satsang
-
పుట్టినవాడు గిట్టక తప్పదు
లక్నో: హత్రాస్ తొక్కిసలాట తనను తీవ్రంగా కలచివేసిందని, అయితే విధిరాతను ఎవరూ తప్పించలేరని భోలే బాబా అన్నారు. అందరూ ఏదో ఒకరోజు మరణించక తప్పదని వేదాంతం వల్లెవేశారు. భోలే బాబా సత్సంగ్‌లో తొక్కిసలాటలో ఇటీవల 121 మంది మరణించడం తెలిసిందే. బుధవారం ఆయన పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ‘పుట్టినవాడు ఏదో ఒకరోజు గిట్టక తప్పదు. కాస్తా ముందూ వెనకా అంతే’ అన్నారు. తొక్కిసలాట వెనుక కుట్ర ఉందని పునరుద్ఘాటించారు. ‘జూలై 2 దుర్ఘటన తర్వాత నేను తీవ్ర నిరాశకు లోనయ్యా, కలత చెందా. కానీ జరిగేదాన్ని ఎవరూ తప్పించలేరు. విషపూరిత రసాయనాలను స్ప్రే చేశారని నా న్యాయవాది, ప్రత్యక్షసాక్షులు చెప్పింది ముమ్మాటికీ నిజం. దీనివెనుక కచి్చతంగా కుట్ర ఉంది’ అని బాబా పేర్కొన్నారు. -
Hathras Satsang Stampede: అనుమతి 80 వేల మందికి.. వచ్చింది 2.5 లక్షలు
హత్రాస్/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా ఫూల్రాయ్ గ్రామంలో తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య బుధవారం 121కి చేరుకుంది. సత్సంగ్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్య సేవాదార్ దేవప్రకాశ్ మధుకర్‌తోపాటు ఇతరుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. భోలే బాబా పేరును ఇంకా చేర్చలేదు. 80 వేల మందికే అనుమతి ఉంటే 2.5 లక్షల మంది వచ్చారని ఎఫ్ఐఆర్లో పోలీసులు స్పష్టం చేశారు. సాక్ష్యాధారాలు దాచిపెట్టేందుకు నిర్వాహకులు ప్రయతి్నంచారని ఆరోపించారు. అనుమతి తీసుకొనే సమయంలో తమకు సరైన సమాచారం ఇవ్వలేదని చెప్పారు. తొక్కిసలాటలో పోలీసుల తప్పిదమీమీ లేదని స్పష్టం చేశారు. ఫూల్రాయ్లో తొక్కిసలాటకు కారణమైన బాబా నారాయణ్ హరి అలియాస్ సకర్ విశ్వ హరి భోలే బాబా ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 121 మంది మృతుల్లో 117 మందిని గుర్తించారు. గాయపడ్డ 28 మందికి చికిత్స కొనసాగుతోంది. సత్సంగ్ టెంట్ వద్ద గుట్టలుగా పేరుకుపోయిన చెప్పులు దుర్ఘటనకు మౌనసాక్షిగా నిలిచాయి. జ్యుడీషియల్ విచారణ: యోగితొక్కిసలాటపై హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వలో జ్యుడీషియల్ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. దుర్ఘటన వెనుక కుట్రకోణాన్ని కొట్టిపారేయలేమని చెప్పారు. చికిత్స పొందుతున్న వారిని ఆయన బుధవారం పరామర్శించారు. ఘటనా స్థలాన్నీ్న పరిశీలించారు.బాబా మంచోడు: గ్రామస్తులుభోలే బాబా మంచోడని యూపీలో కాస్గంజ్ జిల్లాలోని ఆయన స్వగ్రామం బహదూర్‌నగర్ వాసులు చెబుతున్నారు. బాబా తమను ఏనాడూ చందాలు గానీ, కానుకలు గానీ అడగలేదని గ్రామస్థులు చెప్పారు. బహదూర్‌నగర్ సమీపంలో భోలేబాబాకు ఒక ఆశ్రమం ఉంది. బాబా దంపతులకు సంతానం కలగలేదు. ఒక బాలికను దత్తత తీసుకున్నారు. 16 ఏళ్ల క్రితం ఆ బాలిక చనిపోయింది. ఆమె ప్రాణాలతో లేచివస్తుందన్న నమ్మకంతో మృతదేహాన్ని రెండు రోజులపాటు తన ఇంట్లోనే ఉంచారు. పోలీసులు, అధికారులు జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు అంత్య క్రియలు నిర్వహించారు. బాబా అనుచరుల వల్లే తొక్కిసలాట! తొక్కిసలాటపై హత్రాస్ సబ్‌డివిజనల్ మేజి్రస్టేట్(ఎస్డీఎం) బుధవారం జిల్లా మేజి్రస్టేట్‌కు ప్రాథమిక నివేదిక సమర్పించారు. సత్సంగ్ ముగిసిన తర్వాత తన వాహనం వద్దకు తిరిగి వెళ్తున్న భోలే బాబాను దగ్గరగా చూసేందుకు, చేత్తో తాకేందుకు భక్తులు అరాటపడ్డారని, వారిని బాబా అనుచరులు దూరంగా తోసివేయడానికి ప్రయతి్నంచడంతో తొక్కిసలాట జరిగిందని నివేదికలో వెల్లడించారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో నేలంతా బురదగా ఉండడంతో జనం జారిపడ్డారని, ఒకరిపై ఒకరు పడిపోయారని పేర్కొన్నారు. కింద చిక్కుకున్నవారు ఉపిరాడక మృతిచెందారని నివేదికలో ప్రస్తావించారు. సత్సంగ్‌కు 2 లక్షల మందికిపైగా జనం హాజరయ్యారని వివరించారు. విద్రోహ శక్తులే కారణం భోలే బాబా లక్నో: సత్సంగ్ వేదిక నుంచి తాను వెళ్లిపోయిన చాలాసేపటికి తొక్కిసలాట జరిగిందంటూ భోలే బాబా బుధవారం ప్రకటన విడుదల చేశారు. తొక్కిసలాటకు సంఘ విద్రోహ శక్తులే కారణమని ఆరోపించారు. ఆ సమయంలో తానక్కడ లేనన్నారు. భక్తుల మృతిపట్ల సంతాపం ప్రకటించారు. -
Hathras Stampede: అఖిలేష్ కూడా బాబా భక్తుడే.. ఫొటో వైరల్
యూపీలోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాట అందరినీ కలచివేసింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 121 దాటింది. నారాయణ్ సాకార్ అలియాస్ భోలే బాబా సత్సంగంలో ఈ ఘటన చోటుచేసుకుంది.యూపీలో ఈ బాబాకు లెక్కకు మించిన భక్తులు, అనుచరులు ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ గతంలో భోలే బాబా సత్సంగానికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.నాడు భోలే బాబా సత్సంగానికి హాజరైన అఖిలేష్ యాదవ్ తన ప్రసంగంలో బాబాను పొగడ్తలతో ముంచెత్తారు. దీనికి సంబంధించిన ఫోటోలను అఖిలేష్ అప్పట్లో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఫోటోలో అఖిలేష్ వీఐపీ సీట్లలో కూర్చుని కనిపిస్తున్నారు. మరో ఫోటోలో అఖిలేష్ యాదవ్ బాబా భక్తులను ఉద్దేశించి ప్రసంగించడాన్ని చూడవచ్చు. नारायण साकार हरि की सम्पूर्ण ब्रह्मांड में सदा - सदा के लिए जय जयकार हो pic.twitter.com/lp4wTmaHal— Akhilesh Yadav (@yadavakhilesh) January 3, 2023 -
ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
ఆగ్రా అనగానే అందరికీ ముందుగా తెల్లని పాలరాతి కట్టడం తాజ్ మహల్ గుర్తుకు వస్తుంది. అయితే ఇదే ప్రాంతంలో తాజ్‌కు పోటీనిస్తూ, దానినే పోలిన మరో పాలరాతి భవనం ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇది ఆధ్యాత్మిక పర్యాటకులకు ఆలవాలంగా ఉంది.తాజ్ మహల్‌కు 12 కి.మీ. దూరంలోని స్వామి బాగ్ వద్ద రాధాస్వామి సత్సంగ్ శాఖ వ్యవస్థాపకుని సమాధి స్థలంలో నిర్మించిన అద్భుత భవనం మరో తాజ్‌గా పేరొందుతోంది. స్వచ్ఛమైన తెల్లని పాలరాయితో నిర్మితమైన ఈ భవనం పర్యాటకులను అమితంగా అలరిస్తోంది. దీనిని చూసిన పర్యాటకులు ఇది తాజ్‌మహల్‌కు పోటీ అని అభివర్ణిస్తున్నారు. మొఘలుల స్మారక కట్టడాలకు ప్రసిద్ధి చెందిన ఈ నగరంలో ఈ ‘తాజ్’ మరో ఆకర్షణగా నిలిచింది.రాజస్థాన్‌లోని మక్రానా నుండి తెచ్చిన తెల్లటి పాలరాయితో రూపొందిన ఈ 193 అడుగుల ఎత్తయిన ఈ నిర్మాణం భారతదేశ ఖ్యాతిని మరింతగా పెంచుతుందనడంలో సందేహం లేదు. రాధాస్వామి శాఖ వ్యవస్థాపకులు పరమ పురుష్ పూరన్ ధని స్వామీజీ సమాధి స్థలంలో ఈ భవనం నిర్మితమయ్యింది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ సమాధి స్థలిని సందర్శించేందుకు వస్తుంటారు. ఇక్కడి అద్భుత కళాకృతులను చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇక్కడ ఫోటోగ్రఫీని అనుమతించరు.రాధాస్వామి అనుచరుల కాలనీ మధ్య ఈ భవనం ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, కర్ణాటక తదితర రాష్ట్రాలతో పాటు విదేశాలలో లక్షలాది మంది రాధాస్వామి అనుచరులు ఉన్నారు. 1904లో అలహాబాద్‌కు చెందిన ఒక ఆర్కిటెక్ట్ చేతుల మీదుగా ఈ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. భవనం కొంతమేరకు నిర్మాణం పూర్తయ్యాక ఆగిపోయింది. అయితే 1922లో తిరిగి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ జరిగే పనులన్నీ హస్త కళాకారుల నైపుణ్యంతో కూడినవే కావడం విశేషం. పైగా వీరు మూడు తరాలుగా ఈ పనుల్లో నిమగ్నమవుతున్నారు. బంగారు పూతతో ఈ భవన శిఖరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ శిఖరం తాజ్‌మహల్ కన్నా పొడవైనది కావడం విశేషం. -
‘రాధాస్వామి’ గురువు ఎవరు? సత్సంగిలు ఏమి చేస్తుంటారు?
యూపీలోని ఆగ్రాలో గల రాధాస్వామి దయాల్బాగ్ శాఖ ఆమధ్య భూముల ఆక్రమణలకు పాల్పడిందనే ఆరోపణలు వినిపించాయి. కాగా రాధాస్వామి దయాల్బాగ్ శాఖలోని సత్సంగిలు తమదైన సత్సంగంలో ఉంటూ, లోకవ్యవహారాలకు దూరంగా ఉంటారు. ఈ వర్గానికి చెందిన గురువు కూడా ప్రచారానికి దూరంగా ఉంటారు. అతని గురించిన వివరాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుతం సత్సంగ్‌కు గురువుగా వ్యవహరిస్తున్న డాక్టర్ ప్రేమ్ శరణ్ సత్సంగి ఐఐటీ పాసౌట్. విదేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యనభ్యసించారు. పీహెచ్డీ పూర్తి చేశారు. డాక్టర్ ప్రేమ్ శరణ్ సత్సంగి ఈ శాఖకు ఎనిమిదవ గురువు. ప్రేమ్ శరణ్ 2002 నుంచి గురువుగా వ్యవహరిస్తున్నారు. ఐఐటీ బనారస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందిన తర్వాత ఆయన కొన్ని సంవత్సరాల పాటు అమెరికా, యూరప్‌లలోని ప్రముఖ విద్యా సంస్థలలో పనిచేశారు. డాక్టర్ ప్రేమ్ శరణ్ నిరంతరం తెల్లని దుస్తులలో కనిపిస్తారు. సరళత, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు. దానినే ఇతరులకూ బోధిస్తారు. ప్రతిరోజూ దయాల్బాగ్ అనుచరులను కలుసుకుంటుంటారు. దేశం నలుమూలల నుండి వచ్చిన సత్సంగిలు దయాల్బాగ్లో ఉంటారు. ఇక్కడ ఎవరికీ కులం ప్రస్తావన ఉండదు. సత్సంగి అనేది ఇంటిపేరుగా ఉంటుంది. ఇక్కడ నివసిస్తున్న చాలా మంది సత్సంగిలు ఉన్నత విద్యావంతులు. వీరు అర్హతలకు తగిన విధంగా పలు చోట్ల పనిచేస్తుంటారు. ఇది కూడా చదవండి: ఐఎఎఫ్‌హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ -
సత్సాంగత్యం
ఏమీ చదువుకోక పోయినా, విద్యాగంధం ఏ మాత్రం లేక పోయినా కొంత మంది మాటలు పండితులకే ఆశ్చర్యం కలిగిస్తాయి. వారు ఉంటున్న, లేదా పని చేస్తున్న ప్రదేశంలో ఉన్న వాతావరణం ప్రభావం అది. అందరు వైద్యులే ఉన్న కుటుంబంలో ఉన్న పిల్లలు అప్రయత్నంగా వైద్య పరిభాషని ఉపయోగించటం, సంగీత విద్వాంసుల కుటుంబంలో వారి పిల్లలు రాగాలని గుర్తు పట్టటం వంటివి మనం చూస్తూనే ఉంటాం కదా! అదంతా సాంగత్య ప్రభావం. ఒక వ్యక్తి నిత్యం ఎవరితో ఎక్కువగా కలిసి ఉంటే వారి ప్రభావం వల్ల కొన్ని లక్షణాలు సంక్రమిస్తాయి. మంచివారితో కలిసి ఉంటే సహజంగా దురాలోచన ఉన్న వ్యక్తి అయినా కొంత వరకు చెడు ప్రవర్తనకు దూరంగా ఉండటం జరుగుతుంది. దుర్మార్గుల సాహచర్యంలో ఉంటే చెడ్డపనులు చేయక పోయినా ఆమోదించటం, అనుమోదించటం జరుగుతుంది. కనుకనే ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నాము... అన్న దానిని గమనించుకుంటూ ఉండాలి. కొన్ని ప్రభావాలు తాత్కాలికం. మందారపువ్వు పక్కన ఉన్న గాజుపట్టకం లాగా. పువ్వుని అక్కడి నుండి తీసేయగానే అప్పటి వరకు ఎర్రగా కనపడిన గాజుపట్టకం తన సహజ వర్ణానికి వచ్చేస్తుంది. కొన్నిటిని తప్పించుకోవటం కష్టం. మరికొన్నిటి ప్రభావం శాశ్వతం. స్వభావంలో జీర్ణించుకుపోతాయి. శక్తివంతమైన చెడు ప్రభావాల నుండి తప్పించుకోవటానికి మార్గం దూరంగ ఉండటమే. ‘‘దుష్టుడికి దూరంగా ఉండ’’ మని పెద్దలు చెప్పిన మాట ఇందుకోసమే. మరి కొన్నిటి ప్రభావం ఆ పట్టకం పైన రంగులని పూసినట్టు. గట్టిగా తుడిచినా, నీళ్ళతో కడిగినా సహజ స్థితికి వస్తుంది. అదే, పట్టకం తయారు అయే సమయంలో ద్రవస్థితిలో ఉండగానే ఏదైనా రంగు కలిపితే అది శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకే మంచివారి సాంగత్యంలో ఎంత వీలైతే అంత ఎక్కువ సమయం గడిపే ప్రయత్నం చేయాలి. స్వభావసిద్ధంగా దుర్బుద్ధి అయిన ధృతరాష్ట్రుడు ఉత్తమ గతులు పొందటానికి కారణం ఎంతో సమయం విదురుడి సమక్షంలో గడపటమే. మనసు బాగుండనప్పుడు విదురుడిని పిలిపించుకొని అతడి సమక్షంలో కాలం గడిపే వాడు. శాశ్వతంగా కాక పోయినా విదురుడు మాట్లాడినంత సమయం ధృతరాష్ట్రుడు సదాలోచనాలతోనే ఉన్నాడు. కనీసం దురాలోచనలు చేయకుండా ఉన్నాడు కదా! పూలు మాల కట్టిన దారానికి ఆ పూల పరిమళం అంటుకు పోతుంది. ఒకరి ప్రభావం మరొకరి మీద ఉండటం ఎట్లా కుదురుతుంది? అనే దానికి సాన్నిధ్యం లో ఉండటమే కారణం అన్నది సమాధానం. ఇనుము అయస్కాంత సన్నిధిలో కొంతకాలం ఉండగా ఉండగా దాని లక్షణాలు ఇనుముకి రావటం చూస్తున్నాముగా! ఆయుధాన్ని దగ్గర ఉంచుకున్న మునిలో హింసాప్రవృత్తి క్రమంగా పెంపొందిన ఇతివృత్తాన్ని సీత రాముడికి చెప్పింది. అదే విధంగా బోయల మధ్య పెరిగిన ప్రచేతసుడనే ముని కుమారుడు బోయవాడుగా మారటం మనకి తెలుసు. ఇది పైకి కనిపించే అర్థం. అసలు అర్థం మరొకటి ఉన్నదని పెద్దలు చెపుతూ ఉంటారు. ‘సత్’ అంటే ఉన్నది, సత్యము అని కూడా అర్థాలున్నాయి. ‘సత్’ అంటే భగవత్తత్త్వం. ఆ సత్ (వేదాంతులు సత్తు అని అంటూ ఉంటారు) తో సాహచర్యం చేస్తూ ఉండటం. అంటే నిరంతరం దైవచింతనలో ఉండటం. అట్లా కుదురుతుందా? అంటే అందరినీ దైవస్వరూపులుగా భావిస్తే అదెంత పని? ‘సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల తత్త్వం, నిశ్చల తత్త్వే జీవన్ముక్తిః’ అన్నారు ఆది శంకరులు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చాలా మంది పాల్గొంటారు. వీరిలో ఒకరికైనా సద్బుద్ధి కలిగిందని చెప్పగలరా? అంటూ విమర్శిస్తూ ఉంటారు కొందరు. వారికి సద్బుద్ధి కలిగిందో లేదో మనకి అనవసరం. కాని, ఆ కార్యక్రమంలో ఉన్నంత కాలం దురాలోచనలు లేక ఉంటారు. అది గొప్ప ప్రయోజనమే కదా! తరువాత అది నెమ్మది గా మిగిలిన సమయాలకి కూడా విస్తరించే అవకాశం ఉంది. పూలు మాల కట్టిన దారం పువ్వుగా మారక పోవచ్చు కాని పూలవాసనని మాత్రం సంతరించుకుంటుంది. – డా. ఎన్.అనంతలక్ష్మి -
శక్తి.. యుక్తి.. భక్తిల మేలు కలయికే హనుమంతుడు: స్వామి సూర్యపాద
హైదరాబాద్: ధ్యానం, జ్ఞానం ద్వారా మనిషి జీవితంలో ఒత్తిడిని తొలగించి ప్రపంచ శాంతిని తేవటమే గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ లక్ష్యమని స్వామి సూర్యపాద పేర్కొన్నారు. 10వ తేదీ శనివారం సాయంత్రం కర్మన్ ఘాట్‌లోని ధ్యానాంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా సత్సంగానికి వందలాది భక్తులు హాజరయ్యారు. సాయంత్రం 6.30 గంటలకు ఓంకారం, గణేశస్తుతితో కార్యక్రమం ప్రారంభమైంది. శక్తి, యుక్తి, భక్తిల కలయికగా హనుమంతుని స్తుతించిన స్వామీజీ, ప్రశాంతత, ధైర్యం, విశ్వాసం సమపాళ్లలో కలిగి ఉండాలనే విషయాన్ని ధ్యానాంజనేయస్వామి నుండి మనం నేర్చుకోవాలని సూచించారు. అనంతరం శ్రీరామ, కృష్ణ, సరస్వతీ దేవతలను, సద్గురువును స్తుతిస్తూ సాగిన స్వామీజీ సుమథుర గానంతో భక్తులందరూ గొంతు కలిపారు. ప్రతీ భజన అనంతరం కొద్ది సేపు భక్తులందరితో చేయించిన ధ్యానం వారికి అలౌకికానుభూతిని కలిగించింది. స్వామి సూర్యపాద గారు పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్ గురుదేవుల స్ఫూర్తితో గత మూడు దశాబ్దాలుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగ, జ్ఞాన, ధ్యాన కార్యక్రమాలను ప్రజలకు నేర్పుతున్నారు. భక్తిపూర్వకమైన హృదయంతో వారు సత్సంగాలలో పాడే భజనలు, వాటికి తోడుగా చేసే ఉపదేశ వాక్యాలు బహుళ జనాదరణ పొందటమే కాక, ప్రజల్లో చక్కని పరివర్తనను కలిగించేందుకు, వారిని మంచి మార్గంలో నడిపించేందుకు దోహదపడుతున్నాయి. పూర్వం లక్ష్మీదేవి పల్లెగా పేరొందిన కర్మన్ ఘాట్‌లోని ఆంజనేయస్వామి దేవాలయానికి ఘనమైన చరిత్ర ఉంది. అప్పటి గోల్కొండ కోటను జయించి చుట్టుపక్కల హిందూ దేవాలయాలను నాశనం చేస్తూ వస్తున్న అల్లాఉద్దీన్ ఖిల్జీ ఈ పల్లెకు వచ్చి, అక్కడి ధ్యానాంజనేయస్వామి మూర్తిని చూసి నిరుత్తరుడై నిలిచిపోగా, ఈ మూర్తిని దర్శించాలంటే నీ మనసు స్థిరంగా ఉండాలని చెబుతూ ఆలయ పూజారి 'కరో మన్ ఘట్' అని అన్న మాటతో, ఆ ఆలయానికి హాని చేయకుండా ఖిల్జీ మరలిపోయాడని, ఆనాటి నుంచి ఆ ప్రాంతం కరో మన్ ఘట్ లేదా కర్మన్ ఘాట్‌గా పేరు తెచ్చుకుందని చెబుతారు. ఇంతటి చారిత్రక ప్రాధాన్యం కలిగిన ధ్యానాంజనేయస్వామి ప్రాంగణంలో జరిగిన ఈ మహా సత్సంగం భక్తుల హృదయాల్లో మధురానుభూతులను మిగిల్చి, ఈ ప్రాంతమంతటికీ సకల శుభాలను కలిగించినదనడంలో సందేహం లేదు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ అపెక్స్ సభ్యులు రామ్‌కుమార్ రాఠీ, కృష్ణమూర్తి, కో-ఆర్డినేటర్లు శ్రీనివాస్, రోహన్, అనూప్ తదితరులు పాల్గొన్నారు. -
మంచి మాట: ఆత్మ నిగ్రహం అసలైన బలం
మనస్సు చంచలమైనది. అది నిరంతరం ఏదో ఒక దానిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి మనస్సును స్వేచ్ఛగా వదిలేస్తే ఇంద్రియాలకు అధీనమైపోతుంది. కామక్రోధాదులను బలపరుస్తుంది. అహంకార మమకారాలను వృద్ధి చేస్తుంది. ఈ క్రమంలో ఇంద్రియాలకు లాలసుడైన మనిషి విచక్షణను కోల్పోయి క్షణిక సుఖాలకు దగ్గర అవుతాడు. దీంతో అతని అభివృద్ధి నిలిచిపోయి అథః పాతాళంలోకి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మనస్సును ఎప్పటికప్పుడు విమర్శ చేసుకొంటూ ఇంద్రియ వశం కాకుండా మంచి పనులు మాత్రమే చేయాలనే నిబద్ధతతో సత్సాంగత్యం తో మనసును అదుపులో పెట్టుకోవాలి. అలా మనస్సును అధీనంలో ఉంచుకోవడమే మనో నిగ్రహం. మనోస్థైర్యం దానికి ఆలంబన. 3చంచలమైన మనస్సును నిశ్చలంగా చేయడం సాధారణమైన విషయం కాదు. సామాన్యులకే కాదు, అత్యంత శూరుడైన అర్జునికి కూడా మనస్సును నిగ్రహించుకోవడం సాధ్యం కాలేదు. యుద్ధంలో ప్రతిపక్షం మీద దృష్టి సారించి తన తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, గురుపుత్రుడు అశ్వత్థామ, దాయాదులైన కౌరవ సోదరులను చూసి విషాదంలో పడిపోయాడు. వారంతా తన స్వజనం కావడంతో యుద్ధం చేయడానికి అతనికి మనస్కరించలేదు. దాంతో అతని మనస్సు నిగ్రహాన్ని కోల్పోయింది. ధనుర్బాణాలు పక్కన పడేసి, నైరాశ్యంలో కూరుకుపోయాడు. ఇది గమనించిన శ్రీ కృష్ణుడు అర్జునుణ్ణి యుద్ధానికి సన్నద్ధం చేయడానికి ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 అధ్యాయాలుగా ఉండే భగవద్గీతను బోధించాడు. భౌతికమైనవి, తాత్వికమైనవి అనేకానేక విషయాలు తాను గురువుగా మారి అర్జునునికి బోధించాడు. దాంతో అర్జునుడు శత్రువులను సంహరించడానికి సిద్ధపడ్డాడు. అర్జునుడు మనోనిగ్రహాన్ని తిరిగి పొందడం వల్లనే తిరిగి తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. దీనినే మనం నిత్య జీవిత పోరాటంలో పాఠంగా మలచుకోవాలి. ఆ పాఠం మనల్ని సత్య సంధులుగా, న్యాయపరులుగా, నీతివేత్తలుగా తీర్చిదిద్దుతుంది. అందుకే భగవద్గీతను కంఠోపాఠంగా కాకుండా జీవన వెలుగు దివిటీగా చేసుకోమంటారు పెద్దలు. ప్రవరాఖ్యుడికున్నంత మనోనిగ్రహం అందరికీ ఉండాలన్నది శాస్త్ర వచనం. ప్రవరాఖ్యుడు ఒకసారి హిమాలయాలు చూడడానికి వెళ్ళాడు. సిద్ధుడిచ్చిన లేపనం అక్కడ కరిగి పోయింది. కష్టకాలం వచ్చింది. అక్కడ అమిత సౌందర్యవతి అయిన గంధర్వ కాంత కనిపించింది. ఆమెను దారి చెప్పమని ప్రవరాఖ్యుడు అడిగాడు. కానీ ఆమె అతనిని తనను వివాహమాడమని తియ్యని మాటలెన్నో చెప్పింది. ప్రవరాఖ్యుడు ఆమె మాటలకు చలించలేదు. అందాలు ఆరబోసి అతనిని రెచ్చగొట్టినప్పటికీ అతడు నిగ్రహాన్ని విడిచిపెట్టకుండా తన భార్యను, బంధువులను గుర్తు పెట్టుకున్నాడు. ప్రవరాఖ్యుడి వలెనే అందరూ మనో నిగ్రహంతో ముందుకు వెళ్ళాలంటోంది సనాతన ధర్మం. అయితే దీనిని భక్తిమార్గంలో నడవడం వల్లనే సులువుగా సాధించవచ్చు. మనో నిగ్రహం అలవడితే దివ్యశక్తి ఆవహిస్తుంది. సద్గుణ సంపన్నులు అవుతారు. భక్తి, జ్ఞాన, వైరాగ్య భావనలు కలిగి, సమదృష్టి అలవడుతుంది. ఆత్మజ్ఞానాన్ని అవగతం చేస్తుంది. మనోనిగ్రహం ఆధ్యాత్మిక సాధనకు అత్యవసరం. లౌకిక విషయాల సాధనకు కూడా మనో నిగ్రహం అవసరం. అలాంటపుడే మనిషి సజ్జనుడిగా నలుగురిలో కీర్తింపబడతాడు. చంచల చిత్తమైన మనస్సును, విషయ లోలత్వం నుంచి మరల్చి ఆత్మయందే స్థాపితం చేసి ఆత్మకు సర్వదా అధీనమై ఉండేటట్లు చేయాలని భగవద్గీతతో సహా ఇంచుమించు ఇతర మతగ్రంథాలన్నీ ప్రబోధించాయి. మనస్సును జయిస్తే చాలు. ముల్లోకాలను జయిస్తారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనేవి అదుపులో ఉంటాయి. దుర్గుణాలు సద్గుణాలుగా మారి శాంతి సౌఖ్యాలనిస్తాయి. అయితే ఆత్మనిగ్రహానికి ఆత్మ స్థైర్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆత్మస్థైర్యం ఉన్న మనిషికి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది. ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ప్రోది చేసుకున్న వ్యక్తి ఆత్మ స్థైర్యాన్ని సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. స్వార్థరహితమైన మనసు, ప్రవృత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మస్థైర్యాన్ని సంతరించుకుంటాడు. దైవం పట్ల ప్రత్యేక శ్రద్ధ లేకపోయినప్పటికీ తన పట్ల గురి, నమ్మకం ఉన్న వ్యక్తి ఆత్మస్థైర్య సంభూతుడే అవుతాడు. ప్రతిభ ఉండీ పిరికితనం వల్ల మనిషి చాలా పోగొట్టుకుంటాడు. ఆత్మస్థైర్యం మనిషి శక్తి సామర్థ్యాలను ద్విగుణీకృతం చేస్తుంది. ఆత్మ స్థైర్యం ఓ బలవర్ధక పానీయం వంటిది. అది పిరికితనాన్ని పారదోలుతుంది. విద్యార్జనకు, ఆరోగ్యసాధనకు తోడ్పడుతుంది. భిన్నత్వం గల సమాజంలో ఏకతా భావన సాధించేందుకు తగిన బలాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక సాధన లో సైతం ముందుకు సాగేందుకు తోడ్పడుతుంది. అందువల్ల జీవితంలో ఉన్నత సోపానాలను అధిరోహించాలనుకునే ప్రతి వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుంటే ఆత్మనిగ్రహం దానికదే సొంతమవుతుంది. ఆత్మనిగ్రహానికి ఆత్మ స్థైర్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆత్మస్థైర్యం ఉన్న మనిషికి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది. ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ప్రోది చేసుకున్న వ్యక్తి ఆత్మ స్థైర్యాన్ని సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. స్వార్థరహితమైన మనసు, ప్రవృత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మస్థైర్యాన్ని సంతరించుకుంటాడు. – దాసరి దుర్గాప్రసాద్ -
విద్యతోనే ఉన్నత శిఖరాలు
మదనపల్లె/సదుం (చిత్తూరు జిల్లా): విద్యార్థి దశలో ప్రతి ఒక్కరూ కష్టపడి చదవాలని, విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమవుతుందని రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ అన్నారు. సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, పద్మభూషణ్ ముంతాజ్ అలీ (శ్రీఎం) ఆహ్వానం మేరకు రాష్ట్రపతి కోవింద్ ఆదివారం మదనపల్లె వచ్చారు. సత్సంగ్ ఫౌండేషన్‌లో భారత్ యోగా విద్యాకేంద్రాన్ని ప్రారంభించి ఆవరణలో మొక్కలు నాటారు. 38 పడకల స్వస్థ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సదుం మండలం గొంగివారిపల్లెలో సత్సంగ్ ఫౌండేషన్‌కు చెందిన పీపుల్స్ గ్రోవ్ స్కూల్‌ను సందర్శించిన రాష్ట్రపతి అక్కడి విద్యార్థులతో మాట్లాడుతూ.. విద్యార్థులంతా గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు వ్యాయామం ఎంతో అవసరమని, ప్రతిరోజు ఉదయం యోగా చేయడాన్ని విద్యార్థులు అలవాటు చేసుకోవాలని సూచించారు. యోగా, ధ్యానం చేయడం వల్ల ఆలోచనా శక్తి మరింత మెరుగుపడుతుందని తెలిపారు. అట్టడుగు వర్గాల అభివృద్ధికి నాణ్యమైన ఉచిత విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నందుకు ఆశ్రమ నిర్వాహకులను అభినందించారు. పాఠశాలలో నూతనంగా నిర్మించిన ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించిన రాష్ట్రపతి కోవింద్ అంతకుముందు ఆశ్రమ శివాలయంలో పూజలు నిర్వహించి హారతి స్వీకరించారు. సత్సంగ్ ఫౌండేషన్‌ను సందర్శించినందుకు గుర్తుగా ఆశ్రమ ఆవరణలో రావి మొక్క నాటారు. సుమారు 4 గంటలపాటు రాష్ట్రపతి పర్యటన సాగింది. విద్యార్థులతో మాట్లాడుతున్న రాష్ట్రపతి కోవింద్ గొంగివారిపల్లెలో పీపుల్స్ గ్రోవ్ స్కూల్ విద్యార్థులతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖాముఖి ఇలా సాగింది. విద్యార్థి: రాష్ట్రపతిగా మీకు అనుభవంలోకి వచ్చిన సంఘటన, నేర్చుకున్న విలువలు ఏవైనా చెప్పగలరా? రాష్ట్రపతి: ప్రతి మనిషీ జీవితాంతం నిత్య విద్యార్థే. విద్యార్థిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే.. జీవితం అనేక సవాళ్లు, ఒడిదుడుకులతో కూడుకుని ఉంటుంది. నేను నేర్చుకున్నదేమంటే.. ఏదైనా పదవి, ప్రతిష్ట వ్యక్తిగతంగా గుర్తింపులు తీసుకురావు. అనుకున్నది సాధించేందుకు కఠోర శ్రమ, నిజాయితీ, నిబద్ధత అవసరం. అవే పదవికి వన్నె తెస్తాయి. రాష్ట్రపతిగా నాకు లభించిన గొప్ప అవకాశం ప్రజలకు సేవ చేయడం. సత్సంగ్ ఫౌండేషన్‌లో రావిమొక్కను నాటి నీళ్లు పోస్తున్న రాష్ట్రపతి కోవింద్, సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ ఎం. విద్యార్థి: గతంలో పనిచేసిన దేశాధ్యక్షుల్లో ఎవరి నుంచైనా స్ఫూర్తి పొందారా.. ఏ లక్షణాలు మిమ్మల్ని ప్రభావితం చేశాయి? రాష్ట్రపతి: దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే సమయంలో నేను చేసిన ప్రతిజ్ఞను బలంగా విశ్వసిస్తాను. భారత రాజ్యాంగ విలువలను కాపాడుతానని, పార్లమెంటరీ చట్టాలను గౌరవిస్తానని, దేశరక్షణ, సమగ్రతకు పాటుపడతానన్నాను. గాంధీజీ చెప్పినట్టుగా మంచి గుణం నిజాయితీ. నాకు తెలిసిందల్లా అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా చేసుకువెళ్లడమే. ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో స్ఫూర్తిని పొందాల్సిందే. పరిసరాలు, సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది జీవితంలో ముందుకెళ్లాలి. రాష్ట్రపతి మాట్లాడుతూ.. ‘ప్రతి విద్యార్థికి నేనిచ్చే సలహా ఏమంటే.. విద్య మనిషికి జ్ఞానాన్ని ఇస్తుంది. విద్య ప్రాథమిక లక్షణం సత్యం, అహింస, సర్వమత ప్రేమ. ఇంటి నుంచే గౌరవమిచ్చే సంప్రదాయం రావాలి. పెద్దలను గౌరవించడం, పేద, ధనిక తారతమ్యాలు లేకుండా అందరినీ సమానంగా, ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడాలనే భావన ప్రతి ఒక్కరిలో చిన్నప్పటి నుంచే రావాలి. ప్రతి ఒక్కరూ తరగతి గదుల్లో పాఠాలు అర్థం కాక, ట్యూషన్లను ఆశ్రయిస్తున్నారంటే విద్యా విధానంలో లోపాలు ఉన్నట్టు అంగీకరించాలి’ అని అన్నారు. స్వస్థ ఆస్పత్రి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతికి స్వాగతం పలికిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రపతి కోవింద్‌కు సీఎం వైఎస్ జగన్ చిప్పిలిలోని హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. కోవింద్‌కు పుష్పగుచ్ఛాన్ని అందజేసి దుశ్శాలువతో సత్కరించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు నవాజ్‌బాషా, చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, వెంకటేగౌడ, సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ ఎం తదితరులు ఉన్నారు. పర్యటన ముగిసిన అనంతరం రాష్ట్రపతి బెంగళూరుకు పయనమయ్యారు. -
భజనలకొచ్చేవారు రేప్‌లు చేయరు
పనాజీ: దైవ ప్రసంగాలకు హాజరు కావడం ద్వారా మహిళలపై దాడులు, అత్యాచారాలను నివారించవచ్చని గుజరాత్‌కు చెందిన మత ప్రబోధకుడు మోరారీ బాపు అన్నాడు. అదొక్కటే ఇలాంటి నేరాలను నివారించగల సర్వమార్గమని చెప్పారు. ప్రస్తుతం గోవాలో ఆధ్మాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆయన మాట్లాడుతూ దైవ భజనలకు, ప్రసంగ కార్యక్రమాలకు హాజరయ్యేవాళ్లు లైంగికదాడులకు, వేధింపులకు పాల్పడరని చెప్పారు. అందుకు ప్రధాన కారణం వారి పరిజ్ఞానం విస్తృతమవ్వడమేనని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో అన్యాయాలకు, వేధింపులకు, లైంగికదాడులకు ఒక మహిళ శరీరం వస్తువుగా మారకూడదని, పురుషుల ఆలోచన విధానంలో మార్పు రావాల్సి ఉందని చెప్పారు. భజనలకు రావడం ద్వారా ఆ పరిస్థితి మారుతుందని చెప్పారు. తనకు ప్రధాని నరేంద్రమోదీ అంటే చాలా ఇష్టం అని చెప్పిన ఆయన.. ఇప్పటి వరకు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షాన్నివ్వకుండా ఎందుకు చట్టప్రతినిధులు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారు.