surveillance
-
Big Question: చంద్రబాబు భారీ కుట్ర.. ఏకంగా జడ్జిపైనే నిఘా!.. లూథ్రా చేతిలో పోలీసులు?
-
జడ్జి పైనే నిఘా.. ఇదేం పాలన బాబు
-
ఏకంగా న్యాయమూర్తుల పైనే చంద్రబాబు సర్కార్ నిఘా
-
తూనీగలా తిరుగుతూ నిఘా!
సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: తూనీగలా తిరుగుతూ నిఘా పెడు తుంది.. సీతాకోక చిలుకలా కదులుతూ పరిస్థితులను కళ్లకు కడుతుంది... గద్దలా ఎగు రుతూ ఎప్పటికప్పుడు ఫొటో లు, వీడియోలు పంపుతుంది.. ఐఐటీ హైద రాబాద్ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్న బయో ఇన్స్పైర్డ్ ఫ్లాపర్ డ్రోన్ సాంకేతికత ప్రత్యేకత ఇది. పక్షులు, కీటకాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేక తరహా డ్రోన్లపై ఐఐటీహెచ్ పరిశోధనలు చేస్తోంది. ఆయా ప్రాంతాల్లోని భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా వాటిని డిజైన్ చేస్తోంది. అటవీ ప్రాంతాలు, కొండలు, చెరువులు, సరస్సులు, దూర ప్రాంతాల్లో సైతం తిరిగేందుకు అనువుగా వాటిని రూపొందిస్తోంది. డ్రోన్లు ఎగిరినట్లు బయో ఇన్స్పైర్డ్ డ్రోన్లు దేశ సరిహద్దుల్లో సైతం నిఘా పెట్టడానికి ఉపయోగించుకోవచ్చని, భద్రతా అవసరాలకు వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.డ్రోన్లకు కాస్త భిన్నంగా.. డ్రోన్ టెక్నాలజీకి కాస్త భిన్నంగా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. డ్రోన్లు బ్యాటరీల సాయంతో పనిచేస్తుంటాయి. అయితే ఒకసారి వాటి చార్జింగ్ అయిపోతే తిరిగి చార్జ్ చేస్తేనే తిరిగి పనిచేస్తాయి. కానీ తూనీగ మాదిరిగా ఉండే బయో ఇన్స్పైర్డ్ డ్రోన్‌లో రెక్కలు కొట్టుకోవడం ద్వారా వచ్చే శక్తితో దాటంతట అదే చార్జ్ అయ్యేలా డిజైన్ చేస్తున్నారు. అలాగే గద్ద ఆకారంలో తయారు చేసిన ఫ్లాపర్ దూరప్రాంతాలకు సైతం ఎగురుకుంటూ వెళ్లి ఆధునిక కెమెరాల ద్వారా అక్కడి పరిసరాలను వీడియో రికార్డు చేస్తుంది. కంట్రోల్ యూనిట్ ద్వారా దీని గమ్యాన్ని మార్చొచ్చు. తక్కువ ఎత్తు నుంచి ఈ డ్రోన్లను ఎగరేయడం వీలవుతుందని.. దీనివల్ల ఇతర దేశాల రాడార్ల నిఘాకు అవి చిక్కవని పరిశోధకులు చెబుతున్నారు.నాలుగేళ్లుగా పరిశోధనలు..దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ హెచ్లో టీఐహెచ్‌ఏఎన్ (టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నేవిగేషన్) అనే పరిశోధన విభాగం ఉంది. ఇందులో యూఏవీ (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్), ఆర్ఓవీ (రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్) రకాల అటానమస్ వాహనాలను అభివృద్ధి చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా వాటిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఏరోస్పేస్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ వంటి బ్రాంచీలకు చెందిన ఎంటెక్, పీహెచ్డీ విద్యార్థులు ఈ పరిశోధన విభాగంలో పనిచేస్తున్నారు.నిఘా, భద్రత అవసరాలకు ఉపయోగపడేలాబయో ఇన్స్పైర్డ్ డ్రోన్లపై పరిశోధనలు కొనసాగు తున్నాయి. ఇవి ప్రొటోటైప్ (నమూన దశ) స్టేజీలో ఉన్నాయి. కొన్ని డ్రోన్ల పరిశోధనలు చివరి దశకు చేసుకుంటున్నాయి. పక్షులు, తూనీగ వంటి వాటిని స్ఫూర్తిగా తీసుకొని బయో ఇన్స్పైర్డ్ డ్రోన్లను తయారు చేస్తున్నాం. దేశ నిఘా, భద్రతా అవసరాలకు ఎంతగానో ఉపయోగపడేలా వాటిని అభివృద్ధి చేస్తున్నాం.– సంతోష్‌రెడ్డి, టెక్నికల్ ఆఫీసర్, టీఐహెచ్‌ఏఎన్ -
విజయవాడ దుర్గగుడిలో నిఘా వైఫల్యం
సాక్షి, విజయవాడ: విజయవాడ దుర్గగుడిలో నిఘా వైఫల్యం వెలుగుచూసింది. అమ్మవారి అంతరాలయ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై అధికారులు స్పందించారు. రెండురోజుల క్రితం అంతరాలయాన్ని భక్తురాలు వీడియో తీసింది.తాను తీసిన విజువల్స్ సోషల్ మీడియాలో పెట్టడంతో భద్రతాపై అనుమానాలు వ్యక్తమవుతున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆలయ అధికారులు విచారణ చేపట్టారు. ఆలయ పరువుకు భంగం కలిగించేవారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు.. ఘటనపై పోలీస్ శాఖకి ఫిర్యాదు చేశారు. -
బీఆర్ఎస్ నేతలపైనా నిఘా!
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన ఈ నిఘా కేవలం ప్రతిపక్ష నేతలకే పరిమితం కాలేదని, అధికార బీఆర్ఎస్కు చెందిన అసమ్మతి నేతలపైనా సాగినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు నేతృత్వంలో అనేక అక్రమాలు సాగాయని నేరాంగీకార వాంగ్మూలాల్లో పోలీసులు పేర్కొన్నారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఆపరేషన్ కోసం అవసరమైన నిఘా పరికరాలను ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి కొనుగోలు చేయగా... కేరళకు చెందిన ఓ కీలక వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు ఏకంగా చార్టర్డ్ ఫ్లైట్‌లో అక్కడకు వెళ్లినట్లు బయటపడింది. పంజగుట్ట పోలీసులు గతంలో అరెస్టు చేసిన మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు, డీఎస్పీ నాయిని భుజంగరావులకు సంబంధించిన నేరాంగీకార వాంగ్మూలాల్లో ఈ కీలకాంశాలను పొందుపరిచిన దర్యాప్తు అధికారులు.. వీటిని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో ఆపరేషన్ దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ఆ పారీ్టకి బ్రేక్ వేయాలని నాటి సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. 2022 అక్టోబర్ చివరి వారంలో నాటి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ద్వారా ఓ కీలక విషయం కేసీఆర్‌కు తెలిసింది. బీఆర్ఎస్ను వీడి తమ పార్టీలో చేరేలా బీజేపీకి చెందిన కొందరు వ్యక్తులు ఎర వేస్తున్నారంటూ రోహిత్‌రెడ్డి నాటి సీఎంకు చెప్పారు. అప్పటికే మునుగోడు ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీని ఇరుకున పెట్టాలని నిర్ణయించుకున్న కేసీఆర్ ఈ విషయాన్ని ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావులకు అప్పగించడంతోపాటు వారికి సహకరించాలని రోహిత్‌రెడ్డిని ఆదేశించారు. డీఎస్పీ ప్రణీత్‌రావు ద్వారా కొందరు ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టడం ద్వారా కీలక విషయాలు రాబట్టారు. ఈ ఆడియో క్లిప్స్‌ను కేసీఆర్‌కు అందించారు. వీటి ఆధారంగా మొయినాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో ఉన్న రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో ప్రత్యేక ఆపరేషన్‌కు ప్లాన్ చేశారు. ఫలానా రోజున అక్కడికి రావాలని రోహిత్‌రెడ్డి ద్వారా నందుతోపాటు ఇద్దరు స్వామీజీలకు సందేశం పంపారు. అప్పట్లో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, ఎస్సై శ్రీకాంత్‌లను రాధాకిషన్‌రావు ఢిల్లీకి పంపి ప్రత్యేక స్పై కెమెరాలు ఖరీదు చేయించారు. వీటిని శ్రీకాంత్‌తోపాటు మరో ఇద్దరు ఎస్సైలు మల్లికార్జున్, అశోక్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో బిగించారు. రోహిత్‌రెడ్డితోపాటు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను స్వయంగా కేసీఆర్ రంగంలోకి దింపారు. క్షేత్రస్థాయిలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఆపై ఏర్పాటైన సిట్ ద్వారా ఆర్ఎస్ఎస్ కీలక నేత బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేయించాలని తద్వారా బీజేపీని దారిలోకి తెచ్చుకుని తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై ఉన్న ఈడీ కేసు నీరుగారేలా చేయాలని భావించారు. కొందరు సైబరాబాద్ పోలీసుల అసమర్థత కారణంగా కేరళలోని మాతా అమృతానందమయి ఆశ్రమానికి చెందిన ఒక ముఖ్యమైన వ్యక్తి తప్పించుకున్నాడు. దీంతో ఆయన్ను పట్టుకోవడానికి ఎస్పీ రెమా రాజేశ్వరి, ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లుతో కూడిన బృందాన్ని ఏకంగా చార్టర్డ్ ఫ్లైట్‌లో అక్కడకు పంపించారు. ఈ ప్రయత్నమూ సఫలీకృతం కాకపోవడంతోపాటు ఆయా నిందితులను అరెస్టు చేయొద్దని, కేసును సీబీఐకి అప్పగించాలని న్యాయస్థానం నుంచి ఆదేశాలు రావడంతో అంతా అసంతృప్తి చెందారు. తాను అనుకున్నది జరగకపోవడంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు ఇబ్బందికరంగా ఉన్న పరిణామాలను గుర్తించి... ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు మధ్య తరచూ వివిధ నియోజకవర్గాల్లోని రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిగేవి. బీఆర్ఎస్తోపాటు దాని నాయకులకు ఇబ్బందికరంగా ఉన్న పరిణామాలను వీళ్లు గుర్తించే వాళ్లు. ఈ సమాచారాన్ని ప్రణీత్‌కు పంపి ఆయా వ్యక్తులపై నిఘా పెట్టమని ఆదేశించే వాళ్లు. ఇలా ఎస్ఐబీ నిఘా ఉంచిన వారిలో బీఆర్ఎస్కు చెందిన వాళ్లూ ఉండటం గమనార్హం. నాటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదించిన అప్పటి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, అప్పట్లో కడియం శ్రీహరితో విభేదాలు ఉన్న మాజీ మంత్రి టి.రాజయ్య, తాండూరు ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి దంపతులతోపాటు మాజీ ఐపీఎస్ అధికారి, నాటి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, రెండు మీడియా సంస్థల అధినేతలు, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్, గద్వాలకు చెందిన సరిత తిరుపతయ్య, కోరుట్ల వాసి జువ్వాడి నర్సింగరావు, అచ్చంపేటకు చెందిన వంశీకృష్ణ, మానకొండూరుకు చెందిన కవ్వంపల్లి సత్యనారాయణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, బండి సంజయ్‌ల ఫోన్లు ట్యాప్ చేశారు. వీరితోపాటు వివిధ నిర్మాణ సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన యజమానులు, వ్యాపారవేత్తల ఫోన్ల పైనా అక్రమ నిఘా ఉంచారు. ఫోన్ కాల్స్‌కు దూరంగా ఉన్న వారిపై.. ఎస్ఐబీ నిఘా ఉంటుందన్న భయంతో అప్పట్లో అనేక మంది రాజకీయ నాయకులు, న్యాయాధికారులు, ప్రభుత్వ అధికారులు ఫోన్ కాల్స్‌కు దూరంగా ఉన్నారు. వీళ్లు ఎక్కువగా సిగ్నల్, స్నాప్‌చాట్ తదితర సోషల్ మీడియాను వినియోగిస్తూ ఎ¯న్‌క్రిపె్టడ్ విధానంలో మాట్లాడటం ప్రారంభించారు. దీన్ని గుర్తించిన ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు.. వారు ఎవరితో మాట్లాడారో గుర్తించడానికి వారి ఐపీడీఆర్‌లు (ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్స్) సేకరించి, విశ్లేషించారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్టోబర్–నవంబర్‌ల్లో ట్యాపింగ్ మరింత పెరిగింది. నాటి మంత్రి టి.హరీశ్‌రావు సిఫార్సుతో ఐన్యూస్ సంస్థ అధినేత శ్రావణ్ కుమార్ ప్రభాకర్‌రావుతో సన్నిహితంగా మెలిగారు. అనేక సందర్భాల్లో ఆయన వాట్సాప్ ద్వారా ప్రణీత్‌రావుతో టచ్‌లో ఉన్నారు. అలా కాంగ్రెస్, బీజేపీ నాయకులు, వారి మద్దతుదారుల వివరాలు సేకరించి అందించే వారు. ప్రత్యర్థి నాయకులను లక్ష్యంగా చేసుకుని వారి నగదును స్వా«దీనం చేసుకోవడానికి, టార్గెట్ చేసిన వ్యక్తులను ట్రోల్ చేయడానికి శ్రావణ్ పూర్తి సహాయ సహకారాలు అందించారు. తాను 2020లో పదవీ విరమణ చేసిన తర్వాత రెండుసార్లు టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగా పెద్దాయన (కేసీఆర్) అవకాశం ఇచ్చారని, ఈ విశ్వాసంతో కొన్ని కేసులకు అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు బయటపెట్టనని రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో పేర్కొన్నారు. -
ఉద్యోగులపై ఈసీ నిఘా
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వ ఉద్యోగులపై నిఘా పెట్టింది. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. ఏ పార్టీకైనా కొమ్ముగాస్తున్నట్టు ఏ విధంగా తేలినా షోకాజ్ నోటీసులు, ఆ తర్వాత కఠిన చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతోంది. వ్యక్తిగత కదలికలే కాకుండా, వారి సామాజిక మాధ్యమ ఖాతాలపై కూడా కన్నేసి ఉంచింది. అన్ని సాంకేతిక వనరులను వినియోగించుకుంటూ గతంలో ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు, రాజకీయ పార్టీలతో అంటకాగుతున్న నేతలను కనిపెట్టాలని నిర్ణయించింది. దీంతో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు అప్రమత్తమయ్యాయి. జాగ్రత్తగా ఉండాలని తమ ఉద్యోగులకు సూచిస్తున్నాయి. ఎన్నికల కోడ్ ముగిసే వరకూ ఏ పార్టీ నేతలను కలవద్దని స్పష్టం చేశాయి. రాజకీయ పార్టీలు, నేతలు నిర్వహించే విందులు, వినోద కార్యక్రమాలకు వెళ్ళొద్దని హెచ్చరించాయి. సోషల్ మీడియా ఖాతాలపై నిఘా ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు, ఉపాధ్యాయుల వ్యక్తిగత సామాజిక మాధ్యమ ఖాతాలపై ఎన్నికల కమిషన్ నిఘా పెట్టింది. వారు ఉండే వాట్సాప్ గ్రూపులు, వారి ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రాం ఖాతాలను ప్రత్యేక బృందాలు పరిశీలిస్తున్నాయి. గతంలో ఆరోపణలున్న వారిపై మరింత నిఘా పెట్టినట్టు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఓ నేతకు అనుకూలంగా సామాజిక మాధ్యమంలో పోస్టు చేసినా, లేదా ఎవరైనా పోస్టు చేసినదాన్ని ఫార్వర్డ్ చేసినా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్టుగానే పరిగణిస్తారు. ఆరోపణలు వచ్చిన ఉద్యోగి ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలించే అవకాశం ఉందని సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. టీచర్లు, ఉద్యోగులే కీలకం పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులదే కీలక పాత్ర. రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. 1.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీళ్లల్లో దాదాపు 90 శాతం ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఉద్యోగుల్లో క్లాస్–4 తప్ప, అందరికీ ఎన్నికల విధులు తప్పనిసరి. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వీళ్ళు పని చేస్తుంటారు. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వీరికి ప్రత్యేక నిబంధనావళిని ఎన్నికల కమిషన్ జారీ చేసింది. రాజకీయ నేతలతో ఎలాంటి సంబంధాలు నెరపడానికి వీల్లేదని, ఏ సభలు సమావేశాల్లో పాల్గొనవద్దని, విందులు, వినోదాలకు వెళ్ళొద్దని, అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వామ్యం కావద్దని, ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వొద్దని పేర్కొంది. ప్రతి నేత సమావేశం, ప్రచారం వీడియో చిత్రీకరణ ఉంటుందని, ఇందులో ఉద్యోగి ఉన్నట్టు తేలితే, నేతలతో సంబంధాలున్నట్టు ఆధారాలతో ఫిర్యాదులొచ్చిన తక్షణమే సస్పెన్షన్ తప్పదని కూడా స్పష్టం చేసింది. అయినా సరే..! ఎన్నికల కోడ్‌లో ఉద్యోగులకు ప్రత్యేక నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు వాటిని బేఖాతరు చేస్తున్నారు. సిద్దిపేటలో ఇటీవల 110 మంది డీఆర్డీఏ ప్రాజెక్టు మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు ఓ రాజకీయ పార్టీ ఎంపీ అభ్యర్థి నిర్వహించిన బహిరంగ సమావేశానికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోతో ప్రత్యర్థి పార్టీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని కమిషన్ సస్పెండ్ చేసింది. వీడియోను మార్ఫింగ్ చేశారని ఆ ఉద్యోగులు వాదిస్తున్నారు. సదాశివ పేటలో ఓ జూనియర్ లెక్చరర్ ఓ జాతీయ పార్టీ అభ్యర్థికి మద్దతుగా జరిగిన మీటింగ్‌లో పాల్గొనడం ప్రత్యర్థులు పసిగట్టారు. ఈ వీడియోను ఈసీకి అందజేయడంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు ఓ పార్టీ మీటింగ్‌లో పాల్గొన్న వీడియో బయటకు రావడంతో ఈసీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ప్రధాన ఉపాధ్యాయ సంఘం నేతలు ఓ పార్టీ నేత ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆయా సంఘాల నేతలు సూచిస్తున్నారు. -
అక్రమ మద్యంపై గట్టి నిఘా పెట్టాలి
సాక్షి, అమరావతి/సింగరాయకొండ (మర్రిపూడి)/శ్రీకాళహస్తి(తిరుపతి జిల్లా)/నెల్లూరు(బారకాసు): త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అక్రమ నిల్వలు, అమ్మకం, పంపిణీని నిరోధించేందుకు వెబ్ క్యాస్టింగ్, జీపీఎస్ సాంకేతికత ద్వారా నిఘా పెంచేందుకు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. రాష్ట్రంలోని డిస్టిలరీలు, బ్రూవరీలు, మద్యం గొడౌన్ల ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లు, మద్యం తయారీ–నిల్వ చేసే స్థలాల వంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. గోడౌన్ల నుంచి షాపులకు మద్యం సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్ కనెక్టివిటీని ఈనెల 15లోగా ఏర్పాటు చేసి ట్రాకింగ్ ద్వారా నిఘా ఉంచాలన్నారు. ఈ ప్రక్రియను వెబ్ క్యాస్టింగ్ ద్వారా గమనించేలా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం, జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాలకు అనుసంధానం చేయాలన్నారు. అదేవిధంగా తనిఖీలను ముమ్మరం చేయాలని అబ్కారీ శాఖ కమిషనర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. మద్యం ద్వారా ఓటర్లను ప్రలోభపరచకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రలోభాలపై గట్టి నిఘా రాష్ట్రంలో ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలపై గట్టి నిఘా ఉంచామని, ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 100 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ఇతర విలువైన వస్తువులు జప్తు చేశామని ముకేశ్ కుమార్ మీనా ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులతో పాటు రాష్ట్రంలోని పలు చెక్ పోస్టుల ద్వారా అలాగే పోలీస్, ఎక్సైజ్, ఐటీ, ఫారెస్టు, ఈడీ, ఎన్సీబీ, ఆర్పీఎఫ్, కస్టమ్స్ తదితర 20 ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలతో నిరంతరం నిఘా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు జప్తు చేసిన వాటిలో రూ. 25.03 కోట్ల నగదు, రూ. 12.49 కోట్ల విలువైన మద్యం, రూ.2.05 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ. 51.23 కోట్ల విలువైన లోహాలు, రూ. 2.42 కోట్ల విలువైన ఉచితాలు, రూ. 7.04 కోట్ల విలువైన ఇతర వస్తువులను జప్తుచేయడం జరిగిందని ఆయన తెలిపారు. నామినేషన్లకు 18న నోటిఫికేషన్ నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌తో కలిసి గురువారం ముకేశ్ కుమార్ మీనా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18న ప్రారంభం అవుతుందని చెప్పారు. కోడ్‌ను అమలు చేస్తున్న తీరు పరిశీలించి అధికారులను అభినందించారు. ఓటు ఆవశ్యకతను తెలుపుతూ ప్రత్యేకంగా రూపొందించిన అవగాహన మస్కట్‌ను ఆవిష్కరించారు. ముక్కంటి సేవలో మీనా జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఆర్డీవో రవిశంకర్‌రెడ్డి, ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేదపండితులు మీనాకు ఆశీర్వచనం ఇవ్వగా.. స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలను అధికారులు అందజేశారు. సింగరాయకొండ చెక్‌పోస్టు తనిఖీ ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును గురువారం ముకేశ్ కుమార్ మీనా తనిఖీ చేశారు. ఈమార్గంలో వస్తున్న వాహనాలను సిబ్బంది తనిఖీ చేస్తున్న తీరు, వీడియో రికార్డింగ్ చేస్తున్న విధానాన్ని ఆయన చెక్‌పోస్టు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు సీజ్ చేసిన నగదు, నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా ప్రయాణికుల బ్యాగులను కచ్చితంగా మహిళా సిబ్బందితోనే తనిఖీ చేయించాలని సూచించారు. తగిన ఆధారాలు లేకుండా రూ. 50 వేలకు పైగా నగదు ఉంటే దానిని సీజ్ చేసి ట్రెజరీకి జమచేయాలన్నారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఒంగోలులో బుధవారం రాత్రి జరిగిన ఘటనపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ఎన్నికల రాష్ట్ర పోలీసు అబ్జర్వర్ దీపక్‌మిశ్రా ఆధ్వర్యంలో విచారణ చేసి బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వ్యవసాయ కార్పొరేషన్లపై ఏసీబీ నిఘా
సాక్షి, హైదరాబాద్: ఆయన వ్యవసాయశాఖలోని ఒక కార్పొరేషన్ ఎండీ.. టెండర్లు, పనుల్లో పెద్ద ఎత్తున కమీషన్లు దండుకుంటారని ఆరోపణలున్నాయి. ఔట్సోర్సింగ్ కాంట్రాక్టులు మొదలు అన్నింటిలోనూ వసూళ్లేనని.. ఆయన ఆస్తుల విలువ రూ.100 కోట్లకుపైనే ఉంటుందని అంచనా. ఆయన హైదరాబాద్‌లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్, ఒక విల్లా, హైదరాబాద్ పరిసరాల్లో 30 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ♦ ఇదేశాఖలోని ఓ కార్పొరేషన్‌కు చెందిన జనరల్ మేనేజర్‌కు రెండు విల్లాలు, రెండు ప్లాట్లు, నగర శివారులో ఐదెకరాల ఫాంహౌస్ ఉందని సమాచారం. మరో కార్పొరేషన్‌కు చెందిన జనరల్ మేనేజర్‌కు ఒక విల్లా, రెండు ఖరీదైన ఫ్లాట్లు, ఐదుచోట్ల ఇళ్ల స్థలాలు, నగర సమీపంలో రెండెకరాల భూమి ఉన్నాయి. ఒక కార్పొరేషన్‌లోని డిప్యూటీ మేనేజర్ స్థాయి అధికారికి ఒక విల్లా, రెండు ఖరీదైన ఫ్లాట్లు, స్థలాలు ఉన్నాయి. ♦ ..వ్యవసాయశాఖ పరిధిలోని కార్పొరేషన్ల ఎండీలు, జనరల్ మేనేజర్లు, మేనేజర్లు, డిప్యూటీ మేనే జర్లపై వస్తున్న ఫిర్యాదుల్లోని అంశాలివి. దీనిపై దృష్టిపెట్టిన ఏసీబీ కొందరు పెద్ద ఎత్తున ఆస్తులు కూడ బెట్టినట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిసింది. రెండు కార్పొరేషన్ల ఎండీలపై నేరుగా ఫిర్యాదులు అందడంతో.. ఏసీబీ అధికారులు లోతుగా పరిశీల న చేపట్టి, రికార్డులను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అవసరమైతే ఆయా ఉద్యోగులను పిలిపించి విచారించేందుకు, సోదాలు చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయని ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఆయా కార్పొరేషన్ల జనరల్ మేనేజర్లు, మేనేజర్లపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని వ్యవసా య ఉన్నతాధికారులు కూడా భావిస్తున్నారు. ఐఏఎస్‌ల విచారణతో.. వ్యవసాయశాఖలోని 11 కార్పొరేషన్ల పరిధిలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేయిస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకోసం ఇద్దరు ఐఏఎస్‌లను విచారణ అధికారులుగా నియమించారు కూడా. దీంతో భారీగా దండుకున్న అధికారుల్లో దడ మొదలైంది. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని, దీని నుంచి బయటపడేందుకు పలువురు ఎండీలు, జనరల్ మేనేజర్లు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. మార్క్‌ఫెడ్‌లో భారీగా ఉల్లంఘనలు! వ్యవసాయశాఖ పరిధిలో మార్క్‌ఫెడ్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఆయిల్‌ఫెడ్, ఆగ్రోస్, హాకా, టెస్కాబ్, సీడ్ కార్పొరేషన్ వంటి కీలక కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిల్లో వందల కోట్లలో లావాదేవీలు జరుగుతుంటాయి. మార్క్‌ఫెడ్ లోనైతే ఏటా వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుంది. దానిద్వారానే రైతులకు ఎరువుల సరఫరా జరుగుతుంది. రైతుల పంటలను కూడా మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకురావడం, రైతుల నుంచి కొన్న పంటలను విక్రయించాక వచ్చే డబ్బును బ్యాంకులకు తిరిగి చెల్లించడం జరుగుతుంది. అధికా రులు ఆయా లావాదేవీలను ప్రభుత్వ బ్యాంకుల్లో కాకుండా ప్రైవేట్ బ్యాంకులతో నిర్వహిస్తుండటంపై విమర్శలు న్నా యి. ఈ వ్యవహారంలో కమీషన్లు చేతులు మారుతు న్నట్టు ఆరోప ణలు న్నాయి. ఎరువుల నుంచి గన్నీ బ్యాగుల దాకా.. ఎరువుల రవాణా టెండర్లు అధికారులకు వరాల జల్లు కురిపిస్తాయని.. రూ.వంద కోట్లకు పైబడి ఉండే ఈ టెండర్లను ఒకే కంపెనీకే వచ్చేలా నిబంధనలు రూపొందించి కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటిదాకా ఒక్క కంపెనీకే టెండర్ దక్కుతూ వచ్చిందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇక గన్నీ బ్యాగుల టెండర్లలోనూ కొందరు అధికారులు కంపెనీల నుంచి కమీషన్లు అందుకుంటున్నారన్న సమాచారం ఉంది. ♦ 2019–20లో మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన మొక్కజొన్నను టెండర్ల ద్వారా తక్కువ ధరకు విక్రయించాల్సి రావడంతో దాదాపు రూ.1,200 కోట్లు నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి ఎండీ స్థాయి అధికారి నుంచి మేనేజర్ల వరకు కోట్లలో కమీషన్లు ముట్టినట్లు ఫిర్యాదులున్నాయి. మార్క్‌ఫెడ్‌కు రూ.3 వేల కోట్ల అప్పులుంటే, ఈ స్కాం వల్లే సగం అప్పు పేరుకుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. అసలు పదేళ్లుగా మార్క్‌ఫెడ్ జనరల్ బాడీ సమావేశం జరగలేదంటే నిబంధనల ఉల్లంఘన ఏస్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని అంటున్నాయి. మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగిరెడ్డి కాంగ్రెస్‌లో చేరి తన పోస్టును కాపాడుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ♦ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌లోనైతే జిల్లా మేనేజర్లు కూడా ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులే ఉన్నారు. వీరిలో కొందరిని అడ్డుపెట్టుకొని పైస్థా యి అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమా లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రైవే ట్ గోదాములతో సంబంధాలు పెట్టుకుని.. వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌ను దివాలా తీయిస్తున్నా రన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని పనులకు టెండర్లకు వెళ్లకుండా పాత వాటినే కొనసాగిస్తూ నష్టం కలిగిస్తున్నారని అంటున్నారు. ♦ ఆయిల్‌ఫెడ్‌లో సిద్దిపేట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ అనుమతుల టెండర్‌ను తక్కువ ధరకు కోట్ చేసిన కంపెనీకి కాకుండా మరో కంపెనీకి ఇవ్వడం వివాదం రేపింది. కోర్టులో ఈ వివాదం ముగిసింది. కానీ ఈ వ్యవహారంలో కొందరు అధికారులు పాత్ర పోషించారని.. కోట్లు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి. ♦ నిబంధనలకు విరుద్ధంగా ఆయిల్‌ఫెడ్‌లో రూ.కోటిన్నర, వేర్‌హౌజింగ్ కార్పొరేషన్లో రూ.కోటి మొత్తాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల కింద కేటాయించారు. ♦ హాకాలో శనగల కొనుగోలు వ్యవహారం విమర్శలకు దారితీసింది. ఇందులో ఎండీ పాత్ర కంటే అప్పటి ఒక ప్రజాప్రతినిధి జోక్యమే అన్ని విధాలుగా హాకాను భ్రష్టుపట్టించిందనే విమర్శ లున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి శనగలు సరఫరా చేసే బాధ్యత తీసుకొని వాటిని విని యోగదారులకు కాకుండా వ్యాపారులకు కమీష న్లకు అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. ♦ ఇక ఆగ్రోస్‌ను పెద్దగా అభివృద్ధి చేయలేదన్న విమర్శలున్నాయి. ఇందులో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు. వ్యవసాయ యాంత్రీకరణ అమలుకాకపోవడంతో ఆగ్రోస్ కునారిల్లిపోయింది. ♦ ఒక కార్పొరేషన్‌కు చైర్మన్‌గా పనిచేసిన ఒక ప్రజాప్రతినిధి తన పదవిని అడ్డుపెట్టుకొని రూ.500 కోట్ల దాకా వెనకేసుకున్నట్టు ఆరోపణ లున్నాయి. అధికారం ద్వారా అనేక వ్యాపారాలు చేసి కమీషన్లు వసూలు చేశారని, అధికారులు తనకు నచ్చినట్టుగా వ్యవహరించేలా చేశాడని సమాచారం. అదే ఇప్పుడు సదరు కార్పొ రేషన్‌ను బోనులో నిలబెట్టిందని అంటున్నారు. ఇప్పటికీ చక్రం తిప్పుతున్న మాజీ చైర్మన్లు గత ప్రభుత్వంలో కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లుగా పనిచేసినవారు ఇప్పుడు మాజీలుగా మారినా కొత్త ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పుతున్నారు. ఆయా కార్పొరేషన్ ఎండీలు, ఇతర మేనేజర్లు, ఉద్యోగులపై ఒత్తిడి చేస్తూ పనులు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరైతే పార్టీ మారి మళ్లీ ఇదే కార్పొరేషన్‌కు చైర్మన్‌గా వస్తామనీ బెదిరిస్తున్నట్టు సమాచారం. కొందరు ఇప్పటికీ కార్పొరేషన్ల డ్రైవర్లను వాడుకుంటున్నట్టు తెలిసింది. సదరు మాజీ చైర్మన్లతో కలసి అక్రమాలకు పాల్పడిన పలువురు ఎండీలు వారికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
మరిన్ని శాటిలైట్లు, అణ్వస్త్రాలు: కిమ్
సియోల్(దక్షిణ కొరియా): కొరియా ద్వీపకల్పంలో అమెరికా, దక్షిణాకొరియా యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయని ఉత్తరకొరియా నియంత కిమ్ జాన్ మండిపడ్డారు. బదులుగా తామూ ఆయుధ సంపత్తిని పెంచుకుంటామని ప్రకటించారు. కొత్త ఏడాదిలో అదనంగా మూడు నిఘా ఉపగ్రహాల ప్రయోగాలు చేపడతామని ప్రకటించారు. అలాగే మరిన్ని అణ్వస్త్రాలనూ తయారు చేస్తామన్నారు. ఉత్తర కొరియా అధికారిక కేసీఎన్ఏ వార్తాసంస్థ ఈ మేరకు వెల్లడించింది. ట్రంప్ హయాంలో అమెరికాతో చర్చలు విఫలమయ్యాక అగ్రరాజ్యం నుంచి ఆక్రమణ, దాడి ముప్పు పొంచి ఉందన్న అనుమానంతో కిమ్ ఆయుధ సంపత్తి విస్తరణకు తెర తీశారు. ‘‘అమెరికా, దక్షిణకొరియా కవి్వంపు చర్యలు కొరియా ద్వీపకల్పాన్ని అణుయుద్ధం అంచుకు తీసుకెళ్లాయి. వాటి మెరుపుదాడులను తట్టుకుని నిలబడాలంటే మా సాయుధ, శక్తి సామర్థ్యాలను మరింత పటిష్టం చేసుకోవడం అత్యవసరం’’ అన్నారు. -
ఎన్నికల తర్వాతే గృహప్రవేశం!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ స్థిరాస్తి రంగంపై పడింది. సాధారణంగా రియల్టీ మార్కెట్లో నగదు ప్రవాహమే ఎక్కువగా ఉంటుంది. ఇందులోనూ అనధికారిక లావాదేవీలే అధికం. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసు లు, ఎన్నికల సంఘం అధికారులు నగదు ప్రవాహంతోపాటు ఆన్లైన్ లావాదేవీలపై కూడా గట్టి నిఘా పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో నగదు లావాదేవీలు జరపడం శ్రేయస్కరం కాదని గృహ కొనుగోలుదారులు భావిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో నగదు తీసుకెళ్తే.. పోలీసుల తనిఖీల్లో చిక్కితే అసలుకే ఎసరొస్తుందని ఎన్నికలు పూర్తయ్యే వరకు గృహ కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. దీంతో ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లపై తీవ్ర ప్రభావం పడనుంది. అప్పటి వరకూ ఎదురుచూపులే.. సామాన్య, మధ్యతరగతి ప్రజలు పొదుపు చేసిన డబ్బుతో ప్లాట్లు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేస్తుంటారు. చాలా తక్కువ మొత్తానికి గృహ రుణం కోసం బ్యాంకులకు వెళ్తుంటారు. మరోవైపు ఆన్లైన్ ఖాతా ద్వారా నగదు లావాదేవీలు జరుపుదామంటే.. వాటిపై కూడా నిఘా పెట్టా లని ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో బ్యాంకర్లు దృష్టి పెట్టారు. దీంతో ఎన్నికలు పూర్తయ్యే వరకు గృహ ప్రవేశాలకు గడ్డుకాలమేనని చెప్పాలి. ఎన్నికలు డెవలపర్ల మీద కంటే కొనుగోలుదారులపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. ఎన్నికలకు 1–2 నెలల ముందు నుంచి, ఎన్నికలయ్యాక 2 నెలల వరకు కస్టమర్లు వేచిచూసే ధోరణిలో ఉంటారు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వస్తే కొత్త పథకాలు, రాయితీలు, పాలసీలు తమ పెట్టుబడుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయోనని కొనుగోలుదారులు వేచి చూస్తుంటారు. ముందస్తు బుకింగ్‌లు.. స్థిరాస్తి సంస్థలకు నిరంతర క్రయవిక్రయాలు జరపకపోతే సంస్థ కార్యకలాపాలు, ఉద్యోగుల జీవభత్యాలు ఇతరత్రా వ్యయాల నిర్వహణ భారంగా మారుతుంది. దీంతో పలు నిర్మాణ సంస్థలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రవాసులు, విశ్వసనీయమైన కస్టమర్లతో ముందస్తు బుకింగ్‌లు చేసుకుంటున్నారు. ఎన్నికల తర్వాత చెల్లింపులు జరిపేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో రియల్టర్లు రాజకీయ పార్టీలకు, నాయకులకు నిధులు సమకూర్చడం సాధారణమే కానీ, ఈసారి తెలంగాణలో నెలల వ్యవధిలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వేర్వేరుగా జరుగుతాయి. దీంతో బిల్డర్లు ఫండ్‌ను కూడా వేర్వేరుగా ఏర్పాటు చేయాల్సి వస్తుందని, ఇది డెవలపర్లకు కొంత భారమేనని ఓ డెవలపర్ అభిప్రాయపడ్డారు. -
సారూ... జర జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడంతా ‘సోషల్’ మయం.. ప్రచారమేదైనా సోషల్ మీడియాదే హవా! ఎన్నికల సీజన్ కావడంతో రాజకీయ పార్టీలు, అభ్యర్థులతో పాటు ఎవరికి నచ్చినట్లుగా వారు సోషల్ మీడియా పోస్ట్‌లతో చెలరేగిపోతున్నారు. అయితే, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలంటోంది ఎన్నికల కమిషన్. వారిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించింది. ప్రతి ఎన్నికల సందర్భంగా ఇది సర్వసాధారణమే అయినప్పటికీ, ఈసారి సోషల్ మీడియాలో చేసే పోస్ట్‌లపైనా నిఘా పెట్టాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ ఉద్యోగుల పోస్టింగ్‌లు, ప్రచార కోణాన్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఉద్యోగి అనుసరించాల్సిన విధివిధానాలపై ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కొంతమందికి శిక్షణ ఇచ్చారు. వారు జిల్లా స్థాయిలో, వారి ద్వారా మండల స్థాయిలో అవగాహన కార్యక్ర మాలు నిర్వహిస్తారు. ఉద్యోగులపై వచ్చే ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోవాలని కలెక్టర్లను కోరింది. ఏదైనా పార్టీకి అనుకూలంగా పనిచేసినట్టు రుజువైతే తక్షణం సస్పెండ్ చేయాలని నియమావళి పేర్కొంటోంది. మీటింగ్‌లకు వెళ్ళినా నేరమే.. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఈ కారణంగా ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే సంకేతాలు వారి నుంచి రాకుండా ఉండాలని ఎన్నికల నియామవళి పేర్కొంటోంది. పార్టీల బహి రంగ సభలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమాల్లో ఉద్యో గులు పాల్గొన్నట్టు ఫిర్యా దులొస్తే తేలికగా తీసుకోవద్దని పేర్కొంటూ పరిశీలనకు కొన్ని సూచనలు చేసింది. సభ జరిగినప్పుడు తీసిన వీడియోలు, ఫొటోలను పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నట్టు భావిస్తే ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. కరపత్రాలు పంచడం, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా ప్రచారం చేయడాన్ని సీరియస్‌గా పరిగణించాలని, ఆధారాలుంటే తక్షణమే సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. తస్మాత్ జాగ్రత్త ప్రతీ ఉద్యోగికి వ్యక్తిగత అభిప్రాయం ఉండటంలో తప్పులేదు. ఇది విధి నిర్వహణపై ప్రభావం చూపడానికి వీల్లేదు. ఎన్నికల నియామవళి ప్రకారం పారదర్శకంగానే వ్యవహరించాలి. పూర్తి సాంకేతికతతో నిఘా వ్యవస్థ పనిచేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. – చావా రవి (యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి) -
రాష్ట్రానికి డెంగీ ముప్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో అంటే జూలై వరకు రాష్ట్రంలో 961 డెంగీ కేసులు నమోదు కాగా, ఆగస్టు నెలలో సరాసరి రోజుకు వంద మందికి పైగా డెంగీ బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అంచనా వేశాయి. ఇక ఈనెల సెప్టెంబర్ మూడు నాలుగు వారాల్లో డెంగీ కేసులు ఇంకా ఎక్కువ సంఖ్యలో నమోదయ్యే అవకాశం ఉందనీ, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డెంగీ కారక దోమ వృద్ధి చెందుతోందని చెబుతున్నారు. ప్రజలు పగటి పూట దోమ కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోకుంటే డెంగీ బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 28 ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంగీపై సర్వైలెన్స్ డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో 28 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్వైలెన్స్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయా ఆసుపత్రుల్లో డెంగీపై ఎప్పటికప్పుడు నిఘా వేస్తారు. ఆసుపత్రుల పరిధిలోని ప్రాంతాల్లో రక్త నమూనాలు సేకరించి వాటిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖకు పంపిస్తారు. దీనివల్ల దేశంలో ఎక్కడెక్కడ డెంగీ తీవ్రత ఉందో అంచనా వేస్తారు. ఆ మేరకు చర్యలు చేపడతారు. విధిగా ఐజీఎం పరీక్ష చేయించాలి డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్థారించడం శాస్త్రీయం కాదని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. విధిగా అందుబాటులో ఉండే ఐజీఎం పరీక్ష చేయించాలని స్పష్టం చేస్తోంది. ప్లేట్లెట్లు 50 వేలలోపు పడిపోతే అది ప్రమాదకరంగా భావిస్తారు. 15 వేల కన్నా తగ్గితే కొన్నిసార్లు డెంగీ మరణాలు సంభవిస్తాయి. డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడవాలి. ఎల్రక్టాల్ పౌడర్, పళ్లరసాలు రోగికి ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు అదుపులోకి వస్తాయి. ఇంకా తగ్గకుంటే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది. -
ఉత్తరకొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం మళ్లీ విఫలం
సియోల్: ఉత్తరకొరియా రెండో సారి చేపట్టిన నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. గత మేలో చేపట్టిన నిఘా ఉపగ్రహం మొదటి ప్రయోగం కూడా విఫలమైన విషయం తెలిసిందే. మూడో దశలో ఎమర్జెన్సీ బ్లాస్టింగ్ వ్యవస్థలో లోపం వల్లే గురువారం పసిఫిక్ సముద్ర జలాల్లో ఉపగ్రహాన్ని మోసుకెళ్లే చొల్లిమ–1 రాకెట్ కూలిందని వివరించింది. వచ్చే అక్టోబర్‌లో మూడోసారి మరింత మెరుగ్గా ఈ ప్రయోగం చేపడతామని ఉత్తరకొరియా గురువారం ప్రకటించింది. ఈ ప్రయోగం కారణంగా జపాన్ ప్రభుత్వం ఒకినావా దీవుల్లోని తన ప్రజలను అప్రమత్తం చేసింది. ఉత్తరకొరియాలోని తొంగ్చాంగ్–రి తీరం నుంచి గురువారం మధ్యాహ్నం 3.50 గంటలకు ఈ ప్రయోగం జరిగినట్లు దక్షిణకొరియా మిలటరీ తెలిపింది. -
నేరస్తులపై నిఘా పెంచండి
సాక్షి,హైదరాబాద్:నేరాలకు పాల్పడుతున్నవారిపై నిఘా పెంచాలని, అవసరమైతే రౌడీషిటర్లపై పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. చీకటి ప్రదేశాల్లో, భారీ నిర్మాణాల దగ్గర సంఘ వ్యతిరేక కార్యకలాపాలు, ఫ్లై ఓవర్లు, పాఠశాలల వద్ద మద్యం, గంజాయి సేవించడంపై నిఘా ఉంచాలని సూచించారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ ట్రై–పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నమోదవుతున్న నేరాలు, హత్యలపై హోంమంత్రి మంగళవారం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలోని తన కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో డీజీపీ అంజనీకుమార్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్, కమిషనర్లు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహాన్, సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ పాల్గొన్నారు. హోంమంత్రి మాట్లాడుతూ చాంద్రాయణగుట్ట, పహాడీషరీఫ్, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీలోని ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, జిమ్‌లు, పాన్ షాప్‌లు ప్రభుత్వం నిర్దేశించిన సమయాల ప్రకారం మూతపడేలా చూడాలని సూచించారు. వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో రెచ్చగొట్టే సందేశాలను కొన్ని గ్రూపులు ప్రబలంగా ప్రసారం చేస్తున్నాయని, దీని ఫలితంగా ప్రజలలో తప్పుడు ప్రచారాలు జరిగే అవకాశం ఉందని హోంమంత్రి అన్నారు. ఫంక్షన్ హాళ్లలో అర్ధరాత్రి వరకు గడపవద్దని ప్రజలను కోరారు. విధి నిర్వహణలోని పోలీసులకు ప్రజలు సహకరించాలని, భద్రత కోసం ప్రజలకు సేవ చేయడానికి పోలీసులకు చేయూతనివ్వాలన్నారు. -
సీసీ కెమెరాలు తిప్పేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల భద్రత కోణంలో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లను భయపెడుతున్నాయి. తమపై నిఘా కోసమే వాటిని ఏర్పాటు చేశారన్న అపోహలో ఉన్న డ్రైవర్లు గుట్టు చప్పుడు కాకుండా కెమెరాలను ఓ పక్కకు తిప్పేస్తున్నారు. దీంతో బస్సులోపల ప్రయాణికులు ఉండే భాగం కాకుండా, బస్సు గోడలు, కిటికీల ప్రాంతం కెమెరాల్లో రికార్డు అవుతోంది. తాజాగా బస్‌భవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అలాంటి డ్రైవర్లకు సీసీ కెమెరాలపై అపోహలు తొలగిపోయేలా అవగాహన కల్పించాలని నిర్ణయించారు. చర్యలు తీసుకుంటారన్న భయంతో..: ఇటీవలే ఆర్టీసీ దాదాపు 700 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను సమకూర్చుకుంది. ఇప్పటి వరకు కొన్ని ఏసీ బస్సుల్లో తప్ప మిగతా ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు లేవు. బస్సులో ఏ ఘటన జరిగినా స్పష్టంగా తెలుసుకునే వీలు లేకుండా పోతోంది. దీంతో ప్రయాణికుల భద్రతకు సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరని భావించి, కొత్తగా కొనుగోలు చేసే బస్సుల్లో వీటిని ఏర్పాటు చేయిస్తున్నారు. ఇలా కొత్త సూపర్ లగ్జరీ బస్సులను కంపెనీ నుంచి వచ్చినవి వచ్చినట్టు రోడ్డెక్కిస్తున్నారు. ఆ బస్సుల్లో లోపల డ్రైవర్ క్యాబిన్ ఎదురుగా ఒక కెమెరా, డ్రైవర్ క్యాబిన్ వెనక మరో కెమెరా ప్రయాణికులు కనిపించేలా ఉంటాయి. మరో కెమెరా బస్సు వెనక రివర్స్ చేసేప్పుడు డ్రైవర్‌కు సౌలభ్యం కలిగించేలా ఉంటుంది. అయితే ఇప్పుడు క్యాబిన్ ముందువైపు ఉన్న కెమెరాను చూడగానే డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. కొంతకాలంగా ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సస్పెన్షన్ వేటు పడుతుండటమే దీనికి కారణం. ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్ వినియోగం సాధారణ విషయంగా మారింది. ఇంటి నుంచి కాల్ వచ్చినా, అత్యవసర పనులకు సంబంధించి ఫోన్ కాల్‌వచ్చినా డ్రైవర్లు మాట్లాడేస్తుంటారు. అయితే బస్సు నడిపే సమయంలో డ్రైవర్లు సెల్ ఫోన్ మాట్లాడటాన్ని నేరంగా పరిగణిస్తారు. అలాగే కొందరిలో డ్రైవింగ్‌లో అప్పుడప్పుడు ఏమరపాటు వ్యక్తమవుతుంటుంది. ఇలాంటివన్నీ సీసీ కెమెరాలో రికార్డు అవుతాయి. ఇది తమపై చర్యలకు కారణమవుతుందేమోనన్నది డ్రైవర్ల భయానికి కారణంగా ఉంటోందని అధికారులంటున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లకు సంకటం.. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో అడ్వాన్సు టికెట్ బుకింగ్ సమయంలో డ్రైవర్ ఫోన్ నంబర్‌ను కూడా తెలియజేస్తారు. ప్రయాణికులు ఆ నంబర్‌కు ఫోన్ చేసి బస్సు ఎక్కడి వరకు వచ్చిందో వాకబు చేస్తుంటారు. కాగా, విశాఖపట్నం, బెంగళూరు లాంటి దూర ప్రాంతాల సర్విసులు మినహా మిగతా బస్సుల్లో ఒకే డ్రైవర్ ఉంటున్నాడు. ప్రయాణికుల నుంచి ఫోన్ కాల్ వస్తే అతనే మాట్లాడాల్సి వస్తోంది. ఇది రికార్డయితే, దానిని కూడా నేరంగా పరిగణిస్తారన్న భయం డ్రైవర్లలో ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని బస్సులో కెమెరా యాంగిల్‌ను తిప్పేస్తున్నారన్నది అధికారుల మాట. దీంతో డ్రైవర్లలో అపోహలు తొలగించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆ కెమెరాలు ప్రయాణికుల భద్రత కోసమే కేటాయించాన్న విషయాన్ని తెలిపి, వారిలో ఆందోళన పోగొట్టాలని అధికారులు నిర్ణయించారు. -
ముఖం చూశాకే ముందుకు!
ఏదో పనిమీద ఓ ఆఫీసుకు వెళ్లారు. మీకన్నా ముందు ఉన్నఓ వ్యక్తి ప్రవేశ ద్వారం వద్దకు వెళ్లగానే డోర్ ఆటోమేటిగ్గా తెరుచుకుంది.మీకు మాత్రం తెరుచుకోలేదు. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వచ్చి తీస్తేనే తెరుచుకుంది. ఇది ‘ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ’మహిమ. మీకన్నా ముందు వెళ్లిన వ్యక్తిఆ ఆఫీసులో ఉద్యోగి. ద్వారం దగ్గర ఉన్న ‘ఫేషియల్ రికగ్నిషన్’కెమెరా అతడినిగుర్తించి డోర్ తెరిచింది. మీరు బయటివారు కాబట్టి తెరవలేదు. కేవలం ఉద్యోగుల కోసమే కాదు అపరిచితులు, అనుమానితులు, నేరస్తులపై నిఘా కోసం వాడేఈ టెక్నాలజీకి ఇటీవల హైదరాబాద్‌లో ఆదరణ పెరుగుతోంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ (ఎఫ్‌ఆర్‌టీ) వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే విమానాశ్రయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కీలక సంస్థలలో ఉద్యోగుల ప్రవేశ, నిష్క్రమణ కోసం ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. తాజాగా అపరిచితుల ప్రవేశం, అనుమానితుల కదలికల నేపథ్యంలో.. ప్రైవేట్ పార్టీలు నిర్వహించే గేటెడ్ కమ్యూనిటీలు, క్లబ్‌లు, పబ్‌లకు కూడా ఎఫ్‌ఆర్‌టీ వినియోగం విస్తరించింది. సైబర్ నేరాలు, అనుమానితుల కదలికలు పెరిగిన నేపథ్యంలో దీని వినియోగం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఎఫ్‌ఆర్‌టీ సామర్థ్యంఎంతంటే? నాలుగు కెమెరాలు, ఒక వీడియో మేనేజ్మెంట్ సర్వర్, నాలుగు లైసెన్స్‌లు, సర్వర్ స్టోరేజీ, బ్యాకప్‌తో కూడిన ఎఫ్‌ఆర్‌టీ ఉపకరణానికి రూ.3లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చవుతుంది. 200 నుంచి 10 వేల వరకు ముఖాలను, 5 వేల వేలిముద్రలను స్టోర్ చేసుకోవచ్చు. ఇన్కార్డ్ ఎఫ్‌ఆర్‌టీ పరికరాలైతే నియంత్రిత యూనిట్లలో డేటా విడిగా నిల్వ ఉంటుంది. ఎఫ్‌ఆర్‌టీ పరికరాలను అదీకృత నిర్వాహకులు మాత్రమే.. పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పిన్), పాస్వర్డ్, వేలిముద్రల సాయంతో మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. వీటిలోని డేటా ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉండటం వల్ల హ్యాకర్ల నుంచి కూడా భద్రత ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో ఎఫ్‌ఆర్‌టీ లేదా బయోమెట్రిక్‌లను నేరుగా నియంత్రించే చట్టం లేదు. ఎలక్ట్రానిక్ రికార్డులు, ముఖ గుర్తింపు సహా వ్యక్తిగత డేటాను సేకరించే లేదా నిల్వ చేసే విధానం ‘ఇన్ఫర్మేషన్ చట్టం–2000’పరిధిలోకి వస్తాయని కేంద్ర హోం శాఖ గతంలోనే స్పష్టం చేసింది. ముఖ్యమైన ప్రదేశాల్లో ఎఫ్‌ఆర్‌టీ రాష్ట్రంలోని పలు కీలక కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రధాన కార్యాలయం, సెంట్రల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్, హైదరాబాద్ పోలీసు ప్రధాన కార్యాలయం, తెలంగాణ పోలీసు ప్రధాన కార్యాలయం, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తదితర చోట్ల ఎఫ్‌ఆర్‌టీ నిఘా ఉంది. ఎలా పని చేస్తుంది అంటే.. ♦ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వ్యవస్థలో అవసరమైన మేర కెమెరాలు, 7 ఇంచుల ఎల్సీడీ స్క్రీన్, మైఫేర్ అనే రీడింగ్ మాడ్యుల్ కాంటాక్ట్‌లెస్ కార్డు ఉంటుంది. ♦ ముఖాన్ని గుర్తించాక వారిని లోపలికి అనుమతించేందుకు ‘టర్న్ స్టయిల్ గేట్లు’తెరుచుకుంటాయి. ♦ ఈ ఉపకరణాలన్నీ ఇంటర్నెట్తో కాకుండా లోకల్ ఏరియా నెట్వర్క్ (ఎల్ఏఎన్)తో అనుసంధానమై ఉంటాయి. డేటా ఎన్‌క్రిప్ట్ అయి ఉంటుంది. మాస్క్ లేకుండాఉన్నవారి ముఖాలను 3 మీటర్ల దూరం నుంచే ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. ఒక్కొక్కరి ముఖాన్ని 0.2 సెకన్లలోపే రీడ్ చేసి.. ఇప్పటికే ఫీడ్ చేసి ఉన్న ఫొటోలు, వీడియోల్లోని డేటాతో పోల్చుతుంది. సదరు వ్యక్తి ఎవరనేది నిర్ధారిస్తుంది. ఒకవేళ కొత్త వ్యక్తులు అయితే వెంటనే అలర్ట్ చేస్తుంది. అనుమానితులు, బ్లాక్‌లిస్టులో ఉన్న వ్యక్తులను గుర్తిస్తే.. సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తుంది. అవగాహన లేక పరిమిత స్థాయిలో వినియోగం – రాజశేఖర్, ఎండీ, బృహస్పతి టెక్నాలజీస్ అనుమానాస్పద, అపరిచిత వ్యక్తులు, నేరస్తుల ప్రవర్తనను ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ముందుగానే గుర్తించి అప్రమత్తం చేస్తుంది. దీంతో నేరాల శాతం తగ్గుతుంది. అయితే విదేశాలతో పోలిస్తే మన దగ్గర ఎఫ్‌ఆర్‌టీ వినియోగం తక్కువే. ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవటంతో వినియోగం పరిమితంగా ఉంది. -
నిఘా కన్ను.. ఉంటేనే దన్ను!
సాక్షి, హైదరాబాద్: సీసీటీవీ కెమెరాలు..ఏ మూల ఏం జరిగినా పట్టిచూపే నిఘానేత్రాలు. అందుకే భద్రత దృష్ట్యా సీసీటీవీ కెమెరాలకు ఆదరణ పెరుగుతోంది. నేర నియంత్రణతో పాటు, నేరాల పరిశోధనలోనూ ఇవే పోలీసులకు అస్త్రాలుగా మారుతున్నాయి. దుకాణాలు, హోటల్స్, ఇతర వ్యాపార ప్రాంతాల్లోనూ యజమానులు ఉద్యోగుల పనితీరును గమనించేందుకు, వినియోగదారుల్లో ఎవరైనా తేడాగా ఉంటే అలాంటి వారిపై నిఘా పెట్టేందుకు సైతం వీటిని వాడుతున్నారు. అలాంటి సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో ఎలాంటి అవగాహన ఉంది? సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై పలు వర్గాల్లో ఎలాంటి అభిప్రాయాలున్నాయన్న వివరాలను బీపీఆర్ఎండీ (బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) ఇటీవల స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా 2023 పేరిట నివేదికను విడుదల చేసింది. బీదల బస్తీల మొదలు సంపన్న వర్గాల నివాస ప్రాంతాల వరకు అన్ని ప్రాంతాల వారు సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు జై కొట్టారు. -
ఏ చర్యలకైనా సిద్ధం!
లండన్: తమ దేశాన్ని భద్రంగా ఉంచేందుకు ఎటువంటి చర్యకైనా వెనుకాడబోమని బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. అట్లాంటిక్ మిత్ర దేశాలతో నిత్యం టచ్‌లో ఉంటూ, రక్షణపరంగా సన్నద్ధతతో ఉన్నట్లు ఆయన తెలిపారు. సోమవారం ఆయన ఉత్తర ఇంగ్లండ్‌లోని ఓ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన ఎటువంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నామని ప్రజలు గ్రహించాలని కోరారు. తమ దేశ గగనతలాన్ని కాపాడుకునేందుకు టైఫూన్ యుద్ధ విమానాలను అప్రమత్తంగా ఉంచామన్నారు. అనుమానిత చైనా నిఘా బెలూన్లను అమెరికా సైన్యం కూల్చివేయడం, యూకేకు కూడా బెలూన్ల బెడద ఉందన్న వార్తలపై రిషి పై విధంగా స్పందించారు. -
చైనా గగనతలంలో అమెరికా బెలూన్ల కలకలం!
బీజింగ్: నిఘా బెలూన్ల వ్యవహారంతో అమెరికా, చైనాల మధ్య పరిస్థితులు నానాటికీ ఉద్రిక్తతంగా మారుతున్నాయి. ఈ అంశంతో పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి ఇరు దేశాలు. అవి నిఘా బెలూనలు కాదని, సాధారణ పరిశోధనల కోసం ప్రయోగించిన బెలూన్లని, అమెరికా ఉత్తపుణ్యానికే కూల్చేసిందని చైనా మండిపడుతోంది. మరోవైపు అమెరికా మాత్రం చైనా బెలూన్ల వ్యవహారాన్ని సీరియస్‌గానే తీసుకుంటోంది. ఇక.. తాజాగా అమెరికాకు కౌంటర్ ఇచ్చింది చైనా. తమ గగనతలంలోనూ అమెరికా నిఘా బెలూన్స్ సంచరించాయని చైనా సోమవారం ఆరోపించింది. జనవరి 2022 నుంచి ఇప్పటిదాకా తమ గగనతలంలోకి ఏకంగా పది నిఘా బెలూన్లను అమెరికా పంపిందని పేర్కొంది. అక్రమంగా ఇతర దేశాల గగనతలంలోకి చొరబడడమూ అమెరికాకు కొత్తేం కాదు అంటూ చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ బెన్‌బిన్ పేర్కొన్నారు. చైనా అధికార యంత్రాంగం అనుమతులు లేకుండానే మా(చైనా) భూభాగంలోకి అమెరికా బెలూన్లు వచ్చాయి. మరి వాటి సంగతి ఏంటి?. అలాగని వాళ్లలాగా తొందరపాటు చర్యలకు మేం దిగబోం. ఈ పరిస్థితిని బాధ్యతాయుతంగా, ప్రొఫెషనల్‌గా హ్యాండిల్ చేస్తాం. చైనా గగనతలంలో అమెరికా ఎయిర్బెలూన్ల సంచారం గురించి అదనపు సమాచారం కావాలంటే.. వెళ్లి వాళ్లను(అమెరికా)ను ఓసారి సంప్రదించండి అంటూ వ్యాఖ్యానించారు వాంగ్ బెన్‌బిన్. ఈ ఆరోపణలపై అమెరికా స్పందించాల్సి ఉంది. -
భారత్ టార్గెట్‌గా చైనా నిఘా బెలూన్లు!
వాషింగ్టన్: నిఘా బెలూన్లతో అగ్రరాజ్యాన్ని హడలెత్తించిన చైనా.. మరిన్ని దేశాలను లక్ష్యంగా చేసుకుందనే సమాచారం ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తోంది. భారత్‌తో పాటు జపాన్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పైన్స్.. ఇలా మరికొన్ని దేశాలపైనా సర్వేయిలెన్స్ బెలూన్లను ప్రయోగించిందని, ఆర్మీకి చెందిన కీలక సమాచారాన్ని సేకరించే యత్నం చేసిందని కథనాలు వెలువడుతున్నాయి. ప్రముఖ వార్తా ప్రచురణ సంస్థ ది వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. చైనా దక్షిణ తీరంలోని హైనాన్ ప్రావిన్స్ నుంచి నిఘా బెలూన్ల ప్రయత్నం కొనసాగిందని.. జపాన్, భారతదేశం, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్‌తో సహా పలు దేశాల సైనిక సమాచారాన్ని సేకరించే ప్రయత్నం జరిగిందని ఆ కథనం పేర్కొంది. ఇందుకు సంబంధించి పలువురు నిఘా అధికారులు, భద్రతా విభాగానికి చెందిన ప్రముఖుల నుంచి అభిప్రాయాలను సేకరించి.. ప్రచురించింది ఆ కథనం. ఈ పరిణామంపై భారత్ నుంచి స్పందన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. వాషింగ్టన్ పోస్ట్ కథనానికి కొనసాగింపుగా.. అమెరికా భద్రతా అధికారులు భారత్ సహా మిత్ర దేశాలను చైనా నిఘా బెలూన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు తాజాగా యుద్ధ విమానాల ద్వారా చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన విషయాన్ని.. అట్లాంటిక్ మహాసముద్రం నుంచి ఆ బెలూన్ల శకలాలను సేకరించిన విషయాన్ని సైతం మిత్ర దేశాలకు నివేదించింది అమెరికా. గత మూడురోజులుగా 40 మిత్ర దేశాలకు చెందిన భద్రతా ప్రతినిధులు, దౌత్యవేత్తలతో పెంటగాన్ అధికారులు ‘చైనా నిఘా బెలూన్ల వ్యవహారం’పై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సర్వేయలెన్స్ ఎయిర్‌షిప్స్‌గా భావిస్తున్న ఈ బెలూన్లు.. చైనా ఆర్మీ(పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) ద్వారానే ప్రయోగించబడుతున్నాయని, ఐదు ఖండాల్లో వీటి ఉనికి గుర్తించినట్లు అమెరికా భద్రతా అధికారులు చెబుతున్నారు. ఇది ఇతర దేశాల సౌభ్రాతృత్వానికి విఘాతం కలిగించడేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చైనా మాత్రం అవి శాటిలైట్ సంబంధిత ఎయిర్‌షిప్స్ తప్ప.. నిఘాకు సంబంధించినవి కాదని వాదిస్తోంది. ఈ మేరకు బెలూన్ కూల్చివేతపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా.. అమెరికా మాత్రం ఈ ఘటనతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీయదనే ఆశాభావం వ్యక్తం చేశారు బైడెన్. అలాగే.. పేలిన శకలాలను ఎట్టి పరిస్థితుల్లో చైనాకు అప్పగించబోమని స్పష్టం చేశారు. గత వారం రోజులుగా.. హవాయి, ఫ్లోరిడా, టెక్సాస్, గువాం ప్రాంతాల్లో చైనా బెలూన్లు దర్శనమిచ్చాయి. ఇందులో మూడు ట్రంప్ హయాంలోనే గగనతలంలో విహరించేందుకు అనుమతులు లభించాయని.. అయితే అవి చైనా నిఘా బెలూన్లు అనే విషయం తాజాగానే వెల్లడైందని భద్రతా అధికారుల నివేదిక వివరిస్తోంది. -
వీకెండ్ పార్టీలకు వెళ్తున్నారా? మోసగాళ్లు తొలుత ఏం చేస్తారో తెలుసా?
వీకెండ్ వస్తుందంటేనే చాలామందిలో ఒక జోష్ వస్తుంది. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకున్నాం. కుటుంబంతో కలిసి పిక్నిక్లకు వెళ్లాం.. అంటూ ఆ ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేసి ఆనందాన్ని పంచుకుంటాం. వాటికి వచ్చిన లైక్స్, కామెంట్స్ చూసి మురిసిపోతుంటాం. ఇలాంటి వీకెండ్ పార్టీ జాబితా మీద నిఘా వేసే మోసగాళ్లు డిజిటల్లో పొంచి ఉన్నారు జాగ్రత్త. డిజటల్ మోసగాడి లక్ష్యం ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్స్‌ను అనుకరిస్తూ వారి పేరిట నకిలీ అకౌంట్స్‌ను సృష్టించడం. ఈ జాబితాలో రాజకీయ నాయకులు, నటీనటులు, కంపెనీ అధినేతలు, ప్రముఖుల అకౌంట్స్ ఉండే అవకాశాలే ఎక్కువ. నకిలీ అకౌంట్స్‌తో మోసం చేసేవారు అన్ని ఆన్లైన్ సామాజిక ప్లాట్‌ఫారమ్‌లలో కనిపిస్తారు. వీరిలో చాలా మంది ప్రమాదకారులు కానప్పటికీ, పరువు నష్టం లేదా విరాళాలు అడగడం/ రుణాలు కోరడం/ కనెక్ట్ అయిన వెంటనే డబ్బు దోపిడీ చేయడం .. వంటి వాటిపై దృష్టి సారించే వారున్నారు. ముందే ప్లాన్ డిజిటల్ మోసగాళ్లు ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం ఏ మాత్రం నమ్మదగని కంటెంట్‌ను సృష్టిస్తారు. బాధితులు లేదా ఇతర హెల్త్ కేర్ ప్రొవైడర్స్ నుండి సమాచారాన్ని దొంగిలించడానికి టెలిఫోన్ స్కామర్లు ఎన్‌సిబి, ఇతర డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్లలాగా నటించే విస్తృత మోసపు పథకాలు రిలీజ్ చేస్తుంటారు. ముఖ్యంగా వీక్ ఎండ్ పార్టీ కల్చర్ ఉన్న ఆన్లైన్ వినియోగదారులకు ఈ విధమైన కాల్స్ చేస్తుంటారు. స్కామర్లు నకిలీ పేర్లు, ప్రసిద్ధ డ్రగ్ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు లేదా అసలు విభాగాలలోని పోలీసు అధికారుల పేర్లను కూడా ఉపయోగిస్తారు. ప్రధానమైన ఎంపిక వైద్యపరమైన సమస్యలు, విడాకులు, కొత్త ఉద్యోగం, పార్టీల అవగాహన, గేమింగ్, కొనుగోళ్లు చేయాలనుకునేవారు, లైఫ్ స్టైల్ అవగాహన, టెక్నాలజీ, ట్రావెల్, స్పోర్ట్స్.. వంటి టాపిక్స్ గురించి చర్చించే సామాజిక ప్రొఫైల్స్‌ను మోసగాళ్లు ఎంచుకుంటారు. మోసగాళ్ల సాధారణ లక్షణాలు ♦దాడి చేసేవారి మాటల్లో వేగం ఉంటుంది. దీనిని గమనించి బాదితులు వెంటనే అలర్ట్ అవ్వచ్చు. ♦డబ్బుకు సంబంధించి ధ్రువీకరణ పొందడానికి ఊహించని రిక్వెస్ట్‌లు పంపుతారు. ఇది ఇ–మెయిల్స్‌కు ఎక్కువ. ♦స్కామర్లు తరచుగా ‘ప్రైవేట్, గోప్యమైన, రహస్య‘ పదాలను ఉపయోగిస్తారు, ♦చాలాసార్లు స్కామర్లు మీ ఇన్ బాక్స్‌లోకి ప్రవేశించడానికి ఇ మెయిల్ స్పూఫింగ్ లేదా ఒకేలా కనిపించే ఇమెయిల్‌ను ఉపయోగిస్తారు. ఇటీవలి కొత్త దాడులు ♦మోసగాళ్లు దొంగిలించిన ఉన్నతాధికారుల ఖాతాలను ఉపయోగించి ఆన్ లైన్ లో నకిలీ ఖాతాను సృష్టిస్తున్నారు. మోసగాళ్ళు వారి డిజిటల్ ప్రొఫైల్ (ఈ్క)ని ఎన్ ఫోర్స్మెంట్ అధికారి లేదా సీనియర్ బ్యూరోక్రాట్ చిత్రంతో సృష్టిస్తారు. స్కామర్ ఆ ఎన్ ఫోర్స్మెంట్ ఆఫీసర్ లేదా బ్యూరోక్రాట్‌గా నటించి వారి బృందాలకు వాట్సప్ సందేశాలను పంపుతాడు. ♦వారు వారాంతపు పార్టీపై అవగాహన ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటారు. మొత్తం డేటా సోషల్ మీడియా పోర్టల్‌ల నుండి సేకరిస్తారు. ♦స్కామర్ల కథనాలు కొద్దిగా మారవచ్చు కూడా. సాధారణంగా, వారు చట్టవిరుద్ధమైన డ్రగ్స్‌తో ప్యాక్ చేసిన పార్శిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు మీకు చెప్తారు. ఇది బాధితుల పేరుతో కొరియర్ చేయబడింది, లేదా అక్రమ మాదకద్రవ్యాలతో చేసిన ప్యాక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు, కొరియర్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా సృష్టిస్తారు. అంతేకాదు, మాదకద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్ కోసం బాధితుడిని అరెస్టు చేయబోతున్నారని బెదిరించడం. ♦బాధితులు వారి ఇ మెయిల్లు, వాట్సాప్ సంభాషణలకు సరిగ్గా స్పందించకపోతే, స్కామర్లు మొత్తాలను చెల్లించనందుకు అరెస్టు చేయడానికి లా ఎన్ఫోర్స్మెంట్, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలుగా నటిస్తూ నకిలీ నోటీసులు పంపడం ద్వారా బాధితుడిని బెదిరించడం ప్రారంభిస్తారు. బాధితురాలికి బకాయిపడిన మొత్తంపై అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వకుండా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ♦దోపిడీలో భాగంగా, బాధితుడు తమకు చెల్లింపుగా డబ్బును బదిలీ చేయడానికి లేదా బాధితుడు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాడని నిరూపించడానికి నకిలీ అధికారి పైన పేర్కొన్న కారణాన్ని చూపుతాడు. UPIని ఉపయోగించి డబ్బును ట్రాన్స్ఫర్ చేయమని చెబుతారు. సోషల్ మీడియాలో మోసం జరిగితే.. Instagramలో అయితే https://help.instagram.com/ 370054663112398 YouTubeలో అయితే https://support.google.com/youtube/answer/2801947?hl=en Facebookలో అయితే https://www.facebook.com/ help/contact/169486816475808 LinkedInలో అయితే https://www.linkedin.com/ help/linkedin/answer/61664/reporting-fake-profiles?lang=en రిపోర్ట్ చేయవచ్చు సైబర్ క్రైమ్ పోర్టల్... పరిస్థితి తీవ్రతను బట్టి జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ https://www.cybercrime.gov.inలో రిపోర్ట్ చేయచ్చు. మోసం చేయడానికి రకరకాల వేషాలు వేయడం, పరువు తీయడం లేదా మోసం చేయడం లేదా మోసం చేయాలనే ఉద్దేశ్యంతో తప్పుడు గుర్తింపు ఉండటం.. వంటివి నేరంగా ఈ పోర్టల్‌లో ఉంటుంది. మోసగాళ్ల బారిన పడకుండా.. ♦మీ ఖాతాలకు ప్రత్యేక, ఆల్ఫాన్యూమరిక్ అక్షరాలతో సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి ♦(2FA) రెండు కారకాల ప్రమాణీకరణను ప్రారంభించండి. ♦లాక్/ గార్డ్ వంటివి మీ ప్రొఫైల్ ఫీచర్లకు ఉపయోగించండి. ♦సమాచార భాగస్వామ్యాన్ని నియంత్రించడానికి మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కోసం గోప్యతా సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయండి ♦సామాజిక ప్లాట్‌ఫారమ్‌లలో సున్నితమైన, వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయవద్దు ♦అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోండి, https://isitphishing.org/తో లింక్‌ను ధృవీకరించండి. ♦నిజ జీవితంలో మీకు తెలిసిన, విశ్వసించే వ్యక్తులతో మాత్రమే కనెక్ట్ అవ్వండి. ♦ఆఫ్‌లైన్– ఆన్లైన్ అందరినీ ఒకే విధంగా పరిగణించాలి. ♦మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కోసం GPS లొకేషన్ ఫీచర్‌కి యాక్సెస్ ఆపేయండి. ♦మీ ఆర్థిక లావాదేవీలను ఉపయోగించే సమయాల్లో రిక్వెస్ట్ చేయడం, రిప్లై ఇవ్వడం వంటివి చేసే ముందు మీ ఇమెయిల్ హెడర్లను కూడా చెక్ చేయడం అలవాటు చేసుకోండి. -
సోషల్ మీడియాపై సెబీ దృష్టి
న్యూఢిల్లీ: మార్కెట్ మోసాలను అరికట్టే దిశగా సోషల్ మీడియా, ఇతరత్రా ఆన్లైన్ ప్లాట్‌ఫాంలపై నిఘా పెంచడంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘వెబ్ ఇంటెలిజెన్స్ టూల్‘ను ఏర్పాటు చేసేందుకు నాలుగు సంస్థలను ఎంపిక చేసింది. ఆమ్ట్రాక్ టెక్నాలజీస్, ఈఎస్ఎఫ్ ల్యాబ్స్, పెలోరస్ టెక్నాలజీస్, ల్యాబ్ సిస్టమ్స్ వీటిలో ఉన్నట్లు సెబీ తెలిపింది. ఇంటర్నెట్లో విస్తృతంగా ఉండే సమాచారం ఆధారంగా వివిధ సంస్థలు, వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాలను విశ్లేషించడం, ఎప్పటికప్పుడు రిపోర్టులు రూపొందించడం మొదలైన విధులు ఈ టూల్ నిర్వహించాల్సి ఉంటుంది. కొన్నాళ్లుగా ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరిగిపోయి, బోలెడంత సమాచారం అందుబాటులో ఉంటోంది. వివిధ సంస్థలు, వ్యక్తులు, గ్రూప్‌లు, అంశాలపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు ఈ డేటా ఉపయోగపడగలదని సెబీ భావిస్తోంది. విచారణ ప్రక్రియ సులభతరం కాగలదని, సమయం కూడా ఆదా అవుతుందనే ఉద్దేశంతో కొత్త వెబ్ ఇంటెలిజెన్స్ టూల్‌ని ఉపయోగించాలని నిర్ణయించింది. -
జియో ట్యాగింగ్‌కు ‘అగ్రి’ అవడం లేదు!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ శాఖలో జియో ట్యాగింగ్ నిఘా రచ్చకు దారితీసింది. వ్యవసాయ విస్తరణాధికారుల(ఏఈవో)పై జియో ట్యాగింగ్‌తో నిఘా ఏర్పాటు చేసి, తద్వారా అదే పద్ధతిలో హాజరు వేసుకోవాలని నిర్ణయించారు. లేకుంటే గైర్హాజరుగా భావించాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ తేల్చిచెప్పడంతో పెద్ద దుమారం చెలరేగింది. దీనిపై ఏఈవోలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు మండల వ్యవసాయాధికారులు(ఏవో), డివిజనల్ వ్యవసాయాధికారులకు కూడా ఇదే పద్ధతిలో హాజరును ప్రవేశపెట్టాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. దీంతో ఈ పద్ధతిని ఎత్తేయాలని 21 జిల్లాలకు చెందిన పలువురు అధికారులు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. అయినా ఇప్పటివరకు ఉన్నతస్థాయి అధికారులు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. యాక్టివిటీ లాగర్ యాప్... రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పనిచేసే 2,600 మంది ఏఈవోలు ఉన్నారు. ప్రతీ రెండు, మూడు గ్రామాలకు కలిపి ఒక ఏఈవో ఉంటారు. రైతు వేదికలే వారి కార్యాలయాలు. ఏఈవో ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఎప్పటికప్పడూ వారి కార్యకలాలపాలను తెలుసుకునేందుకు ప్రత్యేక యాక్టివిటీ లాగర్ యాప్ పేరుతో జియో ట్యాగింగ్ చేసే జీపీఎస్ వ్యవస్థను అమలు చేయనున్నారు. ఏఈవోలు వారి క్లస్టర్ పరిధిలోని గ్రామాల్లో ప్రత్యేకంగా ఒక నిర్దేశిత స్థలాన్ని నమోదు చేసుకోవాలి. స్పాట్‌లోకి వెళ్లి ‘మార్క్ మై ప్రెజెన్స్’అని నొక్కి ఫింగర్ ప్రింట్ నమోదు చేయాలి. లాంగిట్యూడ్, లాట్యిట్యూడ్ ఆధారంగా గుర్తించిన తర్వాతే హాజరు పడుతుంది. నిర్దేశిత గ్రామంలో ఏ రైతును కలిశారు? రైతుతో కలిసి క్షేత్రస్థాయికి వెళ్లారా? ఇంకా ఎవరైనా అధికారి వచ్చారా? రైతు వేదిక వద్ద ఏం చేశారు? ఆ రోజు షెడ్యూల్ ఏంటి? క్రాప్ బుకింగ్, రైతు బీమా, సీడ్ పర్మిట్ స్లిప్‌లు లాంటివి రోజుకు 17 రకాలు, అందులో మళ్లీ ఒక్కోదానికి రెండు, మూడు ఆప్షన్లతో అప్డేట్ చేసి నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారి రోజువారీ హాజరు, పనితీరు రికార్డు అవుతుంది. ఇలా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేసేలా ఈ విధానాన్ని ప్రవేశపెట్టడంపై ఏఈవోలు మండిపడుతున్నారు. ఇదీ చదవండి: ‘ధరణి’లో పరిష్కారం కాని సమస్యలు.. భూ లబ్ధిదారులకు తిప్పలు -
Predator drone deal: అమెరికా నుంచి అత్యాధునిక డ్రోన్లు
న్యూఢిల్లీ: అమెరికా నుంచి అత్యాధునిక ఎంక్యూ–9బీ ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు సంబంధించిన సంప్రదింపులు పురోగతిలో ఉన్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం రూ.300 కోట్ల విలువైన 30 ఎంక్యూ–9బీ డ్రోన్లు అందితే వీటిని చైనా సరిహద్దులతోపాటు హిందూమహా సముద్రం ప్రాంతంపై నిఘాకు వినియోగించనున్నట్లు వెల్లడించాయి. ఎంక్యూ–9 రీపర్ డ్రోన్ ఆధునిక వెర్షనే ఎంక్యూ–9బీ. గత నెలలో అఫ్గాన్ రాజధాని కాబూల్‌లోని ఓ ఇంట్లో ఉన్న అల్‌ఖైదా నేత అల్ జవహరిని హతమార్చేందుకు వాడింది ఎంక్యూ–9 రీపర్ డ్రోన్‌నే కావడం గమనార్హం. జనరల్ ఆటమిక్స్ అభివృద్ధి చేసిన ఎంక్యూ–9 బీ ప్రిడేటర్ల కోసం రెండు ప్రభుత్వాల మధ్య చర్చలు తుది దశకు వచ్చాయన్న వార్తలను రక్షణ శాఖ వర్గాలు తోసిపుచ్చాయి. ప్రస్తుతం చర్చలు పురోగతిలో ఉన్నాయని స్పష్టం చేశాయి. వీటి ఖరీదు,, ఆయుధాల ప్యాకేజీ, సాంకేతికత భాగస్వామ్యానికి సంబంధించిన కొన్ని అంశాలపై చర్చలు నడుస్తున్నాయని తెలిపాయి. ఇదే విషయాన్ని జనరల్ ఆటమిక్స్ గ్లోబల్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ వివేక్ లాల్ కూడా ధ్రువీకరించారు. చర్చల వివరాలను రెండు దేశాల ప్రభుత్వాలే వెల్లడిస్తాయన్నారు. ఎంక్యూ–9బీ గార్డియన్ రకం రెండు డ్రోన్లను 2020 నుంచి భారత్ తమ నుంచి లీజుకు తీసుకుని భూ సరిహద్దులు, హిందూ మహాసముద్రంపై నిఘాకు వినియోగిస్తోందన్నారు. ఈ హంటర్–కిల్లర్ డ్రోన్లు 450 కిలోల బరువైన బాంబులతోపాటు నాలుగు హెల్ఫైర్ క్షిపణులను మోసుకెళ్లగలవు. -
రష్యా తో ‘లైఫ్ లైన్స్’కు ముప్పు!
ఆధునిక సాంకేతికత మన జీవితాలను ఆక్రమించేసింది. ఇంటర్నెట్ లేనిది క్షణమైనా గడవని పరిస్థితి. కొద్ది గంటలు ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇంటర్నెట్ సేవలు లేదా సామాజిక మాధ్యమ యాప్‌లు నిలిచిపోతే అదో పెద్ద వార్త అవుతోంది. అలాంటిది ఇంటర్నెట్కు జీవనాడులుగా పరిగణించే సముద్రగర్భంలోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను ఎవరైనా కత్తిరించేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ప్రపంచం స్తంభించిపోతుంది. అండర్ వాటర్ క్యాప్సుల్ పనితీరును ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ (ఫైల్) వివిధ ఖండాలను కలుపుతున్న ఆప్టికల్ ఇంటర్నెట్, రక్షణ వ్యవస్థలు, వైద్య ఆరోగ్య సేవలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థలు, ఆర్థిక కార్యకలాపాలు, క్యాబ్ సర్వీసులు, ఫుడ్ డెలివరీలు... ఇలా ఒకటేమిటి ప్రతిదీ నిలిచిపోతుంది. ప్రపంచం అతలాకుతలమవుతంది. ఇప్పుడదే ముప్పు రష్యా నుంచి పొంచి వుందని అమెరికా, బ్రిటన్‌తో సహా ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. అణ్వాయుధ పోటీ గతించిన ముచ్చట. శత్రుదేశాలను దెబ్బతీయడానికి, ప్రపంచ దేశాలను భయపెట్టడానికి రష్యా, చైనాలు ఇప్పటికే సైబర్ దాడులను సమర్థమంతమైన ఆయుధంగా వాడుతున్నాయి. ఇతర దేశాల్లోని కీలక వ్యవస్థలపై దాడులు కొనసాగిస్తూ, వాటిని కుప్పకూల్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. హ్యాకింగ్, డేటా చౌర్యం జరుగుతోంది. అందుకే ప్రపంచదేశాలన్నీ ‘సైబర్ సెక్యూరిటీ’ని అతిపెద్ద సవాల్‌గా స్వీకరించాయి. ఈ తరుణంలోనే రష్యా గత ఐదారేళ్లుగా కొత్త యుద్ధ తంత్రానికి తెరలేపింది. సముద్రగర్భంలోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను లక్ష్యంగా చేసుకుంటూ... ఏ క్షణమైనా వాటిని తుంచేసే విధంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. వీటిలో నుంచి ప్రసారమయ్యే సమాచారాన్ని తస్కరించే సాంకేతికతలనూ అభివృద్ధి చేస్తోంది. భారీగా పెట్టుబడులు పెడుతోంది. కొత్తగా నియమితులైన బ్రిటన్ చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాఫ్ అడ్మిరల్ టోనీ రాడకిన్ ఈ జీవనాడులకు రష్యా నుంచే ప్రధాన ముప్పు పొంచి వుందని గతవారం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సముద్రగర్భంలోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను పరిరక్షించుకోవడానికి.. ప్రత్యేక నిఘా నౌకను 2024 కల్లా జలప్రవేశం చేయిస్తామని బ్రిటన్‌కు చెందిన రాయల్ నేవీ ఇటీవల ప్రకటించింది. ఇది అణ్వాయుధ యుద్ధంతో సమానమైన ముప్పని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా లక్ష మంది సైన్యాన్ని మోహరించడంతో రెండు నెలలుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఉక్రెయిన్ను ఆక్రమిస్తే తీవ్ర పర్యవసానాలు చవిచూడాల్సి వస్తుందని అమెరికా, నాటో దేశాలు రష్యాను పలుమార్లు హెచ్చరించాయి. దీంతో రష్యా అభివృద్ధి చేస్తున్న సముద్రగర్భ సాంకేతికతలు, సమకూర్చుకుంటున్న సాధానాలపై అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. రష్యా ఇలాంటి తీవ్ర చర్యలకు దిగే అవకాశాలు తక్కువే అయినా... అమెరికా, నాటో దేశాలతో ఘర్షణ ముదిరితే... రష్యా దీన్నో ఆయుధంగా వాడే ప్రమాదం ఉందనేది నిపుణుల అభిప్రాయం. రష్యా ఏయే మార్గాల్లో ప్రపంచానికి జీవనాడులైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను దెబ్బతీయగలదో చూద్దాం.. 436: వివిధ సముద్రాల మీదుగా పలు ఖండాలను, ప్రపంచ దేశాలను కలుపుతూ కడలి గర్భంలో మొత్తం 436 ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లైన్స్ ఉన్నాయి. వీటి మొత్తం పొడవు.. 12,87,475 కిలోమీటర్లు. ఇవే నేటి మన ప్రపంచపు జీవనాడులు (లైఫ్ లైన్స్). నిరంతరాయ ఇంటర్నెట్ సేవలకు మూలాధారం. వీటిలో అన్నింటికంటే పొడవైనది అమెరికా– ఆసియా ఖండాలను కలిపేది. ఈ కేబుల్‌లైన్ పొడవు 20,004 కిలోమీటర్లు. 97%: అంతర్జాతీయంగా నిత్యం జరిగే కమ్యూనికేషన్స్‌లో 97 శాతం ఈ కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. శాటిలైట్స్ మన కమ్యూనికేషన్స్ అవసరాల్లో మూడు శాతం మాత్రమే తీరుస్తున్నాయి. 10 లక్షల కోట్ల డాలర్లు: సముద్రపు అడుగుభాగంలోని 436 కేబుల్ లైన్స్ ద్వారా ప్రతిరోజూ 10 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. ప్రపంచం ఆర్థిక రంగానికి ఇదే లైఫ్‌లైన్. -
గంజాయి రవాణాపై ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గంజాయి సాగు, రవాణా, అమ్మకాలపై ఉక్కుపాదం మోపేలా ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. చత్తీస్‌గఢ్, ఏఓబీలోని దండకారణ్యం నుంచి గంజాయి ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగా పలు రాష్ట్రాలకు సరఫరా అవుతున్నట్లు తేలింది. దీంతో సరిహద్దులో నిఘా కట్టుదిట్టం చేసి, నిత్యం తనిఖీలతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై ఉమ్మడి జిల్లా పోలీసులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 78 హాట్స్పాట్లను గుర్తించిన పోలీసులు ఆ ప్రాంతాల్లో డేగ కన్నుతో నిఘా వేయనున్నారు. ఇక్కడ గంజాయి రవాణాకు బ్రేక్ వేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మత్తు దందాకు చెక్ పెట్టనున్నారు. ఇక తనిఖీలు ముమ్మరం ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పట్టుబడిన గంజాయి అక్రమ రవాణా కేసుల్లో మహారాష్ట్ర, ఎంపీ, కర్ణాటకలకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రస్తుతం గంజాయి దందా రూ.కోట్లకు చేరింది. బుధవారం గంజాయిపై జరిగిన సమీక్షలో సీఎం ఆదేశాల మేరకు భద్రాచలం, చర్ల, చింతూరు, బూర్గంపాడు దారిలో, పాల్వంచ, కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లందు, మణుగూరు, మధిర, సత్తుపల్లి, బోనకల్, కామేపల్లి మండలాల్లో ఇకపై నిత్యం తనిఖీలు చేపట్టనున్నారు. దండకారణ్యం గంజాయి వనం ఉమ్మడి ఖమ్మం జిల్లా సరిహద్దులోని చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని సుక్మా, దంతెవాడ, ఖాంఖేడ్, బీజాపూర్, మల్కాన్‌గిరి జిల్లాల్లో భారీగా గంజాయి సాగవుతోంది. అత్యధికంగా మల్కాన్‌గిరి జిల్లాలోనే గంజాయి సాగు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇక్కడి ఆదివాసీలతో దళారులు కొన్నేళ్లుగా గంజాయి సాగు చేయిస్తున్నారు. గత రెండేళ్లుగా ఇది మరింత పెరిగింది. ఇక్కడ సాగు చేసిన గంజాయి ఎండబెట్టిన తర్వాత ప్యాకింగ్ చేసి మల్కాన్‌గిరి నుంచి సీలేరు, మోతుగూడెం, చింతూరు మీదుగా భద్రాచలం చేరుస్తారు. అలాగే దంతెవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాల నుంచి కుంట మీదుగా భద్రాచలానికి సరఫరా అవుతుంది. 24 గంటలు తనిఖీలు.. గంజాయి రవాణా, అమ్మకాలు, సాగుపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఉన్న చెక్‌పోస్టులకు తోడు పలు ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరికొన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తాం. హాట్స్పాట్లలో నిరంతర నిఘా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో 24 గంటలు తనిఖీలు ఉంటాయి. –విష్ణు ఎస్.వారియర్, పోలీస్ కమిషనర్, ఖమ్మం -
రౌడీ షీటర్ల పై నిఘా
-
నగదు లావాదేవీలపై నిరంతర నిఘా
కైకలూరు : ఇకపై ప్రధాన నగదు లావాదేవీలపై నిరంతర నిఘా కొనసాగిస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మండవల్లి సబ్ రిజిస్ట్రార్ నకిలీ చలానా కేసులో ప్రధాన నిందితుడు రామ్థీరజ్ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్టు తెలిపారు. కైకలూరు సర్కిల్ కార్యాలయం వద్ద స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ రవీంద్రనాథ్, గుడివాడ డీఎస్పీ సత్యానందంతో కలసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుగా మోసపోయిన బాధితులు ప్రసాద్, వీరసత్యబాబులు తాము ఏ విధంగా నష్టపోయారో వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లు.. నకిలీ చలానా కేసుపై సమీక్ష చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారని, దీంతో గుడివాడ డీఎస్పీ సత్యానందంను ప్రత్యేకాధికారిగా నియమించి విచారణ జరిపించినట్టు తెలిపారు. తండ్రీకొడుకులది ప్రధాన పాత్ర.. మండవల్లికి చెందిన స్టాంప్ వెండర్ మేడేపల్లి రామ్థీరజ్, అతని తండ్రి డాక్యుమెంట్ రైటర్ బాలాజీ కలిసి.. 568 రిజిస్ట్రేషన్ల నిమిత్తం 640 చలానాలలో రూ.2,68,04,943 ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా, చలానాలను మార్ఫింగ్ చేసి కేవలం రూ.15,92,158 మాత్రమే చెల్లించినట్టు తెలిపారు. అదే విధంగా నాన్–జ్యుడిషియల్ స్టాంపుల కొనుగోలు నిమిత్తం ఏడు చలానాల ద్వారా రూ.1,55,800 చెల్లించాల్సి ఉండగా.. కేవలం రూ.1,981 మాత్రమే చెల్లించి, ప్రభుత్వానికి రూ.1,53,819 జమ చేయలేదన్నారు. ఈ నెల 19న సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదుతో మండవల్లిలో కేసు నమోదు చేసి, బాధితులతో 21న డీఎస్పీ సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. కేసును ఛేదించిన గుడివాడ డీఎస్పీ, కైకలూరు సీఐ వైవీవీఎల్ నాయుడు, మండవల్లి ఎస్ఐ రామకృష్ణను అభినందించారు. అలాగే మండవల్లి నకిలీ చలానా కేసులో పోలీసుల పనితీరు అభినందనీయమని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ డీఐజీ రవీంద్రనాథ్ ప్రశంసించారు. -
దళితబంధుపై నిఘా.. బాధ్యతలు థర్డ్‌పార్టీకి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్‌గా దృష్టి సారించారు. దేశంలో అత్యంత భారీ ఆర్థిక సాయంతో తలపెట్టిన సంక్షేమ పథకం కావడంతో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా పథకం అమలు ఎలా జరుగుతోంది? ఎలాంటి పొరపాట్లు దొర్లుతున్నాయి? ఏ విధానాలు వ్యాపారానికి ప్రతికూలంగా మారుతున్నాయి? తదితర విషయాలపై నిరంతరం ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు విజిలెన్స్ తరహాలో ఓ సంస్థ పనిచేయాలని సీఎం నిర్ణయించారు. చదవండి: పాస్‌పుస్తకం కోసం రైతు వినూత్న నిరసన ఇటు లబ్ధిదారులకు, అటు ప్రభుత్వాధికారులకు సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియాలంటే థర్డ్‌పార్టీ (ప్రైవేటుసంస్థ) పర్యవేక్షణ ఉండాలన్న సీఎం ఆలోచనల మేరకు ఇప్పటికే బాధ్యతలు అప్పగించారు. ఇది విజయవంతం కావాలంటే అమలుపై మూడో నేత్రం ఉండాలన్న తలంపుతోనే థర్డ్‌పార్టీకి విజిలెన్స్ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అధ్యయనం మొదలుపెట్టిన థర్డ్‌పార్టీ ఈ థర్డ్‌పార్టీ ఇప్పటికే లబ్ధిదారులతో సమావేశమైంది. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక ప్యాకేజీతో ఎవరేం చేయాలనుకుంటున్నారో ఇప్పటికే వివరాలు సేకరించింది. ప్రభుత్వం ఎంపిక చేసిన 15 మంది లబ్ధిదారుల నుంచి థర్డ్‌పార్టీకి మిశ్రమస్పందన లభించినట్లు తెలిసింది. తమకు ఎలాంటి నైపుణ్యాభివృద్ధి అవసరం లేదని, తమకు ఇప్పటికే డ్రైవింగ్, మోటారు రంగంలో ఉన్న అనుభవం మేరకు వాహనాలు ఇప్పిస్తే చాలని కొంతమంది చెప్పారు. మరికొందరు తమకు నైపుణ్యాభివృద్ధితోపాటు, మార్కెటింగ్ సదుపాయాలు ప్రభుత్వమే కల్పించాలని కోరారు. ఇంకొందరు తమకు అసలు వ్యాపారం ఎలా చేయాలో తెలియదని, అందుకే తాము ఎంచుకున్న వ్యాపారంలో అలవాటు పడేంతవరకు తమను కనిపెట్టుకుని ఉండాలని చెప్పారు. ఈ సంస్థ లబ్ధిదారులతో మాట్లాడాక నివేదిక సిద్ధం చేసి సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయాని(సీఎంవో)కి పంపినట్లు తెలిసింది. లబ్ధిదారులకు ఎలాంటి సాయం కావాలి? వ్యాపారం/యూనిట్ అభివృద్ధి చెందాలంటే ఎలాంటి వ్యూహాలు అవలంబించాలి? అన్న విషయంలో తాము గమనించిన విషయాలపైనా నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా ముఖ్యమంత్రి నేరుగా జిల్లా మంత్రి, కలెక్టర్‌తో మాట్లాడి దిశానిర్దేశం చేస్తారు. -
దాచడానికి ఏమీ లేదు
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్ వ్యవహారంలో దాచేయడానికి ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. దీనిపై అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించడానికి, అనుమానాలను నివృత్తి చేయడానికి తటస్థులైన ప్రఖ్యాత నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. రాజకీయ ప్రత్యర్థులు, సామాజిక ఉద్యమకారులు, జర్నలిస్టుల ఫోన్లపై కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్ స్పైవేర్‌తో నిఘా పెట్టిందని, ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ సీనియర్ జర్నలిస్టులు ఎన్.రామ్, శశి కుమార్‌తోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పెగసస్‌పై కేంద్ర ప్రభుత్వం క్లుప్తంగా అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే, సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించలేమని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్లపై మంగళవారం కూడా విచారణ కొనసాగిస్తామని వెల్లడించింది. పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. కేంద్రం లేదా కేంద్ర ప్రభుత్వం సంస్థలు అసలు పెగసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తున్నాయో లేదో స్పష్టం చేయాలని, ఈ మేరకు న్యాయస్థానంలో అఫిడవిట్ సమర్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. పెగసస్ అనేది దేశ భద్రతతో ముడిపడిన సున్నితమైన అంశమని పేర్కొన్నారు. దీన్ని సంచలనాత్మకంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తప్పుపట్టారు. అత్యున్నత సాంకేతికతకు సంబంధించిన ఈ అంశాన్ని పరిశీలించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. కేవలం ఓ వెబ్ పోర్టల్‌లో ప్రచురించిన వార్తల ఆధారంగానే పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారని, వాస్తవానికి పెగసస్‌పై తప్పుడు కథనాలు సృష్టించారని తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సొంత లాభం కోసం తప్పుడు ప్రచారం: కేవలం ఊహాగానాలు, అనుమానాలు, బలమైన సాక్ష్యాధారాలు లేని మీడియా కథనాలను, అసంపూర్ణ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని పెగసస్ స్పైవేర్‌పై కొందరు స్వతంత్ర దర్యాప్తును కోరుతున్నారని కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొంది. పెగసస్‌పై వస్తున్న ఆరోపణలకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్లో ఇప్పటికే సమాధానం ఇచ్చారని గుర్తుచేసింది. కొందరు సొంత ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని విమర్శించింది. అనుమానాలను నివృత్తి చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. పెగసస్‌పై మీడియాలో వస్తున్న వార్తలు నిజమే అయితే ఇది తీవ్రమైన అంశమేనని సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ స్పైవేర్‌తో భారత ప్రభుత్వం దేశంలో 300కు పైగా ఫోన్లపై నిఘా పెట్టిందని, రాజకీయ ప్రత్యర్థులు, సామాజిక ఉద్యమకారులు, జర్నలిస్టులపై కేంద్రం లక్ష్యంగా చేసుకుందంటూ ఇంటర్నేషనల్ మీడియా కన్సార్టియం బాంబు పేల్చింది. దీంతో ఈ అంశం దేశాన్ని కుదిపేసింది. పెగసస్‌పై సమాధానం చెప్పాలంటూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రతిపక్షాలు స్తంభింపజేసిన విషయం తెల్సిందే. -
సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లపైనా ‘నిఘా’
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్‌తో నిఘా పెట్టిన వారి జాబితాలో ఇద్దరు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లు కూడా ఉన్నారని ‘ది వైర్’ న్యూస్ పోర్టల్ బుధవారం వెల్లడించింది. సుప్రీంకోర్టు జడ్జి వాడిన పాత ఫోన్ నంబరు కూడా దీంట్లో ఉందని తెలిపింది. రిజిస్ట్రార్లు ఎన్కే గాంధీ, టీఐ రాజ్‌పుత్‌లు సుప్రీంకోర్టులోని ‘రిట్’ విభాగంలో పనిచేసినపుడు.. 2019లో వీరి ఫోన్లపై నిఘా పెట్టారు. ప్రతి ఏడాది దాదాపు వెయ్యికి పైగా రిట్ పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అవుతాయని, వీటిలో ప్రభుత్వానికి ఇబ్బందికరమైనవి, రాజకీయంగా సున్నితమైన అంశాలకు సంబంధించినవి కూడా ఉంటాయని వైర్ పేర్కొంది. అందువల్లే రిజిస్ట్రార్లపై కన్నేసి ఉంచారని వివరించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా వాడిన పాత ఫోన్ నంబరు కూడా నిఘా జాబితాలో ఉంది. సదరు ఫోన్ నంబరు 2014లోనే వాడటం ఆపేశానని అరుణ్ మిశ్రా తెలిపారు. అయితే 2018 దాకా ఇది ఆయన పేరుపైనే ఉందని వైర్ తెలిపింది. జస్టిస్ అరుణ్ మిశ్రా పాత ఫోన్ నంబరును 2019లో నిఘా జాబితాలో చేర్చారు. ఆయన 2020లో రిటైరయ్యారు. మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సన్నిహితుడు, ఆయన దగ్గర పనిచేసే జూనియర్ ఎం.తంగదురై ఫోన్‌పైనా నిఘా పెట్టారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ సంస్థ తయారుచేసిన పెగసస్ స్పైవేర్‌తో విపక్ష నాయకులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు, జర్నలిస్టులపై (మొత్తం 300 మందిపై) కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందని తమ పరిశోధనలో తేలిందని అంతర్జాతీయ మీడియా సంస్థల కన్సార్టియం వెల్లడించినప్పటి నుంచి భారత్‌లో దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. రాహుల్‌గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఇద్దరు కేంద్రమంత్రులు, మాజీ ఎన్నికల కమిషనర్, 40 మంది పాత్రికేయుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని తెలిపింది. ప్రభుత్వాలకు మాత్రమే తాము పెగసస్ స్పైవేర్‌ను అమ్ముతామని ఎన్ఎస్ఓ ప్రకటించింది. చట్ట విరుద్ధంగా ఎవరిపైనా నిఘా పెట్టలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా... అంటే దానర్థం ఈ నిఘా సాఫ్ట్వేర్ భారత ప్రభుత్వం వద్ద ఉన్నట్లు, దాన్ని వాడుతున్నట్లు అంగీకరించడమేనని విపక్షాలు అంటున్నాయి. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన జూలై 19 నుంచి పెగసస్ అంశంపై పార్లమెంటును ప్రతిపక్షాలు స్తంభింపజేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో విస్పష్ట ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. -
నాపై నిఘా పెట్టారు.. భద్రత అక్కర్లేదు: టీఎంసీ ఎంపీ
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై నిఘా పెట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు. తనకు భద్రత కావాలని కోరలేదని.. కానీ తన నివాసం వద్ద బీఎస్ఎఫ్ జవాన్లను మోహరించారని వెల్లడించారు. ఇంత సడెన్‌గా తన ఇంటి వద్ద బీఎస్ఎఫ్ అధికారులను నియమించడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణమే వారిని ఉపసంహరించుకోవాలని ఢిల్లీ పోలీసులకు రాసిన లేఖలో తెలిపారు. సాధారణ పౌరురాలిగా ఉండాలని కోరకుంటున్నాను. నాకు ఎలాంటి భద్రత వద్దన్నారు మహువా. ఇక బీఎస్ఎఫ్ కదలికలు చూస్తుంటే తనపై నిఘా ఉంచినట్టు అనిపిస్తోందంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎన్ఎన్ శ్రీవాస్తవకు రాసిన లేఖలో పేర్కొన్నారు మహువా మొయిత్రా. శుక్రవారం సాయంత్రం 4.30గంటల సమయంలో తన అధికారిక నివాసానికి ఎస్‌హెచ్‌వో వచ్చారనీ.. ఆ తర్వాత రాత్రి 10గంటల సమయంలో ముగ్గురు బీఎస్ఎఫ్ అధికారులను ఇంటి బయట ఉంచినట్టు లేఖలో తెలిపారు. తన భద్రత కోసమే వచ్చినట్టు జవాన్లు చెబుతున్నారని పేర్కొన్నారు. 3 BSF men w/ assault rifles outside my home. Say they are from Barakhamba Road police station for my “protection”. Still outside my home. Am a free citizen of India - people will protect me. Request Honb’le HM @AmitShah Ji & @HMOIndia to remove immediately pic.twitter.com/7nQLy323Xv — Mahua Moitra (@MahuaMoitra) February 13, 2021 ఈ దేశ సాధారణ పౌరురాలిగా ఉండాలనుకుంటున్నానన్న మహువా.. తనకు భద్రత కావాలని ఎవరినీ అడగలేదన్నారు. తన ఇంటి వద్ద ఉన్న జవాన్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని పోలీసులను కోరారు. ఈ లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తనను కాపాడేందుకే ప్రజా ధనాన్ని వృథా చేయొద్దని సూచించారు. అందరికీ రక్షణ కల్పించాలి తప్ప తనకేమీ ప్రత్యేకంగా అవసరం లేదన్నారు మహువా. తనపై నిఘా పెట్టాలంటే తనను అడగాలని, తానే చెబుతానని తెలిపారు. మహువా బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. 3 BSF men w/ assault rifles outside my home. Say they are from Barakhamba Road police station for my “protection”. Still outside my home. Am a free citizen of India - people will protect me. Request Honb’le HM @AmitShah Ji & @HMOIndia to remove immediately pic.twitter.com/7nQLy323Xv — Mahua Moitra (@MahuaMoitra) February 13, 2021 -
కాయ్ రాజా కాయ్.. భారీగా బెట్టింగ్‌లకు పావులు
అసలే కరోనాకాలం. అందరి పరిస్థితులు ఆర్థికంగా చితికిపోయాయి. ఇదే సమయంలో సులభంగా డబ్బు సంపాదించడానికి కొందరు దారులు వెతుకుతున్నారు. ఇలాంటివారికి ఐపీఎల్ సీజన్ కలిసొచ్చింది. ఇంకేముంది టీవీ ఆన్ చేయడం.. బంతి బంతికీ బెట్టింగ్ కట్టడం, ఫోన్లలోనే లావాదేవీలు జరపడం ఇట్టే జరిగిపోతోంది. బెట్టింగుల సంస్కృతిని కట్టడిచేయడానికి పోలీసులు సైతం రహస్యంగా నిఘా ఉంచడం విశేషం. చిత్తూరు అర్బన్: ఐపీఎల్.. పరిచయం అక్కర్లేనిపేరు. క్రికెట్ గురించి తెలియనివాళ్లు కూడా ఐపీఎల్ ఉన్న మజాను ఆస్వాదిస్తారు. ఎప్పుడో వేసవిలో జరగాల్సిన మ్యాచ్‌లు కరోనా కారణంగా వాయిదాపడుతూ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. స్టేడియంలో ప్రేక్షకులు లేకున్నా, ఛీర్ గర్ల్స్ కనిపించకున్నా.. ప్రతి మ్యాచ్‌లో బెట్టింగులు నిర్వహించడానికి మాత్రం కొన్ని ముఠాలు సిద్ధమైపోయాయి. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు సెల్ఫోన్లలో బేరాలు నడుస్తుంటాయి. ఈ సీజన్లో జిల్లా నుంచి రోజుకు రూ.30 కోట్లు బెట్టింగులు జర గొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. కానీ బెట్టింగ్ వ్యవహారాన్ని పసిగట్టడానికి నిఘా వ్యవస్థను పటిష్టం చేసినట్టు తెలుస్తోంది. వాటి మూలాల్లోకి వెళ్లి చట్టరీత్యా ఆటకట్టిస్తామంటుని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. బంతి బంతికో లెక్క పొట్టి క్రికెట్ మ్యాచ్‌లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందూలోనూ స్వదేశీ, విదేశీ ఆటగాళ్లంతా కలిసి జట్లుగా ఆడేసే ఐపీఎల్‌పై ప్రతీ ఏటా జిల్లాలో పెద్ద మొత్తంలో బెట్టింగులు జరుగుతుంటాయి. ప్రతీ ఓవర్లో వేసే బంతి బంతికీ బెట్టింగులు నడుస్తుంటాయి. అన్నీ కూడా సెల్ఫోన్లలోనే జరుగుతుంటాయి. ఇదివరకులాగా ఫోన్లు చేసి బేరసారాలు చేయకుండా.. వాట్సాప్‌కాల్స్, మెసెంజర్ కాల్స్, వాయిస్ మెసేజ్‌ల రూపంలో బెట్టింగులు పెడుతున్నారు. ఒకప్పుడు మహా నగరాలకే పరిమితమైన జాడ్యం జిల్లాలోని పల్లెలకు పాకిపోయింది. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె లాంటి ఓ మోస్తరు ప్రాంతాల నుంచి కుప్పం, పలమనేరు, బి.కొత్తకోట లాంటి మారుమూల ప్రాంతాలకు విస్తరించింది. పుట్టగొడుగుల్లా బుకీలు ఐపీఎల్ మ్యాచ్‌ల్లో బెట్టింగులుచేసే వాళ్లు ఎవరికివాళ్లు బుకీలు, సబ్ బుకీల అవతారం ఎత్తుతున్నారు. ఎదుటివ్యక్తి బలహీనత, అత్యాశే పెట్టుబడిగా రంగంలోకి దిగుతున్నారు. తమ ప్రధాన కేంద్రం బెంగళూరు, చెన్నైలో ఉందని చెబుతూ.. గెలిచిన డబ్బుకు ఎలాంటి ఢోకాలేదని హామీలు ఇస్తున్నారు. పందెంకాచే డబ్బును ఇపుడంతా డిజిటల్ మనీ యాప్స్ ద్వారా మొబైల్ఫోన్లు, బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. గెలిచినవాళ్లకు సైతం ఇదే పద్ధతిలో నగదు ముట్టజెబుతున్నారు. ఈ గోతిలో ఎక్కువగా చదువుకున్న విద్యావంతులు చిక్కుకుంటుండడం ఆందోళనకు గురిచేస్తోంది. తక్కువ సమయంలో కష్టం లేకుండా ఎక్కువ సంపాధించాలనే అత్యాశాపరులు ఐపీఎల్ పందాలకోసం కాచుక్కూర్చున్నారు. గతంలో పట్టుబడ్డా.. గతంలో జిల్లాలో ఐపీఎల్ బెట్టింగులపై పోలీసులు కన్నెర్రజేయడంతో పాటు పెద్ద సంఖ్యలో కేసులు నమోదుచేసి, నగదు సీజ్ చేశారు. తిరుపతిలో ఓ వ్యక్తిపై పీడీ యాక్టు పెట్టడానికి కూడా వెనుకాడలేదు. చిత్తూరులో నాటి టీడీపీ యువ నాయకుడు క్రికెట్ పందెంలో అడ్డంగా దొరికిపోయినా, ఓ కార్పొరేటర్ ప్రమేయం ఉందని సాక్ష్యాలు లభించినా ప్ర త్యేక పోలీసుల సాయంతో తప్పించుకున్నాడు. కు ప్పం నియోజకవర్గంలో ఓ సర్పంచ్ వద్ద 12 సెల్ఫోన్లతోపాటు పెద్ద మొత్తంలో నగదు పట్టుకున్నారు. నాలుగేళ్లలో జిల్లాలో బెట్టింగ్ కేసులు మొత్తం కేసులు -15 అరెస్టయిన వ్యక్తులు -75 పట్టుబడిన నగదు - రూ.6.06 లక్షలు -
ఐపీఎల్ షురూ: పోలీసుల చేతిలో బుకీల చిట్టా
ప్రొద్దుటూరు క్రైం: ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఐపీఎల్–2020 సీజన్ రానే వచ్చింది. చిన్నా..పెద్దా ఎవరి నోట విన్నా ఐపీఎల్ మ్యాచ్ గురించే. కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితమైన వారికి.. ఐపీఎల్ మస్త్ కాలక్షేపాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. క్రికెట్ అభిమానులకు ఇక 53 రోజుల పాటు పండగే అని చెప్పవచ్చు. దుబాయ్ వేదికగా శనివారం ముంబై ఇండియన్– చెన్నై సూపర్‌కింగ్ జట్ల మ్యాచ్‌లతో క్రికెట్ సమరం గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ నెల 19 నుంచి నవంబర్ 10 వరకు పోటీలు జరగనున్నాయి. అయితే క్రీడా స్ఫూర్తిని పొందాల్సిన యువత.. జూదంగా చూస్తోంది. ఈ పరిణామం బుకీలకు కాసుల పంటగా మారింది. కరోనా దెబ్బకు ఇన్నాళ్లు పందెం రాయుళ్లు తోకముడిచారు. ఇప్పుడు మళ్లీ వారి ఆశలకు రెక్కలొచ్చినట్లు అయింది. జిల్లాలో ప్రొద్దుటూరు, కడప, జమ్మలమడుగు, దువ్వూరు, మైదుకూరు, ఎర్రగుంట్ల, రాజంపేట, రాయచోటితోపాటు అనేక ప్రాంతాల్లో క్రికెట్ పందాలు జోరుగా నిర్వహిస్తారు. గతంలో పట్టణాలకే పరిమితమైన బెట్టింగ్ జాడ్యం పల్లెలకు పాకింది. ఫ్యాన్సీ పందాలే ఎక్కువ గతంలో గెలుపోటములపై మాత్రమే పందెం కాసేవారు. కానీ ప్రస్తుతం టాస్ వేసినప్పటి నుంచి బంతి బంతికి కడుతున్నారు. బుకీలు వారి పరిభాషలో దీన్ని ఫ్యాన్సీ బెట్టింగ్ అని పిలుచుకుంటారు. ఫ్యాన్సీ బెట్టింగ్ నిర్వహించే వారు క్రికెట్ మ్యాచ్‌లో ప్రతి బాల్‌ను చూడాల్సి వస్తుంది. ప్రతి ఓవర్లో కొట్టే సిక్స్‌లు, ఫోర్లపై బెట్టింగ్ హోరు కొనసాగుతుంది. బ్యాట్స్‌మన్ కొట్టే పరుగులపై కూడా పందెం కాస్తారు. ప్రారంభ ఓవర్ నుంచి చివరి వరకు మ్యాచ్ అనేక మలుపులు తిరుగుతుంది. పందెం కాసిన జట్టు పరుగులు కొడుతున్న సేపు ఫంటర్ల (పందెం కాసేవాళ్లు)లో ఆశలు చిగురిస్తుంటాయి. అయితే టప టపా వికెట్లు పడితే మాత్రం వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. ఇలాంటి ఒత్తిళ్ల నడుమ కొందరు ఫంటర్లు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు జిల్లాలో గతంలో చోటు చేసుకున్నాయి. బెట్టింగ్‌లో యువత, విద్యార్థులు క్రికెట్ బెట్టింగ్‌లో ఎక్కువగా యువత, విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులు సైతం ఆకర్షితులవుతున్నారు. తల్లిదండ్రులు ఇచ్చే ప్యాకెట్ మనీతో రహస్యంగా బెట్టింగ్ ఆడుతున్నారు. క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు ఇంట్లో టీవీ ముందు కూర్చొని సెల్‌ఫోన్ ద్వారా డబ్బు పెడుతున్నారు. తమ పిల్లలు క్రికెట్ పందాలు ఆడే విషయం తల్లిదండ్రులకు తెలిసే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో.. తమ పిల్లలు బాకీ పడ్డ డబ్బును వారు తీర్చేస్తున్నారు. యువకులు, విద్యార్థులను కొందరు బుకీలు కలెక్షన్ బాయ్‌లుగా ఉపయోగించుకుంటున్నారు. వారికి బైక్‌తో పాటు రోజు వారి ఖర్చుకు డబ్బు, ఆకర్షణీయమైన జీతం ఇస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు కొరియర్లుగా, సబ్బుకీలుగా పని చేస్తున్నారు. గుట్టుగా సాగుతున్న దందా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో క్రికెట్ దందా గుట్టుగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా మ్యాచ్‌ల సమయాల్లో రోజూ రూ.కోట్లు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ సీజన్లో అయితే మరింత ఎక్కువగా నడుస్తుంది. కష్టం లేకుండా అడ్డదారిలో, సులభంగా డబ్బు సంపాదించవచ్చని అనేక మంది బెట్టింగ్ ఫీవర్‌కు బలైపోతున్నారు. బెట్టింగ్‌కు పాల్పడిన వారి నుంచి బుకీలు వెంటపడి డబ్బు వసూలు చేస్తున్నారు. డబ్బులు లేక కొందరైతే బైక్‌లు, బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు. జిల్లాకు చెందిన అనేక మంది బుకీలు ఇతర ప్రాంతాల్లో ఉంటూ దందా కొనసాగిస్తున్నారు. వీరు ఇతర రాష్ట్రాలకు చెందిన షేఠ్లతో సంబంధాలు పెట్టుకొని రూ.కోట్లు గడిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులకు చిక్కకుండా సాగిస్తున్నారు. మొబైల్ ఫోన్ల ద్వారానే ఎక్కువ మంది బెట్టింగ్ జూదం నిర్వహిస్తుండటంతో.. వారిని గుర్తించడం కష్టంగా మారిందని పోలీసు అధికారులు చెబుతున్నారు. కదలికలపై నిఘా.. జిల్లా వ్యాప్తంగా ఉన్న బుకీల చిట్టా పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. వారి కదలికలపై నిఘా పెట్టాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఐపీఎల్ నేపథ్యంలో పోలీసులు గతంలో కేసులు నమోదైన వారిని పిలిపించి బైండోవర్ చేస్తున్నారు. బెట్టింగ్ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కౌన్సెలింగ్ ఇస్తున్నారు. బెట్టింగ్ ఊబిలో పడి అనేక కుటుంబాలు చితికి పోతున్నాయి. పోలీసులు గట్టి చర్యలు తీసుకొని అలాంటి వారిని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా..
సాక్షి, విజయవాడ: రౌడీషీటర్ల కదలికలపై నగర పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కమిషనరేట్ పరిధిలో 476 మంది రౌడీషీటర్లు, 500 మంది సస్పెట్స్ షీటర్లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్లలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. తుపాకులు, మారణాయుధాలతో రౌడీషీటర్ కొక్కొలగడ్డ జాన్ బాబు పట్టుబడటంతో పెనమలూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. స్టేషన్ పరిధిలో నేర ప్రవృత్తి కల్గిన 140 మందిని సమావేశపరిచి సీఐ సత్యనారాయణ హెచ్చరించారు. దందాలు, సెటిల్మెంట్లు చేస్తే పిడీ యాక్టులు పెట్టి నగర బహిష్కరణ చేస్తామన్నారు. గంజాయి అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతిఒక్కరి పై సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా ఏర్పాటు చేశామని, చిన్న తప్పు చేసినా పట్టేస్తామన్నారు. సత్ప్రవర్తనతో మెలిగితే రౌడీషీట్స్ తొలగించే అవకాశం కూడా ఉందన్నారు. ప్రజా జీవనానికి విఘాతం కల్గిస్తే జైలు జీవితం తప్పదని సీఐ సత్యనారాయణ హెచ్చరించారు. -
నేటి నుంచి 9 జిల్లాల్లో సీరో సర్వే
సాక్షి,అమరావతి: కోవిడ్–19 వైరస్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రంలో నిర్వహిస్తోన్న సీరో సర్వైలెన్స్ సర్వే నేటి నుంచి మిగతా 9 జిల్లాల్లో మొదలుకానుంది. ఇప్పటికే తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఈ సర్వైలెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే కాగా, మిగిలిన ఒక్కో జిల్లాలో 5 వేల నమూనాలు సేకరించి సర్వే నిర్వహించనున్నారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు ప్రణాళిక రచించారు. సర్వే ఇలా చేయనున్నారు.. ► ప్రతి జిల్లాలో సేకరించిన 5 వేల నమూనాల్లో వెయ్యింటిని కేవలం హైరిస్కు ప్రాంతాల్లో చేస్తారు. ► మిగతా 4వేల నమూనాలు 60 శాతం కంటెయిన్మెంట్ జోన్‌లోనూ, 40 శాతం నాన్ కంటెయిన్మెంట్ జోన్లలోనూ నిర్వహిస్తారు. ► ఈ జోన్లలో 30 శాతం అర్బన్ ప్రాంతాల్లోనూ, 60 శాతం రూరల్‌లో నిర్వహిస్తారు ► అర్బన్‌లో 3 వార్డులు, రూరల్‌లో 16 గ్రామాల్లో ఈ నమూనాలు సేకరిస్తారు. నాన్ కంటెయిన్మెంట్ జోన్లో 30 శాతం అర్బన్, 70 శాతం రూరల్‌లో నిర్వహిస్తారు. ► ఇందులో అర్బన్‌లో 2 వార్డులు, రూరల్‌లో 8 గ్రామాలు ఉంటాయి. -
కోడి పందాలపై డేగకన్ను
సాక్షి, విశాఖపట్నం: సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహించే వారిపై పోలీసులు డేగ కన్ను వేశారు. అటు జిల్లాలోను, ఇటు నగరంలోనూ ఈ సంక్రాంతికి కోడి పందాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని పాయకరావుపేట, నర్సీపట్నం, యలమంచిలి, చోడవరంలో ఎక్కువగా కోడిపందాలు నిర్వహిస్తుంటారు. అదేవిధంగా నగరంలో విశాఖ తూర్పు, భీమిలి, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాల్లో కూడా గతంలో నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో గత ఏడాది కోడిపందాలు నిర్వహించిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని.., వారు మళ్లీ పందాల నిర్వహణకు ముందుకొస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గత వారం రోజుల నుంచి నగరంలో కొన్ని చోట్ల విచ్చలవిడిగా కోడి కత్తులు తయారుచేస్తూ విక్రయిస్తున్నారు. టాస్‌్కఫోర్స్ పోలీసులు ఇప్పటికే 245 కోడి కత్తులను కూడా స్వా«దీనం చేసుకున్నారు. ఇప్పటికే కోర్టులు కూడా పందాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ పందాలు నిర్వహించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనే ఆదేశాలున్నాయి. ఇవీ హాట్స్పాట్లు నగర పరిధిలో కోడి పందాలు జరిగే ప్రాంతాలను పోలీసులు హాట్స్పాట్లుగా గుర్తించారు. వీటీలో ఆరిలోవ, దువ్వాడ, భీమిలి మండలం తాటితూరు, ఆనందపురం మండలం గుళ్లేపల్లి, పద్మనాభం మండలం రేవిడి, పాండ్రంగి తదితర ప్రాంతాలున్నాయి. అలాగే జిల్లాలోని పాయకరావుపేట మండలం పీఎల్ పురం, మంగవరం, పెదరామభద్రపురం, వెంకటనగరం, కుమారపురం, పాల్మాన్పేట, నక్కపల్లి మండలం వేంపాడు, నెల్లిపూడి, గొడిచెర్ల, దేవవరం, రమణయ్య పేట, రేబాక, డీఎల్ పురం, తీనార్ల, ఎస్.రాయవరం మండలం పెదగుమ్ములూరు, లింగరాజుపాలెం, పెదుప్పలం, కోటఉరట్ల మండలం పాములవాక, రామచంద్రాపురం, ములగల లోవ, యలమంచిలి మండలం పెదపల్లి, గూండ్రుబిల్లి, పులపర్తి, ఏటికొప్పాక, రాంబిల్లి మండలం లాలంకోడూరు, దిమిలి, కట్టుబోలు, మురకాడ, మామిడికొత్తూరు, నాతవరం గునుపూడి, వైబీ పట్నం, నర్సీపట్నం మండలం లింగాపురం, అప్పన్న దొరపాలెం, గొలుగొండ మండలం పాకలపాడు, ఏఎల్ పురం, అమ్మపేట, జోగంపేట, చీడిగుమ్ముల తదితర ప్రాంతాల్లో ఏటా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్పెషల్ టీంల ఏర్పాటు ఇటు నగరంలోనూ, అటు జిల్లాలోనూ కోడి పందాలు నిర్వహించుకుండా మండలంలో ఉన్న పోలీస్‌స్టేషన్ ఎస్ఐల ఆధ్వర్యంలో స్ఫెషల్ టీంలు పనిచేస్తున్నాయి. ఆదివారం నుంచి 18వ తేదీ వరకు ఈ టీంలు నిఘా కొనసాగిస్తాయి. కోడిపందాల నిర్వాహకుల సమచారం తెలుసుకుని అక్కడకు వెళ్లి కేసులు నమోదు చేస్తారు. టాస్‌్కఫోర్స్, క్రైం, లా అండ్ ఆర్డర్ పోలీసులందరూ ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. -
సోషల్ మీడియాపై నిఘా
సాక్షి, పాల్వంచ: చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని ఎది పడితే అది, ఎలా పడితే అలా పోస్టింగ్‌లు పెడితే అంతే సంగతులు. పోలీసులు నిఘాపెట్టి 24 గంటల్లో కేసు నమోదు చేస్తారు. ఇలా కేసుల్లో ఇరుక్కున్నవారిని రూ.లక్ష జరిమానా లేదా 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశాలున్నాయి. కాబట్టి.. తస్మాత్ జాగ్రత్త.. సోషల్ మీడియా పోస్టులపై సైబర్ క్రైం పోలీసులు కన్నేశారు. ఇష్టమొచ్చినట్లుగా పోస్టులు పెడితే ఇట్టే బుక్కవుతారు. హైదరాబాద్‌లో ఇటీవటి కాలంలో జరిగిన దిశ ఎన్‌కౌంటర్‌పై సీపీఎం మాజీ ఎంపీ బృందాకరత్ స్పందిస్తూ.. ‘ఉరిశిక్ష విధించడం మా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం’ అంటూ పోస్ట్ చేశారు. అ అంశంపై సోషల్ మిడియాలో వచ్చిన పోస్టింగ్‌లను చూసిన పాల్వంచకు చెందిన ఓ వ్యక్తి బృందాకరత్‌పై అసభ్యకరంగా పోస్టును షేర్ చేశాడని స్థానిక సీపీఎం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు వ్యక్తిపై చర్యలు తీసుకునేందుకు పోలీసలు సిద్ధమైనట్లు సమాచారం. తప్పుడు ప్రచారం చేయొద్దు ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు ప్రతిఒక్కరి దగ్గరా ఉన్నాయి. ఆ ఫోన్లు వాడుతున్న వారికి కూడా నెట్ అందుబాటులో ఉంటోంది. దీంతో వారు ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. అయితే, అందులో కొన్ని పోస్టింగ్‌లు, వార్తలు తప్పుగా ఉంటున్నాయి. మరికొన్ని దుష్ప్రచారం కోసం పెడుతున్న పోస్టింగులు ఉంటున్నాయి. పలు పోస్టులు ఆత్మహత్యలు, హత్యలను ప్రేరేపించేలా ఉంటున్నాయి. ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవగాన లేని అనేక మంది ఒకరు పంపిన పోస్టింగ్‌లు, మెసేజ్‌లను ఇతరులకు పోస్టు చేయడం ద్వారా క్షణంలో వ్యాపిస్తోంది. ఇలా అనేకమంది పోస్టులు పెట్టి కేసుల్లో ఇరుక్కుంటున్నారు. అనంతరం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పోలీసుల ప్రత్యేక దృష్టి సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెడితే ఇక నుంచి కుదరదు. చర్యలు తీసుకోవడంతోపాటు ప్రత్యేకంగా సైబర్‌క్రైం విభాగాన్ని ఏర్పాటు చేసి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పోలీసులు నిరంతరం సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై కన్నేసి ఉంచుతారు. దుష్ప్రచారం, సమాజాన్ని తప్పుదోవ పట్టించే అంశం, వ్యక్తిగత ధూషణలు, అసత్య ప్రచారాలను పోస్టు చేసిన వారిని 24 గంటల్లో గుర్తించి, ఐపీసీ 153 సెక్షన్ కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. ఈ సెక్షన్ ప్రకారం కేసు నమోదైతే మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. లేదా రూ.లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది. కేసు నిర్ధారణ జరిగితే ప్రభుత్వ ఉద్యోగి అయితే ఉద్యోగానికి అనర్హలుగా గుర్తిస్తారని పోలీసు అధికారులు తెలిపారు. తల్లిదండ్రులూ పిల్లలపై దృష్టి సారించాలి.. తల్లిదండ్రులు స్మార్ట్ఫోన్లు వినియోగించే పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలి. తమ పిల్లలు ఎన్ని గంటలు స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నారు? ఏఏ అంశాలు చూస్తున్నారు? సోషల్ మీడియాలను ఫాలో అవుతున్నారా? అందులోని అంశాలకు స్పందిస్తున్నారా? అనే అంశాలను గమనించాలి. అవగాహన లేకుండా ఇష్ట మొచ్చినట్లుగా పోస్టులు పెడితే పిల్లలతోపాటు తల్లిదండ్రులూ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వాట్సప్‌లో ఏఏ మెసేజ్‌లను పంపుతున్నారని నిత్యం పరిశీలించాలి. అప్పుడే పిల్లల్లో భయం ఏర్పడి అసత్య పోస్టింగ్‌లు, అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టకుండా కొంతమేరకు నివారించవచ్చు. అసత్య ప్రచారం చేస్తే చర్యలు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టింగ్‌లు పెట్టవద్దని భయం చెప్పాలి. ఇష్టం వచ్చిన పోస్టింగ్ పెడితే కేసులవుతాయని భయం చెప్పి అవగాహన కల్పించాలి. సమాజానికి వ్యతిరేకంగా అశాంతి కల్గించే విధంగా, వ్యక్తిగత విమర్శలు, అసత్య ఆరోపణలు చేస్తూ వాట్సప్ పోస్టింగ్‌లు చేయొద్దు. అసత్య ప్రచారాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం –కేఆర్కే ప్రసాద్, డీఎస్పీ, పాల్వంచ -
ప్రపంచంలో భారత్ మూడో నిఘా దేశం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన భారత్, పౌరులపై నిఘా కొనసాగిస్తున్న ప్రపంచ దేశాల్లో మూడవ దేశంగా కూడా గుర్తింపు పొందింది. రష్యా, చైనాల తర్వాత ఆ స్థానం భారత్‌దేనని బ్రిటన్‌లోని ‘క్రాంపిటెక్’ అధ్యయన సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ఐదు పాయింట్లలో భారత్‌కు 2.5 పాయింట్లు లభించాయి. వ్యక్తిగత స్వేచ్ఛ తక్కువున్న దేశాల్లో చైనా, రష్యాల తర్వాత భారత దేశమే. ఆ తర్వాత థాయ్‌లాండ్, మలేసియా దేశాలుండగా, 2.7 పాయింట్లతో అమెరికా ఏడవ స్థానంలో కొనసాగుతోంది. అమెరికాలో పౌరులు ప్రైవసీకి ముప్పు ఎక్కువగా ఉండడానికి కారణం అక్కడ పౌరుల బయోమెట్రిక్ సమాచారం డాటా బేస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవడంతోపాటు వివిధ సంస్థల ద్వారా ఆ డేటా లీక్ కూడా ఎక్కువగానే జరుగుతోంది. ప్రపంచంలోని మొత్తం 47 దేశాలను ఎంపిక చేసుకొని, ఆ దేశాల్లోని బయోమెట్రిక్ డేటా ఆప్‌డేటింగ్, పౌరుల డేటాకు అక్కడి ప్రభుత్వాలు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయి ? డేటా పరిరక్షణకు రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఉన్న రక్షణలు ఏమిటీ? అన్న అంశాల ప్రాతిపదికన ర్యాంకింగ్‌లు కేటాయించినట్లు క్రాంపిటెక్ తెలియజేసింది. ప్రజల డెటా పరిరక్షణకు యూరప్ దేశాల్లో ప్రత్యేక చట్టాలు ఉన్నప్పటికీ ప్రజల ప్రైవసీకి ప్రాధాన్యత తక్కువగానే ఉంటోంది. భారత్‌లో ప్రజల డేటా పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు లేకపోయినా ప్రైవసీ అనేది రాజ్యాంగంలోని ప్రాథిమిక హక్కుగా కొనసాగుతోంది. అయినప్పటికీ భారత్‌లో ప్రైవసీకి రక్షణ లేకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. ఆధార్ గుర్తింపు కార్డు కింద దాదాపు 123 కోట్ల మంది డేటా ఒకే చోటా నిక్షిప్తమై ఉంది. ఈ డేటా పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉంది. ఆ డేటా రక్షణకు ప్రత్యేక చట్టాలేమీ లేవు. వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలకు కూడా ప్రైవసీ లేదు. ఎవరు, ఏ సందేశం పంపారో సులభంగానే తెలుసుకోవచ్చు. సీసీటీవీ కెమేరాల ద్వారా సమాచార మార్పిడికి పటిష్టమైన చట్టాలు లేవు. వీటిలోని సమాచారం కూడా సులభంగానే లీక్ అవుతుంది. ప్రజల డేటా పంపిణీ, పర్యవేక్షణకు భారత్‌కు దాదాపు పది దేశాలతో ఒప్పందం ఉంది. ఇన్ని కారణాల వల్ల భారత్‌లో ప్రైవసీ తక్కువే! -
భారత్‌కు దగ్గర్లో చైనా యుద్ధనౌకలు
న్యూఢిల్లీ: నావికా బలాన్ని అమాంతం పెంచుకుంటున్న చైనా, హిందూ మహాసముద్రం మీదుగా ఏడు యుద్ధ నౌకలను తరలించింది. అయితే భారత నిఘా విమానాలు ఈ యుద్ధనౌకల ఫొటోలను చిత్రీకరించి ఉన్నతాధికారులకు పంపాయి. దాదాపు 15 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సైనిక వాహనాలు, హెలికాప్టర్లను తరలించే సామర్థ్యమున్న గ్జియాన్–32తో పాటు ఆరు యుద్ధనౌకలు సెప్టెంబర్ నెల ఆరంభంలో ‘గల్ఫ్ ఆఫ్ అడెన్’కు బయలుదేరాయి. అక్కడికి చేరుకునేందుకు వీలుగా ఏకైక మార్గమైన హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించాయి. ‘భారత తీరానికి దగ్గరగా వచ్చే నౌకలను మేం గమనిస్తూనే ఉన్నాం. గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో పైరెట్లను ఎదుర్కొనేందుకు వీలుగా చైనా ఈ నౌకలతో విన్యాసాలు నిర్వహించనుంది’ అని భారత నేవీ అధికారి ఒకరు తెలిపారు. -
మావోల కదలికలపై నిఘా
సాక్షి, కొత్తూరు(శ్రీకాకుళం) : మావోల కదలికలపై నిఘా పెట్టినట్లు ఎస్పీ అమ్మిరెడ్డి తెలియజేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం రాత్రి ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానంగా గతంలో మావోలతో సంబంధాలు ఉన్న గిరిజన గ్రామాల్లో కొత్త వ్యక్తుల చేరికపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. పట్టణాలు, మండల కేంద్రాల్లోని రద్దీగా ఉన్న ప్రాంతాల్లో విజబుల్ పోలీస్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నా రు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు ఉన్నట్లయితే ప్రజల కదలికలు గుర్తించవచ్చు అన్నారు. అలాగే హైవేలపై వాహనాలు నడిపే వారికి రోడ్డు నిబంధనలు గురించి ఎస్ఐ స్థాయిలో కౌన్సిలిం గ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతీ వాహనానికి వెనుక భాగంగా రేడియం స్టిక్కర్ అతికించి ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నదుల నుంచి అక్రమ ఇసుక రవాణ చేస్తే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఇసుక అక్రమ నిల్వలు ఉన్నట్లయితే ఇసుక నిల్వ ఉంచిన జిరాయితీ భూమి యజమానిపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమవ్వడంతో కాలేజీల్లో ర్యాంగిగ్ జరగకుండా విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అనంతరం పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించారు. ఎస్పీతో పాటు సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ ప్రవల్లికలు ఉన్నారు. -
భారత్‌పై నిఘా పెట్టలేదు
వాషింగ్టన్: భారత్ ఇటీవల చేపట్టిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ఏ–శాట్ పరీక్షపై నిఘా పెట్టినట్లు వస్తున్న వార్తలను అమెరికా రక్షణశాఖ ఖండించింది. భారత్ ఏ–శాట్ ప్రయోగాన్ని చేపడుతుందన్న విషయం తమకు ముందుగానే తెలుసని అమెరికా రక్షణశాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ డేవిడ్.డబ్ల్యూ.ఈస్ట్‌బర్న్ చెప్పారు. ‘ప్రయోగం గురించి మాకు ముందే తెలుసు. ఎందుకంటే ప్రయోగం కోసం నిర్ణీత ప్రాంతంలో విమానాల రాకపోకలను భారత్ నిషేధించింది. ఈ విషయాన్ని ముందురోజే చెప్పింది’ అని అన్నారు. 300 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న ఓ ఉపగ్రహాన్ని గత గురువారం∙ఏశాట్ క్షిపణి కూల్చివేసింది. దీంతో అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఈ సామర్థ్యం ఉన్న నాలుగో దేశంగా భారత్ అవతరించింది. అయితే ఈ ప్రయోగం జరిగిన కొన్ని నిమిషాలకే అమెరికాకు చెందిన ‘ఆర్సీ–135ఎస్ కోబ్రా బాల్’ నిఘా విమానం బంగాళాఖాతంపై ప్రయాణిస్తూ వివరాలను సేకరించింది. మోదీపై బీఎస్ఎఫ్ జవాన్ పోటీ ఛండీగఢ్: జవాన్లకు నాసిరకం ఆహారం పెడుతున్నారంటూ రెండేళ్ల క్రితం వీడియో పోస్ట్ చేసి ఉద్యోగం కోల్పోయిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్‌బహదూర్ యాదవ్ వారణాసిలో ప్రధాని మోదీపై పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని, ఒకవేళ గెలుపొందితే సాయుధ బలగాల్లో అవినీతి నిర్మూలనకు కృషిచేస్తానని ఆయన శుక్రవారం చెప్పారు. అవినీతి గురించి గళం విప్పినందుకే తనకు ఉద్వాసన పలికారని అన్నారు. నియంత్రణ రేఖ వెంట విధులు నిర్వర్తిస్తున్న జవాన్లకు నాసిరకం భోజనం పెడుతున్నారంటూ 2017లో యాదవ్ ఆన్లైన్లో పోస్ట్ పెట్టగా, క్రమశిక్షణా చర్యల కింద ఆర్మీ ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. -
నీడలా నిఘా.. అభ్యర్థులూ పారాహుషార్
సాక్షి, మెదక్: ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. అసెంబ్లీ, పంచా యతీ ఎన్నికలను ఎలాగైతే విజయవంతంగా పూర్తి చేశారో... అదే తరహాలో లోక్‌సభ పోరును నిర్వహించేందుకు అధికారు లు సన్నద్ధమయ్యారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ‘షాడో’ బృందాల తో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టేందుకు షాడో పోలీసు లు కృషి చేస్తారు. షాడో పార్టీలుగా నిలిచే పోలీసులు నిత్యం అభ్యర్థుల వెన్నం టే ఉంటారు. ప్రచారానికి సంబంధించి ఖర్చును తక్కువగా చూపినా.. షాడో బృందాలు ఇచ్చే సమాచారం ఆధారంగా ఎన్నికల అధికారులు లెక్కలు కట్టనున్నారు. ఈసీ నిబంధనల ప్రకారం ఎంపీ అభ్యర్థి రూ.78 లక్షలకు మించి ఖర్చు చేయొద్దు. దీనికి విరుద్ధంగా అదనపు ఖర్చులు చేసినట్లు రుజువైతే.. గెలుపొందినా వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా.. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నిబంధనలకు మించి ఖర్చు పెట్టినట్లు తేలితే వారు ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అనుచరుల కదలికలపై కూడా.. షాడో బృందాలు ప్రధానంగా ప్రచార ఖర్చులపై నిఘా పెడతాయి. వివిధ పార్టీల ర్యాలీలు, సభల నిర్వహణను షాడో బృందాలు చిత్రీకరిస్తాయి. వాహనాల సంఖ్య, బ్యానర్లు, ఫ్లెక్సీలతోపాటు ప్రచార సామగ్రి వంటి వివరాలు, ఫొటోలను వెంటవెంటనే ఉన్నతాధికారులకు అందజేస్తాయి. అభ్యర్థులకు తెలియకుండానే.. ఈ బృందాలు పని కానిచ్చేస్తాయి. అంతేకాకుండా.. సమస్యాత్మకమైన అభ్యర్థులు, వారి అనుచరుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వీడియో రికార్డ్ చేస్తాయి. ఆయా వ్యక్తులు ఎప్పుడు.. ఎక్కడకు వెళ్తున్నది.. ఎవరితో మాట్లాడుతున్నది వంటి వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేస్తాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ.. మెదక్ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ప్రత్యేక షాడో బృందాలను కేటాయించారు. ఈ పార్లమెంట్ స్థానంలో మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, సంగారెడ్డి, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు ఎస్ఎస్టీ (షాడో స్పెషల్ టీం) బృందాలు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ల చొప్పున నియమించనున్నారు. ఒక్కో ఎస్ఎస్టీ బృందంలో సహాయ వ్యయ పరిశీలకుడు, ఆదాయపు పన్ను శాఖ అధికారి, పోలీస్ అధికారితోపాటు రెవెన్యూ అధికారి ఉండనున్నారు. ఓటర్లను ప్రభావితం చేయకుండా.. బెదిరింపులకు పాల్పడకుండా ఇలాంటి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆన్లైన్ లావాదేవీలపైనా నజర్.. బ్యాంక్ లావాదేవీలపైనా ఎన్నికల అధికారులు నజర్ వేశారు. ప్రధానంగా ఆన్లైన్ ద్వారా జరిగే లావాదీలపై కన్నేశారు. ఈ మేరకు మెదక్ లోక్‌సభ పరిధిలోని సంబంధిత అధికారులు, లీడ్ బ్యాంక్ మేనేజర్‌తో సమావేశం నిర్వహించి తగిన సూచనలు చేశారు. ఏకకాలంలో ఎక్కువ మందికి ఒకే ఖాతా నుంచి లావాదేవీలు జరిగినా.. ఒకే రోజు ఎక్కువ మొత్తంలో నగదు విత్‌డ్రా చేసుకున్నా.. జిల్లా ఎన్నికల అధికారి, ఆదాయపు పన్ను, పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. అనుమానాస్పద లావాదేవీలపై ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేయాలని.. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ ప్రతి రోజూ లావాదేవీల వివరాలు అందజేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఏటీఎంలలో నగదు పెట్టేందుకు తీసుకెళ్లే వాహనాలపై కూడా నిఘా పెట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అభ్యర్థులకు నోట్‌బుక్.. ప్రచార ఖర్చుల వివరాలను రాసేందుకు అభ్యర్థులకు ఈసీ రూపొందించిన ప్రత్యేక నోట్‌బుక్‌ను అందజేయనున్నారు. ఇందులో రోజువారీ ఖర్చు.. బ్యాంక్ లావాదేవీలతోపాటు పలు వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. -
ఆధారం లేకుంటే అంతే మరి!
సాక్షి, శ్రీకాకుళం : సార్వత్రిక ఎన్నికలకు నగరా మోగిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో డబ్బే కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులతోపాటు పోలీసులు గట్టి నిఘా పెట్టారు. భారీగా నగదు చేతులు మారే అవకాశం ఉన్నందున నగదు తరలింపును అడ్డుకోవడంపై అధికార యంత్రాంగం పూ ర్తిగా దృష్టి సారించింది. నియోజకవర్గాల వారీగా తనిఖీలు ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చే సింది. పోలీసులతోపాటు రెవెన్యూ అధికారులు విస్తృతంగా తనీఖీలు చేపడుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. జిల్లాల్లో ఇప్పటికే కొంత నగదుతోపాటు బంగారం, గంజాయి, మద్యం తరలింపులను పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు కూడా ఇబ్బందులు ఎదువరయ్యే అవకాశాలే లేకపోలేదు. ఆధారాలు తప్పనిసరి... ఎన్నికల సంఘం సామాన్యులకు కొంత వెసులుబాటు ఇచ్చింది. వివిధ అవసరాల కోసం ఒక వ్యక్తి రూ.50వేల వరకు తన వెంట తీసుకెళ్లవచ్చు. దీనికి ఎలాంటి ఆధారాలు అక్కర్లేదు. అయితే రూ.50వేల కంటే ఎక్కువ నగదు తరలించే సమయంలో మాత్రం కచ్చితంగా సంబంధిత ఆధారాలను తనిఖీలు జరిపే అధికారులకు చూపించాల్సి ఉంటుంది. లేకుంటే అవస్థలు తప్పవు. తనిఖీల సందర్భంలో సదరు వ్యక్తులు వాగ్వాదానికి దిగినా, అనుచితంగా ప్రవర్తించినా అవన్నీ సీసీ కెమెరాలు, అప్పటికీ పోలీసులు బాడీకి అమర్చకున్న బాడీ కెమెరాల్లో రికార్డు అవుతాయి. అయితే సరైన ఆధారాలు చూపిస్తే డబ్బుకు ఎలాంటి ఢోకా ఉండదు. ఆధారాలు లేకపోతేనే ఇబ్బంది. సీజ్ చేస్తే మాత్రం తిప్పలు తప్పవు.. నగదు పట్టుబడిన సమయంలో తగిన ఆధారాలు చూపకపోతే ఆ వ్యక్తులకు తిప్పలు తప్పవు. సదరు వ్యక్తులు ఏ అవసరం కోసం ఎక్కడి నుంచి ఎక్కడికి నగదు తరలిస్తున్నారో విషయాలు ఆధారాలతో సహా వివరించాలి. తగు ఆధారాలను చూపించాలి. ఆధారాలు సంతృప్తికరంగా ఉంటే చెక్‌పోస్టుల వద్దే వదిలేస్తారు. లేదంటే డబ్బుతోసహా సంబంధిత వ్యక్తిని తహసీల్దార్ వద్ద హాజరుపరుస్తారు. పోలీసులు సీజ్ చేసిన నగదును తొలుత ట్రెజ రీలో డిపాజిట్ చేసి, ఐటీ అధికారులకు సంబంధిత ఫైల్‌ను అప్పగిస్తారు. వారు మ రోసారి ఆధారాలు ఆడుగుతారు. వారికి గాని సక్రమమైన ఆధారాలు చూపకపోతే వారు తిరిగి ఆ ఫైల్‌ను పోలీసులకు పంపుతారు. ఐటీ అధికారుల క్లియరెన్స్ సరి. లేదంటే మాత్రం పోలీసులు కేసు ఫైల్ చేసి, చార్జిషీట్ నమోదుచేస్తారు. కాగా పన్ను కింద ముప్పై శాతం చెల్లించుకుని మిగిలిన మొత్తాన్ని కొన్ని కేసుల్లో తిరిగి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నేతల వాహనాల కదలికలపై నిఘా.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల, రాజకీయ పార్టీల నాయకుల కదలికలపై పోలీసు శాఖ డేగ కన్ను వేయనుంది. ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థుల తరఫున క్రియాశీలకంగా వ్యవహరించే నాయకులు, వారి వాహనాలపై గట్టి నిఘా వేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలు ముగిసేవరకు పోలీసులకు సెలవులు ఇవ్వరాదని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, మఫ్టీ అవతారంలో జిల్లాలోని పలు చోట్ల గట్టి నిఘా పెట్టినట్లు భోగట్టా. -
కావలి డీఎస్పీ నేతృత్వంలో నిఘా పటిష్టం
సాక్షి, కావలి: నియోజకవర్గంలో ఎన్నికలు నిబంధనలు మేరకు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు కావలి డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ నేతృత్వంలో అధికారులు నిఘాను పటిష్టం చేశారు. కావలి వన్ టౌన్, టూ టౌన్, కావలి రూరల్, బిట్రగుంట, దగదర్తి, అల్లూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న సీఐలు, ఎస్ఐలను సమన్వయం చేసుకుని ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోం గార్డులతో పాటు అదనంగా ఇతర బలగాలను నియోజకవర్గంలో మోహరించారు. కావలిలోని డీఎస్పీ కార్యాలయంలో ఎన్నికల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. కాగా నియోజకవర్గం ప్రధానంగా జిల్లా సరిహద్దు కావడం, చెన్నై –కలకత్తా జాతీయ రహదారి ఉండటంతో సున్నితమైన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. జిల్లా సరిహద్దు ప్రాంతమైన రుద్రకోట వద్ద అంతర్ జిల్లా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా నుంచి కావలిలోకి ప్రవేశించే వాహనాలను తనిఖీ చేయడానికి కావలి పోలీసుల ఆధర్వంలో చెక్ పోస్టు నిత్యం పని చేస్తోంది. ప్రతి ఇవాహనాన్ని తనిఖీ చేయనిదే జిల్లాలోకి ప్రవేశించనీయడం లేదు. అలాగే కావలి నుంచి వెళ్లే వాహనాలను ప్రకాశం జిల్లా గుడ్లూరు పోలీసులు తనిఖీలు చేసేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దీంతో జాతీయ రహదారిని పోలీసులు డేగ కళ్లతో సునిశిత పరిశీలన చేస్తున్నారు. అలాగే నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారిపై కావలి రూరల్ మండలం గౌరవరం వద్ద ఉన్న టోల్గేట్ వద్ద చెక్ పోస్ట్, దగదర్తి మండలం సున్నపుబట్టి వద్ద చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశారు. ఈ మూడు చెక్ పోస్టులు కూడా జాతీయ రహదారిపై ఉంది. అలాగే ఉదయగిరి నియోజకవర్గం నుంచి కావలి లోకి ప్రవేశించే వాహనాలను తనిఖీ చేయడానికి కావలి–ఉదయగిరి రోడ్డు లో కావలి పట్టణ పడమటి పొలిమేరల్లో ఉన్న బుడంగుంట వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్ట్‌ల వద్ద సీసీ కెమెరాలు, బాడీ కెమెరాలను కూడా అమర్చారు. అలాగే రెవెన్యూ అధికారి, పోలీసులతో కలిసి ఒక్కో స్టేషన్ పరిధిలో ఫైయింగ్ పోలింగ్ ను ఏర్పాటు చేశారు. వీరికి కూడా బాడీ కెమెరాలను అమర్చారు. నియోజకవర్గంలోని ఆరు పోలీస్ స్టేష న్లు పరిధిలో నిత్యం వీరు విస్తృతంగా పర్యటించి, సాయంత్రానికి డీఎస్పీకి నివేదిక అందజేస్తారు. ఆరు మంది ఎస్ఐలు, ముగ్గురు సీఐలు, పది మంది ఏఎస్ఐలు అధికారులు, ఇతర పోలీసు సిబ్బందిని కావలి డీఎస్పీ డి.ప్రసాద్ సమన్వయం చేసుకొంటూ ఎన్నికల బృందంగా ఎన్నికల ప్రశాంతంగా జరిగేందుకు, నిబంధనలు ఉల్లంఘన జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నారు. ప్రజల సహకారంతోనే ఎన్నికలు ప్రశాంతం ప్రజల సహకారంతో కావలి నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా జరిగేలా చేస్తాం. ప్రజలు ఎప్పటికప్పుడు అనుమానం ఉన్న అంశాలను, నిబంధనలు ఉల్లంఘించిన సమాచారాన్ని తెలియజేయాలి. సమాచారాన్ని తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. చెక్ పోస్టుల వద్ద తనిఖీల సందర్భంలో, గ్రామాల్లో విధులు నిర్వహించే పోలీసులకు బాధ్యతగా సహకరించాలి. అసాంఘిక శక్తులు తోక జాడిస్తే మాత్రం చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. – దేవరకొండ ప్రసాద్, డీఎస్పీ, కావలి -
సబ్సిడీ కిరోసిన్ ఎత్తివేత!
సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని పేదలకు చేరాల్సిన రాయితీ కిరోసిన్ పక్కదారి పడుతోంది. రేషన్ డీలర్ల అత్యాశ, అధికారుల నిర్లక్ష్యం వెరసి కిరోసిన్ యథేచ్ఛగా నల్లబజారుకు తరలిపోతోంది. కిరోసిన్ దందాపై నిఘా కొరవడటంతో వ్యాపారులు అక్రమ మార్గంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఏటా రాష్ట్రంలో 33 శాతం మేర కిరోసిన్ బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నట్లు ఇటీవలి పౌరసరఫరాల శాఖ విశ్లేషణలో తేలింది. దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి నెలకొనడంతో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కిరోసిన్ సరఫరానే పూర్తిగా నిలిపివేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. ఎత్తివేతకు కేంద్రం మొగ్గు.. అయితే రాష్ట్రంలోని రేషన్ దుకాణాల్లో ఇప్పటికే ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఇ –పాస్) విధానాన్ని కిరోసిన్ పంపిణీకి కూడా అనుసంధానం చేశారు. ఇటీవలే ఈ విధానం అమల్లోకి రావడంతో డీలర్లు కిరోసిన్ బ్లాక్ మార్కెట్‌కు తరలించే వీలు లేకుండా అడ్డుకట్ట పడుతోంది. ఈ నెలలోనే ప్రస్తుత లెక్కల మేరకే 33 శాతం మేర కిరోసిన్ మిగులు సాధించినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇ–పాస్ విధానం అన్ని రాష్ట్రాల్లో అమల్లో లేదు. దీంతో దేశవ్యాప్తంగా కిరోసిన్ అక్రమాలకు చెక్‌పడటం లేదు. దేశవ్యాప్తంగా 41శాతం ఏటా అక్రమమా ర్గం పడుతోందని కేంద్రం తన సర్వేలో గుర్తించింది. ప్రస్తుతం దేశంలోనూ, రాష్ట్రంలోనూ నూటికి 95 శాతం మంది దీపం, వంట పొయ్యి లు వాడడం లేదు. దాదాపు ప్రతి ఒక్కరికీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాయితీ సరఫరాను పూర్తిగా నిలిపివేయా లని కేంద్రం యోచిస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక సలహాదారు సైతం ప్రభుత్వానికి తమ సిఫారసులు పంపినట్లుగా తెలిసింది. రాయితీ కిరోసిన్ అంతా పెట్రోల్ బంక్‌లకే.. రాష్ట్రంలో ప్రస్తుతం 87లక్షల రేషన్ కార్డులుండగా, 2.79 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కో కార్డుపై నెలకు లీటర్ కిరోసిన్‌ని రూ.29కి సరఫరా చేస్తున్నారు. నిజానికి లీటర్ కిరోసిన్ ధర రూ.40మేర ఉండగా, రూ.11 మేర కేంద్ర ప్రభుత్వం రాయితీని భరిస్తోంది. రాష్ట్రంలో ప్రతి నెలా సరాసరిన 7.60 లక్షల లీటర్ల కిరోసిన్‌ను కేంద్రం సరఫరా చేస్తోంది. అయితే ఈ కిరోసిన్‌ని రేషన్ డీలర్లు పక్కదారి పట్టిస్తున్నారు. ప్రతి నెలా హోల్‌సేల్ డీలర్లు, రేషన్ డీలర్లకు సరఫరా చేయాల్సి ఉండగా, ఒక నెల సరఫరా చేసి మరో నెల తప్పిస్తున్నారు. దీనిపై లబ్ధిదారులకు సరైన సమాచారం లేకపోవడంతో డీలర్ల వద్దే కిరోసిన్ మిగిలిపోతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని డీలర్లు కిరోసిన్‌ను పెట్రోల్ బంక్‌లకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పైకి ఎగబాకడం డీలర్లకు కాసులు కురిపిస్తోంది. రూ.29కే అందుతున్న కిరోసిన్‌ని ఏకంగా డీలర్లు రూ.40 నుంచి రూ.50కి పెట్రోల్ బంక్ యజమానులకు విక్రయిస్తున్నారు. ఇటీవలే రాయితీ కిరోసిన్‌తో చేస్తున్న కొత్తదందాను తెలంగాణ విజిలెన్స్ గుర్తించింది. ‘ఇంటెరాక్స్ ఎస్టీ 50’అనే కెమికల్‌తో పాటు ముల్తానా మట్టిని వినియోగించి కిరోసిన్‌ను డీజిల్‌గా మార్చేస్తున్నారు. ఇలా తయారు చేసిన నకిలీ ఇంధనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా రవాణా చేసి, వివిధ పెట్రోల్ బంకులకు విక్రయిస్తున్నారు. ఏటా రూ.100 కోట్ల మేర సాగుతున్న ఈ అక్రమ వ్యవహారం తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల చొరవతో గత నెలలో బహిర్గతమైంది. ప్రతి ఏటా ఈ విధంగా ఏకంగా రాష్ట్రంలో 33 శాతం మేర కిరోసిన్ బ్లాక్‌మార్కెట్‌కు తరలుతోంది. -
అనుమతి తీసుకున్నాకే పౌరులపై నిఘా
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేదా రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి నుంచి అనుమతి తీసుకున్నాకే పౌరుల కంప్యూటర్లపై నిఘా పెట్టాల్సి ఉంటుందని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ విషయంలో ఏ విచారణ సంస్థకూ సంపూర్ణ అధికారాలు అప్పగించలేదన్నారు. 2009లో తెచ్చిన నిబంధనల మేరకే ఈ నిఘా కొనసాగుతోందనీ, వీటిలో చిన్నమార్పు కూడా చేయలేదన్నారు. పౌరుల కంప్యూటర్లలోని సమాచారంపై నిఘాతో పాటు డీక్రిప్ట్ చేసే అధికారాన్ని 10 ప్రభుత్వ సంస్థలకు అప్పగించడంపై వివాదం రాజుకున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. -
‘వ్యక్తిగత స్వేచ్ఛ’పై రాద్దాంతం ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : కంప్యూటర్ నుంచి వచ్చే ఏ సమాచారంపైనైనా నిఘా కొనసాగించి, దాన్ని మధ్యలో అడ్డుకోవడంతోపాటు సదరు సమాచారాన్ని స్వాధీనం చేసుకునేందుకు దేశంలోని పది ప్రభుత్వ సంస్థలకు అధికారాన్ని కట్టబెడుతూ కేంద్ర హోం శాఖ గురువారం నాడు విడుదల చేసిన నోటిఫికేషన్‌పైనా శుక్రవారం నాడు పార్లమెంట్లో తుపానే చెలరేగింది. స్వేచ్చా వ్యవస్థ స్వరూపమే సర్వ నాశనం చేస్తుందని మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం విమర్శించగా, సుప్రీం కోర్టు సమర్థించిన రాజ్యాంగబద్ధ వ్యక్తిగత స్వేచ్ఛను ఈ నోటిఫికేషన్ హరిస్తోందని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి ఘాటుగా విమర్శించారు. నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు గొడవ చేయడంతో పార్లమెంట్ సమావేశం కూడా పలు సార్లు వాయిదా పడింది. (సెక్షన్ 69 బాంబు : మండిపడుతున్న ప్రతిపక్షాలు) ఇక పార్లమెంట్ వెలుపల ఈ నోటిఫికేషన్‌ను పలువురు సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, సైబర్ భద్రతా నిపుణులు విమర్శిస్తున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ హరించుకు పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కంప్యూటర్లోని ఎవరి సమాచారమైనా, అది ఎలాంటి సమాచారమైన నిఘావేసి, అడ్డుకొని, తస్కరించే అధికారాలు అధికారులకు ఇప్పటికే ఉన్నాయన్న విషయాన్ని మరచిపోతున్నారు. 2000 నాటి సమాచార సాంకేతిక చట్టంలోనే ఈ ప్రత్యేకాధికారాలను సంస్థలు లేదా అధికారులకు కల్పిస్తూ 2008లో అప్పటి యూపీఏ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం సవరణ తీసుకొచ్చింది. నాడు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సీపీఎం అప్పుడు మౌనం వహించి ఇప్పుడు గోల చేయడం విడ్డూరమే. సమాచార సాంకేతిక చట్టంలోని 69 (1) సెక్షన్ ప్రకారం ‘దేశ సార్వభౌమా«ధికారానికి లేదా దేశ రక్షణకు లేదా రాష్ట్ర భద్రతకు ముప్పుందని భావించినట్లయితే, విదేశాలతో స్నేహ పూర్వక సంబంధాల కోసం లేదా పాలనాపరమైన సంబంధాల కోసం అవసరమైతే, ఎలాంటి నేరాన్నైనా నిరోధించేందుకు ఉపయోగపడుతుందని భావించినట్లయితే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిగల అధికారులు ఎవరి కంప్యూటర్ సమాచారంపైనైనా నిఘా పెట్టవచ్చు. ఆ సమాచారాన్ని మధ్యలోనే అడ్డుకొని, స్వాధీనం చేసుకోవచ్చు. అయితే దర్యాప్తు అధికారులు ఏ కారణంతోని సమాచారాన్ని సేకరిస్తున్నారో మాత్రం లిఖితపూర్వకంగా స్పష్టం చేయాల్సి ఉంటుంది’ అని చెబుతోంది చట్టం. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం లేదా? మాటి మాటికి లేదా కేసుబై కేసుకు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాల్సిన అవసరం లేకుండా కేంద్ర హోం మంత్రి అరుణ్ జైట్లీ దేశంలోని ‘ది ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, క్యాబినెట్ సెక్రటేరియట్, జమ్మూ కశ్మీర్, ఈశాన్య, అస్సాం రాష్ట్రాల పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీసు కమిషనర్’లకు అధికారాలను కట్టబెట్టారు. ఈ సంస్థలకు చెందిన అధికారులకు సమాచారాన్ని సేకరించడంలో సహకరించడానికి ఎవరు నిరాకరించినా చట్ట ప్రకారం ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారన్న హెచ్చరిక కూడా ఉంది. సమాచార సాంకేతిక చట్టంలోనే దర్యాప్తు సంస్థలు సమాచారాన్ని సేకరించే వెసులుబాటు లేకపోయినట్లయితే నేడు అరుణ్ జైట్లీ జారీ చేసిన నోటిఫికేషనే చెల్లేదికాదు. ఇదంతా తెలిసే కాంగ్రెస్, సీపీఎం పార్టీలు రాద్ధాంతం చేయడం ఎందుకు? నిజంగా ఆ పార్టీలకు ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛ పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందుగా ‘వ్యక్తిగత గోప్యత’ భద్రతకు చట్టం తీసుకురావాలి. చాలా దేశాల్లో ఈ చట్టం ఉంది. అప్పుడు దొడ్డి దారిన కూడా వ్యక్తిగత గోప్యతకు ఎవరూ ఎసరు పెట్టలేరు! -
నెట్టింట్లో పోలీస్!
-
కంప్యూటర్లపై దర్యాప్తు సంస్థల నిఘా కన్ను
-
నిఘా నీడలో మద్యం అమ్మకాలు..
సాక్షి, వనపర్తి క్రైం: జిల్లాలో మద్యం విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు నిఘా పెంచారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో విచ్చలవిడిగా జరిగే మద్యం అమ్మకాలను ఎక్క డికక్కడ నియంత్రించేందుకు ఆ బ్కారీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సాధారణ రోజుల్లో కంటే ఎన్నికల సమయంలో విక్రయా లు ఎక్కువగా జరుగుతున్న తరుణంలో అక్రమాలకు పాల్పడే అవకాశాలు లేకపోలేదు. సమయపాలన పాటించడం, నిఘాకెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, బార్‌కోడింగ్ విధానం ద్వారానే అమ్మకాలు చేయాలనే నిబంధనలు ఉన్నాయి. ఇవి అతిక్రమించిన దుకాణాలను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. దుకాణాలపై నిఘా ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో ప్రతి మద్యం దుకాణంపై నిరంతర నిఘా ఉండేలా ఆబ్కారీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. నిబంధనల ప్రకారమే మద్యం దుకాణాలు, బార్లు నడపాలని సృష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మద్యం దుకాణాలు ఉదయం 10నుంచి రాత్రి 10వరకు, బార్లు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు అమ్మకాలు జరపాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 50శాతం కంటే ఎక్కువ విక్రయాలు జరిపితే చర్యలు తప్పవనే భయం విక్రయదారుల్లో నెలకొంది. అధికారులు , సిబ్బంది ప్రతి దుకాణంపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు విక్రయదుకాణాలను పరిశీలిస్తున్నా రు. గొలుసు దుకాణంలో మద్యం విక్రయాన్ని జరిపితే వెంటనే దాడులుచేసి, కేసులు నమోదు చేస్తున్నారు. ఫిర్యాదు కోసం కంట్రోల్ రూం మద్యాన్ని భారీగా నిల్వ ఉంచినా, పంపిణీ చేస్తున్నా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. జిల్లా కేంద్రంలో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఫిర్యాదుకోసం టోల్‌ఫ్రీ నంబర్ 08545–230033కి ఫోన్ చేయవచ్చు. నాటుసారా తయారీ, అక్రమరవాణా చేసినా వెంటనే ఫోన్ చేసి వివరాలు తెలియజేయవచ్చు. ఒక వ్యక్తి తన సొంత వినియోగానికి గరిష్టంగా 6 మద్యం సీసాలు, 12బీరు సీసాలకు అనుమతి ఉంటుంది. అతిక్రమించి విక్రయిస్తే వారిపై జరిమానాతో పాటు కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. భారీగా మద్యం పట్టివేత జిల్లా కేంద్రంలో వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ సమీపంలోని చెక్‌పోస్టుల వద్ద నిర్వహించిన తనిఖీల్లో భారీగా మద్యం పట్టుకున్నారు. అదేవిధంగా గ్రామా ల్లో ఉన్న బెల్టు దుకాణాలపై దాడులు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్‌నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 92కేసులు నమయ్యా యి. కాగా 88 మందిని అరెస్టు చేశారు. 520 లీటర్ల చీప్ లిక్కర్, 140 లీటర్ల బీరు సీసాలు, రెండు వాహనాలు స్వా«ధీనపరుచుకున్నారు. ఆబ్కారీ అ«ధికారుల నిఘాతో గొలుసుకట్టు దుకాణాలు భారీ సంఖ్యలో తగ్గాయి. మద్యాన్ని అదుపు చేసేందుకు బెల్టు దుకాణాలపై అధికారులు విరుచుకుపడుతున్నారు. దీంతో అక్రమ మద్యం తగ్గుముఖం పట్టింది. మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా జిల్లాలో మద్యం విక్రయాలపై ప్రత్యేక ని ఘా ఉంచాం. అక్రమంగా అమ్మినా, నిలువ చేసినా వాటిని నియంత్రించేందుకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు జిల్లాలో 520 లీటర్ల చీప్ లిక్కర్, 120 లీటర్ల బీర్లు, 88మంది అరెస్టు, 92 మందిపై కేసులు నమోదు చేయడం జరిగింది. మద్యం దుకాణాలు నిబంధనల మేరకు తెరిచి ఉంచాలి. గ్రామాల్లో ఉన్న బెల్టుషాపులపై దాడులు నిర్వహించడంతో చాలావరకు తగ్గింది. – విజయభాస్కర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ -
‘కోడ్ ’ దాటితే వేటే..!
సాక్షి, నల్లగొండ: ఎన్నికల నోటిఫికేషన్ వెలుబడింది. నియోజకవర్గ కేంద్రంలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభ మైయింది. అయితే బరిలో దిగనున్న పార్టీ అభ్యర్థులు పాటించాల్సిన నియమావళిని ఎన్నికల సంఘం విడుదల చేసింది. నింబధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నిబంధనలు ఇలా.. - నామినేషన్ దాఖలు చేసే సమయంలో రిట ర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి వంద మీటర్ల పరిధిలో మూడు వాహనాలు మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థితో పాటు మరో ఐదుగురు మాత్రమే ఎన్నికల అధికారి గదిలోకి వెళ్లేం దుకు అనుమతి ఉంటుంది. ఏజెంట్ మరో వ్యక్తి లాయర్‌ను తీసుకు వెళ్లడానికి అవకాశం ఇస్తారు. - ప్రచార వాహనాకి రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకోవాలి. అనుమతి పత్రన్ని వాహనానికి స్పష్టంగా కనబడేలా అతికించాలి. పర్మిట్ మీద అభ్యర్థి పేరు, వాహనం నంబర్ వివరాలు ఉండాలి. ఫర్మిట్వాహనం అదే అభ్యర్థికి తప్ప మరే అభ్యర్థికి వాడరాదు. - విద్యా సంస్థల మైదానాలను వారి ప్రచారానికి వాడరాదు. - ప్రైవేట్ భూములు, వారి భవనాలు యజమానుల లిఖిత పూర్వక అనుమతి తీసుకుని రిటర్నింగ్ అధికారికి అందించిన తర్వాత వాల్పోస్టల్స్ అతికించాలి. - కరపత్రంపై ప్రింటిగ్ ప్రస్ పేరుతో ముద్రించాలి. - పార్టీ ప్రచారంలో భాగంగా ఓటర్లకు టోపీలు, జెండాలు, కండువాలు ఇవ్వవచ్చు. వీటిని ఎన్నికల ఖర్చులో చూపించ వలసి ఉంటుంది. కానీ చొక్కాలు పంపిణీకి వీలు లేదు. - దేవుళ్ల ఫొటోలు ,అభ్యర్థుల ఫొటోలతో డైరీలు, క్యాలెండర్లు ముద్రించ కూడదు. - మంత్రులు ఎన్నికల అధికారులను పిలవడానికి వీలు లేదు. ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన మంత్రిని ఏ అధికారి కలవ కూడదు. - పైలెట్ కార్లు, బుగ్గ కార్లు ఉపయోగించ వద్దు. - అధికార పార్టీ చేసిన పనుల తెలిపే ప్రభుత్వ ప్రచార హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఉండవద్దు. - గతంలో మొదలు పెట్టిన పనులు కొనసాగించ వచ్చు. - పకృతి వైఫరిత్యాలు వస్తే సహాయ కార్యక్రమాల్లో మంత్రి పాల్గనవచ్చు. కానీ రాజకీయ ప్రచారం చేయవద్దు. పార్టీ కార్యాలయం ఏర్పాటుకు.... - పాఠశాలలకు, పోలింగ్ స్టేషన్లకు,ప్రార్థన స్థలలకు 200 మీటర్ల లోపు పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయరాదు. - ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత నియోజక వర్గంలో ఓటర్లు కాని వారు ఉండవద్దు. - రాత్రి 10 గంటల తర్వాత నుంచి ఉదయం 6 గంటల వరకు మైకులు, లౌడ్ స్పీకర్లు ఉపయోగించరాదు. రాత్రి 10 గంటల తర్వాత పబ్లిక్ మీటింగ్‌లు నిర్వహించ కూడదు. - పోలింగ్ ఏజెంట్ అదే పోలింగ్ కేంద్రంలో ఓటరై ఉండాలి. ఫొటోతో కూడిన ఓటరు గుర్తింపు కార్డు ఉంగాలి. - ఎస్‌ఎంఎస్‌లద్వారా అభ్యంతర కర ప్రచారం చేయ రాదు. అభ్యంతర కరమైన మెసేజ్‌లు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు - పోలింగ్ స్టేటసన్ నుంచి 200 మీటర్ల టేబుల్, రెండు కుర్చీలు అభ్యర్థి బ్యానర్‌తో ఎన్నికల బూత్ ఏర్పాటు చేసుకోవచ్చు. - పోలింగ్ స్టేసన్ నుంచి 100 మీటర్లలోపు ప్రచారం చేయడం నిషేధం. ఈ సమయంలో మొబైల్ ఫోన్ మాట్లడడం కూడా నిషేధం. - ఎన్నికల రోజున అభ్యర్థి ఏజెంటు పార్టీ వర్కర్ల కోసం ఒక వాహనం ఉపయోగించుకోవచ్చు. ఈ వాహనంలో ఐదుగురికి మాత్రమే అవకాశం ఉంటుంది. - పోలింగ్ రోజు ఓటర్లను తరలించడానికి అభ్యర్థులు - ప్రైవేట్ వాహనాలను సమకూర్చుకోవడం నిషేధం. - ఓటరు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకుందుకు సహకరించాలి. అధికార పార్టీ వారైనా.... - ఎన్నికల ప్రచారాన్ని అధికారిక పర్యటనలతో కలిసి చేయకూడదు. - అధికార యంత్రాలను , అతిథి గృహాలను ఉపయోగించ రాదు. - ప్రభుత్వ ఖర్చుతో మీడియా ప్రకటనలు ఇవ్వవద్దు. రోడ్ల నిర్మాణం, తాగునీటి వసతి కల్పిస్తామని ప్రకటనలు చేయొద్దు. - పోలింగ్ కేద్రాల్లోకి మంత్రులు ప్రవేశించరాదు. నిబంధనలు - రాజకీయ పార్టీలు ,నాయకులు అంగీకరించిన మార్గ దర్శక సూత్రాలు ఎన్నికల నిబంధనల్లో చేర్చ బడతాయి. - ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయవద్దు. ఎన్నికల నియమావళి యావత్తు రాష్ట్రానికి వర్తిస్తుంది. - అధికారిక పర్యటనలను ఎన్నిక పనిలో కలపొద్దు. - ప్రభుత్వ వాహనాలు, ప్రభుత్వ అధికారులు ఉద్యోగుల బదిలీపై పూర్తి నిషేధం ఉంటుంది. నియమాలు - అభ్యర్థులు వ్యక్తిగతంగా, పార్టీ తరఫున గాని కుల, మత భాషా విద్వేషాలు రెచ్చగొట్టవద్దు. - కుల, మత ప్రాతిపదికన ఓట్లు అడుగొద్దు. మందిరాలు, మసీదులు, చర్చీల్లో పాటు ఇతర ప్రార్థనా ప్రాంతాలను ఎన్నిక ప్రచారం కోసం వాడకూడదు. - ఓటు కోసం డబ్బులు ఇవ్వడం, బెదిరించడం నిషేధం . ఒక వ్యక్తి ఓటు మరో వ్యక్తి వేయడం నేరం. - ఇతర పార్టీల ఎన్నికల ప్రచారం సమావేశాలకు ఆటంకం కలిగించ కూడదు. -
నిఘా నీడలో..
సాక్షి, కామారెడ్డి: ఓటింగ్ ప్రక్రియపై ప్రజలకు నమ్మకాన్ని పెంచడంతోపాటు, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు జిల్లా పోలీస్‌శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఓటర్లలో భద్రతా భావాన్ని పెపొందించేందుకు టెక్నాలజీని వాడుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం జిల్లాలోని అన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఓటింగ్ పక్రియ మొత్తాన్ని సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేయనున్నారు. అల్లర్లు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా ఉండనుంది. ఎవరైనా సమస్యలు సృష్టిస్తే పూర్తి ఆధారాలతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు ఉపయోగపడనుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు కెమెరాల ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. 188 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఆయా పోలింగ్ కేంద్రాల్లో గతంలో జరిగిన అల్లర్లు, వివాదాలను బట్టి సమస్యాత్మకంగా గుర్తిస్తారు. అంతేకాకుండా గతంలో నక్సల్స్ ప్రభావం ఉన్న గ్రామాలు, ఒకేచోట అధికంగా పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లయితే ఓటర్ల రద్దీ ఎక్కువగా ఉండే కేంద్రాలను సైతం సమస్యాత్మకంగానే గుర్తించడం జరుగుతుంది. ఈ మేరకు జిల్లాలో మొత్తం 740 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిలో నుంచి 188 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా పోలీస్‌శాఖ గుర్తించి ఎన్నికల సంఘానికి నివేదించింది. కామారెడ్డి నియోజకవర్గంలో 57, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 74, జుక్కల్ నియోజకవర్గంలో 57 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆయా పోలింగ్ కేంద్రాల్లో సాధారణంగా ఏర్పాటు చేసే పోలీసు భద్రత కంటే అదనంగా బలగాలను నియమించనున్నారు. ఇప్పటికే భిక్కనూరు మండలంలో 45 పోలింగ్ కేంద్రాల వద్ద సరిపడా సీసీ కెమెరాలు ఉన్నాయి. మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో పోలీస్‌శాఖ నిమగ్నమైంది. ఎన్నికల ఖర్చులకు సంబంధించిన నిధులతోనే వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాలు ఓటర్లు వచ్చేదారి, ఓటింగ్ జరిగే హాలు, బయట వందమీటర్ల మేర దృశ్యాలను కెమెరాలను బంధిస్తాయి. జిల్లా కేంద్రంలో కెమెరాలకు మరమ్మతులు జిల్లా కేంద్రంలో ఏడాది క్రితం ప్రధాన రహదారుల గుండా ఏర్పాటు చేసిన 80 సీసీ కెమెరాలు పెట్టిన నెలరోజులకే చెడిపోయి వృథాగా మారాయి. ఎస్పీ శ్వేత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మున్సిపల్ యంత్రాంగంతో మాట్లాడి నిధులు మంజూరయ్యేలా కృషి చేశారు. ఇటీవల నిధులు మంజూరు కాగా కెమెరాల నిర్వహణకు మూడు సంవత్సరాల కాంట్రాక్ట్‌తో మరమ్మతులు పూర్తి చేయించారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాలన్ని అందుబాటులోకి వచ్చాయి. ఎన్నికల నేపథ్యంలో కెమెరాల ఆవశ్యకత ఎంతగానో కనిపిస్తుంది. -
అన్నా...తస్మాత్ జాగ్రత్తే!
ఖమ్మంరూరల్: ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు పెట్టే ఖర్చు పర్యవేక్షణకు అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల ఏర్పాట్లు అక్రమ మద్యం, డబ్బు పంపిణీ, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, అనుమతి లేకుండా ప్రచార కార్యక్రమాలు చేపట్టడం లాంటి వాటిని నిరోధించేందుకు ఎనిమిది రకాల బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. వీరు ప్రతీ అంశాన్ని నేరుగా పరిశీలకులు, ఎన్నికల అధికారికి సమాచారమిస్తారు. వ్యయ పరిశీలకులు వ్యయపరిశీలకులుగా ఐఏఎస్, ఐఆర్ఎస్, సెంట్రల్ ఎక్సైజ్ అధికారులను నియమించారు. ప్రతీ జిల్లాకు నియోజకవర్గాల సంఖ్యకనుగుణంగా పరిశీలకులను నియమించారు. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు నులుగురు వ్యయ పరిశీలకులను నియమించారు. సహాయ వ్యయపరిశీలకులు పరిశీలకులకు సాయంగా ఉండేందుకు సహాయ వ్యయపరిశీలకులను నియోజకవర్గానికి ఒకరిని నియమించారు. ప్రతీ నియోజకవర్గానికి ఆదాయ పన్ను అధికారి (ఐటీఓ) హోదా లేదా ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న అధికారులు ఉంటారు. అభ్యర్థులకు సంబంధించిన అన్ని రకాల వ్యయాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఈ అధికారి వద్ద ఒక్కో అభ్యర్థి పేరుతో ఒక్కో రిజిస్టర్ ఏర్పాటు చేస్తారు. షాడో రిజిస్టర్‌గా పిలిచే దీనిలో అభ్యర్థికి సంబంధించిన వివిధ కమిటీలు ఇచ్చిన వివరాలు పొందుపరుస్తారు. అభ్యర్థులు చూపే ఎన్నికల ఖర్చుతో షాడో రిజిస్టర్ ఖర్చులు పోల్చి చూసి తేడా ఉంటే సంజాయిషీ కోరతారు. అంతిమంగా అభ్యర్థుల ఖర్చుల్లో వీరు చెప్పిందే ఫైనల్‌గా ఉంటుంది. ఎంసీసీ(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల్లో ఈ కమిటీలో 48 మంది పనిచేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలో కనీసం ఐదు, ఆపై సంఖ్యలో కమిటీలను నియమించారు. ఒక్కో కమిటీలో ఓ అధికారి, ఓ ఏఎస్‌ఐతోపాటు వీడియోగ్రాఫర్ ఉంటారు. ప్రవర్తనా నియామవళి ఉల్లంఘనపై సమాచారం ఆధారంగా వీరు రంగంలోకి దిగుతారు. అనుమతి లేని సమావేశాలు రద్దుచేయడం, వాహనాలనను అడ్డుకోవడం వంటి విధులు నిర్వర్తిస్తారు. నిఘా బృందాలు ఈ బృందాలు నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద ఉంటాయి. జిల్లాలో ఒక్కో నియోజవర్గానికి మూడు నుంచి నాలుగు చొప్పున చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో డీటీ స్థాయి అధికారితో పాటు ముగ్గురు ,లేదా నలుగురు కానిస్టేబుళ్లు ఉంటారు. వీడియో నిఘా బృందాలు వీడియో నిఘా బృందం నియోజకవర్గానికొకటి ఉంటుంది. ప్రతీ బృందలో ఒక అధికారి, ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు. వీరు నియోజకవర్గంలోని రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు ,ర్యాలీలు, ఇతర ప్రచార కార్యక్రమాలను చిత్రీకరిస్తారు. ఒకే సమయంలో ఎక్కువ కార్యక్రమాలు ఉంటే అదనపు వీడియో గ్రాఫర్‌ను నియమించుకునే అధికారం ఆ అధికారికి ఉంటుంది. అకౌంటింగ్ టీం జిల్లాలో మొత్తం 12 బృందాలు ఉంటాయి. ఒక్కో బృందంలో ఒక అధికారి, ఒక సహాయకుడు ఉంటారు. వీరు వీడియో వ్యూయింగ్ బృందాలు పంపిన సామగ్రి లెక్కలు చూసి వాటికి ఎన్నికల నిబంధనల ప్రకారం ధరలు నిర్ణయిస్తారు. వీడియో వీక్షణ బృందం ప్రతీ నియోజకవర్గానికి ఓ బృందం చొప్పున కేంద్రంలో విధులు నిర్వరిస్తుంటుంది. ఈ బృందంలో ఓ అధికారి, ఇద్దరు సహాయకులు ఉంటారు. ఈ బృందం ఫ్లయింగ్ స్వా్కడ్, స్టాటిక్ సర్వోలెన్స్ టీం, ఎంసీఎంసీ కమిటీల నుంచి వచ్చిన నివేదికలు, వీడియోలను పరిశీలిస్తుంది. ఉదాహరణకు వీడియో బృందం ఇచ్చిన సీడీలో అభ్యర్థి, పార్టీకి సంబంధించిన టోపీలు, కండువాలు, జెండాలు, బ్యానర్లు, వాహనాలు ఎన్ని ఉన్నాయన్న వివరాలు పరిశీలించి నమోదు చేస్తారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఫ్లయింగ్ స్క్వాడ్లు ప్రతీ నియోజకవర్గంలో మూడు, ఆపై సంఖ్యలో ఉంటాయి. ఒక్కో బృందానికి నాయకత్వం వహించే అధికారికి మెజిస్టీరియల్ అధికారాలు ఉంటాయి. ఇలా జిల్లాలో మొత్తం 5 నియోజకవర్గాలకు 60మంది ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పనిచేస్తుంటారు. బృందంలో ఒక వాహనం, ముగ్గురు లేదా నలుగురు కానిస్టేబుళ్ళు, ఒక ఏఎస్సై, ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు. డబ్బు, మద్యం ఇతర ప్రలోభాలపై సమాచారమొస్తే ఆకస్మిక తనిఖీలు చేసి వాటిని రికార్డు చేస్తారు. -
ఎన్నికల అధికారులపైనా నిఘా
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కేవలం అభ్యర్థులపైనే కాకుండా జిల్లా, నియోజకవర్గ, బూత్ స్థాయిల్లోని ఎన్నికల అధికారులు, సిబ్బందిపై సైతం నిఘా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్‌కుమార్ పౌర సమాజానికి పిలుపునిచ్చారు. తీవ్ర ఒత్తిళ్ల మధ్య క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారుల పనితీరు ప్రభావితమయ్యే అవకాశాలున్నాయన్నారు. తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక ఆధ్వర్యంలో జిల్లాల నుంచి వచ్చిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు గురువారం ఇక్కడ నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో సీఈవో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ బాధ్యత కేవలం ఎన్నికల సంఘం, ప్రభుత్వ యంత్రాంగానిదే కాదని, పౌర సమాజం కూడా తన వంతు పాత్ర పోషించాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా లేకుంటే ప్రజ్వాసామ్యం హైజాక్‌కు గురయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. ఎన్నికల అక్రమాల నిరోధం కోసం స్వచ్ఛంద సంస్థలు, సాధారణ పౌరులు నిఘా ఉంచి ఎప్పటికప్పుడు జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లకు సమాచారమివ్వాలని సూచించారు. ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటుందన్నారు. ఎలాంటి నేర చరిత్ర లేని అమాయకులను పోలీసులు అకారణంగా బైండోవర్ చేస్తే జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సుపరిపాలన వేదిక కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ఎన్నికల అఫిడవిట్లలో అభ్యర్థులు తమపై ఉన్న కేసుల వివరాలను పొందుపర్చాల్సి ఉందని, అయితే చాలామంది తమ నేర చరిత్రను దాచి పెడుతున్నారని పేర్కొన్నారు. నేరచరిత్రను దాచిపెట్టే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. సమాచార హక్కు ద్వారా పోలీసు శాఖ నుంచి అభ్యర్థుల నేర చరిత్ర సమాచారాన్ని సేకరించి, వారి ఎన్నికల అఫిడవిట్లలోని సమాచారంతో పోల్చి చూస్తామన్నారు. ఎవరైనా తప్పుడు వివరాలిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
నిఘా చూస్తోంది!
సాక్షి, ఆసిఫాబాద్‌టౌన్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జిల్లాలో నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల కార్యకలాపాలపై దృష్టి సారిం చేందుకు ప్రత్యేక నిఘా బృందాలను నియమించారు. ఈ బృందాలు ఎప్పటికప్పుడు జిల్లాను జల్లెడ పడుతున్నాయి. అభ్యర్థుల ప్రచారం, నగ దు వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పోటీ చేస్తున్న అభ్యర్థి రూ.28 లక్షలకు మించి ఖర్చు చేయడానికి వీలు లేదు. ఈ నేపథ్యంలో అనుని త్యం నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఖర్చు వివరాలపై ఈసారి ఎన్ని కల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. విధించిన గడువుకు మించి ఖర్చు పెడితే చర్యలు తీసుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల లెక్కలు తప్పుగా చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక బృందాల ద్వారా ర్యాలీలు, బహిరంగ సభలతోపాటు ఇతర కార్యక్రమాలను వీడియో ద్వారా చిత్రీకరిస్తున్నారు. ర్యాలీలు, సభల్లో ఎమ్మెల్యే ఫొటోలు వాడితే ఆ సభకు అయ్యే ఖర్చును అభ్యర్థి ఖాతాలోనే లెక్కిస్తారు. ప్రచారానికి సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు ఎన్నికల అధికారులు ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రత్యేక రిజిష్టర్‌ను అందజేస్తున్నారు. ఈ రిజిష్టర్‌లో అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అక్రమ మార్గాలపై దృష్టి.. ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు అక్రమ రవాణాను నివారించేందుకు నిఘా మరింత పెంచారు. ఇందులో భాగంగానే తెలంగాణ, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న వాంకిడి, సిర్పూర్(టి)తోపాటు ఆసిఫాబాద్, గోలేటి ఎక్స్‌రోడ్, కాగజ్‌నగర్‌లో ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతీ వాహనాన్ని ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించాకే పంపిస్తున్నారు. అయితే ఈ తనిఖీల ద్వారా కొంత వరకూ సామాన్యులు కూడా ఇబ్బందులకు గురువుతున్నారు. సామాన్య పౌరులు తమతో రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లవద్దని, అంతకు మించి తరలిస్తే వాటిని సీజ్ చేసి ఆ దాయపు పన్నుల శాఖకు అప్పగించనున్నారు. న గదుకు సంబంధించిన రశీదు, ధ్రువ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. కాగా జీరో అకౌంట్స్ ఖాతాలతోపాటు, బ్యాంకుల లావాదేవీలపై కూ డా అధికారులు కన్నేశారు. అలాగే మద్యం తరలిం పుపైనా ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టారు. ఎన్ని కలకు ముందు ఏరులై పారే మద్యం అమ్మకాలు, సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇతర ప్రాంతల నుంచి అక్రమంగా మద్యం తరలిపోకుండా ప్రత్యేక తనిఖీలపై సైతం చేపడుతున్నారు. దీనికి తోడు జిల్లాలో నూతనంగా నాలుగు స్కార్పి యో హైవే వాహనాలు రావడం, అవి నిరంతరం హైవేలపై తిరుగుతూ ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూస్తున్నాయి. జిల్లాలో ఆరు బృందాలు.. ఎన్నికల భద్రత అంశాలపై దృష్టి సారించిన పోలీసులు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 3, కాగజ్‌నగర్ మరో మూడు భద్రత బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. దీనితోపాటు మొబైల్ పెట్రోలింగ్, బ్లూకోట్ టీంలు ఎప్పటికప్పుడు నిఘాను పెంచుతున్నాయి. దీనికి తోడు గత ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన వ్యక్తులతోపాటు రౌడీషీ టర్లను బైండోవర్ చేసి రూ.లక్ష సొంతపూచీకత్తుపై విడుదల చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులపై కూడా నిఘా ఉంచేందుకు ప్రజలతో భాగ్యస్వామ్యం అవుతున్నారు. సమాచార వ్యవస్థను మరింత పెంచుకుంటున్నారు. ఇందులో భాగంగా వరుసగా గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రానికి జియో ట్యాగింగ్.. గతంలో నిర్వహించిన ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలకు జియో ట్యాగింగ్ లేదు. కాని ఈసారి నూతనంగా ప్రతీ పోలింగ్‌స్టేషన్‌ను జియో ట్యాగింగ్‌తో అనుసంధానం చేస్తున్నారు. ప్రస్తుతం అత్యధునిక సాంకేతికతతో కూడిన జియో ట్యాగింగ్ సిస్టమ్‌ను పోలీస్ యంత్రాంగం వినియోగిస్తోంది. ఇది పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేసిన బందోబస్తు, రూట్‌మ్యాప్ తదితర వివరాలు సులువుగా తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడనుంది. -
పౌరుడి చేతిలో ‘నిఘానేత్రం’
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ధన ప్రవాహం జరిగినా.. ఎవరైనా విద్వేషపూరిత ప్రసంగాలు చేసినా ఎన్నికల సంఘం(ఈసీ) వలలో చిక్కుకున్నట్లే! ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా ఏమీ కాదులే.. అని అనుకుంటే మూడినట్లే!! కోడ్‌ను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరించాలనుకుంటే తస్మాత్ జాగ్రత్త! మీ చుట్టూరా ఉన్నవారి చేతిలో నిఘానేత్రం ఉంది. అదేంటో కాదు, స్మార్ట్‌ఫోన్..! అవును, ఒక్క మీటతో నేరుగా ఎలక్షన్ కమిషన్(ఈసీ)కు ఫిర్యాదు చేసే యాప్ వచ్చేసింది. డబ్బులు పంచుతూ చిక్కినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, కవ్వింపు చర్యలతో రెచ్చగొట్టినా.. ఆ వీడియోలు, ఫొటోలను చిటికెలో ఎన్నికల అధికారికి చేరవేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎన్నికలను అపహాస్యం చేసేలా వ్యవహరించడానికి వీలు లేకుండా ఈసీ రూపొందించిన ‘సి–విజిల్’యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి పౌరుడూ ఎన్నికల సంఘానికి సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేయవచ్చు. ఎలా పనిచేస్తుందంటే.. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లో సి–విజిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా జరిగే ఏ చర్య అయినా యాప్ ద్వారా ఫొటో, వీడియో ఆప్షన్ ద్వారా రికార్డు చేయొచ్చు. ఫొటో తీసిన తర్వాత దాని గురించి వివరిస్తూ అప్లోడ్ చేస్తే, ఆ ఫిర్యాదును ఐదు నిమిషాల్లో క్షేత్రస్థాయి బృందం పరిశీలనకు జిల్లా రిటర్నింగ్ అధికారి/కలెక్టర్ పంపిస్తారు. యాప్‌లో పొందుపర్చిన జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్) ద్వారా మీరున్న ప్రాంతానికి ‘ఫ్లయింగ్ స్క్వాడ్స్’ 15 నిమిషాల్లో చేరుకుంటారు. మరో అరగంటలో ఫిర్యాదుకు సంబంధించిన చర్యలు చేపట్టి నివేదిక పంపుతారు. 50 నిమిషాల్లో రిటర్నింగ్ అధికారి కేసు స్థితి(స్టేటస్)ని ఉన్నతాధికారులకు చేరవేస్తారు. యాప్ వినియోగిస్తున్న వ్యక్తి జిల్లా కంట్రోల్ రూమ్‌కు, ఎన్నికల్ రిటర్నింగ్ అధికారికి, పర్యవేక్షించే సిబ్బందికి, ఫ్లయింగ్ స్క్వాడ్స్‌కు కనెక్ట్ అయి ఉంటారు. ఫిర్యాదుదారుడి వివరాలు కూడా గోప్యంగా ఉంటాయి. రెచ్చగొట్టే ప్రసంగాలు, ధనప్రవాహం, ఓటర్లకు తాయిలాల ఎరపై నిఘా వేయవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. కోడ్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేక అధికారుల బృందాలు పనిచేస్తున్నా ఈ యాప్‌తో క్షేత్రస్థాయిలో జరిగే ఉల్లంఘనలను క్షణాల్లో పసిగట్టవచ్చని అంచనా వేస్తోంది. -
ఎవరు టాపర్లో తెలుసుకోవచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ పౌరల సామాజిక మీడియా ఖాతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న ‘సోషల్ మీడియా కమ్యూనికేషన్ హబ్’ను సుప్రీం కోర్టు అభ్యంతరాల కారణంగా ఆగస్టు మూడవ తేదీన విరమించుకున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఎంతో మంది భారతీయుల సామాజిక ఖాతాలు ప్రభుత్వం నిఘా నేత్రంలో ఉన్నాయనే విషయం ఎందరికి తెలుసు? ఆ నిఘా నేత్రం పేరు ‘అడ్వాన్స్డ్ అప్లికేషన్ ఫర్ సోషల్ మీడియా అనలిటిక్స్ (ఏఏఎస్‌ఎంఏ)’. ఈ టూల్‌ను కేంద్రంలోని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ నిధులతో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ‘ఇంద్రప్రస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ 2013–2014లో రూపొందించింది. ఈ ఆస్మా టూల్‌ను ఎలాంటి ప్రచారం కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం 2017, ఏప్రిల్ నెల నుంచి దేశంలోని 40 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ప్రవేశపెట్టింది. ఈ ఏడాదిలోగా మరో 75 ప్రభుత్వ సంస్థల్లో అమలు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని వ్యూహాత్మక ప్రాజెక్టుగా, వ్యూహాత్మక పురోగతిని పర్యవేక్షించడం కోసం ఏర్పాటు చేశామని కేంద్రం పేర్కొన్నట్లు ‘ఇంద్రప్రస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ తన 2016–2017 వార్షిక నివేదకలో పేర్కొంది. ఆస్మాపై కేంద్రంలోని మంత్రి, కార్యదర్శుల మధ్య చర్చలు జరిగాయని, ఈ టూల్ తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, దీన్ని తమ అంతర్గత అవసరాల కోసం ఉపయోగిస్తున్న కొన్ని ఏజెన్సీలు లిఖిత పూర్వకంగా కూడా కేంద్రానికి తెలిపాయని ఆ నివేదికలో వెల్లడించింది. అయితే ఈ ఆస్మాను ఏ ప్రభుత్వ సంస్థలు వాడుతున్నాయో, ఎందుకోసం వాడుతున్నాయో, ఏ ఏజెన్సీలు లిఖితపూర్వకంగా సంతృప్తి వ్యక్తం చేశాయో మాత్రం వెల్లడించలేదు. అలాగే ఈ ఆస్మాను ఇంటెలిజెన్సీ, భద్రతా విభాగాలకే పరిమితం చేశాయా, లేదా ? అన్న విషయంలో కూడా స్పష్టత లేదు. ఆస్మా గురించి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు దీన్ని ఇన్స్టాల్ చేసినట్లయితే 24 గంటలపాటు ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, ఫ్లికర్, గూగుల్ తదితర సామాజిక మాధ్యమాలను ఉపయోగించే ఖాతాదారులు ఎప్పటికప్పుడు ఇచ్చిపుచ్చుకునే సమాచారాన్ని విశ్లేషించవచ్చు. సోషల్ మీడియా ప్రొఫైళ్లను, వారి పోస్టులను వీక్షించవచ్చు. వారి పోస్టింగులను సానుకూలం లేదా ప్రతికూలం అంటూ వర్గీకరణ కూడా చేయవచ్చు. అంటే ఎవరు మంచి వారో, ఎవరు చెడ్డవారో విశ్లేషించవచ్చు. ఏ సోషల్ మీడియాలో ఎవరు టాపర్లో కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రతి రాష్ట్రంలోని పోలీసు విభాగంలో నేరస్థులపై నిఘాను కొనసాగించేందుకు ఓ సోషల్ మీడియా హబ్‌ను ఏర్పాటు చేయాలంటూ ‘నేషనల్ పోలీసు మిషన్’ ఉత్తర్వులను జారీ చేసిన నేపథ్యంలో ఈ ఆస్మాను పోలీసు విభాగాలు ఇప్పటికే ఉపయోగిస్తున్నట్లు అనధికారికంగా తెల్సింది. ఎందుకంటే నేరస్థులెవరో, నేరస్థులు ఎవరుకాదో తెలుసుకోవడానికే కాకుండా ఎవరు నేర స్వభావులు ఎవరో ముందుగానే తెలుసుకొని వారిపై నిఘా కొనసాగించడం ద్వారా నేరం చేయకుండా వారిని నియంత్రించవచ్చన వాదన కూడా కొంత మంది పోలీసు అధికారుల్లో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఈ టూల్‌ను సైనిక బలగాలు కూడా కోరుతున్నట్లు తెలుస్తోంది. నేరస్థుల కదలికలను తెలుసుకునేందుకు వారి ఫోన్లపై నిఘా పెట్టడమన్నది పోలీసు విభాగంలో ఎప్పటి నుంచో కొనసాగుతోందని, ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అందరిపై నిఘా పెట్టడం మంచిది కాదని ఉత్తరప్రదేశ్‌లో పోలీసు డైరెక్టర్ జనరల్‌గా, సరిహద్దు భద్రతా దళానికి డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన ప్రకాష్ సింగ్ అభిప్రాయపడ్డారు. నియంతృత్వ పాలనలో నిఘా అవసరమంటే ఆలోచించవచ్చని, స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించుకునే అవకాశం ఉన్న ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి నిఘా అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సంస్థలు పౌరుల సోషల్ మీడియా డేటాను పెద్ద ఎత్తున సేకరిస్తూ విశ్లేషిస్తుందంటే అది కచ్చితంగా పౌరులపై నిఘా కొనసాగించడమేనని ‘గ్లోబల్ డిజిటల్ రైట్స్’లో పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రామన్ జిత్ సింగ్ చిమా వ్యాఖ్యానించారు. అందరికి అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషిస్తే పర్వాలేదుగానీ, వ్యక్తిగతమైన డేటాను విశ్లేషించడమంటే నేరమే అవుతుందని ఆయన అన్నారు. ఆస్మా టూల్ గురించి అన్నింటికన్నా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే పారదర్శకత లేకపోవడమని ‘సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ’ అనే స్వచ్ఛంద పరిశోధనా సంస్థకు చెందిన అంబర్ సిన్హా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ టూల్‌ను ఎవరు ఉపయోగిస్తున్నారో, ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలియదు. ప్రతి వ్యక్తి సోషల్ మీడియా కార్యకలాపాలపై నిఘా కొనసాగించడమంటే భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే అవుతుంది’ అని వ్యాఖ్యానించారు. బ్రిటన్‌లోని రాజకీయ కన్సల్టెంట్ సంస్థ ‘కేంబ్రిడ్జి అనలిటికా’ ఫేస్బుక్ సమాచారాన్ని దుర్వినియోగం చేయడం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఆస్మా లాంటి నిఘా టూల్స్‌పై ఆందోళన పెరిగింది. అన్నింటా ప్రచారానికి ముందుండే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ టూల్‌ను గుట్టుగా అమలు చేస్తుందంటే రానున్న ఎన్నికల్లో సోషల్ మీడియా సమాచారాన్ని దుర్వినియోగం చేయడానికేనని కొంత మంది రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
‘సోషల్ హబ్’పై కేంద్రం వెనక్కి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలపై నిఘా కోసం తీసుకురావాలనుకున్న ‘సోషల్ మీడియా హబ్’పై కేంద్రం వెనక్కు తగ్గింది. సోషల్ మీడియా హబ్ ఏర్పాటుకు తాము జారీచేసిన నోటిఫికేషన్‌ను వెనక్కు తీసుకుంటామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ హబ్‌కు సంబంధించిన పాలసీని సమీక్షిస్తామని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్ కోర్టుకు విన్నవించారు. దీంతో కోర్టు సంబంధిత పిటిషన్‌ను కొట్టివేసేందుకు అంగీకరించింది. సోషల్ మీడియా, ఈ–మెయిల్స్‌లోని సమస్త సమాచారంపై నిఘా పెట్టేందుకు కావాల్సిన సాఫ్ట్వేర్ కోసం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఇటీవల రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్పీ)ను జారీచేసింది. దీన్ని సవాలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మహువా మొయిత్రా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణ సందర్భంగా ‘దేశాన్ని నిఘా రాజ్యంగా మార్చాలనుకుంటున్నారా?’ అని కేంద్రంపై కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ► రాజ్యాంగపరంగా ప్రాధాన్యత ఉన్న అంశాలను కోర్టులు విచారించేటప్పుడు దాన్ని లైవ్ స్ట్రీమింగ్ లేదా రికార్డింగ్ చేసే విషయమై మార్గదర్శకాలను రూపొందించాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించింది. ► శారదా చిట్‌ఫంట్ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం భార్య, న్యాయవాది నళినిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల్ని కోర్టు ఆదేశించింది. శారదా కంపెనీ లా బోర్డు సమావేశాలకు హాజరైన నళిని ఫీజుగా రూ.కోటి అందుకున్నారని ఆరోపిస్తున్న ఈడీ అధికారులు ఆమెకు సమన్లు జారీచేయడం తెల్సిందే. ► దేశంలో సిజేరియన్ ఆపరేషన్లు చేపట్టడంపై మార్గదర్శకాలు జారీచేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిల్‌ను న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడంగా అభివర్ణించిన కోర్టు.. పిటిషనర్‌కు రూ.25,000 జరిమానా విధించింది. దీన్ని నాలుగు వారాల్లోగా సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. -
రైల్వే ఫుడ్డు.. ఇక వెరీగుడ్డు!
సాక్షి, హైదరాబాద్: రైల్వే ఆహారం అంటేనే చాలా మందికి దడ పుడుతుంది. అపరిశుభ్ర వాతావరణంలో, రుచీపచీ లేకుండా, కనీసం చూడడానికీ బాగోలేని ఆహారం గుర్తుకొస్తుంది. కానీ ఇక ముందు పరిశుభ్ర పరిస్థితులలో వండిన నాణ్యత, రుచి ఉన్న మంచి ఆహారం అందించే దిశగా ఐఆర్సీటీసీ సరికొత్త చర్యలు చేపడుతోంది. రైల్వే క్యాంటీన్లలో పరిస్థితి, సిబ్బంది పనితీరు, ఆహార పదార్థాల తయారీ, నాణ్యతా ప్రమాణాలపై నిఘా పెట్టేందుకు ‘వోబోట్’అనే కృత్రిమ మేధస్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది. రైల్వే క్యాంటీన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. అవి రికార్డు చేసిన సమాచారాన్ని ‘వోబోట్’తో విశ్లేషించడం ద్వారా లోపాలను సరిదిద్దనుంది. ఈ సరికొత్త టెక్నాలజీని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలుత సికింద్రాబాద్, రేణిగుంట, గుంతకల్ రైల్వేస్టేషన్లలో ఉన్న ఐఆర్సీటీసీ క్యాంటీన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేయనున్న అతిపెద్ద బేస్ కిచెన్‌లోనూ ‘వోబోట్’నిఘా పెట్టనున్నారు. ఎక్కడ చూసినా అపరిశుభ్రతే.. దక్షిణ మధ్య రైల్వేలో వివిధ ప్రాంతాల మధ్య రోజూ 10 లక్షల మందికిపైగా రాకపోకలు సాగిస్తారు. సుమారు 800 రైళ్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తుంటాయి. అన్ని ప్రధాన రైళ్లలో ఆహార పదార్థాలను అందజేసేందుకు ప్యాంట్రీ కార్లను ఏర్పాటు చేశారు. స్టేషన్లలో రెస్టారెంట్లు, క్యాంటీన్లు ఉన్నాయి. ప్రధాన రైల్వేస్టేషన్లలో ఐఆర్సీటీసీ కేటరింగ్ సంస్థలు, హోటళ్లు ఆహార పదార్ధాలను అందజేస్తున్నాయి. అయితే ప్యాంట్రీ కార్లు, క్యాంటీన్లలో అపరిశుభ్రత తాండవిస్తుంటుంది. దీనికితోడు చెత్తాచెదారం, ఆహార పదార్థాలను తయారు చేసేటప్పుడు, ప్రయాణికులకు అందజేసేటప్పుడు సిబ్బంది యూనిఫామ్ ధరించకపోవడం, చేతులకు గ్లౌజులు వంటి లేకుండానే పనులు చేయడం, తలపై టోపీ ధరించకపోవడం వంటివాటిపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు మరోవైపు ఆహార పదార్థాల ధరలు ఎక్కువ, పరిమాణం తక్కువ. వంద గ్రాముల ఇడ్లీ ధర రూ.28. కానీ పరిమాణం 80 గ్రాములే ఉంటుంది. 250 గ్రాముల పెసరట్టు ధర రూ.55 వరకు ఉంటుంది. కానీ ప్రయాణికుడి చేతికి ఇచ్చేది 200 గ్రాములే. ఇక పూర్తిగా చల్లారిపోయిన ఆహార పదార్థాలను సరఫరా చేయడం, వాటర్ బాటిళ్లపైన కూలింగ్ చార్జీల పేరుతో అధికంగా డబ్బులు వసూలు చేయడంపైనా ప్రయాణికులు తరచుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటికి సంబంధించి ఏటా 2 వేలకుపైగా ఫిర్యాదులు అందుతున్నాయి. గతేడాది కంప్ట్రోలర్ ఆడిటర్ నివేదిక సైతం ఈ అంశాలను ఎత్తి చూపింది. దీంతో రైల్వేలో చలనం మొదలైంది. ఐఆర్సీటీసీ కిచెన్లలోనే నిఘాను కట్టుదిట్టడం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఫలితాల ఆధారంగా విస్తరణ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోని తొలి ప్లాట్‌ఫామ్ పైఅంతస్థులో ఉన్న సాధారణ కిచెన్‌లో మొదట ‘వోబోట్’పరిజ్ఞానాన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఈ కిచెన్ ద్వారా రోజూ 10 వేల నుంచి 15 వేల మంది ప్రయాణికులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రివేళల్లో భోజనాలు అందజేస్తున్నారు. ఈ కిచెన్‌లో ‘వోబోట్’ను ఏర్పాటు చేశాక వచ్చే ఫలితాలను అనుసరించి.. ఇదే స్టేషన్‌లోని 10వ నంబర్ ప్లాట్‌ఫామ్ వైపు నిర్మించతలపెట్టిన బేస్ కిచెన్‌లో పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. ఆ బేస్ కిచెన్ ద్వారా రోజూ సుమారు 80 ప్రధాన రైళ్లలో రాకపోకలు సాగించే 1.5 లక్షల మంది ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆహార పదార్థాలను తయారు చేసి సరఫరా చేయనున్నారు. ఇక రేణిగుంట, గుంతకల్ స్టేషన్లలోనూ ఇదే తరహాలో అమలు చేస్తారు. ‘వోబోట్’తో నిఘా ఇలా.. ‘వోబోట్’అనేది కృత్రిమ మేధో పరిజ్ఞానం. ఐఆర్సీటీసీ కిచెన్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా వచ్చే వీడియో దృశ్యాలను ఈ సాంకేతిక పరిజ్ఞానం ఆటోమేటిగ్గా విశ్లేషిస్తుంది. కిచెన్‌లో ఎక్కడెక్కడ చెత్త చెదారం, దుమ్ము, ధూళీ ఉన్నదీ గుర్తిస్తుంది. వంటపాత్రలు, ప్రయాణికులకు ఆహార పదార్థాలను అందజేసే ప్లేట్లు పరిశుభ్రంగా ఉన్నదీ లేనిదీ పరిశీలిస్తుంది. అలాగే సిబ్బంది పనితీరును, కదలికలను, అనధికార వ్యక్తుల కదలికలను విశ్లేషిస్తుంది. సిబ్బంది యూనిఫామ్ వేసుకోకపోయినా, గ్లౌజులు ధరించకపోయినా వెంటనే పసిగడుతుంది. ఈ అంశాలన్నింటినీ నివేదికగా అందజేస్తుంది. మొత్తంగా ఆహార పదార్థాలను తయారు చేయడం నుంచి ప్రయాణికులకు అం దజేయడం వరకు సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ఈ కృత్రిమ మేధో పరిజ్ఞానం దోహదం చేస్తుంది. దీని ద్వారా వచ్చే నివేదికల ఆధారంగా సిబ్బందిని వెంటనే విధుల నుంచి తప్పించి క్రమశిక్షణా చర్యలు చేపడుతారు. కాంట్రాక్టర్లను తొలగిస్తారు. -
ష్.. మీరు మా నిఘాలో ఉన్నారు..!
సామాజిక మాధ్యమాల్లోని డేటా లీక్ వ్యవహారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సోషల్ మీడియా యూజర్ల వ్యక్తిగత సమాచారం ఎంత సేఫ్‌గా ఉందనే ప్రశ్నలు హడలెత్తిస్తున్న పరిస్థితుల్లో అగ్నికిఆజ్యం పోసినట్లుగా నేనేమన్నా తక్కువనా అన్నట్లు గూగుల్ తోడయింది. మనం ప్రతీ చిన్న విషయానికి ఆధారపడే ‘గూగుల్’ కూడా మన ప్రతి కదలికను డేగ కన్నుతో పర్యవేక్షిస్తున్నట్టు, మనకు సంబంధించిన ప్రతీ అంశాన్ని భద్రపరుస్తున్నట్టు వెల్లడైంది. ఆయా సందర్భాలు, యాప్‌లను ఉపయోగించినపుడు, మనం రోజూ మొబైల్లో లేదా కంప్యూటర్లో నిర్వహించే కార్యకలాపాలు, ఇలా అన్ని విషయాలు గూగుల్, ఫేస్బుక్, యూ ట్యూబ్లలో రికార్డవుతున్నట్టు తేలింది. అంతా గూగుల్ కనుసన్నల్లోనే... మీరు మీ మొబైల్ ఫోన్‌ను తెరిచిన ప్రతీసారి మీరెక్కడ ఉన్నారో తెలిసిపోతుంది! మీ ఫోన్లో గూగుల్ యాప్‌ను ఉపయోగించడం మొదలుపెట్టిన తొలిరోజు నుంచి ఇప్పటివరకు ఎక్కడెక్కడికి వెళ్లారో తేదీలతో సహా ‘టైమ్‌లైన్’లో రికార్డయి ఉంటుంది. గూగుల్‌లో సెర్చ్ చేసిన ప్రతీ అంశం.. హిస్టరీ సహా ఫోన్ డేటా హిస్టరీని తొలగించినా (డిలీట్) ,ఒకవేళ పాతఫోన్ మార్చినా, ఆ తర్వాత మరిన్ని ఫోన్లు మార్చినా ఆ సమాచారమంతా కూడా సేవ్ అయ్యే ఉంటుంది. యూట్యూబ్‌లో ఏమేమీ వీక్షించారు ? మీరు ఎలాంటి వారు ? మీరు ప్రగతిశీలురా కాదా ? ఏ మతానికి చెందినవారు ?త్వరలోనే తండ్రి లేదా తల్లి కాబోతున్నారా ? యూట్యూబ్‌లో చూసిన వీడియోలు, కంటెంట్ హిస్టరీతో పాటు ఈ వివరాలన్నీ కూడా గూగుల్ వద్ద నిక్షిప్తమై ఉంటాయి. ఇలా మీకు సంబంధించిన పూర్తి సమాచారమంతా మీకు తెలియకుండానే గూగుల్ వద్ద గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్న విషయం మీకు తెలుసా..? మీకు సంబంధించిన సమాచారం (ఎక్కడున్నారు, స్త్రీ/పురుషుడు, వయసు, హాబీలు, ఎలాంటి కెరీర్లో ఉన్నారు, వివాహితులా/ సింగిలా, బరువెంత, ఆదాయమెంత)తో అడ్వర్టయిజ్మెంట్ ప్రొఫైల్ కూడా గూగుల్ వద్ద ఉంటుంది. అంతేకాదు మీరు ఏయే యాప్‌లను, ఎప్పుడెప్పుడు, ఎందుకు ఉపయోగిస్తున్నారో, వాటి ద్వారా ఏయే దేశాలకు చెందినవారితో సంభాషిస్తున్నారో, ఏ టైమ్‌లో నిద్రపోతున్నారన్నది కూడా గూగుల్‌కు తెలుసు. గూగుల్ ఫిట్ యాప్ ద్వారా మీరెన్ని అడుగులు వేసారు, ఏ సమయంలో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్లారు. యోగాతో పాటు ఎలాంటి ధ్యానం, వ్యాయామ పద్ధతులు పాటిస్తారో తెలిసిపోతుంది. మీ ఫోన్లో తీసిన ఫోటోల రికార్డంతా కూడా ఉంటుంది. గూగుల్ సెర్చ్‌లో భాగంగా మీరు వెతికిన అంశాలు, చదివిన వ్యాసాలు వంటివన్నీ కూడా నమోదై ఉంటాయి. ఫేస్బుక్కవుతారు.. అత్యంత ప్రజాదరణ పొందిన సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో మీరు ఎక్కడి నుంచి ఏ టైమ్‌లో ఏ సాధనం (మొబైల్, లాప్టాప్, డెస్క్‌టాప్) ద్వారా లాగిన్ అయ్యారు (లాగిన్ అయిన ప్రతీసారి)...మీకు నచ్చిన విషయాలు అలవాట్లు...మిత్రులతో ఏయే అంశాలపై ఎక్కువగా మాట్లాడుతుంటారు ? మీ ఫేస్బుక్ అకౌంట్లో ఏయే అప్లికేషన్లను కనెక్ట్ చేసుకున్నారు ? మీ ఇష్టాయిష్టాలేమిటీ ? వంటి సమాచారం దొంతరలు, దొంతరలుగా ఫేస్బుక్లో స్టోర్ అయ్యి ఉంటాయి. మీకు సంబంధించిన డేటాను కలెక్ట్ చేయడమే కాకుండా మీరెక్కడున్నారో, మీరు ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్లను దేని కోసం ఉపయోగిస్తున్నారో కూడా తెలుసుకుంటారు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ వెబ్కామ్ను, మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేయగలరు. మీ కాంటాక్ట్స్ వివరాలు, మీ ఈమెయిళ్లు, మీ కేలండర్, కాల్‌డేటా హిస్టరీ, మీరు పంపించే, మీకు వచ్చే మెసేజ్‌లు, ఏ ఫైల్స్ డౌన్లోడ్ చేశారు, ఏ గేమ్‌లు ఆడతారు ? మీ ఫోటోలు, వీడియోలు, మీరు వినే సంగీతం, ఏయే రేడియోస్టేషన్లు వింటారు ? సెర్చ్ హిస్టరీ, బ్రౌజింగ్ హిస్టరీ ఇలా మొత్తం వివరాలన్నీ ఈ మాధ్యమాల గుప్పిట్లో బందీ అయ్యి ఉన్నాయి. మీ లాగిన్ లోకేషన్‌తో సహా మీ కంపెనీ సెల్‌ఫోన్ ఉపయోగిస్తారు, దాని నెంబర్‌తో పాటు మొబైల్ ఫోన్లో మీరెక్కడ ఉన్నది తెలియజేసే ‘లోకేషన్’ను ఆన్‌చేస్తే చాలు మీరెక్కడెక్కడికి వెళ్లింది గూగుల్‌లో స్టోర్ అయిపోతుంది. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఆశ్రమ పాఠశాలల్లో సీసీ నిఘా
ఉట్నూర్(ఖానాపూర్): ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలపై ప్రభుత్వం నిరంతరం నిఘా కోసం చర్యలు చేపట్టింది. ప్రతీ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. ఆశ్రమాల్లో జరిగే ప్రతీ సంఘటన.. విషయం క్షణాల్లో అధికారులకు తెలిసేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతీచోట ఆరు సీసీ కెమెరాలకు తగ్గకుండా ఏర్పాటు చేయడంతో పాటు ఇంటర్నెట్ లేదా వైఫై ద్వారా నేరుగా ఆయా జిల్లాల డీటీడీవో కార్యలయాలు, అక్కడి నుంచి నేరుగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యలయానికి అనుసంధానం చేసేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆశ్రమాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రక్రియ పూర్తి కాగానే ప్రత్యేక ఐపీల ద్వారా కార్యాలయాలు, అధికారులు స్మార్ట్ఫోన్లకు ప్రత్యక్షంగా వీక్షించేలా అనుసంధానం చేయనున్నారు. ఫలితంగా ఆశ్రమాల్లోని గిరిజన విద్యార్థులకు మేలు జరగనుంది. నిరంతరం సీసీ నిఘా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలో 127 ఆశ్రమ పాఠశాలల్లో 39,123 మంది, ఏడు వసతి గృహాల్లో 1254 మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం గిరిజన సంక్షేమశాఖ ద్వారా ఉచితంగా విద్య, భోజన, ఇతర మౌలిక వసతులు కల్పిస్తోంది. వీరందరికీ నిర్దేశిత మెనూ ప్రకారం పోషకాహారం అందిస్తూ వసతి సౌకర్యాలు క ల్పిస్తోంది. ఆశ్రమ పాఠశాలలపై పటిష్ట పర్యవేక్షణ ద్వారా గిరిజన విద్యార్థులకు మెరుగైన పోషకాహారం, విద్యనందించాలని ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖకు ఆదేశాలు జారీ చేయడంతో చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఒక్కో ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సం ఖ్యకు అనుగుణంగా ఆరుకు తగ్గకుండా సీసీ కెమెరాలు, డీవీఆర్, మానిటర్లను ఏర్పాటు చేస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశ్రమాల్లో ఇప్పటికే 40శాతం పాఠశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయినట్లు తెలిసింది. ఆశ్రమం ప్రధాన ద్వారం, సరుకుల గది, మైదానం, వరండాలు, చుట్టు పక్కల ప్రాంతాలు కవర్ అయ్యేలా ఏర్పాటు చేస్తూ కార్యాలయ గదిలో టీవీలకు అనుసంధానం చేయడం ద్వారా సిబ్బంది నిత్యం పర్యవేక్షణ చేసేలా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పాఠశాలపై నిరంతరం అధికారుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టింది. ఇంటర్నెట్ లేదా వైఫై సాయంతో ప్రత్యే క ఐపీల ద్వారా నేరుగా డీటీడీవో కార్యాలయానికి అక్క డి నుంచి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యాలయానికి అనుసంధానం చేయనున్నారు. అంతేకాకుండా అధికా రుల స్మార్ట్ఫోన్లలో ప్రత్యేక యాప్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించేలా గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. మహిళా సిబ్బంది హర్షం, బాలికలకు భరోసా.. ఆశ్రమ పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై ఆశ్రమాల్లో విధులు నిర్వహించే మహిళా సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాలికలకు గిరిజన సంక్షేమశాఖ పూర్తి స్థాయి భద్రత కల్పిస్తుందని బాలికల తల్లిదండ్రులు అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడా బాలికల ఆశ్రమ పాఠశాలల్లో బాలికలపై వేధింపులు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం నార్నూర్‌లోని బాలికల ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న విజయ్‌కుమార్ అనే ఉపాధ్యాయుడు గిరిజన బాలికలపై అసభ్యకరంగా వ్యవహరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆశ్రమాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుతో విధులు నిర్వహించే మహిళా సిబ్బందికి, బాలికల భద్రతకు భరోసా ఏర్పడనుంది. డుమ్మా సిబ్బందికి గుబులు.. గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలోని ఆశ్రమ పాఠశాలలు అంటేనే అక్రమాలకు నిలయమని ఎన్నో ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగా చా లా మంది సిబ్బంది ఆశ్రమాల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించడం కంటే హెచ్‌డబ్ల్యూవో (వార్డెన్)లుగా విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూ పిస్తుంటారు. ఇందుకోసం ఉన్నతా«ధికారులపై రాజకీయంగా, ఇతర రకాలుగా ఒత్తిడి తీసుకువచ్చి హెచ్‌డబ్ల్యూవోలుగా కొనసాగుతున్నవారు ఉన్నారు. చాలా చోట్ల విద్యార్థులకు పెట్టే మెనూలో కోత పెట్టి బి య్యం, ఇతర నిత్యావసర వస్తువులను పక్కదారి పట్టిస్తూ పలువురు సిబ్బంది అక్రమాలకు పాల్పడిన సం దర్భాలున్నాయి. అలాగే ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వహించే బోధన, బోధనేతర సిబ్బంది వంతులవారీగా ఆశ్రమాల్లో విధులు నిర్వహిస్తున్న సంఘటనలున్నాయి. జిల్లాలో ఓ ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహించే జూనియర్ అసిస్టెంట్ నెలల తరబడి వి ధులకు హాజరు కాకుండా రిజిష్టర్‌లో వేరే సిబ్బందితో తన సంతకం పెట్టిస్తూ సొంత పనులు చేసుకుంటున్నారనే ప్రచారం ఉంది. సిబ్బంది తరచూ ఆశ్రమాలకు ఎగనామం పెడుతూ సొంత వ్యాపారాలు, వ్యవసాయం లాంటి పనులు చేసుకుంటున్నారు. అధికా రులకు తెలిసిన పైరవీలు, రాజకీయ ఒత్తిడిల కారణంగా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రతీ ఆశ్రమ పాఠశాలలో సీసీ నిఘా ఏర్పాటు కావడంతో ఆశ్రమాల్లో చోటు చేసుకునే అక్రమాలకు అడ్డుకట్ట పడడంతో విధులకు ఎగనామం పెట్టే సిబ్బంది క్రమం తప్పకుండా విధులకు హాజరు కావాల్సిన పరిస్థితులు ఏర్పడడంతో విద్యార్థులకు మేలు జరగనుంది. నిరంతర పర్యవేక్షణకు అవకాశం ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల విషయంలో మాకు ఎలాంటి సమాచారం లేదు. గిరిజన సంక్షేమ శాఖ కార్యాల యం నుంచి నేరుగా ఏర్పాటు చేస్తున్నారు. ఆశ్రమాల్లో సీసీల ఏర్పాటు ద్వారా పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణకు అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనంతో పాటు నాణ్యమైన విద్య అందనుంది. సీసీల నిఘాతో గిరిజన విద్యార్థులకు అన్ని రకాలుగా మేలు జరగనుంది. – పోషం, గిరిజన సంక్షేమశాఖ, డీటీడీవో, ఐటీడీఏ జిల్లాలవారీగా ఆశ్రమ పాఠశాలలు జిల్లా పేరు ఆశ్రమ, వసతి గృహాలు విద్యార్థులు ఆదిలాబాద్ 54 19,706 కుమురంభీం 46 12,327 మంచిర్యాల 17 3,359 నిర్మల్ 17 4,940 -
మాయమవుతున్న మన చరిత్ర
మహానగర చరిత్ర మాయమవుతోంది. చారిత్రక కట్టడాలు ఒక్కొక్కటిగా మట్టిలో కలిసిపోతున్నాయి. నగరం నడిబొడ్డున నిజాం కాలంలో నిఘా కేంద్రంగా సేవలందించిన ఎత్తయిన కట్టడం శిథిలావస్థలో ఉంది. 1850లో నిజాం సైన్యాధిపతి టిప్పుఖాన్శత్రువుల కదలికలను గుర్తించేందుకు దీనిని నిర్మించారు. ‘టిప్పు వాచ్ టవర్’, ‘సిటీ లుక్ ఔట్’గా ప్రసిద్ధి చెందిన ఈ చారిత్రక కట్టడం ఇప్పుడు ధ్వంసమవుతోంది. మల్టీప్లెక్స్ నిర్మాణాల కోసం చరిత్రను ఖతం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని చరిత్ర సంపదను కాపాడాలని చరిత్రకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సిటీ లుక్ ఔట్’ కట్టడంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, సిటీబ్యూరో :నిజాం కాలంలో సైన్యాధిపతిగా పనిచేసిన టిప్పుఖాన్ ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మించాడు. ఆయన తండ్రి నిజాం సైన్యంలో పనిచేసేవాడు. దీంతో టిప్పుఖాన్ యుద్ధ విద్యల్లో నైపుణ్యం పొంది సైన్యంలో చేరాడు. అనతి కాలంలోనే సైన్యాధిపతిగా ఎదిగాడు. నిజాం పాలకులకు దగ్గరయ్యాడు. నగర సంరక్షణ నిమిత్తం ప్రహరీనిర్మాణం, నిఘా కేంద్రం ఏర్పాటు బాధ్యతలను నిజాం టిప్పుఖాన్కు అప్పగించాడు. ఎత్తయిన ప్రదేశంలో నిఘా కేంద్రం ఏర్పాటు చేయాలని భావించిన టిప్పుఖాన్.. ప్రస్తుతలక్డీకాపూల్లోని ఎత్తయిన కొండపైదీనిని నిర్మించాడు. నగరంపై నజర్... 1850లో 162 అడుగుల ఎత్తులో లక్డీకాపూల్‌లోని ఎత్తయిన కొండపై దీనిని నిర్మించాడు టిప్పుఖాన్. ఇక్కడి నుంచి చూస్తే గోల్కొండ ఫతేమైదాన్, హుస్సేన్‌సాగర్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాలన్నీ కనిపించేవి. ఇక్కడి నుంచే నగరంలో ఏం జరుగుతుందనేది? సైనికులు ఎప్పటికప్పుడు కనిపెడుతుండేవారు. శత్రువుల కదలికలు, సైనికుల శిక్షణ, ఇతర కార్యకలాపాలను నిశితంగా పరిశీలించేవారు. ఈ కట్టడం నాలుగు వైపులా గోడలకు మధ్యలో రంధ్రాలు ఉంటాయి. విధులు నిర్వర్తించే సైనికులు అందులో నుంచి బైనాక్యూలర్లతో నగరంపై నజర్ పెట్టేవారు. ఈ ప్రదేశం నుంచి చూస్తే సిటీ మొత్తం మన కళ్లకు కడుతుంది. అందుకే ఇది ‘టిప్పుఖాన్ వాచ్ టవర్’, ‘సిటీ లుక్ ఔట్’గా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికే మెట్ల తొలగింపు... ఇంతటి ఘన చరిత్ర ఉన్న ‘సిటీ లుక్ ఔట్’ కట్టడం ఇప్పుడు ధ్వంసమవుతోంది. టవర్ పైకి వెళ్లేందుకు ఉన్న మెట్లను ఇప్పటికే తొలగించారు. ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న భవనాలే ఇందుకు కారణమవుతున్నాయి. కూల్చివేతలకు రంగం సిద్ధమైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అభివృద్ధి ముసుగులో చారిత్రక కట్టడం అంతర్థానం అవుతున్నా... అధికారులు ఆవైపు వెళ్లడం లేదు. ఇలాంటి చారిత్రక కట్టడాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చరిత్రకారులు, నిపుణులు కోరుతున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలను ఈ టవర్ నుంచి చూసే వీలుందని, దీనికి మరమ్మతులు చేసి అభివృద్ధి చేస్తే టూరిజం కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పరిరక్షించాలి... చారిత్రక కట్టాడాలు రాన్రాను కనుమరుగైపోతున్నాయి. నగరంలో ప్రతి కదలికలపై నజర్ పెట్టేందుకు టిప్పుఖాన్ ఈ సిటీ లుక్ ఔట్ నిర్మించాడు. ఇక్కడ ఓవైపు గుట్ట మొత్తం ధ్వంసమైంది. టవర్‌పై ఎక్కడానికి మార్గం లేకుండా పోయింది. ప్రభుత్వం చొరవ తీసుకొని టవర్ చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేసి, టవర్ పైకి ఎక్కేందుకు మార్గం ఏర్పాటు చేస్తే పర్యాటక ప్రదేశంగా మారుతుంది. అదే విధంగా ఎంతో విలువైన ఈ చారిత్రక కట్టడం రాబోయో తరాలకు జ్ఞాపకంగా మిగులుతుంది. – అనురాధారెడ్డి,ఇన్టాక్ సంస్థ రాష్ట్ర కో–కన్వీనర్ -
నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా
నార్నూర్ : నేరాల నియంత్రణకు పోలిసు శాఖ అద్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటుతో పాటు ప్రధాన కూడలిలో సీసీ కెమోరాలు ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉట్నూర్ డీఎస్పీ వెంకటేశ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక పోలిస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. డివిజన్లోని అన్ని పోలీస్టేషన్ పరిధిలో ప్రధాన పట్టణంతో పాటు కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఏజెన్సీలో ప్రశాంత వాతావరణం ఉందని చెప్పారు. కొన్ని సమస్యలు చర్చల ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని ఎక్కడైనా ఎలాంటి అనుమానం ఉన్న గొడవలు జరిగినా నేరుగా పోలిస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు.ఆయన వెంట ఎస్ఐ కృష్ణకుమార్ తదితరులు ఉన్నారు. -
నిషేధిత కల్లుకు కళ్లెం
గద్వాల క్రైం : నిషేధిత కల్లు తయారీ.. విక్రయాలపై పోలీసు, ఎక్సైజ్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టింది. అయితే నిషేధిత కల్లును కొందరు గుట్టుగా అధికారుల కళ్లు గప్పి రైలుమార్గాల ద్వారా గద్వాలకు చేరుస్తున్నారు. ఇక రైల్వే పోలీసుల తనిఖీల్లో నిత్యం నిషేధిత కల్లును పలువురు తీసుకెళ్తున్న తరుణంలో నిఘా ఉంచి నిందితుల నుంచి వందలాది లీటర్ల నిషేధిత కల్లును స్వాధీనం చేసుకుంటున్నారు. గద్వాల మండల కేంద్రంలోని నిషేధిత కల్లు తయారీ, విక్రయాలపై పోలీసు, ఎక్సైజ్ శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంది. దొడ్డిదారిన వనపర్తి నుంచి.. ఇటీవల గద్వాలకు చెందిన కొందరు రైలు మార్గాల ద్వారా నిషేధిత కల్లును దొడ్డిదారిన వనపర్తి జిల్లా నుంచి గద్వాలకు తీసుకొస్తున్నారు. ఇలా తీసుకొచ్చిన ని షేధిత కల్లును రహస్యంగా కల్లు ప్రియులకు విక్రయిస్తున్నారనే సమాచారం అధికారులకు తెలిసింది. దీంతో ఎక్సైజ్ అధికారులు రైల్వే పోలీసులను అప్రమత్తం చేయడంతో నిత్యం రైల్వే అ ధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీల్లో 20 రోజుల్లోనే 1,000 లీటర్ల నిషేధిత కల్లును స్వాధీనం చేసుకొని 15 మందిపై కేసులు నమోదు చేసి ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. రైలు మార్గంలో ఎందుకంటే.. గద్వాలో నిషేధిత కల్లు తయారీ, విక్రయాలు చేస్తే అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో నిషేధిత కల్లుకు అలవాటు పడిన కల్లు ప్రియులు కల్లు దొరక్కపోవడంతో వనపర్తి జిల్లాకు వెళ్తున్నారు. ఇది అదునుగా భావించిన కొందరు అక్కడి నుంచి ఇక్కడకు తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తే లాభం వస్తుందనే దురాలోచనతో రైలు మార్గం ద్వారా గుట్టుగా తీసుకొస్తున్నారు. అందులోనూ రైలు మార్గం ద్వారా తీసుకురవాడం సులువుగా ఉండటం. అధికారులు పెద్దగా దృష్టి సారించరనే నేపంతో రైలు మార్గం ఎంచుకున్నారనే విమర్శలు నెలకొన్నాయి. నిషేధిత కల్లు విక్రయాలపై నిఘా.. నిషేధిత కల్లు తాగడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభవం చూపుతుంది. పలు ఆరోగ్య సమస్యలు, మత్తు కలిగించే క్లోరల హైడ్రేట్, ఆల్ఫాజోం తదితర పదార్థాలతో తయారు చేసిన కల్లు తాగడంతో మత్తుకు బానిసగా మరి మానసికంగా కుంగిపోతారు. నిషేధిత కల్లు దొరకని సమయంలో పిచ్చిగా కేకలు వేయడం ఇతరత్ర భయాందోళనకు దారి తీస్తారు. ప్రభుత్వం కల్తీ కల్లు తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపింది. నిషేధిత కల్లు ఎవరైనా రహస్యంగా తీసుకొస్తున్నట్లు తెలిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. నిషేధిత కల్లును విక్రయించినా, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చినా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – గోపాల్ గద్వాల ఎక్సైజ్ సీఐ -
శాటిలైట్ నిఘా
ఏటూరునాగారం: ‘పనిచేయని సీసీ కెమెరాలు.. ఇంటర్నెట్ సేవల్లో ఇబ్బందులు.. ట్రాఫిక్ జామ్ జరిగినా అటువైపు చూడని పోలీసులు..’లాంటి విమర్శలు తలెత్తకుండా ఉండేందుకు పోలీస్ యంత్రాంగం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు సిద్ధమైంది. ఇంటర్నెట్తో సంబంధం లేకుండా.. కెమెరాలు లేని ప్రాంతాల్లోని దృశ్యాలను సైతం ఎప్పటికప్పుడు వీక్షించేందుకు శాటిలైట్ టెక్నాలజీని ఈ జాతరలో ఉపయోగించబోతున్నారు. సీసీ కెమెరాలు లేకపోయినా మేడారం పరిసర ప్రాంతాల్లో జరిగే తోపులాటలు.. ట్రాఫిక్‌జామ్‌లు.. పోలీసులకు క్షణాల్లో తెలిసిపోనున్నాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారంలో సహాయక చర్యలు చేపట్టేందుకు పోలీస్ యంత్రాంగం ఇప్పటికే రంగంలోకి దిగింది. డీఎస్పీ, సీఐ, ఎస్సై స్థాయి అధికారులు మేడారానికి చుట్టూ 50 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల మధ్యలోని ప్రాంతాలను జియోటాగింగ్ చేస్తున్నారు. మేడారం గద్దెల ప్రాంతంతోపాటు జాతర పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునే డెన్లు, పోలీసు మంచెలు, ఔట్‌పోస్టులు, మూలమలుపులు, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ రద్దీ అయ్యే ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, చిలకలగుట్ట, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్, చింతల క్రాస్, బయ్యక్కపేట ప్రధాన రహదారి, కన్నెపల్లి సారమ్మల ఆలయం, కొండాయి గోవిందరాజుల పరిసర ప్రాంతాలను జియోటాగింగ్ చేస్తున్నారు. జియోట్యాగింగ్ ఇలా.. ముందుగా జియోట్యాగింగ్ చేయాలనుకున్న ప్రాంతం ఫొటో తీసి.. పేరు పెట్టి శాటిలైట్‌కు ట్యాగ్ చేస్తారు. దీనివల్ల ఆ ప్రాంతం పేరు ఎంటర్ చేయగానే ఆ ఫొటోతోపాటు అక్కడ ఉన్న పరిస్థితిని ప్రత్యక్ష ప్రసారంలో చూపిస్తుంది. శాటిలైట్‌కు జియోట్యాగింగ్ అనుసంధానం చేయడం వల్ల అనుక్షణం ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా ఆన్లైన్లో వీక్షించే అవకాశం ఉంది. అక్కడ ఏదైనా అనుకోని సంఘటన జరిగితే అధికారులకు, పోలీసులకు సమాచారం అందుతుంది. అంతేగాక సెల్ సిగ్నల్స్ లేకున్నా శాటిలైట్‌తో అనుసంధానం చేసుకొని సమాచారం చేరవేసుకునేందుకు ఈ సమాచార వ్యవస్థ పనిచేయనుంది. పోలీసులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా క్షణాల మీద సమాచారం అందడంతో సహాయక చర్యలు తీసుకోవడం సులభతరం కానుంది. -
నిఘా నీడలో శాతవాహన
శాతవాహన యూనివర్సిటీ(కరీంనగర్): కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ వద్ద సోమవారం చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచే పోలీసు బలగాలు వర్సిటీ పరిసరాల్లో నిఘా పెంచాయి. సోమవారం రాత్రి హాస్టళ్లను ఖాళీ చేయించారు. మంగళవారం వర్సిటీ పరిసర ప్రాంతాల్లో పోలీసు బలగాలను కొనసాగించారు. వర్సిటీలో భవనాలు, బాలుర, బాలికల వసతిగృహాలు, కళాశాలలను పోలీసులు తనిఖీచేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా అడుగడుగునా గాలించారు. వర్సిటీకి వచ్చిన వారిని పోలీసులు, యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకొని వివరాలు అడిగి లోపలికి అనుమతించారు. రిజిస్ట్రార్ కార్యాలయం, పరిపాలన విభాగం మంగళవారం సెలవు దినమైనప్పటికి ఒకరిద్దరు సిబ్బంది విధులు నిర్వహించారు. ఉదయం నుంచే ఉస్మానియా, కాకతీయతో పాటు వివిధ వర్సిటీల నుంచి విద్యార్థి సంఘాల నాయ కులు వస్తున్నారని ప్రచారం జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారమే విద్యార్థులు ఖాళీ చేసి వెళ్ళిపోవడంతో వర్సిటీ నిర్మానుష్యంగా మారింది. మంగళవారం వర్సిటీ రిజిస్ట్రార్ ఎం.కోమల్‌రెడ్డి వర్సిటీకి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థి సంఘాలతో సీపీ సమావేశం కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి అన్ని విద్యార్థి సంఘాల ప్రతినిధులతో కమిషనరేట్‌లో మూడు గంటల పాటు సమావేశమయ్యారు. విద్యార్థి సంఘాల మధ్య సైద్ధాంతిక విభేదాలున్నా కక్ష పూరితంగా కాకుండా మంచి వాతావరణంలో తమ భావాలను వెల్లడించాలని కోరారు. వాట్సాఫ్, ఫేస్‌బుక్‌లలో అనవసరమైన పోస్టింగ్‌లు చేస్తూ శాంతియుత వాతావరణానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని సూచించారు. విద్యాసంస్థల యాజమాన్యాలను బెదిరించి చందాల వసూళ్ళకు పాల్పడితే కఠిన చర్యలుంటాయన్నారు. సోమవారం వర్సిటీ ఘటనలో పాల్గొన్న విద్యార్థి సంఘాలపై నాన్ బెయిల్ కేసులు నమోదు చేసే అవకాశమున్నా.. వారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నోటీసులు మాత్రమే ఇచ్చామని, మున్ముందు వారి తీరు మార్చుకోకపోతే కేసులు నమోదు చేస్తామన్నారు. బుధవారం నిర్వహించే బంద్‌ను విరమించుకో వాలని కోరారు. అందుకు విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకే చేస్తున్నామని, శాంతియుతంగా జరుపుతామని వామపక్ష, బహుజన విద్యార్థిసంఘాల నేతలు సీపీకి వివరించారు. -
సారీ.. నానమ్మా!
ఒక వయసొచ్చాక తక్కువ వినపడుతుంది. వినపడినదంతా ఎక్కువగా అనిపిస్తుంది.పెద్దలతో మాట్లాడుతున్నప్పుడుమనం చాలా జాగ్రత్తగా ఉండాలి.ప్రతిరోజూ లేచినప్పటినుంచి నిద్రపోయేదాకా‘నా వల్ల ఈ కుటుంబానికి ఎంత కష్టం?’అనుకుంటూనే జీవిస్తుంటారు.ఒక్క మాట చాలు. దుఃఖంలో కూరుకుపోవడానికి.పిల్లలకు నేర్పించండి ఇంట్లోని పెద్దలను గౌరవించమని!నేడు బాలల దినోత్సవం సందర్భంగా ఒక నానమ్మ కథ! ట్యాంక్‌బండ్ మీద విగ్రహాలు మాటా పలుకూ లేకుండా ఉన్నాయి. రాత్రి చీకటి నిస్సహాయంగా ఉంది.అలలు గాఢతను నింపుకుని తమ మీదకు వచ్చే దేనినైనా దూరం నెట్టేద్దామా అని సమాయత్తమవుతూ ఉన్నాయి. ఆ ముసలామె రెయిలింగ్ దగ్గర నిలుచుని ఉంది. సాయంత్రం అయిదింటికి ట్యాంక్‌బండ్ మీద ఆటోలో దిగిందామె. ఒక్కోవిగ్రహం దగ్గరా కాసేపు కాసేపు కూర్చుంటూ ఇప్పుడు రోడ్డు దాటి రెయిలింగ్ దగ్గర నిలుచుంది. దూరంగా మసక నింపుకున్న బుద్ధుని చిర్నవ్వు. శరణు జొచ్చడానికి తీరిక ఇవ్వని సమాజం ఆ అర్ధరాత్రి అప్పుడొక వాహనం అప్పుడొక వాహనంగా దూసుకొని పోతోంది. ఆ రెయిలింగ్ ఎక్కి నీళ్లలోకి ఎలా దూకాలో ఆ ముసలామెకు అర్థం కాలేదు. అరవై అయిదేళ్ల వయసులో అలాంటి పని చేయాల్సి వస్తుందని ఊహించనుకూడా ఊహించలేదు. ముడతలు పడ్డ చేతి చర్మం రెయింగ్ను పట్టుకున్న మణికట్టు మీద సంశయాన్ని ప్రదర్శిస్తూ ఉంది. దాని మీద రాలాల్సిన కన్నీటి చుక్కలు గాలి అప్పుడే వీయగా శూన్యంలో లుప్తమైపోయాయి. ఒక్క నిమిషం ఆమె గట్టిగా గాలి పీల్చుకుంది. మెడలో ఉన్న తన పెళ్లినాటి బంగారు గొలుసు తీసి గట్టుమీద పడేసింది. రెయిలింగ్‌ను గట్టిగా పట్టుకొని కాళ్లను తేలిగ్గా చేసి నడుము వంచేస్తే దేహం దాని మానాన అది నీళ్లలో పడిపోతుందని నిర్ణయించుకుంది. రెయిలింగ్ గట్టిగా పట్టుకుంది. నడుము కొద్దిగా వొంచింది. పాదాలు తేలిక చేసి దేహాన్ని నీళ్లలో పడేస్తుండగా టక్కున ఎవరో పట్టుకుని ఆపేశాడు. స్పెషల్ పోలీస్.ఆత్మహత్యలు చేసుకునేవారి మీద నిఘా పెట్టే టీమ్‌లో ఒక సభ్యుడైన శివ.చాలా సేపటిగా ఆమెనే గమనిస్తున్నాడు.‘ఏమైందమ్మా?’ అడిగాడు.ఆమెకు కళ్లవెంట వెచ్చదనం ఉబికింది.‘ఊరుకో తల్లి. ఈ వయసులో ఏమిటి ఈ పని?’ఆమె ఊరికే ఉంది. అతడు ఆమె చేయి పట్టుకుని కొయ్యబల్ల మీద కూర్చోపెట్టాడు.‘కొడుకు ఏమైనా అన్నాడా?’ అడిగాడు.‘కోడలు ఏమైనా అన్నదా?’ అడిగాడు.ఆమె తల అడ్డంగా ఊపింది.‘మరి ఎవరు?’‘మనవడు’ చెప్పిందామె.‘మనవడా? వయసెంత?’ఆమె అతడివైపే చూస్తూ చెప్పింది.‘ప..ది... సం..వ..త్స..రా..లు’. ఒక పదేళ్ల పిల్లాడు ఒక ముసలామె ఆత్మహత్యకు ఎలా ప్రేరేపిస్తాడు? ‘బుజ్జీ... కాస్త నా స్లిప్పర్స్ ఎక్కడున్నాయో చూసి పెట్టవా నాన్నా’... బుజ్జి నుంచి సమాధానం లేదు. ‘బుజ్జీ... ఈ నానమ్మకు హెల్ప్ చేయరా కన్నా’ ‘నువ్వే వెతుక్కో పో’ ‘నువ్వు వెతకొచ్చుగా’ ‘ఏం... నువ్వు గుడ్డిదానివి కాలేదుగా. నువ్వు బ్లైండ్ అయిపో నేను వెతికి పెడతా’ఆమె మాట లేనట్టుగా ఉండిపోయింది.‘అమ్మ డిన్నర్‌కి పిలుస్తోంది’ పిలిచాడు బుజ్జి.ఆమె లేచింది.‘నీ కోసం స్పెషల్‌గా చపాతీ చేయలేదు. అన్నమే తిను. అయినా నీలాంటి ఓల్డ్ లేడీస్ ఏమీ తినరట కదా. నువ్వు మాత్రం ఫుల్‌గా తింటావు. నీకు వేరే పనేం లేదానానమ్మా’... ఆ రాత్రి ఆమె పస్తే పడుకుంది.‘నువ్వు ఎందుకు వేరే డాటర్స్నీ సన్నీ కనలేదు?’ ఒకరోజు అడిగాడు.ఆమె నీరసంగా నవ్వింది.‘నాకు మీ నాన్న ఒక్కడే పుట్టాడురా. వాడే లోకం అనుకున్నాను’‘ఇంకా చాలామందికి బర్త్ ఇచ్చి ఉంటే సరిపోయేదిగా. వాళ్ల దగ్గర ఉండేదానివి. ఎప్పుడూ ఇక్కడే పడి ఉంటావ్. మా ఫ్రెండ్స్ అశ్విన్, భువన్, ఆదేశ్ వాళ్ల ఇళ్లలో నీలా ఎవరూ ఉండరు తెలుసా? వాళ్ల మమ్మీ డాడీ ఎంతో హ్యాపీగా ఉంటారు’ఆమె వాడి వైపు చూసింది.దూరంగా కోడలు చిర్నవ్వుతో వాడి మాటలు వింటూ ఉంది. సాయంత్రం పార్క్‌లో కలిసిన కాలనీ ఆమెతో మాటామాటగా ఈ సంగతి చెప్పింది.‘పిల్లలు అలా మాట్లాడరు. ఎవరైనా మాట్లాడిస్తే తప్ప’ అందామె సానుభూతిగా.‘ఏం చేయను. నా మనసు ముక్కలవుతోంది’‘పిల్లలకు నేర్పాల్సింది తల్లిదండ్రులే. కాని వాళ్లను తమ పగ తీర్చుకోవడానికి సాధనంగా వాడుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. మీ కోడలికి మీరుండటం ఇష్టం లేదు. ఆ మాట తను నేరుగా చెప్పలేక మీ మనవణ్ణి ఆయుధంగా వాడుకుంటోంది. పాపం చిన్నపిల్లాడు. వాడికేం తెలుసు. తల్లి ఎలా చెబుతుంటే అలా చెబుతున్నాడు’‘కోడలు తిట్టినా ఇంత బాధ ఉండదు. కాని చిన్నపిల్లాడితో అంటే’... ఆమెకు ఏడుపు తన్నుకొచ్చింది. మనవడిని ఒడిలో కూర్చుపెట్టుకుని కథలు చెప్పాల్సిన వయసు. కాని ఆ మనవడే విలన్‌గా మారడం ఆమెను తినేస్తోంది.‘ఎందుకీ బతుకు? ఎక్కడైనా దూకి చస్తాను’ అనుకుందామె. పోలీసులు ఆమె కొడుకును, కోడలును, మనవణ్ణి స్టేషన్‌కు పిలిపించారు.సాయంత్రం నుంచి పెద్దావిడ కనిపించకపోయేసరికి వాళ్లు కంగారుగా వెతుక్కుంటున్నారు.తీరా ఈ సంగతి తెలిసేసరికి ఇద్దరూ హడలిపోయారు. కోడలు కంగారుపడిపోయింది.‘క్షమించండత్తయ్యా. ఏదో మిమ్మల్ని ఉడికించడానికి అంటున్నాడని ఊరుకున్నాను. మీరింత బాధపడతారని తెలియదు’ అంది నిజంగానే.‘అమ్మా... ఏంటిది.. చిన్నపిల్లాడు ఏదో అన్నాడని ఇలా చేస్తావా. నేను అనుంటే ఫీలవ్వాలి గానీ’ అన్నాడు కొడుకు.బుజ్జి ఇదంతా స్టన్ అయ్యి చూస్తున్నాడు.‘నానమ్మా.. నువ్వు చచ్చిపోతావా?’ అన్నాడు దగ్గరకొచ్చి చేతులు పట్టుకుని దీనంగా. ఆమె ఆ పసివాణ్ణి చుట్టుకుపోయింది.కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పిపోయింది.ఆ తర్వాత బుజ్జి ఆమెను ఏమీ అనలేదు.కొడుకు, కోడలు కూడా బుజ్జికి నానమ్మ ఎంత విలువైన మనిషో, కుటుంబానికి ఎంత పెద్దదిక్కో వివరించారు.ఆమెతో వాళ్లకు పేచీ ఉంటే లేదా ఆమెకు వాళ్లతో పేచీ ఉంటే ఆమెను ఏదైనా మంచి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో చేర్పిస్తారు తప్పితే ఆమె మనసు ముక్కలు చేయడానికి పిల్లలను మాత్రం ఆయుధంగా మార్చరు గాక మార్చరు. ఇది మాత్రం సత్యం. ఆచరిస్తే... అనుసరిస్తారు పెద్దలను గౌరవించే విధానాన్ని పిల్లలు తల్లిదండ్రుల దగ్గరనుంచే నేర్చుకుంటారు కాబట్టి తల్లిదండ్రులు తమ తల్లిదండ్రులతో గౌరవ మర్యాదలతో మెలిగితే, వీరిని చూసి పిల్లలు తమ తాత, నానమ్మలను గౌరవిస్తారు. ఇంటిలోని పెద్దవాళ్లు ఆస్తి వ్యవహారాలలో లేదా ఇతర విషయాలలో నచ్చకపోతేనో లేదా వారి వ్యవహార శైలి నచ్చకపోతేనో వారి గురించి పిల్లల ముందు కామెంట్ చేయకూడదు. తల్లిదండ్రులు ‘ముసల్ది, ముసలాడు, వాడు, అది...’ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అది తప్పకుండా పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. పెద్దవాళ్లకు అనారోగ్యం చేసినప్పుడు ఆ చికిత్సకు అయ్యే ఖర్చు గురించి తల్లిదండ్రులు తప్పుగా మాట్లాడితే అది కూడా పిల్లల పసి మనస్సులపై ముద్రపడుతుంది పెద్దవాళ్లకు పెట్టే ఖర్చు దండగ అని. పెద్దవాళ్లు తమను ఎలా పైకి తీసుకువచ్చారు... అందుకోసం వారు ఎంత కష్టపడ్డారు.. నైతిక విలువలు, ఇతర సంస్కృతీ సంప్రదాయాలు, మంచి అలవాట్లను నేర్పించేందుకు వారు ఎంతగా కృషి చేశారు... వంటి విషయాలను చెప్పుకుంటూ ఉండటం వల్ల తాత, నాయనమ్మ లేదా అమ్మమ్మ తాతయ్యలు మంచివాళ్లని అర్థమవుతుంది. తల్లిదండ్రులు పిల్లలను తాతానానమ్మల దగ్గర కూర్చుని, వారి చేత కథలు, ఇతర మంచి విషయాలు చెప్పించుకునేలా చేయాలి. అప్పుడు వారి మీద గౌరవాభిమానాలు కలుగుతాయి. ముందు మనం మన పెద్ద వాళ్లను గౌరవించాలి. అప్పుడు పిల్లలు మనల్ని అనుసరిస్తారు. డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ లూసిడ్ డయాగ్నస్టిక్స్ - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పోలీసింగ్.. @ టెక్నాలజీ
నిఘా మరింత పటిష్టం.. కమిషనరేట్ పరిధిలో నిఘా వ్యవస్థను మరింత పటిష్ట పరచాలని సీపీ గౌతం సవాంగ్ నిర్ణయించారు. ఇప్పటికే నగరంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పెరుగుతున్న జనాభా, నేరాల తీవ్రత దృష్ట్యా కొత్తగా 2వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగరంలోని ప్రధాన కూడళ్లను అనుసంధానించే రోడ్లు, విద్యాసంస్థలున్న ప్రాంతాలు, కాలనీలు, నగర శివారుప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. సాక్షి, అమరావతి బ్యూరో : భద్రత, నేరాల నియంత్రణకు నగర పోలీసు వ్యవస్థ ఆధునిక సాంకేతికతను మరింతగా అందిపుచ్చుకోనుంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో పోలీసింగ్‌ను పటిష్ట పరచాలని నిర్ణయించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ యూకేలో వారంరోజుల పర్యటనలో ఆధునిక పోలీసింగ్‌పై నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. హ్యాంప్‌షైర్‌లో నిర్వహించిన ‘యూకే సెక్యూరిటీ – పోలీసింగ్ ఎగ్జిబిషన్ 2017’కు హాజరయ్యారు. లండన్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అభివృద్ధి చెందిన దేశాలు నేర పరిశోధనకు ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించారు. ఆ పరిజ్ఞానాన్ని మన అవసరాలకు ఎలా మలచుకోవాలనే దానిపై పలువురు నిపుణులతో చర్చించారు. ఈ మేరకు విజయవాడ కమిషరేట్ పరిధిలో అమలు చేయనున్న ప్రతిపాదనలను ‘సాక్షి’కి ప్రత్యేకంగా వెల్లడించారు. ప్రధానంగా విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ స్థాయిని మరింతంగా పెంచడంతోపాటు నగరంలో నిఘాను పటిష్ట పరచాలని నిర్ణయించారు. సమాచార విశ్లేషణ వ్యవస్థ సమాచార విశ్లేషణ, నేర పరిశోధన దిశగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను తీర్చిదిద్దుతారు. ఇప్పటికే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేశారు. రెండో దశలో ప్రపంచస్థాయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలని పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ నిర్ణయించారు. సమాచార విశ్లేషణ, నేర పరిశోధన అనే రెండు విభాగాలుగా కమాండ్ కంట్రోల్‌ను తీర్చిదిద్దాలని నిర్ణయించారు. లండన్‌లో దాదాపు లక్ష కెమెరాలతో సేకరించిన సమాచారాన్ని విశ్లేషించే వ్యవస్థ ఉంది. ఆ స్థాయిలో కాకపోయినా కమిషనరేట్ పరిధిలోని వివిధ మాధ్యమాల ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించే వ్యవస్థను నెలకొల్పనున్నారు. ఆధునిక నెట్వర్క్ వ్యవస్థ ఏర్పాటు, నగరాన్ని గ్రిడ్లుగా విభజన, సమన్వయం ఇందులో ప్రధానమైనవి. అసాంఘిక శక్తుల కట్టడి ... నేర పరిశోధనకు ఉపకరించే రీతిలో కమాండ్ కంట్రోల్స్థాయిని పెంచనున్నారు. కమాండ్ కంట్రోల్లో ‘ఫేసియల్ రికగ్నైజేషన్’ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. రాజధానిగా రూపాంతరం చెందిన తరువాత నగరానికి రాకపోకల తాకిడి పెరిగింది. నిత్యం వేలమంది కొత్త వ్యక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పద వ్యక్తులపై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని గుర్తించారు. అందుకోసం ‘ఫేసియల్ రికగ్నైజేషన్’ పరిజ్ఞానాన్ని జోడించాలని నిర్ణయించారు. నగరంలోని సీసీ టీవీ ఫుటేజీల ద్వారా సంబంధిత వ్యక్తులు, వాహనాలను గుర్తించి డేటాను భద్రపరుస్తారు. ఆ వ్యక్తుల నేర చరిత్ర, ఇతర అంశాలన్నీ క్షణాల్లో విశ్లేషించి పోలీసులకు అందించగలదు. తద్వారా అసాంఘిక శక్తులపై గట్టి నిఘా పెట్టడం సాధ్యపడుతుంది. అంతే కాకుండా వాహనాల వేగం, నిర్ణీత ప్రదేశాల మధ్య ఎన్నిసార్లు తిరిగింది, గతంలో ఎన్నిసార్లు జరిమానాలు విధించారు అనే వివరాలను కూడా క్షణాల్లో తెలుసుకోవడం సాధ్యపడుతుంది. వాహనాల నెంబర్ ప్లేట్ ఆధారంగా మొత్తం సమాచారం అందుబాటులోకి వచ్చే వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానంగా వివిధ పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తారు. ఫోన్ కాల్ వచ్చిన వెంటనే సంబంధిత బృందాలు స్పందించి సంఘటనాస్థలానికి చేరుకోగలుగుతాయి. -
భారత్ కొత్త జెండాతో పాక్‌కు వణుకు!
అమృతసర్: భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లోని అటారీ సమీపంలో ఏర్పాటుచేసిన దేశంలోనే అత్యంత ఎత్తయిన భారత దేశ త్రివర్ణ పతాకాన్ని చూసి పాకిస్థాన్ భయపడుతోందట. ఆ జెండా ద్వారా భారత్ ఏమైనా నిఘా నిర్వహిస్తుందేమోనని పాక్ అనుమానిస్తోందట. ఈ మేరకు పాక్ భావిస్తున్నట్లు అక్కడి మీడియా చెబుతోంది. ఇప్పటి వరకు జార్ఖండ్ రాజధాని రాంచీలో 293 అడుగుల ఎత్తులో జాతీయ పతాకం ఉంది. అంతకంటే ఎత్తయిన పోల్, పెద్ద జెండా తెలంగాణలో ఎగురవేయాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు నెక్లెస్‌రోడ్డులో 300 అడుగుల ఎత్తున ఓ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కోల్‌కతాకు చెందిన స్కిప్పర్ కంపెనీ దీన్ని ఏర్పాటుచేసింది. ఇప్పుడు దానికంటే మరో 60 అడుగులు ఎక్కువ ఎత్తులో అమృతసర్‌లోని అటారీ సరిహద్ద వద్ద దాదాపు 360 అడుగుల ఎత్తులో కొత్త జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలోనే పాక్ ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ జెండాకోసం ఏర్పాటుచేసిన స్తంభం లాహోర్ నుంచి కూడా కనిపిస్తోందని, అందులో నిఘా కెమెరాలు పెట్టి తమ ప్రాంతంపై నిఘా ఏర్పాటుచేశారేమోనని పాక్ ఆందోళన వ్యక్తం చేస్తోందట. ఈ విషయాన్ని పాక్ రేంజర్లు కూడా ఇప్పటి వరకు కొట్టిపారేయలేదు. అయితే, ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని బీఎస్ఎఫ్ కొట్టిపారేసింది. అసలు నిఘా కెమెరాలే లేవని స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఒక ప్రత్యేక అనుమతి ద్వారా పంజాబ్ మంత్రి అనిల్ జోషి ఈ జెండాను ఆవిష్కరించారు. దాదాపు రూ.3.50కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. -
రాత్రంతా బుజ్జగింపులు..
► బెదిరింపులు ► 22 మందికి మరీ ప్రత్యేకం ► మన్నార్గుడి నీడలో ఎమ్మెల్యేలు సాక్షి, చెన్నై: మన్నార్గుడి ప్రైవేటు సెక్యూరిటీ నీడలో రాత్రంతా ఎమ్మెల్యేలు గడిపారు. 20 మంది ఎమ్మెల్యేలకు మరీ ప్రత్యేకంగా ఓ స్టార్ హోటల్లో బస కల్పించారు. ఎమ్మెల్యేలు తన గుప్పెట్లో నుంచి జారిపోకుండా పకడ్బందీ నిఘాతో చిన్నమ్మ శశికళ మద్దతుదారులు వ్యవహరించారు. పన్నీరు తిరుగుబాటుతో సీఎం కావాలన్న ఆశ ఆమడదూరంలో ఆగడంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ బలాన్ని చాటుకునేందుకు తీవ్ర ప్రయత్నాల్లో పడ్డారు. బుధవారం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం, ఎవ్వరూ జారిపోకుండా ముందస్తు జాగ్రత్తల్లో పడ్డారు. 131 మంది ఎమ్మెల్యేలు తమ వెంటేనని ప్రకటించుకున్న మేరకు కొద్ది రోజుల పాటు వారందర్నీ తమ ఆధీనంలోనే ఉంచుకునే విధంగా ప్రత్యేక క్యాంప్‌ను చిన్నమ్మ సేన సిద్ధం చేసింది. అన్నాడీఎంకే కార్యాలయం నుంచి నాలుగు ప్రత్యేక బస్సుల్లో వీరిని క్యాంప్‌నకు తరలించేందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. ఒక్కో ఎమ్మెల్యేకు ఒక్కో ప్రైవేటు సెక్యూరిటీ నియమించి మరీ క్యాంప్‌నకు తరలించడం గమనార్హం. మొత్తంగా వెయ్యి మంది సెక్యూరిటీని ఏకంగా తన స్వస్థలం మన్నార్గుడి నుంచి చిన్నమ్మ రంగంలోకి దించి ఉండడం ఆలోచించ దగ్గ విషయం. అన్నాడీఎంకే కార్యాలయం నుంచి ఓమందూరు ఎస్టేట్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు అందర్నీ తీసుకెళ్లారు. అక్కడ మూడు రోజులకు తగ్గ బట్టలను తీసుకున్న ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన బస్సుల్లో పయనం అయ్యారు. ఈసీఆర్ రోడ్డు వైపుగా దూసుకెళ్లిన బస్సులను పన్నెండు ప్రైవేటు భద్రతా వాహనాలు అనుసరించాయి. రాత్రి పదకొండున్నర గంటల సమయంలో కల్పాకం కూవత్తూరు గోల్డెన్ ఫైవ్ స్టార్ హోటల్ రిసార్ట్‌లోకి తొలుత రెండు బస్సులు, అర గంట వ్యవధిలో మరో రెండు బస్సులు ప్రవేశించాయి. బస్సుల్లో నుంచి దిగిన ఎమ్మెల్యేలందరి నుంచి ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది సెల్ఫోన్లను సైతం స్వాధీనం చేసుకున్నట్టు, కేవలం కుటుంబీకులతోమాత్రం మాట్లాడేందుకు అనుమతి ఇచ్చినట్టు సమాచారం. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ రిజిస్ట్రేషన్లతో ఉన్న బస్సుల్లో నుంచి దిగిన 22 మందిని మాత్రం ప్రత్యేకంగా ఓ చోట ఉంచి బుజ్జగింపులు, తదుపరి బెదిరింపులతో తమ వైపునకు తిప్పుకునేందుకు మన్నార్గుడి సెక్యూరిటీలో ఉన్న కొందరు తీవ్రంగానే ప్రయత్నాలు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆ రిసార్ట్ హోటల్ పరిసరాల్ని మన్నార్గుడి సెక్యూరిటీ తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కాసేపటికి సైరన్లు కల్గిన నాలుగు వాహనాల్లో 22 మంది ఎమ్మెల్యేలను కల్పాకం పూదండల్‌లోని విలేజ్ రిసార్ట్ హోటల్‌కు తీసుకెళ్లి మరీ వారిని బుజ్జగించినట్టు తెలిసింది. మిగిలిన ఎమ్మెల్యేల్ని ఒక చోట చేర్చి వారికి కావాల్సి విందు ఏర్పాటుతో పాటు, చిన్నమ్మను నమ్ముకుంటే అందరికీ లాభమేనని, లేకుంటే తీవ్రంగా , వ్యక్తిగతంగానూ నష్టపోతారన్నట్టు ఓ వ్యక్తి బెదిరించినట్టు సంకేతాలు వెలువడడంతో ఆ వ్యక్తి ఎవరన్న చర్చ బయలు దేరింది. శశికళకు మద్దతుగానే ఉంటామని, మెజారిటీ శాతం ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చినట్టు తెలిసింది. అయితే, ఆ 22 మంది ఏ మాత్రం తగ్గనట్టు, చివరకు చిన్నమ్మ సైతం వారితో ఫోన్లో మాట్లాడగా దిగి వచ్చినట్టు తెలిసింది. మన్నార్గుడి నుంచి వెయ్యి మంది ప్రైవేటు సెక్యూరిటీ ఆగమేఘాల మీద రంగంలోకి దిగి ఉండడం బట్టి చూస్తే, చిన్నమ్మ వెంట మన్నార్గుడి కుటుంబ సభ్యులు మళ్లీ రంగంలోకి దిగి ఉండొచ్చన్న ప్రశ్న బయలు దేరింది. కాగా, బెదిరింపులు, బుజ్జగింపులు, తాయిలాలకు తలొగ్గిన ప్రత్యేక శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు చివరి క్షణంలో ఇచ్చిన హామీని విస్మరించిన పక్షంలో చిన్నమ్మ సీఎం ఆశలన్నీ అడియాశలైనట్టే. -
నిమజ్జన యాత్ర మార్గాల్లో షీ టీంల నిఘా
వినాయక నిమజ్జన ఉత్సవాల్లో మహిళా భక్తులతో అనుచితంగా వ్యవహరించే వారిపై సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల షీ టీం సభ్యులు నిఘా వేయనున్నారు. ఈవ్ టీజింగ్...అసభ్య పదజాలంతో మాట్లాడుతూ కనిపించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తున్నారు. భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజించే బాలికలు, అమ్మాయిలు, యువతులు, మహిళలు ఆనందంతో కేరింతలు కొడుతూ...గణపతి బొప్పా మోరియా అంటూ నగర శివారు ప్రాంతాలైన సరూర్‌నగర్ ట్యాంక్, సఫీల్‌గూడ చెరువు, కాప్రా చెరువు, చర్లపల్లిలో కొత్తగా రెడీ చేస్తున్న చెరువుల్లో సందడి చేయడం అనవాయితీగా వస్తోంది. ఏటికేడు గణపతి విగ్రహాలతో వచ్చే మహిళ భక్తుల సంఖ్య పెరుగుతోంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని 100 మంది వరకు సిబ్బంది ఆకతాయిలపై కన్నేసి ఉంచుతారు. ఎక్కడా ఎవరైనా అమ్మాయిలను వేధిస్తున్నట్టు సమాచారం వచ్చినా, వీరి కంటపడినా అరెస్టు చేస్తారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ జోన్లతో పాటు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్, మల్కాజిగిరి జోన్లలోని నిమజ్జన యాత్ర మార్గాల్లో గస్తీ నిర్వహిస్తారు. బాధితులు 100కు కాల్ చేస్తే వెంటనే ఘటనాస్థలిలో వీరు వాలిపోయేలా ఏర్పాట్లు చేశారు. ‘మఫ్టీ’తో నిఘా... సందట్లో సండేమియా అన్నట్టు జనాల రద్దీని ఆసరాగా చేసుకుని దొంగలు రెచ్చిపోయే అవకాశముంది. సంప్రదాయ కుటుంబానికి చెందిన నగరవాసులు ఒంటి నిండా ఆభరణాలు ధరించి...శోభాయమానంగా గణపతి మండపాల నుంచి నిమజ్జనం ఘాట్ వరకు జరిగే నిమజ్జన యాత్రలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా కనబడతారు. ఇదే అదునుగా భావించి జనాల మధ్యలోనే దొంగలు తమ పనికానిచ్చే అవకాశముంది. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి దాదాపు 12కు పైగా ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశారు. వీరిలో కొందరు పోలీసు డ్రెస్సులోనే విధులు నిర్వహిస్తుండగా, మరికొందరు మఫ్టీలో నిఘా వేయనున్నారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ... కమిషనరేట్లలోని ముఖ్యకూడళ్ల నుంచి హుస్సేన్‌సాగర్ వరకు జరిగే వినాయక శోభాయాత్రను బలగాల పహారాతో పాటు నిఘా నేత్రాలతో నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా పూర్తి చేసేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గణేశ్ శోభ యాత్రను అధికారులు వీక్షిస్తూ ఎప్పటికప్పుడూ స్థానిక పోలీసు సిబ్బందికి మార్గనిర్దేశనం చేస్తారు. ఈ నిమజ్జన యాత్రల్లో లక్షలాది మంది భక్తుల పూజలతో వేలాది వినాయకులు తరలివస్తాయి. పోలీసులు జంక్షన్లలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలతో పాటు కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటుచేసిన నిఘా నేత్రాలతో ఆయా ప్రాంతాల్లో గణేశుడి నిమజ్జన ర్యాలీల పర్యవేక్షణ కోసం పోలీసులు ఉపయోగిస్తున్నారు. సీసీకెమెరా మౌంట్ వెహికల్లను, ఆశ్విక దళాలను ఇప్పటికే భద్రత కోసం వినియోగిస్తున్నారు. -
కేజీబీవీలపై ఇక నిరంతర నిఘా
కెమెరాల కొనుగోలుకు టెండర్లు ఎస్ఎస్ఏ కార్యాలయానికి అనుసంధానం ఖమ్మం : రెండు కేజీబీవీల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో సత్ఫలితాలు రావడంతో జిల్లాలోని అన్ని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగానే టెండర్లు కూడా పిలిచారు. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో ఆశించిన స్థాయి ఫలితాలు రావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున విడుదల చేసిన నిధులు పక్కదారి పడుతున్నాయని, విద్యార్థినులకు మెనూ అమలు చేయకుండా సరుకులు దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా పలు కేజీబీవీల్లో ఎస్ఓ, సీఆర్టీలు సక్రమంగా విధులకు హాజరు కావడంలేదని, విద్యార్థుల సంఖ్యను కూడా ఎక్కువగా చూపిస్తూ హాజరు నమోదు చేస్తున్నారనే విమర్శలతో పలువురు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారమంతా అ«ధికారులు పర్యవేక్షించడం, తనిఖీలకు వెళ్లినప్పుడు అంతా సర్దుకొని తర్వాత షరా మామూలుగానే ఉండటం పరిపాటిగా మారింది. ఈ పరిస్థితి నేరుగా గమనించేందుకు కేజీబీవీ ప్రవేశ ద్వారం ముందు ఒక కెమెరా, స్టోర్‌రూమ్‌లో మరో కెమెరాను అమర్చి వీటికి నెట్ సౌకర్యం కల్పిస్తారు. అక్కడి నుంచి ఎస్ఎస్ఏ కార్యాలయంలోని పీడీ గదిలో ఉన్న ఎల్ఈడీ టీవీకి నెట్ ద్వారా అనుసంధానం చేస్తారు. తద్వారా జిలా కార్యాలయంలో ఉండి కేజీబీవీల్లో ఏం జరుగుతుందో నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కెమెరాకు అమర్చిన పరికరంలో నెల రోజుల డేటా కూడా రికార్డు అవుతుంది. ఎక్కడి నుంచి ఏ ఫిర్యాదు వచ్చినా, ఆయా కేజీబీవీలకు సంబంధించిన సీసీ కెమెరాను ఓపెన్ చేసి రికార్డు అయిన విషయాలను గమనిస్తారు. పైలెట్ ప్రాజెక్టుతో సత్ఫలితాలు జిల్లాలోని వెంకటాపురం, పెనుబల్లి కేజీబీవీల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్రంలోని అన్ని కేజీబీవీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో మొత్తం 26 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో ఖమ్మం అర్బన్ కేజీబీవీలో ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు, మిగిలిన వాటిల్లో 6 నుంచి10వ తరగతి వరకు చదివే విద్యార్థులు 4,315 మంది ఉన్నారు. జిల్లాలో మిగిలిన 24 కేజీబీవీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు కొనుగోలు కోసం టెండర్లు ఆహ్వానించారు. పర్యవేక్షణ పెంపుకోసం రవికుమార్, ఎస్ఎస్ఏ జిల్లా ప్రాజెక్టు అధికారి కేజీబీవీల పనివిధానంలో మార్పు, బోధన, మెనూ, సరుకులకు భద్రత, అపరిచిత వ్యక్తుల కట్టడి వంటి విషయాలను తెలుకునేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయి. అక్కడ ఏం జరుగుతుందో జిల్లా కార్యాలయం నుంచి తెలుసుకొని తగిన సూచనలు చేసేందుకు అవకాశముంది. కెమెరాల కొనుగోలుకు టెండర్లు పిలిచాం. -
నాపై నిఘా ఎందుకో ప్రభుత్వమే చెప్పాలి
తన ఫోన్‌ను ట్యాపింగ్ వార్తలపై కోదండరాం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలపై తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం ఘాటుగా స్పందించారు. తనపై నిఘా ఎందుకు పెట్టిందో, ఫోన్‌కాల్స్‌ను ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. మీడియా కథనాలపై తన వ్యక్తిగత మిత్రులు, శ్రేయోభిలాషులు మాట్లాడారని, ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న మాట నిజమేనని చెబుతున్నారని వెల్లడించారు. ప్రజాస్వామిక ప్రభుత్వాలు, ప్రజాస్వామికంగా వ్యవహరించాలని సూచించారు. ఇలాంటి నిఘాను వ్యతిరేకించాలని, దాన్ని రూపుమాపాలని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్లలో తాను మాట్లాడే రహస్యాలేవీ లేవన్నారు. తెలంగాణ సాధన ఉద్యమం, రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అభివృద్ధి కోసం పోరాడుతున్న క్రమంలోనూ చట్టానికి లోబడే వ్యవహరిస్తున్నామన్నారు. తాము రాజ్యాంగ పరిధికి లోబడి పనిచేయాలని స్పష్టంగా రాసుకున్నామన్నారు. చట్టానికి లోబడి, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజలకోసం పనిచేస్తున్న జేఏసీ లాంటి సంస్థలపై నిఘా అవసరమే లేదన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు ఎప్పుడు కోరినా వివరాలన్నీ ఇవ్వడానికి అభ్యంతరం లేదన్నారు. తాము ఫోన్లలో ఏం మాట్లాడతామో బయటా అదే చెప్తామన్నారు. ట్యాపింగ్‌ల వంటివి దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రజాస్వామ్య విలువలు, సంప్రదాయాలను పాటిస్తే నిఘా అవసరం ఉండదన్నారు. ప్రభుత్వానికి అభద్రత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతోపాటు అంతర్గత రాజకీయ వ్యవహారాలపై ప్రభుత్వ పెద్దలు అభద్రతాభావంలో ఉన్నారని జేఏసీ ముఖ్యులు విశ్లేషిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంగా తెలంగాణ ఉద్యమం సాగిందని, తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులపై టీఆర్ఎస్లోనే ఆందోళన ఉన్నట్టుగా కనపడుతోందని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 26 నెలల్లో ఇంకా ఆంధ్రా కాంట్రాక్టర్లు అన్ని రంగాల్లో పెత్తనం చేయడంపై టీఆర్ఎస్లోనే తీవ్ర అసంతృప్తి నెలకొందని, అందుకే ప్రభుత్వంలోని పెద్దలు భయపడుతున్నట్టుగా కనిపిస్తోందని జేఏసీ ముఖ్య నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ఇదే ప్రజాసంఘాలపై నిఘాకు కారణం కావొచ్చని జేఏసీ నాయకుడొకరు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ సిగ్గుచేటు: రావుల సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఫోన్‌ను ప్రభుత్వం ట్యాప్ చేయడం సిగ్గుచేటని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఎన్టీఆర్ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చివరకు తెలంగాణ ఉద్యమకారులపై కూడా నిఘా పెట్టడం ప్రభుత్వ దిగజారుడుతనాన్ని రుజువు చేస్తోందన్నారు. వ్యక్తి స్వేచ్ఛను హరించే హక్కు ఏ ప్రభుత్వానికీ ఉండదన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న డబుల్ బెడ్రూం ఇళ్ల పరిస్థితి ఏమైందో అంతుబట్టడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం టీజేఏసీ పనిచేయాలని రావుల కోరారు. -
మూడు మునకలే..!
ఇంద్రకీలాద్రి : పుష్కర స్నానానికి విచ్చేసే భక్తుల భద్రతపై పోలీసులు దృష్టి సారించారు. తొలి రోజున పద్మావతి ఘాట్‌లో బాలుడు నీట మునిగి మృతి చెందడంతో రెండో రోజు నుంచి బందోబస్తు కట్టుదిట్టం చేశారు ప్రతి స్నాన ఘాట్‌లో స్నానాలు చేసే భక్తులను వెయ్యి కళ్లతో పహారా కాసేందుకు అదనపు సిబ్బందిని నియమించారు. నదిలో మూడు మునకలే అన్నట్లుగా ఎక్కువ సేపు ఎవరికి నదిలో ఉండనీయడం లేదు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు స్నానానికి దిగే సమయంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వారిని వెయ్యి కళ్లతో పరిశీలిస్తూ ప్రతి క్షణం విజిల్స్ ఊదుతూ వారిని అప్రమత్తం చేస్తున్నారు. శుక్రవారం నాటి కంటే శనివారం నదిలో నీటిమట్టం సుమారు ఒక అడుగు మేర పెరగడంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నదిలో బ్యారికేడ్ వరకు ఎవరిని అనుమతించడం లేదు. ముఖ్యంగా నీటితో ఆటలాడే యువతి, యువకులను వెళ్లకుండా చూస్తున్నారు. -
కళాశాలలో నిఘా నేత్రాలు..
l సీసీ కెమెరాలు, బయోమెట్రిక్మిషన్ల ఏర్పాటు l విద్యార్థులు, అధ్యాపకుల సమయపాలనకు దోహదం l సత్ఫలితాలిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం కరీమాబాద్ : ఇటు విద్యార్థులు..అటు అధ్యాపకులు సమయానికి కళాశాలకు వచ్చేందుకు బయోమెట్రిక్ మిషన్లు, ఏ తరగతి గదిలో ఏం జరుగుతుందో ప్రిన్సిపాల్ గది నుంచే తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా మధ్యాహ్న భోజనానికి వచ్చేవారి సంఖ్య కూడా తెలుసుకోవచ్చు. దీంతో క్రమశిక్షణతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ బోర్డు ద్వారా జిల్లాలోని 44 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాలతోపాటు విద్యార్థులు, అధ్యాపకులకు వేర్వేరుగా బయోమెట్రిక్ మిషన్లను ఏర్పాటు చేసింది. రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీసీ కెమెరాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏర్పాటు చేయగా, బయోమెట్రిక్ మిషన్లు తాజాగా ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ కె.శోభాదేవి తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ మిషన్లు సత్ఫలితాలనిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు., 4 సీసీ కెమెరాలు, 2 బయోమెట్రిక్ మిషన్లు.. రంగశాయిపేట జూనియర్ కళాశాలలో నాలు గు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రిన్సిపాల్ గదిల–1, వరండా–1, స్టాఫ్ రూం–1, గేట్ కనిపించేలా–1 సీసీ కెమెరా ఏ ర్పాటు చేశారు. అలాగే అధ్యాపకుల కోసం ప్రిన్సిపాల్ గదిలో ఒక బయోమెట్రిక్ మిషన్, విద్యార్థుల కోసం లైబ్రరీలో మరో బయోమెట్రి క్ మిషన్ ఏర్పాటు చేశారు. అధ్యాపకుల బయోమెట్రిక్ మిషన్ ఉదయం 9.30 గంటల నుంచి 9.45 గంటల వరకు పనిచేస్తుంది. ఆ తర్వాత ఉదయం 10.30 గంటల వరకు అధ్యాపకులు ఎవరు వచ్చినా హాఫ్‌డే ఆబ్సెంట్ కిందే లెక్క ఉంటుంది. సాయంత్రం 4 నుంచి 4.30 గం టలలోపు కళాశాల ముగిసిన తర్వాత మరోసారి అధ్యాపకులు బయోమెట్రిక్ మిషన్ వాడాల్సిందే. అలాగే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసి న బయోమెట్రిక్ మిషన్ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఉపయోగంలో ఉంటుంది. ఆ మధ్య సమయంలో బయోమెట్రిక్ మిషన్‌ను ఉపయోగించాలి. లేదంటే ఆబ్సెంట్ పడుతుంది. సమయపాలనకు దోహదం నూతనంగా జూనియర్ కళాశాలలో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేయడం ఉపయోగకరంగా ఉంది. సీసీ కెమెరాల వల్ల కళాశాలలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. బయోమెట్రిక్ మిషన్ల వల్ల అధ్యాపకులు, సిబ్బంది సమయానికి రావడంతో పాటు విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోంది. కళాశాలలో 230 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ప్రక్రియ వల్ల గతంలో కంటే 70 నుంచి 80 శాతం విద్యార్థులు కళాశాలకు వస్తున్నారు. వంద శాతం విద్యార్థులు హాజరయ్యేలా కృషి చేస్తున్నాం. – కె.శోభాదేవి, ప్రిన్సిపాల్, రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల -
పోలీసు నిఘాలో రవీంద్రభారతి
హైదరాబాద్ : జాతీయ కళావేదిక రవీంద్రభారతి భద్రత ఇక పూర్తిగా పోలీసు నిఘాలోకి వెళ్లనుంది. శనివారం రవీంద్రభారతిలో చోటుచేసుకున్న చోరీని భాషా సాంస్కృతిక శాఖ సీరియస్‌గా తీసుకుంది. రవీంద్రభారతిలో జరుగుతున్న దొంగతనాలపై ఆ శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మధ్య మండలం డీసీపీ కమలాసన్‌రెడ్డితో చర్చించారు. ఈ సందర్భంగా అక్కడి 32 సీసీ కెమెరాలను పోలీసు కంట్రోల్ రూంకి అనుసంధానించేందుకు డీసీపీ అంగీకరించారు. అంతేకాకుండా ఇకపై ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పోలీసు పెట్రోల్ క్యాంప్‌ను ఒకటి రవీంద్రభారతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
కాలుక్యులేటర్ ను వాడి వస్తున్నారు!
న్యూఢిల్లీ: జమ్మూ-కశ్మీర్ లో గత కొద్దిరోజులుగా ఉగ్రదాడులు పెరగడానికి గల కారణాన్ని భారత్ ఆర్మీ కనుగొంది. ఒక కాలుక్యులేటర్ సాయంతో వారు భారత భద్రతా దళాల కళ్లుగప్పి దేశంలోకి చొరబడుతున్నట్లు తేల్చింది. ఉగ్రవాదులు వద్ద దొరికిన స్మార్ట్ ఫోన్లను పరిశీలించిన ఆర్మీ ప్లే స్టోర్ లో లభ్యమయ్యే ఓ కాలుక్యులేటర్ ను ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుని దాని ద్వారా ఎటువంటి సెల్యులార్ లేదా వైఫై లు అందుబాటులో లేకపోయినా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని తమ స్థావరాలకు ఎస్ఎమ్మెస్ లు పంపుతున్నట్లు వెల్లడించింది. ఈ రకమైన టెక్నాలజీని అమెరికాలో తొలిసారి పొంచివున్న హరికేన్ సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు ఉపయోగించినట్లు గుర్తించారు. దీంతో ఈ మెకానిజంను బ్రేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఆర్మీ టెక్నికల్ టీం.. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఎన్టీఆర్వో) సాయం కూడా తీసుకుంటోంది. లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రవాదులను విచారిస్తున్న సందర్భంగా వాళ్లు ప్రత్యేకమైన యాప్ కాలుక్యులేటర్ ను తయారుచేసుకుని వినియోగిస్తున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు బోర్డర్లలో చొరబాటుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. మొత్తం 35 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన పాక్ ఆక్రమిత కశ్మీర్ వ్యాలీ ఏరియా ఈ బలగాలు భద్రతను పెంచనున్నాయి. చలికాలం ప్రతికూల వాతవరణం కారణంగా చొరబాటు తక్కువగా ఉంటోంది. కానీ, ఈ ఏడాది చలి తక్కువగా ఉండటంతో ఉగ్రవాదులు మళ్లీ మళ్లీ చొరబాటుకు ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. 2015లో 121 చొరబాటు ప్రయత్నాలు జరుగగా 33 మంది దేశంలోకి ప్రవేశించారని, 2014లో 222 మంది చొరబాటుకు ప్రయత్నించగా65 మంది దేశంలోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
ఆ లోపాలే ‘క్యాష్’!
చిరుద్యోగుల ఆధీనంలో రూ. కోట్ల నగదు పక్కాగా లేని ఆడిటింగ్ స్వాహా చేస్తున్న ఉద్యోగులు ‘ఆర్సీఐ కేసు’ యాజమాన్యానికీ భాగస్వామ్యం సిటీబ్యూరో: 2012లో లోయర్ ట్యాంక్‌బండ్‌లోని సీఎంఎస్ కార్యాలయంలో రూ.2.6 కోట్లు... 2014లో నెల్లూరు కేంద్రంగా పని చేస్తే సంస్థలో రూ.57 లక్షలు... 2015లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సంస్థ నుంచి రూ.31 లక్షలు... తాజాగా ఆర్సీఐ సంస్థలో రూ.9.98 కోట్లు... వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎం మిషీన్లలో నగదు నింపే బాధ్యతలు నిర్వర్తిస్తున్న కస్టోడియన్లు స్వాహా చేసిన మొత్తాలివి. ఆయా సంస్థల్లో ఉన్న వ్యవస్థాగత లోపాలే వీరికి కలిసి వస్తున్నాయని పోలీసులు గుర్తించారు. వీటినే క్యాష్ చేసుకున్న నిందితులు భారీగా నగదు పక్కదారి పట్టింస్తున్నారని చెప్తున్నారు. ప్రజాధనం దుండగుల పాలవుతున్నా... ఆయా బ్యాంకులు మాత్రం సంస్కరణలపై దృష్టి పెట్టడంలేదు. ఆర్సీఐ ఫ్రాడ్‌లో కస్టోడియన్లతో పాటు ఏకంగా యాజమాన్యం పాత్ర వెలుగులోకి రావడంతో అధికారులే అవాక్కయ్యారు. ఔట్సోర్సింగ్ చేతుల్లో నగదు భర్తీ... ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ ఏటీఎంల్లో నగదును నింపే కాంట్రాక్టును ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ కేంద్రాలుగా నడిచే ప్రైవేట్ సంస్థలకు ఔట్సోర్సింగ్ పద్ధతిలో కాంట్రాక్టుకు అప్పగిస్తున్నాయి. ఈ పని చేయడానికి ఆయా సంస్థలు అనేక మందిని ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయి. వీరిలో కస్టోడియన్లుగా పిలిచే ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకం. వీరు బ్యాంకులకు చెందిన కేంద్రాల నుంచి కోట్ల రూపాయలు తమ సంస్థల వాహనాల్లో తీసుకొచ్చి, ఆ మొత్తాన్ని ఆయా బ్యాంకుల ఏటీఎం సెంటర్లలోని మిషీషన్లలో డిపాజిట్ చేస్తుంటారు. గతం తెలీదు.. నిఘా లేదు... కస్టోడియన్లుగా చేరే ఉద్యోగుల పూర్తి వివరాలు ఏటీఎంలో డబ్బు నింపే కాంట్రాక్టు పొందిన సంస్థలు తమ వద్ద ఉంచుకోవడం గానీ, వారి గత చరిత్రను పరిశీలించడంగానీ చేయడం లేదు. అలాగే వారి కార్యకలాపాలపై నిఘా ఉంచట్లేదు. ఫలితంగానే నేరం వెలుగులోకి వచ్చినా.. నిందితులను పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. ఓ బృందం బ్యాంక్ నుంచి సదరు వాహనంలో ఎంత మొత్తం తీసుకుని బయలుదేరింది. ఎంత మొత్తం కార్యాలయంలో అప్పగించింది అనే అంశాలు కేవలం మాన్యువల్‌గా పుస్తకాల్లో లేదా కంప్యూటర్లో నమోదు చేస్తున్నారు. అలాగే, ఈ డబ్బులో ఎంత మొత్తం ఏటీఎం సెంటర్లో డిపాజిట్ చేశారనేది కూడా మాన్యువల్‌గానే రికార్డు చేస్తున్నారు తప్ప.. డిపాజిట్ చేసిన మొత్తాన్ని సాంకేతికంగా లెక్కించే మెకానిజంను ఆయా సంస్థలు ఇప్పటి వరకూ అందిపుచ్చుకో లేదు. అంతర్గత విచారణతో జాప్యం... ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపిన కస్టోడియన్లు డ్యూటీ దిగిన తర్వాత మళ్లీ వెళ్లి ఏటీఎంలను తెరిచినా గుర్తించే పరిజ్ఞానం బ్యాంకుల వద్ద ఉండట్లేదు. దీనిని ఆసరా చేసుకొని కస్టోడియన్లు ఏటీఎంల్లో అవసరమైన డబ్బు డిపాజిట్ చేశామని నమ్మిస్తూ కోట్ల రూపాయలు గోల్మాల్ చేస్తున్నా కాంట్రాక్టు సంస్థలు వెంటనే గుర్తించలేకపోతున్నాయి. అప్పుడప్పుడు జరిగే ఆడిటింగ్‌లో అసలు విషయం బయటకు వచ్చినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అంతర్గత విచారణ పేరుతో జాప్యం చేస్తున్నాయి. ఇవన్నీ పూర్తయ్యాక పోలీసులను ఆశ్రయిస్తుండటంతో దర్యాప్తు క్లిష్టంగా మారుతోందని అధికారులు చెప్తున్నారు. ఈసారి ఏకంగా యాజమాన్యంతో కలిసి... ఏటీఎంల్లో నగదు గోల్మాల్ చేస్తున్న కస్టోడియన్లు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి తొలినాళ్లలో కేవలం ఒకటి రెండు రోజుల సర్దుబాటు కోసం నగదు పక్కదారి పట్టించడం, ఆ తరవాత స్వాహా చేయడం పరిపాటిగా మారిందని పోలీసులు అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో జరిగిన కేసునే తీసుకుంటే తొలుత ఏటీఎంల్లో నగదు డిపాజిట్ చేసిన కస్టోడియన్లు ఆ తర్వాత వెళ్లి మిషీన్లు ఓపెన్ చేసి, ఆ నగదును స్వాహా చేశారు. వీరిని కనిపెట్టే మెకానిజం, సీసీ కెమెరాలు ఉన్నా... కాంట్రాక్ట్ సంస్థల నిఘా లేకపోవం, నిర్లక్ష్యం వల్ల వెంటనే విషయం బయటకు రాలేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఆర్సీఐ సంస్థ విషయానికి వస్తే తొలుత సంస్థకు చెందిన కీలక వ్యక్తులే కస్టోడియన్ల ద్వారా నగదు పక్కదారి పట్టించారు. దీన్ని అదునుగా తీసుకుని ఉద్యోగులు ఆపై సొంతంగా స్వాహా చేశారు. ‘ఆర్సీఐ’పై పట్నాలోనూ కేసు... ఎస్బీఐ ఏటీఎంల్లో పెట్టాల్సిన నగదు గోల్‌మాల్‌కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్సీఐ సంస్థపై బీహార్‌లోని పట్నాలోనూ కేసు నమోదైంది. ఆ నగరంలోని వివిధ బ్యాంకులకు చెందిన 770 ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే బాధ్యతల్ని ఆర్సీఐ పర్యవేక్షిస్తోంది. ఇందులో కస్టోడియన్లుగా పని చేస్తున్న రాకేష్ రాయ్, రాహుల్ కుమార్, అవినాష్ కుమార్, రాజీవ్ కుమార్, ధర్మ్వీర్ కుమార్, చంద్రభాను కుమార్, అభిమన్యు కుమార్, అభిషేక్‌కుమార్, పప్పు కుమార్‌లు 27 ఏటీఎంల్లో పెట్టాల్సిన రూ.2.12 కోట్లు కాజేశారంటూ ఆర్సీఐ అధికారి చిన్మయ్ చందన్ పట్నాలోని డిఘా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ పోలీసులు ప్రాథమికంగా ఈనెల 10న తొమ్మిది మందిపైనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నగరంలో వెలుగులోకి వచ్చిన వ్యవహారంతో డిఘా పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్నాలోనూ ఆర్సీఐ యాజమాన్యమే ఫ్రాడ్ చేసి, కస్టోడియన్లపై నెడుతోందా? లేక కస్టోడియన్లతో కలిసి గోల్‌మాల్‌కు పాల్పడిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆర్సీఐ సంస్థపై మరికొన్ని రాష్ట్రాల్లోనూ కేసులు ఉన్నట్లు సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనూ ఆరా తీస్తున్నారు.