సాక్షి, రంగారెడ్డి జిల్లా: నిఘా, పర్యవేక్షణ కమిటీ జిల్లా చైర్మన్‌గా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు. కో చైర్మన్లుగా భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డిలను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణాభివృద్ధి ద్వారా అమలయ్యే కార్యక్రమాలపై ఈ కమిటీ సమీక్షించి తదుపరి చర్యలు తీసుకుంటుంది.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా నీటియాజమాన్య సంస్థల పరిధిలో కేంద్ర ప్రభుత్వం అమలుచేసే కార్యక్రమాలను కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నిర్ణయాలు తీసుకోనుంది. గతంలో ఈ కమిటీకి చైర్మన్‌గా సర్వే సత్యనారాయణ కొనసాగారు. అయితే కేంద్ర మంత్రిగా విధులు నిర్వహించిన నేపథ్యంలో ఈ కమిటీ భేటీ అరుదుగా జరిగింది. ఈ క్రమంలో పర్యవేక్షణ లోపించడంతో ఉపాధిహామీ పథకంలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. తాజాగా కొత్త కమిటీ ఏర్పాటు కావడంతో ఈ అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందో లేదో చూడాలి.
నిఘా, పర్యవేక్షణ కమిటీ చైర్మన్‌గా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
Published Wed, Nov 26 2014 12:05 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement
Advertisement