నాకు ఆ అలవాటు లేదు | Narasimha Nandi Speech AT Degree College Movie Press Meet | Sakshi
Sakshi News home page

నాకు ఆ అలవాటు లేదు

Dec 16 2019 12:21 AM | Updated on Dec 16 2019 12:21 AM

Narasimha Nandi Speech AT Degree College Movie Press Meet - Sakshi

‘‘ట్రైలర్లో ఒక రకంగా, సినిమాలో మరో రకంగా చూపించే అలవాటు నాకు లేదు. ట్రైలర్లో ఉన్నది సినిమాలోనూ ఉంటుంది’’ అన్నారు దర్శకుడు నరసింహా నంది. వరుణ్, దివ్యారావు హీరోహీరోయిన్లుగా లక్ష్మీ నరసింహా సినిమా పతాకంపై నరసింహా నంది దర్వకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిగ్రీ కాలేజ్‌’. ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు ముగిశాయి. ఈ చిత్రాన్ని జనవరి 1న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నరసింçహా నంది మాట్లాడుతూ–‘‘ఇద్దరు డిగ్రీ విద్యార్థుల మధ్య చిగురించిన  వాస్తవ ప్రేమ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని  తీశాను.

ప్రేమలో ఉన్న ఓ అబ్బాయి, ఓ అమ్మాయి తరగతి గదిలో, బయట ఎలా ప్రవర్తించారన్న అంశాలను చూపించాను. ఇంతవరకు నేను తీసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమాలో కమర్షియల్‌ అంశాలను జోడించాను’’ అని అన్నారు. ‘‘ఇందులో కేవలం రొమాన్స్‌ మాత్రమే కాదు. అంతకుమించిన భావోద్వేగ సన్నివేశాలు ఉన్నాయి. అందుకే విడుదల చేయాలనుకుంటున్నాను’’ అన్నారు  డిస్ట్రిబ్యూటర్‌ బాలరాజు. వరుణ్, దివ్యారావు, టి.ప్రసన్న కుమార్,  రవి రెడ్డి, మదన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement