degree colleage
-
716 కళాశాలలకు... ఏదీ గుర్తింపు..?
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం దరఖాస్తుల పరిశీలన ప్రహసనంగా మారింది. 2019–20 విద్యా సంవత్సరానికి గాను పలు కళాశాలలు ఇప్పటికీ యూనివర్సిటీ/బోర్డు గుర్తింపు పొందిన పత్రాలను సంక్షేమ శాఖలకు సమర్పించలేదు. ఏటా పునరుద్ధరీకుంచుకున్న తర్వాత వాటిని సంక్షేమశాఖ కార్యాలయంలో, ఈ–పాస్ వెబ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. కానీ ప్రస్తుత విద్యా సంవత్సరానికి చెందిన 716 కాలేజీలు ఇప్పటికీ గుర్తింపు/రెన్యువల్ పత్రాలను సమర్పించకపోవడం గమనార్హం. 5,712 కళాశాలలకు లభించిన ధ్రువీకరణ.. రాష్ట్ర వ్యాప్తంగా 6,428 ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, వృత్తివిద్యా కాలేజీలున్నాయి. ఇందులో అత్యధికంగా 2,888 ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపు పొంది ఉన్నాయి. 2019–20 విద్యా సంవత్సరానికి గాను అవన్నీ గుర్తింపు పత్రాలు సమర్పించాయి. మిగతా డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కాలేజీల్లో చాలా వరకు గుర్తింపు పత్రాలను సమర్పించలేదు.కొన్ని ఈ–పాస్ వెబ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ పూర్తిస్థాయి డాక్యుమెంట్లు సమర్పించని కారణంగా సంక్షేమ శాఖాధికారులు వాటిని ధ్రువీకరించలేదు.రాష్ట్రంలో 6,428 కాలేజీల్లో ఇప్పటివరకు కేవలం 6,120 మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఇందులో 5,712 మాత్రమే ధ్రువీకరణ పొందాయి. ఆ కాలేజీ విద్యార్థులకే ఫీజులు.. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలుకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించేనాటికే గుర్తింపు పత్రాలు, రెన్యువల్ వివరాలను సంక్షేమ శాఖలకు సమర్పించాలి. అలాంటి వాటికే వెబ్సైట్లో పొందుపరుస్తారు. అప్పుడు ఆయా కళాశాలల విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునే వీలుంటుంది.కానీ గుర్తింపు పత్రాల సమర్పణ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పూర్తి కావడం లేదని, పలు యూనివర్సిటీలు/ బోర్డులు వీటిని జారీ చేసేందుకు తీవ్ర జాప్యం చేస్తున్నందున విద్యార్థుల దరఖాస్తుకు అనుమతి ఇవ్వాలని పలు కాలేజీల యాజమాన్యాలు కోరాయి.దీంతో స్పందించిన ప్రభుత్వం ఆమేరకు అవకాశం కల్పించింది. 2019–20 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 12.58లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది.ఈ–పాస్ వెబ్ పోర్టల్‌లో ధ్రువీకరణ పొందిన కాలేజీ విద్యార్థుల దరఖాస్తులు మాత్రమే పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. ఇంకా ధ్రువీకరణ పొందని వాటి యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నారు. వాటిని అందుకున్న కళాశాలలు స్పందించి పత్రాలు సమర్పించకుంటే ఆ కాలేజీ విద్యార్థుల దరఖాస్తుల పరిశీలనను నిలిపివేస్తారు. మొత్తంగా అన్ని పత్రాలు సమర్పించిన కళాశాలల విద్యార్థుల దరఖాస్తులు మాత్రమే పరిశీలించి ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
అభ్యంతరకర పోస్టర్లను తొలగిస్తున్నాం
‘‘డిగ్రీ కాలేజ్’ సినిమా పోస్టర్లలో కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయని విద్యార్థి సంఘాల నాయకులు, మహిళలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు స్టేషన్‌కి పిలిపించి అభ్యంతరకర పోస్టర్స్‌ను తొలగించమని చెప్పారు. నన్ను అరెస్ట్ చేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అన్నారు నరసింహ నంది. వరుణ్, దివ్యారావు జంటగా శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నరసింహ నంది స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘డిగ్రీ కాలేజ్’ చిత్రం నేడు విడుదలవుతోంది. విలేకరుల సమావేశంలో నరసింహ నంది, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు, సహ నిర్మాతలు ఆలేటి శ్రీనివాసరావు, కొండయ్య మాట్లాడుతూ– ‘‘పోస్టర్లను చూసి సినిమా ఆపేస్తామనడం సమంజసం కాదు. అభ్యంతరకరంగా ఉన్న రెండు పోస్టర్స్‌ను వెంటనే తొలగించే పని మొదలు పెట్టాం. ఈ సినిమా ఆగిపోతే మా జీవితాలు రోడ్డున పడతాయి’’ అన్నారు. -
నాకు ఆ అలవాటు లేదు
‘‘ట్రైలర్లో ఒక రకంగా, సినిమాలో మరో రకంగా చూపించే అలవాటు నాకు లేదు. ట్రైలర్లో ఉన్నది సినిమాలోనూ ఉంటుంది’’ అన్నారు దర్శకుడు నరసింహా నంది. వరుణ్, దివ్యారావు హీరోహీరోయిన్లుగా లక్ష్మీ నరసింహా సినిమా పతాకంపై నరసింహా నంది దర్వకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిగ్రీ కాలేజ్’. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. ఈ చిత్రాన్ని జనవరి 1న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నరసింçహా నంది మాట్లాడుతూ–‘‘ఇద్దరు డిగ్రీ విద్యార్థుల మధ్య చిగురించిన వాస్తవ ప్రేమ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశాను. ప్రేమలో ఉన్న ఓ అబ్బాయి, ఓ అమ్మాయి తరగతి గదిలో, బయట ఎలా ప్రవర్తించారన్న అంశాలను చూపించాను. ఇంతవరకు నేను తీసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమాలో కమర్షియల్ అంశాలను జోడించాను’’ అని అన్నారు. ‘‘ఇందులో కేవలం రొమాన్స్ మాత్రమే కాదు. అంతకుమించిన భావోద్వేగ సన్నివేశాలు ఉన్నాయి. అందుకే విడుదల చేయాలనుకుంటున్నాను’’ అన్నారు డిస్ట్రిబ్యూటర్ బాలరాజు. వరుణ్, దివ్యారావు, టి.ప్రసన్న కుమార్, రవి రెడ్డి, మదన్ పాల్గొన్నారు. -
కాంట్రవర్సీ కోసం మాట్లాడలేదు
‘‘అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100’’ చిత్రాల పుణ్యమా అని, లిప్‌లాక్ లేని తెలుగు సినిమా లేకుండా పోయింది. దర్శకులు, నిర్మాతలు, రచయితలు సామాజిక బాధ్యతతో సినిమాలు చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నాను’’ అని మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, నటి–దర్శకురాలు జీవితారాజశేఖర్ అన్నారు. వరుణ్, దివ్య జంటగా నరసింహ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డిగ్రీ కాలేజ్’. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘చాలామంది మధ్యలో మనం శృంగారం చేయం. అసభ్యంగా ప్రవర్తించం. సినిమాలో ఇలాంటివి వచ్చేసరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సోషల్ మీడియాలో, టీవీల్లో ఇలాంటివి ఉండటం లేదా? అని కొందరు వాదించవచ్చు. నిజమే.. ఉన్నాయి. కానీ వాటిని మనం ఒక రూమ్‌లో కూర్చొని ఒంటరిగా చూస్తాం. సినిమా అనేది వందల మందితో కలిసి చూసేది. మీ కార్యక్రమానికి (‘డిగ్రీ కాలేజ్’ టీమ్‌ను ఉద్దేశిస్తూ) వచ్చి నేను ఇలా మాట్లాడకూడదు. ఈ మాటలను కాంట్రవర్సీ కోసం కూడా చెప్పడం లేదు. ఈ ట్రైలర్‌ని చూసి నా మనసుకు అనిపించినది చెబుతున్నాను’’ అన్నారు. నరసింహనంది మాట్లాడుతూ ‘‘గతంలో సందేశాత్మక సినిమాలు చేశాను. అవార్డులు వచ్చాయి కానీ డబ్బులు రాలేదు. ‘హైస్కూల్’ చిత్రానికి వచ్చాయి. నాదైన నవ్య పంథాలో ఈ సినిమా తీశాను. ట్రైలర్ చూసి సినిమా మొత్తం వల్గర్‌గా ఉంటుందని అనుకుంటున్నారు. ఇందులో మంచి కంటెంట్ ఉంది. వాస్తవిక సంఘటనలకు సినిమాటిక్ అంశాలను పొందుపరిచి, ఈ సినిమా చేశాం. లిప్ లాక్‌లు, శృంగారభరిత సన్నివేశాలు కథ డిమాండ్ మేరకే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి కాంట్రవర్సీని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అన్నారు. సహ నిర్మాతలు ఆలేటి శ్రీనివాసరావు, బత్తుల కొండయ్య, రవిరెడ్డిలతో తదితరులు పాల్గొన్నారు. -
‘చూచిరాత స్కామ్’లో మరో అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో : ఉస్మానియా యూనివర్శిటీ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల్లో జరిగిన మాస్ కాపీయింగ్ కేసులో నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు మరో నిందితుడిని కటకటాల్లోకి పంపారు. ఈ స్కామ్‌లో పాత్రధారిగా ఉన్న రామాంతపూర్‌లోని ఎస్వీ డిగ్రీ కాలేజ్ కరస్పాండెంట్ రాధాకృష్ణరెడ్డిని అరెస్టు చేసినట్లు డీసీపీ అవినాష్ మహంతి బుధవారం తెలిపారు. ఈ కేసులో సీసీఎస్ పోలీసులు ఇప్పటికే ఆర్కే డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేసిన విషయం విదితమే. ఉస్మానియా యూనివర్శిటీకి (ఓయూ) సంబంధించిన డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు గత ఏడాది అక్టోబర్‌లో జరిగాయి. దీని కోసం కేటాయించిన పరీక్ష కేంద్రాల్లో ముషీరాబాద్‌లోని ఆర్కే డిగ్రీ కాలేజీ ఒకటి. సాధారణంగా పరీక్ష కేంద్రానికి యూనివర్శిటీ ప్రశ్నపత్రాలతో పాటు జవాబు పత్రాల సెట్లను అందిస్తుంది. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ సెంటర్లో పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య కంటే కొన్ని ఎక్కువగానే జవాబు పత్రాల సెట్లు ఇస్తుంది. దీన్నే ఆర్కే డిగ్రీ కాలేజ్ తమకు అనుకూలంగా మార్చుకుంది. సప్లమెంటరీ పరీక్ష రాసే 104 మంది విద్యార్థులతో కుమ్మక్కై వేరే కేంద్రానికి సంబంధించి హాల్‌టిక్కెట్ జారీ అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా తమ కేంద్రంలో పరీక్ష రాసే అవకాశం ఇచ్చింది. వీరికోసం యూనివర్శిటీ నుంచి అదనంగా వచ్చే జవాబు పత్రాల సెట్లను వాడుకుంది. ఇందుకుగాను ఒక్కో సబ్జెక్ట్‌కు దాదాపు రూ.5 వేల వరకు వసూలు చేసినట్లు పోలీసులు తేల్చారు. ఇలా మాస్ కాపీయింగ్ ద్వారా పరీక్ష రాసిన విద్యార్థుల్లో కొందరి పేర్లతో రెండేసి ఆన్సర్ షీట్లు సిద్ధమయ్యాయి. గతేడాది అక్టోబర్ 21న ఆర్కే డిగ్రీ కళాశాల కేంద్రంలో జరిగిన కంప్యూటర్ సైన్స్–3 పరీక్ష పేపర్లు దిద్దుతున్న యూనివర్శిటీ పరీక్షల విభాగం అధికారులు ఈ మాల్ ప్రాక్టీస్ స్కామ్‌ను పసిగట్టారు. ఆర్.హరికృష్ణ అనే విద్యార్థి పేరుతో రెండు ఆన్సర్ బుక్లెట్స్ వర్శిటీకి వచ్చాయి. ఇతడికి పరీక్ష కేంద్రంలో 7257771 నెంబర్‌తో కూడిన బుక్లెట్ ఇవ్వగా... దీంతో పాటు 7257384 నెంబర్‌తో కూడిన బుక్లెట్ సైతం అతడి నుంచి కాలేజీ ద్వారా వర్శిటీకి చేరింది. దీంతో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇతడి ఫలితాన్ని ఆపేశారు. ఈ విషయం తెలుసుకున్న హరికృష్ణ వర్శిటీ అధికారులను సంప్రదించగా... ఆర్కే కాలేజీ నుంచి అటెండెన్స్ షీట్ తీసుకురావాల్సిందిగా సూచించారు. హరికృష్ణ తీసుకువెళ్లిన షీట్లో ఉన్న వివరాల ప్రకారం 7257771 బుక్లెట్ అతడికి జారీ అయింది. దీనిపై చీఫ్ సూపరింటెండెంట్ ముద్ర ఉండగా... 7257384 నెంబర్‌తో కూడిన బుక్లెట్పై కాలేజీ ప్రిన్సిపాల్ ముద్ర ఉంది. దీంతో లోతుగా ఆరా తీసిన అధికారులు మాల్‌ప్రాక్టీస్ జరిగినట్లు గుర్తించారు. ఈ కేంద్రంలో పరీక్ష రాసిన మొత్తం 104 మంది విద్యార్థులు దీనికి పాల్పడినట్లు తేల్చారు. వీరికి వేర్వేరు పరీక్ష కేంద్రాలు కేటాయించినా... పరీక్ష రాసింది మాత్రం ఆర్కే కాలేజీలో అని తేల్చారు. వర్శిటీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కాలేజీ యాజమాన్యం, చీఫ్ సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్, ఇన్విజిలేటర్స్ తదితరులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా దర్యాప్తు బాధ్యతలను సీసీఎస్‌కు అప్పగించారు. ఈ కేసు దర్యాప్తు చేసిన ఎస్సై బి.జగదీశ్వర్‌రావు మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు గుర్తించిన సమాధాన పత్రాలతో పాటు అనేక ఆధారాలు సేకరించారు. ఇప్పటి వరకు లభించిన ఆధారాలను బట్టి కాలేజీ ప్రిన్సిపాల్ స్వర్ణలత పాత్ర రూఢీ కావడంతో గతంలో ఆమెను తాజాగా రాధాకృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. ఈ 104 మంది విద్యార్థులను కొందరు దళారులు ఆర్కే డిగ్రీ కాలేజీ నిర్వాహకుల వద్దకు తీసుకువచ్చినట్లు పోలీసులు తేల్చారు. నగదు చెల్లించి మాల్ ప్రాక్టీస్ ద్వారా పరీక్ష రాసిన నేపథ్యంలో వీరినీ నిందితుల జాబితాలో చేర్చారు. -
కాలేజీ టాయిలెట్లో సీసీటీవీ కెమెరాలు
అలీగఢ్: ఉత్తరప్రదేశ్‌లో విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడకుండా ఓ కళాశాల వింత చర్య తీసుకుంది. అలీగఢ్‌లోని ధర్మ్‌సమాజ్ డిగ్రీ కాలేజీ మూడ్రోజుల క్రితం అబ్బాయిల టాయిలెట్ గదిలో సీసీటీవీ కెమెరాలను అమర్చింది. చివరికి ఈ విషయం బయటకు పొక్కడంతో పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో కళాశాల ప్రిన్సిపాల్ హేమ్‌ప్రకాశ్ గుప్తా స్పందిస్తూ.. పరీక్షల సందర్భంగా పలువురు విద్యార్థులు జేబుల్లో, అండర్‌వేర్‌ల్లో స్లిప్పులు దాస్తున్నారని తెలిపారు. టాయిలెట్లోకి వచ్చి స్లిప్పుల ద్వారా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నారని వెల్లడించారు. టాయిలెట్ గదిలో సీసీటీవీల ఏర్పాటుతో ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు. కాగా, టాయిలెట్ గదిలో సీసీటీవీల ఏర్పాటును ఇంతటితో వదిలిపెట్టబోమనీ, కోర్టుకు ఈడుస్తామని పలు విద్యార్థి సంఘాల నేతలు సదరు కళాశాలను హెచ్చరించారు. -
కులాన్ని కాదు.. కులవృత్తులను ఉద్దరించాలని చెప్పా..
కోదాడ : నాడు విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగలు కావ్యంలో ఉన్న ఓ పద్యంలో ‘కులాన్ని కాదు.. కులవృత్తులను ఉద్దరించాలని’ ఉందని దానినే తాను తరచుగా విద్యార్థులతో చెప్పేవాడినని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువు ముదిగొండ వీరభద్రయ్య అన్నారు. కేసీఆర్ దానిని గుర్తు పెట్టుకున్నాడో ఏమోగాని రాష్ట్రంలో కులవృత్తులకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాడన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తన శిష్యుడని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం కోదాడలోని కేఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్‌డేలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ సిద్దిపేట డిగ్రీ కళాశాలలో తనకు శిష్యుడని తెలిపారు. నాడు బక్కపలచగా ఉండే కేసీఆర్ పెద్ద బొట్టుపెట్టుకొని కళాశాలకు వచ్చేవాడని, విద్యార్థి దశలోనే ఎంతో చురుకుగా ఉండేవాడని గుర్తు చేసుకున్నారు. తెలుగు భాషాలో ఆయనకు మంచి ప్రావీణ్యం ఉందని, ఎన్నో తెలుగు పద్యాలను అలవోకగా చెప్పేవాడని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రూపురేఖలే మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కొద్ది రోజుల్లో కేసీఆర్ తన దూరదృష్టితో కోనసీమగా మారుస్తాడనడంలో సందేహం లేదన్నారు. రైతును రాజును చేస్తానని కేసీఆర్ తనతో అన్నాడని అది తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పారు. రాజకీయ చతురత, విషయ పరిజ్ఞానంలో కేసీఆర్‌ను ఆయన ప్రత్యర్ధులు కూడ మెచ్చుకోకుండా ఉండలేరన్నారు. పసిగుడ్డుగా ఉన్న తెలంగాణకు ఆయన మార్గదర్శకత్వం ఎంతో అవసరమని, అందుకే తెలంగాణ ప్రజలు ఆయనకు పట్టంకట్టి మంచి పని చేశారని అన్నారు. -
విజయవాడలో మరో భూ బాగోతం
-
విజయవాడలో మరో భూ బాగోతం
సాక్షి, విజయవాడ: విజయవాడలో ఓ స్వాతంత్ర్య సమరయోధుడి భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి 5 ఎకరాల భూమిని కబ్జా చేసిన టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ భూ కబ్జా బాగోతం మరిచిపోకముందే.. మరో భూబాగోతం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్ఆర్ఆర్, సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థలం కబ్జాకు గురైంది. దీంతో భూకబ్జాకు నిరసనగా మంగళవారం కాలేజీ విద్యార్థులు నిరసనకు దిగారు. అక్రమణకు గురైన స్థలంలోని వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆక్రమణకు గురైన స్థలంలో ఉన్న బోర్డులు, జెండాలను విద్యార్థులు పీకేశారు. ప్రోక్లైన్లతో స్థలంలో ఉన్న ఆక్రమణలను తొలగించారు. బొండా ఉమ అండతోనే రూ. 300 కోట్ల విలువైన భూమిని ఆక్రమించుకున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తమ కాలేజీ స్ధలాన్ని అప్రగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, విద్యార్థుల ఆందోళనతో బీఆర్టీఎస్ రోడ్డులో భారీగా పోలీసులు మొహరించారు. -
700 కాలేజీల్లో 25 శాతంలోపే ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 25 శాతంలోపు ప్రవేశాలు జరిగిన కాలేజీల లెక్కలు తేలాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి డిగ్రీ ప్రవేశాలపై ప్రాథమిక గణాంకాలు సేకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల కాలేజీల్లో 25 శాతంలోపే ప్రవేశాలు జరిగినట్లు గుర్తించింది. ఇందులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు సైతం 100 వరకు ఉన్నాయి. కొన్ని బ్రాంచీల వారీగా పరిశీలిస్తే పలు కాలేజీల్లో ప్రవేశాలే జరగలేదు. నాణ్యతా ప్రమాణాలు, సౌకర్యాల కల్పన దృష్ట్యా వీటిలో ప్రవేశాలు తగ్గినట్లు ఉన్నత విద్యామండలి భావిస్తోంది. దీంతో ఈ కాలేజీలకు వచ్చే ఏడాది అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. కాలేజీలకు గుర్తింపు ఉండాలంటే తప్పకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలని ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 25 శాతం ప్రవేశాలు ఉండాలనే నిబంధనను సైతం పెట్టింది. తాజాగా నిర్దేశిత సంఖ్య కంటే తక్కువ ప్రవేశాలు నమోదు కావడంతో ఉన్నత విద్యామండలి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
డిగ్రీ కళాశాలల్లో బయోమెట్రిక్
నెల్లూరు(టౌన్): పేద విద్యార్థుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు పక్కదారి పడుతున్నాయన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్ విధానానికి శ్రీకారం చుట్టింది. కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండడం, ప్రైవేటు కళాశాలల యాజమాన్యం వాస్తవానికి మించి విద్యార్థులను ఎక్కువ సంఖ్యలో చూపించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పొందడం లాంటి వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం గతేడాది నుంచే ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అయితే ప్రైవేటు కళాశాలల యాజమాన్యం ఇచ్చే అమ్యామ్యాలతో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నత విద్యాశాఖ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్టోబర్ 1 నుంచి జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 96 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 1944 మంది విద్యార్థులు, ఎయిడెడ్ కళాశాలల్లో 2430 మంది, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 23400 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కళాశాలల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఒక్కో విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద సైన్స్, ఆర్ట్స్ విద్యార్థులకు రూ.10 వేలు చెల్లిస్తున్నారు. దీంతో పాటు మెస్ బిల్లుల కింద నెలకు రూ.550 వంతున ఏడాదికి రూ.5500 అందజేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. 75 శాతం హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్మెంట్ ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని పక్కదారి పట్టిస్తున్నాయన్న ఆరోపణలు ఉండడంతో 75 శాతం హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ ఛార్జీలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కళాశాలలో ప్రతి 100 మంది విద్యార్థులకు ఒక బయోమెట్రిక్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యాశాఖాధికారులు ఆదేశించారు. బయోమెట్రిక్ యంత్రాన్ని ఈ పాస్‌కు అనుసంధానం చేయనున్నారు. అయితే ప్రైవేటు కళాశాలల్లో బయోమెట్రిక్‌ను వర్తింప చేయకుండా ఉండేందుకు వీఎస్‌యూలో కీలకంగా పనిచేసే ఓ అధికారి గతంలోనే ఒక ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చార ని చెబుతున్నారు. ఒక్కో ప్రైవేటు కళాశాల యాజమాన్యం నుంచి రూ.10 వేలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే గతేడాదిలోనే బయోమెట్రì క్ విధానం అమలు చేయాల్సి ఉన్నా, వచ్చేనెల 1 నుంచైనా ప్రైవేటు కళాశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తారో లేదాన్నది వేచి చూడాల్సి ఉంది. -
కాలేజి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి
కామారెడ్డి : నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి మండల డిగ్రీ కాలేజి ఆస్తులను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ సమితి నాయకులు నిరాహార దీక్షకు దిగారు. ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో రైతులు విరాళాలు వేసుకుని 1964లో ఈ డిగ్రీ కాలేజ్ ని ఏర్పాటు చేశారు. కాలక్రమేణా ఉద్యమాల కారణంగా అప్పట్లో ఈ కాలేజి యాజమాన్య బాధ్యతలు ప్రభుత్వపరమైనా... ఆస్తులు మాత్రం ప్రైవేటు వ్యక్త చేతుల్లోనే ఉన్నాయి. దీనివల్ల కాలేజీకి రావాల్సిన యూజీసీ గ్రాంట్స్, నాక్ గుర్తింపు రాలేదు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇక్కడి విద్యార్థి నాయకులు ఈ విషయం గురించి సీఎం కేసీఆర్ తో చర్చించారు. అయినా ఫలితం లేకపోవడంతో జేఏసీ కన్వీనర్ జగన్నాథం, లక్ష్మారెడ్డి, బాలరాజు గౌడ్ తదిత రులు ఆమరణ దీక్షకు దిగారు.