ఆగ్రా: ఏటీఎమ్‌లో డబ్బు డ్రా కాలేదనీ మిషన్‌ను కారులో యంత్రాన్ని ఎత్తుకెళ్లారు! ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో వెలుగుచూసిన ఈ షాకింగ్ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా చోరీకి గురైన ఏటీఎం ఉన్న గదిలో యంత్రం తప్ప ఎక్కడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సమీపంలో అమర్చిన కెమెరాల ఫుటేజీని పోలీసులు స్కాన్ చేస్తున్నారని, పోలీసులు వచ్చేలోపే ఏటీఎంను కారులో ఎక్కించుకుని దుండగులు పారిపోయారని తెలిపారు. ఏటీఎంలో 8 లక్షల 30 వేల రూపాయలు ఉన్నాయని ఎస్‌ఎస్పీ సుధీర్ కుమార్ సింగ్ మీడియాకు తెలిపారు. నిజానికి దుండగులు మొదట ఏటీఎంలో డబ్బు డ్రా చేయడానికి ప్రయత్నించారు. విఫలమవ్వడంతో యంత్రాన్ని కారులో తమతోపాటు తీసుకెళ్లారు. ఈ ఘటనపై తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దుండగుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నామని ఆయన అన్నారు.
చదవండి: Omicron variant of COVID-19: లాక్‌డౌన్‌పై ఆరోగ్య శాఖ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment