
యూపీలోని ఆగ్రాలో గల రాధాస్వామి దయాల్‌బాగ్ శాఖ ఆమధ్య భూముల ఆక్రమణలకు పాల్పడిందనే ఆరోపణలు వినిపించాయి. కాగా రాధాస్వామి దయాల్‌బాగ్ శాఖలోని సత్సంగిలు తమదైన సత్సంగంలో ఉంటూ, లోకవ్యవహారాలకు దూరంగా ఉంటారు. ఈ వర్గానికి చెందిన గురువు కూడా ప్రచారానికి దూరంగా ఉంటారు. అతని గురించిన వివరాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుతం సత్సంగ్‌కు గురువుగా వ్యవహరిస్తున్న డాక్టర్ ప్రేమ్ శరణ్ సత్సంగి ఐఐటీ పాసౌట్. విదేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యనభ్యసించారు. పీహెచ్‌డీ పూర్తి చేశారు.
డాక్టర్ ప్రేమ్ శరణ్ సత్సంగి ఈ శాఖకు ఎనిమిదవ గురువు. ప్రేమ్ శరణ్ 2002 నుంచి గురువుగా వ్యవహరిస్తున్నారు. ఐఐటీ బనారస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందిన తర్వాత ఆయన కొన్ని సంవత్సరాల పాటు అమెరికా, యూరప్‌లలోని ప్రముఖ విద్యా సంస్థలలో పనిచేశారు.
డాక్టర్ ప్రేమ్ శరణ్ నిరంతరం తెల్లని దుస్తులలో కనిపిస్తారు. సరళత, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు. దానినే ఇతరులకూ బోధిస్తారు. ప్రతిరోజూ దయాల్‌బాగ్ అనుచరులను కలుసుకుంటుంటారు. దేశం నలుమూలల నుండి వచ్చిన సత్సంగిలు దయాల్‌బాగ్‌లో ఉంటారు. ఇక్కడ ఎవరికీ కులం ప్రస్తావన ఉండదు. సత్సంగి అనేది ఇంటిపేరుగా ఉంటుంది. ఇక్కడ నివసిస్తున్న చాలా మంది సత్సంగిలు ఉన్నత విద్యావంతులు. వీరు అర్హతలకు తగిన విధంగా పలు చోట్ల పనిచేస్తుంటారు.
ఇది కూడా చదవండి: ఐఎఎఫ్‌హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్