ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలి కుర్చీపై తీవ్ర దుమారం రేగింది. పాత హెడ్ మాస్టర్‌ను కుర్చీ నుంచి బలవంతంగా తొలగించి, కొత్త ప్రధానోపాధ్యాయురాలిని కూర్చోబెట్టారు మిగతా ఉపాధ్యాయురాలు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇందులో పాఠశాల సిబ్బంది బృందం ప్రిన్సిపాల్ కార్యాలయంలోకి ప్రవేశించి ఆమెను వెంటనే తన కుర్చీని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు ప్రిన్సిపాల్ పరుల్ సోలమన్ నిరాకరించడంతో బలవంతంగా ఆమెను కుర్చీ నుంచి బయటకు తీసేశారు. ప్రిన్సిపల్ ఫోన్ కూడా లాక్కున్నారు.
అనంతరం కొత్తగా నియమితులైన ప్రిన్సిపాల్‌ను ఆమె స్థానంలో కూర్చున్నారు, అక్కడ ఉన్న వారు చప్పట్లతో ఆమెకు స్వాగతం పలికారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని బిషప్ జాన్సన్ బాలికల పాఠశాలలో ఈ నాటకీయ దృశ్యాలు చోటుచేసుకున్నాయి.
మరోవైపు ప్రిన్సిపాల్ సీటును బలవంతంగా ఖాళీ చేయించడంపై పరుల్ సోలమన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పరుల్ పట్ల అనుచితంగా ప్రవర్తించలేదని ఆ స్కూల్ యాజమాన్యం పేర్కొంది.
అయితే గతంలో పాఠశాలలో జరిగిన యూపీపీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రిన్సిపల్ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఆమె స్థానంలో మరొకరిని కూర్చొబెట్టారు. పేపర్ లీక్ ముఠా సభ్యుడు కమలేష్ కుమార్ పాల్ అలియాస్ కేకేకు ప్రిన్సిపల్ పరుల్ సోలోమన్‌కు సంబంధం ఉన్నట్లు బయటపడింది. దాంతో ఆమెను తొలగించారు. అయితే ఆమె స్థానంలో కొత్త ప్రిన్సిపాల్ షిర్లీ మాస్సీని నియమించిన తర్వాత కూడా సోలమన్ ఆమె సీటును ఖాళీ చేయడానికి నిరాకరించడంతో ప్రిన్సిపాల్ కార్యాలయంలో ఈ గందరగోళం నెలకొంది.
Video: UP Principal Forcibly Removed From Office, Her Replacement Watches
Facts apart, y shld no action b taken agast d lawyer who with his band on acts extra judicially.Assuming he is for clg, yet,his role wud be limited to court @myogioffice https://t.co/CesaPaMbzl— Nawaz Haindaday مھمد نواز ہئنرارے (@nawazhaindaday) July 6, 2024
Comments
Please login to add a commentAdd a comment