Viral Video: స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి | Agra School Principal Thrashes Teacher For Coming Late, Video Viral | Sakshi
Sakshi News home page

Viral Video: స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి

Published Sat, May 4 2024 4:28 PM | Last Updated on Sat, May 4 2024 5:05 PM

Agra School Principal Thrashes Teacher For Coming Late, Video Viral

విద్యాసంస్థల్లో టీచర్లు, లెక్చరర్లు, ప్రిన్సిపల్స్‌ సభ్యత మరచి ప్రవర్తిస్తున్నారు. విద్యార్ధులు, తోటి ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో హెడ్‌మిస్ట్రెస్‌ ఫేషియల్‌ చేయించుకుంటున్న వీడియో తీసినందుకు టీచర్‌పై దాడి చేసిన నిర్వాకం మరవక ముందే రాష్ట్రంలో ఆగ్రాలో మరో ఘటన చోటుచేసుకుంది.

ఆగ్రాలో పాఠశాలకు ఆలస్యంగా వచ్చారనే నెపంతో ఓ ప్రిన్సిపల్-టీచర్‌పై దాడికి పాల్పడింది. బూతులు తిడుతూ, దుస్తులు చెరిగేలా భౌతిక దాడికి దిగింది. సీగానా గ్రామంలోని ప్రీ-సెకండరీ స్కూల్ టీచర్ గుంజన్ చౌదరి పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని ప్రిన్సిపాల్‌ గొడవకు దిగింది. అంతేగాక టీచర్‌పై దాడి చేసింది. ఈ ఘర్షణలో ఇద్దరు వస్త్రాలు చిరిగిపోయాయి.

అంతటితో ఆగకుండా నోటికి కూడా పని చెప్పారు. బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారు.  అక్కడే ఉన్న తోటి టీచర్లు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ప్రిన్సిపల్ డ్రైవర్ విడదీసే ప్రయత్నం చేసినా.. చివరికి టీచర్‌తో అతడు కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడు.ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న కొందరు తమ కెమెరాల్లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా అదికాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement