట్రాక్టర్ డ్రైవర్ మల్లి పాత్రలో కనిపిస్తారు ‘అల్లరి’ నరేశ్. రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.ఎదురు చూపు ఓప్రాంతం ఒకతని కోసం ఎదురు చూస్తోంది. అతని పేరు సాయి దుర్గాతేజ్. 1940 నేపథ్యంలో సాగే ఓ పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్‌లో సాయి దుర్గాతేజ్ హీరోగా నటిస్తున్నారు. ‘హను–మాన్’ నిర్మాతలు చైతన్య, నిరంజన్‌రెడ్డి దాదాపు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రోహిత్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కష్టాలు పడుతున్న ఓప్రాంత వాసుల జీవితాలు ఓ వ్యక్తి రాకతో ఎలా మారతాయి? అనే కోణంలో ఈ సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.24 సంవత్సరాలు హీరో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో నటిస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘మట్కా’. ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఓ వాస్తవ ఘటన ఆధారంగా వైజాగ్ నేపథ్యంలో గ్యాంబ్లింగ్ అంశాలతో ‘మట్కా’ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. 1958 నుంచి 1982... అంటే ఇరవై నాలుగు సంవత్సరాల టైమ్ పీరియడ్‌లో ‘మట్కా’ సినిమా కథనం ఉంటుంది. ‘పలాస 1978’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
నా హెయిర్ కలర్ చూసి మా ఆవిడ ఏమన్నదంటే..
-
సోదరుడికి ప్రేమతో.. కంగనా కాస్ట్లీ గిఫ్ట్ అదిరిందిగా! (ఫోటోలు)
-
నటుడు వరుణ్ సూద్‌కు వచ్చిన బ్రెయిన్ ఇంజూరీ అంటే? ఎందువల్ల వస్తుంది?
బాలీవుడ్ టీవీ సీరియల్ నటుడు వరుణ్ సూద్ కంకషన్ (తేలికపాటి బాధాకరమైన మెదడు గాయం)తో బాధపడుతున్నట్లు ఇన్‌స్టాగ్రాంలో తెలిపాడు. తాను చికిత్స తీసుకుంటున్నానని, స్క్రీన్ టైం నివారించమని చెప్పడంతో సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అసలేంటి మెదడు గాయం?. ఎందువల్ల వస్తుందంటే..?నిపుణులు అభిప్రాయం ప్రకారం..హింసాత్మకమైన కుదుపు లేదా తలపై బలంగా తగిలిన దెబ్బ కారణంగా మెదడు గాయం సమస్య వస్తుంది. శిశువుల నుంచి వృద్ధులు వరకు ఎవరైన ఈ సమస్యను బారినపడవచ్చు. ఇది తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుంది. సుమారు 14 నుంచి 21 రోజుల్లో రికవరీ అవుతారని వైద్యులు తెలిపారు. ఈ సమస్య వల్ల నరాలు, రక్తనాళాలు తీవ్రంగా గాయపడటం, తద్వారా మెదడులో రసాయన మార్పులకు లోనవ్వడం జరుగుతుంది. దీని ఫలితంగా మెదడు పనితీరుని తాత్కాలికంగా కోల్పోతుంది. ఐతే ఈ సమస్య మెదడుకు శాశ్వత నష్టం కలిగించదు కానీ నిర్మాణాత్మక మార్పులకు దారితీస్తుంది. దీని వల్ల ప్రాణాహాని జరగదు కానీ ప్రభావాలు తీవ్రంగా ఉంటాయి. అది రోజుల, వారాలు లేదా ఎక్కువ కాలం పాటే కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఈ సమస్య ఎవరికీ ఎక్కువంటే..నిపుణుల అభిప్రాయం ప్రకారం, కంకషన్ ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులు ..నాలుగేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, వృద్ధులు ఈ ప్రమాదం బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యువకులు, బైక్ ప్రమాదాలు, క్రీడలకు సంబంధించిన తల గాయాల కారణంగాసైనిక సిబ్బంది పేలుడు పరికరాలకు గురికావడం వల్ల కారు ప్రమాదంలో తలకు బలమైన గాయమైనశారీరక వేధింపులకు గురైన బాధితులుఅంతకుమునుపు మెదుడు గాయం సమస్యను ఎదుర్కొన్నవారుకౌమారదశలో ఉన్నవారు ఇతర వయస్సుల వారి కంటే కంకషన్ ప్రమాదం ఎక్కువగా ఉంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వారి మెదడు ఇంకా అభివృద్ధి చెందుతున్నందున ఈ పరిస్థితి ఏర్పడుతుంది.ఈ సమస్య లక్షణాలు..తలనొప్పివికారం లేదా వాంతులుగందరగోళంస్పృహ, తాత్కాలిక నష్టంసంతులనం, మైకం సమస్యలుద్వంద్వ దృష్టిచెవుల్లో మోగుతోందికాంతి, శబ్దానికి సున్నితత్వంఅలసటగా లేదా మగతగా అనిపిస్తుందిఅర్థం చేసుకోవడం లేదా ఏకాగ్రత చేయడంలో సమస్యడిప్రెషన్ లేదా విచారంచిరాకుగా, నాడీగా ఆత్రుతగా ఉండటంశ్రద్ధ పెట్టడం కష్టంమెమరీ నష్టంఅయితే శిశువులు, పసిబిడ్డలు వారి తలపై కంకషన్ కలిగి ఉన్నప్పటికీ వారికి ఎలా అస్తుందనేది తెలియజేయలేరు కాబట్టి రోగనిర్ధారణ చేస్తే గానీ చెప్పడం కష్టమని చెప్పారు. ఇక పిల్లలలో ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే..తలపై గడ్డలువాంతులు అవుతున్నాయిచిరాకుగా, పిచ్చిగా, అనియంత్రిత ఏడుపుతినడం మానేయడంనిద్ర విధానంలో మార్పు, అసాధారణ సమయాల్లో నిద్ర రావడంసాధారణం కంటే ఎక్కువ గజిబిజిగా, ఓదార్చినప్పటికీ ఏడుపు ఆగదుశూన్యంలోకి చూడటంనిర్ధారణ ఎలా?తల గాయానికి దారితీసిన సంఘటన, లక్షణాల గురించి వైద్య నిపుణుడికి చెప్పడం వంటివి చేయాలి. అప్పుడు నరాల పరీక్ష ద్వారా వైద్యులు పరిస్థితిని గుర్తించడం జరుగుతుంది. ఈ పరీక్షలో..నరాల పనితీరు, ప్రతిచర్యలుదృష్టి, కంటి కదలిక, కాంతికి ప్రతిచర్యవినికిడియాక్టివిటీమెడ కండరాలు కదలికలువారి మానసిక స్థితి మార్పులు, నిద్ర మార్పులు లేదా ప్రవర్తనలో ఏవైనా మార్పులను బట్టి ఈ సమస్య బాధపడుతున్నారని గుర్తించొచ్చని వైద్యులు చెబుతున్నారు. -
సరికొత్తగా...
నిహారిక కొణిదెల లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘వాట్ ది ఫిష్’. ‘వెన్ ది క్రేజీ బికమ్స్ క్రేజియర్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంతో వరుణ్ కోరుకొండ దర్శకునిగా పరిచయమవుతున్నారు. 6 ఐఎక్స్ సినిమాస్‌పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఈ సినిమాలో అష్టలక్ష్మిపాత్రలో కనిపిస్తారు నిహారిక. ఆమెపాత్ర సరికొత్తగా, ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: శక్తికాంత్ కార్తీక్, సహ నిర్మాత: వరుణ్ కోరుకొండ. కాగా 2019లో వచ్చిన ‘సూర్యకాంతం’ చిత్రం తర్వాత మళ్లీ నిహారిక నటిస్తున్న సినిమా ‘వాట్ ది ఫిష్’ కావడం విశేషం. -
అమెరికాలో ఖమ్మం యువకుడిపై హత్యాయత్నం
ఖమ్మంక్రైం: అమెరికాలోని చికాగోకు ఉన్నత విద్య నిమిత్తం వెళ్లిన ఓ భారతీయ యువకుడిపై గుర్తుతెలియ ని దుండగుడు హత్యాయత్నం చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఖమ్మంలోని బుర్హాన్‌పురంలో నివసిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు పుచ్చా రామ్మూర్తి కుమారుడు వరుణ్ చికాగోలో ఉంటూ ఎంఎస్ చదువుతున్నాడు. ఈ నెల 29న జిమ్ నుంచి బయటకు వస్తున్న వరుణ్‌పై అకస్మాత్తుగా ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన వరుణ్ రక్తపు మడుగులో పడిపోగా స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి ఆస్ప త్రికి తరలించారు. అయితే ఆయన పరి స్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అమెరికాలో నివసిస్తున్న వారి బంధువు సాయివ ర్ధన్ ఫోన్ చేసి వరుణ్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. నిందితుడు ఆండ్రేడ్ జోర్డాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, తాము అమెరికా వెళ్లేందుకు సహకరించాలని మంత్రి పువ్వాడ అజయ్‌ను కోరినట్లు రామ్మూర్తి తెలిపారు. -
బోల్సాలో కలెక్టర్ పర్యటన!
నిర్మల్: భారీ వర్షం, వరదలకు ముంపునకు గురైన బోల్సా గ్రామంలో కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి శుక్రవారం పర్యటించారు. నీట మునిగిన ఇళ్లను, కొతకు గురైన రోడ్లను పరిశీలించారు. వరదలతో నష్టపోయిన బాధితుల వివరాలు సేకరించి వారికి పరిహారం అందేలా చూస్తామన్నారు. విద్యుత్ సరఫరాను త్వరగా పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. ముంపు బాధితులకు బియ్యం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతూ కొతకు గురైన రోడ్లుకు మరమ్మతు చేపట్టేలా చూస్తామని తెలిపారు. సంబంధిత అధికారులతో పంట నష్టం సర్వే నిర్వహించి బాధితులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. వారివెంట డీఎల్పీవో శివకృష్ణ , మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, నాయకులు పోతారెడ్డి, పంచాయతీ కార్యదర్శి గోపీనాథ్, గ్రామస్తులు ఉన్నారు. భారీ వాహనాలను అనుమతించొద్దు అర్లి వంతెన నుంచి భారీ వాహనాలను అనుమతించొద్దని కలెక్టరు వరుణ్‌రెడ్డి సూచించారు. హవర్గ గ్రామ సమీపంలోని అర్లి వంతెనను శుక్రవారం పరిశీలించారు. వంతెనకు వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తిచేసి రాకపోకలను పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. సుద్దవాగు పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ సరిత, ఎంపీడీవో సోలమాన్‌రాజ్, విద్యుత్ ఏఈ శివకుమార్, ఆర్‌ఆండ్‌బీ డీఈ కొండయ్య, స్థానిక సర్పంచ్ భూజంగ్‌రావు ఉన్నారు. -
మూడు సార్లు గుండె ఆగినా.. ప్రాణాలు నిలిపారు
సాక్షి, కర్నూలు (హాస్పిటల్): తెలంగాణ రాష్ట్రం గద్వాలకు చెందిన వరుణ్ అనే 8 ఏళ్ల బాలుడికి ఇన్ఫెక్షన్ కారణంగా మూడు సార్లు గుండె ఆగిపోయింది. ఇలాంటి స్థితిలో వైద్యులు.. బాలుడికి సీపీఆర్ చేసుకుంటూ మెరుగైన వైద్యం అందించడంతో తిరిగి ప్రాణం పోసుకున్నాడు. వివరాలను బుధవారం కర్నూలులోని మెడికవర్ హాస్పిటల్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ మురార్జీ వివరించారు. వరుణ్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో తల్లిదండ్రులు మెడికవర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ సమయానికి అతనికి కార్డియాక్ అరెస్ట్ రావడంతో ఎంతో శ్రమించి వైద్యులు అతని గుండెను పునఃప్రారంభింపజేశారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం.. బాబుకు ఇన్ఫెక్షన్ సోకడంతో గుండె సామర్థ్యం మందగించిందని తెలుసుకున్నారు. వైద్యం చేసే సమయంలోనే బాలుడి గుండె మూడు సార్లు ఆగిపోయింది. ఆ సమయంలో మెదడుకు రక్త సరఫరాలో ఇబ్బంది తలెత్తి పక్షవాతం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మెరుగైన వైద్యం కారణంగా పక్షవాతం రాలేదు. పిల్లల గుండెకు ఇన్షెక్షన్ సోకి గుండె పనితీరు మందగించడం చాలా అరుదుగా జరుగుతుందని, దీనిని వైద్య పరిభాషలో మయోకార్డియారెస్ట్ అంటారని డాక్టర్ మురార్జీ తెలిపారు. మయోకార్డియాటీస్ ఉన్నప్పుడు తక్కువ మంది పిల్లలకు తీవ్రమైన గుండె సమస్యలు తలెత్తుతాయని, వారికి ఇంట్రావీనస్ ఆయనోట్రోఫిక్ సపోర్ట్, మెకానికల్ వెంటిలేషన్‌తో ఇంటెన్సివ్ కేర్ థెరపీ అవసరం ఉంటుందని డాక్టర్ మురార్జీ వివరించారు. చదవండి: (బతికుండగా పదిమందికి పట్టెడన్నం.. చనిపోతూ ఐదుగురికి ప్రాణదానం) -
బిగ్‌బాస్ నా జీవితాన్ని మార్చేసింది: నటుడు
బిగ్‌బాస్ షో తన జీవితాన్ని, లైఫ్‌స్టైల్‌ను మార్చేసిందని నటుడు వరుణ్ అన్నారు. ఈ మేరకు చెన్నై వెస్ట్ మాంబలం, దురైస్వామి సబ్వే వద్ద మహిళల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన మహా ఉమెన్స్ బ్యూటీ అవుట్‌లెట్‌ను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం నటుడు వరుణ్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశం లభించటమే తన అదృష్టం అని.. దీని ద్వారా తనకు ఎంతో క్రేజ్‌తో పాటు సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తున్నట్టు తెలిపారు. ఒక్కమాటలో చెప్పాలంటే తన జీవితాన్ని బిగ్‌బాస్ షో మార్చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మహాబ్యూటీ గ్రూప్ వ్యవస్థాపకురాలు మహాలక్ష్మి కమల కన్నన్ మాట్లాడుతూ.. రకరకాల పోరాటాల మధ్య అందాల కళను రేపటి తరానికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో మహాబ్యూటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించామని, ఇక్కడ చదివిన విద్యార్థులు వివిధ ప్రాంతాలలో ఉద్యోగాలు చేస్తూ జీవితంలో స్థిరపడ్డారని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాంజైజ్ పార్టనర్ మణిమొళి తదితరులు పాల్గొన్నారు. -
ముందుంది మరింత మంచికాలం!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో తమ జట్టు ప్రదర్శన పట్ల హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) యజమాని వరుణ్ త్రిపురనేని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సీజన్లో నిలకడైన ప్రదర్శనతో హెచ్ఎఫ్సీ సెమీఫైనల్లో చోటు దక్కించుకుంది. మున్ముందు తమ జట్టులో స్థానిక క్రీడాకారులకు అవకాశం కల్పిస్తామన్న ఆయన... ఓవరాల్‌గా ఐఎస్ఎల్ కూడా ఒక బలమైన బ్రాండ్‌గా మారిందని విశ్లేషించారు. లీగ్‌లో తమ ఆట తదితర అంశాలపై వరుణ్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే... హైదరాబాద్ ఎఫ్‌సీ ప్రదర్శనపై... చాలా బాగుంది. ఇది మాకు మూడో సీజన్. తొలిసారి ఆడినప్పుడు జట్టు చివరి స్థానంలో నిలవడంతో పలు కీలక మార్పులు చేసి భిన్నమైన ప్రణాళికలతో బరిలోకి దిగాం. ఫలితంగా గత ఏడాది ప్లే ఆఫ్స్‌కు చేరువగా వచ్చాం. ఈసారి మరింత మెరుగైన ప్రదర్శనతో సెమీస్‌ను లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగాం. హైదరాబాదీ ఆటగాడు లేకపోవడంపై... స్థానికంగా ప్రతిభ ఉన్నవారిని తీసుకునేందుకు మేం గట్టిగానే ప్రయత్నిం చాం. హైదరాబాద్‌లో చెప్పుకోదగ్గ టోర్నమెంట్లు కూడా లేకపోవడంతో మేం ఆశించిన స్థాయి ప్రమాణాలు గల ఆటగాళ్లు లభించలేదు. ‘నామ్‌కే వాస్తే’గా టీమ్‌లోకి తీసుకోలేం కదా. చివరకు అభినవ్ అనే కుర్రాడిని గుర్తించగలిగాం. గోల్‌కీపర్‌గా అతను మా రిజర్వ్ జట్టులో భాగంగా ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఒక పద్ధతి ప్రకారం ఆటగాళ్లను ఐఎస్ఎల్ కోసం తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రిటైరైన విదేశీయులతో ఆడటంపై... అది ఆరంభ సీజన్లలో మాత్రమే జరిగింది. ఇది ఎనిమిదో ఐఎస్ఎల్ సీజన్. ఇప్పుడు ఈ టోర్నీ గురించి బయటి ప్రపంచానికి కూడా బాగా తెలుసు. పలు విదేశీ సంస్థలు మాకు స్పాన్సర్లుగా రావడం అందుకు నిదర్శనం. ప్రతీ సీజన్‌కు లీగ్ బలంగా మారుతోంది. మున్ముందు ఐఎస్ఎల్ స్థాయి పెరగడం ఖాయం. వచ్చే సీజన్ నుంచి లీగ్ మళ్లీ ప్రేక్షకుల మధ్యలో రానుంది కాబట్టి ఐఎస్ఎల్ ఎదుగుదలను మనం స్పష్టంగా చూడవచ్చు. -
‘ఐయామ్ 420’‘ప్రేమ’ వల వేసి..
గుంటూరు ఈస్ట్: ఇంజనీరింగ్ విద్యార్థిని నగ్న చిత్రాలను ‘ఐయామ్ 420’ పేరుతో ఇన్‌స్ట్ర్రాగామ్‌లో అప్లోడ్ చేసి.. ఆమెను బ్లాక్మెయిల్ చేసిన ఘటనలో మరో ఏడుగురు నిందితులను గుంటూరు అర్బన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితులైన వరుణ్, కౌశిక్‌లను జూన్ 27వ తేదీ అరెస్ట్ చేసిన విషయం విదితమే. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో పక్కా ఆధారాలు సేకరించి మిగిలిన నిందితుల్ని గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి సోమవారం వెల్లడించారు. (విద్యార్థిని నగ్న చిత్రాల కేసు: ఏడుగురు అరెస్ట్) ‘ప్రేమ’ వల వేసి.. ♦ ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన వరుణ్ అనే విద్యార్థి ప్రేమ పేరుతో వలవేసి తన సహ విద్యార్థినిని వంచించాడు. ఆమె నగ్న వీడియో చిత్రీకరించి.. ఆమెను బ్లాక్మెయిల్ చేయడంతోపాటు తోటి విద్యార్థులకు ఫార్వార్డ్ చేశాడు. ♦ రెండో నిందితుడైన కౌశిక్ ద్వారా ఆ విద్యార్థిని నగ్న చిత్రాలు భాస్కర్, అతని ద్వారా ధనుంజయరెడ్డి, అతని నుంచి మణికంఠ, తులసీకృష్ణ, వారి నుంచి కేశవ్, క్రాంతి కిరణ్, రోహిత్ అనే విద్యార్థులకు చేరాయి. ♦ వీరిలో మణికంఠ, ధనుంజయరెడ్డి వాటిని ఆ యువతికి పంపి.. ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు. మిగిలిన ఐదుగురికి ఇదే విషయం చెప్పడంతో వాళ్లు కూడా ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. ♦ వారిలో మణికంఠ అనే విద్యార్థి‘ఐయామ్ 420’ అనే పేరిట ఫేక్ అకౌంట్ తెరిచి ఇన్‌స్ట్రాగామ్ ద్వారా ఆ యువతికి చెందిన నగ్న చిత్రాలను ఆమెకే పంపి చాటింగ్ చేశాడు. ♦ ఆమెను బ్లాక్మెయిల్ చేసి రూ.50 వేల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితురాలు అతడి బ్యాంక్ అకౌంట్ వివరాలు పంపాల్సిందిగా కోరగా.. నిందితులు దొరికిపోతామన్న భయంతో అకౌంట్ నంబర్ పంపకుండా మిన్నకుండిపోయారు. ♦ ఆ యువత ధైర్యం చేసి తనను బ్లాక్మెయిల్ చేస్తున్న విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పక్కా సాంకేతిక ఆధారాలతో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి ల్యాప్‌టాప్, 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ♦ ఫేక్ అకౌంట్‌ను ఛేదించడం, సాంకేతిక ఆధారాలను సేకరించడంలో అర్బన్ టెక్నికల్ అనాలసిస్ టీమ్ ఇన్చార్జి విశ్వనాథరెడ్డి, సాంకేతిక సిబ్బంది విశేష కృషి చేశారని ఎస్పీ చెప్పారు. ♦ నిందితులపై రౌడీషీట్లు తెరుస్తామని ఎస్పీ తెలిపారు. ♦ దీనివల్ల వారిపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని చెప్పారు. కేసును ఛేదించేందుకు కృషి చేసిన దిశ డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణ, ఎస్ఐలు కోటయ్య, బాజీ బాబులను ఎస్పీ అమ్మిరెడ్డి అభినందించారు. -
‘మగజాతికే తలవంపులు తెచ్చావు’
వరుణ్ గ్రోవర్ స్క్రీన్ రైటర్, పాటల రచయిత, థింకర్. వీటన్నిటినీ మించి హాస్య రసజ్ఞుడు. వయసు 40 దాకా ఉంటుంది. అయితే ఇప్పుడు హాస్యం కోసం అతడు ఈ పని చేయలేదు. ఏ పని?! వరుణ్ తన చేతి గోళ్లకు రెండు రకాల రంగును వేసుకుని ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దాన్ని చూసిన మగాళ్లంతా అతడిని ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు. ‘పురుషుడివి అయుండీ ఈ వేషాలు ఏంటి?’ అని అతడిపై గత ఇరవై నాలుగు గంటలుగా ఏకబిగిన సెటైర్లు వేస్తూనే ఉన్నారు. కొందరైతే ‘మగజాతికే తలవంపులు తెచ్చావు’ అని దుయ్యబడుతున్నారు. ఆ మాటలకు వరుణ్ బాధపడ్డాడు. ఆశ్చర్యపోయాడు. ఆవేదన చెందాడు. థింకర్ కదా.. తాత్వికంగా కూడా ఆలోచించే ఉంటాడు. చివరికి ఈ ట్రోలింగ్ చేస్తున్న వాళ్లకు తనూ ఓ ప్రశ్న వేశాడు. ‘‘గోళ్ల రంగు వేసుకుంటే నా చెయ్యి నాకే చూడముచ్చటగా, అందంగా అనిపించింది. అందుకే షేర్ చేసుకున్నాను. దీన్నొక జెండర్ ఇష్యూగా చూస్తారెందుకు?’’ అన్నాడు. ‘నీకు చూడముచ్చటగా ఉంటే సరిపోయిందా..’ అని మళ్లీ ఆయనపై దాడి ప్రారంభమయింది. ఇప్పట్లో అది ముగిసేట్టు లేదు మరి. పేదరికంలో మరణించిన క్యాబరే క్వీన్ నలుపు, తెలుపు చిత్రాల కాలం నాటి ప్రేక్షకుల్ని రెప్ప వెయ్యనివ్వకుండా చేసిన తొలి బెంగాలీ క్యాబరే డ్యాన్సర్ ఆరితీదాస్ గురువారం కోల్‌కతాలో కన్ను మూశారు. ఆమె వయసు 77 ఏళ్లు. మిస్ షెఫాలీగా ప్రసిద్ధురాలైన ఆరతి.. డ్యాన్సర్ మాత్రమే కాదు. విలక్షణ నటి కూడా. సత్యజిత్ రే ‘ప్రతిధ్వని’, ‘సీమబద్ధ’ చిత్రాలలో ఆమె నటించారు. ఇటీవలే ఆమె ఆత్మకథ ‘సంధ్యా రతేర్ షెఫాలీ’.. పుస్తక రూపంలో విడుదలైంది. తూర్పు బెంగాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) నుంచి శరణార్థులుగా పశ్చిమ బెంగాల్ వచ్చిన కుటుంబంలోని ముగ్గురు అక్కచెల్లెళ్లలో ఆరతీదాస్ ఆఖరు అమ్మాయి. పన్నెండేళ్ల వయసులోనే ఇల్లు గడవడానికి అప్పట్లో ప్రముఖులు వచ్చిపోతుండే ‘ఫిర్పో’ రెస్టారెంట్లో డాన్స్ చేశారు ఆరతి. ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లారు. పేదరికంలో జీవితాన్ని ప్రారంభించిన ఆరతి పేదరికంలోనే అంతిమశ్వాస వదిలారు. చివరి రోజుల్లో తన అనారోగ్య సమస్యలకు మందులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఆమె ఉన్నారని బెంగాలీ పత్రికలు రాశాయి. -
అభ్యంతరకర పోస్టర్లను తొలగిస్తున్నాం
‘‘డిగ్రీ కాలేజ్’ సినిమా పోస్టర్లలో కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయని విద్యార్థి సంఘాల నాయకులు, మహిళలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు స్టేషన్‌కి పిలిపించి అభ్యంతరకర పోస్టర్స్‌ను తొలగించమని చెప్పారు. నన్ను అరెస్ట్ చేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అన్నారు నరసింహ నంది. వరుణ్, దివ్యారావు జంటగా శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నరసింహ నంది స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘డిగ్రీ కాలేజ్’ చిత్రం నేడు విడుదలవుతోంది. విలేకరుల సమావేశంలో నరసింహ నంది, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు, సహ నిర్మాతలు ఆలేటి శ్రీనివాసరావు, కొండయ్య మాట్లాడుతూ– ‘‘పోస్టర్లను చూసి సినిమా ఆపేస్తామనడం సమంజసం కాదు. అభ్యంతరకరంగా ఉన్న రెండు పోస్టర్స్‌ను వెంటనే తొలగించే పని మొదలు పెట్టాం. ఈ సినిమా ఆగిపోతే మా జీవితాలు రోడ్డున పడతాయి’’ అన్నారు. -
వాస్తవ ప్రేమకథ
వరుణ్, దివ్యారావు జంటగా ‘1940లో ఒకగ్రామం, కమలతో నా ప్రయాణం’ చిత్రాల ఫేమ్ నరసింహ నంది స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘డిగ్రీ కాలేజ్’. ఈ నెల 7న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘నా గత చిత్రాల మాదిరిగా కాకుండా కమర్షియల్ అంశాలతో ఈ సినిమా తీశాను. ఇద్దరు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ మధ్య క్లాస్‌రూమ్‌లోనూ బయట అంకురించిన వాస్తవ ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు నరసింహæనంది. ‘‘ఈ సినిమాలో భావోద్వేగభరితమైన అంశాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ చిత్రాన్ని నా ఆధ్వర్యంలో విడుదల చేయాలనుకున్నాను’’ అన్నారు పంపిణీదారుడు బాపిరాజు. -
నాకు ఆ అలవాటు లేదు
‘‘ట్రైలర్లో ఒక రకంగా, సినిమాలో మరో రకంగా చూపించే అలవాటు నాకు లేదు. ట్రైలర్లో ఉన్నది సినిమాలోనూ ఉంటుంది’’ అన్నారు దర్శకుడు నరసింహా నంది. వరుణ్, దివ్యారావు హీరోహీరోయిన్లుగా లక్ష్మీ నరసింహా సినిమా పతాకంపై నరసింహా నంది దర్వకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిగ్రీ కాలేజ్’. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. ఈ చిత్రాన్ని జనవరి 1న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నరసింçహా నంది మాట్లాడుతూ–‘‘ఇద్దరు డిగ్రీ విద్యార్థుల మధ్య చిగురించిన వాస్తవ ప్రేమ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశాను. ప్రేమలో ఉన్న ఓ అబ్బాయి, ఓ అమ్మాయి తరగతి గదిలో, బయట ఎలా ప్రవర్తించారన్న అంశాలను చూపించాను. ఇంతవరకు నేను తీసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమాలో కమర్షియల్ అంశాలను జోడించాను’’ అని అన్నారు. ‘‘ఇందులో కేవలం రొమాన్స్ మాత్రమే కాదు. అంతకుమించిన భావోద్వేగ సన్నివేశాలు ఉన్నాయి. అందుకే విడుదల చేయాలనుకుంటున్నాను’’ అన్నారు డిస్ట్రిబ్యూటర్ బాలరాజు. వరుణ్, దివ్యారావు, టి.ప్రసన్న కుమార్, రవి రెడ్డి, మదన్ పాల్గొన్నారు. -
కాంట్రవర్సీ కోసం మాట్లాడలేదు
‘‘అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100’’ చిత్రాల పుణ్యమా అని, లిప్‌లాక్ లేని తెలుగు సినిమా లేకుండా పోయింది. దర్శకులు, నిర్మాతలు, రచయితలు సామాజిక బాధ్యతతో సినిమాలు చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నాను’’ అని మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, నటి–దర్శకురాలు జీవితారాజశేఖర్ అన్నారు. వరుణ్, దివ్య జంటగా నరసింహ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డిగ్రీ కాలేజ్’. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘చాలామంది మధ్యలో మనం శృంగారం చేయం. అసభ్యంగా ప్రవర్తించం. సినిమాలో ఇలాంటివి వచ్చేసరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సోషల్ మీడియాలో, టీవీల్లో ఇలాంటివి ఉండటం లేదా? అని కొందరు వాదించవచ్చు. నిజమే.. ఉన్నాయి. కానీ వాటిని మనం ఒక రూమ్‌లో కూర్చొని ఒంటరిగా చూస్తాం. సినిమా అనేది వందల మందితో కలిసి చూసేది. మీ కార్యక్రమానికి (‘డిగ్రీ కాలేజ్’ టీమ్‌ను ఉద్దేశిస్తూ) వచ్చి నేను ఇలా మాట్లాడకూడదు. ఈ మాటలను కాంట్రవర్సీ కోసం కూడా చెప్పడం లేదు. ఈ ట్రైలర్‌ని చూసి నా మనసుకు అనిపించినది చెబుతున్నాను’’ అన్నారు. నరసింహనంది మాట్లాడుతూ ‘‘గతంలో సందేశాత్మక సినిమాలు చేశాను. అవార్డులు వచ్చాయి కానీ డబ్బులు రాలేదు. ‘హైస్కూల్’ చిత్రానికి వచ్చాయి. నాదైన నవ్య పంథాలో ఈ సినిమా తీశాను. ట్రైలర్ చూసి సినిమా మొత్తం వల్గర్‌గా ఉంటుందని అనుకుంటున్నారు. ఇందులో మంచి కంటెంట్ ఉంది. వాస్తవిక సంఘటనలకు సినిమాటిక్ అంశాలను పొందుపరిచి, ఈ సినిమా చేశాం. లిప్ లాక్‌లు, శృంగారభరిత సన్నివేశాలు కథ డిమాండ్ మేరకే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి కాంట్రవర్సీని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అన్నారు. సహ నిర్మాతలు ఆలేటి శ్రీనివాసరావు, బత్తుల కొండయ్య, రవిరెడ్డిలతో తదితరులు పాల్గొన్నారు. -
వరుణ్ చేతికి హోటల్ గేట్‌వే!
విశాఖపట్నం: విశాఖ సముద్ర తీరంలోని లగ్జరీ హోటల్ ‘తాజ్ గేట్‌వే’ను వరుణ్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఈ హోటల్‌ను దాదాపు రూ.121.10 కోట్లకు కొనుగోలు చేసినట్లు వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభుకిషోర్ తెలియజేశారు. ఆయన గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఆటోమొబైల్స్, వినోదం, ఆతిథ్యం సహా పలు రంగాల్లో ఉన్న వరుణ్ గ్రూప్‌నకు ప్రస్తుతం రెండు హోటల్ ప్రాపర్టీలున్నాయి. విశాఖ బీచ్‌రోడ్, భీమిలిలో ఉన్న ఈ రెండు హోటళ్లను నొవోటెల్ బ్రాండ్లతో ‘అకార్డ్’ గ్రూపు నిర్వహిస్తోంది. తాజాగా గేట్‌వే కూడా తమ ఖాతాలో చేరటంతో తమ హోటళ్లలోని మొత్తం గదుల సంఖ్య 600కు చేరిందని ప్రభుకిషోర్ తెలియజేశారు. తాజ్ బ్రాండ్‌తో టాటా గ్రూపు నిర్వహిస్తున్న హోటల్ గేట్‌వేలో ఇప్పటివరకు టాటాలకు 40, రెడ్డీస్‌కు 30 శాతం వాటాలుండగా మిగతాది పబ్లిక్ షేర్‌హోల్డింగ్. ‘‘గేట్‌వే కొనుగోలు గతనెల 29న ఖరారయింది. దీనికోసం చెన్నై, విశాఖ నుంచి రెండు సంస్థలు పోటీపడినా... మా సామర్థ్యాన్ని, వేగవంతమైన విస్తరణను చూసి మాకే విక్రయించటం సంతోషకరం. వచ్చే నాలుగేళ్లలో ఆతిథ్య రంగంలో మొత్తం 1000 రూమ్స్ మా చేతిలో ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని ఆయన వివరించారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద 196 గదుల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న నొవోటెల్‌ను ఈ డిసెంబరులో ప్రారంభించనున్నట్లు కూడా చెప్పారాయన. ఈ సమావేశంలో వరుణ్ గ్రూప్ డెరైక్టర్లు వరుణ్, వర్ష పాల్గొన్నారు. -
భారత జట్టులో వరుణ్, దీక్షిత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన యువ వెయిట్‌లిఫ్టర్లు వరుణ్, దీక్షితలు ఆసియా జూనియర్, యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపికయ్యారు. నేపాల్‌లోని ఖాట్మండులో జూలై 21 నుంచి 29 వరకు ఈ పోటీలు జరుగుతాయి. వరుణ్ 77 కేజీల విభాగంలో, దీక్షిత 58 కేజీల విభాగంలో పోటీపడతారు. ఈ సందర్భంగా ‘శాట్స్’ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి వీరిని అభినందించారు. మన రాష్ట్రం నుంచి ఇద్దరు వెయిట్ లిఫ్టర్లు ఒకేసారి దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. వరుణ్, దీక్షితలా మరింత మంది క్రీడాకారులు దేశం తరఫున పాల్గొని పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. -
బ్రేకింగ్ న్యూస్‌లో...
‘‘వరుణ్‌లో మంచి నటుడున్నాడు. ‘మనలో ఒకడు’లో దిలీప్ పాత్రకు న్యాయం చేశాడు. హీరోగా వరుణ్‌కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్. ఆయన నటించి, దర్శకత్వం వహించిన ‘మనలో ఒకడు’, ఆ తర్వాత ‘లజ్జ’ చిత్రాల్లో కీలక పాత్రలు చేసిన వరుణ్ ఆలేటి హీరోగా నటించిన ‘బుడ్డా రెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్’ వచ్చే నెలలో విడుదల సిద్ధమవుతోంది. వరుణ్ మాట్లాడుతూ – ‘‘దర్శకుడు నరసింహ నందిగారు ‘..బ్రేకింగ్ న్యూస్’లో నటనకు ఆస్కారమున్న పాత్రను ఇచ్చారు. విలేజ్ లవర్‌బాయ్‌గా కనిపిస్తా. ‘మనలో ఒకడు’లో నాజర్ తనయుడిగా నటించడం మర్చిపోలేని అనుభూతి. ప్రస్తుతం ‘ఈనాడు’లో ఓ హీరోగా నటిస్తున్నా. నటుడిగా మంచి పేరొచ్చే పాత్రల్లో నటించాలని నా ఆశ’’ అన్నారు. నటుడు సందేశ్ పాల్గొన్నారు. -
చెస్ చాంప్స్ రోహిత్, వరుణ్
సాక్షి, హైదరాబాద్: బ్రిలియంట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో రోహిత్ రెడ్డి, వరుణ్ సత్తా చాటారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో జరిగిన ఈ టోర్నీలో జూనియర్స్ విభాగంలో రోహిత్, ఓపెన్ విభాగంలో వరుణ్ చాంపియన్లుగా నిలిచారు. జూనియర్స్ విభాగంలో ఆరురౌండ్లు ముగిసేసరికి 5.5 పాయింట్లతో రోహిత్ రెడ్డి, కృష్ణ దేవర్‡్ష సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోర్ ఆధారంగా రోహిత్ విజేతగా నిలవగా... కృష్ణ దేవర్‡్ష రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 5 పాయింట్లతో గండికోట రిత్విక్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఓపెన్ కేటగిరీలో ఆరు రౌండ్లు ముగిసేసరికి 5.5 పాయింట్లు సాధించిన వి.వరుణ్ విజేతగా నిలిచాడు. రాఘవ శ్రీవాత్సవ, కార్తీక్ కుమార్ వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. అండర్–14 విభాగంలో కృష్ణ దేవర్‡్ష, శ్రీశాంతి... అండర్–12 విభాగంలో హృషికేశ్ అనీశ్, ఎ. భవిష్య... అండర్–10 విభాగంలో జి.రిత్విక్, సమీర, అండర్–8 విభాగంలో చిద్విలాస్ సాయి, శరణ్య విజేతలుగా నిలిచారు. ఈ టోర్నీలో జేఆర్సీ ప్రసాద్ ‘బెస్ట్ వెటరన్’ పురస్కారాన్ని గెలుచుకోగా... వి. సరయుకు ‘బెస్ట్ ఉమెన్’ అవార్డు దక్కింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సీనియర్ ఫైనాన్స్ మేనేజర్ కె. సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. జూనియర్స్ కేటగిరీ ఆరోరౌండ్ గేమ్ ఫలితాలు రిత్విక్ (5)... శ్రీశాంతి (4)పై, ప్రియాన్‡్ష రెడ్డి (4.5)... భవిష్య (3)పై, ఆర్ణవ్ ప్రధాన్ (4.5)... జి. విశాల్‌పై గెలుపొందారు. రోహిత్‌రెడ్డి (5.5), కృష్ణ దేవర్‡్ష (5.5)... చిద్విలాస సాయి (4.5), సిద్ధార్థ్ దేశ్‌పాండే (4)ల మధ్య జరిగిన గేమ్‌లు డ్రా అయ్యాయి. ఓపెన్ కేటగిరీ ఆరోరౌండ్ గేమ్ ఫలితాలు: రాఘవ శ్రీవాత్సవ (5)... రాజు (4)పై, షణ్ముఖ తేజ (5)... సురేశ్ బాబు (4)పై, దిగ్విజయ్ సునీల్ (4.5)... సత్యనారాయణ (3.5)పై నెగ్గారు. కార్తీక్ కుమార్ ప్రదీప్ (5), వరుణ్ (5.5)... ప్రతీక్ శ్రీవాస్తవ (4), శ్రీవిజయ్ సునీల్ (4)ల మధ్య జరిగిన గేమ్‌లు డ్రా అయ్యాయి. -
ఉమ్మడిగా అగ్రస్థానంలో వరుణ్
సాక్షి, హైదరాబాద్: బ్రిలియంట్ ట్రోఫీ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో వి. వరుణ్ అగ్రస్థానంలో ఉన్నాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో జరుగుతోన్న ఈ చాంపియన్‌షిప్ ఓపెన్ కేటగిరీలో 3 రౌండ్లు ముగిసేసరికి 3 పాయింట్లతో మరో నలుగురితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కె. తరుణ్, ఎల్. సతీశ్ కుమార్, పి.రవీందర్, నీరజ్ అనిరుధ్‌లు కూడా 3 పాయింట్లతో ఉన్నారు. జూనియర్ విభాగంలో ఏకంగా ఏడుగురు చిన్నారులు 3 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. జి.శివాని, అద్వైత శర్మ, రిత్విక్, మైత్రి, హిమేశ్, రఘురామ్ తలా 3 పాయింట్లు సాధించారు. శనివారం జూనియర్ విభాగంలో జరిగిన మూడోరౌండ్లో అద్వైత శర్మ (3)... చిద్విలాస్ సాయి (2)పై, రిత్విక్ (3)... ప్రణవ్ (2)పై, రఘురామ్ రెడ్డి (3)... బిల్వ నిలయ (2)పై, మైత్రి (3)... రోహిత్ (2)పై, హిమేశ్ (3)... రిషి (2)పై గెలుపొందారు. ఓపెన్ విభాగంలో మూడో రౌండ్ ఫలితాలు వరుణ్ (3)... ప్రణీత్ (2)పై, తరుణ్ (3)... త్రిష (2)పై, సతీశ్ (3)... రాజు (2)పై గెలిచారు. సాయికృష్ణ (2.5)తో జరిగిన గేమ్‌ను సురేశ్ (2.5)... ప్రతీక్ (2.5)తో జరిగిన గేమ్‌ను సుబ్బరాజు (2.5) డ్రాగా ముగించారు. -
ఇంటర్నెట్ ఎఫెక్ట్!
ఈతరం యువత ఎక్కువగా ఇంటర్నెట్కి అలవాటు కావడం వల్ల సమాజంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయనే కథతో రూపొందుతున్న సినిమా ‘ఈనాడు’. రామ్, వరుణ్, దివ్య, ప్రియా ముఖ్య తారలుగా నల్లూరి శ్రవణ్ దర్శకత్వంలో పులికొండ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా శనివారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి క్లాప్ ఇవ్వగా, నిర్మాత మద్దినేని రమేశ్ కెమేరా స్విచాన్ చేశారు. తమిళనాడు మాజీ గవర్నర్ కె. రోశయ్య స్క్రిప్ట్‌ని చిత్ర బృందానికి అందజేశారు. ‘‘ఫిబ్రవరి రెండోవారంలో చిత్రీకరణ ప్రారంభించి, ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత రామ్. ‘‘కామెడీ థ్రిల్లర్ చిత్రమిది. ఓ ప్రముఖ హీరోయిన్ చిత్రంలో నటించనున్నారు’’ అని దర్శకుడు తెలిపారు. -
ఎంటర్టైన్మెంట్ ప్లీజ్..!!
కాలం ముందుకు వెళ్తోంది.. కానీ, కాలు ముందడుగు వేయనివ్వడం లేదు.. మనసులో ఆలోచనలు పరుగులు పెడుతున్నాయి.. మనిషి మాత్రం మంచం మీద నుంచి కిందకి దిగే పరిస్థితి లేదు.. క్లుప్తంగా యువ హీరో వరుణ్ తేజ్ కండిషన్ ఇది. ఊటీలో ‘మిస్టర్’ షూటింగ్ జరుగుతున్నప్పుడు వరుణ్ కాలికి గాయమైన సంగతి తెలిసిందే. గాయంతో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వరుణ్ తేజ్‌ను చూస్తే, వెంటనే ‘ఊపిరి’ పోస్టర్ గుర్తు రాక మానదు. వీల్ చైర్లో నాగార్జునలా వరుణ్, ఆ చైర్ వెనుకనే తమన్నాలా ‘మిస్టర్’ హీరోయిన్ లావణ్యా త్రిపాఠి, కార్తీలా నటుడు ‘సత్యం’ రాజేశ్‌లు ఈ నెల 1న ఫ్లైట్ దిగారు. ‘ఊపిరి’లో ముగ్గుర్నీ ఇమిటేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామంటూ వరుణ్ తేజ్ సరదాగా ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇంటికొచ్చి వారమైంది. ఇంకా గాయం నయం కాలేదు. దాంతో ఎటూ వెళ్లడం కుదరడం లేదు. అనుకోకుండా వచ్చిన ఈ హాలిడేలో వరుణ్ ఏం చేస్తున్నారో తెలుసా? టైమ్‌పాస్ కోసం బ్యాట్‌మాన్ బొమ్మలు గీశారు. మొబైల్లో ఫొటోలతో ప్రయోగాలు చేస్తున్నారు. ఇలాంటి చిన్ని చిన్ని టైమ్‌పాస్‌లతో రోజంతా గడవడం కష్టమే. ‘‘ఇంట్లోనే ఉండడంతో బోర్ కొడుతోంది.. ఎంటర్టైన్మెంట్ ప్లీజ్’’ అని వరుణ్ తేజ్ సోషల్ మీడియాలోని ప్రేక్షకులకు విన్నవించుకున్నారు. గాయం తగ్గేవరకూ వరుణ్‌కి ఈ బోర్ తప్పదు. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ చిత్రాల్లో వరుణ్ తేజ్ నటిస్తున్నారు. గాయం కారణంగా రెండు సినిమాల షూటింగ్‌లకూ తాత్కాలికంగా బ్రేక్ పడింది. -
వరుణ్‌కు రెండు పతకాలు
సాక్షి, హైదరాబాద్: ముంబైలో జరిగిన ‘స్పెషల్ ఒలింపిక్స్ భారత్’ పోటీల్లో హైదరాబాద్ స్విమ్మర్ వరుణ్ చంద్ సత్తా చాటాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో వరుణ్ 50 మీ. విభాగంలో స్వర్ణ పతకంతో పాటు, 100 మీ. విభాగంలో రజత పతకాన్ని సాధించాడు. వరుణ్ చంద్ రాష్ట్ర నిఘా విభాగం చీఫ్ నవీన్ చంద్ కుమారుడు. -
‘ఆ అమ్మాయి చాలా ఫాస్ట్.. పెళ్లి చేసుకోను’
హైదరాబాద్ : నిశ్చితార్థం జరిగింది.. పెళ్లి ముహుర్తం కూడా పెట్టుకున్నారు.. కట్నకానుకలు మాట్లాడుకున్నారు. ఇంతలోనే ఆ ఎన్ఆర్ఐ యువకుడు మనసు మార్చుకొని ఈ పెళ్లి తనకిష్టం లేదంటూ ప్లేటు ఫిరాయించాడు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్ కాలనీలో నివాసముండే యువతికి ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న వరుణ్ అనే యువకుడితో పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ ఏడాది నవంబర్ 26వ తేదీన పెళ్లి కూడా నిశ్చయించారు. అయితే గతేడాది డిసెంబర్ 27 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీ వరకు బాగానే ఉన్న వరుణ్ కాబోయే భార్యతో చాటింగ్ చేసేవాడు. ఫోటోలు కూడా షేర్ చేసుకునేవాడు. అయితే ఇటీవలనే అకస్మాత్తుగా వరుణ్ ఆమెతో మాట్లాడటం మానేశాడు. అతడితో మాట్లాడేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. యువతి ప్రవర్తన మంచిది కాదంటూ వరుణ్ ప్రచారం చేశాడు. పైపెచ్చు పెళ్లి చేసుకోవాలంటూ రూ.20లక్షలు అదనపు కట్నం కావాలంటూ షరతు పెట్టాడు. తనకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చిందని.. అమ్మాయి ప్రవర్తన మంచిది కాదంటూ వరుణ్ ఫోన్లో చెప్పాడని అందుకే... తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా అమ్మాయి చాలా అడ్వాన్స్‌గా ఉందంటూ వరుణ్ మరో ప్రచారం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వరుణ్‌తో పాటు తల్లి పూర్ణిమ, తండ్రి వినోద్‌కుమార్‌లపై ఐపీసీ సెక్షన్ 417 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
టేబుల్ టెన్నిస్ చాంప్స్ వరుణి, విఘ్నయ్
హైదరాబాద్: సెయింట్ పాల్స్ వార్షిక టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ లో విఘ్నయ్ రెడ్డి, వరుణి జైశ్వాల్ విజేతలుగా నిలిచారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో విఘ్నయ్ రెడ్డి (ఆర్బీఐ)11-08, 09-11, 11-02, 11-08తో అమన్ (ఐటీ)పై విజయం సాధించగా... మహిళల ఫైనల్లో వరుణి జై శ్వాల్ (జీఎస్ఎమ్) 11-09, 07-11, 11-09, 05-11, 08-11, 11-07, 11-07తో నైనా జైశ్వాల్ (ఎల్బీఎస్)ను ఓడించింది. జూనియర్ బాలికల విభాగంలో నైనా జైశ్వాల్ 11-08, 11-07, 11-09, 11-06తో వరుణిపై గెలిచి టైటిల్‌ను సాధించింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన నీలిమ, రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘం ఉపాధ్యక్షుడు కె.కె.మహేశ్వర్, సంయుక్త కార్యదర్శి నరసింహారావు, సెయింట్ పాల్ హైస్కూల్ ప్రిన్సిపల్ రాయప్పరెడ్డి పాల్గొన్నారు. -
సైకిల్ మెకానిక్.. ఐఏఎస్ అయ్యాడు!
చిన్న వయసులోనే తండ్రి తనువు చాలించడంతో తన చదువును ఆపేసిన ఓ బాలుడు... కష్టాలకు ఎదురీదాడు. పూట గడవని స్థితిలో ఫీజులు కట్టలేక ఎన్నోసార్లు విద్యాభ్యాసానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అయితే విరమించుకున్న ప్రతిసారీ ఏదో ఒకరూపంలో అతడికి ప్రోత్సాహం లభించడంతో పట్టువదలని విక్రమార్కుడిలా తిరిగి చదువును కొనసాగిస్తూ వచ్చాడు. అయితే చిన్నతనంలో డాక్టర్ అయ్యి.. అందరికీ సేవలు అందించాలనుకున్న తన కోర్కెను.. జీవితానుభవాలకు అనుగుణంగా మార్చుకొన్న ఆ బాలుడు.. ప్రజాసేవే లక్ష్యంగా ఐఏఎస్ ఆఫీసర్ అయి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. మహరాష్ట్ర పాల్ఘర్ జిల్లా, బైసర్ పట్టణానికి చెందిన వరుణ్ భరన్వాల్.. చిన్నతనంలో డాక్టర్ అవ్వాలని కలలుగనేవాడు. వరుణ్ తండ్రి సైకిల్ రిపేర్ షాపును నడిపిస్తూ.. వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషించేవాడు. వరుణ్ తోపాటు అతడి సోదరికి కూడ మంచి భవిష్యత్తును ఇవ్వాలన్నదే లక్ష్యంగా పనిచేసేవాడు. కానీ వరుణ్ 2006 సంవత్సరంలో పదోతరగతి పరీక్షలు రాశాడో లేదో తండ్రి ఉన్నట్లుండి గుండెజబ్బుతో మరణించాడు. అప్పటికి సైకిల్ షాపు లాభాల్లోనే కొనసాగుతోంది. కానీ తండ్రి ఆస్పత్రి బిల్లులు చెల్లించలేక వరుణ్ కుటుంబం అప్పులపాలైపోయింది. సోదరి టీచర్ అయినప్పటికీ ఆమె వేతనం ఇల్లుగడవడానికే చాలీ చాలకుండా ఉండేంది. దాంతో అప్పుల భారం పెరిగిపోయింది. ఇంటి పరిస్థితులను గమనించిన వరుణ్.. చదువుకు స్వస్తి చెప్పేసి, తండ్రి వ్యాపారాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. షాపులో పని ప్రారంభించిన కొన్నాళ్ళకు పదోతరగతి పరీక్షల్లో పట్టణంలోనే రెండో అత్యధిక మార్కులతో పాసయ్యాడు. తోటి స్నేహితులు, టీచర్లు వరుణ్ మార్కులను చూసి ఎంతో సంతోషించడంతోపాటు అతడ్ని పై చదువులకు ప్రోత్సహించారు. దీంతో వ్యాపారాన్ని తల్లికి అప్పగించి వరుణ్ తిరిగి చదువును కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఆ పరిస్థితుల్లో కాలేజీ ఫీజు పదివేల రూపాయలు కట్టలేక తిరిగి వ్యాపారాన్ని కొనసాగించడం ప్రారంభించాడు. అదే సమయంలో వరుణ్ తండ్రికి చికిత్స అందించిన డాక్టర్ కంప్లి.. వరుణ్ అభీష్టాన్ని తెలుసుకొని ఫీజు కట్టేందుకు ముందుకొచ్చాడు. జేబునుంచి పదివేల రూపాయలు తీసివ్వడంతో కాలేజీలో చేరిన వరుణ్.. నెలవారీ ఫీజు కట్టేందుకు చదువుతోపాటు రేయింబగళ్ళు ఖాళీసమయాల్లో ట్యూషన్లు చెప్పేవాడు. వచ్చిన సంపాదనతో ఫీజులు కట్టేవాడు. ఇంటర్ పూర్తయిన తర్వాత తాను అనుకున్నట్లుగా ఎంబిబిఎస్ చదివేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక, ఎంఐటీ కాలేజ్ పూనె లో ఇంజనీరింగ్ లో చేరాడు. మొదటి సంవత్సరం మంచి మార్కులతో పాసై... స్కాలర్ షిప్ తెచ్చుకొని ఇంజనీరింగి పూర్తయ్యే లోపే క్యాంపస్ సెలెక్షన్ లో 2012 లో మల్టీ నేషనల్ కంపెనీ డెలాయిట్ లో ఉద్యోగం సంపాదించాడు. ఇక జీవితం స్థిరపడిపోయినట్లే అనుకునే సమయంలో అతడి జీవితం మరో మలుపు తిరిగింది. అప్పట్లో అవినీతికి వ్యతిరేకంగా జనలోక్ పాల్ బిల్ కోసం అన్నా హజారే నిర్వహించిన ఉద్యమం వరుణ్ లో స్ఫూర్తిని నింపింది. ప్రజాసేవే పరమావధిగా భావించిన వరుణ్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలని నిశ్చయించుకొని, మిత్రుల సహాయంతో ఆర్నెల్లపాటు యూపీఎస్ సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. అందుకు పుస్తకాలు కొనడానికి కూడ ఎంతో ఇబ్బందులు పడి, చివరికి ఓ ఎన్జీవో సంస్థ సహాయంతో పుస్తకాలు కొని పట్టుదలతో చదివి 2014 యూపీఎస్ సీ పరీక్షల్లో 32వ ర్యాంకును సాధించాడు. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని హిమ్మత్ నగర్ లో అసిస్టెంట్ కలెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న వరుణ్.. ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. -
షార్ట్ ఫిల్మ్ తీయబోతే...?
‘‘మంచి సినిమాలకెప్పుడూ ఆదరణ ఉంటుంది. ఈ చిత్ర నిర్మాత వరుణ్ మా కజిన్ . ‘ముసుగు’ అనే సినిమా పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉండగానే, కొత్త చిత్రం ప్రారంభించడంతో నాకు ఆశ్చర్యమేసింది’’ అని నిర్మాత సురేశ్‌బాబు పేర్కొన్నారు. శ్రీనివాస రెడ్డి, ధీరేంద్ర, ప్రవీణ్, బిందు బార్బీ, కారుణ్య చౌదరి ప్రధాన పాత్రల్లో వేద ఎంటర్ప్రైజెస్ పతాకంపై శ్రీకరబాబు దర్శకత్వంలో దగ్గుబాటి వరుణ్ నిర్మిస్తున్న కొత్త చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత అశోక్ కుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా మరో నిర్మాత టి. ప్రసన్న కుమార్ క్లాప్ కొట్టారు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ కళాశాల నేపథ్యంలో జరిగే కథ ఇది. షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ కోసం వైజాగ్ వెళ్లిన విద్యార్థులకు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయనే సస్పెన్స్ అంశం చుట్టూ ఈ చిత్రం నడుస్తుంది’’ అన్నారు. దర్శకుడు, నటుడు రాంబాబు, సంగీత దర్శకుడు అమోఘ్ దేశ్‌పతి, పాటలు, మాటల రచయిత ‘గంగోత్రి’ విశ్వనాథ్ మాట్లాడారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ-లోఫర్
-
అందరూ వరుణ్ గురించే అడుగుతున్నారు - పూరి జగన్నాథ్
‘‘సక్సెస్ టూర్‌కి ఎక్కడికి వెళ్లినా అందరూ వరుణ్ గురించే అడుగుతున్నారు. మదర్ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయింది. ‘మిమ్మల్ని అమ్మా అని పిలవచ్చా’అని రేవతి గారిని ఒకరు అడిగారట. ఇక పోసాని గారైతే తాను దాదాపు 5 వేల కాల్స్ రిసీవ్ చేసుకున్నానని చెప్పారు’’ అని పూరి జగన్నాథ్ తెలిపారు. వరుణ్, దిశా పాట్ని జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన ‘లోఫర్’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా సక్సెస్ టూర్‌ను చిత్రబృందం నిర్వహించింది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ- ‘‘ ‘కంచె’తో ఈ ఏడాదిని మొదలుపెట్టి, ‘లోఫర్’తో పూర్తి చేయడం హ్యాపీగా ఉంది’’ అని అన్నారు. రచయిత సుద్దాల అశోక్‌తేజ, సహ నిర్మాత సీవీరావు తదితరులు పాల్గొన్నారు. -
'కంచె'లో వరుణ్ నటనకు గర్వంగా ఫీలవుతున్నా: చిరు
మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'కంచె' సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. క్రియేటివ్ డైరెక్రట్ క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా తెలుగు సినిమా స్ధాయిని మరో మెట్టు పైకి చేర్చిందంటున్నారు విశ్లేకులు. కమర్షియల్‌గా కూడా మంచి విజయం సాధించిన కంచె సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కంచె సినిమా స్పెషల్ షో చూసిన మెగాస్టార్ చిరంజీవి యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ' ఈ సినిమా చూశాక యూనిట్ సభ్యులను అభినందించకుండా ఉండలేకపోయా. కంచె సినిమాను ప్రయోగాత్మక చిత్రం అనేకంటే, విజయవంతమైన ప్రయోగం అంటే సరిగ్గా సరిపోతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో ప్రేమకథతో పాటు అంతర్జాతీయ స్ధాయి యుద్ధ సన్నివేశాలను ఒకే సినిమాలో చూపించటంలో క్రిష్ మంచి విజయం సాధించాడు. ఓ తండ్రిగా వరుణ్ నటన చూసి గర్వంగా ఫీల్ అవుతున్నా. సాయిమాధవ్ డైలాగ్స్ సినిమా స్ధాయిని మరింతగా పెంచాయి. చిన్న చిన్న పదాలతో బరువైన భావాలను పలికించారు. ముఖ్యంగా కుల వ్యవస్థ మీద రాసిన డైలాగ్ ఆలోచింప చేసేదిగా ఉంది. ఇంతటి భారీ చిత్రాన్ని ఇంత తక్కువ సమయంలో తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నా' అంటూ యూనిట్ సభ్యులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. -
మెగా కాంపౌండ్ నుంచి పూరికి పిలుపు
-
తప్పు మాదేనా?
అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19? నాకు ఒక్కగానొక్క కొడుకు. వచ్చే నెలకి పదిహేడేళ్ల్లు నిండుతాయి. పేరు వరుణ్. నేనూ, మా వారు ప్రైవేట్ ఉద్యోగులం. ఇప్పుడు నేను ఉద్యోగానికి వెళ్లడం లేదు. వరుణ్ని చూసుకోవడానికే పూర్తి సమయం కేటాయిస్తున్నాను. ఎప్పటికి కోలుకుంటాడో అని కొండంత దిగులును దిగమింగుకొని గంపెడాశతో బతుకుతున్నాను. నాలాంటి సమస్య పిల్లలున్న తల్లిదండ్రులకు ఎవరికీ రాకూడదని, ముందే జాగ్రత్త తీసుకుంటారని చెబుతున్నాను. మా వరుణ్ బాగా చదివేవాడు. చూడటానికి సినిమా హీరోలా ఉంటాడని మా బంధువులు, స్నేహితులు ఎప్పుడు కలిసినా అనేవారు. పదవ తరగతి 9.5 శాతం మార్కులతో పాసయ్యాడు. ఇంకో నాలుగైదేళ్లు కష్టపడితే చాలు వాడి జీవితం ఒక గాడిన పడుతుందని సంబరపడ్డాను. అప్పటి వరకు ఉద్యోగం చేసి, ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవచ్చు అని ఆలోచించాను. కానీ, నా ఆలోచనను మా వాడు తలకిందులు చేశాడని తెలిసేవరకు చాలా ఆలశ్యమైంది. ఓ రోజు ఆఫీస్‌లో ఉండగా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్... ‘ఔటర్‌రింగ్‌రోడ్డు యాక్సిడెంట్లో మీ అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆసుపత్రిలో అడ్మిట్ చేశాం...’ అని. విలవిల్లాడిపోయాను. కాలేజీలో ఉండాల్సిన వాడు ఔటర్‌రింగ్ రోడ్డుకు ఎందుకెళ్లాడు?! ఎప్పుడెళ్లాడు?! అనుకుంటూనే ఆసుపత్రికి వెళ్లాను. మా అదృష్టం బాగుండి వాడు ప్రాణాలతో మాకు దక్కాడు. కానీ, ఎటూ కదల్లేక పడి ఉన్న వాడిని చూస్తూ ప్రతి క్షణం మేమే ప్రాణాలతో ఎందుకున్నామా? అని బాధపడుతూ ఉన్నాం. మా తప్పిదమే మా ఈ శిక్షకు కారణమైందని ఇప్పటికీ తిట్టుకుంటున్నాం. టెన్త్‌లో డిస్టింక్షన్లో పాసైన వరుణ్ ఇంటర్మీడియెట్ ఫస్టియర్‌లో 40 శాతం అత్తెసరు మార్కులతో పాసయ్యాడు. వచ్చే ఏడాది బాగానే కవర్ చేస్తాడులే అని సరిపెట్టుకున్నాను. కానీ, సెకండియర్‌లో రెండు సబ్జెక్టులు మిగిలిపోయాయి. వీడి క్లాసు పిల్లలు బి.టెక్కు వెళుతున్నారు. వీడు ఫెయిలై మళ్లీ అదే క్లాస్‌కి వెళుతున్నాడు. ఇంట్లోనే ఉంటే ఆ సబ్జెక్టులు కూడా పాసవలేడని, డబ్బులు కట్టి మళ్లీ కాలేజీకి పంపిస్తున్నాం. అసలేమైందంటే, పదవతరగతి పూర్తయ్యాక డబ్బులు ఎక్కువైనా పర్వాలేదని, ముందే మంచి కాలేజీలో ఎం.పి.సి సీటు తీసుకున్నాం. మొదట్లో వరుణ్ కాలేజీకి వెళ్లనంటే వెళ్లనన్నాడు. వాడికి హిస్టరీ అంటే ఇష్టం. అందుకే అదే సబ్జెక్ట్ ఉన్న కోర్స్ చేస్తానన్నాడు. దాంట్లో భవిష్యత్తు ఉండదని మేం వారించాం. తిట్టాం. బుజ్జగించాం. ఎమ్‌టెక్ చేసి, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయితే విదేశాలకు వెళ్లి లక్షలు లక్షలు సంపాదించుకోవచ్చని నచ్చజెప్పాం. ఎట్టకేలకు ‘సరే’ అన్నాడు. కానీ, కాలేజీకి వెళ్లాలంటే ఫోన్ కావాలన్నాడు. ల్యాప్ టాప్ అవసరమన్నాడు. వాడు చదువుకుంటే చాలు అనుకొని మా శక్తికి మించి వాడు కోరినవన్నీ కొనిస్తూనే వచ్చాం. కొనిచ్చిన వస్తువులు కనపడక అడిగితే అరిచేవాడు. తప్పు పడుతున్నారని కోపం తెచ్చుకొని చేతికి అందిన వస్తువునల్లా విసిరికొట్టేవాడు. వీడి ప్రవర్తనకు విసిగి వరుణ్ నాన్నగారు కొన్నిసార్లు వాడి మీద చేయి కూడా చేసుకున్నారు. మా వారికి తెలియకుండా వరుణ్ బుద్దిగా ఉండటానికి నేనే అడిగినప్పుడల్లా ఎంతో కొంత డబ్బిచ్చేదాన్ని. అప్పటికి చెప్పింది బాగానే వినేవాడు. వరుణ్ రోజూ కాలేజీకి వెళుతున్నాడనే అనుకున్నాను. కానీ, కాలేజీ ఎగ్గొట్టి స్నేహితులతో సినిమాలకు, షికారులకు, బైక్ రేసింగ్‌లకు వెళుతున్నాడని, ఇంట్లో డబ్బులు దొంగతనం చేస్తున్నాడని, దగ్గర ఉన్న వస్తువులు అమ్మేసి స్మోకింగ్ వంటి వ్యసనాల వైపుకు మళ్లాడని తెలిసేసరికి చాలా ఆలశ్యమైపోయింది. క్లాసులకు హాజరవకుండా కాలేజీవారినే ఏమార్చేవాడని, చదువుకోకుండా డబ్బులిచ్చి రికార్డులు రాయించుకునేవాడని తెలిసి ఆశ్చర్యపోయాను. టాలెంట్ ఉండీ, ఇలా అడ్డదారిలో ఆనందాలను వెతుక్కోవడానికి మేమే కారణం అని తెలిసి నివ్వెరపోయాం. - గాయత్రి (వరుణ్ తల్లి) -
విజువల్ వండర్‌గా...
పౌరాణిక నేపథ్యంతో మోక్ష శ్రీమయి సమర్పణలో సింహవాహిని చలనచిత్ర పతాకంపై రూపొందుతున్న ‘వైవస్వత’ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. వరుణ్-కార్తికేయల జంట దర్శకత్వంలో ఎస్. నాగరాజు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. పౌరాణిక కథల్లో ఇప్పటివరకూ వెండితెరకు రాని ఓ కథతో ఈ చిత్రం ఉంటుందని వరుణ్-కార్తికేయ తెలిపారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్‌పరంగా అద్భుతంగా ఉంటుందని, సాంకేతికంగా భారతీయ సినిమా ఆశ్చర్యపోయే రీతిలో ఈ చిత్రం ఉంటుందని దర్శకులు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: రఘు చతుర్వేదుల, ఆర్ట్: ఎన్. ఇళయరాజా, కెమెరా: ప్రవీణ్ కె బంగారి. -
ఫ్రెండ్‌కు థ్యాంక్స్!
దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య తెగ వినిపిస్తున్న పేరు త్రిష. కారణం ఆమె సినిమాలు, ప్రదర్శన కాదు... మొన్నటి వరకు రానాతో ‘డేటింగ్’షిప్... ఇప్పుడు ఫ్రెండ్ వరుణ్ మానియన్‌తో ఎంగేజ్మెంట్ రూమర్స్. ఎంత అడిగినా... తమిద్దరి మధ్యా అలాంటిదేమీ లేదంటూ కొట్టి పారేస్తున్నారు త్రిష, వరుణ్. అయితే... ఇటీవలే తమిళంలో ‘రేడియన్స్ మీడియా గ్రూప్’ను కూడా స్టార్ట్ చేసిన వరుణ్ తీసిన చిత్రం ‘కావియా తలైవన్’పై ప్రశంసలు కురిపించేసింది త్రిష. టీమ్ అందరి ఎఫర్‌ట బాగుందంటూనే... అద్భుతమైన సినిమా తీసినందుకు వరుణ్‌కు థ్యాంక్స్ చెప్పింది. సినిమాతో తనకు ఎలాంటి రిలేషన్ లేకపోయినా... స్పెషల్‌గా వరుణ్‌కు థ్యాంక్స్ ఏమిటనేది ఇండస్ట్రీ తంబీల ప్రశ్న. -
చాంప్స్ వరుణ్, సేవిత
బ్రిలియంట్ ట్రోఫీ చెస్ సాక్షి, హైదరాబాద్: బ్రిలియంట్ చెస్ టోర్నీ ఓపెన్ కేటగిరీ విభాగంలో వి. వరుణ్ విజేతగా నిలిచాడు. 6 రౌండ్ల ద్వారా అతను 5.5 పాయింట్లు స్కోర్ చేశాడు. చెరో 5 పాయింట్లు సాధించిన ఎంవై రాజు, విశ్వనాథ్ శాండిల్య రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. జూనియర్ కేటగిరీలో సాధువస్వాని ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన సేవిత విజు ట్రోఫీని గెలుచుకుంది. 6 రౌండ్లలో సేవిత 5.5 పాయింట్లు సాధించింది. సాయి అమిత్ (5), రుత్విక్ పొన్నపల్లి (5)లకు రెండు, మూడు స్థానాలు దక్కాయి. ఓపెన్ కేటగిరీ ఫలితాలు: 1. వి.వరుణ్, 2. ఎంవై రాజు, 3. విశ్వనాథ్ శాండిల్య, 4. ఎస్వీసీ చక్రవర్తి, 5. ఎస్.ఖాన్, 6. ఎన్. రామ్మోహనరావు, 7. టి.రమణ్ కుమార్, 8. మురళీమోహన్, 9. వీఎస్ఎన్ మూర్తి, 10. ఎన్సీ రామ్. వివిధ వయో విభాగపు కేటగిరీ ఫలితాలు: (బాలురు) అండర్-14: 1. తరుణ్, 2. ముదబ్బిర్; అండర్-12: 1. సాయి అమిత్, 2. జయంత్; అండర్-10: 1. రుత్విక్, 2. పి. సాయిరోహన్; అండర్-8: 1. రోహిత్ యాదవ్, 2. సాకేత్ కుమార్; అండర్-6: ఎస్. ప్రణయ్, 2. అమోఘ్ (బాలికలు) అండర్-10: 1. హన్సిక; అండర్-8: 1. రచిత, 2. జావళి; అండర్-6: 1. నిగమశ్రీ, 2. హాసిని; ఉత్తమ మహిళా క్రీడాకారిణి: లాస్యప్రియ, ఉత్తమ వెటరన్ క్రీడాకారుడు: పీవీ దుర్గాప్రసాద్ -
పాస్తా రుచుల రాస్తా
‘‘జంతువులు ఆకలేస్తే తింటాయి. మనుషులు అనుబంధాల కోసం తింటారు’’ ‘ఢిల్లీ 6’ సినిమాలో డైలాగ్. పాస్తా... చూడ్డానికి పచ్చి ఆకుల సేమియాలానో... ఉడికీ ఉడకని నూడిల్స్లానో... దవడలకు పనిపట్టే దుంపముక్కల్లానో ఉంటుంది! కానీ ప్రపంచం పాస్తాను పడీపడీ తింటుంది. అనుబంధాల కోసం పంచుకుంటూ తింటుంది! ‘‘లైఫ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ మ్యాజిక్ అండ్ పాస్తా’’ అట! ఇటలీ సినీ దర్శకుడు ఫెలినీ అనేవారు. పాస్తా వాళ్ల దేశానిది కాబట్టి ఆయన అలా అన్నారని అనుకునేరు! ఏ దేశం వారైనా... అదే ఎక్స్ప్రెషన్! అంతగా ఏముందబ్బా అందులో మ్యాజిక్? ఇవాళ మీకు తెలుస్తుంది. పాస్తా మిమ్మల్ని రుచుల రాస్తా ఎక్కిస్తుంది. ష్రింప్ విత్ పాస్తా కావలసినవి: పాస్తా - కప్పు, ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రేకలు- 3, ఉల్లితరుగు - పావు కప్పు, ష్రింప్ (రొయ్యలు) - అర కప్పు, మిరియాల పొడి - పావు టీ స్పూను, టొమాటో తరుగు - అర కప్పు, బేసిల్ ఆకులు - 10 (సూపర్ మార్కెట్లో దొరుకుతాయి), రెడ్ క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు, తాజా క్రీమ్ - కప్పు, పర్మేసన్ చీజ్ - టేబుల్ స్పూను, ఉప్పు - తగినంత. తయారీ: ఒక పాత్రలో తగినంత ఉప్పు, నీళ్లు వేసి మరిగించాలి పాస్తా జత చేసి, ఉడికించి, వడ కట్టాలి (కప్పుడు నీటిని పక్కన ఉంచాలి) పెద్ద బాణలిలో ఆలివ్ ఆయిల్ వేసి కాగాక ముందుగా వెల్లుల్లి రేకలు, ఉల్లి తరుగు, రొయ్యలు వేసి దాని మీద మిరియాల పొడి, చిటికెడు ఉప్పు వేసి కలిపి మూత ఉంచి, రెండు నిమిషాలు ఉడికించాలి బాగా కలిపి మరో రెండు నిమిషాల తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి అదే బాణలిలో ఉడికించిన పాస్తా వేసి అడుగు అంటకుండా కలుపుతుండాలి టొమాటో తరుగు, సగం బేసిల్ ఆకులు, రెడ్ క్యాప్సికమ్ తరుగు, తగినంత ఉప్పు, పర్మేసన్ చీజ్ వేసి పదార్థాలన్నీ కొద్దిగా దగ్గరపడే వరకు ఉడికించాలి క్రీమ్ జత చేసి రెండు నిమిషాలు ఉడికించాలి ఉడికించి ఉంచుకున్న రొయ్యలు, పక్కన ఉంచుకున్న కప్పుడు నీళ్లు, ఉప్పు జత చేయాలి మిగిలిన బేసిల్ ఆకులు వేసి కలిపి వేడివేడిగా అందించాలి. స్పగెటీ మీట్ బాల్స్ కావలసినవి: మటన్ - పావు కేజీ, ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 3, ఉల్లితరుగు - అర కప్పు, టొమాటో తరుగు - కప్పు, స్పగెటీ పాస్తా - పావు కేజీ, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - కొద్దిగా, పర్మేసన్ చీజ్ - టేబుల్ స్పూను. తయారీ: మటన్‌కి కొద్దిగా ఉప్పు జత చేసి చిన్న చిన్న ఉండలుగా చేసి మరిగే నూనెలో వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీయాలి బాణలిలో మిగిలిన నూనెలో ఆవాలు, జీలకర్ర, పచ్చి మిర్చి తరుగు, వెల్లుల్లి రేకలు వేసి వేయించాలి ఉల్లితరుగు, టొమాటో తరుగు జత చేయాలి టొమాటో ముక్కలు మెత్తబడ్డాక ఉడికించి ఉంచుకున్న స్పగెటీ పాస్తా, మీట్ బాల్స్, ఉప్పు వేసి కలపాలి పర్మేసన్ చీజ్ వేసి బాగా కలపాలి మిరియాల పొడి చల్లి మరోమారు కలిపి వేడివేడిగా అందించాలి. పర్మేసన్ చీజ్ ఇది ఇటాలియన్ చీజ్. దీనిని ఆవు పాల నుంచి తయారుచేస్తారు. ఈ చీజ్‌ను సాధారణంగా స్పగెటీ పాస్తాలో వాడతారు. ఇది గట్టిగా ఉంటుంది. తురుముకుని వాడతారు. స్పగెటీ పాస్తా స్పగెటీ పాస్తాను ఒక రకమైన గోధుమపిండికి నీళ్లు జత చేసి తయారుచేస్తారు. ఇటాలియన్‌కు చెందిన ఈ పాస్తా పల్చగా సిలిండర్ ఆకారంలో ఉంటుంది. ఇది 50 సె.మీ. పొడవులో ఉండేది. ప్రస్తుతం 25 సెం.మీ.లలో దొరుకుతోంది. స్పగెటీ అనే పదం ఇటాలియన్ స్పగెటో నుంచి వచ్చింది. దీని అర్థం పల్చటి తీగ అని. ఫెట్యూసినీ మిక్స్ సాస్ కావలసినవి: ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను, ఉల్లితరుగు - పావు కప్పు, వెల్లుల్లి రేకలు - 3, టొమాటో తరుగు - అర కప్పు, ఫెట్యూసినీ పాస్తా - కప్పు, తాజా క్రీమ్ - అరకప్పు, పర్మేసన్ చీజ్ - టేబుల్ స్పూను, ఉప్పు - తగినంత, మిరియాలపొడి - పావు టీ స్పూను తయారీ: బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, పచ్చి మిర్చి వేసి వేయించాలి ఉల్లితరుగు, వెల్లుల్లి రేకలు, టొమాటో తరుగు జత చేసి మరో మారు కలపాలి ఉడికించి ఉంచుకున్న ఫెట్యూసినీ పాస్తా, ఉప్పు, క్రీమ్, పర్మేసన్ చీజ్ వరుసగా వేసి బాగా కలపాలి మిరియాల పొడి చల్లి ఒకసారి కలిపి దించేయాలి వేడివేడిగా అందించాలి. లసాన్యా కావలసినవి: లసాన్యా షీట్లు - 3, జుచినీ - 1, క్యాప్సికమ్ తరుగు - కప్పు, వంకాయ - 1 (చిన్న చిన్న ముక్కలుగా తరగాలి), క్యారట్ తరుగు - పావు కప్పు, బేబీ కార్న్ తరుగు - అర కప్పు,టొమాటో సాస్ - కప్పు, పర్మేసన్ చీజ్ - టేబుల్ స్పూను, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - కొద్దిగా, వెల్లుల్లి రేకలు - 3, ఉల్లితరుగు - పావు కప్పు, ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు, మోజెరిల్లా చీజ్ - అర కప్పు, క్రీమ్ - కొద్దిగా. తయారీ: లసాన్యా షీట్లను ఉడికించి తీసి చన్నీళ్లలో వేయాలి బాణలిలో నూనె కాగాక తరిగి ఉంచుకున్న కూర ముక్కలు వేసి వేయించాలి వెల్లుల్లి రేకలు, మిరియాలపొడి, పోపు జతచేయాలి లసాన్యా షీట్ల మీద ఉడికించి ఉంచుకున్న కూరముక్కలను వరుసగా పేర్చి, పైన టొమాటో సాస్ వేయాలి ఆపైన మోజెరిల్లా చీజ్, క్రీమ్ వేయాలి ఇదే విధంగా అన్ని షీట్ల మీద చేసి ఒకదాని మీద ఒకటి అమర్చి, 200 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసిన అవెన్‌లో సుమారు పావుగంట ఉంచి తీసేయాలి. వేడివేడిగా వడ్డించాలి. జనోచ్చీ కావలసినవి: మైదాపిండి - 2 టేబుల్ స్పూన్లు, బంగాళదుంపలు - 2 (ఉడికించి తొక్కు తీసి మెత్తగా చేయాలి), ఉప్పు - తగినంత, కోడిగుడ్డు - 1 (ఉడికించాలి), పర్మేసన్ చీజ్ - టేబుల్ స్పూను, ఉల్లితరుగు - పావు కప్పు, వెల్లుల్లి రేకలు - 3, బేసిల్ ఆకులు - 10, ఎండిన టొమాటో ముక్కలు - కొద్దిగా, ఆలివ్కాయలు - 5, పాస్తా - రెండు కప్పులు (ఉడికించి నీరు తీసేయాలి), ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను, మిరియాల పొడి - పావు టీ స్పూను తయారీ: ఒక పాత్రలో మైదాపిండి, ఉడికించిన బంగాళదుంప ముద్ద, ఉప్పు, ఉడికించిన కోడిగుడ్డు , పర్మేసన్ చీజ్ వేసి బాగా కలిపి, కావలసిన ఆకారంలో ఉండలు తయారుచేసుకోవాలి ఒక పాత్రలో నీళ్లు మరిగించి అందులో ముందుగా తయారుచేసి ఉంచుకున్న బాల్స్ వేసి ఉడికించాలి బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి ఉల్లితరుగు, వెల్లుల్లి రేకలు, బేసిల్ ఆకులు, ఎండిన టొమాటో ముక్కలు, ఆలివ్ కాయలు, ఉడికించిన పాస్తా ఒకదాని తరవాత ఒకటి వేస్తూ బాగా కలపాలి చివరగా మిరియాల పొడి చల్లి కలిపి వేడివేడిగా అందించాలి. చెఫ్: వరుణ్ ఆవాస, మాదాపూర్, హైదరాబాద్ సేకరణ: డా. వైజయంతి ఫొటోలు: అనిల్ కుమార్ మోర్ల -
స్నేహిత్, వరుణ్‌లకు టైటిల్స్
స్టేట్ ర్యాంకింగ్ టీటీ టోర్నీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో ఫిడేల్ ఆర్. స్నేహిత్, వరుణ్ శంకర్లు టైటిల్స్ సాధించారు. ఖమ్మంలోని జూబ్లీ క్లబ్లో జరిగిన ఈ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్ టీటీ అకాడమీ (జీటీటీఏ) కుర్రాళ్లు బాలుర విభాగంలో, గుజరాతీ సేవామండలి (జీఎస్ఎం) అమ్మాయిలు బాలికల విభాగంలో విజేతలుగా నిలిచారు. సబ్-జూనియర్ బాలుర తుదిపోరులో ఫిడేల్ ఆర్. స్నేహిత్ (జీటీటీఏ) 10-12, 9-11, 11-4, 11-9, 12-10, 11-2తో సాయి తేజేష్ (సెయింట్ పాల్ అకాడమీ)పై గెలుపొందగా, బాలికల ఈవెంట్లో జి.ప్రణీత (జీఎస్ఎం) 11-5, 12-10, 9-11, 18-16, 12-10తో వి.లాస్య (ఆనంద్‌నగర్ వెల్ఫేర్ సంఘం-ఏడబ్ల్యూఏ)పై విజయం సాధించింది. క్యాడెట్ బాలుర టైటిల్ పోరులో బి.వరుణ్ (జీటీటీఏ) 11-9, 11-8, 12-10తో అద్వైత్ (ఏడబ్ల్యూఏ)పై నెగ్గగా, భవిత (జీఎస్ఎం) 11-2, 11-8, 9-11, 5-11, 12-10తో అంజలి (జీఎస్ఎం)పై గెలిచింది. -
నగర విద్యార్థికి కేంబ్రిడ్జి పురస్కారం
నగర విద్యార్థికి అవుట్ స్టాండింగ్ కేంబ్రిడ్జి లెర్నర్ అవార్డు లభించింది. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌లో చదువుతున్న వరుణ్ మాథుర్ జూన్ 2014 సిరీస్‌లో కేంబ్రిడ్జి నిర్వహించిన ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐజీసీఎస్ఈ) పరీక్షలో భారత్ నుంచి ప్రథమస్థాయిలో నిలిచాడు. కేంబ్రిడ్జి.. ఇంటర్నేషనల్ ఎగ్జామినేషన్‌లో భాగంగా పాఠశాల స్థాయిలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు పరీక్ష నిర్వహిస్తుంది. దీనిలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు పురస్కారం అందజేస్తారు. వీరికి అంతర్జాతీయంగా గుర్తింపుతోపాటు కెరీర్‌కు అవసరమైన ప్రోత్సాహాన్ని కేంబ్రిడ్జి వర్సిటీ అందిస్తుంది. నగరానికే చెందిన మరో విద్యార్థి చాలుమూరి వెంక టనాగ రితిన్ నాయుడు రెండో స్థానంలో నిలిచాడు. -
క్షణక్షణమూ నరకమే!
గజ్వేల్/తూప్రాన్: ‘‘మా బిడ్డ ఎంతో గొప్పది అవుదనుకున్నం.. గిట్ల మా కళ్ల ముందే కన్ను మూస్తదనుకోలేదు.. మిగిలిన ఇద్దరు పిల్లలు కూడా ఆసుపత్రిలో ఉన్నరు.. దేవుడా నువ్వే దిక్కు.. ఇట్లాంటి కష్టం పగోడికి కూడా రావోద్దు..’’.. మాసాయిపేట స్కూలు బస్సు-రైలు దుర్ఘటనలో కూతురును కోల్పోయి, మరో ఇద్దరు పిల్లలు ఆస్పత్రిలో ఉన్న శివ్వంపేట మల్లాగౌడ్-లత దంపతుల ఆవేదన ఇది. వారు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె శృతి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.. మరో కుమార్తె రుచిత తీవ్రగాయాలతో ఆస్పత్రి బెడ్‌పై ఉంది.. కుమారుడు వరుణ్ చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు... వీరిదే కాదు... ఆ ప్రమాదంలో మృతిచెం దిన, గాయపడిన వారి కుటుంబాల దీనగాథ ఇది. ఈ పెను విషాదంలో పిల్లలను కోల్పోయినవారు, తీవ్ర గాయాల బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల తల్లిదండ్రులు క్షణ క్షణం నరకయాతన పడుతున్నారు. వెంకటాయపల్లి గ్రామానికి చెందిన శివ్వంపేట మల్లాగౌడ్-లత దంపతుల కుమార్తె శృతి ప్రమాదంలో మృతిచెందగా.. మరో కుమార్తె రుచిత ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కుమారుడు వరుణ్ ఇంకా సృ్పహలోకి రాలేదు. కానీ శృతి మరణించి మూడు రోజులు కావడంతో నిర్వహించాల్సిన సంస్కారాల కోసం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలను వదిలి.. ఆ దంపతులు శనివారం తమ ఇంటికి చేరుకున్నారు. కార్యక్రమాన్ని ముగించిన తర్వాత తిరిగి వెంటనే ఆస్పత్రికి వెళ్లిపోయారు. ఇదే గ్రామంలో మన్నె స్వామి-లావణ్య దంపతుల కుమారుడు సద్భావన్(నర్సరీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ చిన్నారి ఆరోగ్యం ఎప్పుడు కుదుటపడుతుందోనంటూ వారు ఆందోళన చెందుతున్నారు. దేవతా సత్యనారాయణ-గాయత్రి దంపతుల కుమార్తె సాత్విక (ఫస్ట్ క్లాస్), తొంట స్వామి-నర్సమ్మల కుమారుడు ప్రశాంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక జిన్నారం మండలం కానుకుంట గ్రామానికి చెందిన తప్పెట లక్ష్మన్-వీరమ్మల కుమారుడు సాయిరామ్ (యూకేజీ) వెంకటాయపల్లిలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటుండగా ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. అయ్యాలం-నీలమ్మల కుమారుడు శివకుమార్, లంబ రమేష్-పార్వతిల కుమార్తె శ్రావణి, ఉప్పల దుర్గయ్య-కవితల కుమారుడు సందీప్‌ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘నా మనుమలను హాస్పటల్లో జూస్తుంటే జరమొచ్చింది.. బీపీ, షుగర్ పెరిగింది.. వారిని ఆ పరిస్థితిలో చూస్తుంటూ తట్టుకోలేక.. ఇంటికి వచ్చిన.. పిల్లలు బాగుండాలే.. ఇగ దేవుడే దిక్కు..’’..అంటూ తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అభినంద్-శరత్‌ల నానమ్మ నీలమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. శుభకార్యానికి పోయి బయటపడ్డం : జంగం ప్రవీణ్ (వెంకటాయపల్లి) ‘‘మా పిల్లలు మహాలక్ష్మీ (2వ తరగతి), కారుణ్య (నర్సరీ) కూడా కాకతీయ స్కూల్లోనే చదువుతున్నరు. మేం 21వ తేదీన మెదక్‌లో ఓ శుభకార్యానికి వెళ్లినం. 23న రావాల్సి ఉండె.. కానీ నా భార్యాపిల్లలు ఇంకోరోజు అక్కడే ఉంటామనడంతో ఒక్కడినే వచ్చిన. ఒకవేళ నాతోపాటే వచ్చి ఉంటే మా పిల్లలు కూడ స్కూల్ బస్సులో ప్రమాదానికి గురయ్యేవారు. జరిగింది తలుచుకుంటే భయం వేస్తోంది..’’ -
ఓయ్! nజాయ్..
వావ్... సంభ్రమాశ్చర్యం.. సర్‘ప్రైజ్’కోసం.. బహుమతి చేతికందితే ఆనందం. అది ఊహించని సమయంలో అందితే ఆశ్చర్యం. ఊహించని గిఫ్ట్ ఊహించని రీతిలో ఊడిపడితే.. ఇక ఆనందాశ్చర్యాలకు అంతేముంటుంది? అలాంటి ఆనందాశ్చర్యాలను మనకు అందించిన వ్యక్తి మీద కలిగే ఇష్టానికి హద్దేముంటుంది? నచ్చినవారికి ఇలాంటి సర్ప్రైజ్ అందించాలని, వారి నుంచి అంతటి ఇష్టాన్ని రిటర్న్ గిఫ్ట్‌గా అందుకోవాలని అందరికీ ఉంటుంది. కాని ఎలా? ఈ ప్రశ్నకు సమాధానంగా నగరంలో కొత్త వేదికలు ప్రారంభమయ్యాయి. సరికొత్త ట్రెండ్‌కు దారితీస్తున్నాయి. అందరికీ సర్‌ప్రైజ్‌ల మీద సర్ప్రైజ్లు ఇస్తున్నాయి. ప్రత్యూష మనం ఎందుకు బిజీగా ఉంటున్నాం. సంతోషంగా ఉండడానికే కదా. మనం సంపాదించిన మనీతో ఆనందాలను అందుకోవాలనే కదా. దీన్నుంచే ఓ ఐడియా పుట్టుకొచ్చింది. ఆశ్చర్యాలను అందించడం ద్వారా ముఖాల్లో నవ్వులు విరబూయించడం, సంతోషాన్ని కలిగించడం... ఈ రెండు లక్ష్యాలతో కొన్ని సంస్థలు మొదలయ్యాయి. ఎలా చేస్తారు? మీ కుటుంబ సభ్యుల్ని, సన్నిహితుల్ని.. ఆశ్చర్య చకితుల్ని చేయడం ద్వారా సంతోషాన్ని అందించాలనుకుంటే.. దానికి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం వంటి ఏదైనా సందర్భం కూడా తోడైతే... మన తరఫున ఆయా సంస్థలవారు రంగంలోకి దిగుతారు. మన ఆకాంక్షల్ని బట్టి... ప్రియమైన వ్యక్తి ఊహలకు ఏమాత్రం అందని రీతిలో సర్ప్రైజ్లు ఆర్గైనె జ్ చేస్తారు. దీనికి సంబంధించి ఆ వ్యక్తి గురించిన కొన్ని వివరాలు, ఇష్టాఇష్టాలు మాత్రం మనం వారికి చెప్పాల్సి ఉంటుంది. అభిరుచులే ‘కీ’లకం... మనం ఎవరినైతే సర్ప్రైజ్ చేయాలనుకున్నామో... వారి అభిరుచులే ఈ యావత్తు ప్రోగ్రాం డిజైనింగ్‌కి మూలంగా నిలుస్తాయి. ఉదాహరణకు ఓ పెళ్లయిన జంట ఫుడ్‌లవర్స్ అనుకోండి... వారికి రాజసం ఒలికించే వెయిటర్స్‌తో అంతర్జాతీయ రుచులన్నింటినీ పళ్లెంలో ఆతిథ్యం అందుతుంది. అయితే అది కూడా అనూహ్యమైన రీతిలో, అనుకోని ప్రదేశంలోనే సుమా. ఈ సర్ప్రైజ్ యాక్టివిటీలో వ్యక్తులకు అందించే గిఫ్ట్ విలువ కన్నా ఆశ్చర్యం కలిగించే స్థాయికే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆశ్చర్యం ద్వారా వచ్చే ఆనందం చిరకాలం నిలిచి ఉంటుందని, మధురానుభూతిగా మిగిలిపోతుందని ఆయా సంస్థల నిర్వాహకులకు తెలుసు. కాదేదీ... ఆశ్చర్యానికి అనర్హం కెల్విన్-హాబీస్ కామిక్స్ట్రిప్ కావచ్చు, సగం వాక్యం రాసి ఉన్న ఓ టిష్యూ కాగితపు ముక్క కావచ్చు. ఆశ్చర్యం పుట్టించడానికి అన్నీ కారకాలే. ఔత్సాహిక రచయితల కోసం అనూహ్యమైన బుక్ లాంచ్ ప్రోగ్రామ్‌లు, మ్యూజిక్ లవర్స్ కోసం ప్రత్యేకమైన రికార్డెడ్ రేడియో షోస్.. ఇలా కస్టమర్ ఆకాంక్షలకు నప్పే విధంగా క్రియేటివిటీని కదం తొక్కించడంలో, కంటెంట్‌ను డిజైన్ చేయడంలో టీమ్‌లు నిరంతరం మునిగి తేలుతుంటాయి. సంస్థల నిర్వాహకులు కూడా తమ హోదాలను.. ఛీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్, చీఫ్ ట్రబుల్ మేకర్‌గా విభజించుకున్నారు. ఫ్లయిట్ దిగగానే... వావ్ అనిపిస్తాం... చాలా కాలం తర్వాత తమకు ఆత్మీయుడైన వ్యక్తిని కలుస్తున్న సందర్భాన్ని సర్ప్రైజింగ్గా నిర్వహించి, ఆ ఆశ్చర్యానందాలను మరచిపోలేని అద్భుతమైన మధురజ్ఞాపకాలుగా నిలిచిపోయేలా చేయడమే మా సంస్థ ఉద్దేశం. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ మధ్యే మా సర్ప్రైజ్ స్టోర్ ప్రారంభించాం. - హర్ష, వరుణ్ - ఓయ్ హ్యాపీ నిర్వాహకులు -
నవాబ్ భాషా మూవీ స్టిల్స్ మరియు పోస్టర్స్
-
ఆధిక్యంలో వరుణ్
జింఖానా, న్యూస్‌లైన్: ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్స్ టోర్నీలో భాగంగా నిర్వహిస్తున్న ‘బి’ కేటగిరీ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు వరుణ్ సంయుక్త ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో వరుణ్ (3 పాయింట్లు) పశ్చిమ బెంగాల్‌కు చెందిన షౌన్ చౌదరి (2)పై విజయం సాధించాడు. విశ్వనాథ్ ప్రసాద్ (3) మన రాష్ట్రానికే చెందిన భరత్ కుమార్ రెడ్డి (2)పై గెలిచాడు. ఈ విజయాలతో వరుణ్, విశ్వనాథ్ ప్రసాద్ ఉమ్మడిగా ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు టాప్ సీడ్ లోకేష్ (తమిళనాడు) గోవాకు చెందిన అమేయతో డ్రా చేసుకున్నాడు. ప్రేమ్ రాజ్ (2) తమిళ నాడు ఆటగాడు రతన్వేల్ (3) చేతిలో, కళ్యాణ్ కుమార్ (2) ఢిల్లీకి చెందిన ఆన్ష్ గుప్తా (3) చేతిలో ఓటమి చవిచూశారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు రమణ బాబు (3)... లక్ష్మీ కృష్ణ భూషణ్ (2)పై, బైవాబ్ మిశ్రా (3)... హృతికేష్ (2)పై, శ్రీకాంత్ (3)... ఖాన్ (2)పై, నవీన్ ఎస్. హెగ్డే (3)... ప్రజ్ఞానంద్ (2)పై, శైలేష్ ద్రవిడ్ (3)... సర్బోజిత్ పాల్ (2)పై, రుతుజా బక్షీ (3)... భవిక్ భారంబే (2)పై, సమ్మద్ జయకుమార్ (3)... శ్రద్దాంజలి జేన(2)పై, భరత్ కళ్యాణ్ (3)... అమినిస్మాయిల్ ఖాద్రీ (2)పై, హేమంత్ రామ్ (3)... కుషాగ్ర మోహ న్ (2)పై, విజయ్ ఆనంద్ (3)... ఆదిత్య (2)పై నెగ్గారు. మాజీద్ (2.5)... జితేంద్ర (2.5)తో, కాంతిలాల్ దేవ్ (2.5)... రాఘవ్ శ్రీవాస్తవ్ (2.5)తో, తమల్ చక్రవర్తి (2.5)... అభిషేక్ (2.5)తో, విశ్వేశ్వర్ (2.5)... వినాయక్ కులకర్ణి (2.5)తో, శరణ్య (2.5)... రూప్ సౌరవ్ (2.5)తో డ్రా చేసుకున్నారు. -
యువతరం ప్రేమకథ
వరుణ్, దినేష్, ప్రశాంత్, షిప్రా గౌర్, హేమలత, కల్పన, కావ్య, పృధ్వీ ప్రధాన పాత్రధారులుగా ఓ చిత్రం రూపొందుతోంది. యన్నీ కె. దర్శకత్వంలో సంగీత్, హబీబ్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి వీఎన్ ఆదిత్య కెమెరా స్విచాన్ చేయగా, సూర్యకిరణ్ క్లాప్ ఇచ్చారు. ప్రేమతో పాటు అన్ని రకాల ఎలిమెంట్సూ ఉన్న కథాంశమిదని దర్శకుడు చెప్పారు. ఆర్ఎఫ్సీలో సెట్ వేస్తున్నామని, ఓ పదిరోజుల్లో షూటింగ్ మొదలుపెడతామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.కె.సేన, సంగీతం: జె.వర్ధన్, కళ: డేవిడ్.