పోలీసు నిఘాలో రవీంద్రభారతి | Ravindra Bharathi under police surveillance | Sakshi
Sakshi News home page

పోలీసు నిఘాలో రవీంద్రభారతి

Published Mon, Jun 13 2016 6:57 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

Ravindra Bharathi under police surveillance

హైదరాబాద్ : జాతీయ కళావేదిక రవీంద్రభారతి భద్రత ఇక పూర్తిగా పోలీసు నిఘాలోకి వెళ్లనుంది. శనివారం రవీంద్రభారతిలో చోటుచేసుకున్న చోరీని భాషా సాంస్కృతిక శాఖ సీరియస్‌గా తీసుకుంది. రవీంద్రభారతిలో జరుగుతున్న దొంగతనాలపై ఆ శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మధ్య మండలం డీసీపీ కమలాసన్‌రెడ్డితో చర్చించారు. ఈ సందర్భంగా అక్కడి 32 సీసీ కెమెరాలను పోలీసు కంట్రోల్‌ రూంకి అనుసంధానించేందుకు డీసీపీ అంగీకరించారు. అంతేకాకుండా ఇకపై ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పోలీసు పెట్రోల్ క్యాంప్‌ను ఒకటి రవీంద్రభారతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement