సాక్షి, హైదరాబాద్: సీసీటీవీ కెమెరాలు..ఏ మూల ఏం జరిగినా పట్టిచూపే నిఘానేత్రాలు. అందుకే భద్రత దృష్ట్యా సీసీటీవీ కెమెరాలకు ఆదరణ పెరుగుతోంది. నేర నియంత్రణతో పాటు, నేరాల పరిశోధనలోనూ ఇవే పోలీసులకు అస్త్రాలుగా మారుతున్నాయి. దుకాణాలు, హోటల్స్, ఇతర వ్యాపార ప్రాంతాల్లోనూ యజమానులు ఉద్యోగుల పనితీరును గమనించేందుకు, వినియోగదారుల్లో ఎవరైనా తేడాగా ఉంటే అలాంటి వారిపై నిఘా పెట్టేందుకు సైతం వీటిని వాడుతున్నారు.
అలాంటి సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో ఎలాంటి అవగాహన ఉంది? సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై పలు వర్గాల్లో ఎలాంటి అభిప్రాయాలున్నాయన్న వివరాలను బీపీఆర్‌ఎండీ (బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) ఇటీవల స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా 2023 పేరిట నివేదికను విడుదల చేసింది. బీదల బస్తీల మొదలు సంపన్న వర్గాల నివాస ప్రాంతాల వరకు అన్ని ప్రాంతాల వారు సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు జై కొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment