అలీగఢ్: ఉత్తరప్రదేశ్‌లో విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడకుండా ఓ కళాశాల వింత చర్య తీసుకుంది. అలీగఢ్‌లోని ధర్మ్‌సమాజ్ డిగ్రీ కాలేజీ మూడ్రోజుల క్రితం అబ్బాయిల టాయిలెట్ గదిలో సీసీటీవీ కెమెరాలను అమర్చింది. చివరికి ఈ విషయం బయటకు పొక్కడంతో పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో కళాశాల ప్రిన్సిపాల్ హేమ్‌ప్రకాశ్ గుప్తా స్పందిస్తూ.. పరీక్షల సందర్భంగా పలువురు విద్యార్థులు జేబుల్లో, అండర్‌వేర్‌ల్లో స్లిప్పులు దాస్తున్నారని తెలిపారు. టాయిలెట్‌లోకి వచ్చి స్లిప్పుల ద్వారా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నారని వెల్లడించారు. టాయిలెట్ గదిలో సీసీటీవీల ఏర్పాటుతో ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు. కాగా, టాయిలెట్ గదిలో సీసీటీవీల ఏర్పాటును ఇంతటితో వదిలిపెట్టబోమనీ, కోర్టుకు ఈడుస్తామని పలు విద్యార్థి సంఘాల నేతలు సదరు కళాశాలను హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment