Video: Delhi Tourist Chased And Beaten By Locals In Agra, Shocking CCTV Video Viral - Sakshi
Sakshi News home page

Attack On Delhi Tourist In Agra: దారుణం.. తాజ్‌మహల్‌ చూసేందుకు వచ్చిన టూరిస్ట్‌ను వెంబడించి.. ఇనుపరాడ్లతో దాడి

Published Tue, Jul 18 2023 4:25 PM | Last Updated on Tue, Jul 18 2023 5:06 PM

Video: Delhi Tourist Chased By Locals Beaten In Agra - Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ఘటన వెలు గుచూసింది. ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను చూసేందుకు వచ్చిన ఓ పర్యాటకుడిపై స్థానిక యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. పర్యాటకుడిని వెంబడించి మరీ కర్రలు, ఇనుపరాడ్లతో చితకబాదారు. ఇదంతా మంగళవారం ఉదయం జరగ్గా.. దాడికి సంబంధించిన దృశ్యాలు ఓ షాప్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

న్యూఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తాజ్‌మహల్‌ చూసేందుకు ఆదివారం ఆగ్రా వచ్చాడు. ఈ క్రమంలో తాజ్‌గంజ్‌ ప్రాంతంలోని బసాయ్‌ చౌకీ వద్ద కారులో వెళ్తుండగా పక్కన నడుచుకుంటూ వెళ్తున్న భక్తులను తన వాహనం తాకింది. పర్యాటకుడు కారు ఆపి వాళ్లకు క్షమాపణలు చెప్పాడు. అయినా వారు వినిపించుకోకుండా దుర్భాషలాడుతూ దాడికి దిగారు.

వారి నుంచి తప్పించుకునేందుకు భయంతో అతడు దగ్గర్లోని ఓ స్వీట్‌ షాప్‌లోకి పరుగెత్తాడు. అతన్ని వెంబడించిన దుండగులు షాప్‌లోకి చొరబడి కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి తెగబడ్డారు. తప్పు అయ్యింది, క్షమించాలని వేడుకున్నా వదల్లేదు. కొంత సమయం పాటు అతన్ని చితకబాది అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

దీనిపై పోలీసులు స్పందిస్తూ.. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. తమలో ఒకడిని కారుతో ఢీ కొట్టాడన్న కారణంతోనే దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు నిందితులపై కఠిన చర్యలు తీసకోవాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. తాజ్‌మహల్‌ గొప్ప పర్యటక ప్రాంతమని, దీనిని చూసేందుకు రోజు వేలల్లో టూరిస్టులు వస్తుంటారని, ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు.
చదవండి: సరిహద్దులు దాటిన ‘కృష్ణ’ ప్రేమ.. బంగ్లాదేశ్‌ నుంచి రహస్యంగా వచ్చి..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement