cctv cameras
-
పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాల పనితీరుపై నివేదిక ఇవ్వండి
సాక్షి, అమరావతి: వ్యక్తులను అక్రమంగా నిర్బంధించిన సమయాల్లో తమ పోలీస్ స్టేషన్లలోని సీసీ కెమెరాలు పనిచేయడం లేదంటూ పోలీసులు తరచూ చెబుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్న సీసీ కెమెరాల పనితీరుపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో 1,392 పోలీస్ స్టేషన్లు ఉండగా, 1,001 స్టేషన్లలో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మిగిలిన స్టేషన్లలో ఏర్పాటు చేయకపోవడానికి కారణాలేమిటి? వాటిని ఏర్పాటు చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంది.సీసీ కెమెరాలను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాటు చేశారా? స్టేషన్ ప్రాంగణం మొత్తం కనిపిస్తుందా అనే ప్రధాన విషయాలతో రాష్ట్రస్థాయిలో ఐటీ విభాగాన్ని పర్యవేక్షించే అధికారికి నివేదికలివ్వాలని అందరు డీఎస్పీలను ఆదేశించింది. ఆ నివేదికలను తమ ముందుంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అంతేకాక పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ, మరమ్మతులు, సీసీ టీవీ ఫుటేజీ నిల్వ సామర్థ్యం తదితర వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న 1,226 సీసీ కెమెరాల్లో 785 మాత్రమే పనిచేస్తున్నాయని, మిగిలిన వాటి మరమ్మతులపై ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంది.సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సీసీ టీవీ ఫుటేజీని 12 నెలలు స్టోర్ చేయాలని, ప్రస్తుతం పోలీస్ స్టేషన్లలో ఎన్ని నెలల ఫుటేజ్‌ని స్టోర్ చేయవచ్చో స్పష్టతనివ్వాలని ఆదేశించింది. పోలీస్ స్టేషన్లలో రికార్డయిన ఫుటేజీని ఎక్కడ స్టోర్ చేస్తున్నారని, దాని బ్యాకప్ కోసం జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏదైనా వ్యవస్థ ఉందా వంటి వివరాలను కూడా తమకు సమర్పించే నివేదికలో పొందుపరచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు 2015లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అన్ని పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదంటూ న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలంటూ 2019లో ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయలేదని, తద్వారా అధికారులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ యోగేష్ 2022లో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ యోగేష్ జోక్యం చేసుకుంటూ.. ఇంకా 391 స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. సీసీ టీవీల స్టోరేజీ సామర్థ్యాన్ని, ఫుటేజీని ఎక్కడ భద్రపరుస్తున్నారు వంటి వివరాలను ప్రభుత్వం చెప్పలేదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రభుత్వానికి పలు కీలక ఆదేశాలు ఇచి్చంది. -
ఇంటర్ పరీక్షలపై కెమెరాల వార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షల కోలాహలం ప్రారంభమైంది. గురువారం నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలను కొన్ని ప్రైవేటు కాలేజీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ఇప్పటికే 417 కాలేజీల్లో అద్దెకు సీసీ కెమెరాలు తెప్పించారు. కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో ఇప్పటికే కెమెరాలున్నాయి. దీంతో స్వల్ప సంఖ్యలో కాలేజీలు సీసీ కెమెరాల ఏర్పాటును వ్యతిరేకిస్తే.. వాటికి పరీక్ష కేంద్రాలు ఇవ్వబోమని బోర్డు అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉంటే అగ్నిమాపక శాఖ అనుమతి లేని బహుళ అంతస్తుల భవనాల్లోని కాలేజీలకు ఇంటర్ బోర్డు చివరి నిమిషం వరకు అనుమతివ్వలేదు. ఆఖరులో పెద్ద మొత్తంలో జరిమానా విధించి అనుమతిచ్చిది. ఆ కాలేజీల్లో చదివే విద్యార్థుల అడ్మిషన్లకు రూ.2,500, పరీక్ష ఫీజు రూ.500 వసూలు చేసింది. దీంతో ఇంటర్ బోర్డు అధికారులు వేధిస్తున్నారని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు సీఎంకు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు ప్రైవేటు కాలేజీలు ఎంతవరకు సహకరిస్తాయనేది అనుమానంగా మారింది. కొన్ని కాలేజీలపై నిఘా: పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ప్రభుత్వం ఇంటర్ బోర్డును ఆదేశించింది. పరీక్షలపై నిఘా పెట్టాలని పోలీసులకు సూచించింది. దీంతో కొన్ని ప్రైవేటు కాలేజీలపై ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టి పెట్టాయి. ప్రశ్న పత్రాల బట్వాడా నుంచి, సమాధాన పత్రాలను మూల్యాంకన కేంద్రాలకు చేరవేసే దాకా వీడియో రికార్డింగ్ ఉండాలని ఇంటర్ బోర్డు జిల్లా అధికారులను ఆదేశించింది. ఇంటర్ పరీక్షల నియంత్రణ అధికారి జయప్రదబాయి గురువారం కొన్ని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. మొదలైన ప్రాక్టికల్స్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. గురువారం ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 3 నుంచి సెకండియర్ సైన్స్, మ్యాథమెటిక్స్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. థియరీ పరీక్షలు మార్చి 5 నుంచి మొదలవుతాయి. మొదటి సంవత్సరంలో 4,88,316మంది, రెండో సంవత్సరంలో 5,08,225 మంది కలిపి మొత్తం 9,96,541 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. థియరీ పరీక్షల హాల్ టిక్కెట్లు రెండు రోజుల్లో అందుబాటులో ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. ప్రాక్టికల్స్ కోసం 2,008, థియరీ కోసం 1,532 కేంద్రాలను ఏర్పాటుచేశారు.మాపై నియంత్రణ దేనికి? పరీక్షలకు మేం సహకరిస్తామనే చెబుతున్నాం. కానీ ఇంటర్ బోర్డు అధికారులు ప్రైవేటు కాలేజీలపై కక్ష గట్టినట్టు వ్యవహరిస్తున్నారు. సమస్య సృష్టించే విధంగా వ్యవహరిస్తున్నారు. సీసీ కెమెరాలు పెట్టాలనే ఆదేశం సరైంది కాదు. – గౌరీ సతీష్, ప్రైవేటు కాలేజీల యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. అన్ని చర్యలు తీసుకున్నాం ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. పరీక్షల విధానాన్ని మొత్తం రికార్డు చేస్తున్నాం. ప్రైవేటు కాలేజీలు కూడా సహకరించాలి. – జయప్రదబాయి, ఇంటర్ పరీక్ష విభాగం ముఖ్య అధికారి. -
ఇంటర్లో ఉత్తుత్తి ప్రాక్టికల్స్‌కు చెక్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ పరీక్షలపై ఇంటర్ బోర్డు ప్రత్యేక దృష్టి పెట్టింది. నిఘా నీడలో ప్రయోగ పరీక్షలు జరగాలని బోర్డు కార్యదర్శి అన్ని జిల్లాల ఇంటర్ అధికారులను ఆదేశించారు. దీంతో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు సమీక్ష జరిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వాటిని ఇంటర్ బోర్డ్ ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయాలని నిర్ణయించారు. ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో ప్రయోగాలు చేయకున్నా మార్కులు! ఏటా ప్రాక్టికల్ పరీక్షలపై అనేక ఫిర్యాదులొస్తున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో తూతూ మంత్రంగా ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారని, విద్యార్థులు ప్రయోగాలు చేయకపోయినా మార్కులు వేస్తున్నారనే ఆరోపణలున్నాయి.పర్యవేక్షణకు ఇన్విజిలేటర్లుగా వెళ్ళే ప్రభుత్వ లెక్చరర్లను కాలేజీలు ముందే ఆకట్టుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వ కాలేజీలకన్నా, ప్రైవేటు కాలేజీ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వస్తున్నాయన్న విమర్శలున్నాయి. దీన్ని అడ్డుకునేందుకు కొన్నేళ్ళుగా ఇంటర్ బోర్డ్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మార్కులపై దృష్టి రాష్ట్రంలో ఈ ఏడాది 3,80,960 మంది విద్యార్థులు ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాస్తున్నారు. వారిలో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు ఉన్నాయి. అలాగే అన్ని గ్రూపుల విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఇందులో 1,20,515 మంది ఎంపీసీ విద్యార్థులు, 75,040 మంది బైపీసీ విద్యార్థులు ఉన్నారు. ఎంపీసీ విద్యార్థులకు కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో ప్రయోగ పరీక్షలు ఉండగా బైపీసీ విద్యార్థులకు ఈ రెండింటితోపాటు బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్ ఉన్నాయి. రెండేళ్లుగా ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ప్రయోగ పరీక్షల్లో 75 శాతం మార్కులు వస్తుండగా కార్పొరేట్ కాలేజీల్లో ఏకంగా 90 శాతంపైనే మార్కులు వస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ కాలేజీల్లో ప్రాక్టికల్స్ చేయిస్తుండగా చాలా వరకు ప్రైవేటు కాలేజీల్లో కనీసం లేబొరేటరీలు, రసాయనాలు కూడా ఉండటం లేదని పలువురు లెక్చరర్లు బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాలేజీలపై నిఘా పెట్టాలని నిర్ణయించారు. ఆరోపణలున్న కాలేజీల సీసీ ఫుటేజ్‌ను పరీశీలించే ఆలోచన ఉందని ఓ అధికారి తెలిపారు. పరీక్షలపై రోజూ నివేదిక ఇంటర్ పరీక్షల తీరుతెన్నులపై ప్రతిరోజూ నివేదిక ఇవ్వాలని అధికారులను ఇంటర్ బోర్డు ఆదేశించింది. ఏ కాలేజీలో ఎందరు విద్యార్థులు ఏయే ప్రాక్టికల్స్ చేశారనే అంశాలను అందులో పొందుపర్చాలని సూచించింది. గతంలో ఒక కాలేజీకి పంపిన లెక్చరర్‌ను ఈసారి వేరే కాలేజీకి పంపాలని ఆదేశించింది. -
పబ్‌లపై డేగ కన్ను
బంజారాహిల్స్: పబ్‌లు అంటేనే గుర్తుకు వచ్చేది జూబ్లీహిల్స్... నగరంలో ఎక్కడా లేనంత హడావుడి, హంగామా జూబ్లీహిల్స్ పబ్‌లలోనే కనిపిస్తుంది. చుక్కేసినా... చిందేసినా జూబ్లీహిల్స్ పబ్‌లో ఉంటేనే ఆ కిక్కెక్కుతుంది. అందుకే యువత కళ్లన్నీ జూబ్లీహిల్స్ పబ్లపైనే ఉంటాయి. మామూలు రోజుల్లోనే హంగామా జరిగే ఈ పబ్‌లలో న్యూ ఇయర్ విషయం చెప్పనక్కర్లేదు...ఈ నెల 31న రాత్రి న్యూ ఇయర్ వేడుకలకు జూబ్లీహిల్స్‌లోని పబ్‌లన్నీ సరికొత్త వేదికలతో సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక ఆకర్శన కోసం బాలీవుడ్, టాలీవుడ్ తారలను రప్పిస్తున్నారు. అయితే పబ్ నిర్వాహకులు న్యూ ఇయర్ వేడుకల్లో శ్రుతిమించితే ఊరుకునే ప్రసక్తే లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏ మాత్రం హద్దు మీరినా కేసులు నమోదు చేస్తామన్నారు. ఏం చేయాలి.. ఏం చేయకూడదన్న దానిపై పబ్‌ల నిర్వాహకులకు పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఒక పబ్‌లో మద్యం సేవించి ఆ నిషాలో మరో పబ్‌కు వెళ్లి తాగుతామంటే ఇప్పుడు కుదరదు అని చెప్పాలని.. నిషాలో ఉన్న వ్యక్తికి మద్యం సరఫరా చేయకూడదని ఒక వేళ అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పబ్‌ల నిర్వాహకులకు సమావేశాలు నిర్వహించిన పోలీసులు హద్దుమీరి ప్రవర్తిస్తే బాగుండదని హెచ్చరించారు. ప్రతి పబ్‌లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పబ్ ముందు, పార్కింగ్ ప్లేస్‌లోనూ సీసీ కెమెరాలు ఉండాలని సూచిస్తున్నారు. పబ్‌లలో డ్రగ్స్ సరఫరా అయ్యే సూచనలు ఉండటంతో గత పది రోజులుగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు గతంలో డ్రగ్స్ సరఫరా చేసిన పెడ్లర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. వారంతా ఇప్పుడు ఎక్కడున్నారు. ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. ఎవరెవరితో మాట్లాడుతున్నారు అన్న అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో న్యూ ఇయర్ వేడుకలు జరిగే అన్ని పబ్‌లపై పోలీసులు డేగ కన్ను వేయనున్నారు. అనుమానితుల కదలికలపై ఇప్పటికే దృష్టి సారించారు. ప్రతి పబ్‌లోనూ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గంజాయి సరఫరాదారులపై నిఘా ఉచిన పోలీసులు గతంలో గంజాయి కేసులు నమోదైన వారిపై దృష్టి సారించారు. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత మద్యం సేవించే వారు జాగ్రత్తగా ఇంటికి వెళ్లేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని లేని పక్షంలో వారినే బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. నాలుగు పబ్‌లకు అనుమతి నో... జూబ్లీహిల్స్‌లోని హార్ట్‌కప్, అమ్నేషియా, బ్రాడ్వే, బేబీలాన్ పబ్‌లకు పోలీసులు అనుమతి ఇవ్వడం లే దు. గతంలో ఆయా పబ్‌లలో జరిగిన గొడవలు, పో లీసు కేసుల కారణంగా వాటిపై ఆంక్షలు విధిస్తూ వేదికలకు అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. సిద్ధమవుతున్న పబ్‌లు ఇవే... జూబ్లీహిల్స్‌లో మొత్తం 36 పబ్‌లు ఉండగా ఇందులో నాలుగింటికి అనుమతులు నిరాకరించారు. కొన్నింట్లో మాత్రం ప్రత్యేక వేడుకలు జరగడం లేదు. అయితే న్యూ ఇయర్ వేడుకల కోసం దరఖాస్తు చేసుకున్న వాటిలో లుఫ్ట్, క్లబ్ రోగ్, పోష్ నాష్, తబలారసా, జోరా, లార్డ్ ఆఫ్ డ్రింక్స్, ప్రోస్ట్, జిందగీ స్కై బార్, ఫోర్జ్ బ్రీవ్, 040 బ్రీవ్, హలో, ఎల్యూజన్, ఎయిర్‌లైవ్, గ్రీజ్ మంకీ, పోర్ ఫాదర్స్, జైథుమ్, స్టోన్ వాటర్, పోయిస్ట్ తదితర పబ్‌లు వేడుకలకు అనుమతులు పొందాయి. యువతను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన డీజేలను రప్పిస్తున్నారు. గోవా నుంచి పేరొందిన డీజేలతో పాటు గాయనీ, గాయకులను పిలిపిస్తున్నారు. కొన్ని పబ్‌లకు బాలీవుడ్ తారలు కూడా వస్తుండటం గమనార్హం.అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి బంజారాహిల్స్: నూతన సంవత్సర వేడుకలను నిర్వహించే ఈవెంట్ ఆర్గనైజర్లు, పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటించాలని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్ అన్నారు. ఈ నెల 31న నూతన సంవత్సర వేడుకల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్ల నిర్వాహకులు మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసుకోవాలని, భద్రతా సిబ్బందిని నియమించుకోవాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. అన్ని పబ్‌లు, బార్లు మైనర్లను అనుమతించరాదన్నారు. అర్ధరాత్రి ఒంటి గంటలోగా తమ ప్రాంగణాలను ఖాళీ చేయించాలన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటుచేసుకోవాలన్నారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వెస్ట్‌జోన్ అడిషనల్ కమిషనర్‌తో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్ డివిజన్ పోలీసులు పాల్గొన్నారు. -
రైలు ప్రమాదాలకు చెక్.. ఏఐ కెమెరాలతో నిఘా
భద్రత విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిఘా కెమెరాలను ఏర్పాటు చేయనుంది. పట్టాలపై ప్రమాదకరమైన వస్తువులను దూరం నుంచే గుర్తించి లోకో పైలెట్లను అప్రమత్తం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రైళ్లు పట్టాలు తప్పడాన్ని నివారించడంతోపాటు ఉగ్రవాద, అసాంఘిక శక్తుల కుట్రలను తిప్పికొట్టే లక్ష్యంతో రైల్వేశాఖ వీటిని ఏర్పాటుచేయనుంది. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో సీసీటీవీ కెమెరాల నిఘా కొనసాగుతుండగా.. నడుస్తున్న రైళ్లను మాత్రం ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) పరిజ్ఞానం ద్వారా పర్యవేక్షిస్తున్నారు.కానీ, నడిచే రైళ్లు ప్రమాదాలకు గురికాకుండా ముందుగానే అప్రమత్తంచేసే వ్యవస్థ ఇప్పటివరకు అందుబాటులో లేదు. –సాక్షి, అమరావతిమూడేళ్లలో 97 ప్రమాదాలు..ఇటీవలి కాలంలో దేశంలో రైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురవుతున్న దుర్ఘటనలు గణనీయంగా పెరిగాయి. 2021 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ ప్రమాదాలు 97 సంభవించాయి. కొన్నిచోట్ల విద్రోహశక్తులు రైలుపట్టాలపై ప్రమాదకరమైన వస్తువులను ఉంచి కుట్రలు పన్నిన ఉదంతాలూ ఉన్నాయి. దీంతో రైలు పట్టాలపై ఈ తరహా వస్తువులను ముందుగానే గుర్తించి ప్రమాదాలు నివారించేందుకు రైళ్లలో ఏఐ కెమెరాలను ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది.రూ.15 వేల కోట్లతో 75,000 ఏఐ కెమెరాలు..ఈ నేపథ్యంలో.. రూ.15 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో 75 వేల ఏఐ కెమెరాలను ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. 40 వేల బోగీలు, 14 వేల లోకోమోటివ్‌లు (ఇంజిన్లు), 6 వేల ఈఎంయూలలో ఈ కెమెరాలను ఏర్పాటుచేస్తారు. ప్రతి బోగీకి ఆరు కెమెరాలు, ప్రతి లోకోమోటివ్‌కు నాలుగు కెమెరాలను అమరుస్తారు. అక్టోబరు నుంచి ఏడాదిలోగా దశలవారీగా అన్ని రైళ్లలో ఏఐ కెమెరాల ఏర్పాటు పూర్తిచేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పలు కంపెనీలకు టెండర్లు అప్పగిస్తోంది. -
హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. కోఠీ గుజరాత్ గల్లిలోని ఓ గోదాంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అది సీసీటీవీల గోదాం అని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో భారీగా సీసీటీవీలు దగ్ధమైనట్టు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్ధలానికి చేరుకున్నట్టు సమాచారం. మొత్తం మూడు ఫైర్ ఇంజన్లుతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నట్టు తెలుస్తోంది. -
రైల్వే స్టేషన్లలో సరికొత్త సెక్యూరిటీ సిస్టమ్.. ఇక దొంగల ఆటకట్టు!
దేశంలోని రద్దీగా ఉండే రైల్వేస్టేషన్లలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రయాణికుల విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు వార్తలు తరచూ వింటుంటాం. ఇలాంటి రైల్వే స్టేషన్లలో దొంగల ఆట కట్టించడానికి భారతీయ రైల్వే (Indian Railways) సరికొత్త భద్రతా వ్యవస్థను తీసుకొస్తోంది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా వివిధ ప్రాంతాల్లో భద్రతను పెంచేందుకు సెంట్రల్ రైల్వే సర్వం సిద్ధం చేసింది. సెంట్రల్ రైల్వేస్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. త్వరలో 364 రైల్వే స్టేషన్లలో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌తో కూడిన 3,652 కెమెరాలతో సహా మొత్తం 6,122 క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ (CCTV) కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి రైల్‌టెల్‌తో రైల్వే బోర్డు అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. (iPhone 15: షాకింగ్.. బ్రేకింగ్! ఇదేం ఐఫోన్ భయ్యా.. వైరల్ వీడియో) "ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, వీడియో అనలిటిక్స్, వీడియో మేనేజ్మెంట్ సిస్టమ్‌తో కూడిన కెమెరాలు ప్రయాణికుల భద్రతను పెంపొందిస్తాయి. నేరాలను నియంత్రిస్తాయి. చట్టాన్ని దుర్వినియోగం చేసేవారిని అరికట్టగలవు. రైల్వే నిబంధనలకు అనుగుణంగా పర్యవేక్షిస్తాయి" అని ప్రకటనలో వివరించారు. కెమెరాలు ఇలా పనిచేస్తాయి.. రైల్వే స్టేషన్లోకి దొంగ ప్రవేశించగానే ఈ ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు గుర్తించి వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తాయి. ఇందుకోసం ఇదివరకే డేటాబేస్‌లో స్టోర్ అయిన దొంగల ఫేస్ సమాచారాన్ని ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు వినియోగించుకుంటాయి. ఈ కెమెరాలు కంటి రెటీనా లేదా నురురు వంటి ముఖ భాగాలను గుర్తించగలవు. ప్రతి హెచ్డీ కెమెరా సుమారు 750 జీబీ డేటాను వినియోగిస్తుంది. ఇక 4K కెమెరాలు నెలకు 3 టీబీ డేటాను వినియోగించుకుంటాయి. వీడియో ఫుటేజ్‌ను పోస్ట్ ఈవెంట్ అనాలిసిస్, ప్లేబ్యాక్, ఇన్వెస్టిగేషన్ ప్రయోజనాల కోసం 30 రోజుల పాటు నిల్వ చేయనున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. -
సీసీ కెమెరాలు తిప్పేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల భద్రత కోణంలో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లను భయపెడుతున్నాయి. తమపై నిఘా కోసమే వాటిని ఏర్పాటు చేశారన్న అపోహలో ఉన్న డ్రైవర్లు గుట్టు చప్పుడు కాకుండా కెమెరాలను ఓ పక్కకు తిప్పేస్తున్నారు. దీంతో బస్సులోపల ప్రయాణికులు ఉండే భాగం కాకుండా, బస్సు గోడలు, కిటికీల ప్రాంతం కెమెరాల్లో రికార్డు అవుతోంది. తాజాగా బస్‌భవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అలాంటి డ్రైవర్లకు సీసీ కెమెరాలపై అపోహలు తొలగిపోయేలా అవగాహన కల్పించాలని నిర్ణయించారు. చర్యలు తీసుకుంటారన్న భయంతో..: ఇటీవలే ఆర్టీసీ దాదాపు 700 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను సమకూర్చుకుంది. ఇప్పటి వరకు కొన్ని ఏసీ బస్సుల్లో తప్ప మిగతా ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు లేవు. బస్సులో ఏ ఘటన జరిగినా స్పష్టంగా తెలుసుకునే వీలు లేకుండా పోతోంది. దీంతో ప్రయాణికుల భద్రతకు సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరని భావించి, కొత్తగా కొనుగోలు చేసే బస్సుల్లో వీటిని ఏర్పాటు చేయిస్తున్నారు. ఇలా కొత్త సూపర్ లగ్జరీ బస్సులను కంపెనీ నుంచి వచ్చినవి వచ్చినట్టు రోడ్డెక్కిస్తున్నారు. ఆ బస్సుల్లో లోపల డ్రైవర్ క్యాబిన్ ఎదురుగా ఒక కెమెరా, డ్రైవర్ క్యాబిన్ వెనక మరో కెమెరా ప్రయాణికులు కనిపించేలా ఉంటాయి. మరో కెమెరా బస్సు వెనక రివర్స్ చేసేప్పుడు డ్రైవర్‌కు సౌలభ్యం కలిగించేలా ఉంటుంది. అయితే ఇప్పుడు క్యాబిన్ ముందువైపు ఉన్న కెమెరాను చూడగానే డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. కొంతకాలంగా ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సస్పెన్షన్ వేటు పడుతుండటమే దీనికి కారణం. ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్ వినియోగం సాధారణ విషయంగా మారింది. ఇంటి నుంచి కాల్ వచ్చినా, అత్యవసర పనులకు సంబంధించి ఫోన్ కాల్‌వచ్చినా డ్రైవర్లు మాట్లాడేస్తుంటారు. అయితే బస్సు నడిపే సమయంలో డ్రైవర్లు సెల్ ఫోన్ మాట్లాడటాన్ని నేరంగా పరిగణిస్తారు. అలాగే కొందరిలో డ్రైవింగ్‌లో అప్పుడప్పుడు ఏమరపాటు వ్యక్తమవుతుంటుంది. ఇలాంటివన్నీ సీసీ కెమెరాలో రికార్డు అవుతాయి. ఇది తమపై చర్యలకు కారణమవుతుందేమోనన్నది డ్రైవర్ల భయానికి కారణంగా ఉంటోందని అధికారులంటున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లకు సంకటం.. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో అడ్వాన్సు టికెట్ బుకింగ్ సమయంలో డ్రైవర్ ఫోన్ నంబర్‌ను కూడా తెలియజేస్తారు. ప్రయాణికులు ఆ నంబర్‌కు ఫోన్ చేసి బస్సు ఎక్కడి వరకు వచ్చిందో వాకబు చేస్తుంటారు. కాగా, విశాఖపట్నం, బెంగళూరు లాంటి దూర ప్రాంతాల సర్విసులు మినహా మిగతా బస్సుల్లో ఒకే డ్రైవర్ ఉంటున్నాడు. ప్రయాణికుల నుంచి ఫోన్ కాల్ వస్తే అతనే మాట్లాడాల్సి వస్తోంది. ఇది రికార్డయితే, దానిని కూడా నేరంగా పరిగణిస్తారన్న భయం డ్రైవర్లలో ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని బస్సులో కెమెరా యాంగిల్‌ను తిప్పేస్తున్నారన్నది అధికారుల మాట. దీంతో డ్రైవర్లలో అపోహలు తొలగించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆ కెమెరాలు ప్రయాణికుల భద్రత కోసమే కేటాయించాన్న విషయాన్ని తెలిపి, వారిలో ఆందోళన పోగొట్టాలని అధికారులు నిర్ణయించారు. -
నిఘా కన్ను.. ఉంటేనే దన్ను!
సాక్షి, హైదరాబాద్: సీసీటీవీ కెమెరాలు..ఏ మూల ఏం జరిగినా పట్టిచూపే నిఘానేత్రాలు. అందుకే భద్రత దృష్ట్యా సీసీటీవీ కెమెరాలకు ఆదరణ పెరుగుతోంది. నేర నియంత్రణతో పాటు, నేరాల పరిశోధనలోనూ ఇవే పోలీసులకు అస్త్రాలుగా మారుతున్నాయి. దుకాణాలు, హోటల్స్, ఇతర వ్యాపార ప్రాంతాల్లోనూ యజమానులు ఉద్యోగుల పనితీరును గమనించేందుకు, వినియోగదారుల్లో ఎవరైనా తేడాగా ఉంటే అలాంటి వారిపై నిఘా పెట్టేందుకు సైతం వీటిని వాడుతున్నారు. అలాంటి సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో ఎలాంటి అవగాహన ఉంది? సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై పలు వర్గాల్లో ఎలాంటి అభిప్రాయాలున్నాయన్న వివరాలను బీపీఆర్ఎండీ (బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) ఇటీవల స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా 2023 పేరిట నివేదికను విడుదల చేసింది. బీదల బస్తీల మొదలు సంపన్న వర్గాల నివాస ప్రాంతాల వరకు అన్ని ప్రాంతాల వారు సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు జై కొట్టారు. -
నిఘా నేత్రాలకు ‘ప్రజా భద్రత’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సీసీటీవీ కెమెరాల నిర్వహణకు ప్రత్యేకంగా ఓ విభాగం ఏర్పాటు కానుంది. ప్రజలకు రక్షణ కవచంలా నిలుస్తూ.. నేరాల దర్యాప్తులో కీలకంగా మారిన సీసీటీవీ కెమెరాల నిర్వహణ బాధ్యతల కోసం పటిష్టమైన విభాగం ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ సొసైటీ (టీపీఎస్‌ఎస్)ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సొసైటీ నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించిన అనంతరం సొసైటీల చట్టం కింద దీనిని రిజిస్ట్రేషన్ చేయనున్నారు. టీపీఎస్‌ఎస్ ఎందుకంటే? ప్రస్తుతం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) కిందే సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. కానీ, వాటి నిర్వహణ బాధ్యతలు ఎవరు చూడాలనే ప్రశ్న తలెత్తుతోంది. కొన్ని సందర్భాలలో కేసు దర్యాప్తులో భాగంగా సీసీకెమెరాల ఫుటేజీలను సేకరించేందుకు ప్రయత్నిస్తే అవి పాడైపోయి లేదా కెమెరాలు పనిచేయకపోవటం వంటి స్థితిలో కనిపిస్తున్నాయి. ఎండా, వానల కారణంగా కెమెరాలు దెబ్బతినడంతోపాటు నిర్వహణ సరిగాలేక కొన్ని ప్రాంతాలలో కెమెరాలు అలంకారప్రాయంగా మారాయి. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే సీసీ కెమెరాల రక్షణకు టీపీసీసీ లాంటి విభాగం అవసరమని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఎలా పనిచేస్తుందంటే? రాష్ట్రం, కమిషనరేట్, జిల్లా, డివిజన్, పోలీసు స్టేషన్ల వారీగా టీపీఎస్‌ఎస్ పనిచేస్తుంది. సీఎస్సార్ కింద రాష్ట్రవ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ కోసం నిధులను సమీకరించి, వినియోగిస్తారు. ప్రతి యూనిట్ సొసైటీకి ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా ఉంటుంది. వీటి ద్వారానే ఆయా నిధుల వినియోగం జరుగుతుంది. సీసీటీవీ కెమెరాల నిర్వహణ, రిపేరు కోసం స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) యూనిట్ ఆఫీసర్‌కు అభ్యర్థన లేఖ పంపిస్తాడు. వెంటనే ఖాతా నుంచి నిధులు విడుదల అవుతాయి. సొసైటీ ఏర్పాటుతో నిధుల సమీకరణ, వినియోగంలో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం ఏర్పడుతుంది. ఐటీ మినహాయింపు కూడా.. సీఎస్సార్‌లో భాగంగా సంస్థలతో పాటు వ్యక్తులు కూడా స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వొచ్చు. టీపీఎస్‌ఎస్‌కు విరాళాలు ఇచ్చే సంస్థలకు, వ్యక్తులకు ఆదాయపన్ను (ఐటీ)లో మినహాయింపు ఉంటుంది. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు ఐటీ శాఖకు లేఖ రాసినట్లు తెలిసింది. గతేడాది వార్షిక నివేదిక గణాంకాల ప్రకారం.. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 4,40,299 కెమెరాలు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,59,117, రాచకొండలో 1.50 లక్షలకు పైగానే కెమెరాలున్నాయి. -
పోలీసులే నివ్వెరపోయేలా క్యాడ్బరీ గోడౌన్లో భారీ దోపీడీ
లక్నో: యూపీ,లక్నోలోని చిన్హాట్ ప్రాంతంలో భారీ చోరి జరిగింది. ప్రముఖ బ్రాండ్ క్యాడ్‌బరీకి చెందిన దాదాపు 150 కార్టన్ల చాక్లెట్ బార్లను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకుపోయారు. అందరూ స్వాతంతత్ర్య దినోత్సవ సంబరాల్లో ఉంటే దొంగలు మాత్రం తమ పని తాము చేసుకు పోయారు. ట్రక్కులతో వచ్చి మరీ ఈ చోరీకి పాల్పడ్డారు. చోరీ అయిన చాక్లెట్ల విలువు 17 లక్షల రూపాయలని అంచనా వేశారు. యూపీ రాజధాని పోలీసులంతా ఒకవైపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వీవీఐపీల భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు.ఇదే అదునుగా భావించిన దుండగులు ఈ చోరీకి తెగబడ్డారు. అంతే కాదు సాక్ష్యాలు లేకుండా, అక్కడున్న సీసీ కెమెరా డిజిటల్ వీడియో రికార్డర్‌ను కూడా ఎత్తుకు పోవడంతో పోలీసులు సైతం హతాశులయ్యారు. బ్రాండ్ పంపిణీదారు, వ్యాపారవేత్త రాజేంద్ర సింగ్ సిద్ధు ఈ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. 7 లక్షల విలువైన చాక్లెట్లున్న 150 డబ్బాలు, కొన్ని బిస్కెట్ల పెట్టెలు కూడా చోరీ అయ్యాయని సిద్ధు పోలీసులకు తెలిపారు. రెండ్రోజుల క్రితమే స్టాక్ వచ్చిందని, నగరంలోని చిల్లర వ్యాపారులకు వీటిని పంపిణీ చేయాల్సి ఉందని వాపోయారు. దీనిపై ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు చేరవేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. Lucknow, UP | Chocolates worth Rs 17 lakh stolen from a Cadbury godown We've filed an FIR in the Chinhat police station. If anyone has any input, please guide us: Rajendra Singh Sidhu, Cadbury distributor pic.twitter.com/u2JrOSKPtW — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 17, 2022 -
బ్రదరూ! అక్కడుంటాడొకడు.. క్లిక్మనగానే ఇంటికి డైరెక్టుగా ట్రాఫిక్ చలానా!
టాఫిక్ పోలీస్ లేడని దర్జాగా దూసుకెళ్లినా.. నిబంధనలు అతిక్రమించినా ఒకడున్నాడు చూడ్డానికి. ఇకపై కూడళ్ల వద్ద మిమ్మల్ని నిరంతరం పర్యవేక్షిస్తాడు. ఏమాత్రం నిబంధనలు పాటించకపోయినా క్లిక్‌మని జరిమానా వేసేస్తాడు. – కాజీపేట ఇకపై ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే. లేదంటే మీ జేబుకు చిల్లు పడడం ఖాయం. ఎందుకంటే కాజీపేట చౌరస్తాలో ఇటీవల కొత్తగా ఆటోమెటిక్ ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ విధానం అమల్లోకి వచ్చింది. చక్కగా తన పనితాను చేసుకుంటూ వెళ్తోంది. ఇక ముందు బీట్ కానిస్టేబుల్ చౌరస్తాలో నిలబడి నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల ఫొటోలు తీసి జరిమానా విధించే పని ఉండదు. ఆటోమెటిక్ కెమెరాలు తీసిన ఫొటోల ఆధారంగా నేరుగా ఈ–చలానా ఇంటికే వచ్చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ వంటి నగరాల్లో ఈవిధానం అమలవుతుండగా రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటన్నింటికోసం వరంగల్‌లో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేసి నిర్వహణ కొనసాగించనున్నారు. (చదవండి: బిహార్‌లో హైదరాబాద్ పోలీసులపై కాల్పులు) ఈ నిబంధనలు పాటించాల్సిందే.. ► హెల్మెట్ లేకుండా వాహనం నడపొద్దు ► రాంగ్ రూట్లో ప్రయాణించొద్దు ► వాహనాలపై పరిమిత సంఖ్యలో ప్రయాణించాలి ► ఫోన్ మాట్లాడుతూ ప్రయాణించొద్దు ► నంబర్ ప్లేట్ వంచొద్దు. స్టిక్కర్లు అంటించొద్దు. ఈవిధానంలో చౌరస్తాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రాంతం నుంచి వాహనదారులు నిబంధనలు పాటించకపోతే వారి ఫొటోలు ఈకెమెరాల్లో నిక్షిప్తమై కంట్రోల్ కేంద్రం నుంచి ఆటోమెటిక్‌గా ఈ–చలానా వాహనదారులకు చేరేలా ఏర్పాటు చేశారు. త్వరలో ఏఎంపీఆర్ విధానం ఆటోమెటిక్‌గా ఇంటిగ్రెటేడ్ కమాండ్ కంట్రోల్ విధానం అమలు అనంతరం అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ఏఎంపీఆర్ (ఆటో మెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్) అమలు చేయనున్నట్లు సమాచారం. ఎవరైనా తమ వాహనం నంబర్లో ఒక సంఖ్య తొలగించి వాహనం నడిపితే సీసీ కెమెరాల్లో ఆవాహనం ఫొటో నిక్షిప్తమై తొలగించిన నంబర్‌ను గుర్తు పడుతోంది. అనంతరం ఆయజమాని సెల్‌ఫోన్‌కు ఈ–చలాన్ ద్వారా జరిమానా విధిస్తుంది. (చదవండి: లా అండ్ ఆర్డర్ చేతకాకుంటే ఇంట్లో కూర్చోవాలి: బండి సంజయ్) -
అడుగడుగునా కెమెరాలు .. బయోమెట్రిక్ అటెండెన్స్
సాక్షి, హైదరాబాద్: మెడికల్ కాలేజీల ఇష్టారాజ్యానికి చెక్ పెట్టేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నడుం బిగించింది. అధ్యాపకులు పూర్తి స్థాయిలో లేని కళాశాలలకు చెక్ పెట్టేలా చర్యలకు సంసిద్ధమైంది. వైద్య విద్యలో నాణ్యతను పెంపొందించే దిశగా పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఎన్ఎంసీ ఆదేశించింది. ప్రతి కాలేజీలో 25 చొప్పున సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. అదే విధంగా అన్ని మెడికల్ కాలేజీల్లో ఆధార్ సహిత బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఏఈబీఏఎస్), రోగుల వివరాలు, స్థితిగతులు తెలుసుకునేలా (ట్రాకింగ్) హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (హెచ్ఎంఎస్) అమలు చేయాలని స్పష్టం చేసింది. కళాశాలల్లోని ఈ వ్యవస్థను ఢిల్లీలోని ఎన్ఎంసీ వద్ద ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానిస్తారు. లైవ్ వీడియో ఫీడ్‌ను కమాండ్ సెంటర్‌కు షేర్ చేసేలా ఏర్పాట్లు చేయాలని ఎన్ఎంసీ మార్గదర్శకాలు జారీ చేసింది. తద్వారా ప్రతి మెడికల్ కాలేజీని నేరుగా ఎన్ఎంసీ పర్యవేక్షించనుంది. మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలు.. ►బోధన సిబ్బంది,సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్ల హాజరును నమోదు చేయడానికి సమర్థవంతమైన డిజిటల్ పరిష్కారం బయోమెట్రిక్ వ్యవస్థ. అందువల్ల నేషనల్ ఇన్ఫర్మేటి క్స్ సెంటర్ (ఎన్ఐసీ) అభివృద్ధి చేసిన ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీ లు ఈ నెల పదో తేదీలోగా అమల్లోకి తేవాలి. ►మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లోని రోగుల లోడ్, ఇతర వివరాలను పర్యవేక్షించేందుకు హెచ్ఎంఎస్ను అమలు చేయాలి. అందుకోసం ఈ–హాస్పిటల్ సాఫ్ట్‌వేర్‌ను ఎన్ఐసీ అభివృద్ధి చేసింది. ఇది ఆసుపత్రి కౌంటర్లో రోగుల నమోదును సులభతరం చేస్తుంది. మొబైల్ ఓటీపీ, ఆధార్ మొదలైన వాటి ద్వారా రోగుల స్వీయ నమోదును సులభతరం చేస్తుంది. ►వైద్య విద్యపై నియంత్రణకు, ప్రత్యేకించి కొన్ని వైద్య కళాశాలలు తనిఖీల సందర్భంగా నకిలీ ఫ్యాకల్టీలను, రోగులను తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న విధానాన్ని నిరోధించేందుకు కొత్త పద్ధతి ఉపయోగపడుతుంది. ►మెడికల్ కాలేజీల ప్రాంగణంలోని తరగతి గదులు, ఇతర కీలక ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు.. ప్రతిదీ ట్రాక్ చేయడానికి, కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయా కాలేజీలన్నిటినీ పరిశీలించడానికి వీలు కలుగుతుంది. ►కాలేజీల నుంచి లైవ్ ఫీడ్, బయో మెట్రిక్ హాజరు తదితరాల పర్యవేక్షణకు, సమన్వయం చేసేందుకు ఒక నోడల్ అధికారిని నియమించాలి. ►ఏఈబీఏఎస్ పోర్టల్‌లో ఫ్యాకల్టీ మొత్తం స్వయంగా నమోదు చేసుకోవాలి. మెడికల్ కాలేజీ నోడల్ అధికారి హాజరును పర్యవేక్షిస్తారు. ►ఈ నెలాఖరు నాటికి మెడికల్ కాలేజీలు ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. -
ప్రభుత్వం సీరియస్.. ఇకపై బడి బస్సుల్లో అవి తప్పనిసరి
సాక్షి, చెన్నై: ప్రైవేటు విద్యా సంస్థల బస్సులు, ప్రైవేటు ఆపరేటర్ల వాహనాల్లో సీసీ కెమెరాలను ప్రభుత్వం తప్పని సరి చేసింది. అలాగే, నలువైపులా సెన్సార్ పరికరాల్ని అమర్చాలన్న ఉత్తర్వులు బుధవారం జారీ అయ్యాయి. గతంలో ఓ ప్రైవేటు విద్యా సంస్థ బస్సులో ఉన్న రంధ్రం నుంచి కింద పడి ఓ విద్యార్థిని మరణించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో జనంలో ఆగ్రహావేశాల్ని రగల్చడంతో కోర్టు జోక్యం చేసుకుంది. దీంతో విద్యాసంస్థల బస్సులు, విద్యార్థులను తరలించే ప్రైవేటు ఆపరేటర్ల వాహనాలకు సంబంధించిన నిబంధనలు కఠినం చేశారు. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగా బస్సులను ఆర్టీఓ అధికారులు తనిఖీలు చేసి, సర్టిఫికెట్లను మంజూరు చేస్తూ వస్తున్నారు. అయినా, ఏదో ఒక చోట విద్యా సంస్థల బస్సులు, ఇతర ప్రైవేటు ఆపరేటర్ల వాహనాల కారణంగా విద్యార్థులకు ప్రమాదాలు తప్పడం లేదు. దీంతో మోటారు వెహికల్ చట్టంలో సవరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తర్వుల జారీ.. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి ఫనీంద్రరెడ్డి బుధవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు లగ్జరీ కార్లు వంటి వాహనాల్లో ఉండే విధంగా విద్యాసంస్థల బస్సులు, వాహనాల్లో ముందు, వెనుక భాగాల్లో సీసీ కెమెరాలను తప్పనిసరి చేశారు. అలాగే, వాహనాలకు నలువైపులా సెన్సార్ పరికరం అమర్చేందుకు ఆదేశాలు ఇచ్చారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా బస్సు ముందు, వెనుక భాగంలో ఎవరైనా ఉన్నారా..? అని డ్రైవర్ తెలుసుకునేందుకు వీలుందని వివరించారు. అలాగే, సెన్సార్ పరికరం నుంచి వచ్చే సంకేతాల మేరకు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించేందుకు వీలుందని పేర్కొన్నారు. తక్షణం ఆయా బస్సులు, వాహనాల్లో వీటిని అమర్చేందుకు చర్యలు తీసుకోవాలని, తనిఖీలు చేయాలని ఆర్టీఓ అధికారులను, పోలీసు యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. -
పోలీస్స్టేషన్ల సీసీటీవీల్లో ఆడియో ఫుటేజీ తప్పనిసరి
న్యూఢిల్లీ: పోలీస్ స్టేషన్లలోని సీసీటీవీల్లో వీడియోతో పాటు ఆడియో రికార్డింగ్ సదుపాయం కూడా తప్పనిసరిగా ఉండాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ‘‘లాకప్‌లు, కారిడార్లు, లాబీలు, రిసెప్షన్ ప్రాంతం, వరండాలు, ఔట్హౌస్లు, ఇన్స్పెక్టర్ చాంబర్ వంటి అన్నిచోట్లా నైట్ కాప్చరింగ్ సదుపాయంతో కూడిన వీడియోతో పాటు ఆడియో రికార్డింగ్ తప్పనిసరని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. ఈ మేరకు అన్ని పోలీస్స్టేషన్లలోనూ సీసీటీవీ వ్యవస్థలను ఆధునీకరించాలని స్పష్టంగా చెప్పింది’’ అని గుర్తు చేసింది. ఢిల్లీలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో ఆడియో రికార్డింగ్ వ్యవస్థ లేకపోవడాన్ని తప్పుబడుతూ కోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. -
పది పరీక్షలు ప్రారంభం.. వచ్చే నెలాఖరుకు ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి మొదలయ్యే పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమైంది. మొత్తం 2,861 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. క్షేత్ర స్థాయి ఏర్పాట్లపై పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఆదివారం వర్చువల్ పద్ధతిలో అధికారులతో సమీక్షించారు. విద్యార్థులకు సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని, అదనపు బల్లలు, ఇతర సౌకర్యాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని.. వాటికయ్యే ఖర్చు పరీక్షల విభాగం భరిస్తుందని తెలిపారు. తర్వాత ‘సాక్షి’ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. పరీక్షల ఫలితాలను ఎట్టి పరిస్థితుల్లో జూన్ నెలాఖరుకు వెల్లడించాలని నిర్ణయించామన్నారు. వీలైనంత త్వరగా మార్కుల మెమోలు కూడా అందే ఏర్పాటు చేస్తామన్నారు. జూన్ 2 నుంచి సమాధాన పత్రాల మూల్యాంకనం మొదలవుతుందని, పరీక్షలు జరుగుతుండగానే ఇందుకు కసరత్తు మొదలు పెట్టాలని భావిస్తున్నామని చెప్పారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా నిఘా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2,861 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేశారు. చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాను ఏర్పాటు చేసి అక్కడ ప్రశ్నపత్రాల బండిల్‌ను ఓపెన్ చేస్తారు. సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక పోలీసుల పహారా ఉంటుంది. -
ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వైద్యం మరింత మెరుగ్గా అందించేందుకు వీలుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని టీచింగ్ హాస్పటల్స్ మొదలు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకూ అన్నింటిలోనూ సీసీ కెమెరాల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,968 ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో 8,260 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ఆధ్వర్యంలో టెండర్లను ఆహ్వానించారు. టెండర్ల గడువు ఈ నెల 18తో ముగియనుంది. సాంకేతిక, ఫైనాన్స్ బిడ్ల అనంతరం అర్హత కలిగిన సంస్థకు పనులను అప్పగించనున్నారు. కాంట్రాక్టును దక్కించుకున్న 2 నెలల్లోగా పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక్కో టీచింగ్ ఆస్పత్రిలో 20 కెమెరాలు రాష్ట్రవ్యాప్తంగా 20 టీచింగ్ ఆస్పత్రులు, 17 జిల్లా ఆస్పత్రులు, 48 ఏరియా ఆస్పత్రులు, 178 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ), 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), 560 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (యుపీహెచ్సీ)లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులోనూ ఒక్కో టీచింగ్ ఆస్పత్రిలో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుండగా.. జిల్లా ఆస్పత్రులలో 16, ఏరియా ఆస్పత్రిలో 8 చొప్పున బిగించనున్నారు. ఇక పీహెచ్సీలో 4, యుపీహెచ్‌సీలో 2 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 8,260 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. నిబంధనలు ఇవీ.! ► టెండర్ దక్కించుకున్న రెండు నెలల్లోగా పని పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ► ఇక సీసీ కెమెరా రికార్డింగ్ బ్యాకప్ నెల రోజుల పాటు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ► పనులు దక్కించుకున్న సంస్థ రెండేళ్ల పాటు నిర్వహణను చేపట్టాలని నిబంధన విధించారు. ► సీసీ కెమెరాల నిర్వహణలో ఏదైనా సమస్య వస్తే 24 గంటల్లోగా పరిష్కరించాలి. ఒకవేళ 24 గంటల్లోగా సమస్యను పరిష్కరించకపోతే పెనాల్టీ కూడా విధించనున్నారు. -
ఒంటరి జీవితం.. మహిళలు, యువతులపై వికృత చేష్టలు
నల్లగొండ: జిల్లా కేంద్రంలో మహిళలు, యువతులు, విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ చాకచక్యంగా తప్పించుకుంటున్న సైకోను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గుర్తుతెలియని వ్యక్తి వికృత ప్రవర్తనపై ‘నీలగిరిలో సైకో వీరంగం’ శీర్షికన ఈనెల 26న సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ రెమా రాజేశ్వరి ఆదేశాలతో టూటౌన్ ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు పాతబస్తీ హిందూపూర్‌కు చెందిన కుమిరిల సతీష్‌గా గుర్తించారు. ఎన్జీ కళాశాల సమీపంలో తచ్చాడుతుండగా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వివరాలను సోమవారం టౌటూన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. హిందూపూర్ ప్రాంతానికి చెందిన సతీష్ 2007లో బీఎస్పీ, బీఈడీ పూర్తి చేశాడు. అనంతరం మునుగోడు రోడ్డులోని పీఎల్ఎన్ మెమోరియల్ స్కూల్లో 2009–2011వరకు, శివాజీనగర్‌లోని ఏకలవ్య పాఠశాలలో 2011–2012 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. మహిళలపై ద్వేషం పెంచుకుని.. సతీష్‌కు 2012 ఏప్రిల్ 25న వేములపల్లి మండలంలోని వేములపాడు గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో ఎనిమిది మాసాలకే భార్య సతీష్‌ను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి ఒంటరి జీవితం గడుపుతున్న సతీష్ మహిళలపై ద్వేషం పెంచుకుని అకృత్యాలకు పాల్పడుతున్నాడని డీఎస్పీ వివరించారు. సతీష్ చిన్నతనం నుంచే అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపారు. 1999లో సమీప బంధువుతోనే వికృతంగా ప్రవర్తించి జైలుకు వెళ్లాడని తెలిపారు. అధ్యాపకురాలి ఫిర్యాదుతో.. ఒంటరిగా వెళ్తున్న మహిళలు, ఇళ్ల ముందు ముగ్గురులు వేస్తుండగా, వాకింగ్ వెళ్తుండగా, పాఠశాలలు, కళాశాలకు వెళ్తున్న విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని సతీష్ కొద్ది రోజులుగా అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. పరువు పోతుందన్న కారణంతో ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు. అయితే ఈ నెల 24న మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన ఓ అధ్యాపకురాలితో కూడా సతీష్ అసభ్యంగా ప్రవర్తించడంతో టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసును ఛేదించిన సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి, సిబ్బంది శంశుద్దీన్, శంకర్, బాలకోటి, గోపయ్యలను డీఎస్పీ అభినందించారు. వేధిస్తే కఠిన చర్యలు : ఎస్పీ మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రెమా రాజేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆకతాయిల ఆగడాలను కట్టడి చేసి మహిళలకు భరోసా, స్వేచ్ఛ ఇచ్చేందుకు పోలీసు శాఖ , షీ టీం బృందాలు అండగా ఉంటాయన్నారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే డయల్ 100, షీ టీం పోలీసుల నంబర్ 9963393970 సమాచారం ఇవ్వాలని కోరారు. వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. -
నేరాలపై మూడో కన్ను!
సాక్షి, హైదరాబాద్: హత్యలు, దొంగతనాలు, కిడ్నాపులు, సైబర్ నేరాలు.. ఇలా నేరం ఏదైనాసరే రాష్ట్ర పోలీసుశాఖ చిటికెలో తేల్చేస్తోంది. భారీ సంఖ్యలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలు ఓవైపు, అత్యాధునిక టెక్నాలజీ మరోవైపు ఆయుధాలు చేసుకుని నేరస్తుల పని పడుతోంది. ఏటా వేలకొద్దీ కేసులను కొన్ని గంటల్లోనే ఛేదిస్తోంది. టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుంటూ.. నేరాలు, ముందు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. సాంకేతికత వినియోగంలో ఏటేటా మరింత ముందుకు వెళుతోంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి యుద్ధప్రాతిపదికన జరుగుతున్న సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యాన్ని మరికొద్ది రోజుల్లో చేరుకోబోతోంది. ఇప్పటివరకు 8.6 లక్షల కెమెరాలు రాష్ట్రంలో 10 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 8.60 లక్షల కెమెరాలను ఏర్పాటు చేశారు. మిగతా వాటిని కూడా కొద్దిరోజుల్లో పూర్తిచేసి.. మొత్తం వ్యవస్థను త్వరలో అందుబాటులోకి రానున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ, ఏం జరిగినా ఈ సెంటర్ నుంచి అప్డేట్ చేసేలా, సమస్యను నిమిషాల్లో పరిష్కరించేలా వ్యవస్థ అందుబాటులోకి రానుందని పోలీస్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు పోలీసు విభాగాల ఆధునీకరణ కూడా కేసుల పరిష్కారానికి మరింత వెన్నుదన్నుగా నిలుస్తోంది. సోషల్ మీడియాలోనూ ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్.. ఇలా పలు వేదికల ద్వారా వచ్చే ఫిర్యాదులు, పోస్టులపైనా పోలీసుశాఖ వేగంగా చర్యలు తీసుకుంటోంది. 2021లో రాష్ట్రవ్యాప్తంగా 1.47 లక్షల పోస్టులపై పోలీస్ శాఖ స్పందించింది. అంతేకాదు ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ దోపిడీ, ఇతర ముందస్తు జాగ్రత్తలు, నిబంధనలపై లక్షల మందికి అవగాహన కల్పించింది. స్కూళ్లు, కాలేజీలు, ఇతర వేదికల ద్వారా 53.5 లక్షల మంది మహిళలు, చిన్నారులకు, సైబర్ నేరాలపై 2.1 లక్షల మందికి అవగాహన కల్పించినట్టు అధికారులు తెలిపారు. అటు కళా బృందాల ద్వారా కూడా లక్షల మందికి వివిధ అంశాలపై అవగాహన కల్పించామని.. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా 10 లక్షల మందిని చేరుకున్నామని వివరించారు. కేసులను వేగంగా ఛేదిస్తూ.. ►ఓవైపు పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలు, మరోవైపు ఆధునీకరించిన విభాగాల పనితీరుతో.. నేరాల అదుపుతోపాటు కేసుల ఛేదింపు పెరుగుతోంది. 2021లో సీసీ కెమెరాల సాయంతోనే ఏకంగా 23 వేల కేసులు ఛేదించినట్టు అధికారులు చెప్తున్నారు. అదే 2020లో సీసీ కెమెరాల ద్వారా ఛేదించిన కేసులు 4,490 మాత్రమే. ►ఇక ఆధునీకరించిన ఫింగర్ ప్రింట్స్ విభాగం ద్వారా 2020లో 300 కేసులను, 2021లో 480 కేసులను ఛేదించారు. వేలిముద్రల ద్వారా 37 గుర్తుతెలియని మృతదేహాలు ఎవరివో తేల్చగలిగారు. ►మొబైల్ యాప్ ద్వారా 2020లో 3,100 అనుమానితులను గుర్తించగా.. 2021లో 5,624 మంది అనుమానితులను గుర్తించారు. ►బాధితులకు త్వరగా న్యాయం జరిగేందుకు నమోదు చేసే జీరో ఎఫ్‌ఐఆర్‌లూ పెరుగుతున్నాయి. 2020లో 517 జీరో ఎఫ్ఐఆర్లు చేయగా, 2021లో 838 నమోదైనట్టు అధికారులు తెలిపారు. ►బాధితులు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు రాకుండానే ఆన్లైన్ ద్వారా దాఖలు చేస్తున్న ఫిర్యాదుల సంఖ్య కూడా పెరిగింది. ఇలా 2020లో 2,626 ఫిర్యాదులు అందగా.. 2021లో ఏకంగా 10,656 ఫిర్యాదులు ఆన్లైన్లో అందినట్టు అధికారులు వెల్లడించారు. ►ఇక మొబైల్ యాప్ హ్యాక్ ఐ ద్వారా 83,355 ఫిర్యాదులు అందగా, డయల్ 100 ద్వారా 11.24 లక్షల కాల్స్‌ను పోలీస్ సిబ్బంది అందుకున్నారు. ►సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కింద ఏర్పాటు చేసిన సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ద్వారా 808 కేసుల్లో 426 కేసులను ఛేదించారు. ►మొబైల్ క్లూస్ టీంల ద్వారా 2,969 ఘటనల్లో 1,638 కేసులను తేల్చారు. ►‘వీడియో ఎన్హాన్స్మెంట్ ల్యాబ్’ద్వారా వివిధ ఘటనలకు చెందిన 7,460 వీడియోల్లో.. 2,283 వీడియోలను బాగా మెరుగుపర్చి కేసుల దర్యాప్తులో వినియోగించారు. ►డేటా అనలిటిక్స్ యూనిట్ ద్వారా 37,563 కేసులను తేల్చారు. ►నాన్ బెయిలబుల్ వారెంట్లు వచ్చి తప్పించుకు తిరుగుతున్న 94మంది నిందితులను ‘పాపిలాన్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్’ద్వారా పట్టుకున్నారు. -
సీసీ కెమెరాల ఏర్పాటుపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా షెల్టర్ హోమ్స్, మదర్సాలు, ఠాణాలు, జువైనల్ హోమ్లాంటి ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి తీసుకున్న చర్యలను వివరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్స్టేషన్లు ఇతర ముఖ్య కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. -
ముంబైలో మరో 7 వేల సీసీ కెమెరాలు.. ఎందుకంటే?
సాక్షి, ముంబై: మహిళలు, ఆడ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని ముంబైలో అదనంగా మరో 7 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి సతేజ్ పాటిల్ వెల్లడించారు. ఏటా ముంబైలో వందలాది మంది ఆడ పిల్లలు అదృశ్యమవుతున్నారు. గడిచిన మూడేళ్లలో 3,519 మంది ఆడ పిల్లలు అదృశ్యమయ్యారు. ఆధారాలు, సీసీ కెమెరాలు అనేక చోట్ల లేకపోవడంతో వారి ఆచూకీ లభించడం లేదు. ఫలితంగా ఆ అదృశ్యమైన కేసులు చేధించడంలో పోలీసులు సఫలీకృతం కాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నగరంలో ఉన్న 5 వేల సీసీ కెమెరాలకు అదనంగా మరో 7 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సతేజ్ పాటిల్ వివరించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇదే క్రమంలో నగరంలో నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. పరీక్ష తప్పడంతో తల్లిదండ్రులు మందలించారని కొందరు, గొడవ పడి, ప్రేమలో పడి మరికొందరు ఇళ్ల నుంచి పారిపోతారు. ఆ తరువాత ఇంటికి వెళ్లలేక, ఎక్కడికెళ్లాలో తెలియక రోడ్లపై, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్ ఆవరణల్లో, ప్లాట్‌ఫారాలపై తిరుగుతుంటారు. ఆ తరువాత ఎవరి మాయలోనో పడి అదృశ్యమవుతారు. (చదవండి: 15-18 యేళ్ల వయసు వారికి జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్!) ఇలాంటి కేసులు నిత్యం ముంబైలోని వివిధ పోలీసు స్టేషన్లలో నమోదవుతూనే ఉంటాయి. ఇందులో కొన్ని కేసులను పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా చేధిస్తారు. మరికొన్ని కేసులు ఆధారాలు లేక అలాగే పెండింగులో ఉంటాయి. దీంతో అదనంగా మరిన్ని సీసీ కెమెరాలు అమర్చితే అదృశ్యమైన యువతులు, బాలికలు ఎలా వెళ్లారు, ఏ మార్గంలో వెళ్లారో ఆచూకీ వెంటనే కనుక్కొని కేసులను సత్వరమే పరిష్కరించవచ్చని సతేజ్ పాటిల్ అభిప్రాయపడ్డారు. కేసులు చేధించకపోవడంతో ఇప్పటికే అనేక రంగాల నుంచి పోలీసు శాఖ విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక అలాంటి అవకాశం ఇవ్వకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. (చదవండి: పరిస్థితి చేయి దాటుతోందా? ఒక్క రోజులోనే లక్ష కోవిడ్ పాజిటివ్ కేసులు..) -
డబ్బు విత్డ్రాకావట్లేదని ఏటీఎమ్‌నే ఎత్తుకెళ్లారు!
ఆగ్రా: ఏటీఎమ్‌లో డబ్బు డ్రా కాలేదనీ మిషన్‌ను కారులో యంత్రాన్ని ఎత్తుకెళ్లారు! ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో వెలుగుచూసిన ఈ షాకింగ్ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా చోరీకి గురైన ఏటీఎం ఉన్న గదిలో యంత్రం తప్ప ఎక్కడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సమీపంలో అమర్చిన కెమెరాల ఫుటేజీని పోలీసులు స్కాన్ చేస్తున్నారని, పోలీసులు వచ్చేలోపే ఏటీఎంను కారులో ఎక్కించుకుని దుండగులు పారిపోయారని తెలిపారు. ఏటీఎంలో 8 లక్షల 30 వేల రూపాయలు ఉన్నాయని ఎస్ఎస్పీ సుధీర్ కుమార్ సింగ్ మీడియాకు తెలిపారు. నిజానికి దుండగులు మొదట ఏటీఎంలో డబ్బు డ్రా చేయడానికి ప్రయత్నించారు. విఫలమవ్వడంతో యంత్రాన్ని కారులో తమతోపాటు తీసుకెళ్లారు. ఈ ఘటనపై తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దుండగుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నామని ఆయన అన్నారు. చదవండి: Omicron variant of COVID-19: లాక్‌డౌన్‌పై ఆరోగ్య శాఖ కీలక వ్యాఖ్యలు -
గుడిలో నగలకు 'డిజిటల్' బందోబస్త్
సాక్షి, అమరావతి: అన్ని ఆలయాల్లోని ఆభరణాల విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి పారదర్శకత, మరింత భద్రత కల్పించేందుకు దేవదాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. స్వామివారు, అమ్మవారి అలంకరణ కోసం ఉండే బంగారు, వెండి ఆభరణాలతోపాటు అన్ని రకాల నగల వివరాలతో జనవరి 15కల్లా ప్రతి గుడిలో డిజిటల్ ఆల్బమ్‌లు రూపొందించుకోవాలని ఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పటిష్టంగా అమలు చేస్తున్న పలు అంశాలను రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో అమలుకు దేవదాయశాఖ వివిధ స్థాయి అధికారులతో ఇటీవల పునశ్చరణ కార్యక్రమం నిర్వహించింది. ఆ సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ఇటీవల ఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. అవేమిటంటే.. ప్రతి ఆలయంలో ఐదు రకాల రిజిస్టర్లు.. ► ప్రతి ఆభరణాన్ని డిజిటల్ చేయడానికి అన్ని కోణాల నుంచి ఫొటోలు తీయాలి. ► బంగారం, వెండికి సంబంధించిన ప్రతి ఆభరణం పేరు, దేవదాయశాఖ ఆ ఆభరణానికి కేటాయించిన నంబరు, దాని బరువు తదితర వివరాలన్నీ ఆ ఫొటోలలో కనిపించాలి. ► ఆలయాల్లో అలంకరణలకు ఉపయోగించని బంగారాన్ని గోల్డ్ బాండ్ పథకంలో బాండ్‌గా మార్పిడి చేసుకోవాలి. ► అభరణాలన్నింటికీ క్రమం తప్పకుండా బీమా చేయించాలి. ► కనీసం మూడేళ్లకొకసారైనా దేవదాయ శాఖలోని జ్యుయలరీ వెరిఫికేషన్ అధికారి (జేవీవో)లు ఆలయాల వారీగా ఆభరణాలకు తనిఖీలు నిర్వహించాలి. ► ఆభరణాలకు సంబంధించి ప్రతి ఆలయంలోనూ ఐదు రకాల రిజిస్టర్లను నిర్వహించాలి. అభరణాల అంచనా రిజిస్టర్, ఆభరణాల వారీగా నంబరు, వాటి బరువుకు సంబంధించి ఇన్వెంటరీ రిజిస్టర్, అర్చక కస్టడీ రిజిస్టర్, ఈవో కస్టడి రిజిస్టర్, బ్యాంకు లాకర్‌కు సంబంధించిన రిజిస్టర్లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయాలి. ► ఆభరణాలు, వాటి భద్రత విషయంలోనూ ఈవోలు పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలి. ఘాట్ రోడ్లపై మూడు చక్రాల వాహనాలకు బ్రేక్.. ► అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు, 24 గంటల పాటు వాటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒకరికి బాధ్యత అప్పగించాలి. ► ఆలయ భద్రతకు కేటాయించిన సిబ్బందితో పాటు ఈవోలు శాశ్వత ప్రాతిపదికన వాకీటాకీలను ఏర్పాటు చేసుకోవాలి. ► కొండ మీద ఆలయాలు ఉన్న చోట ఘాట్ రోడ్డుపై ఆటోలు వంటి మూడు చక్రాల వాహనాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. ► భక్తులు మంచి నీటి కోసం ప్లాస్టిక్ బాటిళ్లు ఉపయోగించాల్సిన అవసరం లేకుండా ఆలయాల్లో పూర్తి స్థాయిలో శుద్ధిచేసిన నీటి సరఫరా పాయింట్లను ఏర్పాటు చేసుకోవాలి. -
బ్యాంక్ లాకర్.. కాదా బేఫికర్?
బ్యాంకు లాకర్లో విలువైన వాటిని ఉంచేస్తే.. ఎటువంటి భయం లేకుండా ఇంట్లో ప్రశాంతంగా నిద్రించొచ్చని భావించడం పొరపాటే. లాకర్ల విషయంలో బ్యాంకుల బాధ్యత కూడా పరిమితమే. సుప్రీంకోర్టు ఒక కేసు విచారణ సందర్భంగా ఇచి్చన ఆదేశాల నేపథ్యంలో ఆర్బీఐ ఇటీవలే లాకర్లకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. లాకర్లో ఉంచిన వాటిని దోపిడీ లేదా దొంగతనం చేస్తే? లాకర్ కీ కనిపించకుండా పోతే? లాకర్ అద్దె చెల్లించకపోతే? ఇలా ఎన్నో ప్రశ్నలకు జవాబులను లాకర్ హోల్డర్లు తెలుసుకోవడం ఎంతో అవసరం. ఈ వివరాలతో కూడిన ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది.. లాకర్ అంటే? ఇది ఒక ఖాతా వంటిది. విలువైన వస్తువులు.. ఆభరణాలు, డాక్యుమెంట్లను ఇందులో ఉంచు కోవచ్చు. రెండు కీలు(తాళం చెవులు) ఉంటాయి. అందులో ఒక టి బ్యాంకు దగ్గర, రెండోది లాకర్ దారుని వద్ద ఉంటాయి. ఏదో ఒక కీ సాయంతో లాకర్‌ను తెరవడం సాధ్యం కాదు. రెండు కీలు ఉంటేనే అది సాధ్యపడుతుంది. బ్యాంకు ఉద్యోగి తొలుత తన దగ్గరున్న కీతో లాకర్ రూమ్‌ను తెరుస్తారు. ఆ తర్వాత లాకర్హోల్డర్ తన దగ్గరున్న కీ సాయంతో లాకర్‌ను వినియోగించుకోవడం సాధ్యపడుతుంది. బ్యాంకులు భద్రతాపరంగా అధిక నాణ్యతతో కూడిన లాకర్లను వినియోగిస్తుంటాయి. అందుకే వీటిని సేఫ్ డిపాజిట్ లాకర్లుగా పిలుస్తుంటారు. ఎవరైనా అర్హులే.. మీకు సమీపంలోని బ్యాంకు శాఖలో లాకర్ సదుపాయాన్ని పొందొచ్చు. ఆ బ్యాంకు శాఖలో ఖాతా లేకపోయినా ఫర్వాలేదు. గతంలో తమ ఖాతాదారులకే బ్యాంకులు ఈ సదుపాయం అందించేవి. కానీ, ఎవరికైనా ఈ సేవలు అందించాలని ఆర్బీఐ 2021 ఆగస్ట్ 18 నాటి ఆదేశాల్లో పేర్కొంది. ఒకవేళ లాకర్ ఖాళీగా లేకుంటే.. దరఖాస్తుదారులతో ఒక వేచి ఉండే జాబితాను నిర్వహిస్తూ.. ఖాళీ అయిన వాటిని వరుస క్రమంలో జాబితాలోని వారికి తప్పనిసరిగా కేటాయించాలి. చట్టవిరుద్ధమైనవి, ప్రమాదకరమైన వాటిని లాకర్లో ఉంచనంటూ ధ్రువీకరణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు లాకర్ అగ్రిమెంట్‌పై సంతకం చేయాలి. బాధ్యతలు, హక్కుల వివరాలు ఇందులో ఉంటాయి. ఈ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే.. బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారాన్ని కలిగి ఉంటాయి. నూతన లాకర్ ఒప్పందంపై ప్రస్తుత లాకర్ హోల్డర్లు సైతం 2023 జనవరి 1 నాటికి సంతకం చేయాల్సి ఉంటుంది. అద్దె బ్యాంకులు లాకర్ అద్దెను వార్షికంగా ఒక సారి వసూలు చేస్తుంటాయి. అంతేకాదు, లాకర్ కోసం డిపాజిట్ కూడా చేయాలని కోరుతుంటాయి. ఎందుకంటే లాకర్ అద్దె చెల్లించకపోతే.. డిపాజిట్ నుంచి మినహాయించుకునేందుకు అలా చేస్తాయి. మూడేళ్ల కాలానికి లాకర్ అద్దెతోపాటు, లాకర్‌ను తెరవాల్సి వస్తే అయ్యే చార్జీలను కలిపి ఆ మేరకు డిపాజిట్‌గా తీసుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అధికారం కలి్పంచింది. ఇంతకుమించి డిపాజిట్ చేయాలని బ్యాంకులు కోరడానికి వీల్లేదు. అలాగే, లాకర్ కోసం డిపాజిట్ అన్నది తప్పనిసరి కాదు. బ్యాంకులో అప్పటికే కొన్నేళ్లుగా ఖాతా నిర్వహిస్తున్నట్టయితే మీ చరిత్ర ఆధారంగా బ్యాంకులు డిపాజిట్ నుంచి మినహాయింపును ఇవ్వొచ్చు. లాకర్‌ను స్వా«దీనం చేసేస్తే తిరిగి ఈ డిపాజిట్‌ను వెనక్కి పొందొచ్చు. ఇంటికి లేదా కార్యాలయానికి సమీపంలోని బ్యాంకు శాఖలో సౌకర్యం కోసం లాకర్‌ను తెరిచిన తర్వాత.. అనూహ్య కారణాలతో ఆయా బ్యాంకు శాఖను వేరే ప్రాంతానికి మార్చాల్సి వచి్చనా.. లేదా వేరే బ్యాంకుతో విలీనం అయిన సందర్భాల్లో లాకర్ హోల్డర్లకు రెండు నెలల వ్యవధిని బ్యాంకులు ఇస్తాయి. లాకర్‌ను బ్యాంకుతోపాటే మార్చుకోవచ్చు. లేదా మూసేయవచ్చు. అద్దె చెల్లించకపోతే? వరుసగా మూడు సంవత్సరాల పాటు లాకర్ అద్దె చెల్లించకపోతే.. ఆయా లాకర్లను బలవంతంగా తెరిచేందుకు బ్యాంకులకు అధికారం ఉంటుంది. కాకపోతే దీనికంటే ముందు బ్యాంకు తన ఖాతాదారుకు ఇదే విషయమై సమాచారం (నోటీస్) కూడా ఇస్తాయి. ఈ మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సందేశం ఇస్తాయి. నోటీసును స్వీకరించకుండా, మెయిల్, ఎస్ఎంఎస్కు స్పందన రాకపోతే.. అప్పుడు దినపత్రికల్లో పబ్లిక్ నోటీస్ జారీ చేస్తాయి. తగినంత సమయం ఇచ్చిన తర్వాత అప్పటికీ ఎవరి నుంచి స్పందన రాకపోతే.. బ్యాంకు అధికారి, ఇద్దరు సాక్షుల సమక్షంలో లాకర్‌ను తెరుస్తారు. ఈ ప్రక్రియను వీడియో కూడా తీస్తాయి. భవిష్యత్తులో కోర్టుల్లో కేసులు నమోదైతే వీటిని సాక్ష్యాలుగా బ్యాంకు సమరి్పస్తుంది. నగదు సహా లాకర్లో ఉన్న వాటిని సీల్ చేసి భద్రంగా ఉంచుతాయి. నిర్వహణ ఖాతాదారులు లాకర్లను తెరిచి, చూసుకునే సమయంలో వారికంటూ గోప్యత ఉండేలా బ్యాంకులు చూడాలి. అంతేకాదు లాకర్‌ను వినియోగించుకున్న రోజు అందుకు సంబంధించి ఈ మెయిల్, ఎస్ఎంఎస్ అలర్ట్‌లను కూడా బ్యాంకులు ఇక మీదట తప్పకుండా పంపించాలి. తేదీ, సమయం వివరాలు అందులో ఉంటాయి. దీంతో ఒకవేళ తను కాకుండా, మరొకరు లాకర్‌ను యాక్సెస్ చేస్తే ఖాతాదారు అప్రమత్తం అయ్యేందుకే ఈ ఏర్పాటు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తెరిచే అవకాశం లేకపోలేదు. ఒకవేళ ఖాతాదారు ప్రమేయం లేకుండా లాకర్ యాక్సెస్ జరిగి ఉంటే.. అందుకు ఫిర్యాదుల పరిష్కార యంత్రంగా కూడా ఉంటుంది. లాకర్ దారులు వాటిని తెరిచి, మూసేసి వెళ్లిన తర్వాత బ్యాంకు కస్టోడియన్ ఆయా లాకర్లను విధిగా పరీక్షించాలి. ఏదైనా సందర్భంలో లాకర్‌ను తెరిచి, తిరిగి సరిగ్గా క్లోజ్ చేయకుండా వెళ్లి ఉంటే.. బ్యాంకు కస్టోడియన్ వాటిని క్లోజ్ చేయాలి. అదే విషయాన్ని రిజిస్టర్లో నమోదు చేయడంతోపాటు.. ఖాతాదారుకు తెలియజేయాలి. లాకర్దారు మరణిస్తే..? లాకర్లకు సంబంధించి నామినేషన్, లాకర్ హోల్డర్ మరణానికి గురైతే.. లాకర్లలో ఉన్న వాటిని నామినీలకు అందించే విషయమైన ప్రతీ బ్యాంకు తగిన విధానాన్ని కలిగి ఉంటుంది. అవసరమైన ధ్రువీకరణ పత్రాలను నామినీ సమరి్పంచినట్టయితే లాకర్లలో ఉన్నవాటిని పొందేందుకు బ్యాంకులు అనుమతిస్తాయి. నామినీ నమోదై లేకపోతే.. చట్టబద్ధమైన వారసులకు నిబంధనల మేరకు అందిస్తాయి. క్లెయిమ్‌తోపాటు అవసరమైన అన్ని పత్రాలు అందిన నాటి నుంచి 15 పనిదినాల్లో బ్యాంకులు వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది. బ్రేక్ చేయొచ్చు.. ఖాతాదారు లాకర్ కీ పోయిందని అభ్యర్థన పెట్టుకున్నప్పుడు, లాకర్ జప్తునకు సంబంధించి కోర్టుల ఆదేశాలతో దర్యాప్తు అధికారులు బ్యాంకును సంప్రదించిన సందర్భాల్లోనూ లాకర్‌ను తెరుస్తారు. లాకర్దారు నిబంధనలను పాటించని సందర్భాల్లోనూ ఇదే చోటు చేసుకుం టుంది. లాకర్ల విషయంలో బ్యాంకుల బాధ్యత ప్రకృతి విపత్తుల వల్ల (భూకంపాలు, వరదలు తదితర) లాకర్లలోని వాటికి నష్టం కలిగితే బ్యాంకులు ఎటువంటి పరిహారాన్ని చెల్లించవు. ఖాతాదారుల నిర్లక్ష్యం వల్ల వాటిల్లే నష్టానికి సైతం చెల్లింపులు చేయవు. అగ్ని ప్రమాదం, దొంగతనం, దోపిడీ, భవనం కుప్పకూలిపోవడం, బ్యాంకు ఉద్యోగి మోసం వల్ల లాకర్లలోని వాటికి నష్టం వాటిల్లితే చెల్లింపుల బాధ్యత బ్యాంకులపై ఉంటుంది. ఎందుకంటే చోరీలు, అగ్ని ప్రమాదాల నష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకుపై ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మాత్రం తమకు సంబంధం లేదని బ్యాంకులు చెప్పడానికి లేదు. లాకర్‌కు వార్షికంగా వసూలు చేసే అద్దెకు గరిష్టంగా 100 రెట్ల పరిహారాన్ని బ్యాంకులు చెల్లించగలవు. ఉదాహరణకు లాకర్ అద్దె రూ.2,000 ఉందనుకుంటే రూ.2లక్షలు పరిహారంగా లభిస్తుంది. ఎందుకంటే లాకర్లలో ఏవి ఉంచుతున్నారు, తిరిగి ఏవి తీసుకెళుతున్నారు? ఇటువంటి వివరాలను బ్యాంకులు నమోదు చేయవు. ఖాతాదారుల గోప్యతకు భంగం కలగకుండా చూడడంలో భాగంగా ఈ పనికి దూరంగా ఉంటాయి. అటువంటప్పుడు ఫలానావి పోయాయని నిర్ధారించడానికి అవకాశం ఉండదు. కనుక లాకర్ అద్దెకు 100 రెట్లకే పరిహారాన్ని పరిమితం చేసింది ఆర్బీఐ. లాకర్లకు సంబంధించి బ్యాంకులు బీమా కవరేజీని కూడా అందించడం లేదు. లాకర్లలో భద్రత? బ్యాంకు లాకర్లను ఏర్పాటు చేసిన చోట తగినంత భద్రతా చర్యలు తీసుకోవడం బాధ్యతల్లో భాగమే. లాకర్ గది/వాల్ట్‌కు ఒక్కటే ప్రవేశం, వెలుపలి ద్వారం ఉండాలి. వర్షాలు, వరదలు వచి్చనాకానీ లాకర్లు దెబ్బతినకుండా చూడాలి. అగ్ని ప్రమాదాలకు అవకాశం లేని విధంగా.. ఆ రిస్క్‌ను తగ్గించే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది. ఈ ప్రమాదాల రిస్‌్కను తగ్గించేందుకు బ్యాంకు ఉద్యోగులు నిపుణులతో కలసి ఇంజనీరింగ్/భద్రతా పరిస్థితులను సమీక్షించి, అవసరమైన చర్యలు తీసుకుంటూ ఉండాలి. అంతేకాదు లాకర్లకు ఎప్పుడూ కూడా తగినంత రక్షణ కూడా ఏర్పాటు చేయాలి. లాకర్ ఆవరణలోకి వెళ్లి, వచ్చే వారిని కవర్ చేసేందుకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. 180 రోజుల సీసీటీవీ కెమెరా రికార్డులను ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. తన లాకర్‌ను తన ప్రమేయం లేకుండా ఓపెన్ చేశారని, లాకర్లో ఉంచినవి కనిపించడం లేదని ఖాతాదారు ఫిర్యాదు చేసిన సందర్భంలో దర్యాప్తునకు ఈ సీసీటీవీ కెమెరా రికార్డులు ఆధారంగా పనిచేస్తాయి. బ్యాంకులు ఏర్పాటు చేసే మెకానికల్ లాకర్లు భారత ప్రమా ణాల మండలి (బీఐఎస్) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఎలక్ట్రానిక్‌గా తెరిచే లాకర్లకు పూర్తి సైబర్ భద్రత ఉండాలి. కీ కోల్పోతే..? బ్యాంకు ఇచ్చిన లాకర్ కీని ఎక్కడైన పోగొట్టుకున్నట్టు అయితే వెంటనే ఆ విషయాన్ని బ్యాంకుకు తెలియజేయాలి. కనిపించకుండా పోయిన కీ తిరిగి భవిష్యత్తులో ఎప్పుడైనా లభిస్తే బ్యాంకుకు స్వాధీనం చేస్తానంటూ లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకు లాకర్‌ను బద్దలు కొట్టడం, తిరిగి కొత్త కీ ఏర్పాటు చేసేందుకు అయ్యే చార్జీలన్నింటినీ ఖాతాదారే భరించాల్సి వస్తుంది. ఈ ప్రక్రియను అంతా ఖాతాదారు సమక్షంలోనే బ్యాంకులు టెక్నీషియన్లతో నిర్వహిస్తాయి. ఎందుకంటే లాకర్లో ఉన్న వాటికి నష్టం వాటిల్లలేదన్న భరోసా ఖాతాదారుకు ఉండాలి కనుక. -
విజయవాడలో గట్టి భద్రతా ఏర్పాట్లపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
-
మద్యం షాపుల్లో అక్రమాలకు చెక్
సాక్షి, అమరావతి: మద్యం దుకాణాల్లో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రెవెన్యూ శాఖ(ఎక్సైజ్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇటీవల ఏపీ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీకి ఆదేశాలు జారీ చేశారు. మద్యం దుకాణాల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను జిల్లా కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేస్తారు. తద్వారా మద్యం దుకాణాల్లో విక్రయాలు సజావుగా జరుగుతున్నాయా, లేదా అనే విషయాన్ని జిల్లా కంట్రోల్ రూమ్‌ల నుంచి పర్యవేక్షిస్తారు. విక్రయాల్లో ఏదైనా అవకతవకలు జరిగితే ఆ విషయం సీసీ కెమెరాల ద్వారా తెలిసిపోతుంది. మద్యం బాటిల్స్ లేబుల్స్‌ను తప్పనిసరిగా స్కాన్ చేయాల్సి ఉంటుంది. అలాగే దుకాణాల్లో మద్యం విక్రయించే వ్యక్తుల నుంచి రెండు సెక్యూరిటీలను తీసుకోనున్నారు. ఒకవేళ ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలు జరిగితే.. విక్రయించే వ్యక్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మద్యం దుకాణాల్లోని లావాదేవీలను ప్రతి నెలా ప్రత్యేకంగా ఆడిట్ నిర్వహిస్తారు. సంబంధిత నోడల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ క్రమం తప్పకుండా దుకాణాలను తనిఖీ చేయాలి. ఏమైనా అక్రమాలు జరిగితే తెలియజేసేందుకు వీలుగా మద్యం దుకాణాల వద్ద స్థానిక ఎక్సైజ్ అధికారి ఫోన్ నంబర్‌ను తప్పనిసరిగా ఉంచాలి. మద్యం విక్రయించే వ్యక్తులు ఎవ్వరైనా తప్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నారని అనుమానం వస్తే.. వారిని బదిలీ చేయనున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం దశల వారీ మద్య నియంత్రణలో భాగంగా ఇప్పటికే 33 శాతం మద్యం దుకాణాలను తగ్గించింది. 43 వేల బెల్ట్ షాపులను రద్దు చేసింది. అలాగే పర్మిట్టు రూమ్‌లను రద్దు చేసింది. ప్రత్యేకంగా మద్యం అక్రమాలను అరికట్టేందుకు, మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. అక్రమ మద్యం వ్యవహారాలను నిరోధించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ)ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే అక్రమ మద్యం వ్యవహారాలకు సంబంధించి 15 వేల కేసులు నమోదు చేశారు. తాజాగా మద్యం దుకాణాల్లోనూ ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటోంది. -
నంది విగ్రహం ధ్వంసం కేసులో.. ముఠా గుట్టు రట్టు
వత్సవాయి/పెనుగంచిప్రోలు/నందిగామ: కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలోని పార్వతీ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో గతేడాది సెప్టెంబర్ 10న నంది విగ్రహం ధ్వంసం చేసిన కేసును పోలీసులు ఛేదించారు. గుప్త నిధుల కోసమే ఓ ముఠా ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు తేల్చారు. ఇందుకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, డీఎస్పీ నాగేశ్వరరెడ్డిలతో కలిసి కృష్ణాజిల్లా నందిగామ డీఎస్పీ కార్యాలయంలో రాష్ట్ర సిట్ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. అవి.. ఆలయాల్లో గుప్త నిధులు ఉంటాయనే నమ్మకంతో ఏడుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లోని పురాతన ఆలయాల్లో రెక్కీ నిర్వహించారు. ఇదే క్రమంలో మక్కపేటలోని శివాలయంలో మొదటిసారి ప్రవేశించి నంది విగ్రహం చెవులు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమై సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. అనంతరం.. విగ్రహం పొట్ట భాగంలో విలువైన వజ్రాలున్నాయన్న భావనతో రెండోసారి వచ్చిన ముఠా సభ్యులు గుడిలో పూజ చేయించుకుని వెళ్లిపోయారు. వీరి కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో అర్చకుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సీసీ ఫుటేజి పరిశీలించి విచారణ ప్రారంభించారు. చివరకు.. హైదరాబాద్‌కు చెందిన అనుగొండ్ల శ్రీనివాసరావు, ఇట్టబోయిన విజయ్, మదని రామకృష్ణ, వికారాబాద్ జిల్లాకు చెందిన చిట్యాల కృష్ణయ్య, గంపలగూడెంకు చెందిన అరిపిరాల వెంకటప్పయ్య శాస్త్రిలతోపాటు రంగురాళ్ల వ్యాపారులు నాగేశ్వరరావు, గోపాలరావులను శుక్రవారం అరెస్టుచేశారు. వారి వద్ద పలు ఆలయాల ఫొటోలు, వీడియోలతోపాటు విలువైన సమాచారాన్ని సేకరించారు. రెక్కీ నిర్వహించిన ఆలయాలు ఇవే.. ప్రకాశం జిల్లా పొదిలి శివాలయం, దర్శి సమీపంలోని దేకలకొండపై ఉన్న లక్ష్మీ నృసింహస్వామి ఆలయం, గిద్దలూరు మండలం గుడిమెట్లలోని ఆంజనేయస్వామి ఆలయం, యర్రగొండపాలెంలోని చెన్నకేశవస్వామి ఆలయం, గుంటూరు జిల్లా దుర్గి శివాలయం, వైఎస్సార్ జిల్లా కమలాపురంలోని ఆంజనేయస్వామి ఆలయం, నల్గొండ జిల్లా హాలియా పేరూరు గ్రామంలోని శివాలయం, వరంగల్ జిల్లా రంగసాయిపేటలోని రామాలయంలో గుప్త నిధుల కోసం రెక్కీ నిర్వహించినట్లు విచారణలో తేలిందని సిట్ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. వీరితో పాటు రెండు రాష్ట్రాల్లో గుప్త నిధుల కోసం వేట సాగించే 25 ముఠాల్లోని సుమారు 70 మంది సభ్యులను గుర్తించామన్నారు. కాగా, కేసును ఛేదించేందుకు కీలక సమాచారం అందించిన మక్కపేట శివాలయ అర్చకుడు యుగంధర శర్మను సిట్ అధికారితోపాటు జిల్లా ఎస్పీ సత్కరించారు. అలాగే, కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, పలువురు సిబ్బందిని రివార్డులతో సత్కరించారు. -
సీబీఐ, ఈడీ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు: సుప్రీం
న్యూఢిల్లీ: విచారణ జరిపే, అరెస్ట్ చేసే అధికారాలున్న సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ తదితర అన్ని దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు, ఇతర రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని బుధవారం సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ప్రతీ పోలీస్ స్టేషన్‌లోని ప్రధాన ద్వారం, లోపలికి, బయటకు వెళ్లే మార్గాలు, ఇంటరాగేషన్ సెల్స్, లాకప్ గదులు, కారిడార్లు, రిసెప్షన్ ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాలను అమర్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. మానవ హక్కుల ఉల్లంఘనలను నియంత్రించేందుకు పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని 2018లోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
పార్కుల్లో సీసీటీవీలు..
సాక్షి, హైదరాబాద్: వినోదపు పార్కులు, ఫుడ్‌కోర్టుల్లో సీసీటీవీలు ఏర్పాటుచేసి సందర్శకులు గుంపుగా ఒకేచోటకు చేరకుండా పర్యవేక్షించాలని కేంద్ర ప్రభు త్వం ఆదేశించింది. కరోనా కంటైన్మెంట్ ఏరియాల్లో వినోదపు పార్కులు తెరవ కూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. కరోనా వ్యాప్తి జరగకుండా వినోదపు పార్కుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. వినోద కేంద్రాలకు, పార్కుల్లోకి సందర్శకులు విశ్రాంతి, వినోదం కోసం పెద్దసంఖ్యలో వస్తారు. కాబట్టి కరోనా నివారణ చర్యలు పాటించడం చాలా ముఖ్యమని నొక్కిచెప్పింది. ఇవీ మార్గదర్శకాలు ► కనీసం ఆరడుగుల భౌతికదూరం పాటించాలి. మాస్క్ తప్పనిసరి. చేతులను తరచూ సబ్బుతో కడుక్కోవాలి. లేకుంటే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లను వాడాలి. ఉమ్మివేయడం నిషేధం. ►65 ఏళ్లు పైబడిన, తీవ్రమైన అనారోగ్య సమస్యలున్నవారు, గర్భిణులు, పదేళ్లలోపు పిల్లలు ఇంట్లోనే ఉండాలి. ►పార్కుల్లో పనిచేసే వారిలో అనారోగ్యంతో ఉన్నవారు, వయసు పైబడిన, గర్భిణులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేకుండా విధులు నిర్వహించాలి. ► ఫుడ్‌కోర్టులు ఇతర చోట్ల రద్దీని గుర్తించడానికి íసీసీటీవీలతో పర్యవేక్షించాలి. ► ప్రాంగణం లోపల, వెలుపల భౌతికదూరాన్ని పాటించేలా నేలపై నిర్ధిష్ట గుర్తులుపెట్టాలి. ప్రాంగణం లోపల, వెలుపల క్యూ పాటించాలి. క్యూ, భౌతికదూరం పర్యవేక్షణకు తగినంత మంది సిబ్బందిని నియమించాలి. ► ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో 50 శాతం కంటే ఎక్కువ సీటింగ్ సామర్థ్యం అనుమతించకూడదు. ఫుడ్‌కోర్టు సిబ్బంది లేదా వెయిటర్లు మాస్క్‌లు, గ్లోవ్స్ ధరించాలి. ► మ్యూజియంలు, ఉద్యానవనాలు, ఫుడ్ కోర్టులు, థియేటర్లు మొదలైన వాటితో పాటు డోర్ హ్యాండిల్స్, ఎలివేటర్ బటన్లు, కుర్చీలు, బెంచీలు, అంతస్తులు, గోడలు మొదలైనవాటిని సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రపరచాలి. ► వాష్‌రూమ్‌లలో సబ్బు, ఇతర సాధారణ ప్రాంతాల్లో హ్యాండ్ శానిటైజర్లను తగినంత పరిమాణంలో ఉంచాలి. మాస్క్‌లు, శానిటైజర్లు, సబ్బులు, సోడియం హైపోక్లోరైట్ ద్రావణం, ఇతరత్రా లాజిస్టిక్స్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. ► సందర్శకులు, ఉద్యోగులు ఉపయోగించిన మాస్క్‌లను ప్రత్యేక కవర్ డబ్బాలలో పారవేసేలా ఏర్పాట్లు చేయాలి. ►స్విమ్మింగ్‌పూల్స్‌ను మూసివేయాలి. నీటితో కూడిన వినోదం అందించే పార్కుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటిచోట్ల నీటి వడపోత, క్లోరినేషన్ తప్పనిసరి. ►రద్దీ ఎక్కువుండే వారాంతం, సెలవు రోజుల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ►ఆన్లైన్ టిక్కెట్ సదుపాయాన్ని ప్రోత్సహించాలి. టికెట్లు జారీ చేసేటప్పుడు చేయవలసిన, చేయకూడని సూచనలతో కూడిన కరపత్రాలు పంచాలి. లేదా టికెటట్లపైనే వాటిని ముద్రించవచ్చు. ►సహజ వెలుతురు ఉండాలి. క్రాస్ వెంటిలేషన్ తగినంతగా ఉండాలి. ►ఎవరైనా కోవిడ్ లక్షణాలతో బాధపడుతుంటే పార్కును సందర్శించవద్దని తెలపాలి. కంటైన్మెంట్ జోన్లలో ఉండే వారికి ప్రవేశం లేదు. ► కోవిడ్ హెల్ప్‌లైన్ నంబర్లను, స్థానిక ఆరోగ్య అధికారుల ఫోన్ నంబర్లను ప్రదర్శించాలి. ►ప్రవేశద్వారం వద్ద శానిటైజర్ డిస్పెన్సర్, థర్మల్ స్క్రీనింగ్ తప్పక ఏర్పాటుచేయాలి. ఎగ్జిట్ మార్గాల కోసం వీలైనన్ని గేట్లు ఏర్పాటు చేయాలి. ►వాలెట్ పార్కింగ్ అందుబాటులో ఉంటే మాస్క్‌లు ధరించిన ఆపరేటింగ్ సిబ్బందితో పనిచేయించాలి. వాహనాల స్టీరింగ్, డోర్ హ్యాండిల్స్, కీలు మొదలైన వాటిని శుభ్రపరచాలి. ►పార్క్ ప్రాంగణంలో కుర్చీలు, బెంచీలు మొదలైన వాటి మధ్య ఆరడుగుల దూరం ఉండాలి. ► కాంటాక్ట్‌లెస్ ఆర్డరింగ్ మోడ్, డిజిటల్ మోడ్ చెల్లింపులను ప్రోత్సహించాలి. -
డాక్టర్లపై నిఘా..
సాక్షి, హైదరాబాద్: వైద్య సిబ్బందిపై నిఘా పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది సకాలంలో ఆసుపత్రులకు వెళ్లేలా, రోగు లకు వైద్యం చేసేలా పర్యవేక్షణ చేయాలని భావిస్తోంది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (యూపీ హెచ్‌సీ) సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. తద్వారా హైదరాబాద్ నుంచే సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించ డానికి మార్గం ఏర్పడనుంది. వైద్య సిబ్బంది సకాలంలో ఆసుపత్రికి వస్తు న్నారా లేదా అని పర్యవేక్షించి, అవసరమైతే అప్ర మత్తం చేయడానికి వీలు కలగనుంది. ఇవే కీలకం.. రాష్ట్రంలో వెయ్యి పీహెచ్‌సీలు, యూపీ హెచ్సీలున్నాయి. ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్లు వేయడానికి, ఇతర సాధారణ వైద్యం అందజేయడానికి ఇవి ఎంతో కీలకం. దాదాపు ప్రతీ మండలానికో పీహెచ్సీ ఉంటుంది. పెద్ద మండలాలైతే 2 పీహెచ్‌సీలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పీహెచ్‌సీల్లో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. సీజనల్ వ్యాధుల కాలంలో పీహెచ్‌సీలు కీలకపాత్ర పోషిస్తాయి. అంటువ్యాధులు తీవ్రమైన సందర్భంలో తక్షణ మే స్పందించేలా పీహెచ్‌సీలు వ్యవహరిస్తాయి. ఒక్కో పీహెచ్‌సీల్లో ఒకరు లేదా ఇద్దరు డాక్టర్లుం టారు. నర్సులు, ఇతర సిబ్బంది ఉంటారు. వైద్యుల గైర్హాజరు.. పీహెచ్‌సీల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు స్థానికం గా ఉండటం లేదన్న విమర్శలున్నాయి. సమీప పట్టణాల్లో నివాసముంటూ పీహెచ్‌సీలకు వస్తూ పోతూ ఉంటారు. వారానికి రెండు, మూడు సార్లు మాత్రమే వచ్చేవారు ఎక్కువగా ఉంటా రని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కొందరు డాక్ట ర్లయితే దాదాపు రోజుకు వంద కిలోమీటర్లకు పైగా వెళ్లే వారుంటున్నారు. హైదరాబాద్‌లో ఉం టూ నిజామాబాద్ జిల్లాలోని పీహెచ్‌సీలకు వెళ్లే వైద్యులూ ఉన్నారని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాల సమాచారం. వీరు పట్టణాల్లో ప్రైవేట్ ప్రాక్టీసు చేస్తుండటంతో పీహెచ్‌సీలకు రావడంలేదన్న విమర్శలున్నాయి. ఒకవేళ వచ్చినా ఉద యం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకే వెళ్లిపో తున్నారన్న ఫిర్యాదులు గ్రామాల నుంచి ప్రభు త్వానికి అందాయి. అందుకే వారి కదలికలపైనా ఎప్పటికప్పుడు నిఘా పెట్టేందుకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు.. ఇక హైదరాబాద్ కోఠిలోని ప్రజారోగ్య కార్యాల యంలో అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచే అన్ని పీహెచ్‌సీలకు అను సంధానం చేశారు. కంట్రోల్ రూంలో భారీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఒకేసారి అన్ని పీహెచ్ సీల వైద్యులతో నేరుగా మాట్లాడి అవసరమైన ఆదేశాలివ్వొచ్చు. ఎక్కడైనా అంటు వ్యాధుల వం టివి తీవ్రంగా విజృంభిస్తే ఇక్కడి నుంచే వైద్యు లకు సూచనలిస్తారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎం లతోనూ మాట్లాడే వీలు కల్పించారు. అవసర మైతే జూమ్ మీటింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిస్థాయి కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పా టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే ప్రజారోగ్య కార్యాలయాన్ని అన్ని రకాల హైటెక్ హంగులతో సిద్ధం చేశారు. నిత్యం వచ్చే విజిట ర్లను డైరెక్టర్ నేరుగా కలవకుండానే బయట నుంచే వీడియోకాల్ ద్వారా మాట్లాడే సదుపా యం ఏర్పాటు చేశారు. కరోనా కాలంలో కార్యా లయం లోపలికి వచ్చి జనం గుమిగూడకుండా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రజారోగ్య కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద లాకింగ్ సిస్ట మ్ను ఏర్పాటు చేశారు. డైరెక్టర్ ఆదేశాల మేరకే ఎవరినైనా పంపడానికి వీలుంది. -
ఢిల్లీలో 1.45 లక్షల చైనా సీసీటీవీ కెమెరాలు
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన 1.45 లక్షల సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కార్యక్రమం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఈ సీసీటీవీ కెమెరాలు చైనాకు చెందినవి కావడంతో విమర్శలు వస్తున్నాయి. గల్వాన్ వ్యాలీ ఘర్షణ తర్వాత చైనా వస్తువుల పట్ల దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్‌లను బ్యాన్ చేసింది. అయితే ఎన్నికల హామీల్లో భాగంగా ఢిల్లీ వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం కోసం కేజ్రీవాల్ ప్రభుత్వం చైనాకు చెందిన హిక్విజన్ కంపెనీ నుంచి వీటిని కొనుగోలు చేసింది. సీసీటీవీ కెమెరాల వల్ల నష్టం లేదు కానీ జనాలు లైవ్ ఫీడ్‌ను చూడటం కోసం ఈ కంపెనీ మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. దీనివల్ల పెద్ద నిఘా ప్రమాదం వాటిల్లుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ దీనిపై స్పందిసస్తూ.. కేజ్రీవాల్ ప్రభుత్వ తక్షణమే తప్పు దిద్దుకోవాలని డిమాండ్ చేస్తోంది. కానీ కేజ్రీవాల్ ప్రభుత్వం మాత్రం ఇదంతా రాజకీయం అంటూ కొట్టిపారేసింది. నిపుణుల ఆందోళన ‘సీసీటీవీ కెమెరాల వల్ల ఎలాంటి ముప్పు లేదు. కానీ ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో లైవ్ ఫీడ్ చూడటానికి హిక్ విజన్ ఐవీఎమ్‌ఎస్-4500 యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దాని వల్ల తీవ్రమైన నిఘా ముప్పు ఏర్పడుతుంది’ అని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు అనుజ్ అగర్వాల్ తెలిపారు. అంతేకాక ‘ఈ యాప్‌ను చైనాకు చెందిన కంపెనీ అధికారి, అక్కడి ప్రభుత్వం, చైనా ఆర్మీ సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఢిల్లీ రోడ్లపై ఏమి జరుగుతుందో వారు చూడగలరు. ఈ కెమెరాలకు ఇటువంటి చొరబాట్లను నిరోధించడానికి అవసరమైన ఎలాంటి భద్రతా లక్షణాలు లేవు. అవి చాలా హాని కలిగిస్తాయి’ అన్నారు. (చైనా ట్విట్టర్’ అకౌంట్ మూసేసిన ప్రధాని ) సైబర్ లా నిపుణుడు పవన్ దుగ్గల్ మాట్లాడుతూ.. ‘వివిధ కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ ప్రాంగణాల్లో హిక్విజన్ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో లైవ్ ఫీడ్ పొందడంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఈ ఫీడ్‌ని మనతో పాటు చైనా, ఆ దేశం సైన్యం కూడా యాక్సెస్ చేయగలదు. అది ఆందోళన కలిగించే అంశం. దీనివల్ల దేశ భద్రతకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది’ అన్నారు. హిక్విజన్పై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ సాధనాలను ఉత్పత్తి చేసే ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో నిఘా సంస్థలలో ఒకటైన హిక్విజన్ నుంచి ప్రభుత్వ సంస్థలు ఉత్పత్తులను కొనుగోలు చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిషేధించారు. ఇటీవలి నివేదికల ప్రకారం హిక్విజన్, 19 ఇతర సంస్థలు చైనా మిలిటరీకి చెందినవి లేదా నియంత్రించబడుతున్నట్లు వెల్లడయ్యింది. ఈ కారణంగా హిక్విజన్ సంస్థను కొన్ని యూరోపియన్ దేశాలలో కూడా నిషేధించారు. ఢిల్లీలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ మార్కెట్ భాగీరథి ప్యాలెస్ ఈ చైనా కెమెరాలతో నిండి ఉంది. దీని గురించి సదరు దుకాణ యజమాని మాట్లాడుతూ.. ‘ఈ సీసీటీవీలు ఒక్కొక్క దాని ధర రూ .1,200 నుంచి 3,500 రూపాయల వరకు ఉంటుంది. అందుకే ప్రభుత్వం వీటి కొనుగోలుకు ఆసక్తి చూపింది. కానీ చైనా వస్తువులను బహిష్కరించి దేశీ వస్తువులను వినియోగించేలా ప్రోత్సాహిస్తే బాగుంటుంది’ అన్నారు. ప్రాజెక్ట్ ఎలా ప్రారంభించబడింది ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ అంతటా నివాస, వాణిజ్య సముదాయాలలో 1.5లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని భావించింది. వీటిని కొనుగోలు డిస్పెన్సేషన్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పిడబ్ల్యూడీ)ని ఆదేశించింది. 571 కోట్ల రూపాయల ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, పోలీస్ స్టేషన్లు, కోర్టు ప్రాంగణాలు, మార్కెట్లు, ఇతర సున్నితమైన ప్రాంతాలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతేకాక 'నిగేబాన్' అనే కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా నగరమంతా మరో 2.45 లక్షల సీసీటీవీలు ఏర్పాటు చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం భావిస్తోంది. 2018లో ఈ 1.45లక్షల సీసీటీవీ కెమెరాల ప్రాజెక్ట్‌కు సంబంధించిన టెండర్‌ను హిక్విజన్ గెలుచుకుంది.(టిక్‌టాక్ బ్యాన్‌ను స్వాగతించిన అమెరికా) ప్రతిపక్షాల వ్యతిరేకత హిక్ విజన్ సీసీటీవీ కెమెరాలను తొలగించడమే కాకుండా యాప్‌ను బ్యాన్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ‘హిక్ విజన్ స్వరర్ కూడా చైనాలో ఉంది.ఈ కెమెరాల ఫీడ్, డాటా ఆధారంగా చైనా మన దేశ రాజధానిలోని ప్రతి ప్రదేశాన్ని చూడగలుగుతోంది. ఢిల్లీ ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్‌ను బెల్ (బీఈఎల్) కు ఇచ్చినట్లు చెప్తోంది. కానీ చైనాలో తయారు చేసిన కెమరాలను వాడుతుంది. దీనికి ఆప్ సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేసింది. అలానే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ గత ఏడాదిలోనే వ్యతిరేకత తెలిపింది. కేజ్రీవాల్ ప్రభుత్వం హిక్విజన్కు కాంట్రాక్ట్ ఇవ్వడం ద్వారా జాతీయ భద్రతను ప్రమాదంలో పెట్టిందని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను కేజ్రీవాల్ ప్రభుత్వం కొట్టి పారేసింది. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కంటైన్మెంట్ జోన్లలో సీసీ కెమెరాలు!
కోల్‌కత: కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న కోల్‌కతాలోని కంటైన్మెంట్ జోన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఆయా ప్రాంతాల్లోని ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని పక్కాగా తెలుసుకోవచ్చని కోల్‌కత నగరపాలక సంస్థ అధికారులు సోమవారం తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలోని ప్రజల కదలికలను లాల్బజార్లో ఉన్న కంట్రోల్ రూమ్ నుంచి పోలీసులు నిత్యం పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. కోల్‌కతాలోని 480 కంటైన్మెంట్ జోన్లలో 500 సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయని అధికారులు వెల్లడించారు. అధిక జనాభా ఉన్న కోల్‌కతా నగరంలో కోవిడ్ ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఇక లాక్డౌన్ సడలింపులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. కోవిడ్ ఆస్పత్రులు ఉన్న ప్రాంతాలను సైతం ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించింది. దీంతో కోల్‌కతాలో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య అమాంతం పెరిగింది. పశ్చిమ బెంగాల్లో కంటైన్మెంట్ జోన్లను ‘ప్రభావిత ప్రాంతాలు’గా పిలుస్తున్నారు. వాటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్లుగా పేర్కొంటున్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలు కనుగొనేందుకు ప్రభావిత ప్రాంతాల్లోనే కొందరిని నియమించుకుంటామని అధికారులు తెలిపారు. (చదవండి: 8 రోజుల్లోనే కరోనాను జయించిన 93 ఏళ్ల వ్యక్తి) -
‘కమాండ్ కంట్రోల్’తో భద్రత భేష్
సాక్షి, హైదరాబాద్: నేర పరిశోధనకు అత్యంత కీలకంగా మారిన సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో అధునాతన కమాండ్ కంట్రోల్ సెంటర్ త్వరలో అందుబాటులోకి రాబోతుందని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో చేపట్టిన అధునాతన కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌తో కలసి శుక్రవారం పర్యవేక్షించారు. త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఎల్ అండ్ టీ సిబ్బందిని కోరారు. ప్రస్తుత కమాండ్ కంట్రోల్ సెంటర్ల ద్వారా హైదరాబాద్‌లో వెయ్యి, సైబరాబాద్‌లో 500 కెమెరాల్ని మాత్రమే పర్యవేక్షించే సదుపాయముందని, అయితే కొత్త కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా రెండు వేల కెమెరాల్ని ఏకకాలంలో వీక్షించవచ్చన్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా బంజారాహిల్స్‌లో నిర్మితమవుతున్న జంట పోలీస్‌టవర్లలో ఏర్పాటు కాబోయే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సమాంతరంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటితోపాటు కమ్యూనిటీ పోలీసింగ్, ‘నేను సైతం’ప్రాజెక్టుల కింద కాలనీల్లో ఏర్పాటు చేస్తున్న లక్షలాది కెమెరాల్నీ ఈ కేంద్రంలో పర్యవేక్షించే వీలు కలుగుతుందన్నారు. 3 కమిషనరేట్లలో ఎల్ అండ్ టీ సంస్థ 10,000 అధునాతన కెమెరాల్ని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. వేగంగా వెళ్లే వాహనాల నంబర్ ప్లేట్లను గుర్తించే ఆటోమేటిక్ కెమెరాల్ని ఇక్కడ అందుబాటులోకి తెస్తున్నారు. కాలనీల్లో ఏర్పాటు చేస్తున్న కెమెరాల్ని ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాజెక్టులో భాగంగా మూడు కమిషనరేట్లలో కెమెరాల్ని అమర్చనున్నారు. ఈ కేంద్రంలో దాదాపు 10 లక్షల కెమెరాలకు సంబంధించిన దృశ్యాల్ని నెలపాటు నిక్షిప్తం చేసే భారీ సర్వర్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశమై సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించేందుకు వీలుగా ఆధునిక హంగులతో వార్‌రూంను ఏర్పాటు చేశారు. -
కిరీటాల మాయంపై కీలక ఆధారాలు లభ్యం!
-
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల మాయం
-
కిరీటాల మాయంపై కీలక ఆధారాలు లభ్యం!
సాక్షి, తిరుపతి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల మాయం ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఈ కేసులో ఇప్పటికే కొన్ని ఆధారాలను సేకరించినట్టు తెలుస్తోంది. కిరీటాల మాయం వెనుక ఇంటి దొంగల పనే ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆలయ సిబ్బందే కిరీటాలు మాయం చేసి ఉంటారన్న కోణంలో విచారణ జరుపుతున్నట్టు సమాచారం. ఆలయంలోని సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులకు పలు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. సాయంత్రం 5.40 గంటల నుంచి 6 గంటల మధ్యప్రాంతంలో కిరీటాలు చోరీ అయినట్టు పోలీసులు గుర్తించారు. చోరీ జరిగిన సమయంలో ఆలయంలో అర్చకులు బాలాజీ దీక్షితులు, శ్రీనివాసులు ఉన్నట్లు తెలుస్తోంది. చోరీ జరిగిన ప్రదేశంలో సీసీటీవీ కెమెరా ఒకటి పని చేయడం లేదని గుర్తించారు. కిరీటాల మాయం కచ్చితంగా ఇంటి దొంగల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఆలయ ప్రాంగణంలో మరోసారి డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. 2011లోనూ.. టీటీడీ ఆలయాల్లో గతంలో కూడా పలుమార్లు నగలు మాయమయ్యాయి. 2011లో తిరుపతిలోని కోదండ రామస్వామి ఆలయంలోనూ నగల అపహారణ జరిగింది. ఈ కేసులో ఇప్పటికీ కూడా విచారణ కొనసాగుతూనే ఉంది. అప్పట్లో ఆలయ ప్రధాన అర్చకుడే నగలను తాకట్టు పెట్టినట్టు అధికారులు నిర్ధారించారు. అంతేకాదు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో సైతం గతంలో నగలు మాయమయ్యాయి. టీటీడీ ఆలయాల్లో వరుసగా జరగుతున్న నగల మాయంపై భక్తుల్లో ఆందోళన నెలకొంది. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే నగలు మాయమవుతున్నాయంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయానికి చేరుకున్న పెద్ద జీయర్, చిన జీయర్.. కిరీటాల చోరీ నేపథ్యంలో తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయానికి పెద్ద జీయర్, చిన జీయర్ చేరుకున్నారు. మరోవైపు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల మాయం కావడంలో బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో స్వామి వారి నగలకు భద్రత లేదంటూ దేవాలయం ముందు నిరసనకు దిగారు. కిరీటాల మాయంపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని, టీటీడీ అనుబంధ ఆలయాల్లో భద్రతను పటిష్టం చేయాలని బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
సీసీ కెమెరాలు అమర్చి పైశాచికత్వం
కృష్ణరాజపురం : భార్యను అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా ఆమెపై అనుమానం పెంచుకున్న భర్త.. ఇంట్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టాడు. భర్త పైశాచికత్వాన్ని భరించలేని భార్య పోలీసులను ఆశ్రయించింది.ఈ ఘటన బెంగళూరులోని రామ్మూర్తినగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన ప్రదీప్ మూపర్తి బెంగళూరు నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన అనూపతో వివాహమైంది. ఆ సమయంలో రూ.15 లక్షల నగదు, 12 తులాల బంగారం ఇచ్చి రూ.45 లక్షలు ఖర్చు చేసి పెళ్లిని ఘనంగా వివాహం జరిపించారు. కొద్ది కాలం భార్యను బాగానే చూసుకున్న ప్రదీప్.. మెల్లగా తనలోని పైశాచికత్వాన్ని బహిర్గతం చేశాడు. భార్యపై అనుమానం పెంచుకున్న ప్రదీప్ పడకగదిలో, వంటగదిలో, హాల్లో సీసీ కెమెరాలు అమర్చాడు. దీంతోపాటు కెమెరాతో వీడియో తీస్తూ తన ముందు నగ్నంగా నడవాలంటూ అనూపను వేధించేవాడు. అందుకు నిరాకరించిన అనూపను శారీరకంగా కూడా వేధించాడు. మరో వైపు బెంగళూరులోనే ఉంటున్న ప్రదీప్ అక్క ప్రశాంతి, ఆమె భర్త సంజీవ్‌లు అనూపను శారీరకంగా, మానసికంగా హింసించా రు. ఓ దశలో అనూపను పుట్టింటికి పం పించారు. దీంతో అనూప తల్లితండ్రులు అదనంగా రూ.5 లక్షలు ఇచ్చారు. దీన్ని అదునుగా భావించి ముగ్గురు మరింత అదనపు కట్నం తేవాలంటూ వేధించసాగారు. విడాకులు విషయం దాచి రెండో పెళ్లి... ప్రదీప్‌కు ఇదివరకే వివాహం కాగా మొదటి భార్యను కూడా ఇదే విధంగా వేధింపులకు గురి చేయడంతో సదరు మహిళ విడాకులు తీసుకుంది. ఈ విషయాన్ని దాచిపెట్టిన ప్రదీప్ తల్లితండ్రులు మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన అనూపతో వివాహం జరిపించారు. కొద్ది కాలంగా అదనపు కట్నం కోసం వేధిస్తున్న ప్రదీప్ అక్క ప్రశాంతి.. కొద్ది రోజుల క్రితం అనూపను తన ఇంటికి తీసుకెళ్లి ప్రదీప్ మొదటి వివాహం సీడీని చూపించి మొదటి భార్య తల్లితండ్రులు ఇంకా ఎక్కువ మొత్తంలో తన తమ్మడికి కట్నకానుకలు ఇచ్చారని అంతకంటే ఎక్కువ మొత్తంలో అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధిం చింది. అనూప తల్లితండ్రులు వచ్చి ఆరా తీయగా ప్రదీప్ మొదటి వివాహం వ్యవహార ం వెలుగు చూసింది. అంతేగాకుండా ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చి నగ్నవీడియోలు చిత్రీకరించిన విషయం కూడా బహిర్గతమైంది. దీంతో అనూప ఈనెల 4వ తేదీ భర్త ప్రదీప్‌తో పాటు ప్రదీప్ అక్కబావలైన ప్రశాంతి, సంజీవ్కుమార్లపై రామ్మూర్తినగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రైలు ప్రయాణం మరింత భద్రం
ఇన్నాళ్లూ జరిగినట్లుగా.. ఆఖరి నిమిషంలో రైలెక్కే సన్నివేశాలు ఇకపై కనిపించకపోవచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో రైలు ప్రయాణికులంతా ప్రయాణానికి 20 నిమిషాలు ముందే స్టేషన్ చేరుకోవాలి. తమ లగేజీ తనిఖీ చేసుకుని ప్రయాణానికి సిద్ధంగా ఉండాలి. ఇకపై రైలుప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే ప్రయాణానికి అనుమతించనున్నారు. ఇలాంటి ఎన్నో మార్పులకు రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. స్టేషన్లలో సౌకర్యాలను మెరుగుపరచడంతోపాటు రక్షణ పరంగా కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా కేంద్ర రైల్వే బోర్డు పలు సంస్కరణలు చేపడుతోంది. ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్ (ఐఎస్ఎస్) పేరిట దేశవ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్లలో ఈ భద్రతా ఏర్పాట్లను విస్తరించనున్నారు. ఇప్పటికే అలహాబాద్, హుబ్లీ స్టేషన్లలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీ లిస్తోన్న రైల్వేశాఖ త్వరలోనే దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్)లో ఈ సేవలను విస్తరించనుంది. ఇందుకోసం ఎస్సీఆర్ పరిధిలోని సికింద్రాబాద్, నాంపల్లి, తిరుపతి స్టేషన్లను ఎంపిక చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పాత్ర అత్యంత కీలకం కానుంది. – సాక్షి, హైదరాబాద్ ఎలాంటి ఏర్పాట్లు వస్తాయి? ఐఎస్ఎస్ విధానం ఏర్పాట్లలో భాగంగా స్టేషన్ పరిసరాలన్నింటినీ సీసీటీవీ కెమెరాల నిఘాలోకి తీసుకువస్తారు. స్టేషన్ పరిధిలో అసాంఘిక శక్తుల కదలికలను పసిగట్టి వారి ఆటకట్టించేందుకు ఇది దోహదపడనుంది. ఇకపై రైళ్లల్లో ఎవరెవరు ఎక్కుతున్నారన్న విషయం రికార్డవుతుంది. తద్వారా రైల్లో నేరాలు, చోరీలు తగ్గుముఖం పడతాయి. ఈ కట్టుదిట్టమైన వ్యవస్థ కోసం అదనంగా ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది అవసరమవుతారు. డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్, హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్స్, అండర్ వెహికల్ స్కానర్స్, ఫేస్ రికగ్నేషన్ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే సికింద్రాబాద్ స్టేషన్లో దాదాపుగా ఈ ఏర్పాట్లన్నీ ఉన్నాయి. ప్రతీ ప్రవేశ ద్వారం, బయటికి వెళ్లే మార్గంపై సునిశిత నిఘా ఉంటుంది. ఇందుకోసం కొన్ని మార్గాలను ఆనుకుని ప్రహరీలు నిర్మించే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యవస్థను అమలు చేయాలంటే ఇపుడున్న వ్యవస్థను మరింత బలోపేతం చేసి అదనపు సిబ్బందిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని వల్ల లాభాలేంటి? - రైళ్లలో ప్రయాణం మరింత సురక్షితమవుతుంది - నేరస్తులు ఇకపై రైళ్ల ద్వారా పరారయ్యే అవకాశాలుండవు - టికెట్ లేని ప్రయాణాలు తగ్గుముఖం పడతాయి - మాదకద్రవ్యాలు, మారణాయుధాలు తదితరాల అక్రమరవాణాకు వీలుండదు - ఉగ్రవాదులు, పాత నేరస్తులను సులభంగా గుర్తించవచ్చు - అనుమానితులు స్టేషన్లోకి చొరబడలేరు - తప్పిపోయిన, ఇంటినుంచి పారిపోయిన చిన్నారులను గుర్తించడం సులభం - ఆడపిల్లలు, మహిళల అక్రమరవాణాకు కూడా ముకుతాడు నిజంగా సవాలే! సికింద్రాబాద్ స్టేషన్లో ఒక్క రోజు జరిగే కార్యకలాపాలను గమనిస్తే.. ప్రయాణించే రైళ్లు : 215 ప్రయాణీకులు : 1,80,000 ప్లాట్‌ఫామ్‌లు : 10 ప్రవేశద్వారాలు : 6 - ఒక్క సికింద్రాబాద్ స్టేషన్ నుంచే ఇంత మంది ప్రజలు ప్రయాణాలు సాగిస్తే.. వీరందరిని రైలు వచ్చేలోగా తనిఖీ చేసి పంపడం సవాలే. - దేశంలో నలుమూలలా భిన్న వాతావరణాలుంటాయి. ఇవి రైళ్ల రాకపోకల్లో జాప్యానికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పయాణికులను తనిఖీ చేయడమంత సులువు కాదు. - పండుగలు, పర్వదినాలు, మేళాలు జరిగినపుడు రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయాల్లోనూ సిబ్బందికి తనిఖీలు నిర్వహించడం కత్తిమీదసామే. - ఇప్పటికే ప్రతిరోజూ 300 రైళ్లల్లో 321 ఆర్పీఎఫ్, 154 మంది జీఆర్పీ పోలీసులు గస్తీ కాస్తున్నప్పటికీ.. నేరాలు తగ్గినట్లు కనిపించడం లేదు. అధికారిక ఆదేశాలు రాలేదు నూతన సమీకృత భద్రతా వ్యవస్థ (ఐఎస్ఎస్) అమలుకు సంబంధించిన ఆదేశాలు అధికారికంగా అందలేదు. ఎస్సీఆర్ పరిధిలోని తిరుపతి, సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇది పూర్తిస్థాయిలో అమలు కావాలంటే మరికాస్త సమయం పట్టే అవకాశముంది – రాకేశ్ సీపీఆర్వో, దక్షిణమధ్య రైల్వే. -
నేరాలపై సీసీటీవీ కన్ను
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది నేరాలు తగ్గాయని, గతేడాది కంటే క్రైమ్ రేటు పరంగా 5% తగ్గిందని డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ప్రభు త్వం ఇస్తున్న తోడ్పాటు, ప్రజలందిస్తున్న సహకారం తో 2018 పోలీస్ శాఖకు కలిసొచ్చిందని.. ఇదే పద్ధ తిలో భవిష్యత్‌లో అనేక విజయాలు సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నేరాల నియంత్రణలో కీలక ఆధారాలుగా మారుతున్న సీసీ కెమెరాల ఏర్పాటును వచ్చే మూడేళ్లలో జిల్లాల్లోనూ విస్తృతం చేస్తున్నట్టు డీజీపీ తెలిపారు. హైదరాబాద్‌లో ని రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో ఈ ఏడాది పోలీసు శాఖ సాధించిన ఫలితాలు, 2019లో సాధించాల్సిన అంశాలపై డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. విజిబుల్ పోలీసింగ్‌లో విజయవంతం: రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖకు అందుబాటులోకి వచ్చిన నూతన పెట్రోలింగ్ వాహనాలు, బ్లూకోట్స్ బైక్‌ల ద్వారా ప్రజల్లో విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం సక్సెస్ అయ్యిందన్నారు. ప్రతీ మారుమూల ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్‌కు సైతం ఒక అత్యాధుని క పెట్రోలింగ్ వాహనం, రెండు బ్లూకోట్స్ వాహనా లు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అర్బన్ పోలీస్స్టేషన్లలో రెండు పెట్రోలింగ్ వాహనాలు, 4–6 బ్లూకోట్స్ వాహనాలు అందుబాటులోకి తీసుకువచ్చి గల్లీల్లో గస్తీని విస్తృతపరిచామన్నారు. అదే విధంగా పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకున్నవారి విచారణ కోసం 4లక్షల అప్లికేషన్లు వచ్చాయని.. వాటిని కేవలం 4 రోజుల్లో విచారించి ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి పంపించామన్నారు. ఇందుకుగానూ.. వరుసగా 4సార్లు ‘పాస్‌పోర్టు సేవా పురస్కార్’అవార్డు రాష్ట్ర పోలీస్ శాఖకు దక్కిందన్నారు. డయల్ 100కి కాల్ చేస్తే 8 నిమిషాల్లోనే.. పోలీస్ శాఖలో తీసుకొచ్చిన సాంకేతికత మార్పుల కారణంగా.. ప్రజలకు వేగవంతమైన సేవలు అందిస్తున్నామని డీజీపీ స్పష్టంచేశారు. ఈ ఏడాది డయల్ 100 ద్వారా 8.5 లక్షల మంది వివిధ ఘటనలపై సమాచారం, ఫిర్యాదులిచ్చారన్నారు. ఇలా ఫిర్యాదులొచ్చిన ప్రాంతాలకు (పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో) సరాసరి 8 నిమిషాల్లో చేరుకుని పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3–4నిమిషాల్లోపే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుంటున్నారని డీజీపీ వెల్లడించారు. రాష్ట్ర పోలీస్ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో టెక్నాలజీ యాప్స్‌ను వినియోగించినట్లు డీజీపీ తెలిపారు. టార్గెట్ 15లక్షల కెమెరాలు 15లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందన్నారు. 5లక్షల కెమెరాలను జిల్లాలు, ఇతర కమిషనరేట్లలో ఏర్పాటుచేయడంతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలోనూ మిగిలిన 10లక్షల సీసీకెమెరాలు ఏర్పాటుచేస్తామన్నారు. ఈ సీసీటీవీలు అన్ని స్థాయిల్లోని పోలీసు అధికారులకు అందుబాటులో ఉండేలా ఎక్కడికక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్లతో అనుసంధానం చేస్తున్నామన్నారు. వీటి పర్యవేక్షణకు 4వేల మందికిపైగా శిక్షణ ఇచ్చినట్టు డీజీపీ తెలిపారు. మొత్తంగా ఇప్పటివరకు 3.91లక్షల కెమెరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రధాన నేరాల్లో తగ్గుదల రాష్ట్రంలో ఈ ఏడాది నేరాల్లో 5% తగ్గుదల కనిపించిందన్నారు. హత్యలు 4% తగ్గగా, ఆస్తులకోసం నేరాలు 8%, చైన్ స్నాచింగులు 43%, మహిళలపై నేరాలు 7%, సైబర్ నేరాలు 3%, ఆర్థిక నేరాలు 2% తగ్గాయన్నారు. చార్జిషీట్ నమోదైన కేసుల్లో శిక్ష శాతం సైతం పెరిగిందని మహేందర్ రెడ్డి వెల్లడించారు. జీవితఖైదు కేసుల్లో 11%, ప్రధాన నేరాల్లో 5%, ఇతర ఐపీసీ సెక్షన్ల కేసుల్లో 2% పెరుగుదల సాధించామన్నారు. ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ కార్యక్రమాల ద్వారా ఈ ఏడాది 6,019మంది చిన్నారులను కాపాడామని.. అందులో 3,390 మందిని తల్లిదండ్రులకు అప్పగించామని, 2,629 మందిని పునరావాస కేంద్రాలకు పంపించామన్నారు. సొత్తు చోరీ కేసుల్లో 69% రికవరీ చేశామన్నారు. 2018లో రూ. 149.56 కోట్ల సొత్తు చోరీ కాగా, రూ.102.69 కోట్ల సొత్తు రికవరీ చేశామని డీజీపీ తెలిపారు. కొత్త ఏడాది తొలి 15రోజులు ప్రజల్లోనే.. కొత్త సంవత్సరంలో పీపుల్స్ ఫ్రెండ్లీ సేవలను మరింత విస్తృతం చేస్తామని డీజీపీ తెలి పారు. గ్రామాలు, కాలనీలు, అపార్ట్మెంట్లు, బస్తీలు, ఇలా అన్ని ప్రాంతాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది పర్యటిస్తారని, ప్రజలతో సమావేశాలు ఏర్పాటుచేసి వారికి పోలీస్ శాఖా పరంగా కావాల్సిన సేవలేంటని తెలుసుకుంటా మని మహేందర్ రెడ్డి తెలిపారు. ఇలా మొదటి పదిహేను రోజుల్లో గుర్తించిన అవసరాలను సంవత్సరకాలంలో పరిష్కరిస్తామన్నారు. కొత్త సమస్యలు వస్తే వాటిని పరిష్కరించి ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై మరింత నమ్మకం పెరిగేలా చేసేందుకు ఈ కార్యాచరణ ఉపకరిస్తుందని డీజీపీ అభిప్రాయపడ్డారు. -
పెట్రోల్ బంక్‌లో దారుణం.. వైరల్ వీడియో
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోరం జరిగింది. బైక్ మీద వచ్చిన ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ బంక్‌లో దోపిడీకి పాల్పడ్డారు. దోపిడీ అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని దారుణంగా నరికి.. డబ్బు సంచిని లాక్కెళ్లారు. కడలూరు-చిదంబరం రోడ్డులో ఉన్న ఓ పెట్రోల్ బంక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన బంక్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. బైక్ మీద పెట్రోల్ బంక్‌కు వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. పెట్రోల్ పోసే బాయ్‌తో మాట్లాడినట్టు నటించారు. ఇంతలో చివర కూర్చున్నవాడు.. అతని వద్ద నుంచి డబ్బు సంచి లాక్కునే ప్రయత్నం చేశాడు. దీనిని అతను అడ్డుకోవడంతో కత్తి తీసుకొని దౌర్జన్యానికి దిగాడు. దీంతో అతనితోపాటు ఉన్న మరో సిబ్బంది అక్కడి నుంచి పారిపోయాడు. కత్తి తీసుకొని బెదిరించినా.. డబ్బు ఇచ్చేందుకు బాధితుడు నిరాకరించడంతో.. విచక్షణారహితంగా కత్తితో నరికి.. ఆ కిరాతకులు డబ్బుసంచితో పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. -
పెట్రోల్ బంక్‌లో దారుణం
-
మహానగరంలో నేరగాళ్లను పంట్టించే కెమెరాలు
-
ప్రతి పల్లెలో సీసీ నిఘా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా పోలీసు శాఖ కార్యాచరణ రూపొందించింది. హైదరాబాద్‌లో విజయవంతంగా అమలవుతున్న కమ్యూనిటీ, నేను సైతం సీసీటీవీ ప్రాజెక్టులను అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో కమిషనర్లు, ఎస్పీలు, అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టు కింద జనసంచార, రద్దీ ప్రాంతాలు, కీలక కార్యాలయాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఎంపీ, ఎమ్మెల్యే లాడ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులతో స్వచ్ఛంద సంఘాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల సహాకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. నేను సైతం ప్రాజెక్టు కింద స్వచ్ఛందంగా ముందుకొచ్చే వ్యాపారులు, కాలనీ, అపార్ట్మెంట్ వాసులు, వివిధ సంఘాలు నేతృత్వంలో ఏర్పాటు చేస్తారు. కమ్యూనిటీ సీసీటీవీల వీడియో ఫుటేజీ 30 రోజుల పాటు ఉంటుందని, నేను సైతం కింద ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫీడ్ యజమాని నిర్వహణపై ఆధారపడి ఉంటుందని డీజీపీ వివరించారు. జీహెచ్ఎంసీలో 10 లక్షల కెమెరాలు గ్రామంలో ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ సీసీటీవీలు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానిస్తామని డీజీపీ చెప్పారు. సర్కిల్, డివిజన్, జిల్లా స్థాయి కమాండ్ సెంటర్లకు వాటిని అనుసంధానిస్తామని తెలిపారు. అన్ని జిల్లాల కమాండ్ సెంటర్లను రాజధానిలో ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి రానున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానిస్తామన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో హైదరాబాద్‌లో అనేక సంచలనాత్మక కేసులను 24–40 గంటల్లోనే ఛేదించామని గుర్తు చేశారు. హైదరాబాద్ పరిధిలో 2014 నుంచి 2017 మధ్య 32 శాతం నేరాల తగ్గుదల కనిపించిందని.. సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రజల సహకారం, ప్రభుత్వ తోడ్పాటుతోనే ఇదంతా జరిగిందని చెప్పారు. వచ్చే మూడేళ్లలో జీహెచ్ఎంసీ పరిధిలో 10 లక్షలు, మిగతా ప్రాంతాల్లో 15 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కమ్యూనిటీ, నేను సైతం సీసీటీవీ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసుకునే కెమెరాలను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూపొందించిన మార్గదర్శాకాల ద్వారా కొనుగోలు చేయాలని.. నెట్వర్క్ వ్య వస్థ, హెచ్డీ క్వాలిటీ అంశాలను పాటించాలని డీజీపీ చెప్పారు. మార్గదర్శకాల కాపీ లను ఎస్పీలు, కమిషనర్లకు అందించారు. తద్వారా సీసీ ఫుటేజీ క్వాలిటీ బాగుంటుందని, నిందితులు, అనుమానితుల గుర్తింపు సులభమవుతుందని చెప్పారు. పోలీసులు ఫ్రెండ్లీగా ఉండాలి: నాయిని నేను సైతం ప్రాజెక్టుకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు రూపొందించిన షార్ట్ ఫిలిమ్‌ను హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆవిష్కరించారు. టెక్నాలజీతో నేరాల నియంత్రణ చేయొచ్చని హైదరాబాద్ పోలీసులు రుజువు చేశారని, అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అని హోం మంత్రి అభిప్రాయపడ్డారు. ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వెళ్తే నేరాల నియంత్రణ సులభమవుతుందన్నారు. పోలీసు శాఖకు ప్రభుత్వం ఎప్పుడూ సహకారం అందిస్తుందని, పీపుల్ ఫ్రెండ్లీగా పోలీసులు ఉండాలాని నాయిని ఆకాక్షించారు. -
కాలేజీ టాయిలెట్లో సీసీటీవీ కెమెరాలు
అలీగఢ్: ఉత్తరప్రదేశ్‌లో విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడకుండా ఓ కళాశాల వింత చర్య తీసుకుంది. అలీగఢ్‌లోని ధర్మ్‌సమాజ్ డిగ్రీ కాలేజీ మూడ్రోజుల క్రితం అబ్బాయిల టాయిలెట్ గదిలో సీసీటీవీ కెమెరాలను అమర్చింది. చివరికి ఈ విషయం బయటకు పొక్కడంతో పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో కళాశాల ప్రిన్సిపాల్ హేమ్‌ప్రకాశ్ గుప్తా స్పందిస్తూ.. పరీక్షల సందర్భంగా పలువురు విద్యార్థులు జేబుల్లో, అండర్‌వేర్‌ల్లో స్లిప్పులు దాస్తున్నారని తెలిపారు. టాయిలెట్లోకి వచ్చి స్లిప్పుల ద్వారా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నారని వెల్లడించారు. టాయిలెట్ గదిలో సీసీటీవీల ఏర్పాటుతో ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు. కాగా, టాయిలెట్ గదిలో సీసీటీవీల ఏర్పాటును ఇంతటితో వదిలిపెట్టబోమనీ, కోర్టుకు ఈడుస్తామని పలు విద్యార్థి సంఘాల నేతలు సదరు కళాశాలను హెచ్చరించారు. -
ప్రిన్సిపాల్ వినూత్న ఆలోచన.. విమర్శలు!
లక్నో : విద్యార్థులు కాపీ కొడుతున్నారని వీటిని అరికట్టేందుకు ఓ కాలేజీ ప్రిన్సిపాల్ వినూత్నంగా ఆలోచించారు. కాలేజీ బాత్రూమ్లలో సీసీ కెమెరాలు సెట్ చేయించారు. ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌లోని ధరం సమాజ్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ హేం ప్రకాష్ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. డ్రెస్సుల్లో ఏదో విధంగా స్లిప్స్ తీసుకొస్తున్నారని, వీటిని అరికట్టేందుకు ఇలా చేయాల్సి వచ్చిందన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లదని, దాంతో విద్యార్థులు ధర్నాలు చేపట్టే అవకాశం లేదన్నారు. విద్యార్థులు చీటింగ్ చేస్తున్నారని బాయ్స్ బాత్రూముల్లో సీసీ కెమెరాలు ఫిట్ చేయించారు. అయితే కేవలం అబ్బాయిలే పరీక్షల్లో కాపీయింగ్ చేస్తారా అని కొందరు ప్రిన్సిపాల్‌ను ప్రశ్నిస్తున్నారు. అమ్మాయిల బాత్రూమ్లలో కెమెరాలు పెట్టాలన్నది మా ఉద్దేశం కాదని, అయితే విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష హాలులోకి అనుమతించాలని సూచించారు. కాపీయింగ్ చేస్తూ దొరికిపోయే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కానీ అబ్బాయిలను అవమానించే ఇలాంటి పనులు మంచివి కాదంటూ మరికొందరు హితవు పలుకుతున్నారు. -
ఏటీఎంలలో జరభద్రం!
సాక్షి, సిటీబ్యూరో: ‘డబ్బులు డ్రా చేసుకునేందుకు నగరంలోని ఏటీఎం కేంద్రాలకు వెళుతున్నారా...యథాలాపంగా ఏటీఎం యంత్రంలో కార్డు పెట్టి కీబోర్డు మీద పాస్వర్డ్ కొట్టి చకచకా డబ్బులు తీసుకొని వెళ్లిపోదామని అనుకుంటే మీ ఖాతాల్లోని డబ్బులకు గ్యారంటీ ఉండకపోవచ్చు. నగరంలోని ఏటీఎం కేంద్రాల్లో డేటా కార్డ్ రీడర్ అమర్చి ఉన్న స్కిమ్మర్ కార్డును బిగించి ఏటీఎం కార్డు వివరాలన్నీ సేకరించడంతో పాటు అక్కడే బిగించిన రహస్య సీసీటీవీ కెమెరా ద్వారా పిన్ నంబర్ తెలుసుకొని ముంబైలో క్లోనింగ్ చేసి భారీ మొత్తంలో అక్కడి ఏటీఎంల నుంచి డబ్బులను కాజేస్తున్న ఇద్దరు రుమేనియా దేశస్తులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ నగదును తమ దేశ కరెన్సీలోకి మార్చుకునేందుకు నగరానికి వచ్చిన ప్రధాన నిందితులు వసిలె గాబ్రియల్ రజ్వాన్, బురిసియా అలెగ్జాండ్రు మిహయ్లను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వీరి నుంచి రూ.35 లక్షల నగదుతో పాటు 196 స్కిమ్మర్ కార్డులు, ఆరు కెమెరా ప్యానెల్స్, ఒక ఎంఎస్ఆర్ మెషిన్, ఆరు ఏటీఎం కార్డు స్కిమ్మర్లు, రెండు పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 4న తన బ్యాంక్ ఖాతా నుంచి ముంబై, గోరేగావ్‌లోని ఓ ఏటీఎం సెంటర్ నుంచి లక్ష రూపాయలు డ్రా అయ్యాయని మెసేజ్ వచ్చిందంటూ కూకట్పల్లివాసి అనిల్ భార్గవ ఫిర్యాదుతో ఈ భారీ క్లోనింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం మీడియాకు తెలిపారు. మెకానిక్ నుంచి చోరీలవైపు... రొమానియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వసిలె గాబ్రియల్ రజ్వాన్ అక్కడే కారు మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని స్నేహితుడైన బురిసియా అలెగ్జాండ్రు మిహయ్ హోటల్లో పనిచేస్తుండేవాడు. అయితే వీరి అవసరాలకు తగ్గట్టుగా డబ్బులు సంపాదించకపోవడంతో నేరాలబాట పట్టారు. వీరికి రజ్వాన్ స్నేహితులైన టికూ బొగ్దాన్ కాస్టినెల్, పుయికా ఇగ్ను మరియన్లు కూడా తోడయ్యారు. ఇలా యూకే, యూరోపియన్లలోనూ ఏటీఎం కార్డులు క్లోనింగ్ చేసి వివిధ బ్యాంక్ ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసుకునేవారు. అక్కడ నిఘా పెరగడంతో వీరి చూపు భారతదేశంలోని హైదరాబాద్, ముంబై, ఢిల్లీపై పడింది. ఇలా వీరు బిజినెస్, టూరిస్ట్ వీసాలపై గతేడాది డిసెంబర్లో హైదరాబాద్‌కు వచ్చారు. నగరంలోని హోటల్స్‌లో ఉండి సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలను గుర్తించారు. అదే నెలలోనే ఢిల్లీకి విమానంలో వెళ్లి అక్కడ ఏటీఎంలో ఈ ఏడాది జనవరిలో స్కిమ్మర్లను అమర్చి సేకరించిన డేటా కార్డు వివరాలతో రూ.9 లక్షల 50 వేలు డ్రా చేశారు. అదే నెలలోనే వెస్టర్న్ యూనియన్ అవుట్‌లెట్‌లో డబ్బులను రొమానియా కరెన్సీలోకి మార్చుకున్నారు. ఆ తర్వాత గాబ్రియల్ సూచనల మేరకు అతని స్నేహితులైన టికూ బొగ్దాన్ కాస్టినెల్, పుయికా ఇగ్ను మరియన్లు ఫిబ్రవరి, మార్చి నెలల్లో హైదరాబాద్‌కు వచ్చి నగరంలోని కూకట్పల్లి, జగద్గిరిగుట్ట, విజయ్‌నగర్‌కాలనీ, జూబ్లీహిల్స్‌లోని నాలుగు ఏటీఎం సెంటర్లలో ఏటీఎం కార్డులు ఇన్సర్ట్ (కార్డును పెట్టే ప్రాంతం) చేసే దగ్గర అనుమానం రాకుండా చిప్‌తో కూడిన స్కిమ్మర్లను అమర్చారు. మెషీన్ కీ బోర్డుకుపైన రహస్య కెమెరాలను ఏర్పాటుచేశారు. ఈ స్కిమ్మర్ ద్వారా కార్డు పెట్టగానే ఖాతాదారుడి వివరాలను తీసుకొని చిప్‌లో భద్రపరుస్తుంది. రహస్య కెమెరా కీబోర్డు మీద నమోదయ్యే పిన్ నంబర్ల వివరాలను రికార్డు చేసుకుంటుంది. మరుసటిరోజూ వచ్చి ఈ స్కీమర్, సీసీకెమెరాలను తీసుకెళ్లారు. వాటిలో వచ్చిన డేటా, దృశ్యాలతో మరో కార్డులోకి గాబ్రియల్ టెక్నికల్ టూల్స్‌తో క్లోనింగ్ చేసి యాంటీ గిఫ్ట్‌కార్డు(ఏటీఎం డూప్లికేట్) వెనకాల పిన్ నంబర్ రాసుకునేవాడు. ఆ తర్వాత డ్రా చేసేవాడు. ఇలా కూకట్‌పల్లికి చెందిన అనిల్ భార్గవ బ్యాంక్ ఖాతా నుంచి లక్ష రూపాయలు ముంబైలోని గోరేగావ్‌లోని ఓ బ్యాంక్ నుంచి డ్రా అయినట్టుగా సెల్‌కు ఎస్ఎంఎస్ వచ్చింది. వెంటనే సంబంధించి బ్యాంక్ కాల్‌సెంటర్‌కు కాల్ చేయగా మీ బ్యాంక్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారంటూ సమాధానం చెప్పడంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నికల్ డేటా సహకారంతో ముంబైలోని నాలుగు ఏటీఎం కేంద్రాల నుంచి డబ్బు విత్‌డ్రా అవుతున్నట్టు గుర్తించారు. మార్చుకుందామని వచ్చిదొరికిపోయారు... అయితే అప్పటికే ఆయా ఏటీఎంల నుంచి దాదాపు రూ.35 లక్షలు డ్రా చేసిన గాబ్రియల్, అలెగ్జాండ్రులు అక్కడ డబ్బు తమ కరెన్సీలోకి మార్చడం అంత సేఫ్ కాదని భావించి హైదరాబాద్‌లోని కరెన్సీ మార్పిడి కేంద్రానికి చేరుకునే సమయంలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. వీరు సైబరాబాద్‌లోని కూకట్పల్లి ఐసీఐసీఐ బ్యాంక్, జగద్గిరిగుట్టలోని కెనరా బ్యాంక్‌లతో పాటు హైదరాబాద్‌లోని మరో రెండు ఏటీఎం కేంద్రాల్లో స్కిమ్మర్లు అమర్చినట్టుగా విచారణలో ఒప్పుకున్నారు. అయితే గాబ్రియల్ స్నేహితులైన టికూ, పుయికాలు ఫిబ్రవరి, మార్చి నెలల్లో హైదరాబాద్‌లో ఈ పనిచేశారని చెప్పారు. ఏటీఎం కేంద్రాల్లో టికూ స్కిమ్మర్ అమర్చితే, పుయికా మరుసటిరోజు తొలగించేవాడని విచారణలో వెల్లడించారు. వారి పని పూర్తవడంతో రుమేనియా వెళ్లిపోయారని పోలీసులకు తెలిపారు. ఆయా ఏటీఎం కేంద్రాల్లోని సీసీటీవీ ఫుటేజీల్లో టికూ, పుయికాల ముఖాలు కనబడతాయనే ధైర్యంతో హైదరాబాద్‌కు వచ్చామని, ఇలా దొరికిపోతామని ఊహించలేదని పోలీసుల విచారణలో అన్నట్టు తెలిసింది. అయితే వీరు ఇప్పటివరకు 2040 కార్డులను క్లోనింగ్ చేసి 560 కార్డుల నుంచి డబ్బులు డ్రా చేశారని సజ్జనార్ వివరించారు. ఆలీబాబా ఆన్లైన్ వెబ్సైట్ నుంచి తెప్పించిన స్కిమ్మింగ్ కార్డులు, మాగ్నటిక్ రీడర్లు కొనుగోలు చేశాడని తెలిపారు. ఈ నిందితులను పట్టుకున్న డీసీపీ క్రైమ్స్ జానకి షర్మిలా, ఏసీపీ వై.శ్రీనివాస్కుమార్లను అభినందించారు. వచ్చే వారంలో బ్యాంకర్లతో సమావేశం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో సుమారు ఐదువేలకుపైగా ఏటీఎం కేంద్రాలున్నాయి. వీటిలో చాలావరకు సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలు ఉన్నట్టుగా పోలీసులకు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలోనూ భద్రత సిబ్బందిని నియమించుకోవాలని పోలీసులు గట్టిగా హెచ్చరించినా పెద్దగా పట్టించుకోలేదు. ఏటీఎంలలో సీసీటీవీ కెమెరాలున్నా పర్యవేక్షణ కొరవడింది. ఈ నేపథ్యంలో డెబిట్ కార్డు క్లోనింగ్ మోసాలు జరగడంతో వచ్చే వారంలో అన్ని బ్యాంక్‌ల మేనేజర్లతో సమావేశం నిర్వహించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ నిర్ణయించారు. ఖాతాదారుల భద్రతే లక్ష్యంగా ఉండాలని సూచించడంతో పాటు మోసాలకు చెక్‌పెట్టేలా అవగాహన కలిగించాలని నిర్ణయించారు. -
మహిళల బాత్రూమ్ల్లో సీసీ కెమెరాలు..
సాక్షి, అనంతపురం : కోచింగ్ సెంటర్ల ఆగడాలు రోజు రోజుకు తీవ్రమౌతున్నాయి. వేలాది రూపాయల కొద్ది దండుకునే కోచింగ్ సెంటర్లు మరింత రెచ్చిపోయి భద్రత పేరుతో అకృత్యాలు చేస్తున్నాయి. మహిళల బాత్రూమ్లో రహస్య కెమారాలు పెట్టి దారుణాలకు పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురంలోని లోటస్ కోచింగ్ సెంటర్ చేస్తున్న నిర్వాకం బయటపడింది. కోచింగ్ సెంటర్లోని మహిళల బాత్రూమ్ల్లో రహస్య కెమరాలు పెట్టి వీడియోలు రికార్డు చేస్తున్నారు. అయితే విషయం తెసుకున్న మహిళలు విద్యార్థులు ఈ దారుణం గురించి కుటుంబ సభ్యులకు తెలియచేశారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రలు కోచింగ్ సెంటర్‌పై దాడలకు దిగారు. చదువు చెప్పాల్సింది పోయి.. ఇలాంటి పనులు చేయడం ఏంటని నిలదీశారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సంజీవరాయుడుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. -
ఒక ఘరానా దొంగ..ఇంటి చుట్టూ 32 కెమెరాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటి చుట్టూ 32 సీసీటీవీ కెమెరాలు.. వీటిలోని ఫీడ్‌ను రికార్డ్ చేయడానికి, లైవ్‌లో చూడటానికి నాలుగు డిజిటల్ వీడియో రికార్డర్స్(డీవీఆర్లు).. ఈ మాటలు చెప్పగానే.. ఎవరో పెద్ద రాజకీయ నాయకుడి నివాసమో లేక పోలీసు ఉన్నతాధికారి గృహమో అనుకుంటున్నారా..? కానే కాదు.. అది ఓ ఘరానా దొంగ ఇల్లు. భద్రత కోసం ఈ హైటెక్ దొంగ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఎలక్ట్రీషియన్ ముసుగులో ల్యాప్‌టాప్ బ్యాగ్‌తో టిప్‌టాప్‌గా తిరుగుతూ పట్టపగలే ఇళ్లలో చోరీలకు పాల్పడే ఇతగాడి పేరు మీర్ ఖాజం అలీ ఖాన్. ఇతను పదో తరగతి వరకూ ఓ ప్రతిష్టాత్మక పబ్లిక్ స్కూల్లో చదవడం గమనార్హం. చివరికి నగర పోలీసు విభాగం వినియోగిస్తున్న అత్యాధునిక పాపిల్లన్ సాఫ్ట్వేర్ సాయంతో అతను దొరికిపోయాడు. ఈ ఘరానా నేరగాడి నుంచి రూ.18 లక్షల విలువైన 55 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మంచం పట్టి.. వ్యసనాలకు బానిసై.. ఆర్ఎంపీ డాక్టర్ అయిన మీర్ అక్బర్ అలీ ఖాన్ తన కుమారుడు ఖాజం అలీని చదువు నిమిత్తం ప్రతిష్టాత్మకమైన ఓ పబ్లిక్ స్కూల్లో చేర్పించాడు. ఆ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సమయంలో జరిగిన ఓ ప్రమాదం అతని జీవితాన్ని మార్చేసింది. ఓ భవనంపైన పతంగులు ఎగురవేస్తుండగా ఖాజం కాలు జారి కింద పడటంతో రెండేళ్ల పాటు మంచానికే పరిమితమయ్యాడు. ఈ సమయంలో పరిచయమైన వారు వ్యసనాలు అలవాటు చేయడంతో వాటికి బానిసగా మారాడు. జల్సాలు.. అవసరాల కోసం ఆ స్నేహితులతోనే కలసి చోరీలు చేయడం మొదలుపెట్టాడు. ఇలా వరుస చోరీలు చేసి జైలుకు వెళ్లాడు. జూబ్లీహిల్స్ ఠాణాలో నమోదైన కేసులో అరెస్టు అయినప్పుడు నగర పోలీసులు ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఏడాది పాటు జైల్లో ఉన్న అలీ 2016 జూన్ 28న బయటకు వచ్చాడు. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి...: ప్రస్తుతం టోలిచౌకిలోని సూర్యనగర్‌లో నివసిస్తున్న ఖాజం అలీ ఇల్లు ఒకప్పుడు అక్కడి ఫ్లైఓవర్ పక్కన ఉండేది. ఈ ఇంటి స్థలానికి సంబంధించి ఇతడి కుటుంబానికి, గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు విభేదాలు ఉండేవి. దీంతో నయీమ్ నుంచి ముప్పు ఉంటుందనే ఉద్దేశంతో ఖాజం ఇంటి చుట్టూ 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు. వీటిలోని ఫీడ్‌ను రికార్డ్ చేయడానికి నాలుగు డీవీఆర్లు ఏర్పాటు చేసుకున్నాడు. నయీమ్ ఎన్కౌంటర్ అయిన తర్వాత కూడా కొన్నాళ్ల పాటు సీసీ కెమెరాలు కొనసాగించాడు. ఖాజం 2009–2015 మధ్య నగరంతోపాటు సైబరాబాద్, మెదక్ ల్లోని 17 పోలీసుస్టేషన్ల పరిధిలో 29 నేరాలు చేశాడు. 2016 సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 16 మధ్య దాదాపు 40 రోజుల్లో 2 ఠాణాల పరిధిలో 9 నేరాలు చేశాడు. అప్పట్లో చిక్కినా చెప్పకపోవడంతో... ఖాజంను మీర్‌పేట పోలీసులు 2016లో అరెస్టు చేశారు. అయితే ఎనిమిదేళ్ల క్రితం మలక్‌పేట, మంగళ్‌హాట్‌లో చేసిన 180 తులాల బంగారం చోరీ కేసుల్ని అతడు చెప్పలేదు. ఈ కేసుల్ని బాధితులు, పోలీసులూ దాదాపు మర్చిపోయారు. అయితే నగర పోలీసు విభాగం కొన్నాళ్ల క్రితం అందుబాటులోకి తెచ్చిన ‘పాపిల్లన్’సాఫ్ట్వేర్ ఖాజం ‘గతాన్ని’విప్పింది. ఆ నేరాలు జరిగినప్పుడు పోలీసులు సేకరించిన వేలిముద్రలు.. పాత నేరస్తుల డేటాబేస్‌తో సరిపోలలేదు. దీంతో ఆ కేసులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ‘పాపిల్లన్’అనే ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సాఫ్ట్వేర్ ఇతడికి చెక్ చెçప్పింది. ఇందులో ఇప్పటి వరకు అరెస్టు అయిన, వాంటెడ్‌గా ఉన్న పాత నేరగాళ్లతో పాటు వివిధ నేర స్థలాల్లో దొరికిన వేలిముద్రల్ని డిజిటలైజ్ చేసిన పోలీసులు వాటిని ఓ సర్వర్‌లో నిక్షిప్తం చేశారు. ఈ సాఫ్ట్వేర్ వివిధ సందర్భాలు, సమయాల్లో నేర స్థలాల్లో దొరికిన వేలిముద్రల్ని పాత నేరగాళ్లకు చెందిన వాటితో సరిచూసి తక్షణం రిజల్ట్ ఇస్తుంది. దీంతో ఖాజం దాచిన రెండు దొంగతనాలు బయటపడ్డాయి. దీంతో సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలోని బృందం ముమ్మరంగా గాలించి మంగళవారం ఖాజంను పట్టుకుని మలక్‌పేట పోలీసులకు అప్పగించింది. -
జయ మృతి కేసులో ఊహించని మలుపు!
-
జయ మృతి కేసులో ఊహించని మలుపు!
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మృతి అనేక అనుమానాలకు తావిస్తున్న సంగతి తెలిసిందే. అనారోగ్యానికి గురైన జయలితత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె అనారోగ్యం, చికిత్స తదితర విషయాలను గోప్యంగా ఉంచడం.. ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్న సమయంలో తమను సైతం లోపలికి వెళ్లి జయను చూడనివ్వలేదని అన్నాడీఎంకే సీనియర్ నేతలు ఆరోపించడంతో ఆమె మృతి ఒక మిస్టరీగా మారింది. ఆమె మృతి వెనుక కారణాలపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణ కమిషన్ దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జయలలిత మృతికి సంబంధించి మరో సంచలన అంశం వెలుగుచూసింది. జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సీసీటీవీ కెమెరాలు బంద్ (స్విచ్చాప్) చేశారని, ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నంతకాలం అవి పనిచేయలేదని తాజాగా వెలుగులోకి వచ్చింది. అంటే ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందినతీరు వీడియో రికార్డు కాలేదని తేలిపోయింది. దీంతో ఆస్పత్రిలో నిజానికి ఏం జరిగిందనే దానిపై మరిన్ని అనుమానాలు వచ్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ‘దురదృష్టవశాత్తు సీసీటీవీ కెమెరాలను స్విచ్ ఆఫ్ చేశారు. జయలలిత ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాక.. ఐసీయూను పూర్తిగా ఆమె కోసమే కేటాయించాం. అందువల్ల ప్రతి ఒక్కరూ సీసీటీవీ దృశ్యాలు కూడా చూడకూడదని, వాటిని తొలగించాం’ అని అపోలో చైర్మన్ సీ ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు. -
ఇక రైళ్లలో సీసీ టీవీ కెమెరాలు, వైఫై
సాక్షి. లక్నో : దేశవ్యాప్తంగా రైళ్లలో సీసీటీవీ కెమెరాలు, వైఫై కనెక్షన్‌ను అందుబాటులోకి తేనున్నట్టు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. తమ ప్రభుత్వం అన్ని రైల్వే స్టేషన్లను పరిశుభ్రంగా, సురక్షితంగా ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేలా తీర్చిదిద్దుతుందని చెప్పారు. అన్ని రైళ్లలో త్వరలో సీసీటీవీ కెమెరాలు, వైఫై సదుపాయాలను కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆదివారం లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో్ మంత్రి మాట్లాడుతూ రైల్వేల్లో 90,000 మంది ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని చెప్పారు. రైల్వేల అభివృద్ధికి గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఆయన ఆరోపించారు. రాయ్‌బరేలి రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రపంచంలోనే అతిపెద్ద కర్మాగారంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. కాగా తేజాస్, శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఎల్సీడీ స్ర్కీన్లను తొలగించాలని రైల్వేలు నిర్ణయించిన అనంతరం మంత్రి సీసీటీవీ కెమెరాలు, వైఫై ఏర్పాటు చేస్తామని ప్రకటించడం గమనార్హం. కొందరు ప్రయాణీకులు ఎల్సీడీ స్క్రీన్లను ధ్వంసం చేయడం, అపహరించడం వంటి ఘటనలకు పాల్పడుతున్న క్రమంలో రైళ్లలో వాటిని శాశ్వతంగా తొలగించాలని రైల్వేలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
పేరెంట్స్‌ను పోలీసుల్ని చేస్తానంటున్న కేజ్రివాల్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ నగరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, తరగతి గదుల్లో సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేయాలన్నది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌కు ఎప్పటి నుంచో మదిలో మెదులుతున్న ఆలోచన. 2015లో విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు జరిపినప్పుడు ఆయన తొలిసారిగా తన ఈ ఆలోచనను బయటపెట్టారు. పాఠశాలలకు వెళ్లిన తమ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు ఇంటివద్ద నుంచి ప్రత్యక్షంగా ఎప్పటికప్పుడు వీక్షించేందుకు ఇది తోడ్పడుతోందని, అందుకోసం అవసరమైన ఆప్‌ను కూడా తీసుకొస్తామని ఆయన చెప్పారు. ఎందుకో ఆయన చాలాకాలం ఈ విషయాన్ని మరచిపోయారు. గురుగావ్‌లోని పాఠశాలలో నవంబర్ నెలలో ఓ విద్యార్థి హత్య జరగడంతో సీసీటీవీ కెమేరాల అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. సాధ్యమైనంత త్వరగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన విద్యాశాఖ అధికారులను ఇటీవల ఆదేశించారు. ఈ ఆదేశాలను అమలు చేయడంలో అనేక ఆచరణపరమైన సమస్యలతోపాటు నైతిక సమస్యలు ఎదురవుతాయన్న విషయాన్ని అరవింద్ కేజ్రివాల్గానీ, ఆయన అధికారులుగానీ ఎందుకు ఆలోచించడంలేదో అర్థం కావడం లేదు. పాఠశాలల్లో, తరగతి గదుల్లో ఏర్పాటు చేసే కొన్ని లక్షలాది సీసీటీవీ కెమేరాలను ఎవరు పర్యవేక్షించాలి? అందుకు ప్రత్యేక సిబ్బంది ఉంటుందా? విద్యార్థుల మనస్తత్వం గురించి అవగాహన కలిగిన సిబ్బందిని నియమిస్తారా? ఎంత మంది అవసరం అవుతారు? వారి జీతాల కోసం ఎంత డబ్బును వెచ్చిస్తారు? పాఠశాలల్లో కనీస అవసరాలైన మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలకు నిధులు లేవని చేతులెత్తేస్తున్న ప్రభుత్వం, నిఘా సిబ్బంది జీతాలకు ఎక్కడి నుంచి నిధులను తెస్తుంది? టీచర్ల కొరతతో సతమతమవుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో కోట్ల రూపాయలతో సీసీటీవీ కెమేరాలు పెట్టడం సాధ్యం అయ్యేపనేనా? ప్రభుత్వ పాఠశాలల్లో సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేస్తామంటే ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు? తరగతి గదులకు వాటిని పరిమితం చేస్తారా? అన్ని చోట్ల ఏర్పాటు చేస్తారా? నోయిడా పాఠశాలల్లో జరిగిన లాంటి సంఘటనలు పునరావతం కాకుండా ఉండేందుకు సీసీటీవీ కెమేరాలు అవసరమని అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. నోయిడాలో విద్యార్థిని రేప్‌చేసి హత్యచేసిన సంఘటన టాయ్లెట్లో జరిగింది. అంటే టాయ్లెట్లో కూడా సీసీటీవీ కెమేరాలు పెడతారా? ఇక తల్లిదండ్రులు కూడా ఇంటి వద్ద నుంచి ఎప్పటికప్పుడు పాఠశాలల్లో తమ పిల్లలు ఏం చేస్తున్నారో ఆప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లో తిలకించవచ్చంటున్నారు. వారు ఏ సమయంలో తమ పిల్లలను పర్యవేక్షించాలి? ఇంటి పనులు మానుకొని అన్ని వేళలా పర్యవేక్షించాలా? అసలు తల్లిదండ్రులు పిల్లలను పర్యవేక్షించడమేమిటీ? అది మోరల్ పోలిసింగ్ కాదా? టీచర్లపై అపనమ్మకాన్ని పెంచదా? పిల్లలు పాఠశాలకు వచ్చేది కేవలం చదువుకోసమే కాదు. ఆటపాటల కోసం, వాటితో ముడివడి ఉన్న ఆత్మీయత కోసం. సామాజికంగా చెప్పాలంటే తల్లిదండ్రులతో సంబంధం లేకుండా సమాజంలో తాము స్వతంత్రంగా ఎదిగేందుకు, బతికేందుకు బడి తోడ్పడుతుందని వస్తారు. ఏ తల్లిదండ్రులైనా బాల్యం దాటుకునే వచ్చినప్పటికీ నేటి కార్పొరేట్ విద్యా వ్యవస్థలో తమ పిల్లలకు మంచి బాల్యం ఉండాలని కోరుకోరు. తాము అనుకున్న మంచి భవిష్యత్తునే కోరుకుంటారు. పాఠశాలలకు వెళ్లిన తమ పిల్లలు చదువుకోకుండా ఆడుకుంటున్నారని, అల్లరి చేస్తున్నారని సీసీకెమేరాల ద్వారా చూసినప్పుడు తల్లిదండ్రుల ఆందోళన రెట్టింపు అవడమేకాదు. ఇంటికొచ్చాక వారి తాటతీసే తల్లిదండ్రులు లేకపోరు. సీసీకెమేరాలను ఏర్పాటు చేయడం మంటే తల్లిదండ్రులను పోలీసులను చేయడమే. ప్రత్యక్షంగా ప్రజలు పర్యవేక్షించే ప్రభుత్వం ఉండాలని ఉన్నత చదువులు చదివిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కోరుకుంటారు. ఈ ఆలోచనను ఆయన గతంలో రెండు, మూడు సార్లు బయటపెట్టారు కూడా. అందులో భాగంగానే ఆయనకు ఈ సీసీటీవీ కెమేరాల ఆలోచన వచ్చి ఉంటుంది. నిజంగా ప్రజలు ప్రత్యక్షంగా పర్యవేక్షించేలా ప్రభుత్వ పాలన కొనసాగాలని ఆయన కోరుకుంటే, అందుకు చిత్తశుద్ధి ఉంటే ముందుగా ఢిల్లీ సచివాలయంలో, కీలకమైన ప్రభుత్వ భవనాల్లో సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా ప్రభుత్వ సిబ్బంది పనితీరును ప్రజలు ఎప్పటికప్పుడు వీక్షించే అవకాశాన్ని కల్పించాలి. -
వింత జంతువు విధ్వంసం
♦ నియాలిలో కుప్పలు తెప్పలుగా గొర్రెల మరణం ♦ నర మేక దాడి అని అపోహ! ♦ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్న అటవీ సంరక్షక విభాగం భువనేశ్వర్: కటక్ జిల్లా నియాలి ప్రాంతంలో గత కొద్ది రోజులుగా గొర్రెలు కుప్పలు తెప్పలుగా మరణిస్తున్నాయి. ఆకస్మిక రోగ సంక్రమణ కాదు. అస్పష్టమైన దాడితో ఈ జీవులు అకారణంగా మరణిస్తున్నట్టు గ్రామంలో తీవ్ర భయాందోళనల చోటు చేసుకున్నాయి. శాలలో కట్టి ఉంచిన గొర్రెలపై ఈ దాడులు జరుగుతున్నాయి. గొర్రెల్ని చీల్చి చెండాడి చంపేస్తున్నట్టు వాస్తవ దృశ్యాలు రుజువు చేస్తున్నాయి. అయితే ఇదంతా మానవ కృత్యమా? అదృశ్య శక్తి దాడులా? క్షుద్ర శక్తుల ప్రయోగమా? కక్షదార్ల కుట్రా? ఇలా పలు సందేహాలతో నియాలి గ్రామస్తులు తల్లడిల్లుతున్నారు. విష ప్రయోగం అయితే కానే కాదని స్పష్టం అయిపోయింది. సోషల్ వైరల్ ఈ పరిస్థితుల్లో అద్భుత రూపం దాల్చిన జీవి గొర్రెల్ని హతమార్చుతుందనే సోషల్ మీడియా వైరల్ బలం పుంజుకుంది. మేక పోతు రూపంతో ముఖం మినహా శరీరం అంతా మానవ ఆకృతి కలిగి(నర మేక) ఉన్నట్టు ఈ ప్రసారం దుమారం రేపింది. ఈ ప్రసారంలో ఎంత మాత్రం నిజం లేదని రాష్ట్ర పశు సంవర్థక విభాగం మంత్రి డాక్టర్ దామోదర్ రౌత్ తెలిపారు. ఇదంతా దుమ్ములగొండి దాడి అయి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దాడి చోటు చేసుకున్న శాల పరిసరాల్లో కొన్ని అంతు చిక్కని పాద ముద్రల్ని గుర్తించారు. దాడులకు గురైన శాలల్ని పరిశీలించారు. ఏదో జంతువు ఈ చర్యకు పాల్పడుతున్నట్లు ఈ ఛాయలు స్పష్టం చేస్తున్నాయి. దాడుల్లో కొన్ని గొర్రెలు అదృష్టవశాత్తు స్వల్పంగా గాయపడి ప్రాణాలతో బయటపడుతున్నాయి. వీటిపై మిగిలిన ఆనవాళ్ల ప్రకారం గుర్తు తెలియని జంతువు బలంగా కరిచి గాయపరిచినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఏదో జంతువు మాత్రమే దాడులకు పాల్పడుతున్నట్టు విజ్ఞుల అభిప్రాయం. అదేమిటో స్పష్టం కావలసి ఉంది. సీసీటీవీ కెమెరాలతో నిగ్గు తేల్చుతాం: చీఫ్ కంజర్వేటరు నియాలి ప్రాంతంలో గొర్రెలపై దాడులకు సంబంధించి బలపడిన అపోహల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించాల్సి ఉంది. అభూత కల్పనతో పేరుకుపోయిన భయాందోళనల్ని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని అటవీ సంరక్షక విభాగం ప్రధాన అధికారి పీసీసీఎఫ్ ఎస్.ఎస్.శ్రీవాస్తవ తెలిపారు. ఈ దాడుల నిగ్గు తేల్చేందుకు ప్రభావిత ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల్ని అమర్చేందుకు నిర్ణయించినట్టు మంగళవారం ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో 5 చోట్ల సీసీటీవీ కెమెరాల్ని ఏర్పాటు చేస్తారు. భయాందోళన కలిగిస్తున్న జంతువుని గుడా రం నుంచి బయటకు రప్పించేందుకు బాణసంచ కా ల్చి దుమారం రేపుతారు. అంతకు ముందే పరిసర ప్రా ంతాల్లో వల పన్ని జంతువు పని పడతామని ఆయన వివరించారు. పరిస్థితులపై నిఘా వేసేందుకు అటవీ సంరక్షణ విభాగం 3 ప్రత్యేక స్క్వాడ్‌ల్ని నియమించింది. గొర్రెల శాలల్లో రాత్రి పూట దీపాలు వెలిగించేందుకు సంబంధీకులకు సలహా జారీ చేశారు. మృత గొర్రెల దేహ నమూనాల్ని పశువుల రోగాలు, పరిశోధన సంస్థ సేకరించి ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తుంది. గ్రామస్తుల గాలింపు పరిసర అటవీ ప్రాంతాల నుంచి, జనావాసం నుంచి ఏదో జంతువు తరలి వచ్చి గొర్రెలపై దాడికి పాల్పడుతుందనే భావనతో నియాలి గ్రామస్తులు గాలింపు ప్రారంభించారు. రాత్రి పూట పరిసర బొనొసాహి గ్రామం ప్రాంతంలో రాత్రంతా చీకటిలో నిఘా వేశారు. అంతు చిక్కని జంతువు దాడుల్లో 2, 3 రోజుల్లో 150 పెంపుడు గొర్రెలు మరణించాయి. ప్రభుత్వ యంత్రాంగం ఈ మేరకు పెదవి కదపకుండా చోద్యం చూస్తుంది. ఇదే వైఖరి కొనసాగితే ఈ పరిణామం ఎలా దారి తీస్తాయోననే భయాందోళనలు విస్తరిస్తున్నాయి. జిల్లా యంత్రాంగం నిర్మాణాత్మక కార్యాచరణతో తక్షణమే ముందుకు రావాలని బాధిత గ్రామస్తులు అభ్యర్థిస్తున్నారు. -
చిత్తూరు బస్టాండులో సీసీ కెమెరాల గొడవ
-
నాయకుల కట్టడికి 13వేల సీసీటీవీలు
ముంబయి: బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో నాయకులను కట్టడి చేయనుంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయనుంది. ఇందుకోసం ఎన్నికలు జరిగే ప్రాంతాల నిండా నిఘా నేత్రాలు(సీసీటీవీ కెమెరాలు) ఏర్పాటు చేస్తుంది. అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13,000 సీసీటీవీ కెమెరాలు. సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ నాయకుల హడావుడి అంతా ఇంతా కాదు. ఆ సమయంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బులు, కానుకలు ఇవ్వడం, బోగస్ ఓటింగ్‌కు పాల్పడే ప్రయత్నాలు చేయడం వారికి పరిపాటి. సమస్యాత్మక నియోజకవర్గాల్లో మత ఘర్షణలకు కూడా వారు పరోక్షంగా కారణం అవుతుంటారు. వీటికి తాజాగా బీఎంసీ పరిపాలనా విభాగం చెక్ పెట్టనుంది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులపై దృష్టి సారించేందుకు నిఘా నేత్రాలను ఏర్పాటు చేయనుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఫలితాల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ముంబైతో పాటు పశ్చిమ, తూర్పు ఉప నగరాల్లో 13,020 సీసీటీవీ కెమారాలు అద్దెకు తీసుకుంది. దానికోసం రూ.6.37 కోట్లు అద్దె చెల్లించనుంది. ఎన్నికల ప్రచార ర్యాలీలు, రాజకీయ బహిరంగ సభల్లోనూ వీటిని ఏర్పాటు చేయనున్నట్లు బీఎంసీ తెలిపింది. గత బీఎంసీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు 50శాతం కంటే తక్కువ ఓటింగ్ నమోదైంది. ఈ సారి మరో 10శాతం పెంచాలని బీఎంసీ ప్రయత్నాలకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కూడా సహకరిస్తుందని భావిస్తోంది. అందులో భాగంగా ప్రజలు ఓటు వేసేలా జనజాగృతి కార్యక్రమాలు చేపట్టాలని భావించింది. అందుకు ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ) నిర్మించిన స్కై వాక్‌లపై సుమారు రూ.3.45 లక్షలతో ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయనుంది. బస్సుల్లో ప్రకటనలు ఇచ్చేందుకు రూ.11.38 లక్షలు, లోకల్ రైళ్లలో ప్రకటనల కోసం రూ.8.73 లక్షలు ఖర్చు చేయనుంది. -
స్ప్లెండర్ పై వచ్చి యాక్టివా ఎత్తుకెళ్లాడు
-
'అన్ని బార్లలో సీసీ కెమెరాలు ఉండాలి'
-
'అన్ని బార్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి'
హైదరాబాద్: చిన్నారి రమ్య ఘటనతో నగరంలో ఎక్సైజ్ శాఖ అధికారులు తమ దాడులు ముమ్మరం చేశారు. అందులో భాగంగా జూబ్లిహిల్స్, బంజారాహిల్స్‌లోని బార్ అండ్ రెస్టారెంట్లలో ఎక్సైజ్ సీఐ కృపాకర్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. రెండు బృందాలుగా ఏర్పడి సిటీలో బార్ అండ్ రెస్టారెంట్లపై దాడులు చేస్తున్నామని ఎక్సైజ్ సీఐ కృపాకర్ వెల్లడించారు. 21 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారికి మద్యం విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అన్ని బార్లలో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయాలని సీఐ కృపాకర్ సూచించారు. -
ఓయూపై డేగకన్ను
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీపై రాష్ట్ర ప్రభుత్వం డేగకన్ను వేసింది. క్యాంపస్‌లో 42 మంది ఇంటెలిజెన్స్ అధికారులను నియమించింది. అందులో 22 మంది తెలంగాణ అధికారులు కాగా.. 20 మంది ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు ఉన్నారు. వీరు విద్యార్థుల ఆందోళనలు, అధికారుల పనితీరు, అధ్యాపకులు, ఉద్యోగుల హాజరు శాతం తదితర వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. క్యాంపస్ అంతటా రూ.9 కోట్ల వ్యయంతో సుమారు 600 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. -
సీఎం ఆఫీసులో సీసీటీవీలు మాయం
తిరువనంతపురం: అవినీతికి పాల్పడిన ఏస్థాయి వ్యక్తినైనా, సంస్థనైనా విడిచిపెట్టబోమని కేరళ సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ నేత, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న పినరాయ్ విజయన్ హెచ్చరించిన నేపథ్యంలో అక్కడి సీఎంవో ఆఫీసులోని సీసీటీవీ కెమెరాలన్నింటిని తొలగించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పూర్తిగా తొలగించారు. 2011లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల వద్ద తానేమీ దాచబోనని ప్రకటిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉమెన్ చాందీ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసి వాటిని ప్రత్యేక వెబ్‌సైట్‌కు లైవ్ టెలికాస్ట్ గా అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అధికారం మారిన నేపథ్యంలో సీఎం కార్యాలయాన్ని చాందీ ఖాళీ చేశారు. ఈ క్రమంలోనే అందులోని సీసీటీవీ కెమెరాలు కూడా తొలగించినట్లు తెలుస్తోంది. 'మొత్తం సీఎం కార్యాలయాన్ని ఖాళీ అయింది. మేం సోమవారం వెళ్లి చూడగా అక్కడి సీసీటీవీ కెమెరాలు కూడా కనిపించలేదు' అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక అధికారి చెప్పారు. -
సీసీ కెమెరాలతో సూపర్ సేఫ్టీ
► ప్రజాప్రతినిధులు, గేటెడ్ కమ్యూనిటీలు సహకరించాలి ► అందరి సహకారంతో నేరాల నియంత్రణ ► సీసీటీవీ కెమెరాలపై అవగాహన కార్యక్రమం ► హోంమంత్రి నాయిని కేపీహెచ్‌బీ: దొంగల అడ్రస్ గల్లంతు చేసేందుకు పోలీసులకు ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి పిలుపునిచ్చారు. ఆధునీకరించిన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ను నాయిని సోమవారం ప్రారంభించారు. అనంతరం జేఎ న్టీయూ ఆడిటోరియంలో సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కమ్యూనిటీ సీసీటీవీ అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పోలీసు లు, ఎమ్మెల్యేల ఇళ్లల్లో దొంగలు చోరీకి పాల్పడరని, ప్రజల ఇళ్లనే దోచుకుంటారనే వాదనలున్నాయని, చోరీ ల నియంత్రణ కోసం కమ్యూనిటీ సీసీటీవీలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం ప్రజాప్రతి నిధులు, గేటెడ్ కమ్యూనిటీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతల విషయంలో జంట పోలీసు కమిషనరేట్లు తీసుకుంటున్న చర్యలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, దీనిపై ప్రధాని మోదీ కూడా కితాబునిచ్చారన్నారు. ఒకప్పుడు ఠాణాకు వెళ్లాలంటే ఫిర్యాదుదారుడు ఒకటికి.. వందసార్లు ఆలోచించేవాడని, ఇప్పుడు పోలీసు స్టేషన్లు ఆధునీకరించి ప్రశాంత వాతావరణం నెలకొనడంతో బాధితులు ఫిర్యాదు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారన్నారు. సీసీటీవీలతో సేఫెస్ట్ సిటీ... శాంతిభద్రతల కోసం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారం ప్రజల్లో మనోధైర్యాన్ని పెంచిందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సీసీటీవీల ఏర్పాటుతో హైదరాబాద్ సేఫెస్ట్ సిటీగా మారుతుందన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరెకాపూడిగాంధీ తమ నిధుల నుంచి రూ. కోటికిపైగా సీసీటీవీల కోసం ఇచ్చారన్నారు. కార్డన్‌సెర్చ్, మహిళల భద్రత, యాంటీ చైన్‌స్నాచింగ్ వంటి ఫోర్స్‌లు పటిష్టంగా పని చేయడం వల్ల గతేడాది కంటే ఈ నాలుగు నెలల్లోనే సైబరాబాద్‌లో 32 శాతం నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. మరో రెండున్నర కోట్లు ఇస్తా: రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల కోసం తీసుకుంటున్న చర్యలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నాలుగు నెలల్లో సీసీటీవీ కెమెరాల కోసం మరో రెండున్నర కోట్ల రూపాయలు అందిస్తానన్నారు. తన నియోజకవర్గం పరిధిలో ఉన్న వందలాది సాఫ్ట్వేర్ కంపెనీల్లో లక్షలాది మంది ఐటీ ఉద్యోగులున్నారని, వీరిలో పనిచేసే విదేశీమహిళలు సైతం ఉన్నారని ఎమ్మెల్యే అరెకాపూడిగాంధీ అన్నారు. షీ టీమ్స్‌తో మహిళల కు భద్రత పెరిగిందన్నారు. అంతకుముందు సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో వెలుగులోకి వచ్చిన సంచలనాత్మక అంశాలతో పాటు వాటివల్ల కలిగిన ఉపయోగాలను డాక్యుమెంటరీ రూపంలో పోలీసులు వివరించారు. కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ కార్తీకేయ, బాలానగర్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, కూకట్పల్లి ఏసీపీ భుజంగరావు, బాలానగర్ ఏసీపీ నంద్యాల నర్సింహ్మారెడ్డి, జోనల్ కమిషనర్ గంగాధర్ రెడ్డి, డీసీలు నరేందర్‌గౌడ్, రవీందర్‌కుమార్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు తదితరులు పాల్గొన్నారు. -
కారుతో ఢీకొట్టి.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లాడు..
గుర్గావ్: గతనెల 28న గుర్గావ్ లో ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. హోండా కారు నడుపుతున్న ఓ డ్రైవర్ ఎదురుగా వస్తున్న వ్యక్తిని ఢీకొట్టాడు. అయితే, అయిందేదో అయిపోయిందని తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే సమస్య అక్కడితో వీగిపోయేది. కారు ఢీకొన్న వెంటనే ఆ వ్యక్తి కారు ముందుభాగంపై పడ్డాడు. మార్కెట్లో చుట్టుపక్కలున్న జనాలు కొడతారని భయపడ్డాడు. ఇక అంతే అక్కడి నుంచి కారును వేగంగా పొనిస్తూ సుమారు కిలోమీటర్ వరకు అలాగే కారు డ్రైవర్ ఈడ్చుకుంటూ వెళ్లాడు బాధితుని కథనం ప్రకారం... ప్రతీక్ కుమార్, తన మూడేళ్ల బాబుతో కలిసి మార్చి28 సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో బంధువుల ఇంటికి వెళుతున్నాడు. ఇంతలో ఓ బ్లాక్ హోండా కారు నడుపుతున్న వ్యక్తి తనను ఢీకొట్టాడనని కనీసం అక్కడ ఆగకుండా అలాగే వెళ్తూనే ఉన్నాడని చెప్పుకొచ్చాడు. పాత ఢిల్లీ రోడ్ మార్గంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద ఈ ఘటన జరిగిందని చెప్పాడు. కిలోమీటర్ వరకు వెళ్లిన తర్వాత కారు నుంచి కింద పడ్డాడనీ ఆ వెంటనే మరో వాహనం తనను తాకడంతో గాయపడ్డట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. తనకు యాక్సిడెంట్ జరిగిన ఘటనను వీడియో రూపంలో సాక్ష్యాన్ని అందించడానికి ఆ ఏరియాలోని దుకాణాలలో ఎంక్వయిరీ చేసి ఫలితాన్ని పొందాడు. బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. -
సీసీ కెమెరాల నిఘాలో టెన్త్ పరీక్షలు..
15లోగా పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి పాఠశాలలకు విద్యాశాఖ ఆదేశం అవకతవకల నియంత్రణకు నిర్ణయం వ్యయం సుమారు రూ.40 కోట్లు ఆర్థిక భారమంటున్న ప్రైవేటు యాజమాన్యాలు వచ్చే ఏడాదికి వాయిదా వేయాలి:‘ట్రస్మా’ సాక్షి, హైదరాబాద్: టెన్త్ పరీక్షల్లో అవకతవకలను నివారించేందుకు పాఠశాల విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పరీక్షలను నిఘానీడలో జరపాలని నిర్ణయించింది. గతంలో పలు ప్రాంతాల్లో జరిగిన మాస్ కాపీయింగ్, పరీక్ష రాసే విద్యార్థులకు ఇన్విజిలేటర్లే జవాబులు చెప్పడం.. వంటి ఘటనలు వెలుగుచూడటంతో వాటిని అరికట్టేందుకు సిద్ధమైంది. మార్చి 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల కోసం పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను వినియోగించాలని తాజాగా నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు జరగనున్న అన్ని (ప్రభుత్వ, ప్రైవేటు) పరీక్షా కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారు (డీఈఓ)లను ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ (డీజీఈ) ఆదేశించారు. దీంతో ఈనెల 15లోగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పరీక్షాకేంద్రాలుగా ఎంపికైన ప్రభుత్వ పాఠ శాలల ప్రధానోపాధ్యాయులకు, ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లకు ఆయా డీఈఓలు ఉత్తర్వులు జారీచేశారు. పరీక్షహాలుగా వినియోగించే తరగతి గదులు, ప్రశ్నాపత్రాల బండిల్స్ తెరిచే, జవాబు పత్రాలు ప్యాక్ చేసే గదులు, ప్రధానోపాధ్యాయుని రూమ్‌తో పాటు పాఠశాల ప్రాంగణమంతా కనిపించేలా ఓపెన్ కారిడార్‌లోనూ తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. రూ.40 కోట్లకు పైగా వ్యయం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు సుమారు 5 లక్షల మంది విద్యార్థులు హాజరుకానుండగా, 2,528 పరీక్షాకేంద్రాలను ఎంపిక చేశారు. 1,510 ప్రభుత్వ పాఠశాల(జెడ్పీ, కేజీబీవీ, మోడల్, రెసిడెన్షియల్)ల్లో, 1,018 ప్రైవేటు పాఠశాలల్లో పరీక్షలు జరగనున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటకు ఒక్కో పాఠశాలకు రూ.1.5 లక్షల చొప్పున ఖర్చవుతుందని అంచనా. దీనిప్రకారం ప్రభుత్వ పాఠశాలకు రూ.22.65 కోట్లు ఖర్చు కానుండగా, పైవేటు పాఠశాలలపై రూ.15.27 కోట్ల భారం పడనుంది. ఇవికాక టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేవారి కోసం మరో 300 పరీక్షాాకేంద్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మొత్తం కలిపితే సీసీ కెమెరాలకయ్యే ఖర్చు రూ. 40 కోట్లు దాటనుందని ప్రభుత్వ వర్గాల అంచనా. ప్రైవేటు స్కూళ్లకు ఆర్థిక భారమే! టెన్త్ పరీక్షాకేంద్రాలుగా ఎంపికైన ప్రైవేటు పాఠశాలల్లో సీసీ కెమెరాలను సొంతంగా ఏర్పాటు చేసుకోవాలన్న ఆదేశాలు తమకు ఆర్థిక భారంగా పరిణమించాయని ఆయా పాఠశాలల కరస్పాండెంట్లు వాపోతున్నారు. ఒక్కో పాఠశాలలో కనీసం 15 నుంచి 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉందని, రూ.1.5-2 లక్షల వరకు వ్యయమవుతుందని చెబుతున్నారు. సాధారణ పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఓ మోస్తరు ఆదాయం వచ్చే పాఠశాలలకు సీసీ కెమెరాల ఏర్పాటు భారమేనని, తప్పనిసరి చేసిన పక్షంలో ఆ భారాన్ని విద్యార్థులపైనే (ఫీజుల పెంపు రూపేణా) వేయాల్సి వస్తుందంటున్నారు. సర్కారీ బడుల్లో భద్రత ఏదీ? రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏ ప్రభుత్వ పాఠశాలలోనూ కాపలాదారులు లేనందున రూ.కోట్లు వెచ్చించి ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల భద్రత ప్రశ్నార్థకంగా మారనుంది. ఇప్పటికే ప్రభుత్వం అందించిన కంప్యూటర్లు పలు పాఠశాలల్లో చోరికి గురైన సంగతి తెలిసిందే. సీసీ కెమెరాల ఏర్పాటు అలా ఉంచితే.. ఏడాది పొడవునా వాటి నిర్వహణ మరింత ఇబ్బందికరంగా మారనుందని పలువురు ప్రధానోపాధ్యాయులు అంటున్నారు. వచ్చే ఏడాదికి వాయిదా వే యండి పరీక్షాకేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అయితే, ఇప్పటికిప్పుడు ఈ ప్రక్రియ పూర్తికావాలని ఆదేశించడం ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ఇబ్బందికరమే. ఒకేసారి అన్ని పాఠశాలలు సీసీ కెమెరాల కోసం ఎగబడితే ధరలు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రభావం గ్రామీణ పాఠశాలలపై ఎక్కువగా ఉంటుంది. సమయం తక్కువగా ఉన్నందున, ప్రైవేటు స్కూళ్ల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సీసీ కెమెరాల ఏర్పాటును వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని కోరుతున్నాం. -శ్రీనివాసరెడ్డి, తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్ర స్మా) అధ్యక్షుడు -
వెయిట్ అండ్ ‘సీ..సీ’!
♦ ట్రాఫిక్ ఉల్లంఘనులపై ‘టెక్నాలజీ’ కొరడా ♦ జంక్షన్ల వద్ద జాగ్రత్త పడుతున్న వాహన చోదకులు సాక్షి, సిటీబ్యూరో : ట్రాఫిక్ జంక్షన్ల వద్ద రెడ్‌లైట్ ఉన్నా రయ్యుమని దూసుకెళ్లే వాహన చోదకులు...ఇప్పుడు అలా వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు లేరు కదా...ఎమర్జెన్సీ పని ఉందని రెడ్‌సిగ్నల్ క్రాస్ చేయాలనుకునే వాహనచోదకులను ‘సీసీటీవీ’ కెమెరాలు హడలెత్తిస్తున్నాయి. ఇదే కాదు ఆటోమేటిక్ రెడ్‌లైట్ కెమెరా, ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఆపరేట్ చేసే స్పీడ్ లేజర్ గన్లు, డిజిటల్ కెమెరా, ట్యాబ్‌లు కూడా ట్రాఫిక్ ఉల్లంఘనుల విషయంలో తమ పని తాము చేసుకుపోతున్నాయి. ఫలితంగా ఈ చలాన్లు ఇంటికి వచ్చి చేరుతున్నాయి. 15 రోజుల్లో కట్టకపోతే లీగల్ నోటీసులు వస్తున్నాయి. అయినా స్పందించకుంటే చార్జిషీట్ దాఖలు చేస్తున్నారు. ఏకంగా జైలుకే వెళ్లే సందర్భాలు వస్తున్నాయి. ఫలితంగా జంక్షన్ల వద్ద ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించేవారి సంఖ్య తగ్గింది. రెడ్‌సిగ్నల్ ఉండగానే జంక్షన్ దాటిన వారి సంఖ్య జవనరిలో 10,129 ఉంటే జూలైకి ఆ సంఖ్య 2,338కి తగ్గింది. జనవరిలో 6,416 మంది అతి వేగంతో దూసుకెళుతూ లేజర్ గన్ కెమెరాకు చిక్కగా.. జూలైలో 6,023 మందికి ఈ చలాన్లు జారీ చేశారు. అంటే పరిస్థితిలో కొంత మార్పు వచ్చినట్టు కనబడుతోంది. కాగా, తొలినాళ్లలో దాదాపు 40 శాతం వరకు ఈ-చలాన్లు చెల్లించే నగరవాసుల సంఖ్య ఇప్పుడు ఏకంగా 75 శాతానికి చేరుకోవడం విశేషం. స్పీడ్ పెరిగితే ఫైనే.. మెహదీపట్నం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే అవుటర్ రింగ్ రోడ్డులో ఒక్కో దగ్గర ఒక్కో వేగంతో వాహనం నడపాలనే సూచన బోర్డులు కనిపిస్తాయి. 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన ప్రాంతంలో 60 కిలోమీటర్ల వేగంతో దూసుకెళితే ఈ స్పీడ్ లేజర్ గన్లు ఇట్టే పసిగడతాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 42,951 మందికి ఈ చలాన్లు జారీ అయ్యాయి. త్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్...ఇలా తదితర నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తున్నారనే దృశ్యాలను సర్వ్లెన్స్ కెమెరా మానిటరింగ్ సెల్(ఎస్సీఎంసీ) పర్యవేక్షిస్తుంది. సీసీ కెమెరాలు, కానిస్టేబుళ్ల కెమెరాకు చిక్కకున్నా ఈ సెల్ పసిగడుతుంది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 1,62,498 మందికి ఎస్సీఎంసీ ద్వారా ఈ చలాన్లు జారీ అయ్యాయి. జంపింగ్ ఈ ప్రాంతాల్లోనే... మాసబ్‌ట్యాంక్ చిల్డ్రన్ పార్కు జంక్షన్, ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జంక్షన్, మదీనా, తెలుగు తల్లి ఫ్లైఓవర్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, శ్రీనగర్ టీ జంక్షన్లలో ఎక్కువగా రెడ్‌లైట్ జంపింగ్ కేసులు చోటుచేసుకుంటున్నాయి. మెహదీపట్నంలోని సరోజినిదేవీ కంటి ఆస్పత్రి వద్ద రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తూ సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. జంక్షన్లతో పాటు రోడ్డుపై నో పార్కింగ్ జోన్లో నిలిపిన వాహనాలను కానిస్టేబుళ్లు కెమెరాలో బంధించి...ఆ ఫొటోలను ఆయా పోలీసు స్టేషన్ల నుంచి అప్లోడ్ చేసి ఈ చలాన్‌కు పంపుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 11,06,093 మందికి ఈ చలాన్లు జారీ అయ్యాయి. జనవరిలో 13,940 మందికి జరిమానా వేస్తే...జూలైలో ఆ సంఖ్య 26,032కి ఎగబాకింది. వీటిలో ఎక్కువగా రాంగ్‌సైడ్ డ్రైవింగ్, నో పార్కింగ్ జోన్లో ఉన్న వాహన కేసులే ఉన్నాయి. ఒకప్పుడు 80 శాతం వరకు ట్రాఫిక్ పోలీసులు పనిచేస్తే, 20 శాతం టెక్నాలజీని ఉపయోగించుకునేవారు. ఇప్పుడు 80 శాతం టెక్నాలజీతోనే పనులన్నీ చేస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. -
అన్ని జైళ్లలో సీసీ కెమెరాలు: సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని కారాగారాల్లో క్లోజ్డ్ సర్క్యూట్ (సీసీ) టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్రం, రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. చిత్రహింసలను నిరోధించడానికి పోలీసుస్టేషన్లలో, లాకప్‌లలో కూడా సీసీ కెమెరాల ఏర్పాటు పరిశీలించాలని సూచించింది. అన్ని జైళ్లలో ఏడాదిలోగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలంది. అలాగే ప్రతి పోలీసుస్టేషన్లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉండేలా చూడాలని, రాష్ట్రాల మానవ హక్కుల కమిషన్లలో ఖాళీలను మూడునెలల్లోగా భర్తీ చేయాలని ఆదేశించింది. -
పుష్కర ఘాట్ల వద్ద సీసీ కెమెరాలు
రాజమండ్రి (తూర్పుగోదావరి జిల్లా) : గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి పుష్కర ఘాట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పురపాలకశాఖ కార్యదర్శి జి.జయలక్ష్మి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పుష్కర ఘాట్లతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలలో 31 కిలోమీటర్ల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. రిలయన్స్ జియో ఇన్కామ్ కార్పొరేట్ సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
వైద్య ఆరోగ్యశాఖలో సీసీ కెమెరాలు
- పారదర్శకతకు ప్రాధాన్యం... అవినీతి, అక్రమాలకు చెక్ - ముఖ్య అధికారుల చాంబర్లు, కారిడార్లలో ఏర్పాటు - ప్రధాన ఆసుపత్రుల్లోనూ ఏర్పాటు చేయాలని యోచన హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖ పారదర్శకతపై దృష్టి సారించింది. అక్రమాలు, అవినీతికి ఆస్కారం ఉన్న ప్రధాన కార్యాల యాల్లో ఐపీ అడ్రస్ కలిగిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆ శాఖ యోచిస్తోంది. ఇప్పటికే ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌చందా తన చాంబర్లో స్వయంగా సీసీ కెమెరా ఏర్పాటుచేసుకుని ఆదర్శంగా నిలవడమే కాకుండా, శాఖలోని వివిధ విభాగాల ముఖ్య అధికారుల కార్యాలయాలు, ప్రధాన ఆసుపత్రుల్లో ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. తద్వారా అవినీతి అక్రమాలకు చెక్ పెట్టడం... రోగులకు సంపూర్ణ వైద్య, ఆరోగ్య సేవలను అందించవచ్చని పేర్కొంటున్నారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఆయా కార్యాలయాల్లో జరిగే అన్ని వ్యవహారాలను ఇంటర్నెట్ ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. ఆయా కార్యాలయాల నుంచి సచివాలయంలోని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ముఖ్యకార్యదర్శి చాం బర్లకు అనుసంధానం చేస్తారు. ఆస్పత్రుల్లో సేవల పర్యవేక్షణ వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి వచ్చే రాష్ట్ర స్థాయి ముఖ్య ఆసుపత్రులైన గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ వంటి వాటిల్లోనూ... అలాగే పరిపాలనా విభాగాలైన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్ర మౌలికసేవలు, సదుపాయాల సంస్థ, ఆరోగ్యశ్రీ ట్రస్టు వంటి వాటిల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఇప్పటికే గాంధీలో 200 కెమెరాలు ఏర్పాటుచేశారు. కోఠిలోని వైద్యవిద్యాశాఖ సంచాలకుని చాంబర్, కారిడార్లలోనూ వీటిని బిగించారు. కొద్దిరోజుల్లో వీటిని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సీసీ కెమెరాలను కంట్రోల్‌రూంతో అనుసంధా నం చేయడం ద్వారా ఆయా ఆస్పత్రుల్లో వైద్య సేవలు, పారిశుధ్యం, రోగులకు తలెత్తే ఇబ్బం దులు ఎప్పటికప్పుడు తెలుసుకుని అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి వీలు కలుగుతుంది. సంబంధిత మంత్రి, ఉన్నతాధికారుల పర్యవేక్షణకు సులవవుతుంది. ఏదీ రహస్యం కాదు... 'ఆర్టీఐ చట్టం వచ్చాక ఏదీ రహస్యం కాదు. ఎవరు ఎప్పుడు ఏది అడిగినా నిర్ణీత కాలంలో వారికి ఆ సమాచారం ఇస్తున్న నేపథ్యంలో ఎవరూ అడగకుండానే సమాచారం అందరికీ అందుబాటులో ఉంచడం మరింత పారదర్శకత అవుతుంది కదా' - సురేష్‌చందా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి -
రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ల వద్ద కెమెరాలు
తిరుపతి: ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడానికి రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ డీజీపీ జె.వి.రాముడు వెల్లడించారు. శుక్రవారం తిరుపతి నగరంలోని తూర్పు పోలీసు స్టేషన్లో కమాండింగ్ సెంట్రల్ పాయింట్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం జె వి రాముడు మాట్లాడుతూ... వచ్చే ఆరునెలల్లో ఎర్రచందనం ప్రధాన స్మగ్లర్లను అరెస్ట్ చేస్తామన్నారు. తిరుపతి అత్యంత సున్నితమైన నగరమని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో నిఘా వ్యవస్థను పటిష్ట పరిచే క్రమంలో కమాండింగ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జె.వి.రాముడు వివరించారు. అలాగే తిరుపతి అర్బన్ కాంప్లెక్స్‌కు స్థల సేకరణ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు చెప్పారు. -
పనిచేయని ‘నిఘా నేత్రం’!
సాక్షి, ముంబై: నగరంలోని బెస్ట్ బస్సుల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలు చాలావరకు పనిచేయడం లేదు. దీంతో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అయినా సదరు కాంట్రాక్టర్ గాని, బెస్ట్ అధికారులు గాని పట్టించుకోవడంలేదు. గతంలో బెస్ట్ బస్సుల్లో ప్రయాణించేవారి భద్రత దృష్ట్యా బస్సులన్నింటిలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేశారు. ఎవరైనా బస్సు ఎక్కినప్పుడు పర్సులు పోగొట్టుకున్నా లేదా మహిళలను ఆక తాయిలెవరైనా ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదులందినా ఆయా బస్సుల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను చూసి నిందితులను గుర్తించేవారు. సాధారణంగా ఈ కెమెరాలలో 72 గంటల వరకు ఫుటేజ్ రికార్డు ఉంటుంది. వాటినే బ్యాగ్ లిఫ్టింగ్, ఉగ్రవాద కేసులకు సంబంధించిన విషయాలలో పోలీసులు సాక్ష్యాలుగా ఉపయోగిస్తారు. కాగా, కొంత కాలంగా బెస్ట్ బస్సుల్లో ఈ కెమెరాలు పనిచేయడం మానేశాయి. దీంతో దొంగతనాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడం వీలుకావడంలేదు. ఇటీవల కాలంలో బెస్ట్ బస్సుల్లో దొంగల బెడద ఎక్కువగా మారింది. లక్షలాది మంది ప్రజలు తమ కార్యాలయాలకు వెళ్లేందుకు, ఇతర కార్యకలాపాలకు ఈ బస్సులనే ఆశ్రయిస్తుండటంతో జేబుదొంగలకు అది వరంగా మారింది. రద్దీ సమయంలో వీరు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తుండటంతో రోజూ వేలాదిమంది తమ వస్తువులను పోగొట్టుకుంటున్నారు. ఇటీవల ఓ మిహ ళా బస్సులో చోరీ చేసింది. కానీ ఆ సంఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు కాలేదు. సదరు మహిళ ఫిర్యాదు చేసినా నిందితుడిని గుర్తించడంలో బెస్ట్ అధికారులు విఫలమయ్యారు. ప్రస్తుతం 2,300 బస్సుల్లో మాత్రమే సీసీటీవీ కెమెరాలు పనిచేస్తుండగా, మిగిలిన బస్సుల్లో అవి ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయని పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కాగా, డిసెంబర్ 31లోగా బెస్ట్‌కు సంబంధించిన అన్ని బస్సుల్లోనూ సీసీటీవీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీచేసినట్లు సంస్థ అధికారులు తెలిపారు. సంస్థ నిబంధనలను పాటించకపోతే కాంట్రాక్టు రద్దు చేస్తామని హెచ్చరించినట్లు వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఏసీ బస్సులు సహా పలు ఇతర బస్సుల్లో ఏర్పాటుచేసిన సుమారు 1,700 కెమెరాలు బాగానే పనిచేస్తున్నాయని ఒక అధికారి తెలిపారు. మిగిలిన బస్సుల్లో కూడా ఈ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బస్సుల్లో కెమెరాలను అమర్చడం వల్ల మహిళలకు భద్రత ఏర్పడుతుందని, అందుకే ఈ విషయమై పోరాటం చేస్తున్నానని బెస్ట్కమిటీ సభ్యుడు కేదార్ హంబల్కర్ తెలిపారు. -
రెప్పవాల్చిన నిఘా నేత్రం
నూజివీడు : పెచ్చుమీరుతున్న నేరాలను అదుపు చేసేందుకు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసు నిఘా నేత్రంఅధికారులు గాలికొదిలేశారు. రెండేళ్ల క్రితం నూజివీడులో రోడ్లపైనే బంగారు గొలుసులు తెంపుకొనిపోవడం, ఇళ్లలో పట్టపగలే చోరీలకు పాల్పడటం, ఆ క్రమంలో ప్రాణాలు తీసేందుకూ వెనకాడకపోవడం వంటి ఘటనలు విచ్చలవిడిగా జరిగాయి. 2012లో పట్టపగలు మధ్యాహ్న సమయంలో మహిళ మెడలోని బంగారు గొలుసులు లాక్కొని హత్యచేసిన ఘటనలో నిందితులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ లభ్యంకాని నేపథ్యంలో సీసీ కెమెరాల ఆవశ్యకతను గుర్తించారు. పట్టణంలోని చిన్న గాంధీబొమ్మ సెంటర్, సింగ్ హోటల్ సెంటర్, బస్టాండు సెంటర్ల వద్ద అప్పటి ఎస్ఐ ఐవీ నాగేంద్రకుమార్ దాతల సహకారంతో వీటిని ఏర్పాటుచేశారు. వీటి పర్యవేక్షణ కోసం చిన్నగాంధీబొమ్మ సెంటర్లో ఒక కంప్యూటర్ గదిని కూడా కేటాయించారు. సీసీ కెమెరాల కారణంగా అప్పట్లో చైన్ స్నాచింగ్‌లు, ఈవ్‌టీజింగ్‌లు, ట్రాఫిక్ ఉల్లంఘనలు అదుపులోకి చాలావరకు తగ్గాయి. కొరవడిన పర్యవేక్షణ... సీసీ కెమెరాలను ఏర్పాటుచేసిన కొత్తలో కొద్దిరోజులపాటు బాగానే నిర్వహించినా.. అనంతర కాలంలో వాటి నిర్వహణను గాలికొదిలేశారు. దీంతో నిఘా నేత్రాలు నిరుపయోగంగా మారాయి. కొన్ని రోజులు మాత్రమే పనిచేసిన ఈ సీసీ కెమెరాలు ఆ తర్వాత పనిచేయడం లేదు. పోలీసు అధికారులు కూడా వాటిని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. సీసీ కెమేరాల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన గది కూడా ఖాళీచేయడం గమనార్హం. తీవ్ర నేరాలు జరిగితే గుర్తించడం ఇబ్బందే... సీసీ కెమెరాలు వినియోగంలో లేని నేపథ్యంలో గతంలో మాదిరిగా తీవ్ర నేరాలు జరిగితే పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. సంఘ వ్యతిరేక శక్తుల కార్యకలాపాలను పసిగట్టడానికి, నేరాలను నిరోధించడానికి ఉపయోగపడే సీసీ కెమెరాలను పునరుద్ధరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
‘భద్రత’కు లేదు భరోసా..
సాక్షి, ముంబై: 26/11 ఘటన జరిగి బుధవారంతో ఆరేళ్లు పూర్తవుతున్నాయి. ఆ ఘటన తాలూకు జ్ఞాపకాలు ముంబైవాసులను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ముంబైలో అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముంబైకర్లు ఇప్పటికీ తాము పూర్తి భద్రత కలిగి ఉన్నామనే భావనకు రాలేకపోతున్నారు. పాక్ ప్రేరేపిత ముష్కరులు పదిమంది 2008 నవంబర్ 26వ తేదీన ముంబైలో జరిపిన మారణహోమంలో 166 మంది మృత్యువాత పడగా మరో 300 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఎన్ఎస్జీ కమాండోలు, పోలీసులు, ఇతర రక్ష క దళాలు కలిసి 9 మంది ముష్కరులను హతమార్చగా అజ్మల్ కసబ్ అనే ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడ్డాడు. ఆ తర్వాత అతడిని యెరవాడ జైల్లో 2012లో ఉరితీశారు. అయితే ముష్కరుల ఘటన నేపథ్యంలో ముంబైలో తిరిగి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాయి. నగరవ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, ప్రత్యేక భద్రతా దళం ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ ఇప్పటికీ వాటిని సంపూర్ణంగా అమలు చేయకపోవడం గమనార్హం. పేరు ఘనం.. కాంట్రాక్ట్ వేతనం .. ముష్కరుల దాడి అనంతరం జాతీయ భద్రత దళం (ఎన్ఎస్జి) మాదిరిగానే మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర భద్రత దళాన్ని 2010 ఏప్రిల్‌లో ప్రారంభించింది. 250 మందితో మొదలైన ఈ దళంలో ఇప్పుడు 2,500 మంది కమాండోలు ఉన్నారు. వీరికి ప్రత్యేక పోలీసు అధికారులుగా గుర్తిస్తున్నారు. ముంబైలోని మెట్రో, మోనో మార్గాలోని అన్ని రైల్వేస్టేషన్లు, మహాలక్ష్మి మందిరం, ఓఎన్జిసి, ఐఐటి-పవాయి, సెబీ కార్యాలయాలు, జెఎన్పిటిలతోపాటు రాష్ట్రం లోని ప్రముఖ సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించి వాటివద్ద ఈ దళానికి చెందిన కమాండోలను మోహరిస్తున్నారు. అయితే వీరికి మౌలిక సదుపాయాల కల్పనలో గాని, ఆయుధాల విషయంలో గాని ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీరికి పాత ఆయుధాలు అప్పగించడంతో అత్యాధునిక ఆయుధాలతో దాడులకు దిగే ముష్కరులను ఎలా ఎదుర్కొంటారనేది ప్రశ్నగా మారిం ది. అలాగే ప్రత్యేక పోలీసు అధికారులు హోదా ఇచ్చిన వీరికి స్థాయికి తగ్గట్టుగా ఏవి లభించడంలేదు. ముఖ్యంగా దళంలోని కమాండోలకు లభించేగౌరవ వేతనం రూ. 10,400 మినహా ఎలాంటి అలవెన్స్ (బత్తాలు) ఇవ్వడంలేదని తెలిసింది. వీరందరూ ఇప్పటికీ 11 నెలల కంట్రాక్ట్పైనే పనిచేస్తున్నారని తెలిసింది. మరోవైపు అధికారులకు మాత్రం కనీస వేతనం రూ. 50 వేల వరకు అందిస్తున్నారు. ప్రభుత్వ సంస్థా లేదా ప్రైవేటా...? మహారాష్ట్ర భద్రత దళం ప్రభుత్వ సంస్థనా లేదా ప్రైవేట్ సంస్థనా అనేది స్పష్టం కావడంలేదు. భర్తీ మాత్రం పోలీసుల భర్తీ ప్రక్రియ మాదిరిగానే నిర్వహిస్తున్నారు. కాని వీరిని కంట్రాక్ట్ కార్మికులుగా పరిగణిస్తున్నారు. దీంతో ఈ కమాండోలలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అసలు మేము ప్రభుత్వ ఉద్యోగులమా..? లేదా ప్రైవేట్ ఉద్యోగులమా అనేది తెలియడంలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగంలో చేరాలంటూ అనేక మంచి ఉద్యోగాలను వదిలి వస్తే ఇక్కడ సరైన సదుపాయాలు లేకుండా తాము పనిచేయాల్సి వస్తోందని ఓ కమాండో తెలిపారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఏదీ.. ఘటన అనంతరంలో నగరంలోని అన్ని ముఖ్య కూడళ్లతోపాటు వివిధ సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేయాలని 2008లోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‌తో 6 వేల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదన అమలులో మాత్రం నత్తనడక నడుస్తోంది. ఈ ఆరేళ్ల కాలంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వీటిని అమర్చారు. మరోవైపు వీటి ఏర్పాటుకు ప్రస్తుతం సుమారు రూ.1,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. దీంతో ప్రభుత్వం వీటి ఏర్పాటుపై మీనమేషాలు లెక్కిస్తోంది. సామాన్యుల్లో సన్నగిల్లుతున్న నమ్మకం.. నగర భద్రతపై సామాన్య పౌరులు భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం తాము అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నామని.. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తే ఉగ్రవాద దాడుల నుంచి నగరవాసులను సురక్షితంగా కాపాడగలుగుతామని అంటున్నారు. ముఖ్యంగా ఎవరైనా.. ఎక్కడైనా.. అపరిచితులు అనుమానంగా సంచరిస్తున్నట్లు కనిపించినా..లేదా రైళ్లు, బస్సులు, ఇతర ప్రయాణ వాహనాల్లో ఎవరైనా బ్యాగులు, బాక్సులు వంటివి వదిలేసి వెళ్లిపోయినట్లు అనిపించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్లకు సమాచారమివ్వాలని వారు కోరుతున్నారు. -
డీటీసీ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు
న్యూఢిల్లీ: నగరవాసులకు ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు భద్రతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) తాజాగా 200 బస్సుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసింది. రాజ్‌ఘాట్, సరోజినీనగర్ డిపోకు చెందిన బస్సుల్లో వీటిని ఏర్పాటు చేశామని సంబంధిత అధకారి ఒకరు తెలియజేశారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏడు గంటలపాటు దృశ్యాలను నమోదు చేయగల సామర్థ్యం ఈ కెమెరాలకు ఉందన్నారు. తొలి విడతలో భాగంగా వీటిని బస్సుల్లో అమర్చామన్నారు. మలివిడతలో మరిన్ని బస్సులకు వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. తొలి విడత విజయవంతంగా పూర్తయిందన్నారు. తొలివిడత కింద అమర్చిన సీసీటీవీ కెమెరాల పనితీరును ప్రస్తుతం పరిశీలిస్తున్నామన్నారు. ఈ కెమెరాలు రాత్రి వేళల్లో డీటీసీ బస్సుల్లో రాకపోకలు సాగించే మహిళలకు ఎంతో ఉపయుక్తమవుతాయన్నారు. రాజ్‌ఘాట్, సరోజినీనగర్ డిపోల్లో కంట్రోల్‌రూంలను ఏర్పాటు చేశామని, ఈ కెమెరాలు నమోదు చేసే దృశ్యాలను నిపుణులు ప్రతిరోజూ పరిశీ లిస్తుంటారని తెలిపారు. సీసీటీవీ కెమెరాల్లో 15 గంటలపాటు నమోదైన దృశ్యాలను ఆయా కంప్యూటర్లలో భద్రపరుస్తామని తెలిపారు. డిసెంబర్, 16నాటి సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో డీటీసీ యాజమాన్యం రాత్రివేళల్లో సేవలందించే బస్సుల్లో ఇద్దరు హోంగార్డులను నియమించిన సంగతి విదితమే. -
80 డీటీసీ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు
న్యూఢిల్లీ: మహిళా ప్రయాణికుల భద్రతకోసం ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) తన ఆధ్వర్యంలోని 80 బస్సులలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసింది. తొలి విడతలో భాగంగా మొత్తం 200 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని డీటీసీ నిర్ణయించిన సంగతి విదితమే. వీటిని లోఫ్లోర్ ఏసీ, నాన్ఏసీ బస్సుల్లో ఏర్పాటు చేయనుంది. ఈ విషయమై డీటీసీ అధికార ప్రతినిధి ఆర్.ఎస్.మిన్హాస్ మాట్లాడుతూ రాజ్‌ఘాట్ డిపోలోని 80 బస్సులకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాం. శుక్రవారంనాటికల్లా మొత్తం వంద బస్సులకు ఏర్పాటు చేస్తాం. ఇలా ఈ కెమెరాలను ఏర్పాటు చేయడం డీటీసీ చరిత్రలోనే తొలిసారి. బాగా పొద్దుపోయాక ఈ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. తొలివిడత కింద రాజ్‌ఘాట్, సరోజినీనగర్ బస్సు డిపోల్లో వీటిని ఏర్పాటు చే స్తాం. ఈ రెండు డిపోల్లో మొత్తం 200 బస్సులు ఉన్నాయి. రాజ్‌ఘాట్ డిపోలో కంట్రోల్‌రూం ఏర్పాటుచేశాం. డైలీ పద్ధతిలో నిపుణులు ఈ దృశ్యాలను పరిశీలిస్తారు. ఈ కెమెరాలకు ఏడు గంటలపాటు దృశ్యాలను నమోదు చేసే సామర్థ్యం ఉంది. కంట్రోల్‌రూంలోని కంప్యూటర్లలో 15 గంటల నిడివిగల దృశ్యాలను భద్రపరుస్తాం.’అని అన్నారు. -
మోడీ నిఘా.. మంత్రులకు వణుకు
అవును.. మోడీ చూస్తున్నారు. ఎవరినో కాదు, తన సొంత మంత్రివర్గంలోని సహచరులను, సీనియర్ అధికారులను కూడా ఆయన జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉన్నారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ముందే స్పష్టం చేసిన మోడీ.. అందుకు తగ్గట్లే పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నారు. ఆగస్టు 12వ తేదీన నిర్వహించిన కార్గిల్ ర్యాలీలో ఆయన ముందుగానే బహిరంగంగా ఓ మాట చెప్పారు. 'నేను తినను, ఎవరినీ తిననివ్వను' అన్నారు. తన మంత్రులైనా, ఉన్నత స్థాయిలో ఉన్నత అధికారులైనా ఎవరైనా సరే.. పాలనలో అవినీతికి పాల్పడితే ఏమాత్రం సహించబోనని చెప్పేశారు. ఇందుకోసం పలు రకాల చర్యలు కూడా తీసుకున్నారు. ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రీ చేయని విధంగా ప్రధానమైన మంత్రిత్వశాఖల కార్యాలయాలు అన్నింటిలో సీసీటీవీలు ఏర్పాటుచేశారు. పెట్రోలియం సహజవాయువుల మంత్రిత్వశాఖ కార్యాలయంలో మొట్టమొదటి సీసీటీవీ కెమెరా వస్తోంది. వందల కోట్లలో ఇక్కడ కాంట్రాక్టులు కుదురుతుంటాయి. అవినీతికి కూడా అంతేస్థాయిలో ఆస్కారం ఉంటుంది. దీంతోపాటు రక్షణ మంత్రిత్వశాఖలోనూ ఈ కెమెరా కన్ను పనిచేస్తుంది. గత పదేళ్లలో సమాచార ప్రసార మంత్రిత్వశాఖ వివిధ వార్తాపత్రికలకు జారీచేసిన ప్రకటనలన్నింటినీ కూడా ప్రధానమంత్రి స్వయంగా పరిశీలించబోతున్నారు. ఇలా గత దశాబ్ద కాలంలో ఎంత సొమ్ము పత్రికా ప్రకటనలకు వెచ్చించారో ప్రధాని స్వయంగా చూసి నిగ్గు తేలుస్తారు. భవిష్యత్తులో కూడా ఆయన దృష్టికి వెళ్లాకే ప్రకటనలు ఇవ్వాలి. కొన్ని పెద్ద పత్రికలకు ఇది ఎదురుదెబ్బే అవుతుంది. ప్రభుత్వ ప్రకటనలను నియంత్రిస్తే కొన్ని పెద్ద పత్రికల మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. మంత్రులపై ప్రధాని నిఘాకు ప్రత్యక్ష ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఓ మంత్రిగారు ఇటీవల ఓ ఫైవ్ స్టార్ హోటల్లో, ప్రధాని మోడీకి సన్నిహితుడైన ఓ అగ్రస్థాయి పారిశ్రామికవేత్తతో కలిసి భోజనం చేస్తున్నారు. భోజనం సగంలో ఉండగానే మోడీ నుంచి ఫోన్ వచ్చింది.. 'భోజనం అయిపోయిందా' అని ఆయన అడిగారు. కొన్ని నెలల క్రితం మరో మంత్రిగారు తన తొలి విదేశీ పర్యటన కోసం జీన్స్ ప్యాంట్ వేసుకుని విమానాశ్రయానికి వెళ్తున్నారు. సగం దారిలో ఉన్నారో లేదో.. ప్రధాని నుంచి ఫోన్! మంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లడానికి ముందు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని సుతిమెత్తగా ఆయన్ను హెచ్చరించారు. అంతేకాదు.. దేశానికి ప్రాతినిధ్యం వహించే మంత్రిగా ఉన్నప్పుడు జీన్స్ ప్యాంట్లు వేసుకెళ్తే బాగోదని కూడా చెప్పారు. వెంటనే మంత్రిగారు కారు వెనక్కి తిప్పించి, ఇంటికి వెళ్లి కుర్తా పైజమా వేసుకుని అప్పుడు విమానాశ్రయానికి వెళ్లారు. ఈ నిఘా భయంతో చాలామంది మంత్రులు, ఉన్నతాధికారులు తమ ప్రైవేటు సంభాషణలకు తమ సొంత మొబైల్ ఫోన్లు ఉపయోగించడం దాదాపు మానేశారు. దానికి బదులుగా తమ డ్రైవర్లు, ఇతర సహాయకుల ఫోన్లు తీసుకుని వాటినుంచి చేసుకోవడమే 'సురక్షితం' అని వాళ్లు భావిస్తున్నారు. -
నగరంలో నేరాల నియంత్రణకు మరిన్ని నిఘానేత్రాలు
నేరాల కట్టడిపై పోలీసు శాఖ దృష్టి సారించింది. ఇందులోభాగంగా నగరవ్యాప్తంగా త్వరలో పది వేల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర హోం శాఖ పరిశీలనలో ఉంది. సూరత్‌లో ప్రారంభించిన కమ్యూనిటీ ఆధారిత సీసీటీవీ కెమెరా ప్రాజెక్టు విజయవంతమవడంతో అదే నమూనాను ఇక్కడ కూడా అమలు చేయనున్నారు. న్యూఢిల్లీ: నగరంలో నానాటికీ నేరాల సంఖ్య పెరిగిపోతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో వాటిని నియంత్రించే అంశంపై దృష్టి సారించింది. ఇందులోభాగంగా త్వరలో నగరవ్యాప్తంగా పది వేల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉంది. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సీసీటీవీ కెమెరాల ఏర్పాటువల్ల నేరాల నియంత్రణతోపాటు నిందితులను పట్టుకునేందుకు తగు ఆధారాలు కూడా లభిస్తాయన్నారు. నగరంలో 16 మిలియన్ల మందికిపైగా జనాభా ఉన్నారు. ఇప్పటికే నగరంలో 22 వేల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటయ్యాయన్నారు. వీటి ఏర్పాటువల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇందులో మొత్తం 3,586 సీసీటీవీ కెమెరాలను పోలీసు శాఖ ఏర్పాటుచేయగా మిగతావాటిని ఇతర శాఖలు అమర్చాయి. ఇక నగర పరిధిలోని మూడు కార్పొరేషన్లు 992 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాయి. ఇవి అందుబాటులో ఉండడం వల్ల నిందితులను పట్టుకోవడం మరింత సులువవుతుందన్నారు. దక్షిణ ఢిల్లీలో ఇటీవల జరిగిన ఓ హత్యకేసును సీసీటీవీ కెమెరాల్లో లభించిన ఆధారాల వల్ల ఐదుగురు నిందితులను త్వరగా గుర్తించడం, వారిని పట్టుకోవడం చకచకా జరిగిపోయాయి. ఈ హత్య ఘటన దృశ్యాలు అనేక చానళ్లలోనూ అప్పట్లో ప్రసారమయ్యాయి. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు లేకపోయినప్పటికీ నగరవాసులు తమ తమ ఇళ్లతోపాటు పరిసర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాల్సిందిగా సూచించామని, ఇందులోని దృశ్యాలు 20 రోజులపాటు భ ద్రంగా నిక్షిప్తమవుతాయని తెలిపారు. అనేక రద్దీ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని, దుకాణదారులు తమ తమ దుకాణాల వద్ద వీటిని ఏర్పాటు చేసుకోవాలంటూ సూచించామన్నారు. వీరితోపాటు మాల్స్, హోటళ్ల యజమానులను కూడా ఇవే సూచనలు చేశామన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఔటర్ ఢిల్లీలో మొత్తం 4,529 సీసీటీవీ కెమెరాలు ఉండగా, అందులో పోలీసులు ఏర్పాటు చేసినవి 246 కాగా పౌర సంస్థలు అమర్చినవి 186. ఇక ప్రధానమంత్రి, రాష్ట్రపతి, మంత్రులు, ఉన్నతాధికారులు తదితర వీఐపీలు నివసించే ప్రాంతాల్లో వీటి సంఖ్య అంతంతమాత్రంగానే ఉంది. ఈ ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల సంఖ్య నాలుగువందలు మాత్రమే. పార్లమెంట్‌పై 2001లో ఉగ్రవాదుల దాడి అనంతరం వీటిని ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ ఆధారిత సీసీటీవీ ప్రాజెక్టు కాగా నగరంలోని చాందినీచౌక్‌లో కమ్యూనిటీ ఆధారిత సీసీటీవీ కెమెరాల ప్రాజెక్టును లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ బుధవారం ప్రారంభించనున్నారు. గుజరాత్ రాష్ర్టంలోని సూరత్ నగరంలో కూడా ఇదే తరహా ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి విదితమే. అక్కడ ప్రారంభించిన ఆ ప్రాజెక్టు విజయవంతమైంది. కాగా సూరత్‌లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారుల బృందం అక్కడికి చేరుకుని పరిశీలించిన సంగతి విదితమే. నగరంలో ఈ తరహా ప్రాజెక్టును ప్రారంభించడం ఇదే తొలిసారని, పోలీసు శాఖ ప్రజాసంబంధాల అధికారి రాజన్ భగత్ వెల్లడించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నేరాల్ని కట్టడి చేయడంతోపాటు నగరవాసులకు భద్రత కల్పించాలనే లక్ష్యంతో తమ శాఖ ముందుకు సాగుతోందన్నారు. ఇప్పటిదాకా సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకయ్యే ఖర్చును ప్రభుత్వాలే భరించాయని, ఇకమీదట ఇందులో ప్రజలను కూడా మరింతగా భాగస్వాములను చేయాలనేదే ఈ తరహా ప్రాజెక్టు ప్రారంభంలోని ఆంతర్యమని ఆయన వివరిం చారు. -
రైల్వేస్టేషన్లలో మూడో కన్ను
రైలు ఇంకా రావాల్సి ఉంటుంది. అందుకు దాదాపు అరగంటకు పైగా సమయం ఉంటుంది. ఈలోపు అక్కడున్న టీవీలో ఏదో మంచి సినిమాపాట వస్తుంటుంది. సరేకదాని దానివైపు మనం తదేకంగా చూస్తుంటే.. ఇంతలో మన పక్కనే నిలబడి టీవీ చూస్తున్నట్లే చూస్తూ జేబులు కొట్టేసే గ్యాంగులు కోకొల్లలు. అలాగే, టికెట్ కౌంటర్ వద్ద రద్దీగా ఉన్నప్పుడు కూడా జేబులు కొట్టేయడం, ఒక టికెట్ కూడా అవసరం లేకపోయినా కొనేసి బయట బ్లాక్‌లో అమ్ముకోవడం లాంటివి చేసే గ్యాంగులకు కూడా కొదవలేదు. ఇప్పుడు ఇలాంటివాళ్ల ఆట కట్టించడానికి రైల్వే స్టేషన్లలో మూడో కన్ను వచ్చేస్తోంది. స్టేషన్ల ఆవరణలోను, ప్లాట్ఫారాలపైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ లాంటి పెద్ద నగరాల్లో ఇప్పటికే ఇవి ఉన్నా.. భీమవరం లాంటి పట్టణాల్లో కూడా ఇప్పుడు ఇవి వచ్చేస్తున్నాయి. భీమవరం టౌన్ రైల్వేస్టేషన్లో శనివారం నాడు ఈ సీసీ కెమెరాలను తొలిసారిగా ఏర్పాటుచేసి, వాటి పనితీరును పరిశీలించారు. ఇకపై గట్టి నిఘా ఇటీవల రైల్వే స్టేషన్లు, రైళ్లలో దోపిడీలు ఎక్కువకావడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రైల్వేస్టేషన్లలో గట్టి నిఘా పెట్టనున్నారు. ఇందులో భాగంగా సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషించనున్నాయి. సీసీ కెమెరాల ఆధారంగా స్టేషన్లలో నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చనేది రైల్వే అధికారుల ఆలోచన. స్టేషన్లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకునే వీలుంటుంది. పలు కెమెరాల ఏర్పాటు భీమవరం టౌన్ రైల్వేస్టేషన్‌లోని ప్రధాన ద్వారం వద్ద, రిజర్వేషన్, టికెట్ కౌంటర్లు, ఫ్లాట్‌ఫారాలపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇటీవల తత్కాల్ టికెట్లను బ్లాక్‌లో అమ్ముకునేందుకు కొంతమంది ముఠాగా తయారయ్యారు. నిత్యం క్యూలైన్లో కొందరిని నిలిపి, వారి ద్వారా టికెట్లు తీసుకుని ఎక్కువ ధరకు బయట వ్యక్తులకు ముఠా సభ్యులు విక్రయిస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో ఇటువంటి చర్య లకు అడ్డుకట్ట పడే అవకాశముంది. -
సీసీ కెమెరాలు తప్పనిసరి
సాక్షి, చెన్నై : ప్రైవేటు స్కూళ్లు , కళాశాలల పరిసరాల్లో తప్పని సరిగా సీసీ కెమెరాలు అమర్చాల్సిందేనని నగర పోలీసు యంత్రాంగం హుకుం జారీ చేసింది. విద్యా సంవత్సరం మరి కొద్ది రోజుల్లో ఆరంభం కానున్నది. విద్యార్థులకు భద్రత కల్పించే రీతిలో ఆయా విద్యా సంస్థలు తీసుకున్న చర్యలపై పరిశీలనకు పోలీసు యం త్రాంగం సిద్ధం అయింది. రాష్ట్ర రాజధాని నగరం చెన్నైలోని అన్ని విద్యా సంస్థల్లోనూ ఈ పరిశీలనకు కమిషనర్ జార్జ్ ఆదేశాలు ఇచ్చారు. అదనపు కమిషనర్ కరుణా సాగర్ పర్యవేక్షణలో ఆయా డివిజన్లలోని డెప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్ల నేతృత్వంలో విద్యాసంస్థల్లో పరిశీలన ప్రక్రియ ఆదివారం నుంచి ఆరంభమైంది. ఆ ఆయా స్కూల్స్, కళాశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగ, సిబ్బంది, డ్రైవర్లు, వాచ్మన్లు, సెక్యూరిటీల ఫొటోలు, చిరునామాలతో కూడిన వివరాలు సేకరించి పెట్టుకోవాలని, ఆయా పరిధిలోని పోలీసు స్టేషన్ల నెంబర్లు, అధికారుల సెల్ నెంబర్లు తప్పనిసరిగా నోటీసు బోర్డుల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరోమారు తాము పరిశీలనకు వచ్చేలోపు నిఘా నేత్రాలు, తాము సూచించిన అన్ని అంశాలను పూర్తి చేసి ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. -
ఎల్టీటీ.. లోపాల పుట్ట!
సాక్షి, ముంబై: ముంబైలో దారుణ హత్యకు గురైన తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య ముంబైలో రైలు దిగిన అనంతరం ఎటువైపు నుంచి వెళ్లిందనేది పోలీసులకు ఇంతవరకు తెలియరాలేదు. ఎంతో కీలకంగా భావించే సీసీటీవీ కెమెరాల్లో అనూహ్యకు సంబంధించిన ఎలాంటి ఫుటేజ్‌లు లభించలేకపోవడం గమనార్హం. అత్యాధునిక సాంకేతిక పరి/ా్ఞనం వినియోగిస్తున్నామని పేర్కొనే పోలీసులకు ఇంత వరకు ఒక్క ఆధారం కూడా సేకరించకపోవడంపై అనూహ్య బంధువులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నగరంతోపాటు దేశంలోని ప్రముఖ రైల్వేస్టేషన్లలో ఒక్కటైన ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ), దాదర్ టర్మినస్లపై కొంత భారాన్ని తగ్గించేందుకు లోకమాన్య తిలక్ టర్మినస్ (ఎల్టీ టీ)ను నిర్మించారు. అనంతరం దీన్ని అత్యాధునిక పరి/ా్ఞనంతో ఆధునికీకరించారు. అయినప్పటికీ రైలు దిగిన అనూహ్య గురించి సీసీటీవీలో ఎలాంటి సమాచారం లభించకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుర్లా టర్మినస్‌లో భద్రతా ఏర్పాట్లపై ‘సాక్షి’ దృష్టి పెట్టగా పలు లోపాలు బయటపడ్డాయి. ఇక్కడ మెటల్ డిటెక్టర్లున్నప్పటికీ ప్రయాణికులు నేరుగా వెళ్లడం విశేషం. మరోవైపు ఫ్లాట్ ఫారం ముందు నుంచి వెళితే అక్కడ పోలీసుల జాడ లేదు. ఈ టర్మినస్‌లో మొత్తం అయిదు ఫ్లాట్ ఫారాలున్నాయి. ఒకటో ఫ్లాట్‌ఫారం విడిగా ఉండగా రెండు, మూడు ఫ్లాట్‌ఫారాలు, నాలుగు, అయిదు ఫ్లాట్ ఫారాలు కలిసి ఉన్నాయి. ఈ ఫ్లాట్ ఫారాలన్నింటిపై నుంచి బయటికి వెళ్లేందుకు ఒకే ఒక్క పాదచారుల వంతెన ఉండగా ఒకటో నంబరు ఫ్లాట్‌ఫారంపై ప్రధాన ద్వారం ఉంది. అయితే ముందువైపు నుంచి మాత్రం నేరుగా వెళ్లేందుకు ఆస్కారం ఉంది. ఇక అనూహ్య రైలు దిగిన మూడవ నెంబరు ఫ్లాట్ ఫారాాన్ని పరిశీలించినట్టయితే నాలుగు సీసీ టీవీలున్నాయి. ఫ్లాట్‌ఫారం మధ్యలో ఉన్న పాదచారుల వంతెన వరకు నాలుగు సీసీటీవీలు సుమారు 40 నుంచి 50 అడుగుల దూరంలో అమర్చి ఉన్నాయి. అయితే ఇవన్నీ డౌన్ వైపు చిత్రీకరించేవిధంగా ఉన్నాయి. దీంతో వీటిలో అనూహ్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసు ఇన్స్పెక్టర్ శింతే తెలిపారు. దీంతో రెండో నంబర్ ఫ్లాట్‌ఫారంలోని సీసీటీవీలను కూడా పరిశీలిస్తున్నట్టు ఆయన చెప్పారు. దీనిపై కూడా కేవలం ఆరు సీసీటీవీ కెమెరాలున్నాయి. వీటిలో మొదటి మూడు ఫ్లాట్ ఫారం మూడుపై ఉన్నట్టుగానే దిగువ వైపు చిత్రీకరించే విధంగా ఉండగా, తర్వాత కెమెరా ఎగువ వైపు, మరొకటి దిగువ దిశగా ఉన్నాయి. అయితే ఇవన్ని కూడా పాదచారుల వంతెన తర్వాత మరో రెండు మూడు బోగీలు కనిపించే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. కాని ఇంజిన్‌వైపు నుంచి వెళితే మాత్రం ఎవరూ కన్పించే అవకాశంలేదు. దీంతో అనూహ్య అటునుంచి వెళ్లిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ముందువైపు ఎగ్జిట్, ఎంట్రెన్స్‌లో కూడా సీసీ టీవీలున్నట్టయితే అనూహ్య కన్పించి ఉండడంతోపాటు ఆమెను కాపాడుకునేందుకు కూడా ఆస్కారం ఉండేదని భావిస్తున్నారు. అయితే ఊరినుంచి వెళ్లిన ప్రతిసారీ అటోలోనే ఇంటికి వెళ్లే అనూహ్య ఈసారి కూడా ఎటువైపు నుంచి అటోలో వెళ్లిందనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఇప్పటి వరకు పలువురిని విచారించినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలుపుతున్నారు. మరోవైపు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని వైపుల సీసీటీవీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. -
వీధిదీపాలుగా ఎల్ఈడీ బల్బులు!
సాక్షి, ముంబై: సీసీటీవీ కెమెరాల పనితీరుపై వీధిదీపాలు ప్రభావం చూపుతున్నాయి. దీంతో వాటిని మార్చివేయాలని బీఎంసీ నిర్ణయించింది. నగర రహదారులపై ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాల్లో ముఖాలు స్పష్టంగా కనిపించకపోవడంతో ఏకంగా వీధి దీపాలను (స్ట్రీట్ లైట్స్) మార్చాలని నగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనపై బీఎంసీ మహాసభలో చర్చలు జరిగాయి. అన్ని పార్టీల కార్పొరేటర్ల నుంచి ఆమోదం లభించడంతో వీధి దీపాల తొలగింపునకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం రహదారులపై పసుపు రంగులో వె లిగే వీధి దీపాలు ఉన్నాయి. ఈ వెలుగులో సీసీ కెమెరాల ద్వారా రికార్డయిన వీడియో ఫుటేజ్‌లో ముఖాలు స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో వీటి స్థానంలో తెల్లగా వెలుగునిచ్చే ఎల్ఈడీ బల్బులు బిగించాలని బీఎంసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 2008 నవంబర్ 26న ఉగ్రవాదుల దాడుల సంఘటన అనంతరం నగర రహదారులపై, జంక్షన్ల వద్ద ఆరు వేల సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాని ఐదేళ్లు పూర్తికావస్తున్నప్పటికీ ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆరు వేలకు బదులుగా కేవలం రెండున్నర వేల కె మెరాలు కీలకమైన జంక్షన్లు, రహదారులపై ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. కాని అందులో రికార్డయిన వీడియో ఫుటేజ్‌లో పసుపు రంగు వెలుగునిచ్చే స్ట్రీట్ లైట్ల కారణంగా ముఖాలు స్పష్టంగా కనిపించడం లేదని తేలింది. రాత్రి వేళల్లో దోపిడీలు, రోడ్డు ప్రమాదాలు, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం లాంటి సంఘటనల్లో నేరస్తులను గుర్తించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఫలితంగా పోలీసులు కేసు దర్యాప్తు చేయడంలో విఫలమవుతున్నారు. దీంతో ఎల్ఈడీ దీపాలు అమర్చాలని నిర్ణయించారు. అందుకయ్యే వ్యయాన్ని అంచనా వేస్తున్నారు. త్వరలో టెండర్లను ఆహ్వానించి ఈ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు శివసేన నాయకురాలు శీతల్ మాత్రే చెప్పారు. -
మహిళల భద్రతకే నిర్భయ నిధి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిర్భయ నిధిని మహిళల భద్రత కోసం ఖర్చు చేయనున్నట్లు రహదారుల మంత్రిత్వశాఖ ప్రకటించింది. నగరంలో తిరిగే అన్ని బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ఆటోల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తామని ఆ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.1000 కోట్ల నిధిని ఖర్చు చేస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, త్వరలో వీటిని కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపుతామన్నారు. అంతేకాక ప్రజారవాణా వ్యవస్థలో మహిళలకు కూడా స్థానం కల్పిం చాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఇందుకోసం మహిళా డ్రైవర్లను నియమించుకోవాలని భావిస్తున్నామని చెప్పారు. ఈ విషయాలన్నింటితో ఓ ప్రెజెంటేషన్‌ను ఆర్థికశాఖ సలహాలు, సూచనల కోసం పంపుతామని, అక్కడి నుంచి వచ్చిన సమాధానం ఆధారంగా మార్పులు చేర్పులు చేసి వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. దేశ రాజధానిలో గత సంవత్సరం డిసెంబర్ 16న వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైన తర్వాత వెల్లువెత్తిన ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం 2012-13 సంవత్సరం బడ్జెట్లో ‘నిర్భయ నిధి’ పేరుతో రూ.1,000 కోట్లను కేటాయించిన విష యం తెలిసిందే. అయితే వీటిని మహిళల భద్రత కోసం వినియోగిస్తామని అప్పట్లోనే ప్రకటించినా దాదాపు ఏడాది పూర్తికావొస్తున్నా నిధులను ఖర్చుచేయలేదు. దీనిపై కూడా అనేక విమర్శలు వెల్లువెత్తుతుండడంతో రహదారుల మంత్రిత్వశాఖ ఈ ప్రతిపాదనలను రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఈ ప్రతిపాదనలకు ఆర్థికశాఖ అనుమతి లభిస్తే నగరంలో మహిళల భద్రతకు కొంతమేరైనా భరోసా లభిస్తుందని స్వచ్ఛంద సంస్థలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలాఉండగా నిర్భ య ఘటన తర్వాత నగరవ్యాప్తంగా ప్రధాన కూడళ్ల లో సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటిదాకా అటువంటి చర్యలేవీ తీసుకోలేదని, రహదారుల మంత్రిత్వశాఖ అయినా మహిళ భద్రత కోసం చిత్తశుద్ధితో పనిచే యాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. సీసీ టీవీ కెమెరాలు, జీపీఎస్‌లు ఏర్పాటు చేయడమే గాకుండా వాటి నిర్వహణ భాద్యతలను సమర్థ వంతమైన సంస్థలకు అప్పజెప్పాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.