
ఓయూపై డేగకన్ను
ఉస్మానియా యూనివర్సిటీపై రాష్ట్ర ప్రభుత్వం డేగకన్ను వేసింది.
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీపై రాష్ట్ర ప్రభుత్వం డేగకన్ను వేసింది. క్యాంపస్‌లో 42 మంది ఇంటెలిజెన్స్ అధికారులను నియమించింది. అందులో 22 మంది తెలంగాణ అధికారులు కాగా.. 20 మంది ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు ఉన్నారు.
వీరు విద్యార్థుల ఆందోళనలు, అధికారుల పనితీరు, అధ్యాపకులు, ఉద్యోగుల హాజరు శాతం తదితర వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. క్యాంపస్ అంతటా రూ.9 కోట్ల వ్యయంతో సుమారు 600 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.