Rural Development
-
మానవాభివృద్ధి దిశగా!
2025–26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. వ్యవసాయం; సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు; పెట్టుబడి, ఎగుమతుల అభివృద్ధిని వేగవంతం చేయడం, సమ్మిళిత సాధన, ప్రైవేటు రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, మధ్యతరగతి ప్రజల వినియోగ వ్యయ సామర్థ్యం పెంపు లాంటి లక్ష్యాల సాధన ‘వికసిత్ భారత్’ ఆకాంక్షలుగా ఆర్థిక మంత్రి అభివర్ణించారు. నూతన పన్ను వ్యవస్థలో భాగంగా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు వల్ల ప్రజల వ్యయార్హ ఆదాయాలు పెరిగి, కుటుంబ వినియోగ వ్యయం పెరుగుతుంది. తద్వారా దేశంలో సమష్టి డిమాండ్ పెరిగి, ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుంది.బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించడం ఆహ్వానించద గిన పరిణామం. ఈ చర్య ఆరోగ్య బీమా రంగంపై దీర్ఘకాల ప్రభా వాన్ని కలుగజేస్తుంది. బీమా రంగంలో పెట్టుబడులు పెరగడంతో పాటు పోటీతత్వం పెరిగి బీమా పాలసీల రూపకల్పన, సేవల డెలి వరీలో నవకల్పనలు చోటుచేసు కుంటాయి. తద్వారా వ్యక్తులు, కుటుంబాలు తమ ఆరోగ్య సంర క్షణ వ్యయాన్ని సక్రమంగా నిర్వ హించుకోవడం ద్వారా నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలను పొంద గలుగుతారు. ఆర్థిక సేవల అందు బాటు దేశంలో మానవాభివృద్ధికి దారితీస్తుంది, ఆర్థికాభివృద్ధి వేగ వంతమవుతుంది.ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను విద్యారంగానికి విస్తరించి పెట్టుబడులను ప్రకటించడం ద్వారా దీన్ని భవిష్యత్ సామాజిక – ఆర్థిక ప్రగతికి కారకంగా ప్రభుత్వం గుర్తించింది. అదనంగా పదివేల మెడికల్ సీట్లు, ఐఐటీలలో అదనంగా 6,500 సీట్ల పెంపు, నాణ్యతతో కూడిన శ్రామిక శక్తి పెంపు నవకల్పనలకు దారితీస్తాయి. గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పనపై పెట్టు బడులు, ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు దారితీసి, అధిక వినియోగం, మార్కెట్ విస్తరణకు నూతన అవకాశాలు ఏర్ప డతాయి. 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌కు కస్టమ్ సుంకాన్ని మినహా యింపునివ్వడం వల్ల పేషెంట్లపై ఆర్థిక ఒత్తిడి తగ్గి ఆరోగ్య ప్రమాణాలు మెరుగవుతాయి.బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీల క్షీణతకు మూలధన వ్యయంలో స్వల్ప పెరుగుదల కారణంగా భావించవచ్చు. 2024–25 ఆర్థిక సంవత్సరం మూలధన వ్యయంతో పోల్చినప్పుడు 2025–26లో మూలధన వ్యయంలో పెరుగుదల 10 శాతం మాత్రమే. ఆర్థికాభివృద్ధికి మూలధన వ్యయంలో పెరుగుదల అధికంగా లేనప్పుడు ఆ ప్రభావం ఉత్పాక రంగాలపై రుణాత్మకంగా ఉండి, వృద్ధి క్షీణతకు దారితీస్తుంది. ప్రభుత్వ కోశ విధానాలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్లు స్పందిస్తాయి. 2024–25 ఆర్థిక సంవ త్సరం ద్రవ్యలోటు జీడీపీలో 4 శాతంగా నమోదు కావడం, పెరుగుతున్న ప్రభుత్వ రుణాలు, బాండ్ల రాబడి, ఈక్విటీ మార్కెట్లపై స్వల్పకాల ఒడుదొడుకులను కలుగజేస్తాయి. విదేశీ పెట్టుబడులను భారత్ అధికంగా ఆకర్షించడమనేది ప్రతి పాదిత బడ్జెట్ చర్యలు ఆర్థిక విస్తరణ, రాజకీయ సుస్థిరత, కార్పొరేట్ సంస్థల రాబడుల పెరుగుదలకు దారితీశాయా, లేదా అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.ఆదాయపు పన్ను మినహాయింపు వలన పెరిగిన వ్యయార్హ ఆదాయాన్ని, వినియోగదారులు వినియోగ వ్యయంగా మరల్చగలరనే విషయంలోనూ అనిశ్చితి ఉంది. పన్ను రేట్ల తగ్గింపు స్వల్పకాల ప్రయోజనాలకే దారి తీస్తుంది. మరోవైపు అవస్థాపనా సౌకర్యా లపై పెట్టుబడులు అధికవృద్ధి సాధనకు దారి తీస్తాయి.రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వా మ్యంతో వంద జిల్లాల్లో వ్యవసాయ ఉత్పాదకత పెంపు, పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహించడం, సరకు నిల్వ, నీటి పారుదల సౌకర్యాల విస్తరణ, స్వల్పకాల, దీర్ఘకాల వ్యవసాయ పరపతి పెంపు లక్ష్యాలుగా, ‘ప్రధాన మంత్రి ధన్ – ధాన్య క్రిషి యోజన’ పథకాన్ని ప్రకటించారు. భారత్‌లో వ్యవసాయ రంగానికి సంబంధించి అధిక శాతం రైతులు ఉపాంత, చిన్న కమతాలపై ఆధా రపడి జీవనం సాగిస్తున్నారు. మొత్తం వ్యవసాయ భూమిలో రెండు హెక్టార్ల కన్నా తక్కువ ఉన్న కమతాల వాటా 86 శాతం. కమతాల విస్తీర్ణం తక్కువగా ఉండటం వలన ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులు అవలంబించలేకపోతున్నారు. బడ్జెట్లో ప్రతిపాదించిన సంస్క రణలు ముఖ్యంగా మేలు రకమైన వంగడాల వినియోగం,పంటమార్పిడి విధానాన్ని అవలంబించగలిగే సామర్థ్యం తక్కువగా ఉండటానికి రైతులలో ఆధునిక వ్యవసాయ పద్ధతు లపై అవగాహన లేకపోవడంతోపాటు, పరపతి లభ్యత తక్కు వగా ఉండటాన్ని కారణాలుగా పేర్కొనవచ్చు.స్టార్టప్‌లు, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలకు బడ్జెట్ ప్రతిపాదనలు అనుకూలంగా ఉన్నప్పటికీ లోప భూయిష్ఠ సప్లయ్ చెయిన్ వ్యవస్థ, అసంఘటిత రంగ కార్య కలాపాలు, సంస్థాపరమైన పరపతి లభ్యతలో ఇబ్బందులు అభివృద్ధికి అవరోధంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త ప్రొఫెసర్ అండ్ డీన్, ఇక్ఫాయ్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఐఎఫ్ హెచ్ఇ, హైదరాబాద్ -
గ్రామీణాభివృద్ధికి రూ.2,773 కోట్లు మంజూరు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణాభివృద్ధికి సంబంధించి వివిధ పనులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం రూ.2,773 కోట్లు మంజూరు చేసింది. గతంలోనే రూ. 2,682.95 కోట్లు మంజూరు చేయగా ఆ పనులు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపా రు. తాజాగా మంజూరు చేసిన రూ. 2,773 కోట్ల లో.. గ్రామీణ రోడ్ల నిర్మాణం (సీఆర్ఆర్) కింద రూ. 1,419 కోట్లు, గ్రామీణ రోడ్ల నిర్వహణ (ఎంఆర్ ఆర్)కు రూ.1,288 కోట్లు కేటాయించారు. ఈ నిధు లతో పల్లెల్లో బీటీ రోడ్లు, ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం, తండాలు, గూడేల్లో బీటీ రోడ్ల నిర్మాణం వంటివి చేపట్టనున్నారు. దీంతో పాటు పీఎం జన్మన్ పథకం కింద రాష్ట్ర వాటాగా ప్రభుత్వం రూ.66 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో 25 ఆదివాసీ గూడేలకు బీటీ రోడ్లు వేయనున్నారు. కాగా, పల్లెల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, సహచర మంత్రులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.గ్రామీణాభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు గురువారం ఆమె ప్రజాభవన్‌లో పూల మొక్క అందచేసి కృతజ్ఞతలు తెలిపారు. ‘మా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నడూ లేని విధంగా నిధులు మంజూరు చేసి, పనులు చేయిస్తున్నాం. మొదటి విడతలో రూ. 2,682 కోట్లు, తాజాగా మరో రూ. 2,773 కోట్లు మంజూరు చేశాం. ఇంకా ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రూ.197 కోట్లు మంజూరు చేశాం. గతంలో పీఎంజీఎస్‌వై కోసం రూ. 110 కోట్లు విడుదల చేశాం’అని ఈ సందర్భంగా సీతక్క తెలిపారు. పల్లెల్లో మౌలిక వసతుల కల్పన కోసం వేల కోట్లు వ్యయం చేస్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులను మంజూరు చేస్తామని మంత్రి వివరించారు. పీఆర్ ఇంజనీరింగ్ అధికారులకు వెహికల్ అలవెన్స్క్షేత్రస్థాయి పంచాయతీరాజ్ రూరల్ ఇంజనీరింగ్ అధికారులకు వాహన సదుపాయం కల్పిస్తూ ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. శాఖాపరంగా పనుల పర్యవేక్షణ కోసం ఈఈలు, డిప్యూటీ ఈఈలు, ఎస్ ఈలకు వాహన సౌకర్యం లభిస్తుంది. ఇందులో భా గంగా 237 మంది ఇంజనీరింగ్ అధికారులకు రూ. 5 కోట్లు మంజూరు చేశారు. ఒక్కో వాహనం అద్దె కింద నెలకు రూ.33 వేలు చొప్పున చెల్లించనున్నారు. కాగా, తమ ఇంజనీర్లకు వాహన సదుపాయం కల్పించిన ప్రభుత్వానికి పంచాయతీరాజ్ విభాగం ఈఎన్సీ కనకరత్నం ధన్యవాదాలు తెలిపారు. అలాగే మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఊరు ఉమెన్ అనుకున్నారా... నేషనల్!
ఆ ఊరి జనాభా పదకొండు వందలు కూడా ఉండదు. ‘గ్రామాభివృద్ధికి జనాభా కాదు... చైతన్యం ప్రమాణం’ అనుకుంటే చిల్లపల్లి చిన్న ఊరు కాదు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పెద్ద ఊరు. కేంద్ర ప్రభుత్వం ‘దీన్ దీయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్’ పురస్కారాలు ప్రకటించింది. అందులో ‘ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయితీ’ విభాగంలో పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిల్లపల్లి గ్రామపంచాయితీకి రెండో ర్యాంకు వచ్చింది. నేడు దిల్లీలోని విజ్ఞాన్‌భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముచేతుల మీదుగా చిల్లపల్లి గ్రామపంచాయతీ ఈ అవార్డులను అందుకోనుంది...చిల్లపల్లి గ్రామంలో 1081 మంది జనాభా ఉండగా, అందులో 508 మంది మహిళలు ఉన్నారు. గ్రామంలో ఉన్న 33 స్వశక్తి సంఘాలలో 335 మంది సభ్యులు ఉన్నారు. వీరందరూ ‘శ్రీజ్యోతి గ్రామ సమైక్య సంఘం’ ఏర్పాటు చేసుకుని రూ.3.35కోట్ల వరకు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. రుణవాయిదాలను క్రమం తప్పకుండా చెల్లించడమే కాకుండా ΄పొదుపు ఖాతాల్లో సైతం డబ్బును జమ చేస్తున్నారు. కిరాణాషాపులు, కుట్టు మిషన్లు, కోళ్ల పెంపకం, పాడిగేదెలు, కంగన్ హాల్, చికెన్ షాప్, బ్యూటీపార్లర్, టిఫిన్ సెంటర్లు, డ్రాగన్ ప్రూట్స్ తోట, పిండిగిర్ని, కూరగాయల సాగు, విక్రయం, మెడికల్ షాపు, ఐకేపీ సెంటర్ నిర్వహణ, అమ్మ ఆదర్శ పాఠశాల కింద ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టడం... మొదలైన పనులతో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు.సక్సెస్ మంత్రం ఇదే...కొన్ని గ్రామాల్లో మహిళ సంఘాలలోని సభ్యులు డబ్బులు ΄పొదుపు చేసి, రుణాలు తీసుకొని బయట అధిక వడ్డీకి ఇవ్వడానికి ఇష్టపడతారు. దీనివల్ల సంఘాలకు, సభ్యులకు పెద్దగా ఉపయోగం ఉండదు. ఈ విషయాన్ని గ్రహించిన చిల్లపల్లి గ్రామ మహిళలు ΄పొదుపు చేసిన డబ్బులతో పాటు, ప్రభుత్వం ఇచ్చే రుణాలను ఉపాధి కల్పన కోసం ఉపయోగిస్తున్నారు. దీనివల్ల తాము ఉపాధి పొందడంతో పాటు ఇతరులకు కూడా ఉపాధి చూపించగలుగుతున్నారు. రుణాలు తీసుకోవడంతో పాటు జీరో బకాయిలతో ముందుకు వెళుతున్నారు.ఆర్థిక స్వావలంబన నుంచి ఆరోగ్య పరిరక్షణ వరకు చిల్లపల్లి ఆదర్శగ్రామంగా నిలుస్తోంది.‘గ్రామాల్లో ఉండడం దండగ’ అనుకుంటూ ఉపాధి కోసం పట్నం బాట పడుతున్న ఎన్నో కుటుంబాలకు చిల్లపల్లి కొండంత ధైర్యాన్ని ఇస్తోంది. పట్టణంలో బతుకీడుస్తున్న వాళ్లను కూడా ‘నేను నా ఊళ్లో హాయిగా బతక వచ్చు’ అనుకునేలా భరోసా ఇస్తోంది. ఇంతకు మించిన విజయం ఏమిటి!– గుడ్ల శ్రీనివాస్ సాక్షి, పెద్దపల్లి ఫోటోలు: మర్రి సతీష్రెడ్డిరైతు మిత్రులురమాదేవి, సరోజన, సౌజన్య... ముగ్గురు కలిసి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ధాన్యం వచ్చినప్పటి నుంచి తూకం వేసి మిల్లుకు తరలించే వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రతి క్వింటాకు ప్రభుత్వం ఇచ్చే రూ.32 కమీషన్ తో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. రైతులకు చేదోడు వాదోడుగా ఉండడంతో పాటు ఐకేపీ సెంటర్ల ద్వారా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.ఆ ఊళ్లో రోజూ పండగే!ఆర్థిక స్వావలంబనలోనే కాదు ఆరోగ్యం, పారిశుద్ధ్యంలోనూ చిల్లపల్లి ముందు ఉంటుంది. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉంది. బాలికలకు శానిటరీ న్యాప్కిన్స్ పై, తల్లిదండ్రులకు పేరెంటింగ్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు ఈ చిన్న ఊళ్లో గాఢమైన నిశ్శబ్దం రాజ్యమేలేది. పెద్ద సందడి ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు. ‘ప్రతిరోజూ మా ఊళ్లో పండగే. సందడే’ అన్నట్లుగా కనిపిస్తుంది. అది మహిళా చైతన్యానికి సంకేతమైన సందడి!మినీ ఏటీఎంతో....డ్వాక్రా సంఘంలో చేరిన తరువాత సుమారు ఐదుసార్లు లోన్ తీసుకున్నాను. మొదటిసారి తీసుకున్నప్పుడు గేదెలు కొనుగోలు చేశాను. ఆ ఆప్పు తీర్చి మళ్లీ లోను ఎత్తుకుని పిల్లల చదువులకు ఉపయోగించాను. మరోసారి లోన్ ఎత్తుకొని సెంట్రింగ్ కర్రలు కొనుగోలు చేసి అద్దెకు ఇస్తున్నా. తరువాత మినీ ఏటీఎం నిర్వహించేందుకు ల్యాప్‌టాప్ కొనుగోలు చేసేందుకు లోన్ తీసుకున్నా. మినీ ఏటీఎం నిర్వహణతో నెలకు పదమూడు నుంచి పదిహేను వేల వరకు ఆదాయం వస్తుంది. – కూర వనిత మినీ ఏటీఎం నిర్వాహకురాలుఅందుకే ఆదర్శంగా నిలిచిందిపన్నెండేళ్ల క్రితం మహిళ సంఘంలో చేరాను. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు రుణం తీసుకున్నా. మొదట్లో అయిదువేలు ఎత్తుకోని కుట్టుమిషన్ కొన్నాను. తరువాత లోన్లు తీసుకుంటూ మగ్గం, మెడికల్ షాపు ఏర్పాటు చేసుకున్నాను. స్త్రీనిధి కింద రూ.75వేలు తీసుకుని కిరాణాషాపు ఏర్పాటు చేసుకున్నాం. సంఘంలో లోన్ తీసుకోవడం, ఆ పైసలను సద్వినియోగం చేసుకోవడం, తిరిగి సకాలంలో చెల్లించడంలో మా గ్రామ సమాఖ్య ఆదర్శంగా నిలుస్తుంది. – అరె.శ్వేత మెడికల్ షాపు యజమానిఎన్నో గ్రామాలకు గెలుపు పాఠంనలుగురు కలిస్తే ఎన్ని అద్భుతాలు సాధించవచ్చో నిరూపించింది చిల్లపల్లి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఏ వ్యాపారానికైనా ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యం. ఈ విషయంలో చిల్లపల్లి మహిళలు పర్ఫెక్ట్గా ఉన్నారు. ‘ఫ్రెండ్లీ ఉమెన్ విభాగం’లో జాతీయ అవార్డు రావటం సంతోషంగా ఉంది. అయితే ఇది ఒక ఊరి విజయం మాత్రమే కాదు ఎన్నో గ్రామాలకు గెలుపు పాఠం. ‘మనం కూడా ఇలా చేసి విజయం సాధించవచ్చు’ అని ప్రతి గ్రామం ధైర్యం తెచ్చుకునే విజయం. – సంతోషం పద్మ, ఏపీఎం, మంథని -
పది పాసైన మహిళలకు ఎల్ఐసీ ఉపాధి అవకాశం
బీమా సేవలందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 9న హరియాణాలోని పానిపట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎల్ఐసీ బీమా సఖీ యోజన’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు నియామక పత్రాలను అందజేశారు. మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడం, స్థిరమైన ఆదాయ ప్రోత్సాహకాలు అందించడం, ఆర్థిక అక్షరాస్యత పెంపొందించి, బీమాపై అవగాహనను కల్పించడం ఈ పథకం ప్రాథమిక లక్ష్యమని ఎల్ఐసీ తెలిపింది.The Honorable Prime Minister of India, Shri Narendra Modi will be launching LIC’s BIMA SAKHI yojana at Panipat on 09th December 2024 to celebrate Women as partner in the Nations Progress.#BimaSakhiYojana #LIC@narendramodi @PMOIndia@nsitharaman @DFS_India— LIC India Forever (@LICIndiaForever) December 8, 2024కీలక అంశాలు..అర్హులు: కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులైన 18-70 సంవత్సరాల వయస్సు గల మహిళలు.శిక్షణ, ఉపాధి: బీమా సఖీలుగా పిలువబడే మహిళలకు బీమా రంగంలో శిక్షణ ఇచ్చి ఎల్ఐసీ ఏజెంట్లుగా నియమించుకుంటారు. ఆర్థిక అక్షరాస్యత పెంపొందించడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా భారతదేశం అంతటా లక్ష మంది మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు.ఆర్థిక సహాయం: ఈ పథకంలో ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలవారీ స్టైఫండ్ లభిస్తుంది. మొదటి సంవత్సరంలో నెలకు రూ.7,000, రెండో సంవత్సరంలో రూ.6,000, మూడో సంవత్సరంలో రూ.5,000 పొందవచ్చు. అదనంగా రూ.2,100 ప్రోత్సాహకం లభిస్తుంది.బీమా విక్రయ లక్ష్యాలను సాధించిన మహిళలు కమీషన్ ఆధారిత రివార్డులను కూడా పొందవచ్చు. మొదటి సంవత్సరం కమీషన్ రూ.48,000 వరకు ఉంటుంది.ఇదీ చదవండి: నెలకు రూ.80,000.. ఇదేదో సాఫ్ట్వేర్ జీతం కాదు! -
గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణకు ఏం చేయాలంటే..
గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణ కోసం ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను (ఐఎస్పీ) ప్రోత్సహించాలని, వారికి పన్ను మినహాయింపులు ఇవ్వాలని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరమ్ (బీఐఎఫ్) కోరింది. గతేడాదితో పోలిస్తే 20 శాతం గ్రామీణ వినియోగదారులను పెంచుకున్న కంపెనీలకు రివార్డులు ప్రకటించాలని తెలిపింది.ఈ సందర్భంగా బీఐఎఫ్ ఛైర్పర్సన్ అరుణా సౌందరరాజన్ మాట్లాడుతూ..‘దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఒక ట్రిలియన్ డాలర్ల(రూ.84 లక్షల కోట్లు) మార్కు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026-27 నాటికి జీడీపీలో 20 శాతం ఈ వ్యవస్థ తోడ్పటును అందించాలని నిర్ణయించారు. కాబట్టి ఈ వ్యవస్థ వృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందించాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వారికి వేగవంతమైన నెట్వర్క్ సౌకర్యాలు కల్పించాలి. ఈ రంగంలో దేశమంతటా స్థిరమైన బ్రాడ్‌బ్యాండ్ మౌలిక సదుపాయాలను విస్తరించాలి’ అన్నారు.ఇదీ చదవండి: ‘అలాంటివారిని ఇప్పటి వరకు చూడలేదు’‘ప్రస్తుతం దేశంలో డిజిటల్ వృద్ధికి సంబంధించి మొబైల్ వ్యవస్థ మొదటి స్థానంలో ఉంది. 95.6% మంది వినియోగదారులు మొబైల్ ఇంటర్నెట్పై ఆధారపడుతున్నారు. వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్‌ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య 4.3% మాత్రమే. వేగవంతమైన ఇంటర్నెట్కు, మొబైల్ కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్థిర బ్రాడ్‌బ్యాండ్ అవసరం. కాబట్టి ఈ వ్యవస్థలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. గ్రామీణ చందాదారులలో గణనీయమైన వృద్ధిని సాధించే ఐఎస్పీలకు పన్ను మినహాయింపులు ఇవ్వాలి. బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలను ప్రధాన మంత్రి వై-ఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ (పీఎం-వాణి) వంటి కార్యక్రమాలతో అనుసంధానించాలి. గ్రామీణ ప్రాంతాల్లో శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌కు కూడా ప్రభుత్వం సహకరించాలి’ అన్నారు. -
రైతు సంక్షేమంపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దృష్టి
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)– ‘పరివర్తన్’లో భాగంగా 2025 నాటికి సంవత్సరానికి రూ. 60,000 కంటే తక్కువ సంపాదించే 5 లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంపునకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ‘‘గ్రామీణాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం అంటే స్థిరమైన వృద్ధిని పెంపొందించడమే. అలాగే బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులను పెంచడానికి సంబంధించి మా నిరంతర నిబద్ధతను మా కార్యక్రమాలు ప్రతిబింబిస్తాయి. 2014లో ప్రారంభమైనప్పటి నుండి, 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో క్రియాశీలకంగా ఉన్న భారతదేశపు అతిపెద్ద సీఎస్ఆర్ కార్యక్రమాలలో పరివర్తన్ ఒకటిగా ఎదిగింది’’ అని బ్యాంక్ డిప్యూటీ. మేనేజింగ్ డైరెక్టర్ కైజాద్ ఎం భారుచా అన్నారు. భారత్‌లోని సామాజిక–ఆర్థిక అభివృద్ధికి దోహదపడాలనే లక్ష్యంతో 2014లో ప్రారంభమైన హెచ్డీఎఫ్సి బ్యాంక్ ‘పరివర్తన్’ తన లక్ష్య సాధనలో పురోగమిస్తోందని ఆయన అన్నారు. ఆయన తెలిపిన మరిన్ని అంశాలను పరిశీలిస్తే.. → గత దశాబ్ద కాలంలో రూ. 5,100 కోట్లకు పైగా సీఎస్ఆర్ వ్యయంతో ‘పరివర్తన్’ కింద స్థిరమైన జీవనోపాధిని సృష్టించడం, అభివృద్ధిని పెంపొందించడం, జీవన ప్రమాణాలను పెంపొందించడం వంటి లక్ష్యాలను కొంతమేర బ్యాంక్ సాకారం చేసుకుంది. → బ్యాంక్ తన సీఎస్ఆర్ చొరవ కింద దాదాపు 2 లక్షల మందికి స్వయం సమృద్ధిని పెంచడానికి నైపుణ్య శిక్షణను అందించాలని యోచిస్తోంది. → 2 లక్షల ఎకరాలను నీటిపారుదల కిందకు తీసుకువచి్చ, సాగుకు అనువైనదిగా తీర్చి దిద్దడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, 25,000 మంది ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు విద్య అవకాశాలను మెరుగుపరచడం, ఇందుకు స్కాలర్షిప్లు వంటివి అందించడం వంటి కార్యకలాపాలను బ్యాంక్ యోచిస్తోంది. → 17 ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) తొమ్మిదింటిని సాకారం చేయడానికి బ్యాంక్ తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. వీటిలో విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, అందరికీ ఆర్థిక సేవలు అందుబాటు వంటివి ఉన్నాయి. → సమాజ ఆర్థిక శ్రేయస్సును ప్రతి బాధ్యతగల బ్యాంకింగ్ కోరుకుంటుంది. ఈ సూత్రానికి తన నిబద్ధతను బ్యాంక్ నిరంతరం ఉద్ఘాటిస్తుంది. దేశ నిర్మాణానికి దోహదపడే కార్యకలాపాలు చేపట్టేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కట్టుబడి ఉంది. → హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ. 945.31 కోట్లను తన కార్పొరేట్ సామాజిక బాధ్యతగా వెచి్చంచింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు రూ. 125 కోట్లు అధికం. → కంపెనీల చట్టం 2013 ప్రకారం, సీఎస్ఆర్ నిబంధనలు వర్తించే ప్రతి కంపెనీ ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం మూడు ఆర్థిక సంవత్సరాల్లో సంపాదించిన దాని సగటు నికర లాభాలలో కనీసం 2 శాతం ఖర్చు చేసేలా చూసుకోవాలి. → బ్యాంక్ నికర లాభం 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.44,109 కోట్లుకాగా, 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ పరిమాణం 38 శాతం పెరిగి రూ.60,812 కోట్లకు చేరుకుంది. ఈ ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ దాదాపు రూ. 950 కోట్లు సీఎస్ఆర్ కింద వ్యయం చేయాల్సి ఉంది.గ్రీన్ ఎకానమీ పురోగతికి ప్రాధాన్యం...భారతదేశ జనాభాలో 65 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నందున, గ్రామాలలో ప్రజల శ్రేయస్సు, జీవనోపాధి దేశ సమగ్ర అభివృద్ధికి కీలకమని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెడ్ (సీఎస్ఆర్) నుస్రత్ పఠాన్ అన్నారు. బ్యాంక్ తన కార్యక్రమాలకు గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ప్రస్తుతం 70 శాతం బ్యాంక్ సీఎస్ఆర్ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లోనే అమలవుతున్నాయని వెల్లడించారు. 2031–32 నాటికి కార్బన్ న్యూట్రల్‌గా మారేందుకు బ్యాంక్ తన వంతు కృషి చేస్తుందని వివరించారు. ఈ చొరవలో భాగంగా పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంపొందించడంపై దృష్టి పెడుతుందని అన్నారు. గ్రీన్ ఇనిíÙయేటివ్లో భాగంగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్యాంక్ తన మొట్టమొదటి ఫైనాన్స్ బాండ్ ఇష్యూ ద్వారా 300 మిలియన్ డాలర్లను సేకరించిందని ఆయన చెప్పారు. సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ)లు, ఈవీలుసహా గ్రీన్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుతున్నట్లు వెల్లడించారు. -
పల్లెకు.. తగ్గిన ప్రాధాన్యం
⇒ వార్షిక బడ్జెట్లో ‘పల్లె’కు కాస్త ప్రాధాన్యం తగ్గినట్లు కనిపిస్తోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరంగా 2024–25 బడ్జెట్లో రూ. 29,816 కోట్లు కేటాయించారు. అందులో పంచాయతీరాజ్ శాఖకు రూ. 9,341.56 కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 1,317.95 కోట్లను ప్రతిపాదించగా ఇతర పథకాల కింద వచ్చే గ్రాంట్లు, ఇతర నిధులను కలిపి మొత్తంగా రూ. 29,816 కోట్లు ప్రతిపాదించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఈ శాఖకు ఏకంగా రూ. 40,080 కోట్లు కేటాయించగా ఈసారి కేటాయింపులు సుమారు రూ. 10 వేల కోట్లు తగ్గడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్పెంచిన పెన్షన్ల అమలు లేనట్టేనా?⇒ ఈ శాఖ పరిధిలోకి వచి్చన కేటాయింపుల విషయానికొస్తే 2024–25 బడ్జెట్లో చేయూత (ఆసరా పించన్లు) పెన్షన్ల కోసం రూ. 14,628.91 కోట్లు ప్రతిపాదించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు సహా వివిధ కేటగిరీల పెన్షన్లను రూ. 2,016 నుంచి రూ.4 వేలకు, దివ్యాంగులకు రూ. 4 వేల నుంచి రూ. 6 వేలకు పెంపు అమలును ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే మాత్రం ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పెంచిన పెన్షన్ల అమలు ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ప్రస్తుతం దివ్యాంగులకు నెలకు రూ. 4 వేల చొప్పున, వివిధ కేటగిరీల వారికి రూ. 2,016 చొప్పున చెల్లించేందుకు నెలకు రూ. 950 కోట్ల చొప్పున ఏడాదికి రూ.11,400 కోట్లు ఖర్చవుతోంది. ఇప్పుడు బడ్జెట్లో చేయూత పెన్షన్ల కోసం రూ. 14,628.91 కోట్లను ప్రతిపాదించడాన్నిబట్టి రూ. 3,228.91 కోట్లు అధికంగా కేటాయించారు. పెంచిన పెన్షన్ల అమలుకు రూ. 23 వేల కోట్ల దాకా (నెలకు రూ. 1,910 కోట్లు) అవసరమవుతాయి.అయితే ఈ బడ్జెట్‌ను పెంచిన పెన్షన్లకు అనుగుణంగా ఖర్చు చేస్తారా లేక బడ్జెట్ కేటాయింపులకే పరిమితమవుతారా అన్నది వేచిచూడాల్సి ఉందంటున్నారు. పెంచిన చేయూత పెన్షన్లను ఆగస్టు 15 నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వపరంగా సిద్ధమవుతున్నట్లు పంచాయతీరాజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి.ఇతర కేటాయింపులు.. ⇒ గ్రామీణాభివృద్ధిశాఖకు (కమిషనర్ కార్యాలయం) రూ. 12,820 కోట్లు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) రూ. 295 కోట్లు, సీ డీ అండ్ పంచాయతీలు రూ. 3,117 కోట్లు, గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద రూ. 1,142 కోట్లు ప్రతిపాదించారు. దీంతోపాటు డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ. 750 కోట్ల మేర కేటాయింపులు చేశారు.అలాగే మహిళా సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ‘ఇందిరా మహిళాశక్తి పథకం’కోసం రూ. 50.41 కోట్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ. 10 లక్షల జీవితబీమా కోసం ‘ఇందిరా జీవిత భీమా’కు రూ. 96.53 కోట్లు ప్రతిపాదించారు. స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణకు రూ. 120 కోట్లు కేటాయించారు. గ్రామీణ తాగునీటి సరఫరా (మిషన్ భగీరథ) కోసం రూ. 3046.26 కోట్లు, గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ. 72 కోట్లు, రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణానికి రూ. 20 కోట్లు కేటాయించారు.ప్రస్తుతం వివిధ కేటగిరీలవారీగా ‘భరోసా’పింఛన్లు పొందుతున్న వారి సంఖ్య (వృద్ధులు, ఇతర కేటగిరీలవారికి నెలకు రూ. 2,016 చొప్పున, దివ్యాంగులకు రూ. 4 వేల చొప్పున)వృద్ధులు 15,81,630 వితంతువులు 15,54,525 దివ్యాంగులు 5.05,836 బీడీ కారి్మకులు 4,24,292 ఒంటరి మహిళలు 1,42,252 గీత కార్మికులు 65,196 నేత కార్మికులు 37,051 ఎయిడ్స్ రోగులు 35,670 బోదకాలు బాధితులు 17,995 డయాలిసిస్ రోగులు 4,337 మొత్తం 43,70,751 -
పల్లెలను పొడుచుకు తింటుంది ఈ కాంగ్రెస్ అభివృద్ధి శూన్యం
-
కడుపు మంట తట్టుకోలేక ఈనాడులో మరో అబద్దం
-
రైతులకు మరింత ఆర్థిక చేయూత ఇవ్వండి
సాక్షి, అమరావతి: రైతులకు మరింత ఆర్థిక చేయూతనిచ్చేందుకు బ్యాంకర్లు ఉదారంగా ముందుకు రావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సచివాలయంలో నాబార్డ్ క్రెడిట్ సెమినార్ జరిగింది. ఇందులో 2024–25కు నాబార్డ్ రూ.3.55 లక్షల కోట్ల అంచనాతో రూపొందించిన స్టేట్ ఫోకస్ పేపర్‌ను కాకాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. గ్రామీణాభివృద్ధి రంగం బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అన్ని విధాలుగా చేయూతనిచ్చిన నాబార్డ్‌ను అభినందిస్తున్నానన్నారు. వ్యవసాయం, నీటిపారుదల, సామాజిక, గ్రామీణ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డ్ మద్దతునివ్వడం అభినందనీయమని తెలిపారు. వ్యవసాయ రంగంలో సవాళ్ల పరిష్కారం, స్థిరమైన వృద్ధి సాధన కోసం ప్రభుత్వం, కార్పొరేట్ రంగం, ఆర్థిక సంస్థలతో కలిసి నాబార్డ్ రోడ్‌మ్యాప్ తయారుచేయాలని సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాల్యూ చైన్, విలువ జోడింపు, కౌలు రైతులకు విరివిగా రుణ సదుపాయం కల్పించాలన్నారు. నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్ మాట్లాడుతూ 2024–25కి రాష్ట్ర రుణ ప్రణాళికను రూ.3.55 లక్షల కోట్లుగా అంచనా వేశామన్నారు. ఇది 2023–24తో పోలిస్తే 24 శాతం అధికమన్నారు. ఈసారి 38 శాతం పంట రుణాలు, 25 శాతం ఎంఎస్ఎంఈ, 13 శాతం వ్యవసాయ టర్మ్, 4 శాతం వ్యవసాయ అనుబంధ అవసరాలకు, 2 శాతం వ్యవసాయ మౌలిక వసతుల కల్పనకు, 18 శాతం ఇతర రంగాలకు రుణాలు ఇచ్చేలా æప్రణాళిక తయారు చేశామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.2.04 లక్షల కోట్లు, పంట రుణాలకు రూ.1.36 లక్షల కోట్లుగా అంచనా వేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, కమిషనర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అహ్మద్ బాబు, వ్యవసాయ, ఉద్యాన శాఖల కమిషనర్లు శేఖర్‌బాబు, శ్రీధర్, పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండ్యన్, ఆర్బీఐ జీఎం ఆర్కే మహానా, ఎస్ఎల్బీసీ కన్వ్నిర్ ఎం.రవీంద్రబాబు, నాబార్డ్ జీఎం డాక్టర్ కేవీఎస్ ప్రసాద్, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ శారదా జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నేడు విశాఖ జిల్లాలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పర్యటన
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లాలో 29 మంది ఎంపీలతో కూడిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ శనివారం పర్యటించనుంది. పద్మనాభం మండలం రెడ్డిపల్లి గ్రామ సచివాలయంతో పాటు అదే జిల్లాలోని ఆనందపురం మండలం శొంఠ్యాం, చందక గ్రామాల్లో పర్యటించి అక్కడ చేపడుతోన్న పనులను పరిశీలించనుంది. ఏపీతో పాటు తమిళనాడు, మహారాష్ట్రల్లో క్షేత్రస్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖ చేపడుతోన్న కార్యక్రమాలను పరిశీలించేందుకు శనివారం నుంచి ఈ నెల 31 వరకు ఎంపీల బృందం పర్యటించనుంది. ఇందులో భాగంగా వైఎస్సార్ జగనన్న భూ రక్ష, భూ సర్వే కార్యక్రమంలో గ్రామ కంఠాల పరిధిలోని ఇళ్ల యజ మానులకు కొత్తగా యాజమాన్య హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించనుంది. ఇది కూడా చదవండి: జాతీయ స్థాయిలో సత్తాచాటిన కాకినాడ.. స్మార్ట్ సిటీ అవార్డుల్లో రెండో స్థానం -
జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం విశిష్టమైనది: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలన్న సీఎం.. అర్బన్ ప్రాంతాల్లో కూడా డిజిటల్ లైబ్రరీలను తీసుకురావాలన్నారు. చేయూత కింద స్వయం ఉపాధి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్న సీఎం.. లబ్ధిదారులు తొలి విడత డబ్బు అందుకున్నప్పుడే స్వయం ఉపాధి కార్యక్రమానికి అనుసంధానం చేస్తే ఆ మహిళకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ‘‘గ్రామీణాభివృద్ధి శాఖ కింద చేపట్టే ఉపాధి కార్యక్రమాలపై నిరంతరం సమీక్ష చేయాలి. ఆ కార్యక్రమాల పనితీరుపై మదింపు చేసేందుకు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నివేదికల ఆధారంగా ఆ యూనిట్లు విజయవంతంగా నడిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలి’’ అని సీఎం సూచించారు. చదవండి: విశాఖలో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే.. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం విశిష్టమైనది, ప్రతి గ్రామ సచివాలయంలో సర్వేయర్‌ను నియమించడంవల్ల ఈ ప్రాజెక్టు సజావుగా ముందుకు సాగుతోంది. అలాగే గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు కూడా ప్రారంభించిన ఘనత మన రాష్ట్రానికే దక్కుతుంది. జగనన్న కాలనీలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. మౌలిక సదుపాయాలు దగ్గరనుంచి ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. జగనన్న కాలనీలను ఆహ్లాదంగా, పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలి. లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నందున మౌలిక సదుపాయాలు విషయంలో రాజీ పడొద్దు. అపరిశుభ్రతకు ఈ కాలనీలను నిలయంగా మారకూడదు. అందుకనే కాలనీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.‘‘స్వయం ఉపాధి కార్యక్రమాల్లో మహిళలకు చేయూతనిచ్చి నడిపించడం అన్నది చాలా కీలకం. ఆగస్టు 10న మహిళలకు సున్నావడ్డీ కార్యక్రమం నిర్వహించాలి’’ అని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశానికి సీఎస్ జవహర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
నెట్టింట అభిమానం.. మహానేత మురిసిపోయిన వేళ..
ఈరోజు.. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాల రూపురేఖలు సమూలంగా మారాయి. ఏ గ్రామంలో చూసినా సచివాలయం కనిపిస్తోంది. ఏ గ్రామానికి వెళ్లినా కూడా 50 మందికి ఒక వాలంటీర్ కనిపిస్తాడు. మరో నాలుగు అడుగులు వేస్తే నాడు నేడుతో రూపురేఖలు మారిపోయిన ఇంగ్లీష్ మీడియం బడులు కనిపిస్తున్నాయి.. ఇంకో నాలుగు అడులేస్తే.. విలేజ్ క్లినిక్ కనిపిస్తోంది.. ఆ విలేజ్ క్లినిక్‌లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఆధారంగా అన్ని రకాల జబ్బులకు వైద్యం అందించే డాక్టర్ కనిపిస్తున్నాడు.. దేశానికి రైతన్న వెన్నెముక అయితే.. ఆ రైతన్న చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న ఆర్బీకే వ్యవస్థకు పల్లెలే కేంద్రాలయ్యాయి జగనన్న ప్రభుత్వం వేసే ప్రతీ అడుగుతోనూ పల్లె మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నాడు జాతిపిత మహాత్మా గాంధీ.. మొన్న తండ్రి వైఎస్సార్ కలగంది.. నేడు జగనన్న సాధించిన గ్రామ స్వరాజ్యం ఇది! ‘‘గ్రామాలు అన్నింటా గణతంత్రంగా వ్యవహరించగలగాలి. సొంత అవసరాలకోసం ఇతరులపై ఆధారపడకూడదు. స్వావలంబన సాధించాలి. గ్రామాలు బావుంటేనే దేశం బాగుంటుంది’.. మహాత్ముడు చెప్పిన మాటల్ని ఆ మహానేత కలగన్నాడు. కానీ, అది పూర్తిస్థాయిలో జరగలేదు. అయితే ఆ గ్రామ స్వరాజ్యం ఇప్పుడు.. తన బిడ్డ పాలనలో కనిపిస్తోంది. అందుకే ఆ దివంగత నేత మురిసిపోతున్నారు!. పల్లెలు దేశానికి పట్టుకోమ్మలు. గ్రామాలు బాగుంటేనే ఆ రాష్ట్రం.. దేశం బాగుంటాయి. అందుకే పల్లె ప్రగతి ప్రధానంగా ప్రతీ అడుగు వేయాలని మహానేత తలిచారు. గ్రామాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగారు. కానీ, గ్రామాల రూపురేఖల్ని సమూలంగా మార్చేయడం మాత్రం ఆ మహానేత బిడ్డ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే సాధ్యమయ్యింది. జులై 8వ తేదీన వైఎస్సార్ జయంతి. కానీ, అంతకంటే ముందుగానే అభిమానుల కోలాహలం నెట్టింట కనిపిస్తోంది. ఈ క్రమంలో ‘‘నేను కన్నకల.. నా బిడ్డ పాలనలో నెరవేరిన వేళ’’.. అంటూ దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరిట ఆ ఫొటో వైరల్ అవుతోంది. పల్లె ప్రగతిని కోరుకున్న వైఎస్సార్‌కు గౌరవ సూచీగా.. ఆయన జయంతిని ‘గ్రామీణ స్వరాజ్య దినోత్సవం’గా ప్రకటిస్తే బాగుంటుంది కదా అంటూ కొందరు అభిమానులు ఏపీ ప్రభుత్వాన్ని కోరుతుండడం గమనార్హం. అధికారంలోకి రాగానే గ్రామ స్థాయిలో సచివాలయం ఏర్పాటుకు చేస్తాను-వైఎస్ జగన్ #YSR8thVardanthi #YSRKutumbam — YSR Congress Party (@YSRCParty) September 2, 2017 సీఎం వైఎస్ జగన్.. చెప్పాడంటే చేస్తాడంతే.. మాట ఇస్తే మడమ తప్పని నైజం.. పేరుతో పలకరింపు.. అన్నదాతల కోసం తాపత్రయం.. జనసంక్షేమమే ధ్యేయం.. ప్రాంతాలకతీతంగా అభివృద్ధి చెందాలనే తలంపు.. సాగునీటితోనే సమాగ్రాభివృద్ధి అనే ప్రగాఢ విశ్వాసం. ఇవన్నీ కలగలిపిన రూపం దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి. ఆయన గుణాలు పుణికిపుచ్చుకున్న బిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇప్పుడు జనానికి పెద్ద బిడ్డ అయ్యాడు. జగనన్న సంక్షేమ పాలనలో ఆ మహానేత.. జనం చిరునవ్వు రూపంలో ఇంకా మనమధ్యే ఉన్నాడు. -
వృద్ధికి ఊతం.. ప్రైవేటు వినియోగం
ముంబై: దేశీయ వృద్ధికి ప్రైవేటు వినియోగం ఊతం ఇస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆర్టికల్ ఒకటి పేర్కొంది. ఆయా అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) గ్రామీణాభివృద్ధి, తయారీ రంగాల పునరుద్ధరణకు ఊతం ఇస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆర్బీఐ అభిప్రాయాలగా పరిగణించకూడని ఈ ఆర్టికల్ ‘‘ప్రస్తుత ఎకానమీ పరిస్థితి’’ పేరుతో సెంట్రల్ బ్యాంక్ బులిటెన్‌లో ప్రచురితమైంది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ కథనాన్ని రచించింది. నివేదిక పేర్కొన్న మరిన్ని అంశాలను పరిశీలిస్తే.. చదవండి: అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్! ► అంతర్జాతీయ మందగమనం, అధిక ద్రవ్యోల్బణం తీవ్రత తగ్గాయి. బ్యాంకింగ్ నియంత్రణ, పర్యవేక్షణల్లో మెరుగుదల నమోదయ్యింది. గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లలో అనిశ్చితి కొంత తగ్గింది. ► ఇక దేశీయంగా చూస్తే 2023 మే తొలి భాగంలో ఆర్థిక సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. రెవెన్యూ వసూళ్ల పెరుగుదల, ద్రవ్యోల్బణం తగ్గుదల వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ► ఆర్బీఐ పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2023 ఏప్రిల్ 5 శాతం దిగువకు వచ్చింది. కార్పొరేట్ ఆదాయాలు ఆదాయాలకు మించి నమోదయ్యాయి. ► బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలు కూడా ఆదాయాల విషయంలో మంచి పనితీరును కనబరిచాయి. రుణ వృద్ధి పెరిగింది. మరిన్ని బిజినెస్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
తాడేపల్లి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, మహిళల స్వయం సాధికారిత కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పలు పథకాల ద్వారా వారికి జీవనోపాధి కల్పించే మార్గాలను మరింత విస్తృతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. చేయూత కింద అర్హత సాధించిన లబ్ధిదారులకు వరుసగా నాలుగేళ్లపాటు క్రమం తప్పకుండా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని సీఎం అన్నారు. అలానే ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల కింద కూడా నిర్ణయించిన వ్యవధి మేరకు క్రమం తప్పకుండా వారికి ఆర్థిక సహాయం అందుతుందని సీఎం అన్నారు. ఈ డబ్బు వారి జీవనోపాధికి ఉపయోగపడేలా ఇప్పటికే ప్రభుత్వం బ్యాంకుల సహాయంతో స్వయం ఉపాధి మార్గాలను అమలు చేస్తోందని, దీన్ని మరింత విస్తృతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ►లబ్ధిదారులకు పథకాన్ని అందుకునే మొదటి ఏడాదినుంచే వారిని స్వయం ఉపాధి మార్గాలవైపు మళ్లించే కార్యక్రమాలను మరింత పెంచాలని, దీనివల్ల గ్రామ స్థాయిలో సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా వేగంగా అడుగులుపడతాయన్న సీఎం ►అర్హులైన మహిళల్లో మరింత అవగాహన కల్పించి బ్యాంకుల నుంచి కూడా రుణాలు ఇప్పించి ఉపాధి కల్పించే మార్గాలను సమర్థవంతంగా కొనసాగించాలన్న సీఎం ►మహిళలు తయారు చేస్తున్న వస్తువులు, ఉత్పాదనలకు సంబంధించి మంచి మార్కెట్ వ్యవస్ధ ఉండాలన్న సీఎం ►దీనికోసం బహుళజాతి కంపెనీలతో అనుసంధానం కావాలన్న సీఎం ►45-60 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల సాధికారతే లక్ష్యంగా చేయూత పథకం ►ఇప్పటివరకూ చేయూత పథకం ద్వారా 9 లక్షలమంది స్వయం ఉపాధి పొందుతున్నారని అధికారులు వెల్లడి ►హిందుస్తాన్ యూనీలీవర్, ఐటీసీ లిమిటెడ్, రిలయెన్స్, అజియో, జీవీకే, మహేంద్ర, కాలాగుడి, ఇర్మా, నైనా, పీ అండ్ జీ వంటి అంతర్జాతీయ సంస్ధలతో ఇప్పటికే ఒప్పందాలు జరిగాయన్న అధికారులు ►ఈ కార్యక్రమం ద్వారా చేయూత మహిళా మార్టు, వస్త్ర, చింతపండు ప్రాసెసింగ్ యూనిట్, లేస్ పార్కు, ఇ– కామర్స్, ఇ–మిర్చ, బ్యాక్ యార్డు పౌల్ట్రీ, ఆనియన్ సోలార్ డ్రయ్యర్లు ఏర్పాటు వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్టు తెలిపిన అధికారులు. ►గ్రామీణ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను మార్కెట్ ధర కంటే తక్కువకే అందించాలన్న లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల మహిళలతో సూపర్ మార్కెట్లు ఏర్పాటు ►జిల్లాకు కనీసం రెండు సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపిన అధికారులు ►మొత్తం 27 చేయూత మహిళా మార్టులు ఏర్పాటు ►ఒక్కో సూపర్ మార్టులో కనీసం నెలకు రూ.30 లక్షలు టర్నోవర్ లక్ష్యంగా ఏర్పాటు ►వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు డోర్ డెలివరీ, ఆన్లైన్ బుకింగ్, వాట్సప్ బుకింగ్ సౌకర్యా్ని అందుబాటులోకి తెస్తున్నామన్న అధికారులు ►మల్టీ నేషన్ కంపెనీలతో భాగస్వామ్యం వల్ల వారి ఉత్పత్తుల్లో కనీసం 8 నుంచి 25 శాతం మార్జిన్ ఉండేట్టు ఏర్పాటు చేశామని వెల్లడి ►కాకినాడ జిల్లాలో సామర్లకోటలో వస్త్ర పేరుతో ఏర్పాటు చేసిన దుస్తుల తయారీ యూనిట్లో 200 మంది మహిళలకు ఉపాధి ►ట్రెండ్స్, అజియో వంటి కంపెనీలతో ఒప్పందం ►చిత్తూరు జిల్లా కురుబలకోటలో చింతపండు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు ►ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 3వేల కుటుంబాలకు చేయూత. ఉపాధి హామీపైనా సమీక్ష ►ఉపాథి హామీలో భాగంగా ఈ ఏడాది 1500 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యం ►ఇప్పటివరకూ 215.17 లక్షల పనిదినాల కల్పన ►పనిదినాల రూపంలో రూ. 5280 కోట్ల రూపాయలు ఉపాధిహామీ కింద ఖర్చు చేయాలని లక్ష్యం ►మెటీరియల్ రూపంలో రూ.3520 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని లక్ష్యం ►మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8800 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యం ►గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా రావాల్సిన ఉపాథిహామీ డబ్బులు సుమారు రూ.880 కోట్లు రావాల్సి ఉందని తెలిపిన అధికారులు ►ఈ డబ్బులు తెచ్చుకోవడంపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం ►గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్కులు పూర్తిచేయాలన్న సీఎం ►గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీల నిర్మాణం పైన కూడా దృష్టిపెట్టాలన్న సీఎం ►రోడ్ల నాణ్యతపైనా మరింత దృష్టిపెట్టాలన్న సీఎం ►రోడ్డు వేస్తే కనీసం ఐదేళ్లపాటు నిలిచేలా నాణ్యత పాటించాలి ►వేసిన మరుసటి సంవత్సరమే మళ్లీ రిపేరు చేయాల్సిన పరిస్థితి రాకూడదు ►ఆ మేరకు అధికారులు అన్ని చర్యలూ తీసుకోవాలన్న సీఎం ►ఇంజినీర్లు వీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ సూర్యకుమారి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ పి బసంత్ కుమార్, సెర్ప్ సీఈఓ ఏ ఎండి ఇంతియాజ్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: ‘అవినాష్‌ను అనుమానించదగ్గ ఆధారాలు సీబీఐ దగ్గర లేవు’ -
AP Budget 2023-24: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 15,873 కోట్ల
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుస్థిరమైన జీవనోపాధిని కల్పించడానికి, గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతమైన ఆస్తులను సృష్టించడానికి 16 ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మహత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కల్పనా హామీ పథకం (ఎమ్‌జీఎన్‌ఆర్‌జీఎస్) అమలు చేస్తోంది. ఈ ఆస్తులలో 10,917 గ్రామ సచివాలయ భనాలు, 10,243 వ్యవసాయ ఉత్పత్తులను నిల్వచేసే నిర్మాణాలు, 8,320 భారత్ నిర్మాణ సేవా కేంద్రాలు, ఎక్కువ మోతాదులో పాల శీతలీకరణ చేసే 3,734 పాల శీతలీకరణ యూనిట్లు, నీటి సంరక్షణా కట్టడాలు ఉన్నాయి. డిసెంబర్ 2022 నాటికి ఈ రంగంలో సుమారుగా 18,39 కోట్ల పని దినాలు కల్పించాయి. అంతేగాక 98 శాతం చెల్లింపులు 15 రోజులలోపు చేశారు. ఉచితంగా బోరు బావులు తవ్వి పంపుసెట్లను ఏర్పాటు చేస్తూ, తద్వారా సాగు యోగ్యమైన భూములకు నీటిపారుదల సౌకర్యాన్ని పెంచేవిధంగా సీఎం జగన్.. సన్న, చిన్నకారు రైతుల కోసం వైఎస్సార్ జలకళ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 28, 2020న ప్రారంభించారు. ఇప్పటి వరకు 17,047 బోరు బావులు తవ్వడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వంలో కుళాయి కనెక్షన్ల ద్వారా సుమారు 65 లక్షల ఇళ్లకు సురక్షిత మంచినీటిని అందించింది. జగనన్న కొత్త హౌసింగ్ కాలనీలతో సహా 2024 సంవత్సరం నాటికి రాష్ట్రంలోని అన్ని కుటుంబాలు వీటి కిందకు తీసుకురాబడతాయి. అంతేగాక 250 అంతకంటే ఎక్కువ జనాభా ఉండి రహదారుల అనుసంధానం లేని అన్ని నివాసాలకు అనుసంధానించడానికి 'ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారి ప్రాజెక్టు'ను అమలు చేస్తోంది. ఇప్పటివరకు 1,737 కి.మీ. రహదారుల పొడవుతో సుమారు 1,198 ఆవాసాలు ఈ ప్రాజెక్టు క్రింద అనుసంధానం చేయబడ్డాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3,692 కి.మీ. రహదారి పొడవుతో అదనంగా 2,461 ఆవాసాలను కలుపుటకు ఈ ప్రాజెక్టు క్రింద ప్రణాళిక చేయబడింది. ప్రయోజనకరమైన ఈ రహదారుల అనుసంధానం వలన మార్కెట్ మెరుగుపడి రోజువారీ వేతనాల పెరుగుదలకు దారితీసింది. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి 15,873 కోట్ల రూపాయల కేటాయించింది. చదవండి: AP Budget: మహిళా సాధికారతే ధ్యేయంగా.. -
పల్లెకు పట్టాభిషేకం
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో పల్లెకు పట్టాభిషేకం చేశారు. అత్యధిక కేటాయింపులు చేసి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు అగ్రతాంబూలం ఇచ్చారు. మొత్తం రూ.2,90,396 కోట్ల బడ్జెట్లో పీఆర్‌శాఖకు రూ.31,426 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్లో ఇచ్చిన రూ.29.586 కోట్ల కేటా యింపుల కంటే రూ.1,840 కోట్లు అధికం. ఐతే పీఆర్ శాఖతోపాటు మిషన్ భగీరథకు ఇచ్చిన రూ. 600 కోట్లు కూడా కలిపితే ఉమ్మడిగా (పీఆర్, ఆర్డీ, మిషన్‌భగీరథ శాఖకు కలిపి) రూ.32,026 కోట్లు కేటాయించినట్టు అవుతుంది. వివిధ పథకాలు, కార్యక్రమాలకు బడ్జెట్ కేటాయింపులు కోరుతూ ఈ శాఖ ఉన్నతాధికారులు పంపిన ప్రతిపాదనలకు ఆర్థికశాఖ చాలామటుకు ఆమోదముద్ర వేసినట్టు సమాచారం. కొత్తగా వేసే గ్రామీణ రోడ్లతోపాటు గతంలో వేసిన రోడ్ల నిర్వహణకు కలిపి రూ.2,587 కోట్లు, మిషన్ భగీరథ మెయింటెనెన్స్, మిషన్‌భగీ రథ ఇతర ఖర్చుల కోసం రూ.1,600 కోట్లు, జూని యర్ పంచాయతీ సెక్రెటరీల సర్వీసుల క్రమబద్ధీక రణ, దానికి తగ్గట్టుగా వేతనాల పెంపు నిమిత్తం రూ.315 కోట్లు, వడ్డీలేని రుణాల కోసం రూ.849 కోట్లు, గ్రామీణ దారిద్య్ర నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగుల పేస్కేళ్ల సవరణ నిమిత్తం కేటాయింపులు చేశారు. కాగా, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి నిధులతో పాటు పైనాన్స్ కమిషన్ నిధులను కూడా స్థానిక సంస్థల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల స్థానిక సంస్థల ప్రజాప్రతిని ధులు ఫైనాన్స్ ట్రెజరీల ఆమోదం కోసం వేచిచూడ కుండా స్వతంత్రంగా నిధులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. -
వివక్షపై.. నమ్రత పిడికిలి
ఇటీవల ఓ ఎయిర్‌లైన్స్ సంస్థ దివ్యాంగ పిల్లవాడిని విమానంలో ఎక్కడానికి అనుమతించలేదు. ‘‘ప్రత్యేక అవసరాలు కలిగిన ఇతనివల్ల మిగతా ప్రయాణికులు ఇబ్బంది పడతారు’’ అని సాకును చూపిస్తూ పిల్లవాడిని విమానంలోకి ఎక్కడానికి నిరాకరించింది. ఈ సంఘటనను చూసిన వారంతా..ఇంత చిన్నచూపా? ఇదేం పని? అంటూ విమర్శిస్తూనే వారి అమానుషత్వాన్ని తీవ్రంగా ఖండించారు. అయితే 35 ఏళ్ల నమ్రత మాత్రం అందరిలా ‘అయ్యోపాపం’ అనో, పిడికిళ్లు బిగించో ఊరుకోలేదు. దివ్యాంగులను విమాన సిబ్బంది అలా ఎలా అడ్డుకుంటారు? ఇది సరైంది కాదంటూ ఏకంగా ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది. ‘‘నాకు ఒక చెవి వినపడదు. చుట్టూ ఉన్నవారు నన్ను ఎంత అవహేళనగా చూస్తారో ఆ బాధ నాకు తెలుసు’’ అని చెబుతూ తనలా సమాజంలో వివక్షకు గురవుతోన్న ఎంతోమంది అట్టడుగు వర్గాల వారి తరపున నిలబడి పోరాడుతోంది నమ్రత. మేఘాలయకు చెందిన అమ్మాయి నమ్రతాశర్మ. గోర్ఘా కమ్యునిటీలో ఎనిమిదో తరానికి చెందిన అమ్మాయి. నాగాలాండ్‌లో పుట్టడడం వల్ల నమ్రతకు నేపాలీ కూడా మాట్లాడం వచ్చు. మేఘాలయలో పోస్ట్రుగాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత గ్రామీణాభివద్ధి సెక్టార్లో ఉద్యోగం రావడంతో బీహార్ వెళ్లింది. ఉద్యోగం వల్ల వినికిడి పోయింది... ఎవరికైనా ఉద్యోగం వస్తే కష్టాలన్నీ పోయి సంతోషంగా అనిపిస్తుంది. నమ్రతకు మాత్రం ఉద్యోగంతో పెద్ద కష్టమే వచ్చింది. మేఘాలయాలో పెరిగిన నమ్రత ఉద్యోగరీత్యా బీహార్‌కు వచ్చింది. అక్కడి వాతావరణం మేఘాలయకు పూర్తి భిన్నంగా ఉండడంతో ఆమెకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఉద్యోగ విషయంలో అంతా బాగానే ఉన్నప్పటికీ వేడి ఎక్కువగా ఉండడం వల్ల తరచూ డీహైడ్రేషన్‌కు గురయ్యేది. ప్రారంభంలో సర్దుకున్నప్పటికీ క్రమంగా తన చెవి నరాలు ఎండిపోయి వినికిడి శక్తిని కోల్పోయింది. తనతో ఎవరు మాట్లాడినా సరిగా వినిపించేది కాదు. దీంతో తన సహోద్యోగులంతా ‘హే చెవిటిదానా’ అని పిలిచి పెద్దగా నవ్వుకునేవారు. నమ్రత మాటల్లో నేపాలీ యాస ధ్వనించడంతో ‘ఏ నేపాలీ’ అని కూడా ఆమెను కించపరిచేవారు. ఇలా పదేపదే జరగడంతో నమ్రతకు చాలా బాధగా అనిపించేది. గొంతుకగా నిలవాలని కొంతమంది తనకు సాయం చేస్తామని చెప్పి ఆమె మీద జోకులు వేసి నవ్వుకోవడాన్ని భరించలేని నమ్రతకు... ‘‘నాకు ఒక్క చెవి వినపడకపోతేనే ఇలా గేలిచేస్తున్నారు. కొంతమందికి పూర్తిగా వినపడదు. అలాంటి వాళ్ల పరిస్థితి ఏంటీ?’’ అనిపించింది. ఇలా అవమానాలు ఎదుర్కొంటోన్న వారికి సాయపడాలని నిర్ణయించుకుంది. దళిత, ఆదివాసి మహిళలు, అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలు ఎవరైతే వినికిడి శక్తిని కోల్పోయారో, మాట్లాడలేరో, అలాంటి వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ వారికి గొంతుకగా నిలబడుతోంది. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకోసం నమ్రత వేసిన పిటిషన్ ఇది తొలిసారి కాదు. గతంలో కూడా నమ్రత బెంగళూరులో ఉన్నప్పుడు.. అక్కడ ఉన్న ఒకే ఒక డెఫ్ ఇన్స్టిట్యూట్ ‘టెక్నికల్ ట్రై నింగ్ స్కూల్’ను మెట్రో నిర్మాణంలో భాగంగా కూల్చివేయాలని నిర్ణయించారు. ఈ స్కూలును కూల్చవద్దని పిటిషన్ వేసింది. దీనికి అక్కడి స్థానికులు కూడా మద్దతు తెలపడంతో స్కూలు కూల్చడాన్ని మెట్రో అధికార యంత్రాంగం వాయిదా వేసింది. ఆ తర్వాత ‘పాతాల్‌లోక్’ వెబ్ సిరీస్ లో ఈశాన్య దేశాల ప్రజలను కించపరిచే విధంగా మాటలు ఉన్నాయని, వాటిని తొలగించాలని పిటిషన్ వేసింది. ఇలా సమాజంలో ఎదురయ్యే అనేక వివక్షలను గొంతెత్తి ప్రశ్నిస్తూ ఎంతోమందికి కనివిప్పు కలిగిస్తూ సమాజాభివద్ధికి తనవంతు సాయం చేస్తోంది నమ్రత. మానవత్వం చూపాలి మనుషులమని మర్చిపోయి ప్రవర్తించడం చాలా బాధాకరం. మనుషుల్లో కొంతమంది పొడవుగా, మరికొంతమంది పొట్టిగా, వివిధ రకాల రంగూ, రూపురేఖలతో విభిన్నంగా ఉంటారు. అంతమాత్రాన వాళ్లు మనుషులు కాకుండా పోరు. ఎటువంటి లోపాలు, అంతరాలు ఉన్నప్పటికీ వాళ్లు మనలాంటి మనుషులని గుర్తించాలి. వికలాంగుల పట్ల వివక్ష చూపకూడదు. మానవత్వం చూపాలి. – నమ్రతా శర్మ -
గ్రామీణాభివృద్ధి శాఖకు స్కోచ్ పురస్కారం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ‘స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్–2021’లో ఏపీ.. దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. గ్రామీణ పాలనలో అత్యుత్తమ విధానాలను అవలంబిస్తున్న రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఇందులో భాగంగా ‘స్టార్ ఆఫ్ గవర్నెన్స్’ స్కోచ్ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ ఎంపికైనట్లు స్కోచ్ గ్రూప్ ఎండీ దీపక్ దలాల్ ప్రకటించారు. జూన్ 18న ఢిల్లీలో ఇండియన్ గవర్నెన్స్ ఫోరం ఆధ్వర్యంలో జరగనున్న కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధానం చేయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదికి రాసిన లేఖలో ఆయన తెలిపారు. స్టార్ ఆఫ్ గవర్నెన్స్ స్కోచ్ అవార్డుకు ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ ఎంపికవ్వడంపట్ల డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు సంతోషం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ అమలుచేస్తున్న అత్యుత్తమ విధానాలు, విప్లవాత్మకమైన సంస్కరణల ఫలితంగానే జాతీయ స్థాయిలో ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు ఈ అరుదైన గుర్తింపు లభించిందన్నారు. గ్రామీణ పాలనలో ముఖ్యమంత్రి ముందుచూపుతో తీసుకొచ్చిన మార్పులు జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయని తెలిపారు. పారదర్శక పాలన, ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లడం వంటి అంశాలతో గ్రామీణాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ విజయవంతమైన ఫలితాలను సాధిస్తోందని, దానికి నిదర్శనమే ఈ స్కోచ్ అవార్డని అన్నారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ ద్వివేది, ఇతర అధికారులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. -
ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు దక్కిన మరో అరుదైన గౌరవం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖకు మరో అరుదైన గౌరవం దక్కింది. గ్రామీణ పాలనలో అత్యుత్తమ విధానాలను అవలంభిస్తున్న రాష్ట్రంగా ప్రతిష్టాత్మక ''స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్-2021''లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. దీనిలో భాగంగా ''స్టార్ ఆఫ్ గవర్నెన్స్-స్కోచ్ అవార్డు''కు ఆంధ్రప్రదేశ్ ఎంపికైనట్లు స్కోచ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ దలాల్ ప్రకటించారు. జూన్ 18వ తేదీన ఢిల్లీలో ఇండియన్ గవర్నెన్స్ ఫోరం ఆధ్వర్యంలో జరుగనున్న కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదికి రాసిన లేఖలో ఆయన వెల్లడించారు. చదవండి: నారా వారి ఏలుబడి.. నయవంచనే పెట్టుబడి! స్టార్ ఆఫ్ గవర్నెన్స్-స్కోచ్ అవార్డుకు ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ ఎంపికవ్వడం పట్ల రాష్ట్ర డిప్యూటీ సీఎం (పిఆర్ అండ్ ఆర్డీ) బూడి ముత్యాలనాయుడు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు, విప్లవాత్మకమైన సంస్కరణల ఫలితంగానే జాతీయ స్థాయిలో ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు అరుదైన గుర్తింపు లభించిందని అన్నారు. గ్రామీణ పాలనలో సీఎం జగన్ ముందుచూపుతో తీసుకొచ్చిన మార్పులు జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయని తెలిపారు. పారదర్శక పాలన, ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలను తీసుకువెళ్ళడం వంటి అంశాలతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధిలో విజయవంతమైన ఫలితాలను సాధిస్తోందని, దానికి నిదర్శనమే తాజాగా స్టార్ ఆఫ్ గవర్నెన్స్ స్కోచ్ అవార్డుకు ఎంపిక అవ్వడమని అన్నారు. ఇందుకు గానూ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఇతర అధికారులు, ఉద్యోగులను ఆయన అభినందించారు. -
గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి
ఉంగుటూరు: గ్రామీణ ప్రాంతాలు సమగ్రమైన అభివృద్ధి సాధించినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్లో విద్యార్థులతో ఆయన మంగళవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించేందుకు నిపుణులైన యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువతలోని నైపుణ్యానికి మెరుగులు దిద్దేందుకు విద్యాసంస్థలు, కార్పొరేట్, వ్యాపారసంస్థలు చొరవ తీసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీలు ప్రజలకు నైపుణ్యాభివృద్ధిని అందించి వారు ఆర్థికంగా ఎదిగేందుకు సహకరించాలేగానీ ఉచితాలను అలవాటు చేయడం వలన ప్రయోజనం ఉండదని చెప్పారు. సంతోషమయ జీవనానికి సేవే అత్యుత్తమ సాధనమని, ఆధ్యాత్మికతలోని అంతరార్థం సాటివారికి సేవచేయడమేనని పేర్కొన్నారు. మాతృభాషను, సంస్కృతిని పరిరక్షించుకుని ముందుతరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. తొలుత చేతన ఫౌండషన్, రామినేని ఫౌండేషన్ సంయుక్తంగా మహిళలకు అందజేసిన కుట్టుమిషన్లు, బాలబాలికలకు సైకిళ్లు, చిరు వ్యాపారులకు తోపుడు బళ్లను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో చేతన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వెనిగళ్ల రవి, ఉపాధ్యక్షుడు మోదుకూరి నారాయణరావు, బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం, రామినేని ఫౌండేషన్ నిర్వాహకుడు రామినేని ధర్మప్రచారక్, ట్రస్ట్ ట్రస్టీలు, డైరెక్టర్ పరదేశి, విద్యార్థులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: పల్లె పటిష్టం
కళ్లెదుటే గ్రామ సచివాలయం.. కళకళలాడుతున్న స్కూలు భవనాలు ఓ వైపు.. రైతుల సేవకు వెలసిన రైతు భరోసా కేంద్రం మరో వైపు.. ఆపద వేళ ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్న హెల్త్ క్లినిక్ ఇంకో వైపు.. అక్కడి నుంచి నాలుగడుగులు ముందుకేస్తే డిజిటల్ లైబ్రరీ భవనం.. ఇంకో నాలుగడుగులు వేస్తే పాల సేకరణ కేంద్రం.. సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం ఇదీ సీఎం వైఎస్ జగన్ కల. ఈ కలను సాకారం చేసేందుకు ఆయన వేసిన విత్తు మొక్కగా మొలిచి.. వృక్షంగా ఎదుగుతోంది. కళ్లెదుటే ఫలాలూ కనిపిస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ ఫలాల విలువ లక్షల కోట్లలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. సాక్షి నెట్వర్క్,ఆంధ్రప్రదేశ్: గ్రామాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్నన్ని చర్యలు ఇదివరకెన్నడూ ఏ ప్రభుత్వం తీసుకోలేదని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన రైతు ప్రగడ రాంబాబు చెబుతున్నారు. 5400 మంది జనాభా గల తమ ఊళ్లో రెండు చొప్పున గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాలు పూర్తి అయ్యాయని చెప్పారు. గతంలో ఏమ్మెల్యేను అడిగినా, ఏ భవనం మంజూరు చేసే వారు కాదని.. ఇప్పుడు అడగకుండానే రూ.2 కోట్లకు పైగా వ్యయంతో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారని చెప్పారు. పురుగు మందులు, ఎరువులు అన్నీ ఉన్న ఊళ్లోనే ఇస్తున్నారని.. ఏ సర్టిఫికెట్ కావాలన్నా, ఏ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా సచివాలయానికి వెళితే చాలని చెబుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు ఇంకా చాలానే ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వం పుణ్యమా అని తమ గ్రామం కొత్త శోభను సంతరించుకుందని, గ్రామాలకు పెద్ద ఎత్తున ఆస్తులు సమకూరాయని తెలిపారు. తనకు ఊహ తెలిశాక ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరగడం ఇదే ప్రథమం అని సంతోషం వ్యక్తం చేశారు. ఇలా రాష్ట్రంలో ఏ పల్లెకు వెళ్లి ఎవరిని కదిపినా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో అభివృద్ధి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కొన్ని ఊళ్లలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాలు పూర్తి కావడంతో గ్రామాలు కొత్త శోభను సంతరించుకోగా, మరి కొన్ని ఊళ్లలో ఈ భవనాల నిర్మాణాలతో సందడి నెలకొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే తొలి సారిగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని, జరుగుతున్నాయని జనం చెబుతున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా గ్రామాల్లో మౌలిక వసతుల కోసం ఇంత పెద్దఎత్తున నిధులు వెచ్చించలేదని ప్రజలు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రభుత్వం తక్కువలో తక్కువ ఒక్కో ఊరికి రూ.కోటికి పైగా వ్యయం చేస్తోందని చెబుతున్నారు. పెద్ద పెద్ద ఊళ్లలో రూ.రెండు కోట్ల నుంచి రెండున్నర కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా నరేంద్రపురంలో గ్రామ సచివాలయం, ఆర్బీకే రూ.12,510 కోట్లతో మౌలిక వసతుల కల్పన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామాల్లోని ప్రజలకు సంక్షేమంతో పాటు అవసరమైన మౌలిక వసతులను ఆయా గ్రామాల్లోనే కల్పించేందుకు పెద్ద పీట వేశారు. గత 29 నెలల పాలనలోనే గ్రామాల్లో స్పష్టమైన అభివృద్ధి కన్పించేలా పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. సింహ భాగం పనులు పూర్తి అయ్యాయి. మిగతా పనులు కొనసాగుతున్నాయి. ఆయా గ్రామ ప్రజల అవసరాలను తీర్చే గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్, బల్క్‌మిల్క్ యూనిట్లు, వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలతో పాటు నాడు–నేడు కింద పాఠశాలలను బాగు చేయడం తదితర పనులు చేపట్టారు. రూ.12,510 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టారు. ఇందులో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రూ.3,400 కోట్ల వ్యయంతో 15,000 స్కూల్స్ రూపు రేఖలు మార్చారు. దీంతో పాటు గ్రామాల్లో అంతర్గత రహదారులు, డ్రైనేజీ నిర్మాణ పనులు, మంచి నీటి వసతి పనులు కొనసాగుతున్నాయి. మండల, జిల్లా, నియోజకవర్గ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్థాయిలో జరిగే అభివృద్ధి పనులు వీటికి అదనం. గ్రామాల్లో మౌలిక సదుపాయాల పనులు ఇలా.. ► రూ.4,199.70 కోట్లతో 10,929 గ్రామ సచివాలయాల నిర్మాణం. ఇందులో ఇప్పటికే 3,273 పూర్తి. మరో 2,683 పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఇంకా 1,840 సచివాలయాలు రెండవ అంతస్తు దశలో ఉన్నాయి. ► రూ.2,303.47 కోట్లతో 10,408 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) ఏర్పాటు. ఇందులో ఇప్పటికే 1,746 పూర్తి. మరో 2,860 గ్రౌండ్ ఫ్లోర్ స్లాబుతో పాటు పూర్తి అయ్యే దశలో ఉన్నాయి. ఇంకా 5,803 బేస్మెంట్ స్థాయి నుంచి గ్రౌండ్ ఫ్లోర్ దశలో ఉన్నాయి. ► రూ.1,475.50 కోట్లతో 8,585 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు. ఇందులో 702 క్లినిక్స్ నిర్మాణం పూర్తి. మరో 2,008 గ్రౌండ్ ఫ్లోర్ ఫినిషింగ్ స్థాయిలో ఉన్నాయి. ఇంకా 5,875 బేస్మెంట్ స్థాయి దాటి గ్రౌండ్ ఫ్లోర్ దశలో ఉన్నాయి. ► పాడి రైతుల కోసం తొలి దశలో రూ.416.23 కోట్ల వ్యయంతో 2,541 బల్క్ మిల్స్ యూనిట్ల నిర్మాణం మొదలైంది. వివిధ దశల్లో ఉన్నాయి. ► రూ.724.80 కోట్లతో 4,530 వైఎస్సార్ విలేజ్ డిజిటల్ ల్రైబరీల పనులు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. ► నాడు–నాడు తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లోని రూ.3,400 కోట్లతో 15,000 స్కూల్స్‌లో మరమ్మత్తులు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తయింది. అభివృద్ధి కళ్లెదుటే కనిపిస్తోంది మా ఊళ్లో రూ.40 లక్షలతో గ్రామ సచివాలయ భవనం నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. రూ.25 లక్షలతో రైతు భరోసా కేంద్రం నిర్మిస్తున్నారు. రూ.14.95 లక్షలతో విలేజ్ క్లినిక్ భవనం నిర్మాణంలో ఉంది. విద్యార్థుల కోసం రూ.15 లక్షలతో డిజిటల్ లైబ్రరీ నిర్మాణం పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. బల్క్ మిల్క్ సెంటర్ కోసం రూ.17.67 లక్షలు మంజూరు చేసింది. నాడు–నేడు పథకం ద్వారా స్కూల్లో రూ.18 లక్షలతో పనులు చేపట్టారు. పెయింటింగ్, ప్రహరీ గోడ నిర్మాణం, టైల్స్, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యార్థులు కూర్చునేందుకు బెంచీలు, క్లాసు రూములో లైటింగ్, ఫ్యాన్లు ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సచివాలయం వల్ల మండల కేంద్రానికి వెళ్లే బాధ తప్పింది. గ్రామ స్థాయిలోనే అన్ని రకాల సేవలు అందించేందుకు కోట్ల రూపాయలు వెచ్చించి అవసరమైన భవనాలు నిర్మించడం సంతోషంగా ఉంది. సంక్షేమంతో పాటు ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తుంది. – చిటికెల జగదీష్, భీమ బోయిన పాలెం, మాకవరపాలెం మండలం, విశాఖ జిల్లా ఊహించలేదు.. కలలా ఉంది నల్లమల అడవికి సమీపంలోని మా ఊరు మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. 800 జనాభా. పక్కనే ఉన్న కొత్తూరును కలుపుకుని సచివాలయం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అధికారులు మా ఊళ్లోనే మాకు అందుబాటులో ఉంటున్నారు. పనుల కోసం మేము ఏ ఊరికీ పోనవసరం లేదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ పథకం కావాలన్నా అర్హత ఉంటే చాలు వెంటనే అందిస్తున్నారు. వలంటీర్ల తోడుతో చదువురాని వారు సైతం పథకాలను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందుతున్నారు. రూ.40 లక్షలతో సచివాలయం, రూ.21.80 లక్షలతో ఆర్బీకే, 17.50 లక్షలతో హెల్త్ క్లినిక్ భవనం, రూ.36 లక్షలతో సిమెంట్ రోడ్లు, స్కూల్లో అదనపు గదుల కోసం రూ.11 లక్షలు, ఇళ్లకు కుళాయిల కోసం రూ.15 లక్షలు ఖర్చు చేశారు. ఇలా చకచకా అన్నీ కళ్లెదుటే ఏర్పాటై పోతున్నాయి. అంతా కలగా ఉంది. ఇంత త్వరగా ఇంత అభివృద్ధి జరుగుతుందని మేమెవ్వరమూ ఊహించలేదు. – షేక్ పెద్ద దాదావలి, ఆరవీటికోట, రాచర్ల మండలం, ప్రకాశం జిల్లా విశాఖ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సచివాలయ భవనం -
ఏపీ: స్వయం ఉపాధిలో ‘చేయూత’ మహిళలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 45–60 ఏళ్లలోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్సార్ చేయూత పథకం తొలి విడతలో 78 వేల రిటైల్ షాపులను మహిళలు ఏర్పాటుచేశారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. తొలి విడత చేయూత లబ్ధిదారులు 1,19,000 పశువులను, 70,955 గొర్రెలు, మేకలను కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. గత ఏడాది అక్టోబర్ 12న వైఎస్సార్ చేయూత మొదటి విడత కార్యక్రమాన్ని అమలు చేశామని, దీనిలో మొత్తం 24,00,111 మంది లబ్ధిదారులకు రూ.4,500.20 కోట్ల మేర లబ్ధి జరిగిందన్నారు. రెండో ఏడాది 23.44 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు దాదాపు రూ.4,400 కోట్ల అర్థిక సాయం అందించామని మంత్రి తెలిపారు. మంచి ఆశయంతో ముఖ్యమంత్రి ప్రారంభించిన ఈ పథకాన్ని అమలుచేయడం, పర్యవేక్షించడంలో అధికారులు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని ఆయన ప్రశంసించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాంతాల వారీగా స్థానికంగా ఉన్న మార్కెటింగ్ అంశాలను అధ్యయనం చేయాలని.. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో గురువారం వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ పెన్షన్ కానుక, జగనన్న పల్లెవెలుగు, గ్రామ పంచాయతీల్లో లేఅవుట్లపై సంబంధిత అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా ఇప్పటికే రిలయన్స్, ఏజియో, మహేంద్ర అండ్ ఖేధీ వంటి ప్రముఖ సంస్థలు మహిళల వ్యాపార కార్యకలాపాలకు అవసరమైన మార్కెటింగ్‌లో శిక్షణకు ముందుకు వచ్చాయన్నారు. వీధి దీపాల నిర్వహణలో ఏజెన్సీ విఫలం గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ వీధి దీపాలను నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఏజెన్సీ పనితీరుపట్ల మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్రంలో వీధిదీపాలకు చెల్లిస్తున్న విద్యుత్ బిల్లును తగ్గించాలనే లక్ష్యంతో జగనన్న పల్లెవెలుగు కింద రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఈడీ బల్బులను ఏర్పాటుచేశామని.. అయితే వీటి నిర్వహణలో కాంట్రాక్టింగ్ ఏజెన్సీ విఫలమయ్యిందన్నారు. పట్టపగలు కూడా వీధి దీపాలు వెలుగుతుండడంపై అనేక ఫిర్యాదులు ఉన్నాయని పెద్దిరెడ్డి అన్నారు. వీటి నిర్వహణలో ఎనర్జీ అసిస్టెంట్లను భాగస్వాములను చేయాలని ఆయన కోరారు. ఇక పంచాయతీల్లో అక్రమ లేఅవుట్లను గుర్తించి, వాటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ గిరిజాశంకర్, సెర్ప్ సీఈఓ ఎన్ఎండీ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్ లైబ్రరీలన్నీ ఈ ఏడాదే పూర్తి కావాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు అన్నీకూడా ఈ ఏడాదే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. జియో ట్యాగింగ్ చేసి నిర్మాణాల తీరుపై సమీక్ష చేయాలని తెలిపారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో పలు కార్యక్రమాలపై మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రాధాన్యక్రమంలో పనులు చేపట్టాలన్నారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమానికి పెద్దపీట వేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. గ్రామాల్లో 14వేల ట్రైసైకిళ్లు గ్రామాల్లో 14వేల ట్రైసైకిళ్లు ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ అంగీకారం తెలిపారు. అలాగే అర్బన్ ప్రాంతాలకు సమీపంలో ఉన్న పల్లెల్లో 1034 ఆటోలు ఏర్పాటు, వాటితోపాటు మరిన్ని వాహనాలను కొనుగోలుకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రూరల్ ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా వెట్ వేస్టేజ్ ఉంటే దాన్ని తరలించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ఒక ప్రత్యేక నంబర్‌ను గ్రామాల్లో డిస్ప్లే చేయాలని, దానికి కాల్ చేయగానే సంబంధిత వాహనం ద్వారా వేస్టేజ్ సేకరించి ట్రీట్మెంట్ ప్లాంట్‌కు తరలించాలని అధికారులకు సూచించారు. అపరిశుభ్రత, దోమలవల్ల రోగాలు వస్తున్నాయని అలాంటి పరిస్థితులను నివారించాలన్నారు. బలోపేతమైన పారిశుద్ధ్య కార్యక్రమాల వల్ల ప్రజారోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ‘వైఎస్సార్ జలకళ’ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు వైఎస్సార్ జలకళ ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని సీఎం జగన్ అన్నారు. లక్ష మందికి పైగా రైతులకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. చిన్నచిన్న నదులపై ఉన్న బ్రిడ్జిల వద్ద చెక్‌డ్యామ్ తరహాలో నిర్మాణాలు చేపట్టాలని, కనీసం 3, 4 అడుగుల మేర అక్కడ నీరు నిల్వ ఉండేలా చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. తద్వారా భూగర్భ జలాలు బాగా పెరుగుతాయని సీఎం జగన్ తెలిపారు. వైఎస్సార్ జలకళ ప్రాజెక్టు సమర్థవంతంగా ముందుకుసాగాలని, దానిపై ఒక కార్యాచరణ తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్రిడ్జిల వద్ద ఈ నిర్మాణాలు చేయాలని, వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీరాజ్, రెవిన్యూ, మున్సిపల్ శాఖ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సమగ్రసర్వేను ఉద్ధృతంగా చేయడంపై కమిటీ దృష్టిపెట్టనుందని సీఎం జగన్ తెలిపారు. ఈ సమీక్ష సమావేశానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
‘గ్రామీణ వికాసం’లో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు తర్వాత మన రాష్ట్రంలో పైరవీలకు తావులేని పాలన నడుస్తోంది. ఫలితంగా గ్రామ పాలన వికసిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ‘స్థానిక పాలనా పరిస్థితుల’ ఆధారంగా ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డులలో ఈ ఏడాది మన రాష్ట్రం ఏకంగా 17 అవార్డులను దక్కించుకుంది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలోని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నిర్వహించే సమావేశంలో శనివారం ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. అవార్డుల పోటీలో దేశవ్యాప్తంగా 74 వేల గ్రామ పంచాయతీలు పోటీ పడినట్టు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించింది. చదవండి: తుపాన్లతో దెబ్బతిన్న రోడ్లకు వేగంగా మరమ్మతులు సీఎం సహాయ నిధికి రూ.1.33 కోట్ల విరాళం -
ఉచిత బోరుకు ప్రతి రైతు అర్హుడే
సాక్షి, అమరావతి: ఉచిత బోరు పథకానికి విస్తీర్ణంతో సంబంధం లేకుండా వ్యవసాయ భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు అర్హుడే అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వైఎస్సార్ జలకళ పథకం విధివిధానాలను సవరిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జులై 3వ తేదీ పథకం విధివిధానాలపై జారీ చేసిన ఉత్తర్వుల్లో ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులనే అర్హులుగా పేర్కొన్నారు. తాజా నిబంధనల ప్రకారం ఇప్పటి దాకా బోరు వసతి లేని, ఫెయిల్ అయిన బోర్ ఉన్న రైతులంతా అర్హులేనని పేర్కొన్నారు. ► గతంలో ఉచిత బోరు తవ్వకానికి రైతుకు కనీసం 2.5 ఎకరాల భూమి ఉండాలని, ఒక రైతుకు కనీసం 2.5 ఎకరాల భూమి లేకపోతే, గరిష్టంగా 5 ఎకరాల వరకు ఉన్న రైతులు గ్రూపుగా ఏర్పడాలన్న నిబంధనను తాజా విధివిధానాలలో సవరించారు. ► బోరు తవ్వకానికి ప్రత్యేకంగా ఎటువంటి విస్తీర్ణం పరిధిని పేర్కొనలేదు. అంటే రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న రైతు మిగిలిన వారితో సంబంధం లేకుండా తన భూమిలో ఉచిత బోరు తవ్వకానికి అర్హుడేనని అధికారులు వెల్లడించారు. ► భూగర్భ జల మట్టం ప్రమాదకర స్థాయిలో ఉన్న రాష్ట్రంలోని 1094 రెవిన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకం అమలు కాదని పేర్కొన్నారు. అయితే భూగర్భ జల మట్టాన్నిబట్టి ఈ గ్రామాల సంఖ్యలో మార్పులు ఉంటాయన్నారు. సన్న, చిన్నకారు రైతులకు పంపుసెట్, పైపులు, వైర్ ఉచితం ► సన్న, చిన్నకారు రైతులకు (ఐదు ఎకరాలలోపు భూమి ఉండే వారు) ఉచిత బోరుతో పాటు మోటార్ (పంపుసెట్) కూడా ఉచితంగా అందజేస్తారు. ఈ మేరకు సీఎం ప్రకటనకు అనుగుణంగా తాజాగా మరో ఉత్తర్వు జారీ చేశారు. ► పైపులు, విద్యుత్ వైరు, ప్యానల్ బోర్డు వంటి అనుబంధ పరికరాలను కూడా ఉచితంగా అందించనున్నట్టు పేర్కొన్నారు. ► హైడ్రో–జియోలాజికల్, జియోఫిజికల్ సర్వేలు నిర్వహించాకే బోరు బావి తవ్వకం ప్రారంభిస్తారు. అర్హత కలిగిన రైతులు ఫొటో, పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు కాపీతో గ్రామ సచివాలయంలో లేదా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ► డ్రిల్లింగ్ అనంతరం గంటకు కనీసం 4,500 లీటర్లు తోడడానికి అవకాశం ఉన్న దానినే విజయవంతమైన బోరు బావిగా పరిగణిస్తారు. అనంతరం జియో ట్యాగింగ్‌తో కూడిన డిజిటల్ ఫొటోలతో రికార్డు చేస్తారు. పారదర్శకత కోసం సోషల్ ఆడిట్ నిర్వహిస్తారు. -
పల్లెకు ప్రగతి
సాక్షి, హైదరాబాద్: పల్లె ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్ర బడ్జెట్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు దండిగా నిధులు కేటాయించింది. గ్రామీణ వికాసానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్న సర్కారు.. అదే ఒరవడిని కొనసాగించేలా బడ్జెట్‌ను ప్రతిపాదించింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.23,005.35 కోట్లను కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఇది ఏకంగా రూ.7,880.46 కోట్లు అధికం. కాగా, ఈ ఏడాది బడ్జెట్లో రూ.4,701.04 కోట్లు నిర్వహణ పద్దు కాగా, రూ.18,304.31 కోట్లు ప్రగతి పద్దు. వ్యవసాయం తర్వాత అత్యధిక నిధులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు దక్కడం విశేషం. ఆసరా పింఛన్లకు రూ.11,758 కోట్లు అసహాయులైన పేదలకు ఆసరా పింఛన్లతో అండగా నిలుస్తున్న ప్రభుత్వం.. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను ఆసరా పథకం కింద రూ.11,758 కోట్లను ప్రతిపాదించింది. గతేడాది రూ.9,402 కోట్లు కేటాయించగా.. ఈసారి అదనంగా మరో రూ.2,356 కోట్లను బడ్జెట్లో పొందుపరిచింది. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించనుండటంతో లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద 39.41 లక్షల మందికి ఆసరా పింఛన్ అందుతుండగా.. అర్హత వయసు తగ్గింపుతో మరో ఏడెనిమిది లక్షల మంది అదనంగా పింఛన్‌కు అర్హత సాధించే అవకాశముంది. దండిగా ఆర్థిక సంఘం నిధులు.. గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టింది. ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులతో పంచాయతీలకు నిధుల కొరత తీరనుంది. ఇప్పటికే ప్రతినెలా రూ.339 కోట్లు కేటాయిస్తున్న సర్కారుకు ఈ నిధుల రాకతో వెసులుబాటు కలుగనుంది. ఈ నేపథ్యంలో 2020–21లో గ్రామ పంచాయతీలకు రూ.1,393.93 కోట్ల ఆర్థిక సంఘం నిధులను అందించనుంది. గతేడాది కేవలం రూ.819.44 కోట్లు కేటాయించగా.. ఈ సారి అదనంగా రూ.574.49 కోట్లు పెంచింది. వడ్డీలేని రుణాల్లో కోత డ్వాక్రా మహిళలకు ఇచ్చే వడ్డీ రుణాలకు స్వల్పంగా కోత పెట్టింది. గతేడాది రూ.680.49 కోట్లు కేటాయించగా.. ఈ సారి 679.23 కోట్లు ప్రతిపాదించింది. అలాగే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో జరిగే పనులకు రూ.54 కోట్లు కేటాయించింది. 2019–20తో పోలిస్తే రూ.13 కోట్లు అదనం. శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద రూ.15.09 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కంటే రూ.11 కోట్లు అధికం. -
‘పల్లె’కు ఓకే..!
ఆర్థిక మందగమనం నుంచి గ్రామీణ భారతాన్ని గట్టెక్కించేందుకు మోదీ సర్కారు తాజా బడ్జెట్లో దండిగానే నిధులను కేటాయించింది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనపై ఖర్చుకు వెనుకాడబోమని స్పష్టం చేసింది. గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే కొన్ని పథకాలకు కేటాయింపులు తగ్గడం గమనార్హం. గ్రామీణ ఇళ్ల నిర్మాణం, రోడ్లపై అత్యధికంగా దృష్టిపెట్టింది. ఇప్పటికే కొన్ని పథకాల లక్ష్యాలు పూర్తవడంతో తదుపరి దశలను వేగంగా అమలు చేయనున్నట్లు బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పల్లెల్లో 2022 మార్చినాటికి అదనంగా 1.95 కోట్ల ఇళ్లను నిర్మించేందుకు సుమారు రూ.1,56,634 కోట్లను వెచ్చించనున్నారు. మరో లక్ష గ్రామ పంచాయతీలకు (2020–21)లో బ్రాడ్‌బ్యాండ్(ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్)ను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అటు వ్యవసాయంతో పాటు ఇటు గ్రామీణాభివృద్ధికి బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. గ్రామీణ సంక్షేమ పథకాలకు ఎంతంటే... 2020–21 కేటాయింపు: రూ.1,20,148 కోట్లు 2019–20 కేటాయింపు: రూ.1,17,647 కోట్లు (సవరించిన అంచనా(రూ.1.22 లక్షల కోట్లు) ‘ఉపాధి’కి హామీ... 2020–21 కేటాయింపు: రూ.61,500 కోట్లు 2019–20 కేటాయింపు: రూ. 60,000 కోట్లు (సవరించిన అంచనా రూ.71,001 కోట్లు) ► ఉపాధి హామీకి గతేడాది బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఈసారి స్వల్పంగా 2.5 శాతం పెరిగింది. సవరించిన అంచనాలతో పోలిస్తే భారీగా తగ్గింది. ► చాలా రాష్ట్రాల్లో లక్ష్యాలను మించి ఉపాధి పనులను కల్పించడంతో అధికమొత్తంలో కేంద్రం నిధులను అందించాల్సి వచ్చింది. ► ఏడాదిలో వందరోజుల పాటు కనీస ఉపాధి హామీని ఇవ్వడమే ఈ పథకం ప్రధానోద్దేశం. విద్యుత్తుకు మరింత ఊతం... (దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన) 2020–21 కేటాయింపు: రూ.4,500 కోట్లు 2019–20 కేటాయింపు: రూ.4,066 కోట్లు ► వ్యవసాయ, వ్యవసాయేతర విద్యుత్ వినియోగదారులకు ప్రత్యేక ఫీడర్లు, డిస్కమ్‌లను అందుబాటులోకి తీసుకురావడం, విద్యుత్ సబ్–ట్రాన్స్మిషన్, పంపిణీ మౌలిక సదుపాయాల పెంపు... గ్రామీణ విద్యుదీకరణ కోసం ఈ పథకాన్ని రూపొందించారు. ► 2017లో సౌభాగ్య పథకం కింద 2.5 కోట్ల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్‌ను అందించారు. ► ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్‌కు కేటాయింపులు రూ. 3970 కోట్ల నుంచి రూ. 5280 కోట్లకు పెంచారు. ► ఉజాల స్కీమ్ కింద పేద, మధ్యతరహా కుటుంబాలకు ఉచితంగా 35 కోట్ల ఎల్ఈడీ బల్బులను ఇచ్చారు. ► ఎల్ఈడీ బల్బులతో ఏటా రూ.18,341 కోట్ల మేర విద్యుత్ బిల్లులు ఆదా అవుతున్నాయి. స్వచ్ఛ భారత్‌కు దన్ను... 2020–21 కేటాయింపు: రూ.12,300 కోట్లు 2019–20 కేటాయింపు (సవరించిన అంచనా): రూ. 9,638 కోట్లు. ► 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున మొదలైన ఈ పథకం కింద ఇప్పటివరకు దాదాపు 9.6 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశారు. ► బహిరంగ మలవిసర్జన(ఓడీఎఫ్) అలవాటు దాదాపు కనుమరుగైంది. ఓడీఎఫ్ రహిత గ్రామాల సంఖ్య 5.6 లక్షలకు చేరింది. ► గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 98 శాతం శానిటేషన్ కవరేజ్ కల్పన. ► పట్టణాల్లో 95 శాతం ఓడీఎఫ్ రహితంగా మారినట్లు అంచనా. ఇప్పుడు 100 శాతం లక్ష్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ► దేశవ్యాప్తంగా 1,700 నగరాలు, పట్టణాల్లో 45,000 ప్రజా, కమ్యూనిటీ మరుగుదొడ్లను గుర్తించేందుకు వీలుగా గూగుల్ మ్యాప్స్‌కు అనుసంధానించారు. ► పూర్తిగా ఓడీఎఫ్ రహితంగా మారిన గ్రామాలు, పట్టణాల్లో దీన్ని కచ్చితంగా అమలయ్యేవిధంగా చూడటం కూడా ఈ పథకంలో భాగమే. ► ప్రతి గ్రామంలో ఘన వ్యర్థాల(చెత్త నిర్మూలన), జల వ్యర్థాల నిర్వహణను కూడా ఈ స్వచ్ఛ భారత్ పథకం కిందకు తీసుకొచ్చారు. పల్లె రోడ్లు పరుగులు 2020–21 కేటాయింపు: రూ.19,500 కోట్లు 2019–20 కేటాయింపు: రూ. 19,000 కోట్లు (సవరించిన అంచనా రూ.14,071 కోట్లు) ► దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 1,67,152 ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ కల్పించారు. ► పీఎంజీఎస్‌వై రెండో దశలో రోడ్లను మెరుగుపరడం, మావోయిస్టుల ప్రభావిత జిల్లాల్లో కల్వర్టులు, ఇతర సదుపాయాలు కల్పిస్తారు. ► 2019 డిసెంబర్ 31 నాటికి మొత్తం రెండు దశలకింద 6,08,899 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం, అప్గ్రేడేషన్ను పూర్తి చేశారు. ► వచ్చే ఐదేళ్లలో 1,25,000 కిలోమీటర్ల రోడ్లను అప్‌గ్రేడ్ చేయనున్నారు. దీనికి రూ.80,250 కోట్లు వెచ్చించనున్నారు. 2019–20లో ఇందుకు 13 రాష్ట్రాలను ఎంపిక చేశారు. గ్రామీణ టెలిఫోనీ... 2020–21 కేటాయింపు: రూ.6,000 కోట్లు 2019–20 కేటాయింపు (సవరించిన అంచనా): రూ. 2,000 కోట్లు ► భారత్ నెట్ ఫేజ్1 కింద 1,21,652 గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కనెక్టివిటీ పూర్తి. 1.16లక్షల పంచాయతీల్లో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ► దీంతో 2.5 లక్షల గ్రామాల్లోని దాదాపు 20 కోట్ల మంది గ్రామీణవాసులకు బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్ లభించింది. దీన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని(పీపీపీ) జోడించనున్నారు. ► ఐదు కోట్లమంది గ్రామీణులకు లబ్ధి చేకూరేలా 5 లక్షల వైఫై స్పాట్స్ ఏర్పాటు లక్ష్యం. ► 2020–21 ఆర్థిక సంవత్సరంలో మరో 1,00,000 గ్రామ పంచాయతీలకు ఫైబర్ ఆఫ్టిక్ నెట్‌వర్క్‌ను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక మంత్రి తాజా బడ్జెట్లో ప్రకటించారు. ‘జల్ జీవన్’తో స్వచ్ఛమైన నీరు.... 2020–21 కేటాయింపులు: రూ.11,500 కోట్లు 2019–20 కేటాయింపులు: రూ. 10,001 కోట్లు ► దేశంలో తాగునీటి సౌకర్యం లేని అన్ని మారుమూల గ్రామీణప్రాంతాలకూ సురక్షితమైన, తగినంత తాగునీటిని(హ్యాండ్ పంపులు, పైపులు ఇతరత్రా మార్గాల్లో) అందించాలనేది ఈ పథకం ప్రధానోద్దేశం. ► గతేడాది బడ్జెట్లో జల్ జీవన్ మిషన్ ను ప్రకటించారు. దీనిలోభాగంగా రూ.3.6 లక్షల కోట్ల నిధులను వెచ్చించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సీతారామన్ బడ్జెట్లో తెలిపారు. ఈ ఏడాది రూ.11,500 కోట్లను కేటాయించినట్లు వివరించారు. ► స్థానిక స్థాయిలో సమీకృత డిమాండ్, సరఫరా నిర్వహణ యంత్రాంగం; వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు తగిన మౌలిక వసతుల కల్పన, భూగర్భజలాల పెంపు, సముద్రపునీటిని మంచినీరుగా మార్చడం(డీశాలినేషన్) కూడా జల్‌జీవన్ మిషన్‌లో భాగమే. ► 10 లక్షల జనాభా దాటిన నగరాలన్నింటినీ దీని అమలు కు ప్రోత్సహించనున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. ఇంటికి ఇంకాస్త ఆసరా... 2020–21 కేటాయింపులు: రూ.19,500 కోట్లు 2019–20 కేటాయింపులు (సవరించిన అంచనా): రూ. 18,475 కోట్లు ► ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)లో భాగంగా 2022 కల్లా దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని బలహీనవర్గాలందరికీ పక్కా ఇళ్లను కట్టివ్వాలనేది కేంద్ర ప్రభుత్వ తాజా లక్ష్యం. ► పీఎంఏవై తొలి దశను 2016–17 నుంచి 2018–19 వరకూ మూడేళ్లపాటు అమలుచేశారు. గడిచిన ఐదేళ్లలో 1.54 కోట్ల ఇళ్లను నిర్మించారు. ► ఇప్పుడు రెండో దశ కింద 2019–20 నుంచి 2021–22 మధ్య 1.95 కోట్ల ఇళ్లను నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.1,56,634 కోట్లను వెచ్చించనున్నారు. ► అంతేకాదు ఈ ఇళ్లకు మరుగుదొడ్లు, విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు కూడా ఉచితంగా కల్పించనున్నారు. -
‘ఇళ్లస్థలాల’ భూముల అభివృద్ధికి ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల స్థలాల కోసం గుర్తించిన భూముల్లో అన్ని మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నడుం బిగించింది. వచ్చే ఉగాది నాటికి దాదాపు 25 లక్షల మంది పేదలకు ఇళ్లస్థలాల పంపిణీకి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా భూములు గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇళ్ల స్థలాల కోసం గుర్తించిన భూముల్లో ముళ్ల పొదల తొలగింపు, భూమి చదును చేయడం, అంతర్గత రోడ్ల నిర్మాణం, లింకు రోడ్లు నిర్మాణాన్ని ఉపాధి హామీ పథకంలో చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇళ్ల స్థలాల కోసం కేటాయింపు చేసినట్లు నిర్ణయం తీసుకున్నాకే ఆయా స్థలాల్లో పనులు చేపట్టాలని పేర్కొన్నారు. 800 మీటర్ల అంతర్గత రోడ్లు ఇళ్ల స్థలాలకు కేటాయించిన స్థలంలో ‘ఉపాధి’ నిధులతో ఏయే పనులు చేపట్టవచ్చో స్పష్టంగా పేర్కొంటూ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఉత్తర్వులిచ్చారు. ఎకరా విస్తీర్ణంలో గరిష్టంగా నాలుగు వేల క్యూబిక్ మీటర్ల పరిమాణం మేర భూమి చదునుకు అనుమతించారు. ఎకరా స్థలంలో గరిష్టంగా 800 మీటర్ల పొడవున అంతర్గత రోడ్ల నిర్మాణానికీ.. ఇళ్ల స్థలానికి కేటాయించిన స్థలం నుంచి దగ్గరగా ఉండే రోడ్డుకు కలుపుతూ గరిష్టంగా 5 కి.మీ పొడవున గ్రావెల్ రోడ్డు నిరి్మంచవచ్చని పేర్కొన్నారు. రూ. 5 లక్షల లోపు పనులకు పంచాయతీరాజ్ లేదా సాంఘిక సంక్షేమ శాఖ ఇంజనీరు విభాగాల్లో పనిచేసే డీఈఈ.. రూ. 40 లక్షల వరకు పనులను ఈఈలు.. రూ. 2 కోట్ల వరకు పనులను జిల్లా ఎస్ఈలు, అంతకు మించి విలువ చేసే పనులను ఈఎన్సీ కార్యాలయంలోని సీఈలకు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు. 12,291 ఎకరాల్లో పనులకు ప్రతిపాదనలు ఇళ్ల స్థలాల కోసం మొత్తం 12,291 ఎకరాల్లో రూ. 803 కోట్లతో నాలుగు రకాల అభివృద్ధి పనులకు ప్రతిపాదనల్ని జిల్లా అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. ఇందులో 2,702 ఎకరాల్లో పనులు చేపట్టేందుకు అనుమతుల జారీ చేసే ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన పనులకు సంబంధించి అనుమతుల జారీ ప్రక్రియ జిల్లాల్లో వేగంగా కొనసాగుతున్నట్లు అధికారులు వివరించారు. -
గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం...
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం పంచాయతీరాజ్ శాఖను ఒడిదుడుకులకు గురిచేసింది. బడ్జెట్లో ఆ శాఖ కేటాయింపులను తీవ్రంగా ప్రభావితం చేసింది. గ్రామీణాభివృద్ధికి ఆశాజనకంగా నిధులు కేటాయించినా.. పంచాయతీరాజ్ విభాగానికి మాత్రం కోత పడింది. గ్రామీణ ప్రాంతాలకు పెద్దపీట వేస్తున్న సర్కారు.. పంచాయతీలకు ప్రతి నెలా రూ.339 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం ఈ బడ్జెట్లో హైలెట్. 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ నిధులతో వీటిని భర్తీ చేయనుంది. గత బడ్జెట్లో పంచాయతీరాజ్‌కు మంచి ప్రాధాన్యత దక్కింది. నీటిపారుదల శాఖ తర్వాత పీఆర్కే ఎక్కువ నిధులు కేటాయించింది. ఈసారి ఇరిగేషన్‌కు కూడా నిధుల కత్తెరపడినప్పటికీ, అదేస్థాయిలో ఈ శాఖకు నిరాశే మిగిలింది. 2018–19 బడ్జెట్లో పంచాయతీరాజ్‌కు రూ.15,562 .84 కోట్లను కేటాయించగా, తాజా బడ్జెట్లో పీఆర్, గ్రామీణాభివృద్ధికి కలిపి రూ.15,124.89 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం పెంచిన ఆసరా పింఛన్ల మొత్తానికి అనుగుణంగా నెలకు రూ.830 నుంచి రూ.850 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. లబ్దిదారులు అందుబాటులో లేకనో, ఇతరత్రా కారణాలతోనో ఇందులో 15శాతం వరకు వెనక్కు వస్తున్నాయి. ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద దాదాపు 40 లక్షల మందికి ఈ పింఛన్లు అందుతున్నాయి. పింఛన్ల మొత్తాన్ని పెంచకముందు (రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తున్నపుడు) రూ. 420–450 కోట్ల వరకు వ్యయమయ్యేది. ఆసరాకు బడ్జెట్లో కేటాయించిన మొత్తం వాస్తవ లెక్కలకు అనుగుణంగా సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. వృద్ధాప్య పింఛన్ల లబ్ధిదారుల అర్హతను 60 ఏళ్ల నుంచి 57కు తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ఇంకా అమల్లోకి రాలేదు. హైదరాబాద్ మినహాయించి మిగతా జిల్లాల్లోనే 57 ఏళ్లకు పింఛను పొందేందుకు అర్హులైన వారి సంఖ్య ఆరున్నర లక్షలు ఉంటుందని సమాచారం. -
పల్లెలు మారితీరాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పల్లెసీమలు దేశంలోని ఇతర రాష్ట్రాలవారు వచ్చి నేర్చుకునే ఆదర్శగ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే విధంగా 30 రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ‘‘పల్లెల ప్రగతికి మార్గం వేయడానికి అమలు చేసే 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేసే బాధ్యత ప్రజల మీదే ఉంది. ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములై, ఏ ఊరి ప్రజలే ఆ ఊరి కథానాయకులై తమ గ్రామాలను తీర్చిదిద్దుకోవాలి. అవసరమైన చోట ప్రజలే శ్రమదానం చేయాలి. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు నిబద్ధతతో పనిచేసి, తెలంగాణ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతారని గట్టిగా విశ్వసిస్తున్నా. 30 రోజుల తర్వాత కచ్చితంగా గ్రామముఖ చిత్రం మారితీరాలి. దసరా పండుగను ప్రజలు పరిశుభ్రమైన వాతావరణంలో జరుపుకోవాలి’’అని ఆకాంక్షించారు. గ్రామాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చే బృహత్తర ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కావాల్సిన అధికారాలు, విధులు, నిధులను అందించిందన్నారు. గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు కూడా అధికారాలు, బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించిందన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలని, నియంత్రిత పద్ధతిలో విస్తృత ప్రజా భాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధి జరగాలన్నారు. ప్రణాళిక అమలుపై ‘తెలంగాణ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్’లో మంగళవారం జరిగిన రాష్ట్ర సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని, అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ముఖ్య సేవకుడిననే భావనతో ఉంటా.. పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసేలా చేయడం, నిధుల సద్వినియోగం, ప్రజా భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు నిర్వహించడం అనేది నిరంత రం సాగాలని, దీనికోసం ఈ 30 రోజుల ప్రణాళికతో కొత్త ఒరవడి ప్రారంభం కావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. కలెక్టర్లు దీనికి నాయకత్వం వహించాలని, పంచాయతీ రాజ్ అధికారులు నిబద్ధతతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ బాధ్యతలు పంచుకునేందుకు ముఖ్య శాఖలకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని, డిప్యూటీ కలెక్టర్ లేదా మరో హాదా కల్పిస్తామన్నారు. వీరిలో ఒకరిని పంచాయతీ రాజ్ శాఖకు కేటాయిస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి ముఖ్య సేవకుడు అనే భావనతోనే తానుంటానని, అధికారులు కూడా అలాగే ప్రజాసేవకులు అనుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయన్నారు. వయో పరిమితి పెంచుతాం.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 60 లేదా 61 సంవత్సరాలకు పెంచుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. అన్ని శాఖల్లో ఉద్యోగుల ప్రమోషన్ చార్టు రూపొందించాలని, తమకు ఏ తేదీన ప్రమోషన్ వస్తుందో ఉద్యోగికి ముందే తెలిసి ఉండాలని, పదోన్నతుల కోసం పైరవీలుచేసే దుస్థితి పోవాలన్నారు. అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులను కూడా సృష్టిస్తామన్నారు. మండల, జిల్లా పరిషత్ సమావేశాల్లో అధికారులు, ఉద్యోగులను ధూషిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలుపుతూ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ప్రజలు తలుచుకుంటే.. ప్రజలు తలుచుకుంటే, ఉద్యమ స్పూర్తితో పనిచేస్తే తప్పక మంచి ఫలితాలు వస్తాయని, దీనికి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయని కేసీఆర్ అన్నారు. ‘‘ఎస్.కె.డే గ్రామీణాభివృద్ధి కోసం పంచాయతీ రాజ్ వ్యవస్థకు పురుడుపోశారు. కూసం రాజమౌళి కృషి ఫలితంగా వరంగల్ జిల్లా గంగదేవిపల్లి ఆదర్శ గ్రామమైంది. గంగదేవిపల్లిలో 26 గ్రామ కమిటీలున్నాయి. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామం అభివృద్ధికి, ముఖ్యంగా మహిళా సాధికారితకు సాక్ష్యంగా నిలబడింది. మురార్జీ దేశాయ్ కృషి వల్ల ముంబైలో ట్రాఫిక్ నియంత్రణ సాధ్యమైంది’’అని ముఖ్యమంత్రి సోదాహరణంగా చెప్పారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడానికి గ్రామస్థాయిలో ఎవరి బాధ్యత ఏంటో చెప్పడానికి ముందే ప్రభుత్వం తన బాధ్యతలను నెరవేర్చి ఆదర్శంగా నిలిచిందన్నారు. సదస్సులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర మం త్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీనియర్ అధికారులు, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీనేత కె.కేశవరావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల కలెక్టర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. అన్నీ సర్కారే చేసినా... గ్రామ పంచాయతీలపై బాధ్యతలున్నాయి గ్రామ పంచాయతీలు నేల విడిచి సాము చేయవద్దని, ప్రజలందరి భాగస్వామ్యంతో గ్రామాల రూపురేఖలు మార్చాలని సీఎం పిలుపునిచ్చారు. ‘‘మిషన్ భగీరథ ద్వారా మంచినీరు, నిరంతర విద్యుత్, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు అమలు చేస్తోంది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కావాల్సిన ఆర్థిక ప్రేరణ ప్రభుత్వమే అందిస్తోంది. రహదారులు, వంతెనలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం తదితర పనులన్నీ ప్రభుత్వమే గ్రామ పంచాయతీలపై భారం పడకుండా చూస్తోంది. పచ్చదనం, పరిశుభ్రత కాపాడటం, వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించడం, క్రమం తప్పకుండా పన్నుల వసూలు, విద్యుత్ బిల్లుల లాంటి చెల్లింపులు చేయడం, వీధిలైట్లను సరిగ్గా నిర్వహించడం పంచాయతీలు నిర్వహించాల్సిన ముఖ్య విధులు’’అని సీఎం నిర్దేశించారు. సెప్టెంబర్ 6 నుంచి అమలు చేసే కార్యాచరణలోని ముఖ్యాంశాలు.. సెప్టెంబర్ 4న కలెక్టర్లు జిల్లాసదస్సు నిర్వహించి, ప్రత్యేక కార్యాచరణ అమలు కు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి. ప్రతీ గ్రామానికి ఒక మండల స్థాయి అధికారి పర్యవేక్షకుడిగా నియమించాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్, మండలంలో ఎంపీడీవో, గ్రామస్థాయిలో ప్రత్యేక అధికారి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. వార్షిక, పంచవర్ష ప్రణాళికల రూపకల్పన. గ్రామసభ ఆమోదం. ఈ ప్రణాళికలకు అనుగుణంగానే బడ్జెట్ రూపకల్పన. అప్పులు, జీతాల చెల్లింపు, కరెంటు బిల్లుల చెల్లింపులను తప్పనిసరిగా చేయాల్సిన వ్యయం (చార్టెడ్ అకౌంటు)లో చేర్చాలి. ప్రతీ ఇంటికీ, ఆస్తికి సరైన విలువ కట్టాలి. క్రమంతప్పకుండా ఆస్తులవిలువ మదింపు. పన్నులు క్రమం తప్పకుండా వసూలు. పన్నులు వంద శాతం వసూలు చేయని గ్రామ కార్యదర్శిపై చర్యలు. మొక్కలు నాటడం, స్మశాన వాటిక నిర్మాణం, డంపుయార్డు నిర్మాణ తదితర పనులకు ‘నరేగా’నిధుల వినియోగం. రాష్ట్ర బడ్జెట్, ఫైనాన్స్ కమిషన్, ‘నరేగా’ నిధులు వస్తాయి. గ్రామ పంచాయతీ సాధారణ నిధులు అందుబాటులో ఉంటాయి. సీఎస్ఆర్ నిధులను సమకూర్చుకోవాలి. దాతల నుంచి విరాళాలు సేకరించాలి. శ్రమదానంతో పనులు నిర్వహించాలి. సీనియర్ అధికారుల నేతృత్వంలో 100 ఫ్లయింగ్ స్వా్కడ్స్ ఏర్పాటు. 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు తర్వాత ఈ బృందాలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తాయి. లక్ష్యాలు సాధించిన గ్రామాలకు ప్రోత్సాహాకాలు. అలసత్వం ప్రదర్శించిన వారిపై చర్యలు. మంగళవారం రూరల్ డెవలప్మెంట్పై పె నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. చిత్రంలో మంత్రులు తదితరులు -
సీఈవోలు, డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖలో పాతికేళ్లకుపైగా ఎంపీడీవోలుగా పనిచేస్తూ పదోన్నతులు, పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నవారి నిరీక్షణ ఫలించింది. మూడు నెలల క్రితం వంద మందికిపైగా ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించినా ఎన్నికల కోడ్ కారణంగా వారికి పోస్టింగ్‌లు ఇవ్వలేదు. ఈ పదోన్నతుల ద్వారా జిల్లాల్లో పంచాయతీ, గ్రామీణాభివృద్ధి తదితర విభాగాల్లో పీఆర్ శాఖకు సంబంధించిన అధికారులే వివిధ విధులు నిర్వహించనున్నారు.‡రెండున్నర దశాబ్దాలకుపైగా ఎదురుచూపుల తర్వాత 95 మందికి డిప్యూటీ సీఈవో, డీఆర్డీఏ, గ్రామీణాభివృద్ధి, అకౌంట్స్ ఆఫీసర్లు తదితర పోస్టుల్లో బదిలీ, పోస్టింగ్, డిప్యూటేషన్లపై నియమిస్తూ గురువారం పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీచేశారు సీఈవో, డిప్యూటీ సీఈవో, ఇతర పదవులకు... ఆదిలాబాద్ మండల ప్రజాపరిషత్(ఎంపీపీ)లో పనిచేస్తున్న జి.జితేందర్‌రెడ్డిని రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా; మంచిర్యాల ఎంపీపీలో పనిచేస్తున్న కె.నరేందర్‌ను ఆదిలాబాద్ జడ్పీ సీఈవోగా బదిలీ చేశారు. పీజే వెస్లీని డిప్యూటేషన్‌పై టీఎస్ఐఆర్డీలోని ఈటీసీ ప్రిన్సిపాల్‌గా; కె.అనిల్‌కుమార్‌ను టీఎస్ఐఆర్డీ ఏవోగా, ఎం.ఉమారాణిని స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా; కె.సునీతను ఎస్ఈసీ అసిస్టెంట్ సెక్రటరీగా నియమించారు. ఎస్.దిలీప్‌కుమార్‌ను డైరెక్టర్ ఎస్బీఎంగా డిప్యూటేషన్‌పై పంపించారు. డిప్యూటీ సీఈవోలుగా నియమితులైన వారిలో ఎం.లక్ష్మీబాయి (మెదక్–పోస్టింగ్), ఎం.పద్మజ(మహబూబ్‌నగర్–పో), సి.శ్రీకాంత్‌రెడ్డి (రంగారెడ్డి –పో), డి.పురుషోత్తం (ఖమ్మం–పో), ఎల్.విజయలక్ష్మీ (నల్లగొండ–పో), బి. గౌతంరెడ్డి (కరీంనగర్–పో), గోవింద్(నిజామాబాద్–పో), ఎ.రాజారావు (వరంగల్–పో), సన్యాసయ్య(ఆదిలాబాద్–పో) ఉన్నారు. డిప్యూటేషన్‌పై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులుగా నియమితులైనవారిలో మర్రి వెంకట శైలేష్ (ఆసిఫాబాద్), జె.సుమతి (భూపాలపల్లి).సీహెచ్ శ్రీనివాసరావు(సంగారెడ్డి), పి.బలరామారావు(మహబూబాబాద్) ఉన్నారు. ఈ.అనిల్‌కుమార్‌ను టీఎస్ఐఆర్డీ జాయింట్ డైరెక్టర్‌గా; ఎం.నవీన్‌కుమార్, టి.శ్రీనాథ్రావులు సెర్ప్ డైరెక్టర్లుగా; జి.వెంకటసూర్యారావు, ఎస్.వెంకటేశ్వర్, బి.రాఘవేందర్రావు, ఎన్.శోభారాణిలు ఈటీసీ ఫ్యాకల్టీలుగా నియమితులయ్యారు. సీఎం, మంత్రికి కృతజ్ఞతలు... ఇరవై ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల సమస్యను పరిష్కరించడంతోపాటు పీఆర్, గ్రామీణాభివృద్ధిశాఖలోనే పోస్టింగ్‌లు ఇచ్చిన సీఎం కేసీఆర్, పీఆర్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పీఆర్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్‌లకు తెలంగాణ ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు బి.రాఘవేందర్రావు, ప్రధానకార్యదర్శి ఎం.శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ శేషాద్రి కృతజ్ఞతలు తెలిపారు. పదోన్నతులు కల్పించి పోస్టింగ్‌లు ఇవ్వడంతో తమకు మరింత బాధ్యత పెరిగిందన్నారు. -
విద్యారంగం తోడ్పాటుతోనే గ్రామీణాభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: విద్యారంగం తోడ్పాటుతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యం అవుతుందని.. అప్పుడే దేశం సమగ్రాభివృద్ధి సాధించినట్లవుతుందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. మహత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ (ఎంజీఎన్సీఆర్ఈ) ఆధ్వర్యంలో నయ్ తాలిమ్ (పని విద్య)పై హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రెండ్రోజులు నిర్వహించిన జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో వెంకయ్య పాల్గొని ప్రసంగించారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించేందుకు ఉన్నత విద్యా సంస్థలు ఇతోధిక కృషి చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. సిలబస్‌లో మార్పులు అవసరం రైతుల స్థితిగతులు, పంటలు, వాటికి లభిస్తున్న ధరలు, గ్రామీణ పరిస్థితులు, నిజ జీవితం ఏంట న్నది భవిష్యత్తు తరాలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ఇందుకు అనుగుణంగా సిలబస్ మార్పులు చేయాలన్నారు. గ్రామీణ విద్యా వ్యవస్థ బలోపేతానికి విద్యా రంగం చర్యలు చేపట్టాలని, అప్పుడే వలసలు ఆగిపోతాయన్నారు. పట్టణీకరణ వేగంగా పెరిగిపోతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, నీతిఆయోగ్, మీడియా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. తాను ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టానన్నారు. అందుకే గడిచిన 16 నెలల్లో యూనివర్సిటీలు, పరిశోధన, సాంకేతిక విద్యా సంస్థలు, వ్యవసాయ స్థితిగతులు, సాంస్కృతిక సంస్థలు, పారిశ్రామిక రంగాలు, ఎన్జీవోలతో తరచూ సమావేశం అవుతున్నట్లు చెప్పారు. యువతకు నైతిక విలువలు, పని విద్య, పర్యావరణ పరిరక్షణ, శానిటేషన్ అంశాలపై ప్రత్యేక అవగాహన అవసరమని విద్యా సంస్థలు ఆ దిశగా కృషి చేయాలన్నారు. మాతృభాష మరవొద్దు: భాషలెన్ని నేర్చుకున్నా మాతృభాషను మరువొద్దని వెంకయ్య అన్నారు. మాతృభాష మన కళ్లు అయితే ఇతర భాషలు కళ్ల జోడులాంటివని చెప్పారు. ప్రాథమిక విద్య కచ్చితంగా మాతృభాషలోనే కొనసాగేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ విద్యాభివృద్ధికి ఇప్పటికే పలు చర్యలు చేపట్టినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. గ్రామాల గురించి విద్యార్థులు తెలుసుకోవాలని అన్నారు. రూరల్ మేనేజ్మెంట్ను తప్పనిసరి చేయాలన్నారు. సదస్సుకు దేశంలోని 102 వర్సిటీలు, 17 సెంట్రల్ వర్సిటీల విద్యావిభాగం అధిపతులు, ప్రొఫెసర్లు, వైస్ చాన్స్లర్లు హాజరయ్యారని సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంజీఎన్సీఆర్ఈ చైర్మన్ ప్రసన్నకుమార్ తెలిపారు. గ్రామీణ విద్యకు సంబంధించిన పాఠ్య పుస్తకాల రూపకల్పనకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. -
గోదాములు.. వైకుంఠ ధామాలు
సాక్షి, హైదరాబాద్ : ప్రతీ గ్రామంలో తప్పనిసరిగా వైకుంఠధామం (శ్మశానం) ఏర్పాటు, గోదాముల నిర్మాణం చేస్తామని పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు.శ్మశాన వాటికలకు స్థలం దొరకని చోట అవసరమైతే గ్రామపంచాయతీ ద్వారా కొనుగోలు చేయనున్నట్టు ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుందని తెలిపారు.పల్లెల్లో కూడా తగిన వసతులతో స్వర్గధామాలు కూడా లేకపోవడంతో.. ఏర్పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గమనించి ఈ చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. సచివాలయంలో శుక్రవారం పీఆర్‌శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ‘సాక్షి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామస్వరాజ్యం సాధనకు సంబంధించి, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజల అవసరాలు, అభివృద్ధి పనులతో ముడిపడిన కీలకంగా మారిన పంచాయతీ రాజ్.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అత్యంత కీలకంగా మారిందన్నారు.ఈ నేపథ్యంలో ప్రతీ గ్రామపంచాయతీకి సొంత భవన నిర్మాణం, రోడ్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఈజీఎస్ ద్వారా గ్రామాల్లోని ప్రతీ ఇంట్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, చెట్ల పెంపకం, పారిశుధ్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ప్రతి ఊళ్లో గోదాంలు... గ్రామ స్థాయిలోనే ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు వీలుగా ప్రతీ ఊళ్లో గోదాంల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. వీటితో పాటు ఫుడ్ ప్రాసె సింగ్ యూనిట్లను కూడా ఐకేపీ సెంటర్లు, గ్రూపుల ద్వారా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రామాల్లోని నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పనలో భాగంగా మూడునెలల పాటు వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించి, వివిధ ప్రైవేట్సంస్థలు, ఆయా రంగా లకు సంబంధించి అవకాశాలు ఉన్న చోట్ల ఉద్యోగ,ఉపాధి కల్పించేలా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నట్టు తెలియజేశారు.మిషన్ భగీరథలో భాగంగా వచ్చేనెలాఖరుకల్లా అన్ని గ్రామాలకు తాగునీరు అందిస్తామన్నారు.ఏప్రిల్ చివరకల్లా గ్రామాల్లోని అన్ని ట్యాంకుల నిర్మాణం పూర్తి చేసేట్టు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సర్కిల్ బిల్డింగ్ నిర్మాణ మంజూరుపై తొలి సంతకం తనకు పెద్ద బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు తాను రుణపడి ఉంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం ఉదయం సచివాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతలు స్వీకరించిన వెంటనే నల్లగొండ పంచాయతీ రాజ్ సర్కిల్ బిల్డింగ్ నిర్మాణానికి రూ. కోటి మంజూరు చేస్తూ ఫైల్‌పై తొలి సంతకం చేశారు.మంత్రి పదవి ఇస్తానని చెప్పి గతంలో చంద్రబాబు తనను మోసం చేశారని ఎర్రబెల్లి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో పొందని ఆనందం మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తాను పొందానన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లా రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి,రాజయ్య, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి,శంకర్ నాయక్ , పెద్ది సుదర్శన్, గాంధీ, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్, కంచర్ల భూపాల్‌రెడ్డి,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, గుండు సుధారాణి, పీఆర్‌శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఇప్పటివరకూ పార్టీ సమన్వయ బాధ్యతలే.. మూడున్నర దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగుతూ పార్టీ సంస్థాగత విషయాలు, రాష్ట్రస్థాయి నాయకులు, కార్యకర్తల సమన్వయం వంటి వాటిపై ఇప్పటివరకు దృష్టి పెట్టిన తనకు పీఆర్ శాఖ వంటి ప్రజలతో నిత్యం సంబంధముండే గురుతర బాధ్య తను సీఎం కేసీఆర్ తనపై ఉంచారన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధిపై దృష్టి పెట్టిన సీఎంకు, ఈ శాఖపై ఎన్నో ఆశలు, ఆకాంక్షలున్నాయన్నారు. వాటిని కచ్చితంగా పూర్తిచేసే దిశగా తన కార్యాచరణ ఉంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టంచేశారు. విధులు,బాధ్యతలపై దృష్టి పెట్టాలి.. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో భాగంగా సర్పంచ్‌లకు అధికారాలతో విధులు, బాధ్యతలు కూడా ఉన్నందున వాటి నిర్వహణపై కొత్త సర్పంచులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. సర్పంచ్‌లు తమ తమ గ్రామాల్లోనే ఉంటూ రోజువారి విధులు నిర్వహించుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చట్టంలో నిర్దేశించిన విధంగా నెలకోసారి గ్రామపంచాయతీ సమావేశం, మూడునెలలకోమారు సర్వసభ్య సమావేశం నిర్వహించడం, వంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని కోరారు. -
గ్రామసభే సుప్రీం
సాక్షి, హైదరాబాద్: గ్రామీణాభివృద్ధిలో గ్రామసభలు కీలకం కానున్నాయి. గతంలో కంటే భిన్నంగా కొత్త పంచాయతీరాజ్ చట్టంలో గ్రామసభలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. పారిశుధ్యం మొదలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష, గ్రామ సమస్యలతో పాటు వివిధ అంశాలపై గ్రామసభల్లో తీర్మానాలు ఆమోదించాల్సి ఉంటుంది. పల్లెల్లోని ప్రజల ఆచార, సంప్రదాయాలు, సాంస్కృతిక వైవిధ్యం, సామాజిక వనరుల పరిరక్షణ, ఆచార వ్యవహారాలకు సంబంధించి ఏవైనా వివాదాలు తలెత్తినపుడు వాటిని పరిష్కరించే అధికారం గ్రామసభకు ఉంటుంది. గ్రామాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు, కార్యక్రమాలు, ప్రాజెక్టుల ఆమోదం, సామాజిక,ఆర్థిక, అభివృద్ధి కోసం ప్రణాళికలు,కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసేందుకు ముందస్తుగా గ్రామసభల అనుమతి పొందేలా చట్టంలో పొందుపరిచారు. వివిధ పథకాల కింద లబ్ధిదారుల ఎంపిక, పేదరిక నిర్మూలన, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో లబ్ధిదారుల గుర్తింపు, ఎంపికకు గ్రామసభే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వివిధ కార్యక్రమాల కోసం కేటాయించిన నిధుల వినియోగానికి సంబంధించిన సర్టిఫికెట్లు (యూసీ), వివిధ ప్రణాళికలు, కార్యక్రమాలు, ప్రాజెక్టు పరిమాణాలు, గ్రామస్థాయిలో వ్యయం చేసిన నిధులకు సంబంధించిన యూసీలను గ్రామసభల ద్వారానే పొందాల్సి ఉంటుంది. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం,షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఏదైనా ప్రాజెక్టు అమలుకు భూమి స్వాధీనం లేదా సంబంధిత ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే వారికి పునరావాసం కల్పించాల్సి వచ్చినా ముందుగా గ్రామసభ లేదా తగినపద్ధతుల్లో గ్రామపంచాయతీని తప్పనిసరిగా సంప్రదించేలా నూతనచట్టంలో ఏర్పాట్లు చేశారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని చిన్నతరహా నీటివనరుల నిర్వహణ ప్రణాళికలకు, చిన్న తరహా ఖనిజాల తవ్వకాలకు గనుల లైసెన్స్‌లు లేదా లీజుకు ఇచ్చేందుకు గ్రామసభ లేదా సరైన స్థాయిలోని పంచాయతీ సిఫార్సులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. రెండునెలలకు ఒకసారి గ్రామసభ జరిగేలా, ఏడాదిలో మొత్తం ఆరు సభల్లో రెండింటిని మహిళలు, వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా నిర్వహించాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాలో ఓటర్లుగా నమోదైన వారందరూ సభ్యులుగా గ్రామసభకు హాజరుకావొచ్చు. గ్రామసభలు సమీక్షించే అంశాలు పారిశుధ్యం కాపాడే చర్యలు.. ఘన,ద్రవరూప వ్యర్థాల నిర్వహణ, చెత్తా,చెదారాన్ని ఎరువుగామార్చడం వీధిదీపాల నిర్వహణ, గ్రామపంచాయతీలో వివిధ పథకాల కింద చెట్లునాటడం, వాటి నిర్వహణ కుటుంబ సంక్షేమం విద్య, ప్రజారోగ్యం, బాలకార్మికుల నిర్వహణ అంతర్గతరోడ్లు, వంతెనలు, కాల్వల నిర్వహణ పబ్లిక్ ప్రదేశాలు, కమ్యూనిటీహాళ్లు, పార్కుల వంటి సామాజిక ఆస్తుల నిర్వహణ సంతలు, పండుగలు, క్రీడలు, ఆటలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం గ్రామపంచాయతీ అమలుచేసే పథకాలు,అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలు రూపొందించి,ప్రాధాన్యతల నిర్ధారణ. సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రాధాన్యతా క్రమంలో అర్హులైన లబ్ధిదారుల తుది జాబితా సిద్ధం చేసే బాధ్యత పంచాయతీల్లో వివిధ వర్గాల ప్రజల మధ్య మతసామరస్యం, సఖ్యత పెంపొందించేందుకు, స్థానిక ప్రజల మధ్య స్నేహసంబంధాలు అభివృద్ధి చెందేందుకు కళలు, క్రీడా సంబరాల నిర్వహణ పింఛన్లతో పాటు వివిధరకాల సంక్షేమ సహాయాలను ప్రభుత్వం నుంచి పొందేందుకు వ్యక్తుల స్క్రీనింగ్ వయోజన విద్య ప్రోత్సాహం, పబ్లిక్ ఆస్తుల పరిరక్షణ, నిర్వహణ బడ్జెట్ సంబంధ ఏర్పాట్లు, ఖర్చు చేసే ప్రణాళిక వివరాలు, అంశాల వారీగా నిధుల కేటాయింపు వివరాలు, పంచాయతీ ప్రాంతంలో చేసిన లేదా చేయబోయే పనులకు సంబంధించి సామగ్రి ఖర్చుల గురించి తెలుసుకునే హక్కు గ్రామసభకు ఉంటుంది. షెడ్యూల్డ్ ప్రాంత పంచాయతీల్లో... షెడ్యూల్డ్ ప్రాంత పంచాయతీలు/ గ్రామసభలకు మత్తు పదార్థాల వినియోగంపై నిషేధం లేదా మత్తు పదార్థాల అమ్మకం, వినియోగంపై నియంత్రణ లేదా క్రమబద్ధీకరించే అధికారాన్ని కొత్త పంచాయతీరాజ్ చట్టం కల్పించింది. చిన్నతరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్యహక్కులు, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూమి అన్యాక్రాంతం కాకుండా చూసే అధికారం, చట్టవిరుద్ధంగా అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అధికారాన్ని కూడా కట్టబెట్టింది. గ్రామీణ మార్కెట్ (సంత) నిర్వహణ అధికారం, గిరిజన ప్రజలకు రుణం ఇస్తున్న సంస్థలు, వ్యక్తులపై నియంత్రణ అధికారాన్ని కూడా నూతన చట్టం కల్పించింది. -
గ్రామీణ వికాసానికి గాలి వీస్తోంది
రైతు కేంద్రంగా పాలకుల విధానాలు మారుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి వంటి పథకాలతో ప్రజానుకూల ప్రభుత్వ విధానాలు, నేరుగా ప్రజలకు ఫలాలు అందించడం అనే పద్ధతికే ప్రాధాన్యత ఇచ్చారు. ఏపీలో అన్ని వ్యవహారాలు పార్టీ కార్యకర్తల కనుసన్నల్లో సాగించే పంథాను బాబు ఎంచుకున్నారు. పార్టీ శ్రేణుల్ని పాలనలో దొడ్డిదారి భాగస్వాముల్ని చేయడం ద్వారా, స్థానిక పంచాయతీ పాలనా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఈ చీకటిని తొలగించే కొత్త వెలుగు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరీక్షిస్తున్నారు. మార్పు కోసం ఏపీలోని 12,918 గ్రామ పంచాయతీలు ఎదురుచూస్తున్నాయి. పల్లెకు మంచి రోజులొస్తున్నాయి. సానుకూల వాతావరణం పెరుగుతోంది. ఇక ‘కనిపించని కుట్రల’ను ఛేదించే చొరవ గ్రామస్తులే తీసుకోవాలి. పల్లె కన్నీరు తుడవాలి. సుదీర్ఘకాలం వ్యవసాయం కుదేలవటం వల్ల గ్రామ స్వరూపం మారింది. చేతి వృత్తులు భంగపడి గ్రామం బోసి పోయింది. ఉద్యోగ–ఉపాధి అవకాశాలు సన్నగిల్లి పట్టణాలు, నగరాలకు వలసలు పెరిగాయి. పాలకుల నిర్లక్ష్యమూ తోడై చాన్నాళ్లుగా పల్లె కళ తప్పింది. నిన్నా, ఇవాల్టి వరకు ఏ ఊరు చూసినా జీవం కోల్పోయిన అచే తన కొట్టొచ్చినట్టు కనిపించేది. పరిస్థితులు మెలమెల్లగా మారుతు న్నాయి. పట్టణ, నగర జీవుల్లోనూ పుట్టినూరుపై మమకారం పెరుగు తోంది. చుట్టపు చూపుగానైనా సాగే సొంతూరు పర్యటనలు పెరుగుతున్నాయి. పల్లెతో బంధాన్ని పెనవేస్తున్నారు. పెరిగిన శాస్త్రసాంకేతిక పుణ్యమా అని గ్రామాల్లోనే ఏదైనా సమకూర్చుకునే వెసలుబాటొచ్చింది. నగర జీవనంపై మొహం మొత్తిన సంపన్నులూ, విడిదిలానైనా బాగుంటుందని ఊరితో బంధం పునరుద్దరిస్తున్నారు. పాలకుల విధానాల్లో, రాజకీయ దృక్కోణంలోనూ గ్రామీణ భారతానికి ప్రాధాన్యత పెరుగు తోంది. నాయకుల ఓట్ల గురి కావచ్చు, సంక్షోభం నుంచి రైతును గట్టె క్కించే సర్కార్ల చేయూత కావచ్చు, మారిన పరిస్థితుల్లో గ్రామాలకు నేరుగా నిధులు రావడం కావచ్చు.. కారణం ఏమైతేనేం పల్లెకు ప్రాధా న్యత లభిస్తోంది. కేంద్రం ప్రకటించిన పలు అభివృద్ధి–సంక్షేమ కార్యక్ర మాల్లోనూ గ్రామం కేంద్రబిందువుగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనూ పరిస్థితులు ఆశావహంగా కనిపిస్తు న్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలై తాజా సర్కారు ఏర్పడ్డ క్రమం లోనే పంచాయతీ ఎన్నికలూ ముగిసి గ్రామాలకు కొత్త పాలకులొచ్చారు. పంచాయతీరాజ్ కొత్త చట్టం విస్తృతాధికారాలు కల్పించడంతో పాటు స్థానిక పాలకుల బాధ్యతల్నీ పెంచింది. ఏపీ రాష్ట్రం ఇపుడు శాసనసభ ఎన్నికల ముంగిట్లో నిలిచింది. గ్రామీణ పాలనా విధానం సమూల మార్పు సంకేతాలు వెలువడుతున్నాయి. కొత్త వెలుగుకోసం జనం నిరీ క్షిస్తున్నారు. పల్లెల పునరుద్ధరణకు తెలుగునాట ఇది మంచి తరుణం. విభజనతో రెండు నమూనాలు విభజన తర్వాత ఏర్పడ్డ తెలంగాణ, ఏపీల్లో రెండు వేర్వేరు గ్రామీణ పాలనా నమూనాలు ఆవిష్కృతమయ్యాయి. తెలంగాణలో ముఖ్య మంత్రి చంద్రశేఖరరావు ఒక నమూనా అమలు చేస్తే, ఏపీలో సీఎం చంద్రబాబునాయుడు మరో నమూనాతో వెళ్లారు. ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల లబ్దిదారుల ఎంపిక నుంచి అన్ని వ్యవహారాలు పార్టీ కార్యకర్తల కనుసన్నల్లో సాగించే పంథాను బాబు ఎంచుకున్నారు. పార్టీ శ్రేణుల్ని పాలనలో దొడ్డిదారి భాగస్వాముల్ని చేశారు. స్థానిక పంచాయతీ పాలనా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఈ దేశంలో బహుళ ప్రచారంలో ఉన్న కమ్యూనిస్టు పాలకుల ‘పశ్చిమ బెంగాల్’ నమూనానే ఆయన నమ్ముకున్నారు. తద్వారా సుదీర్ఘకాలం అప్రతిహతంగా రాజ్యం చేయాలనుకున్నారు. పార్టీ శ్రేణులతో జన్మభూమి కమిటీల ఏర్పాటు చేసి పాలన సాగిస్తున్నారు. కానీ, అదొక విఫల నమూనాగా ధ్రువపడిన విష యాన్ని ఆయన పరిగణనలోకి తీసుకోలేదు. తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ కూడా బెంగాల్లో అదే నమూనాతో ‘పార్టీ శ్రేణుల’ కేంద్రకంగా సాగిస్తున్న పాలన క్రమంగా బెడిసికొడుతోంది. ఆంధ్రప్రదేశ్ లోనూ అవే సంకేతాలు, అవినీతి ప్రజల కళ్లకు కట్టినట్టు కనిపించడం ఈ నమూనాలో బహిరంగ రహస్యం! దీనిపై పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్ భిన్నమైన పంథాలో పాలనసాగించారు. ప్రజానుకూల ప్రభుత్వ విధానాలు, అధికార యంత్రాంగంపై సరైన అజమాయిషీ, నేరుగా ప్రజలకు ఫలాలు అందించడం.. అనే పద్ధతికే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణ లక్ష్మి.. ఇవన్నీ ఇటువంటివే! పార్టీ శ్రేణుల్ని పాలనలోకి జొరనివ్వలేదు. అందుకే, తమ వ్యక్తిగత అవసరాలు తీర్చలేదని స్థానిక నాయకత్వంపైన, ప్రజాప్రతినిధులపైన ప్రజల్లో బలమైన అసంతృప్తి ఉన్నా, వ్యతిరేకత వెల్లువెత్తినా... ఇటీవలి ఎన్నికల్లో కేసీఆర్ అన్నీ తానై ప్రచారం చేసి ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మలిచారు. ఘన విజయం సాధించారు. ఇటీవలి కాలంలో పాలకపక్ష శ్రేణులు ప్రజాభిప్రాయాన్ని సర్కా రుకు అనుకూలంగా మలచలేకపోతున్నాయనే ఒక అధ్యయన నివేదిక కేసీఆర్‌ను బాగా ప్రభావితం చేసినట్టుంది. అందుకే ఆయన తొలి నుంచి జాగ్రత్త పడ్డారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పుష్కరకాలం పైగా ఉద్యమించిన పార్టీ అయినా, అధికారంలోకి వచ్చాక పార్టీ శ్రేణుల విచ్చలవిడితనాన్ని ఆయన ప్రోత్సహించలేదు. అట్టడుగుస్థాయిలో జనాభిప్రాయాన్ని పాలక పక్ష శ్రేణులు ఓటుగా మలిచే ప్రభావం క్రమంగా సన్నగిల్లుతోందని ‘అభి వృద్ధి సమాజాల అధ్యయన కేంద్రం’(సీఎస్డీఎస్) పరిశీలనలో వెల్లడైంది. పార్టీలకతీతంగా గ్రామాలు ఎదగాలి తెలంగాణలో కొత్త పంచాయతీ చట్టం అమల్లోకి వచ్చింది. వారం కిందటి నుంచి కొత్త సర్పంచులు, పాలకమండళ్ల పాలన మొదలయింది. పార్టీలతో నిమిత్తం లేకుండా జరిగిన ఈ ఎన్నికల్లో యువతరం ఉత్సాహం పతాకస్థాయికి చేరింది. పెద్ద సంఖ్యలో యువత సర్పం చులుగా, వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. ప్రధాన పార్టీలు కూడా పెద్దగా పట్టింపులకు వెళ్లలేదు. ఒక పార్టీకే చెందిన ఇద్దరు, ముగ్గురు కూడా పోటీ చేశారు. పదేళ్లపాటు రిజర్వేషన్లు మారవనేది ప్రభావం చూపింది. బాగా పనిచేస్తే మరో దఫా ఎన్నికవొచ్చన్న భరోసా కలిగింది. ఈ సారి పట్టణాలు, నగరాల్లోని వ్యాపార–వాణిజ్య వేత్తలు, సంప న్నులు, మేధావులు తమ సొంతూళ్ల పంచాయతీ ఎన్నికల పట్ల ఆసక్తి చూపారు. అక్కడక్కడ తమ వారనుకునే అభ్యర్థులకు మద్దతో, సహాయ సహకారాలో అందించారు. పలుచోట్ల పట్టుబట్టి గెలిపించుకున్నారు. ఇదొక ప్రగతి సంకేతం! గ్రామ పంచాయతీలను పరిపుష్టం చేయడంలో, నిధుల్ని సక్రమంగా వినియోగించి గ్రామాభివృద్ధి సాధించడంలోనూ ఈ సహకారం కొనసాగాలి. పల్లె పట్టణం పెనవేయాలి. త్వరలో పంచాయతీ ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వనున్న శిక్షకులను చైతన్యపరుస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీయార్ ప్రభుత్వ సంకల్పాన్ని విస్పష్టంగా చెప్పారు. గ్రామాభివృద్ధికి గ్రామస్తులే బాధ్యత వహించాలన్నారు. పాల కమండళ్లు నిబద్దతతో, లక్ష్యసాధనపై గురి–జవాబుదారితనంతో పనిచే యాలని పిలుపునిచ్చారు. 15వ ఆర్థిక సంఘం, కేంద్ర–రాష్ట్ర పథకాలు, ఎమ్మెల్యే–ఎమ్మెల్సీ–ఎంపీల అభివృద్ధి నిధులు.. ఇలా వివిధ పద్దతుల్లో గ్రామాలకు రాబోయే అయిదేళ్లలో నలబై వేల కోట్ల రూపాయలు రాను న్నాయని చెప్పారు. తెలంగాణలో 12,751 గ్రామ పంచాయతీలు న్నాయి. ఇదొక సువర్ణావకాశం. కొత్త చట్టం ఎన్నో అవకాశాల్ని కల్పి స్తోంది. ప్రతి రెండు నెలలకోసారి జరిగే గ్రామ సభలో గ్రామస్థులు విధిగా పాల్గొని, అభివృద్ది–సంక్షేమాన్ని గరిష్టంగా సాధించుకోవాలి. అధికారాలే కాకుండా వైఫల్యాలకు ప్రజాప్రతినిధుల్ని బాధ్యుల్ని చేసే, అవసరమైతే సర్పంచ్‌ను కలెక్టర్ సస్పెండ్ చేసే నిబంధనలు కూడా చట్టంలో ఉన్నాయి. అలా అని, పాలకపక్షం తన రాజకీయ ప్రయోజ నాలు నెరవేర్చుకునే సాధనంగా, దీన్ని సర్పంచుల ‘తలపై నిరంతరం వేలాడే కత్తి’ చేయకుండా ప్రజలే ప్రతిఘటించాలి. అవినీతిని అడ్డగించి, మంచిని సాధించుకునేలా నిఘావేయాలి. రాజ్యాంగేతర శక్తులకు చరమగీతం విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి అవకాశాలు క్రమంగా సన్నగిల్లాయి. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది దారుల ఎంపికలో ఏ రాజ్యాంగబద్దత లేని జన్మభూమి కమిటీలకు ప్రాధాన్యతనివ్వటంతో అవినీతి రాజ్యమేలుతోంది. ఈ చీకటిని తొల గించే కొత్త వెలుగు కోసం ఏపీ ప్రజలు నిరీక్షిస్తున్నారు. చట్టబద్దమైన గ్రామసచివాలయాన్ని కేంద్రబిందువుగా చేసి, గ్రామీణ వికాసానికి బాటలు పరుస్తామని విపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాటలు ఇక్కడి ప్రజల్లో కొత్త ఆశలు రేపుతున్నాయి. దానికి కారణం, గ్రామీణ పాలనా వ్యవస్థను ఏపీలో బాబు ప్రభుత్వం బలహీనపరచడమే! ప్రజలతో ఎన్నికైన సర్పంచులు, పాలక మండళ్లను నిర్వీర్యం చేసి, పార్టీ కార్యకర్తలు కీలకంగా ఉండే జన్మభూమి కమిటీలకు పెత్తనం అప్పగించింది. రేషన్‌కార్డులు, ఇళ్లు, పెన్షన్లు... ఇలా ఏ ప్రయో జన లబ్దిదారుల ఎంపికలోనైనా వారిదే కీలక భూమిక! కేంద్ర ప్రభుత్వ నిధుల్ని కూడా రాష్ట్ర కేంద్రీకృత పథకాలకు దారి మళ్లించడం ఇక్కడ రివాజయింది. 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిదులకు కూడా దిక్కులేని పరిస్థితి! రెండు వేల జనాభా ఉన్న గ్రామాలకు కూడా ఏటా 9 లక్షల రూపాయలకు తగ్గని నిధులు వస్తున్నా, అవి నేరుగా గ్రామాభివృద్ధికి దక్కడం లేదు. చంద్రన్న బాట, సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్.. ఇలా ఏవేవో పథకాల్లోకి మళ్లించి వ్యయం చేస్తున్నారు. స్థానికంగా పన్నులు విధిం చడం ద్వారా ఏటా లభించే దాదాపు 500 కోట్ల రూపాయల్నీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కేంద్రీకృత కార్యక్రమాల్లో వ్యయం చేస్తున్నారు. గ్రామాల స్థానిక పరిస్థితిని బట్టి, అక్కడి అవసరాలు తీర్చుకునే వెసు లుబాటు కూడా వారికి లేకుండా చేస్తున్నారు. త్వరలోనే రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు జరుగనున్న వేళ, ఈ దుస్థితిని తప్పించే అవకాశం కోసం ఏపీలోని 12,918 గ్రామ పంచాయతీలు నిరీక్షిస్తున్నాయి. ఇదే మంచి తరుణం గ్రామీణ వికాసానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నట్టు ఇటీవలి బడ్జెట్ స్పష్టం చేసింది. రైతుకు పెట్టుబడి, అసంఘటిత కార్మికులకు పెన్షన్, వైద్య పథకం విస్తరణ, గ్రామీణ రోడ్లు 3 రెట్లు పెంచడం, ‘గ్రామ్ జ్యోతి’ ప్రాధాన్యత, లక్ష గ్రామాల డిజిటలైజేషన్, ఉపాధిహామీకి నిధుల పెంపు... వంటివన్నీ గ్రామీణ వికాసానికి సానుకూల చర్యలే! కేంద్ర రాష్ట్రాలు కలిసి గ్రామాలను ఆర్థిక, ఉత్పత్తి కేంద్రాలుగా చేయాలి. గ్రామీణ గ్రోత్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. వ్యవసాయ మార్కెట్ సదు పాయాలు పెంచాలి. స్థానికంగా ఉద్యోగ–ఉపాధి అవకాశాల్ని మరింత మెరుగుపరచాలి. ఇదొక మంచి తరుణం. గ్రామీణ ప్రజానీకం, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండి ప్రతి అవకాశాన్ని అందిపుచ్చు కోవాలి, సానుకూలంగా మలచుకోవాలి. ప్రగతి పల్లవించాలి, మళ్లీ పల్లెలు వికసించాలి. గడపగడపన ఆనందం వెల్లివిరియాలి. పూజ్య బాపూజీ కలలుకన్న ‘గ్రామస్వరాజ్యం’ విరాజిల్లాలి. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ఊరూరా నర్సరీలు
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) నిధులను సంపూర్ణంగా వినియోగించుకొని గ్రామాల్లో తెలంగాణకు హరితహారం, వైకుంఠధామాలు (శ్మశాన వాటికలు) నిర్మించా లని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. నరేగా నిధులతోపాటు రాష్ట్ర బడ్జెట్ నిధులు, ఎంపీ, ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఉపయోగించుకొని గ్రామాల్లో అభివృద్ధి చర్యలు చేపట్టాలని సూచించారు. నరేగా పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంత మొత్తంలో నిధులు ఇస్తుందో అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయిస్తుందని... ఈ నిధులను గ్రామాల అభివృద్ధికి వినియోగించా లన్నారు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే నరేగా పనులు జరగాలని, హరితహారం పనులకు మొదటి ప్రాధాన్యం, శ్మశాన వాటికల నిర్మాణానికి రెండో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చెప్పారు. నరేగా నిధులు గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే ఆస్తు లను సృష్టించడానికి ఉపయోగించాలని సూచిం చారు. అన్ని గ్రామ పంచాయతీలకు కచ్చితంగా బీటీ రోడ్డు ఉండేలా రహదారుల వ్యవస్థను నిర్మించాలన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ఎంపీలు బి. వినోద్ కుమార్, బండ ప్రకాశ్, ఎమ్మెల్యేలు డి.ఎస్. రెడ్యానాయక్, ఈటల రాజేందర్, బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, అడిషనల్ పీసీసీఎఫ్ డోబ్రియాల్, సీఎంవో ప్రత్యేక కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పాల్గొన్నారు. మొక్కల సంరక్షణ గ్రామ పంచాయతీలదే... ‘తెలంగాణకు హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామంలో మొక్కలు నాటి రక్షించాలి. వాటికి నరేగా నిధులను పూర్తిగా వినియోగించుకోవాలి. గుంతలు తవ్వడానికి, నీళ్లు పోయడానికి, ఇతరత్రా పనులకు ఈ నిధులను వాడాలి. అటవీశాఖ అధికారుల సలహాలు, సాంకేతిక సహకారంతో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేయాలి. మొక్కలు పెట్టడం, వాటిని సంరక్షించడం లాంటి బాధ్యతలను గ్రామ పంచాయతీలు చేపట్టాలి. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కచ్చితంగా ఆరు నెలల్లో వైకుంఠధామాలు నిర్మించాలి. ప్రభుత్వ భూమి లేకుంటే గ్రామ పంచాయతీలు తమ నిధులతో స్థలాలు సమకూర్చాలి లేదా దాతల నుంచి స్వీకరించాలి. నరేగా నిధులతో వైకుంఠధామాలను నిర్మించాలి. మూడు వేలలోపు జనాభాగల 11,412 గ్రామాల్లో ఒకటి చొప్పున... మూడు వేలకుపైగా జనాభా కలిగిన 1,300 గ్రామాల్లో రెండు చొప్పున మొత్తం 14,012 గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించాలి. గ్రామాలను పరిశుభ్రంగా నిలపడం గ్రామ పంచాయతీల బాధ్యత. శిథిలాలను తొలగించాలి. పాడుపడిన, వాడని బావులను పూడ్చేయాలి. కూలిన ఇళ్ల శిథిలాలు తొలగించాలి. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు కచ్చితంగా బీటీ రోడ్డు ఉండాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. కొత్తగా 859 గ్రామాలకు రహదారులను నిర్మించాలి. వీటికోసం వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి పనులు ప్రారంభించాలి. నరేగాతోపాటు వివిధ పథకాల కింద సమకూరిన నిధులతో గ్రామాల్లో జరుగుతున్న పనులను అధికారులు తనిఖీ చేయాలి. నిధులు దుర్వినియోగం కావద్దు. ప్రతి పైసా సద్వినియోగం కావాలి. పనులు నామమాత్రంగా చేసి నిధులు కాజేసే పద్ధతి పోవాలి. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న పనులను అధికారులు 20 బృందాలుగా విడిపోయి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి’అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పంచాయతీ పాలనపై నేడు శిక్షణ... కొత్త పంచాయతీరాజ్ చట్టం, గ్రామాల్లోని పాలన తీరుపై గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గాలకు శిక్షణ ఇచ్చే ముఖ్య శిక్షకులకు అవగాహన కార్యక్రమం బుధవారం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్లో మొదలయ్యే ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని అన్ని జిల్లాల పంచాయతీ అధికారులను ఆదేశించారు. వారితోపాటు ప్రతి జిల్లా నుంచి 10 మంది ఎంపిక చేసిన అధికారులు పాల్గొననున్నారు. ఈవోపీఆర్డీలు, ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శులు, పలువురు కొత్త సర్పంచ్‌లు, తాజా మాజీ సర్పంచ్‌లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు పంచాయతీరాజ్‌శాఖ వర్గాలు తెలిపాయి. -
సాధికారతతో సమస్యలపై పోరు
న్యూఢిల్లీ: ఆర్థిక సాధికారత సాధించిన మహిళలు సామాజిక సమస్యలపై పోరాడగలుగుతారని ప్రధాని మోదీ అన్నారు. మహిళల్లో అపార శక్తి దాగి ఉందని, తమ శక్తి సామర్థ్యాలేమిటో వారు గుర్తించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు కోటి మంది స్వయంసహాయక బృందాల మహిళలతో నమో యాప్ ద్వారా ముచ్చటించారు. సమాజ సర్వతోముఖాభివృద్ధికి మహిళా సాధికారత కీలకమని ఉద్ఘాటించారు. ‘మహిళా సాధికారతకు ఆర్థిక స్వాతంత్య్రం ముఖ్యం. మహిళలు ప్రతిభావంతులు. వారికి మరొకరు చెప్పాల్సిన అవసరం లేదు. తామేంటో నిరూపించుకునేందుకు వారికి అవకాశం ఇస్తే చాలు. ఆర్థిక స్వాతంత్య్రం మహిళా సాధికారతకు దోహదపడుతుంది. ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడిన మహిళలు అన్ని సామాజిక దురాచారాలకు ఎదురొడ్డి నిలుస్తారు’ అని కితాబిచ్చారు. గ్రామీణాభివృద్ధిలో స్వయం సహాయక బృందాల పాత్రను ఆయన కొనియాడారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుమారు 20 లక్షల స్వయం సహాయక బృందాలను ఏర్పాటుచేశామని, 2.25 కోట్లకు పైగా కుటుంబాలను వాటిలో భాగం చేశామని తెలిపారు. ప్రస్తుతం 45 లక్షల స్వయం సహాయక బృందాల్లో సుమారు 5 కోట్ల మంది మహిళలు క్రియాశీలకంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధికి ఈ బృందాలు పునాది వేస్తున్నాయని ప్రశంసించారు. గ్రామీణాభివృద్ధిలో కీలకమైన వ్యవసాయం, పశుపోషణ రంగాలు మహిళలు లేకుండా మనుగడ సాగించలేవని అన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక బృందాలు తమ జీవితాల్లో తీసుకొచ్చిన మార్పును, స్ఫూర్తిదాయక గాథలను పలువురు మహిళలు ప్రధానితో పంచుకున్నారు. ‘వారసత్వ’ రక్షణకు ప్రజా భాగస్వామ్యం దేశ వారసత్వ సంపద పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రాచీన కట్టడాలను విస్మరించడంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని..వాటి ప్రాముఖ్యతను యువ తరానికి తెలియజేసి వారి వైఖరిలో మార్పు తీసుకురావాలని అభిలషించారు. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో మోదీ గురువారం నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..మన ప్రాచీన వారసత్వ కట్టడాలు, సంపదను కాపాడుకోవాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని నొక్కి చెప్పారు. కొన్ని కట్టడాల వద్ద ప్రజలు ఫొటోలు, సెల్ఫీలు దిగకుండా నిషేధాజ్ఞలు విధించడాన్ని తప్పు పట్టారు. ‘విదేశాల్లో ఎక్కడికెళ్లినా ప్రాచీన కట్టడాల వద్ద రిటైర్ అయిన వారే గైడుగా పనిచేస్తూ కనిపిస్తారు. వాటిని కాపాడుకునే బాధ్యతను సమాజమే తీసుకుంటుంది. అలాంటి విలువలనే భారత్‌లోనూ పాదుకొల్పాలి. పాఠశాలల సిలబస్‌లో వారసత్వ కట్టడాల సమాచారాన్ని చేరిస్తే, విద్యార్థులు వాటి గురించి తెలుసుకుంటూ పెరుగుతారు. టూరిస్ట్ గైడుగా పనిచేసేలా యువతను ప్రోత్సహించాలి. వారసత్వ స్థలాల పరిరక్షణలో పాలుపంచుకునేలా కార్పొరేట్ కంపెనీలను ఒప్పించాలి’ అని అన్నారు. -
బడ్జెట్ ఓ కురవని మేఘం
గ్రామీణాభివృద్ధి శాఖకు కేంద్ర బడ్జెట్లో నాలుగు శాతం నామమాత్రపు కేటాయింపులు చేశారు. వీటితో ఆరున్నర లక్షల గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన అంటే 21వ శతాబ్దపు మయసభను ఊహించుకోవటం తప్ప మరో మార్గం లేదు. గత మూడేళ్లుగా గ్రామీణ ప్రాంతాలు ఎదుర్కొంటున్న దుర్భిక్షం నేపథ్యంలో 2018 బడ్జెట్ గ్రామీణ ప్రజల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తుందని భావించారు. బడ్జెట్ ఉపన్యాసం కూడా అదే ధోరణిని ధ్వనించింది. అయితే ఆర్థికమంత్రి చూస్తున్న గ్రామీణ భారతం, ప్రజలనుభవిస్తున్న గ్రామీణ భారతం ఒక్కటేనా అన్నది ఇప్పుడు మనముందున్న సమస్య. గత 3 బడ్జెట్లలో మాట వరుసకన్నా ఉపాధి, నైపుణ్యం, గ్రామీణ ఉపాధి, ఉత్పత్తి వంటి పదాలు వినిపించాయి. ఈ బడ్జెట్లో అవి కూడా కరువయ్యాయి. గ్రామీణ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య బీమా ఈ బడ్జెట్ ప్రాధాన్యతలుగా ముందుకొచ్చాయి. 2008 బడ్జెట్లో యూపీఏ ప్రతిపాదించిన రుణమాఫీ పథకం 2009 ఎన్నికల్లో ఫలితాన్నిచ్చినట్లుగా ఈ ఆరోగ్యబీమా ఎన్డీయేకు 2019లో అచ్చొస్తుందా అన్నది వేచి చూడాలి. ఈ రెండు పథకాల మధ్య మౌలికమైన తేడా ఉంది. రైతు రుణమాఫీ పథకం ఎన్ని పరిమితులతోనైనా రైతుల చేతుల్లో రొక్కం మిగి ల్చింది. కానీ మోదీ ప్రభుత్వ ఆరోగ్యబీమా పథకం కార్పొరేట్ ఆసుపత్రుల ఖజానాను నింపే పథకమన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్యబీమా పథకాన్ని ముందుకు తేవటంతో 2014 ఎన్నికల్లో గ్రామీణ ప్రజల ఆదాయాలు రెట్టింపు చేస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, అవినీతిని అంతమొందిస్తామని బీజేపీ వాగ్దానాలు నీటిమీద రాతలయ్యాయన్న అంగీకరించినట్లైంది. విత్తనాలు వేయటానికి ముందు రైతు ఆకాశంలో కనపడే ప్రతి మేఘమూ కురవటానికే వచ్చిందా అన్నట్లు చూస్తాడు. మోదీ మాయాజాలం కూడా ప్రజలకు కురవని మేఘాలు చూపించి కాలక్షేపం చేస్తోంది. బడ్జెట్ ప్రసంగానికి, కేటాయింపులకు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోటానికి ఒక్క గ్రామీణ మౌలిక రంగం గురించి ప్రస్తావనను చూస్తే సరిపోతుంది. గ్రామీణాభివృద్ధికి క్లస్టర్ విధానాన్ని అనుసరించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే పాతిక ముప్పై గ్రామాలకు ఉపయోగపడేలా మౌలికసదుపాయాల కల్పన వ్యూహం. కానీ గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయింపులు 4 శాతానికి మించి పెరగలేదు. మరి ఆరున్నర లక్షల గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించటం అంటే 21వ శతాబ్దపు మయసభను ఊహించుకోవటం తప్ప మరో మార్గం లేదు. ప్రభుత్వానికి ప్రాణప్రదమైన పథకాలు స్వచ్ఛభారత్ అభియాన్, ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన, ఆవాస్ యోజన, ఉపాధి హామీ పథకం కేటాయింపులు నిరాశాజనకంగా ఉన్నాయి. ఆవాస్ యోజన కేటాయింపులు 9 శాతం తగ్గితే ఉపాధి హామీ కేటాయింపులు యథాతథంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు రెండు కోట్ల పాయఖానాలు, యాభై లక్షల నివాసాలు నిర్మాణం లక్ష్యంగా నిర్ణయించింది. కానీ కేటాయింపులు తగ్గట్టుగా లేవు. ఒక్క ఏపీలోనే 30 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం సహకరించాలని డిసెంబరులో హూంకరించిన టీడీపీ తన విజ్ఞప్తిని కనీసం ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం కూడా చేయకపోవటం గమనిస్తే రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజల ఆగ్రహావేశాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నమే తప్ప మరోటి కాదని తేటతెల్లమవుతుంది. ఇక ఆరోగ్య బీమా పథకంపై ఆర్థిక మంత్రి ప్రకటన రెండు కీలక అంశాలు చర్చకు పెడుతోంది. మొదటిది దేశంలో పేదలెందరు అన్న ప్రశ్న. దావోస్ మొదలు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్, ప్రపంచ వాణిజ్య సంస్థలకిచ్చిన లెక్కల్లో దేశ జనాభాలో పేదలు 20 శాతంలోపే అన్న వాదన వినిపించిన ప్రభుత్వం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న యాభై కోట్ల ప్రజానీకం కోసం ఆరోగ్య బీమా పథకం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ఏది మోసం, ఏది వాస్తవం అన్నది ప్రజలే నిర్ణయిం చుకోవాలి. పైగా 2008లో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనకు (ఆరెస్బీవై) నేడు మోదీ రంగు మార్చి చెప్పుకుంటున్న ‘ఆయుష్మాన్ భారత్’ పథకానికి మధ్య పేర్లలో తప్ప తేడా లేదు. యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన పదుల కొద్దీ పథకాలకు పేర్లు మార్చటం తప్ప మోదీ గ్రామీణ ప్రజలకు కొత్తగా ఇచ్చిన వరాలు ఏమీ లేవు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనకు పునాది నాటి ఉమ్మడి ఏపీలో ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఆరెస్బీవై అమలు కొన్ని రాష్ట్రాల్లో తప్ప విజయవంతం కాలేదు. ప్రజల్లో ఈ పథకం, దాని ప్రయోజనం పట్ల సరైన అవగాహన లేకపోవటం ఒక కారణమైతే ప్రాథమిక వైద్యసేవలను పటిష్టం చేయకపోవటం మరో కారణం. చివరిగా 2018 బడ్జెట్లో ప్రతిపాదించిన ఆరోగ్యబీమా పథకం నేరుగా ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరవేయటం కాకుండా బీమా కంపెనీల ద్వారా చేరవేయటానికి సంకల్పించింది. నేరుగా అందించాల్సిన సేవల విషయంలోనే ప్రభుత్వ వైఫల్యం బట్టబయలవుతుంటే మార్కెట్ నియంత్రిత సేవలు ప్రజలకు ఎక్కువ ప్రయోజనం కల్గిస్తాయని నమ్మటం ఎలా? ప్రైవేటు వైద్య, ఇంజ నీరింగ్ కళాశాలలనే నియంత్రించలేని మనదేశంలో లక్షల కోట్ల రూపాయలతో కూడిన ప్రైవేటు ఆరోగ్య బీమా కంపెనీలను నియంత్రించి ప్రజల ఆరోగ్యానికి బీమా హామీ కల్పిస్తుందని ఆశించటం ఎలా? వ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు కొండూరి వీరయ్య 98717 94037 -
గ్రామీణ బడ్జెట్
సాక్షి, వరంగల్ రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గ్రామీణాభివృద్ధికి ఊతమిచ్చేలా ఉంది. రైతులు, పేదలు, చిరువ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ సారి కేంద్రం గ్రామీణ ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్లో గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. 2018–2019 ఆర్థిక సంవత్సరానికి రూ.11 లక్షల కోట్లు వ్యవసాయానికి కేటాయించారు. దీంతో జిల్లా రైతాంగానికి కూడా లబ్ధి చేకూరే అవకాశముంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14,36,215 ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా 6,27,415 మంది రైతులు ఉన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలన్న ఆశయంతో ఉన్నామని, ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో జిల్లాలోని రైతులకు ఎంతో లబ్ధి చేకూరనుంది. మద్దతు ధరతో రైతులకు లాభం కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతుధర కల్పించడానికి బడ్జెట్లో నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. వ్యవసాయ రంగంలో రూ.11 లక్షల కోట్ల రుణాలు ఇప్పించడానికి బడ్జెట్లో కేటాయిం చడం సంతోషకరం. ప్రధాని నిర్ణయంతో రైతులకు ఇక మంచిరోజులు వచ్చే అవకాశం ఉంది. – కత్తాల వెంకటేశ్వర్రావు, ధర్మరావుపేట, రైతు తెల్లకార్డు దారులకు ఆరోగ్య బీమా తెల్లకార్డుదారుడి కుటుంబానికి రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించనున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12,93,612 ఆహార భద్రత కార్డులుండటంతో ఆ కుటుంబాల వారికి వర్తించనుంది. గిరిజన యూనివర్సిటీకి రూ.10 కోట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో ఏర్పాటు చేయనున్న గిరిజన యూనివర్సిటీకి రూ.10 కోట్లను ఈ బడ్జెట్లో కేటాయించారు. ఇటీవలే ఈ గిరిజన యూనివర్సిటీ మంజూరైంది. -
ఉపాధి సిబ్బందితో సెల్‌గాటం
గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ శాంసంగ్ మొబైల్ ఫోన్ల వ్యాపారం ప్రారంభించిందా? ఉపాధి హామీ పథకం సిబ్బంది వద్దంటున్నా బలవంతంగా పాత స్మార్ట్ఫోన్లను అంటగట్టే ప్రయత్నాలు ప్రారంభిం చిందా? స్మార్టు ఫోన్లు ఉన్నా మళ్లీ కొనాల్సి వస్తోందని ఉపాధి హామీ పథకం సిబ్బంది వాపోతున్నారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఉపాధి పథకం సిబ్బంది వద్ద ఇప్పటికే స్మార్టు ఫోన్లు ఉన్నా అంతగా ఫీచర్లు లేని ఫోన్లను బలవంతంగా అంటగట్టడం ఇందుకు నిదర్శనం. సాక్షి, మచిలీప్నటం: రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించి పదేళ్లు పూర్తయింది. పథకంలో పారదర్శకత కోసం 8 ఏళ్లుగా కూలీల హాజరు, పని కొలతల నమోదు, కూలి చెల్లింపును ఆన్లైన్లో చేపడుతున్నారు. ఇందు కోసం క్షేత్ర స్థాయి సిబ్బంది మొదలు కార్యాలయ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ అధునాతన టెక్నాలజీతో కూడిన ఆండ్రాయిడ్ స్మార్టు ఫోన్లను వినియోగిస్తున్నారు. 2006లో పథకం ప్రారంభం సమయంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ పథకం సిబ్బందికి సాధారణ ఫోన్లు ఉచితంగా అందజేసింది. ఆన్లైన్ చెల్లింపులు ప్రారంభమవడంతో నాలుగేళ్ల క్రితం రూ.6,700 విలువైన శాంసంగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు అందజేసింది. ఫోన్ ధరలో 50 శాతం సిబ్బంది చెల్లిస్తే, మిగిలిన మొత్తం గ్రామీణాభివృద్ధి భరిస్తుందని మొదట్లో చెప్పినా ఆ మొత్తాన్ని కూడా సిబ్బంది వేతనం నుంచే వసూలు చేశారు. వద్దన్నా ఫోన్లు సెల్‌ఫోన్ కంపెనీల మధ్య పోటీ నేపథ్యంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, సరికొత్త ఫీచర్లతో మొబైల్ ఫోన్లు చౌకధరలకే లభిస్తున్నాయి. ఉపాధి సిబ్బంది కూడా రూ.10 వేలకు పైగా విలువైన లేటెస్ట్ మోడల్ స్మార్ట్ఫోన్లతో రోజువారీగా కూలీల హాజరు, కొలతలు, జీపీఎస్ ద్వారా క్షేత్రస్థాయి నుంచే ఎన్ఆర్ఈజీఎస్ వెబ్‌సైట్‌కు అప్లోడ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయి ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు మేట్లు కూడా వీటినే వినియోగిస్తున్నారు. ఈ నేథ్యంలో ఇటీవల ఎన్ఆర్ఈజీఎస్ సరఫరా చేసే స్మార్ట్ ఫోన్లు ఎవరికి కావాలంటూ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ నుంచి ఉపాధి సిబ్బందిని అడిగారు. 80 శాతం మందికి పైగా క్షేత్రస్థాయి సిబ్బంది తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలోని అన్ని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయాలకు పాతబడిన శాంసంగ్ జే2 ప్రో మొబైల్ పార్శిళ్లు వచ్చిచేరాయి. జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖలో ఏపీడీ, పీఓ, టెక్నిలక్ అసిస్టెంట్స్, సీనియర్ మేట్లు కలిపి 1035 మంది ఉన్నారు. వారందరికీ రూ.93 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఇప్పటికే 80 శాతం ఫోన్లను ఎంపీడీఓ కార్యాలయాలకు సరఫరా చేశారు. కొంత మంది సిబ్బందికి సైతం పంపిణీ చేశారు. మిగిలిన వారికి రెండు మూడు రోజుల్లో అందజేయనున్నారు. సిబ్బంది అప్పుగా ఫోన్లు ఇచ్చి, నెలకు రూ.900 చొప్పున జీతంలో కోత విధించనున్నారు. పాత ఫోన్లకు అధిక ధర శ్యాంసంగ్ జే2 ప్రో మోడల్ పాతబడింది. ప్రస్తుతం సరికొత్త జే7 మోడల్ మార్కెల్లో లభిస్తోంది. ఈ ఫోన్ల కంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్న వీవో, అప్పో ఫోన్లు చౌకగా లభిస్తున్నాయి. ఆ కంపెనీలతో పోల్చితే శాంసంగ్ బ్యాటరీ లైఫ్, ఫీచర్స్ కూడా తక్కువే. అమెజాన్ వంటి ఆన్లైన్ సంస్థ రూ.8,470 రూపాయలకే విక్రయిస్తున్న జే2 ప్రో ఫోన్‌ను రూ.9080కు అంటగడుతున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 26,786 మందికి అంటగట్టేందుకు రూ.24.32 కోట్లు వెచ్చించి ఫోన్లుకొన్నారు. ఇన్ని ఫోన్లు కొంటే ఆన్లైన్ ధరకంటే తక్కువకే రావాలి. అయితే ధర అంతకు విరుద్ధంగా ఉంది. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల పాత్ర దాగుందని, ఇందులో భాగంగానే తమ కమీషన్ల కోసం సిబ్బందిని పావులుగా వాడుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. -
గ్రామ సంపూర్ణ అభివృద్ధే లక్ష్యం
తాడిమర్రి / ధర్మవరం అర్బన్ : గ్రామ సంపూర్ణ అభివృద్ధే తన లక్ష్యమని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ అనూరాధ పేర్కొన్నారు. తాను దత్తతకు తీసుకున్న మండలంలోని ఆత్మకూరు, శివంపల్లి గ్రామాల్లో శుక్రవారం ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆత్మకూరు గ్రామంలో రూ.4లక్షలతో నిర్మించిన రెండు సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం 20 మంది చేనేత కార్మికులకు ఒకొక్కక్కరికి రూ.1000లు ప్రకారం నగదు సాయం, చేనేత మగ్గం పరికరాలను అందజేశారు. అనంతరం శివంపల్లి గ్రామంలో రూ.6లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని, తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యలు లేని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడానికే శివంపల్లి, ఆత్మకూరు గ్రామాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తాడిమర్రి, ఆత్మకూరు సర్పంచ్‌లు దేవర హర్షిత, సాకే లక్ష్మీదేవి, తహసీల్దార్ సుబ్బలక్ష్మమ్మ, ఎంపీడీఓ వెంకటనాయుడు, ఎస్ఐ రాంభూపాల్, ఐసీడీఎస్ సూపర్వైజర్ కౌసల్య, మండల ఇంజనీర్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం ధర్మవరం మండలం కుణుతూరు సమీపంలో పోలీస్ గెస్ట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మాజీ డీజీపీ రాముడు దత్తత తీసుకున్న నార్సింపల్లి గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో తాను తాడిమర్రి మండలంలోని శివంపల్లి గ్రామాన్ని దత్తతకు తీసుకున్నట్లు వివరించారు. గ్రామంలోని మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఉచిత కుట్టుశిక్షణ, అగరబత్తీ తయారీ, పురుషులకు డ్రైవింగ్ శిక్షణ ఇప్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గ్రామంలోని చేనేత కార్మికులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే జిల్లాలో అక్రమ మైనింగ్ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సమావేశంలో విజిలెన్స్ ఎస్పీ అనిల్‌బాబు, రూరల్ సీఐ శివరాముడు, ఎస్ఐలు యతీంద్ర, సురేష్ పాల్గొన్నారు. -
గ్రామీణాభివృద్ధితోనే దేశ ప్రగతి
‘గ్రామీణాభివృద్ధి’ సదస్సులో కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు సాక్షి, హైదరాబాద్: పల్లె ప్రజల జీవన ప్రమాణాలను, ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో గ్రామీణ ఆవిష్కరణలు దోహదపడతాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. గ్రామీణ జీవితాలను ప్రభావితం చేసే స్థానిక ఆవిష్కరణలపై హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభి వృద్ధి, పంచాయతీరాజ్ సంస్థలో రెండు రోజుల సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామీణ ఆవిష్కరణల ఎగ్జిబిషన్‌ను వెంకయ్యనాయుడు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాల నుంచి ప్రజలు ఉపాధి కోసం పట్టణాలకు వలస రాకుండా చూడాలంటే గ్రామాల్లోనే అన్ని వసతులూ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తేగలిగిన బయోగ్యాస్, ఏ సీజన్లోనైనా వ్యర్థాలను కుళ్లింపజేసే బయోడైజెస్టర్ బాక్టీరియా వంటి అద్భుత ఆవిష్కరణలు ఎన్నో ఉన్నప్పటికీ గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం విచారకరమని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. గ్రామీణ ప్రజల అభ్యున్నతికి దోహదపడే ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే ఈ సదస్సు ఏర్పాటు చేశామని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ డైరెక్టర్ జనరల్ డా. డబ్ల్యూఆర్.రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలోఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ చైర్మన్ డాక్టర్ బి.ఎన్. సురేశ్, పల్లెసృజన అధక్షుడు బ్రిగేడియర్ పోగుల గణేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ గ్రామీణ ఆవిష్కర్తలు చింతల వెంకటరెడ్డి, చింతకింది మల్లేశంను మంత్రి ఘనంగా సత్కరించారు. ఇన్నోవేషన్ల ప్రదర్శన, సదస్సు శనివారం కూడా కొనసాగుతుంది. -
గ్రామీణ ప్రగతిపై నూతన యాప్
► ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త సత్యనారాయణ భీమవరం : ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థుల యువశక్తిని వినియోగించుకుని భారతదేశంలో గ్రామీణ ప్రగతిపై ఒక యాప్‌ను తయారు చేసేందుకు జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) సన్నాహాలు చేస్తున్నట్టు ఎన్ఆర్ఎస్సీ ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి.సత్యనారాయణ అన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం యాప్ వివరాలతో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. యాప్‌ను జాతీయస్థాయిలో పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖకు అందించేందుకు భవన్ పంచాయతీ మొబైల్ యాప్‌ను రూపొందించినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా 574 జిల్లాల్లోని అన్ని గ్రామాల్లో భవన్ పంచాయతీ సేవలు జియో ట్యాగ్ ద్వారా అనుసంధానం చేస్తామన్నారు. దీనికిగాను సుమారు రూ.150 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సత్యనారాయణ చెప్పారు. రెండోదశలో కొన్ని జిల్లాలు, మూడో దశలో అన్ని జిల్లాలను పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు చెప్పారు. దీనిలో భాగంగా ఇప్పటికే 70 జిల్లాల్లో యాప్ తయారుచేయడం పూర్తయిందన్నారు. అనంతరం కళాశాలలోని వెట్ సెంటర్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎస్ఎన్ రాజు, డైరెక్టర్ సాగి విఠల్‌రంగరాజు, స్పేస్ టెక్నాలజీ సెంటర్ కో–ఆరి్డనేటర్ డాక్టర్ వైఎస్ఎస్ఆర్ మూర్తి, ఆర్అండ్డీ డీన్ డాక్టర్ పీఏ రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
వంద రోజుల ఉపాధి కల్పనే లక్ష్యం
- గ్రామీణాభివృద్ధికి జతగా సెర్ప్ సిబ్బంది - ఉపాధిహామీ కమిటీల ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ పేదలకు వందరోజుల ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామాల్లో వ్యవసాయ పనులు ముగియ డంతో ఖాళీగా ఉన్న కూలీలందరినీ ఉపాధి హామీ వైపు మళ్లించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కూలీలకు ఉపాధిహామీ పథకం పట్ల అవగాహన కల్పించడం, వారికి అవసరమైన జాబ్ కార్డులను ఇప్పించడం, కూలీల డిమాండ్ మేరకు ఉపాధి పనులను సిద్ధం చేయడం.. తదితర కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఉపాధిహామీ సిబ్బందితో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సిబ్బంది సేవలను కూడా వినియోగించు కోవాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఉపాధిహామీ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 18,405 గ్రామ సమాఖ్యల సహాయకులను, 3,209 మంది కమ్యూనిటీ కోఆర్డినేటర్లను, 45.65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ స్థాయిలో సమష్టిగా.. ఉపాధిహామీ పనులు కల్పించే నిమిత్తం జాబ్ కార్డులు ఇప్పించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందితో సెర్ప్ సిబ్బంది కలసి పని చేయాలని ప్రభుత్వం సూచించింది. పనుల డిమాం డ్‌ను సృష్టించే విధంగా కూలీలను, ఎస్ఎస్ఎస్, ఎస్‌హెచ్‌జీ గ్రూపులను ప్రోత్స హించాలని ఆదేశిం చింది. గ్రామంలో రోజు వారీ ఉపాధిహామీ పనులను పర్యవేక్షిం చేందుకు గ్రామస్థాయిలో ఐదుగురు సభ్యుల తో కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభు త్వం సూచించింది. లేబర్ బడ్జెట్ రూప కల్పనలో గ్రామ సమాఖ్యలు కీలక పాత్ర పోషించాలని ఆదేశించింది. గ్రామాలలో లేబర్ బడ్జెట్ పురోగతిని మండల సమాఖ్యలు సమీక్షించాలని, మండల స్థాయిలో పనిచేసే ఏపీఎంలు, కమ్యూనిటీ కోఆర్డి నేటర్లు ఆయా పనులను పర్యవేక్షించాలని సర్కారు సూచించింది. -
మరమ్మతులతో సరిపెడుతున్నారు!
- ఉపాధిహామీ కింద సీసీరోడ్ల నిర్మాణంలో కొన్నిచోట్ల అవకతవకలు - గ్రామీణాభివృద్ధి శాఖకు ఫిర్యాదులు సాక్షి, హైదరాబాద్: ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన సిమెంట్ రహదారుల నిర్మాణ పనుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని గ్రామీణాభి వృద్ధి శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఇంతకు మునుపే వివిధ ప్రభుత్వ పథకాల కింద వేసిన సీసీరోడ్లనే తాజాగా కొద్దిపాటి మరమ్మతులు చేసి, కొత్త సిమెంట్ రోడ్ల మాదిరిగా చిత్రీకరిస్తున్నట్లు ఉన్నతాధి కారుల పరిశీలనలో తేలింది. ఉపాధిహామీ పథకంలో మెటీరియల్ కాంపొనెంట్ నిధులను ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఖర్చు చేయాల్సి ఉన్నందున, గత నెలరోజు లుగా గ్రామాల్లో హడావిడి వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో సిమెంట్ రహదారుల నిర్మాణానికి అవసరమైన ఇసుక అందుబాటులో లేకపోవడం, కొన్ని ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేసేందుకు అవసరమైన మేస్త్రీలు దొరకకపోవడంతో ఆశించిన స్థాయిలో పనులు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. రూ.300 కోట్లకు మించే పరిస్థితి లేదు... ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి కేవలం 7,564 పనులు మాత్రమే కొనసాగుతున్నాయని, వీటికి రూ.259.09కోట్లు మాత్రమే ఖర్చయిందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. కొన్ని జిల్లాల్లో ఇంటర్నెట్ సమస్యల కారణంగా పనుల వివరాలను నమోదు చేయలేదని, మొత్తంగా రూ.300 కోట్లకు మించి సీసీ రోడ్లకు ఖర్చయ్యే పరిస్థితి కనిపించడం లేదని తెలుస్తోంది. దీంతో ఆయా గ్రామాల్లో పాత సిమెంట్ రోడ్లనే కొత్త రహదారులుగా చూపి సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లో కొత్త సీసీరోడ్లు వేసినట్లు రికార్డుల్లో నమోదు చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లోనైతే ఏకంగా ఎమ్మెల్యేలు, మంత్రులు తమ అనుయూయులకు సీసీరోడ్ల బిల్లులు ఇప్పించాలని జిల్లా కలెక్టర్లపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. పూర్తి చేసిన వాటికే బిల్లులు.. మార్చి 31లోగా సీసీరోడ్లు నిర్మించకుండా బిల్లులు పొందేందుకు అస్కారం లేదని, పూర్తిచేసిన రహదారులకు మాత్రమే బిల్లులు మంజూరవుతాయని ఉన్నతాధికారులు అంటున్నారు. నిర్మించిన ప్రతి సీసీరోడ్ను తప్పనిసరిగా జియోట్యాగింగ్ చేస్తున్నామని, ఆయా రహదారుల వద్ద ఉపాధిహామీ నిధులతో నిర్మించిన రహదారిగా శిలాఫలకాలు ఏర్పాటు చేయనున్నామని అధికారులు చెబుతున్నారు. -
గ్రామీణ అభివృద్ధిలో భాగమే ‘చేనేత’
టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ పునరుజ్జీవం పేరుతో చేతివృత్తుల వారికి 2017–18 బడ్జెట్లో ప్రత్యేకమైన కేటాయింపులు చేసినట్లు కనపడుతోంది. వివిధ కుల వృత్తులకు నిలయమైన గ్రామీణ అభి వృద్ధికి ఉత్తేజం కల్పించాలనే తపనతో అదనంగా నిధుల కేటా యింపు అని చెబుతున్నారు. అందులో భాగంగానే ‘చేనేత వృత్తికి భరోసా’ కల్పించేందుకు, మొత్తంగా వృత్తికారుల ఉనికిని నిల బెట్టేందుకు చేనేతకు రూ. 12 వందల కోట్లను ప్రభుత్వం ప్రకటిం చింది. దీంతో రాష్ట్రంలో ఒక వర్గానికి జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపు చేసే ప్రక్రియకు తెరతీసింది. చేనేతలకు, వృత్తులపై ఆధారపడిన వారికి మాత్రం ఇలాంటి కేటాయింపులు లేవు. చేనేతకు రూ. 1,200 కోట్లు అనగానే బంగారు తెలంగాణ ఏమోగానీ, చేనేతల బ్రతుకుకు బంగారు భవిష్యత్ ఉందని కార్మికులు ఆశపడుతున్నారు. చావుభయంతో ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తునికి బ్రతుకు ఆశ కల్పించినట్లుగా ఉనికి కోల్పోతున్న చేనేత రంగానికి పునరు త్తేజం తెస్తున్నట్లు ప్రభుత్వం మరోసారి భ్రమలు కల్పిస్తున్నది. తెలంగాణ చేనేత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రత్యేకంగా పోచంపల్లి టై అండ్ డై, గద్వాలు కుప్పడం చీరలు, హన్మకొండ తివాచీ, కరీంనగర్ దుప్పట్లు, ధోతీలు, లుంగీలు; దుబ్బాక గొల్ల భామలు చీరలు ఎంతో ప్రత్యేకత కల్గిన ఉత్పత్తులు. అంతేగాక దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ అవకా శాలు అంది పుచ్చుకుంటున్న ఉత్పత్తి రకాలు. అయితే 1980ల నుంచి చేనేత రంగం తన ఉనికిని కోల్పోతూ సహకార వ్యవస్థ కుంటుపడింది. దీనికి అవినీతి, యాజమాన్యాల నిర్వహణ లోపాలు, రాజకీయ పార్టీల జోక్యమే కారణం. ఈ దుస్థితి వల్లనే 1995 వరకు సుమారు 73,119 మగ్గాలు ఉండగా నేడు 17,000 సంఖ్యకు తగ్గిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వ డేటా మగ్గాల సంఖ్య తగ్గిందని చూపు తుందే కానీ, 11,643 మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్న 69,858 మంది చేనేతపై పొందుతున్న ఉపాధిని కోల్పోయారని మాత్రం చెప్పదు. వృత్తిపై ఆధారపడి జీవిస్తూ అప్పుల బాధ తట్టుకోలేక, అనారోగ్య పీడితులై ఆత్మహత్యలు చేసుకున్న 234 కుటుంబాలలో 89 మందికి సంబంధించిన పోస్ట్‌మార్టం రిపోర్టులు, ఎఫ్ఐఆర్ కాపీలు లేవంటూ ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరిం చింది. చావులో కూడా ప్రభుత్వ వివక్షకు ఇంతకంటే నిదర్శనం లేదు. కేసీఆర్ పాలనలో 11 మంది చేనేతలు ఆత్మహత్య చేసుకు న్నారు. చేనేతపట్ల చేసిన నిర్లక్ష్యానికి బలైన కుటుంబాలకు జవాబు దారీ ఎవరు? రాజ్యం భరోసా ఇవ్వనందునే, సంక్షేమ చర్యలు, వృత్తిని ఆదుకొనే విధానాలు లేనందునే తెలంగాణలో కానీ మరె క్కడైనా శ్రమించే లక్షణం పుణికి పుచ్చుకునే చేనేత కార్మికులు ఆత్మ గౌరవంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులలో రూ. 74.93 లక్షలలో కేవలం రూ. 49.87 లక్షలు మాత్రమే త్రిఫ్ట్ పథకంకు ఖర్చు చేశారు. 2015–16 సంవత్సరంలో కూడా రూ. 199.50 లక్షలు కేటాయించి రూ. 49.47 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. రుణమాఫీ పథకానికి రూ. 239 లక్షలు కేటాయించి, రూ. 176.16 లక్షలు మాత్రమే నిధులు విడుదల చేసింది. ముడిసరుకు సరసమైన ధరలకు అందించాలనే చేనేతల డిమాండ్ ఫలితంగా ప్రవేశపెట్టిన యారన్ సబ్సిడీ పథకానికి (10 శాతం) రూ. 450.00 లక్షలు కేటాయించి రూ. 225.00 లక్షలు మాత్రమే నిధులిచ్చింది. గద్వాల్ చేనేత పార్క్ స్థాపనను ప్రకటనకే పరిమితం చేసి నిధులు కేటాయించక పోవడంతో పనులు ప్రారంభించక చేనేత కార్మికుల ఆశలు ‘ఎండమావి’గా మారాయి. వడ్డీ రాయితీని రూ. 750.70 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. బడ్జెట్ కేటాయింపుల ప్రకారం పథకాలను అమలు చేయకపోవడం వలన తెలంగాణలో చేనేత ఉపాధి ప్రశ్నార్థకమై కార్మికులు ఇతర రంగాలలో ఉపాధి పొందేందుకు పట్టణ ప్రాంతాలకు వలసలు వెళ్లడం వలన చేనేత గ్రామాలలో మగ్గాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇప్పటికే సూరత్, భివాంధే, షోలాపూర్‌లకు వలసలు వెళ్లిన తెలంగాణ చేనే తలు నేడు అమలు జరుగుతున్న వేతనాల సమస్యతో చాలీ చాలని జీతాలతో బ్రతుకునీడ్చలేక అనారోగ్య పీడితులై దుర్భర దారిద్య్ర జీవితాలను అనుభవిస్తున్నారు. వారందరినీ ఇక్కడకు తెచ్చే ఏర్పా టుచేస్తానని కేసీఆర్ ఎన్నికల్లో వాగ్దానం చేశారు. అయితే వారిని ఇక్కడికి తీసుకొచ్చేది వేతన కూలీలుగా చేయడానికా లేక స్వయం సమృద్ధి చెందించడానికా అనేది ప్రశ్న. నిజంగా స్వయంసమృద్ధి కొరకు అయితే అపెరల్ పార్కులను, మెగా టెక్స్టైల్ పార్కులను ప్రతిపాదించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి చేనేత పరిశ్రమలను కాపాడాలనే తపన ఉంటే తక్షణమే 20 శాతం వేతన రాయితీని కార్మికులకు ప్రకటించాలి. ఈ పథకం అమలుకు సగటు నెల వేతనాన్ని రూ. 12 వేల నుంచి రూ. 15 వేలుగా గుర్తించి, కార్మికులు నెలవారీగా సంఘాలు లేక మాస్టర్ వీవర్స్ వద్ద పొందుతున్న మజూరీలనుబట్టి వేజ్ ఇన్సెం టివ్‌ను లెక్కకట్టి ఇవ్వాలి. చేనేత అభివృద్ధిని గ్రామీణ అభివృద్ధిలో భాగంగా ఆలోచించి విధానాలు రూపొందించాలి. గ్రామీణ నిరు ద్యోగ నిర్మూలనకు చేనేత రంగ అభివృద్ధి ఒక చక్కని అవకాశంగా గుర్తించి ప్రత్యేక ప్రణాళికలను, స్థానిక మార్కెట్ అవకాశాలను రూపొందించాలి. అంతిమంగా చేనేతనాయకులు, కార్మికులు సమస్య ప్రాతిపదికగా జరిపే పోరాట ఆచరణ మాత్రమే నిజమైన గుర్తింపుగా భావించి సంఘటిత పోరాటాలు చేయాలి. - మాచర్ల మోహన్‌రావు, వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర చేనేత జనసమాఖ్య, తెలంగాణ weavers.hl@gmail.com -
ఊపందుకున్న ‘ఉపాధి’
⇒ ఉపాధి పనుల్లో రోజుకు ఏడు లక్షల మంది కూలీలు! ⇒ ఇక కనిష్ట కూలీ రూ.130, గరిష్టం రూ.310 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. జనవరిలో ఉపాధి పనులకు లక్ష మంది లోపే హాజరు కాగా, ఫిబ్రవరి నుంచి ఆ సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోంది. గత వారంలోనైతే రోజుకు సగటున 5.78 లక్షల మంది చొప్పున కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొన్నారు. ఇక తాజాగా శుక్రవారం నాడైతే ఏకంగా 6.99 లక్షల మంది కూలీలు పనులకు రావడం విశేషం! గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు బాగా తగ్గడం, ప్రభుత్వం 20 శాతం నుంచి 35 శాతం దాకా సమ్మర్ అలవెన్స్ పెంచడంతో జాబ్ కార్డులున్న కూలీలంతా ఉపాధి పనుల వైపే మొగ్గుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉపాధి కూలీలకు రూరల్ స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లను కూడా ప్రభుత్వం తాజాగా సవరించింది. దాదాపు 21 విభాగాల్లో వివిధ రకాల పనులకు రేట్లను 28 శాతం దాకా పెంచుతూ శనివారం ఉత్తర్వులిచ్చింది. ఉపాధి హామీ కింద గ్రామీణాభివృద్ధి శాఖ ప్రస్తుతం కూలీలకు చెల్లిస్తున్న రోజువారీ వేతన సగటు రూ.137 కాగా, తాజా పెంపుదలతో పూర్తిస్థాయిలో రోజువారీ వేతనం (రూ.194) అందే అవకాశం ఏర్పడిందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఉపాధిహామీ కూలీలందరికీ తాజా ఉత్తర్వుల మేరకు పెరిగిన వేతనాలందేలా చర్యలు చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని 8,182 గ్రామాలలో ఉపాధి పనులు జరుగుతుండగా, పని కోరిన కూలీలందరికీ ఉపాధి కల్పించే నిమిత్తం రూ.14 వేల కోట్ల విలువైన 11లక్షల పనులను గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సిద్ధం చేశారు. సవరించిన రూరల్ స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్లు ► కొండ ప్రాంతాలు, పల్లపు ప్రాంతాల్లో భూమి తవ్వకం, భూమిని చదును చేసే పనులకు ప్రస్తుతం క్యూబిక్ మీటరుకు రూ.114 ఇస్తుండగా రూ.145.82కు పెంచారు ► చెక్‌డ్యామ్‌లు, చిన్న కుంటల్లో పూడికతీత పనులకు కూలీ రూ.114 నుంచి 130కి పెంపు ► సరిహద్దు కందకాలు, కరకట్టల పనులకు కూలీ క్యూబిక్ మీటరుకు రూ.157.39 నుంచి రూ.173.13కు పెంచారు ► ఫీడర్ ఛానళ్లలో పూడికతీత, అప్రోచ్ రోడ్ల నిర్మాణం, ఇందిరమ్మ కాలనీల్లో నీరు నిలిచే ప్రాంతాలను పూడ్చడం, మురికి కాల్వల నిర్మాణం తదితర పనుల్లో క్యూబిక్ మీటరుకు రూ.114 నుంచి రూ.145.82కు పెంచారు ► వ్యవసాయ కుంటలు, బావులు, నీటి సంరక్షణ కందకాల తవ్వకం, డంపింగ్ యార్డులలో పనులకు రూ.194 నుంచి రూ.246.30కు పెంచారు ► గరప నేలల్లో పనులకు క్యూబిక్ మీటరుకు రూ.140.6 నుంచి రూ.180కి పెంచారు ► పలు పనులకు క్యూబిక్ మీటర్‌కు కనిష్టంగా రూ.130, గరిష్టంగా రూ.310 అందనుంది -
250 కోట్లతో శ్మశానవాటికల అభివృద్ధి
• గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయం.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు • డీఆర్డీవోలతో సమీక్షలో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో శ్మశాన వాటికలను సమగ్రంగా అభివృద్ధి పర చాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ మేరకు వెసులుబాటు ఉండడంతో గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు అందాయి. తొలి దశలో 5 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో శ్మశాన వాటికలను అభివృద్ధి పరచాలని, సుమారు 2,500 గ్రామాల్లో ఒక్కో శ్మశాన వాటికకు రూ.10 లక్షలు చొప్పున ఉపాధి హామీ మెటీరియల్ కాంపొనెంట్ నిధులను వెచ్చించాలని నిర్ణ యించింది. ఇందుకు రూ.250 కోట్లు ఖర్చవు తుందని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే మార్చి 1 నుంచే శ్మశానవాటికల అభి వృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఉన్న తాధికారులు యోచిస్తున్నారు. ఒక్కో శ్మశాన వాటికలో మృతదేహాల దహనానికి రెండు ప్లాట్‌ఫారాలు, షెడ్డు, చుట్టూ కందకంతో పాటు రక్షణగా ఫెన్సిం గ్, ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్, సోలార్ లై టింగ్, గ్రీనరీ తదితర పనులను చేపట్టనున్నారు. అలాగే ఉపాధి హామీ పథకం కింద స్థలం చదును, అభివృద్ధి వంటి కార్యక్రమాలకు అదనంగా నిధులను వెచ్చించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల నుంచి ప్రతిపాదనలు పంపాలని గురువారం డీఆర్డీవోలతో జరిగిన సమీక్షలో గ్రామీణాభి వృద్ధి శాఖ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ ఆదేశించారు. మిషన్ కాకతీయ చెరువుల్లోనూ పూడికతీత... మిషన్ కాకతీయ మొదటి దశ కింద బాగు చేసిన చెరువుల్లో పూడికతీత పనులను కూడా ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయిం చింది. ప్రభుత్వం ఫేజ్–4, 5 మిషన్ కాకతీయ కింద చేపట్టబోయే చెరువుల పునరుద్ధరణ కార్యక్ర మాన్ని కూడా ఉపాధి హామీ నిధులతో పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోంది. సిమెంట్ రోడ్లకు సంబం ధించి అన్ని జిల్లాల నుంచి త్వరితగతిన ప్రతిపాదనలను పంపాలని అధికారులను నీతూ కుమారి ప్రసాద్ ఆదేశించారు. మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కింద గ్రామాలలో వేస్తున్న పైప్లైన్లకు ఇబ్బందులు తలెత్తకుండా సిమెంట్ రహదారుల నిర్మా ణాన్ని చేపట్టాలని సూచించారు. వచ్చే జూన్‌లో ప్రారంభించనున్న హరితహారం కార్యక్రమానికి సంబంధించి ప్రతి గ్రామం లోనూ నర్సరీ ఉండేలా చూడాలని, నెలఖారు కల్లా నర్సరీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాలలో ఉపాధి హామీ లేబర్ బడ్జెట్‌ను పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సత్యనా రాయణరెడ్డి, ఉపాధి హామీ జాయింట్ కమిషనర్ బి.సైదులు, ముఖ్య విజిలెన్స్ అధికారి ఎస్.జె.ఆషా తదితరులు పాల్గొన్నారు. -
నిధులు ఇవ్వకుంటే భిక్షాటనే గతి!
• సర్పంచుల ఐక్యవేదిక ఆవేదన • కేరళ తరహాలో బడ్జెట్లో గ్రామాలకు 40 శాతం నిధులు కేటాయించాలి • ‘జాయింట్ చెక్‌పవర్’ రద్దు ఆదేశాలు అమలు కావడం లేదు • గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌కు వినతిపత్రం సాక్షి, హైదరాబాద్ : రానున్న బడ్జెట్లో గ్రామీ ణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కేరళ రాష్ట్రం మాదిరిగా 40శాతం నిధులు కేటాయిం చాలని సర్పంచుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు గత మూడేళ్లుగా ఒక్క రూపాయి కూడా అభివృద్ధి నిధులు అందలేదని, వచ్చే బడ్జెట్లోనైనా నిధులు కేటాయించని పక్షంలో గ్రామాల బాగు కోసం సర్పంచులంతా భిక్షాటన చేయ డం మినహా వేరే గత్యంతరం లేదని సర్పం చుల ఐక్యవేదిక అధ్యక్షుడు అంధోల్ కృష్ణ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలు ఎదు ర్కొంటున్న సమస్యలు, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్లో తగినన్ని నిధుల కేటాయింపు.. తదితర అంశాలపై పలువురు ఐక్యవేదిక ప్రతి నిధులు శనివారం పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి శాఖ కమిషనర్‌ను కలసి వినతి పత్రం సమర్పించారు. అలాగే జాయింట్ చెక్‌పవర్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను క్షేత్రస్థాయిలో అధికారులు ఖాతరు చేయడం లేదని కమిషనర్‌కు వారు ఫిర్యాదు చేశారు. తాము పేర్కొన్న సమస్యల ను ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లాలని, ప్రభుత్వ ఉత్తర్వులు అమల య్యేలా ఆదేశాలివ్వాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. ఐక్యవేదిక డిమాండ్లివే.. ⇔ స్థానిక సంస్థలకు రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించిన 29 అధికారాలను వెంటనే బదలాయించాలని ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం వాటిని బదలాయిం చడంలేదు. అధికా రాలను బదలాయిస్తూ ఉత్తర్వులివ్వాలి. ⇔ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు కేరళ మాదిరిగా రాష్ట్రంలో గ్రామీణా భివృద్ధికి బడ్జెట్లో 40శాతం నిధులను కేటా యించాలి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికలలో సర్పంచులకు కూడా ఓటుహక్కు కల్పించాలి. ⇔ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయ తీలకు సొంత భవనాలను నిర్మిం చాలి. గ్రామస్థాయిలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్ట్‌ల పర్యవేక్షణ బాధ్యతల ను సర్పంచులకు అప్పగించాలి. ⇔ సర్పంచులకు ప్రతినెలా ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.20వేలకు పెంచాలి. సర్పంచులందరికీ ప్రమాదబీమా సదుపా యాన్ని కల్పించాలి. పదవీ విరమణ చేసిన సర్పంచులకు రూ.5వేల చొప్పున పెన్షన్ అందించాలి. పదవిలో ఉండి మరణించిన సర్పంచులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. ⇔ వందశాతం ఓడీఎఫ్ గ్రామాలుగా మార్చేందుకు మరుగుదొడ్ల నిర్మాణానికి వందశాతం సబ్సిడీ నిధులను గ్రామ పంచాయతీలకు మంజూరు చేయాలి. గ్రామాల్లో నామినేషన్‌పై కేటాయించే పనులను రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలి. ⇔ ఏకగ్రీవంగా సర్పంచులను ఎన్నుకున్న పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాన్ని (మైనర్ పంచాయతీకి రూ.10లక్షలు, మేజర్ పంచాయతీకి రూ.15లక్షలు) వెంటనే అందించాలి. స్థానికంగా సీనరేజి, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి వచ్చే స్టాంప్‌డ్యూటీ ఆదాయాన్ని వెంటనే పంచాయతీలకు బదలాయించాలి. -
వాటర్షెడ్లతో గ్రామాల అభివృద్ధి
గంభీరావుపేట : వాటర్షెడ్లతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. నేల, నీరు, చెట్లు, పశు సంపద సంరక్షణకు దోహదపడతాయని పేర్కొన్నారు. భవిష్యత్‌లో బతుకుదెరువుకు దారులు చూపుతాయన్నారు. నాబార్డ్ నిధులు రూ.3కోట్లతో మండలంలోని గజసింగవరం, దమ్మన్నపేట, ముస్తఫానగర్ వాటర్షెడ్ల నిర్మాణానికి కలెక్టర్ కృష్ణభాస్కర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావుతో కలిసి ఎంపీ సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో మాట్లాడారు. వాటర్షెడ్లను రైతులు సద్వినియోగం చేసుకుని సత్ఫలితాలు సాధించాలని కోరారు. ఉద్యమస్ఫూర్తితోనే రాష్ట్రంలో పాలన కొనసాగుతుందన్నారు. ఇక్కడి ప్రాంతంలో అడవులు ఉన్నప్పటికీ నీళ్లు లేక వ్యవసాయం కుంటుపడిందని..అందుకే వాటర్‌షెడ్ మంజూరు చేయించినట్లు తెలిపారు. యుద్ధప్రాతిపదికన ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. సర్పంచ్ కొండూరి గాంధీ, నాబార్డు ఏజీఎం సుదర్శన్ చందర్, డీడీఎం రవిబాబు, ఎంపీపీ కమ్మరి గంగసాయవ్వ, జెడ్పీటీసీ మల్లుగారి పద్మ, కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు, వైస్ చైర్మన్ మోహన్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీలకు నేరుగా వేతనాలు!
వారి ఖాతాల్లోనే జమ చేయనున్న కేంద్రం సామగ్రి ఖర్చు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లింపు సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు ఇకపై వేతన ఇబ్బందులు తొలగిపోనున్నాయి. డిసెంబర్ 1 నుంచి ఈ పథకం కింద పనులు చేసిన కూలీలకు వేతనాల సొమ్మును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని కేంద్రం నిర్ణరుుంచిం ది. కేంద్రం నుంచి ఉపాధి సొమ్ము రాష్ట్ర ఖజానాకు జమ కావడం, ఆ సొమ్మును వెంటనే గ్రామీణాభివృద్ధి శాఖకు బదిలీ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇతర పనులకు మళ్లించడం వంటివాటితో కూలీలకు సకాలంలో వేతనాలు అందడం లేదు. దీంతో ఉపాధి కూలీలు పనులు మానేయడం, వలస పోయిన దుస్థితి ఏర్పడడంతోపాటు కొన్నిసార్లు ఉపాధి నిధులను విడుదల చేరుుంచడానికి రాష్ట్ర గవర్నర్ స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది కూడా. ఇలా రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా తాము అప్రదిష్ట పాలుకావాల్సి వస్తోందని భావించిన కేంద్రం... నేరుగా కూలీల ఖాతాల్లో వేతనాలు జమ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఎన్ఈఎఫ్ఎంఎస్ ద్వారా.. ఉపాధి కూలీలకు రోజు వారీ వేతనాలను చెల్లించేందుకు ‘నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్’ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూపొందించింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉపాధి పనులు చేసిన కూలీల పేరు, ఆధార్, జాబ్‌కార్డ్ నంబర్, చెల్లించాల్సిన వేతనం తదితర వివరాలను ‘తెలంగాణ పేమెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్(టీపీఎంఎస్)’ద్వారా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కేంద్రానికి పంపుతారు. ఆ వివరాలను ఎన్ ఈఎఫ్ఎంఎస్కు అనుసంధానించి, కూలీ లకు వేతనాలు చెల్లిస్తారు. దీనికి సంబంధిం చి రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలు ఇవ్వడంతో.. రాష్ట్రమంతటా అమలు చేయాలని నిర్ణరుుంచారు. దీంతో ఉపాధి కూలీలకు ఇకపై వేతన సమస్యలు ఉండవని ఉపాధి హామీ పథకం సిబ్బంది, అధికారులు పేర్కొంటున్నారు. రూ.202 కోట్లు విడుదల రాష్ట్రంలో డిసెంబర్ నెలాఖరు వరకు ఉపాధి హామీ పనుల చెల్లింపుల కోసం మూడో విడత కింద కేంద్రం రూ.202 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఉప కార్యదర్శి ఏకే సంబ్లీ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ మొత్తం సొమ్ములో రూ.152.23 కోట్లను వేతన చెల్లింపులకు, రూ.50 కోట్లను మెటీరియల్ కాంపొనెంట్ కింద అవసరమైన సామగ్రికి వినియోగించుకోవాలని అందులో పేర్కొన్నారు. కూలీల కు వేతన చెల్లింపులను ఎన్ఈఎఫ్ఎంఎస్ ద్వారా నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని.. మెటీరియల్ కాంపొనెంట్ సొమ్మును త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని స్పష్టం చేశారు. -
ఉపాధి కూలీలకు కొత్త జాబ్ కార్డులు
జనవరి నుంచి కార్డుల పంపిణీకి సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈ జీఎస్) కూలీలకు కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణ రుుంచింది. నిబంధనల ప్రకారం ప్రతి ఐదేళ్లకో మారు కొత్త జాబ్‌కార్డు లను అందజేయాల్సి ఉన్నందున వచ్చే ఏడాది జనవరి నుంచి వీటిని పంపిణీ చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని గ్రామాల్లోనూ గ్రామసభలు ఏర్పాటుచేసి ప్రజాప్రతినిధుల చేతులమీదుగా అందజేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 56.39 లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులుండగా, 1.28 కోట్ల మంది కూలీలుగా నమోదు చేసుకున్నారు. మూడేళ్ల లో ఉపాధి పనులకు వచ్చేవారి జాబితాలను పరిశీలిస్తే 24 లక్షల కుటుంబాలకు చెందిన 40.92 లక్షల మంది మాత్రమే ఈ పథకాన్ని వినియోగించుకుంటు న్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, ఉద్యాన పంటలకు సబ్సిడీ తదితర పథకాల కోసమే ఎక్కువమంది జాబ్‌కార్డులు తీసుకున్నట్లు తేలింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉపాధి పనులు జరుగుతున్నా సగటు పనిదినాలు మాత్రం తక్కువగా కనిపిస్తున్నారుు. ఈ నేపథ్యంలో వాస్తవంగా ఉపాధి పనులకు వచ్చేవారికి మాత్రమే కొత్తకార్డులను అందజేయాలని ఉన్నతాధికారులు నిర్ణరుుంచారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లోనూ తనిఖీలు చేయాలని ఆయా జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులను ఆ శాఖ కమిషనర్ ఆదేశించారు. మూడేళ్లలో ఒక్కరోజైనా పనికి రాకుంటే కార్డ్ కట్! ఇప్పటికే కార్డులు పొంది మూడేళ్లలో ఒక్కరోజు కూడా ఉపాధి పనులకు వెళ్లని కుటుంబాలను కొత్త కార్డుల జాబితాలో నుంచి తొలగించాలని నిర్ణరుుంచారు. తాత్కాలిక వలసల కారణంగా ఒకేపేరుతో పలుచోట్ల జాబ్‌కార్డులు పొందినవారి పేర్లను కూడా ప్రస్తుతముంటున్న జిల్లాలో మినహా మిగతా చోట్ల తొలగించను న్నారు. ప్రస్తుతం పనులకు వస్తున్న వారితోపాటు కొత్తగా 18 ఏళ్లు నిండిన పేద యువతీ, యువకులకు, ఆయా గ్రామాలకు కొత్తగా వచ్చిన కోడళ్లకు, శాశ్వతంగా వలస వచ్చిన కుటుంబాలకు కొత్తకార్డులను జారీ చేయనున్నారు. అర్హులైన కూలీలందరికీ జాబ్కార్డులిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. -
గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం
ఎన్ఐఆర్డీలో అంతర్జాతీయ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన జూపల్లి సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాం తాలు అభివృద్ధి చెందడం పైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుందని, కొత్తగా ఏర్పడిన తెలంగాణలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ(ఎన్ఐఆర్డీ)లో ‘ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్’ అంశంపై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ శిక్షణా శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా గ్రామాల్లో పేదరికం ఇంకా పూర్తిగా పోలేదని అన్నారు. ఉపాధిహామీ, పీఎంజీఎస్‌వై, రూరల్ హెల్త్ మిషన్, స్వచ్ఛభారత్ తదితర కార్యక్రమాలను కేంద్రం అమలు చేస్తోందన్నారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింద న్నారు. గ్రామీణాభివృద్ధికి తెలం గాణ రాష్ట్రాన్ని రోల్‌మోడల్‌గా చూపేలా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. గ్రామస్థాయిలో వివిధ శాఖలను సమన్వయం చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించామని మంత్రి అన్నారు. నవంబర్ 27వరకు కొనసాగనున్న అంతర్జాతీయ శిక్షణా శిబిరానికి టాంజానియా, నైజీరియా, శ్రీలంక, సూడాన్, జింబాబ్వే, ఫిజి, ఈజిప్ట్, కజికిస్తాన్, మలేషియా, మాల్దీవులు తదితర 20 దేశాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఎన్ఐఆర్ డీ డెరైక్టర్ జనరల్ రాంపుల్లారెడ్డి, ఎన్ఐఆర్డీ ప్రతినిధులు శంకర్ ఛటర్జీ, చిన్నాదురై, ఆరుణ జయమణి తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ ఇంటి పథకంపై విసృత ప్రచారం
కర్నూలు(హాస్పిటల్): ఎన్టీఆర్ గ్రామీణ ఇంటి నిర్మాణ పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రామకృష్ణ, డ్వామా పీడీ పుల్లారెడ్డి ఆదేశించారు. ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పథకంపై మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పథకం కింద 1.50లక్షలు, రూ.2లక్షల అంచనాతో పేదలకు హౌసింగ్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉపాధి నిధులతో ఇంటినిర్మాణాలు చేపడతారన్నారు. రూ.1.50లక్షల స్కీమ్‌లు జిల్లాకు 11వేలు, రూ.2లక్షల స్కీమ్‌లో 15వేల ఇళ్లను కేటాయించారన్నారు. ఉపాధి నిధుల కింద ప్రతి ఇంటికి 90 రోజుల పనిదినాలు ఇస్తారన్నారు. 90 రోజుల ఉపాధి పనిదినాలకు రూ.17,460 అందజేస్తారన్నారు. ఇంటి నిర్మాణానికి మహిళా సమాఖ్యలచే తయారు చేసిన ఇటుకలను ఉచితంగా పంపిణీ చేస్తారన్నారు. ఈ మేరకు ప్రతి మండలానికి ఒక నిర్మిత కేంద్రాన్ని మహిళా సంఘాలకు కేటాయిస్తారన్నారు. వీరు తయారు చేసే మూడు రకాల ఇటుకలపై ఉపాధి లోగో ఉంటుందన్నారు. దంతో పాటు వ్యక్తిగత మరుగుదొడ్లకు 12వేలు అందిస్తారు. మిగిలిన మొత్తాన్ని హౌసింగ్ వారు అందజేస్తారని తెలిపారు. జెడ్పీ సీఈఓ ఈశ్వర్, హౌసింగ్ పీడీ రాజశేఖర్, డ్వామా ఏపీడీ మురళీధర్, డీఆర్డీఏ ఏపీడీ శివలీల తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా సేవలు
• ఏపీవైలో దేశంలోనే మొదటిస్థానం • ఆంధ్రాబ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అజిత్‌కుమార్ మహబూబ్‌నగర్, సాక్షి: గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా దేశంలో ఆంధ్రాబ్యాంక్ తనవంతు పాత్ర పోషిస్తున్నట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అజిత్‌కుమార్ రత్ చెప్పారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని రాజేంద్రనగర్ బ్రాంచిలో ‘ఈ-లాబీ’ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బ్యాంకు శాఖల్లో ఖాతాదారుల కోసం మరిన్ని టెక్నాలజీ ఆధారిత సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. ఈ-లాబీ కేంద్రంలో ఏటీఎం, క్యాష్ రీసైక్లర్ మిషన్, పాస్‌బుక్ ప్రింటింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. క్యాష్ రీసైక్లర్ మిషన్ ద్వారా ఖాతాదారులు ఎప్పుడైనా డిపాజిట్ చేయొచ్చునన్నారు. ఆంధ్రాబ్యాంక్ రూ.3.12 లక్షల కోట్ల వ్యాపారం చేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. అటల్ పింఛన్ యోజన నమోదులో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచినట్లు చెప్పారాయన. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను సమర్థంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్వరలో మహబూబ్‌నగర్‌లో 5, నల్లగొండలో 4 నూతన బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జోనల్ మేనేజర్ లీలాధర్, ఏజీఎం ఎన్ఎస్ఎన్ రెడ్డి, చీఫ్ మేనేజర్లు పరంధాములు, శామ్యుల్,మాణిక్యరావు పాల్గొన్నారు. -
డైరెక్టర్ అనితారామచంద్రన్ పర్యటన రద్దు
మూడు గంటలపాటు ఎదురుచూపులు మెుక్కలు నాటిన నాయకులు, అధికారులు సారంగాపూర్ : రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ అనితారామచంద్రన్ పర్యటన శనివారం రద్దయింది. దీంతో చేసేది లేక స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా మండలంలోని ధని–గోపాల్పేట్ రహదారి వెంట మొక్కలు నాటడానికి శనివారం అనితారామచంద్రన్ వస్తున్నారని స్థానిక అధికారులు, నాయకులకు సమాచారం అందింది. రోడ్డుకు ఇరువైపులా ఒకే సమయంలో మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేశారు. ఉదయం 11గంటలకు సమయం కేటాయించిన కమిషనర్ మధ్యాహ్నం రెండు గంటల వరకు రాలేదు. అప్పటి వరకు వేచి చూశారు. మధ్యాహ్నం సమయంలో హరితహారం కార్యక్రమంపై సమావేశం ఉండడంతో కమిషనర్ ధని గ్రామానికి రావడం లేదని సమాచారం అందింది. దీంతో చేసేదిలేక స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు రాజ్‌మహ్మద్, ఆలూరు పీఏసీఎస్ అధ్యక్షుడు ఆయిటి రమేష్, సర్పంచ్ తుల లక్ష్మి ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. మండల ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, మండల ప్రత్యేకాధికారి రాంకిషన్‌నాయక్, ఆయా గ్రామాల సర్పంచులు గంగారెడ్డి, దేవీశంకర్, పూజారి శ్రీనివాస్, తహసీల్దార్ శ్యామ్‌సుందర్, ఎంపీడీఓ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
విభజించు.. పాలించు !
డీఆర్డీఏ వెలుగులో ఓ అధికారి తీరిది రెండు వర్గాలుగా ఉద్యోగులు గాడితప్పుతున్న పాలన అనంతపురం టౌన్ : ఏ శాఖలో అయినా అధికారంటే కింది స్థాయి ఉద్యోగులకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. చిన్న చిన్న పొరపాట్లు చేస్తే సరిచేసుకోవాలని సుతిమెత్తగా చెప్పడం.. ఉద్యోగుల ఉజ్వల భవిష్యత్‌కు తోడ్పడం పరిపాటే. కానీ అనంతపురం జిల్లా గ్రామీణాభివృద్ధి వెలుగులో ఉన్న ఓ అధికారి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. విభజించు పాలించు సూత్రాన్ని అమలు చేస్తుండటంతో ఉద్యోగులు రెండు వర్గాలయ్యారు. ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరులో కొందరు అమాయకులు బలవుతుండగా..మరికొందరు మాత్రం మానసిక వ్యథను అనుభవిస్తున్నారు. పైకి చెప్పుకోవడానికి కూడా జంకుతున్న పరిస్థితి. కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగులు నిత్యం తమ పబ్బం గడుపుకోవడం కోసం లేనిపోని సమస్యలను సృష్టిస్తుంటార న్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వారి వ్యవహార శైలిపై ప్రత్యేక దృష్టి పెట్టి తన పరిధిలోని పాలనపై దృష్టి కేంద్రీకరించాల్సిన అధికారి మొక్కుబడిగా కార్యాలయానికి వస్తుండటం కూడా సమస్యను మరింత జఠిలం చేస్తోంది. ఇదే అదునుగా కొందరు ఉద్యోగులు విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు. కార్యాలయంలో ఎవరితో ఎవరు మాట్లాడుతుంటారు.. ఎవరు ఎక్కడికెళ్తుంటారన్న సమాచారం ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలంటూ సదరు అధికారి తన ‘గ్యాంగ్’కు పురమాయిస్తుండటంతో వాళ్లు అదే ‘పని’గా భావిస్తూ తమ ప్రాభవాన్ని చాటుకుంటున్నారు. సహజంగా అధికారికి సన్నిహితంగా ఉండే ఉద్యోగుల పట్ల కింది స్థాయి ఉద్యోగులకు కాసింత అసహనం ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం ఇది తారస్థాయికి చేరింది. జిల్లా ఉన్నతాధికారిగా కలెక్టర్ కోన శశిధర్ ప్రత్యేక దృష్టి పెడితే వ్యవస్థలో కాస్త మార్పు వచ్చే అవకాశం ఉందని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. లేకుంటే పరువు కాస్తా బజారుపాలు కావాల్సిందేనని అంటున్నారు. డీఆర్డీఏలో హైడ్రామా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వెలుగులో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైడ్రామా నడిచింది. గత నెలలో కలెక్టర్ సమక్షంలో కౌన్సెలింగ్ ద్వారా చేపట్టిన బదిలీలు కాదని తాజాగా డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు చేపట్టిన బదిలీల ప్రక్రియ వివాదాస్పదమైంది. కొందరు ఏపీఎంలు, సీసీల పనితీరును పక్కకుపెట్టి అయిన వారికి కట్టబెట్టడంలో డీఆర్డీఏ అధికారులు చక్రం తిప్పిన వైనంపై ‘బదిలీల మాయ’ శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో గురువారం అధికారులు ఉపశమన చర్యలకు దిగారు. ఈ క్రమంలో రాజకీయ ఒత్తిడి సైతం మొదలైనట్లు తెలిసింది. అనంతపురం రూరల్ పోస్టును తమ వాళ్లకే కట్టబెట్టాలని ఓ మంత్రి అనుచరులు తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం. అయితే మధ్యాహ్నానికి సీన్ రివర్స్ అయింది. మొదట అనుకున్నట్టుగానే ఎనిమిదేళ్లపాటు కార్యాలయంలోనే పని చేసిన హరిప్రసాద్‌ను ఇక్కడకు నియమించినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన బదిలీల్లో ఈయన్ను పుట్టపర్తికి బదిలీ చేయగా డీఆర్డీఏలోని ఓ కీలక అధికారి అండదండతో మళ్లీ ఇక్కడికే వచ్చారు. ఇక టీటీడీసీ మేనేజర్ పోస్టుకు సంబంధించి సెర్ప్ సీఈఓకు ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. పెనుకొండ నియోజకవర్గంలో పని చేస్తున్న ఓ ఉద్యోగిని హిందూపురం నియోజకవర్గంలోని ఓ మండలానికి మార్పు చేసినట్లు తెలిసింది. -
గ్రామీణ ‘ప్రగతి’ వికృత హేల
ఔరంగాబాద్ రైతులు 15.9 శాతం వడ్డీకి తీసుకున్న ట్రాక్టర్ రుణం ఊబిలో కూరుకుపోయి ఉండగా... అదేసమయంలో విలాసవంతమైన మెర్సిడిస్ బెంజ్ కార్లు 7 శాతం వడ్డీకి లభిం చాయి. రెంటినీ గ్రామీణ పురోగతిగానే చూస్తున్నారు. 2004-14 మధ్య కాలంలోని రుణ చోదక ట్రాక్టర్ల అమ్మకాల పెరుగుదలనే గ్రామీణ ప్రగతికి సంకేతంగా చూడటం అంటే... ఒక్క రోజులో 150 మెర్సిడిస్ బెంజ్ కార్ల అమ్మకంతో ఔరంగాబాద్ ప్రపంచ పెట్టుబడుల పటంపైకి ఎక్కడంగా భావించడమంతే హాస్యాస్పదం. బ్యాంకులు ‘ట్రాక్టర్ మేళా’ సందడిలో ఉన్న 2010లో హిరాబాయ్ ఫకీరా రాథోడ్‌ను ఒక కొత్త ట్రాక్టర్‌ను కొనేలా ఒప్పించారు. ‘‘ట్రాక్టర్ షాపు సేల్స్ మేన్ రుణం దొరకడం, తిరిగి చెల్లించడం చాలా తేలికని చెప్పాడు’’అని ఆమె ఔరంగాబాద్ జిల్లా కన్నాడ్ తెహసీల్‌లోని శిథిలావస్థలోని తన ఇంట్లో చెప్పింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) స్థానిక బ్రాంచి కూడా రుణాన్ని త్వరత్వరగా మంజూరు చేసేసింది. బంజారా ఆదివాసియైన హీరాబాయ్ భర్త ఫారెస్టు గార్డుగా పనిచేసి రిటైరయ్యాడు. ఆమె కుటుంబానికి అదే తెహసీల్‌లో 3.5 ఎకరాల భూమి ఉంది. ‘‘ఆ ట్రాక్టర్‌ను మా భూమిలో ఉపయోగించుకోవడంతో పాటూ ఇతరుల భూముల్లో కూడా ఉపయోగించి మరి కాస్త సంపాదించగలమని అనుకున్నాం’’ అంటూ చెప్పుకొచ్చిందామె. రూ. 6,35,000 ధర ఉన్న ఆ ట్రాక్టర్కుగానూ ఆమెకు రూ. 5,75,000 రుణంగా ఇచ్చారు. ఆ రుణాన్ని ఆమె 15.9 శాతం వడ్డీ రేటున ఏడేళ్లలోగా తిరిగి చెల్లించాలి. ‘‘అదే నా జీవితంలోని ఘోరమైన తప్పు’’ అని కోపంగా చెప్పింది. ఈ ఏడాది మార్చి వరకు రూ. 7.5 లక్షలు బ్యాంకుకు తిరిగి చెల్లించే సరికి హీరాబాయ్ ఆర్థికంగా పూర్తిగా చితికిపోయింది. అప్పుడిక బ్యాంకు ‘ఒక్క దఫా రుణ పరిష్కారం’గా రూ. 1.25 లక్షలు ఇమ్మని కోరింది. బంధు వులనుంచి మరిన్ని అప్పులు చేసి ఆమె ఆ మొత్తం చెల్లించింది. ట్రాక్టర్ రుణాల మాయాజాలం సంపన్నవంతురాలు లేదా కాస్త ఆర్థికంగా స్థితిమంతురాలు కాని ఆ బంజారా రైతు మహిళ రూ. 5.75 లక్షలకుగానూ దాదాపు రూ. 9 లక్షలు చెల్లించింది. దుర్భిక్ష పీడిత ప్రాంతమైన ఈ మరఠ్వాడా ప్రాంతంలో వ్యవసాయం మూలనపడటంతో ‘‘మా పొలానికి మించి మరెక్కడా మా ట్రాక్టర్‌కు పనే లేకుండా పోయింది.’’ ఔరంగాబాద్ జిల్లాలోనే కాదు, దేశ వ్యాప్తంగా కూడా ఇంకా ఎందరో హీరాబాయ్లున్నారు. ఆమెలాగా అంత అప్పును తిరిగి చెల్లించలేని వారే ఎక్కువ మంది ఉన్నారు. రుణం కారణంగా జరిగిన ఆత్మ హత్యలు అసంఖ్యాకంగా ఉన్న మహారాష్ట్రలో ఈ పరిణామం ముఖ్యమైనది. ఎస్బీహెచ్ ఒక్కటే 2005-06 నుంచి ప్రారంభించి అలాంటి 1,000 ట్రాక్టర్ రుణాలను ఇచ్చింది. ‘‘బ్యాంకులు అప్పుడు ట్రాక్టర్ రుణాల వ్యామోహంతో ఉన్నాయి’’ అంటారు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉద్యోగుల నేత దేవీదాస్ తుల్జాపుకార్. ‘‘వాళ్లు ‘ప్రాధాన్యతా రంగ’ (వ్యవసాయం) రుణ కోటాను పూర్తి చేయాల్సి ఉండేది... ట్రాక్టర్ రుణాలను వ్యవసాయ రుణాలుగా చూపించవచ్చు. కాబట్టి పూర్తిగా కుంగదీసే అధిక వడ్డీ రేట్లకు ఎన్నడూ ట్రాక్టర్ నడిపి ఎరగని వారికి వాటిని అంటకట్టారు. హీరాబాయ్కి భిన్నంగా చాలా మంది భారీ మొత్తంలో తిరిగి చెల్లించినా గానీ ఒక దఫా సెటిల్మెంట్ భాగ్యా నికి కూడా నోచుకోలేదు. పలువురు అసలేమీ చెల్లించలేకపోయారు.’’ ఒక్క కన్నాడ్ ఎస్బీహెచ్ బ్రాంచ్ ఒక్కదాని నుంచి కనీసం అలాంటి 45 మంది వివరాలు మాకు లభ్యమయ్యాయి. వారు మొత్తంగా రూ. 2.7 కోట్లు ఆ బ్యాంకుకు ఇంకా బకాయిపడ్డారు. ఇది, ఒక చిన్న పట్టణంలోని ఒక బ్యాంకుకు చెందిన ఒక బ్రాంచి పరిస్థితి. దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్నో బ్యాంకుల్లో అలాంటి లెక్కలేనన్ని వేల కొలది రుణాలున్నాయి. హీరాబాయ్ 15.9 శాతం వడ్డీకి ట్రాక్టర్ రుణం తీసుకున్న సమయం లోనే... 65 కిలో మీటర్ల దూరంలోని ఔరంగాబాద్ పట్టణంలో ఇంతకు మించిన రుణ సంతర్పణ జరిగింది. ఆ నగరంలోని ఉన్నత వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ఎగ్జిక్యూటివ్‌లు, డాక్టర్లు, లాయర్లు తదితరులు 2010 అక్టోబర్‌లో ఒక్క రోజులో 150 మెర్సిడిస్ బెంజ్ కార్లు కొన్నారు. ‘‘ఔరంగా బాద్ అభివృద్ధి పథంలోకి వచ్చేసింది’’, ‘‘ప్రపంచ పెట్టుబడుల పటంపైకి ఎక్కింది’’ అన్నారు. ఆరోజున అమ్ముడుపోయిన బెంజ్ కార్ల ధరలు మోడ ళ్లను బట్టి రూ. 30 నుంచి 70 లక్షల వరకు ఉన్నాయి. 24 గంటల్లో 150 విలా సవంతమైన కార్లను అమ్మేస్తున్నందున క ంపెనీ భారీ ధర తగ్గింపును ఇచ్చిం దని మీడియా తెలిపింది. ఔరంగాబాద్ ఎస్బీఐ కేవలం7 శాతం వడ్డీకి రూ. 65 కోట్ల సంతర్పణలో మూడింట రెండు వంతుల రుణాలను ఇచ్చింది. మెర్సిడిస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ దేశంలోని రెండవ స్థాయి, మూడవ స్థాయి నగరాల అద్భుత ఆర్థిక శక్తికి జేజేలు పలికినట్టుగా మీడియా తెలిపింది. ‘‘ఒక్కరోజులో 150 మెర్సిడిస్ బెంజ్ కార్లు ఒక్కసారిగా అమ్ముడు పోవడం ద్వారా సాహసోపేతంగా, దూకుడుగా, చలనశీలంగా అది బయట పడింది ’’ అని వ్యాఖ్యానించారు. ఔరంగాబాద్‌లోని చాలా మంది హీరాబాయ్లకు మరో విభిన్నమైన షాక్ తగిలింది. రెండు వర్గాలూ వాహనాల రుణాలను తీసుకున్నవే. రెండూ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచే రుణాలను తీసుకున్నాయి. కాకపోతే హీరా బాయ్ నగరంలోని ఉన్నత వర్గాలవారు చెల్లించేదానికి రెండింతలు కంటే ఎక్కువ వడ్డీని చెల్లిస్తున్నారు అంతే. ఆమె ఔరంగాబాద్‌ను ప్రపంచ పెట్టు బడుల పటం మీదకు ఎక్కించలేకపోవడమే బహుశా అందుకు కారణం కావచ్చు. 12.5 నుంచి 15.9 శాతం వడ్డీకి ట్రాక్టర్ల రుణాలను తీసుకున్న వారిలో అత్యధికులు ఆదివాసులు, దళితులు. అలాంటి వారు బెంజ్ కార్ల కొనుగోలుదార్లలో కనిపించరు. అంబా తండా వాసి అమర్‌సింగ్ ముఖర్ర మమ్ రాథోడ్ బ్యాంకుకు రూ. 11.14 లక్షలు బకాయి పడ్డాడు... తీసుకున్న రుణం అందులో సగం కంటే తక్కువే. అతను దాదాపుగా ఏమీ తిరిగి చెల్లించలేకపోయాడు, బహుశా ఎప్పటికీ ఏమీ చెల్లించలేడు. మేమా తండాకు వెళ్లి మేం అతని ఇంటిని చూశాం. ఇంటిలో విలువైనవేమీ లేవు. ట్రాక్టర్ అసలుకే లేదు. కొన్ని సందర్భాల్లో పలుకుబడిగలవారు పేదల పేరు మీద ఆ రుణం తీసుకుంటారు. అదే ఇక్కడా జరిగి ఉండాలి. కన్నాడ్లోని 45 కేసులే గాక ఇతర తెహసీళ్లలోనూ, బ్రాంచ్‌లలోనూ అలాంటివి ఇంకెన్నో ఉన్నాయి. బ్యాంకుల ప్రమాదకరమైన క్రీడ ‘‘ఈ రుణాలలో వేటినీ క్రియాశీలంగా లేని ఆస్తులు’’గా ప్రకటించలేదని తుల్జాపుర్కర్ తెలిపారు. ‘‘మొత్తంగా అది చాలా కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. వాటిని కాగితాల మీద క్రియాశీలంగా ఉన్న ఆస్తులుగా చూపడమే బ్యాంకులు ఎక్కువగా చేస్తాయి. తిరిగి చెల్లించాల్సిన గడువు దాటిపోయినా ఆ రుణాలను ప్రామాణికమైన క్రియాశీల ఆస్తుల జాబితాలోనే చూపవచ్చు. ఎప్పుడో ఒకప్పుడు ఈ వాస్తవాన్ని ముఖాముఖి ఎదుర్కోక తప్పదు.’’ కొన్ని సందర్భాల్లో కొనుగోలుదార్లు మధ్యవర్తులు, డీలర్ల చేతుల్లో మోసపోవడం జరిగి ఉంటుంది. ‘‘బ్యాంకు ఫైనాన్స్ ట్రాక్టర్, ట్రాలీ తదితర అనుబంధాలను కలుపుకుని ఉండవచ్చు. కానీ వాటిలో రైతుకూ కావాల్సింది ట్రాక్టర్ మాత్రమే, అదే తీసుకుంటాడు. మిగతాదంతా డీలర్ల జేబుల్లోకి చేరుతుంది.’’ భారత్‌లో ట్రాక్టర్ల అమ్మకాలు 2004-14 మధ్య మూడు రెట్లు పెరి గాయి. 2013లో దేశంలో 6,19,000 ట్రాక్టర్లు ఉత్పత్తి అయ్యాయని, అది దాదాపు మొత్తంగా ప్రపంచ ఉత్పత్తిలో మూడో వంతని ఆ పరిశ్రమ గణాం కాలు సూచిస్తున్నాయి. పలువురు దీన్ని ‘‘గ్రామీణ ప్రగతికి ప్రతిబింబం’’ లేదా గ్రామీణ భారతం ఎంత వేగంగా పురోగమిస్తోందనే దానికి ‘‘ముఖ్యై మెన బరోమీటరు’’గా చూస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలోని ఒక సెక్షన్ల ఆదా యాల్లోని పెరుగుదల ఈ ట్రాక్టర్ల డిమాండు పెరగడానికి కొంతవరకు కారణమైన మాట నిజమే. అయితే చేతికి అంటగట్టే వేలం వెర్రి రుణాలు కూడా అందుకు దోహదపడ్డాయి. గ్రామీణ కుటుంబాలలో కేవలం 8 శాతం మాత్రమే నెలకు రూ. 10,000కు మించిన ఆదాయాన్ని సంపాదిస్తున్నవని సామాజిక ఆర్థిక కుల జనాభా గణాంకాలు సూచిస్తున్నాయి (ట్రాక్టర్లున్న కుటుంబాలు ఆ 8 శాతం కంటే కూడా చాలా తక్కువే). అయినా ట్రాక్టర్ల అమ్మకాల గణాంకాలు గ్రామీణ భారతం వృద్ధి చెందుతున్న తీరుకు నమ్మదగిన సూచిక అనే వాదనను చాలా మంది ఆర్థికవేత్తలు, కాలమిస్టులు పట్టుకుని వేలాడటం విశేషం. ఇప్పుడు ఔరంగాబాద్‌లో ట్రాక్టర్ల అమ్మకాలు 50 శాతం క్షీణించిపోయాయనే నివేదికే పడక కుర్చీ విశ్లేషకులకు ‘గ్రామీణ సంక్షోభానికి’ కచ్చితమైన సూచిక అవుతుంది. విలాసవంతమైన మెర్సిడిస్ బెంజ్ కారుకు భిన్నంగా ట్రాక్టర్ ఉత్పాదక సాధనం, నిజమే. కానీ 2004-14 మధ్య కాలంలో రుణ చోదక ట్రాక్టర్ల అమ్మకాల పెరుగుదలనే వేగవంతమైన గ్రామీణ ప్రగతికి సంకేతంగా చూడటం అంటే... ఒక్క రోజులో 150 బెంజ్‌లు అమ్ముడుపోతేనే ఔరంగాబాద్ ప్రపంచ పెట్టుబడుల పటంపైకి ఎక్కడంగా భావించడమంతే హాస్యాస్పదం. రూ. 64,330 తలసరి ఆదాయంతో మర ఠ్వాడా మహారాష్ట్రలోకెల్లా అతి తక్కువ తలసరి ఆదాయం ఉన్న ప్రాంతం. తలెత్తుతున్న మరో సంక్షోభం ఈ ట్రాక్టర్ల సంక్షోభం ఇలా ఉండగా, మరో కొత్త సంక్షోభం తలె త్తుతోంది. ఇది ఎక్సకవేటర్లకు (తవ్వుడు యంత్రాలు) సంబంధించినది. శారీ రక శ్రమకు బదులుగా మరిన్ని యంత్రాలను ప్రవేశపెట్టాలని తాపత్రయపడే ప్రభుత్వాలున్న మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వాటి వాడకం బాగా పెరుగు తోంది. ‘‘రుణ వాయిదాను, భారీ నిర్వహణా వ్యయాలను చెల్లించాక ఇంకా మీకు ఏమైనా కాస్త మిగలాలంటే నెలకు లక్ష రూపాయల విలువైన పనిని చేయాల్సి ఉంటుంది. అది వానా కాలంలో సాధ్యం కావచ్చు. ఆ తర్వాత అది ముగిసిపోతుంది. ఈ పట్టణంలో ఉన్న 30 జేసీబీలకు కాదుగదా, మూడింటికి కూడా సరిపడేంత పని ఉండదు. ఇక మీరు చేసేది ఏముంది? ఈ రంగంలో ఏ మాత్రం అనుభవం లేని వారు కూడా ప్రొక్లయిన్ హైడ్రాలిక్ ఎక్స్కవేటర్లపై మదుపు పెడుతున్నారు. తిరిగి రుణాలు తీసుకోవడమే వారిని చితికి పోయేలా చేస్తోంది. ఇది ఈ ప్రాంతం అంతటికీ వర్తిస్తుందని అనుకుంటు న్నాను. సంబంధాలున్న కొద్ది మందికే కాంట్రాక్టులు దక్కుతాయి. వందకు పది మందే మనగలగవచ్చు. మిగతావారంతా దివాలా తీయాల్సిందే.’’ కన్నాడ్లోని హీరాబాయ్ కూడా మమ్మల్ని చూసి బ్యాంకు అధికారులమే మోనని ఆశ్చర్యపోయింది. ‘‘నన్ను ఇప్పుడు ఏం చేస్తారు?’’ అని అడిగింది. రూ. 6.35 లక్షల విలువైన (బహుశా అంతకంటే తక్కువే ఉంటుంది) ట్రాక్టర్ కోసం తీసుకున్న 5.75 లక్షలకుగానూ రూ. 9 లక్షలు చెల్లించాక కూడా ఆమె భయంగా వేసే ప్రశ్న ‘‘ఇంకా నేను ఏమైనా కట్టాలా?’’ లేదు, నువ్వు దాని ధరను పూర్తిగా చెల్లించడమే కాదు, ఇంకా చాలా ఎక్కువే కట్టావు అని మేం చెప్పాం. ‘పీపుల్స్ ఆర్కీవ్ ఆఫ్ రూరల్ ఇండియా’ సౌజన్యంతో పి. సాయినాథ్ వ్యాసకర్త సుప్రసిద్ధ గ్రామీణ పాత్రికేయులు, రచయిత ః PSainath_org -
వారంలో ఆరురోజులు ‘ఉపాధి’కి దరఖాస్తు
- స్వీకరించాలని సిబ్బందికి డెరైక్టర్ అనితారామచంద్రన్ ఆదేశం - జాబ్ కార్డుదారుల్లో సగం మందికైనా 100 రోజుల పని కల్పించాలి సాక్షి, హైదరాబాద్: ఉపాధి పనుల కోసం ఇకపై వారంలో ఆరు రోజులపాటు దరఖాస్తు చేసుకోవచ్చని గ్రామీణాభివృద్ధి విభాగం డెరైక్టర్ అనితారామచంద్రన్ వెల్లడించారు. ఇప్పటివరకు ఉన్న మూడు రోజులను పొడిగిస్తూ మంగళవారం మార్గదర్శకాలను విడుదల చేశారు. ప్రతివారంలో సోమవార ం నుంచి శనివారం వరకు శ్రమశక్తి సంఘాలు, జాబ్‌కార్డులు కలిగిన వ్యక్తుల నుంచి పనికొరకు దరఖాస్తులు స్వీకరించి పని కల్పించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు. మార్గదర్శకాలు ఇవీ.. ►బ్యాచ్ 1, 2 వారీగా గ్రామ పంచాయతీల్లో పని కోరినవారి వద్ద నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు దరఖాస్తులు స్వీకరించి రశీదులు అందజేయాలి. దరఖాస్తుల స్వీకరణ నిమిత్తం రోజూ ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ మేట్లు గ్రామ పంచాయతీ కార్యాలయం/రచ్చబండ వద్ద ఉదయం 6 నుంచి 7 గంటల వరకు అందుబాటులో ఉండాలి. ►దరఖాస్తులు స్వీకరించే ప్రదేశం నుంచే మొబైల్ ద్వారా లబ్ధిదారుల ఫొటోలను అప్లోడ్ చేయాలి. అవసరమైన మేరకు దరఖాస్తు ఫారాలు శ్రమశక్తి సంఘాలకు మేట్ల ద్వారా అందించాలి. ►స్వీకరించిన దరఖాస్తులు, రశీదు నంబర్ల వివరాలతో తప్పనిసరిగా డిమాండ్ రిజిస్టర్‌ను నిర్వహించాలి. ప్రతి బుధవారం జరిగే సమావేశం వరకు స్వీకరించిన దరఖాస్తుల వివరాలను డిమాండ్ రిజిస్టర్లో నమోదు చేసి టెక్నికల్ అసిస్టెంట్, ఏపీవోల సంతకాలను తీసుకోవాలి. ►రోజూ ఎంపీడీవో/ ఉపాధిహామీ ప్రాజెక్ట్ అధికారి ఆధ్వర్యంలో ఏపీవోల బృందం కనీసం ఒక గ్రామంలో సమావేశం నిర్వహించాలి. నెలలోగా మండలంలోని అన్ని గ్రామాల్లోనూ సమావేశాలు నిర్వహించి ఉపాధిహామీ పథకంలో ఎదురవుతున్న ఇబ్బందులు, లబ్ధిదారులకు కల్పిస్తున్న హక్కులపై అవగాహన కల్పించాలి. ►గ్రామంలో జాబ్‌కార్డ్ కలిగినవారిలో సగం మందికిపైగా 100 రోజుల పనిని తప్పనిసరిగా పొందేలా చర్యలు చేపట్టాలి. సమావేశం జరిగిన ప్రదేశం నుంచి ఫీల్డ్ లేదా టెక్నికల్ అసిస్టెంట్లు సమావేశపు ఫొటోలను మొబైల్ ద్వారా అప్లోడ్ చేయాలి. ఆ మూడు జిల్లాల్లో ఉపాధి మెరుగు ఉపాధి హామీ పథకం పనులను కల్పించడం లో రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా లు ముందున్నాయని పంచాయతీరాజ్ స్పెషల్ సీఎస్ ఎస్పీసింగ్ ప్రశంసించారు. నల్లగొండ, వరంగల్, మెదక్ జిల్లాల్లో అధికారులు పనితీరును మరింత మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఉపాధిహామీ పథకం అమలుపై వివిధ జిల్లాల డ్వామా పీడీలతో మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ఈ ఏడాది వంద శాతం లేబర్ బడ్జెట్ సాధించడానికి రోజూ 15.72 లక్షల మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించాలన్నారు. కూలీల జాబ్‌కార్డులకు ఆధార్ నం బరును నెలాఖరులోగా అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. -
గ్రామాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే
వడాయిగూడెం(భువనగిరి అర్బన్) : నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం వడాయిగూడెం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలను తీసుకోవాలన్నారు. త్వరలోనే వడాయిగూడెం గ్రామానికి బీటీరోడ్డును వేస్తామన్నారు. మండలంలోని సూరేపల్లి గ్రామంలో మిషన్‌కాకతీయ రెండవ విడుత పనులను ప్రారంభించారు. అలాగే బొల్లేపల్లి గ్రామంలో ఉన్న శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చేరాలని ఆడ్మిషన్లు పొందే కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు కోట పెద్దస్వామి, అబ్బగాని వెంకట్‌గౌడ్, గోద శ్రీనివాస్‌గౌడ్, సతీష్‌పవన్, రఘురామయ్య, సింగిల్‌విండో చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, నాయకులు డాక్టర్ జడల అమరేందర్, పట్టణ, మండలశాఖ మారగోని రాముగౌడ్, కొల్పుల అమరేందర్, నోముల పరమేశ్వర్‌రెడ్డి, చిందం మల్లికార్జున్, జనగాం పాండు, మొలుగు లక్ష్మయ్య, పుట్ట వీరేష్, బబ్బూరి శంకర్‌గౌడ్ , తదితరులు ఉన్నారు. సర్పంచ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే పగిడిపల్లి గ్రామ సర్పంచ్ కట్కూరి భాగ్యమ్మ నివాసానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి బుధవారం వెళ్లారు. ఈ నెల 8న జరిగిన దాడి విషయంపై సర్పంచ్‌ను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన ఆమె కుటుంబ సభ్యులను పరమర్శించారు. అనంతరం భువనగిరి పట్టణంలోని శృతినగర్లో జరుగుతున్న ప్రముఖ న్యాయవాది నాగారం అంజయ్య తండ్రి అంత్యక్రియలకు హాజరై మృతదేహంపై పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జడల అమరేందర్‌గౌడ్, రావి సురేందర్‌రెడ్డి, మారగోని రాముగౌడ్, కొల్పుల అమరేందర్, మొలుగు లక్ష్మయ్య, అంజనేయులు, నాగయ్యగౌడ్ తదితరులు ఉన్నారు. -
పల్లెల అభివృద్ధికి కృషిచేస్తా: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు పరిశ్రమల శాఖ మంత్రిగా రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేశానని, ఇకపై పల్లెలను అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కొత్త బాధ్యతలు అప్పగించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపా రు. శాఖకు చెందిన ఉన్నతాధికారులు, ఉద్యోగులు మంగళవారం సచివాలయంలో జూపల్లిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలను, ప్రజాప్రతినిధులను కలుపుకుపోతానని, పరిపాలనలో కొత్త ఒరవడితో ముందుకు వెళతానని జూపల్లి చెప్పారు. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడంలో భాగంగా మహిళలు చదువు నేర్చుకునేలా కృషి చేస్తానన్నారు. గ్రామీణ పేదలకు వందశాతం ఉపాధి పనులు అందేలా చూస్తానన్నారు. మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో పంచాయతీరాజ్ విభాగం డెరైక్టర్ అనితారాం చంద్రన్, ఇంజనీర్ ఇన్ చీఫ్ సత్యనారాయణరెడ్డి, ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు భూమన్న తదితరులున్నారు. -
పంచాయతీరాజ్‌కు నిధుల్లో కోత!
బడ్జెట్లో రూ. 4,686.16 కోట్ల కేటాయింపులతో సరి ⇒ ఈ శాఖకు గతేడాది కేటాయింపులు రూ. 6,927.48 కోట్లు ⇒ గ్రామీణాభివృద్ధిశాఖకు స్వల్పంగా పెరిగిన నిధులు ⇒ గత బడ్జెట్లో రూ. 6,256.68 కోట్లు కేటాయించగా ఈసారి ⇒ రూ. 6,344.55 కోట్ల కేటాయింపు ⇒ మిషన్ భగీరథకు కేటాయింపులు శూన్యం సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వ్యవస్థల బలోపేతానికి అత్యంత ప్రాధాన్యమిస్తామన్న ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో ఆ మేరకు కేటాయింపులు మాత్రం చేయలేదు. 2015-16 ఆర్థిక బడ్జెట్లో వివిధ పథకాల కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలకు రూ.13,184 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్లో కేవలం రూ. 11,031 కోట్లతో సరిపెట్టింది. ఇందులోనూ తగ్గింపు వసూళ్లు రూ. 300 కోట్లు చూపి నికర కేటాయింపులను రూ. 10,731 కోట్లుగా పేర్కొన్నారు. ఆసరా పథకం మినహా మిషన్ భగీరథ, గ్రామీణ రహదారుల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. కేటాయింపుల మొత్తంలో పంచాయతీరాజ్‌కు గతేడాదికన్నా నిధులను బాగా తగ్గించగా గ్రామీణాభివృద్ధికి మాత్రం స్వల్పంగా కేటాయింపులు పెంచారు. అయితే పెరిగిన కేటాయింపులు కూడా కేంద్రం నుంచి వచ్చే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులకు సంబంధించినవే కావడం గమనార్హం. పంచాయతీరాజ్ విభాగానికి గతేడాది మొత్తం రూ. 6,927.48 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్లో రూ. 4,686.16 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక గ్రామీణాభివృద్ధి విభాగానికి గత బడ్జెట్లో రూ. 6,256.68 కోట్లు కేటాయించగా ఈ ఏడాది కేటాయింపులను స్వల్పంగా పెంచుతూ రూ. 6,344.55 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్ విభాగానికి కేటాయించిన నిధుల్లో రూ. 2,102.96 కోట్లను ప్రణాళికేతర వ్యయంగానూ రూ. 2,583.20 కోట్లు ప్రణాళికా వ్యయంగానూ చూపారు. గ్రామీణాభివృద్ధిశాఖకు ప్రణాళికా వ్యయం కింద రూ. 6,336.30 కోట్లు చూపగా, ప్రణాళికేతర వ్యయం కింద రూ. 8.25 కోట్లను మాత్రమే చూపారు. పంచాయతీరాజ్‌కు కేటాయింపులు ఇలా.. పంచాయతీరాజ్ విభాగంలో ముఖ్య కేటాయింపులను పరిశీలిస్తే సచివాలయశాఖ ఆర్థిక సేవలకు రూ. 3.50 కోట్లు, జిల్లా పరిషత్‌లకు ఆర్థిక సాయంగా రూ. 58.65 కోట్లు, మండల పరిషత్‌లకు రూ. 240.08 కోట్లు, గ్రామ పంచాయతీలకు రూ. 819.50 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్ సంస్థలకు నష్టపరిహారం, ఇతర కేటాయింపుల కింద మొత్తం రూ. 1,468.56 కోట్లు కేటాయించారు. ప్రణాళిక కింద ఇతర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు మరో రూ. 94.02 కోట్లు, ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాల నిమిత్తం రూ. 45.16 కోట్లు, గ్రామ పంచాయతీల బలోపేతానికి రూ. 45.16 కోట్లు, ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద రూ. 45.16 కోట్లు కేటాయించారు. ఆస్తుల రూపకల్పన, ఉపాధి హామీ పనుల అప్‌గ్రెడేషన్ కోసం మొత్తం రూ. 1,078 కోట్లు కేటాయించారు. మండల పరిషత్ భవనాల కోసం రూ. 45 కోట్లు, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద కేంద్రం నుంచి రూ. 407 కోట్లు రావచ్చని చూపారు. గ్రామీణ నీటిసరఫరా విభాగానికి రూ. 164 కోట్లు కేటాయించారు. నిర్మల భారత్ అభియాన్, ఎన్ఆర్డీడబ్ల్యూఎంపీ ప్రోగ్రామ్‌ల కింద కేంద్రం నుంచి మరో రూ. 1,040 కోట్లు వస్తాయని బడ్జెట్ కేటాయింపుల్లో చూపారు. గ్రామీణాభివృద్ధికి ఇలా.. గ్రామీణాభివృద్ధిశాఖకు బడ్జెట్లో ప్రణాళికా వ్యయం కింద మొత్తం రూ. 6,344.55 కోట్లు చూపగా ఇందులో వివిధ సామాజిక భద్రతా పింఛన్ల కోసం రూ. 3,260 కోట్లు కే టాయించారు. ఈ శాఖ పరిధిలో చేపట్టనున్న ఇతర ప్రత్యేక కార్యక్రమాలకు రూ. 2,712.55 కోట్లు, ఇతర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు రూ. 3.74 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. వడ్డీలేని రుణాలకు గతేడాదికన్నా కేటాయింపులు పెంచారు. గతంలో రూ. 84.61 కోట్లు కేటాయించగా తాజాగా రూ. 148.43 కోట్లకు పెంచారు. స్త్రీ నిధి బ్యాంకుకు ప్రత్యేక గ్రాంటును రూ. 11 కోట్లకు పెంచారు. గ్రామీణ జీవనోపాధికి రూ. 57.36 కోట్లు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు రూ. 133 కోట్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 2,450 కోట్లు, ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ ప్రోగ్రామ్‌కు రూ. 84 కోట్లు కేటాయించారు. ప్రణాళికేతర వ్యయం కింద గతేడాది రూ. 11.81 కోట్లు కేటాయించగా ఈ ఏడాది దాన్ని రూ. 8.24 కోట్లకు కుదించారు. ఇందులో ప్రత్యేక కార్యక్రమాలకు రూ. 2.16 కోట్లు, టీసీపార్డ్కు గతేడాది రూ. 7.96 కోట్లు కేటాయించగా ఈ ఏడాది కేవలం రూ. 4.85 కోట్లకు కుదించారు. ‘మిషన్ భగీరథ’కు అప్పులే ఆధారం! ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి వివిధ ఆర్థిక సంస్థలిచ్చే అప్పులే ఆధారం కానున్నాయి. గతేడాది ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం బడ్జెట్లో రూ. 4 వేల కోట్లు కేటాయించగా ఈ ఏడాది బడ్జెట్లో నిధుల కేటాయింపు ఊసేలేదు. బడ్జెట్ ప్రసంగంలోనూ మిషన్ భగీరథకు హడ్కో, నాబార్డు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ మొదలైన సంస్థల నుంచి ఆర్థిక వనరులను సమకూర్చుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. సుమారు రూ. 40 వేల కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును వచ్చే మూడేళ ్లలో పూర్తి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల చెప్పారు. 2016 చివరికి 6,100 గ్రామాలు, 12 పట్టణాలకు సురక్షిత తాగునీరందిస్తామని సర్కారు ప్రకటించింది. గ్రామజ్యోతికి నిధులు కరువు ప్రభుత్వం గత ఆగస్టులో ప్రారంభించిన గ్రామజ్యోతికి ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించలేదు. మన ఊరు-మన ప్రణాళికలో ప్రజల సూచనల ప్రకారం గ్రామాభివృద్ధి ప్రణాళికలను తయారు చేయడమే గ్రామజ్యోతి ముఖ్య ఉద్దేశమని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. -
కాసులు రాల్చుతున్న ఇసుక
జోరుగా అమ్మకాలు రికార్డు స్థాయిలో ఖజానాకు పాతిక కోట్లు ఆదాయం బడాబాబులకు కోరుకున్నంత సామాన్యులకు అందనంత సంఘాలకు దక్కింది అంతంత ఇసుక.. ఖజానాకు కాసుల వర్షం కురిపించింది. వేలం పాటలు నిర్వహించిన ప్పుడు కూడా ఇంత ఆదాయం రాలేదు. గతంలో ఏనాడు నాలుగైదుకోట్లే మించి ఆదాయం వచ్చిన దాఖలాలులేవు. కేవలం పది నెలల కాలం ఒక్క విశాఖ జిల్లా నుంచే ఏకంగా పాతిక కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది. విశాఖపట్నం: ఇసుక రీచ్‌ల నిర్వహణ..అమ్మకాలను డ్వామా నుంచి గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించి రెండేళ్లు కావస్తోంది. జిల్లాలో పదేళ్ల తర్వాత రీచ్‌లకు డీనోటిఫై చేసి ఏడాది కావస్తోంది. ప్రారంభించిన 25 రీచ్‌లలో 20 రీచ్‌ల్లో ఇసుక నిల్వలు అడుగంటాయి. మరో పక్క డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని పొరుగు జిల్లాల నుంచి ఇసుకను ప్రత్యేకంగా రప్పించి మరీ డిపోల ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు. ఒక పక్క ఇసుక కొరత.. మరో పక్క కొండెక్కిన ధరలతో సామాన్యులకు అందనంత దూరంలో ఇసుక రేణువులుంటే.. ఆరంభం నుంచి సిఫార్సులుంటేచాలు బడాబాబులకు కోరుకున్నంత ఇసుకవారి చెంతకు చేరుతూనే ఉంది. ఇలా వివాదాల నడుమ ఇసుక అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతూనే ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు ఇసుక అమ్మకాల ద్వారా ఖజానాకు రూ. పాతిక కోట్ల ఆదాయం వచ్చి చేరింది. జిల్లాలో డీనోటిఫై చేసిన 25 రీచ్‌ల్లో 4,47,605 క్యూబిక్‌మీటర్ల ఇసుక ఉంటుందని అంచనా వేశారు. ప్లెయిన్ ఏరియాలో 20 రీచ్‌ల ద్వారా 2,46,465 క్యూ.మీ. ఇసుకను వెలికి తీశారు. ఏజెన్సీ పరిధిలోని నాలుగు ప్రధాన రీచ్ ల ద్వారా 2,23, 818 క్యూ.మీ ఇసుకను వెలికి తీశారు. వీటి అమ్మకాల ద్వారా 13.50 కోట్ల ఆదాయం వచ్చింది. ఇంకా ప్లెయిన్ ఏరియాలో రీచ్‌ల వద్ద 27,621 క్యూ.మీ, ఏజెన్సీ ప్రాంత రీచ్‌ల వద్ద 36,492 క్యూ.మీ. ఇసుక కోసం పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయి. ఆరిలోవ డిపో ద్వారా ఇప్పటివరకు 65వేల క్యూ.మీ, ఆనంద పురంలోని జిల్లా సమైక్య డిపో ద్వారా మరో 75వేల క్యూ.మీ. ఇసుకను విక్రయించారు. ఇక సీజ్ చేసిన ఇసుకను పద్మనాభం వద్ద డిపో ద్వారా 8,995 క్యూ.మీ, కశింకోట వద్ద 48 క్యూ.మీ స్టీల్‌ప్లాంట్ డిపో వద్ద 8వేల క్యూ.మీ. మేర అమ్మకాలు సాగించారు. ఈ అమ్మకాల ద్వారా రూ.12 కోట్ల ఆదాయం వచ్చింది. -
కాసులు రాల్చుతున్న ఇసుక
జోరుగా అమ్మకాలు రికార్డు స్థాయిలో ఖజానాకు పాతిక కోట్లు ఆదాయం బడాబాబులు కోరుకున్నంత సామాన్యులకు అందనంత సంఘాలకు దక్కింది అంతంత ఇసుక.. ఖజానాకు కాసుల వర్షం కురిపించింది. వేలం పాటలు నిర్వహించిన ప్పుడు కూడా ఇంత ఆదాయం రాలేదు. గతంలో ఏనాడు నాలుగైదుకోట్లే మించి ఆదాయం వచ్చిన దాఖలాలులేవు. కేవలం పది నెలల కాలం ఒక్క విశాఖ జిల్లా నుంచే ఏకంగా పాతిక కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది. విశాఖపట్నం: ఇసుక రీచ్‌ల నిర్వహణ..అమ్మకాలను డ్వామా నుంచి గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించి రెండేళ్లు కావస్తోంది. జిల్లాలో పదేళ్ల తర్వాత రీచ్‌లకు డీనోటిఫై చేసి ఏడాది కావస్తోంది. ప్రారంభించిన 25 రీచ్‌లలో 20 రీచ్‌ల్లో ఇసుక నిల్వలు అడుగంటాయి. మరో పక్క డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని పొరుగు జిల్లాల నుంచి ఇసుకను ప్రత్యేకంగా రప్పించి మరీ డిపోల ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు. ఒక పక్క ఇసుక కొరత.. మరో పక్క కొండెక్కిన ధరలతో సామాన్యులకు అందనంత దూరంలో ఇసుక రేణువులుంటే.. ఆరంభం నుంచి సిఫార్సులుంటేచాలు బడాబాబులకు కోరుకున్నంత ఇసుకవారి చెంతకు చేరుతూనే ఉంది. ఇలా వివాదాల నడుమ ఇసుక అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతూనే ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు ఇసుక అమ్మకాల ద్వారా ఖజానాకు రూ. పాతిక కోట్ల ఆదాయం వచ్చి చేరింది. జిల్లాలో డీనోటిఫై చేసిన 25 రీచ్‌ల్లో 4,47,605 క్యూబిక్‌మీటర్ల ఇసుక ఉంటుందని అంచనా వేశారు. ప్లెయిన్ ఏరియాలో 20 రీచ్‌ల ద్వారా 2,46,465 క్యూ.మీ. ఇసుకను వెలికి తీశారు. ఏజెన్సీ పరిధిలోని నాలుగు ప్రధాన రీచ్ ల ద్వారా 2,23, 818 క్యూ.మీ ఇసుకను వెలికి తీశారు. వీటి అమ్మకాల ద్వారా 13.50 కోట్ల ఆదాయం వచ్చింది. ఇంకా ప్లెయిన్ ఏరియాలో రీచ్‌ల వద్ద 27,621 క్యూ.మీ, ఏజెన్సీ ప్రాంత రీచ్‌ల వద్ద 36,492 క్యూ.మీ. ఇసుక కోసం పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయి. ఆరిలోవ డిపో ద్వారా ఇప్పటివరకు 65వేల క్యూ.మీ, ఆనంద పురంలోని జిల్లా సమైక్య డిపో ద్వారా మరో 75వేల క్యూ.మీ. ఇసుకను విక్రయించారు. ఇక సీజ్ చేసిన ఇసుకను పద్మనాభం వద్ద డిపో ద్వారా 8,995 క్యూ.మీ, కశింకోట వద్ద 48 క్యూ.మీ స్టీల్‌ప్లాంట్ డిపో వద్ద 8వేల క్యూ.మీ. మేర అమ్మకాలు సాగించారు. ఈ అమ్మకాల ద్వారా రూ.12 కోట్ల ఆదాయం వచ్చింది. అందుబాటులో 1.79 లక్షల క్యూ.మీ.ఇసుక రీచ్‌లు, డిపోల వద్ద కలుపుకుంటే మొత్తం 5,26,939 క్యూ.మీ ఇసుక అందుబాటులో ఉంటుందని అంచనా వేయగా, 3,47,193 క్యూ.మీ ఇసుక కోసం ఆర్డర్లు రాగా ఇప్పటివరకు 3,09,733 క్యూ.మీ ఇసుక అమ్మకాలు జరిగాయి. మరో 37,460 క్యూ.మీ ఇసుకను విక్రయించాల్సి ఉంది. ప్రస్తుతం రీచ్‌లు, డిపోల వద్ద ఉన్న నిల్వలన్నీ కలిపి మరో 1,79,746 క్యూ.మీ. ఇసుక ప్రస్తుతం అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నారు. వీటిలో ప్రధానంగా ఏజెన్సీ పరిధిలో మంగబంద శాండ్ మైనింగ్ రీచ్ వద్ద 1.07లక్షల క్యూ.మీ. ఇసుక అందుబాటులో ఉంది. సగరం రీచ్‌లో మరో 53 వేలు, కాశీపట్నం, సోమిదేవులపల్లి రీచ్‌లో 12వేల చొప్పున, జుత్తాడ రీచ్‌లో 10వేలు, ఎరుకువాడ, దిబ్బపాలెం రీచ్‌లలో వెయ్యేసి క్యూ.మీ. చొప్పున ఇసుక అందుబాటులో ఉంది. మంగబంద రీచ్‌లో ఉన్న 1.05 లక్షల క్యూ.మీ. ఇసుకను పూర్తిగా ఏజెన్సీ అవసరాలకే వినియోగించనున్నారు. ఇక డిపోల విషయానికొస్తే ఆరిలోవ డిపో వద్ద సుమారు 10వేల క్యూ.మీ. స్టీల్‌ప్లాంట్ డిపో వద్ద మరో 42 వేల క్యూ.మీ. ఇసుక అందుబాటులో ఉంది. పొరుగు జిల్లాల నుంచి.. నిర్మాణ రంగం ఊపందుకోవడంతో జిల్లాకు 11లక్షల క్యూ.మీ. ఇసుక అవసరమనే అంచనాతో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి రప్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే సుమారు 65వేల క్యూ.మీ. ఇసుకను రప్పించి పెండింగ్ ఆర్డర్లకు అనుగుణంగా విక్రయాలు జరిపారు. -
వచ్చే నెల 2 నుంచి బాబు మహిళా సాధికారయాత్ర
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబరు 2 నుంచి మహిళా సాధికారయాత్ర చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు చెప్పారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డ్వాక్రా గ్రూపులకు అన్న సంజీవని, ఫుడ్ క్యాంటీన్లను అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రతి ఇంట్లో ఒక మహిళకు కంప్యూటర్ పరిజ్ఞానం కల్పించాలని నిర్ణయించారు. 2019నాటికి డ్వాక్రా గ్రూపులు 100 శాతం అక్షరాస్యత సాధించాలని చంద్రబాబు సూచించారు. -
పల్లెల ప్రగతి కోసమే.. గ్రామజ్యోతి
ప్రజలు సంఘటిత శక్తిగా కదలాలి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి నిధులు వస్తాయనే భ్రమలు వీడాలి అందుబాటులోని నిధులు వాడాలి గ్రామసభలో నిర్ణయాలు జరగాలి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండ : పల్లెల అభివృద్ధి కోసమే గ్రామజ్యోతి కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ప్రజలు సంఘటితంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గురువారం హన్మకొండలోని జెడ్పీ సమావేశ మందిరంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల నోడల్ అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో గ్రామజ్యోతిపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామజ్యోతిలో ప్రజలు భాగస్వాములు అయ్యేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. గ్రామజ్యోతి అనగానే ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయనే భ్రమలు వీడాలన్నారు. అందుబాటులో ఉన్న నిధులతో ప్రాధాన్యత క్రమంలో పనులు గుర్తించాలన్నారు. గ్రామసభ నిర్వహించి పనులు గుర్తించాలన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల నియోజక అభివృద్ధి నిధులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు, గ్రామపంచాయతీ ఆదాయం వీటి ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో పనులు గుర్తించాలన్నారు. ప్రభుత్వం నిధులు ఇస్తేనే అభివృద్ధి జరుగుతుందని భావించవద్దన్నారు. గంగదేవిపల్లి స్ఫూర్తి ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ అభివృద్ధికి స్ఫూర్తి గంగదేవిపల్లి గ్రామం అని కడియం అన్నారు. గంగదేవిపల్లి ప్రజలు అందుబాటులో ఉన్న నిధులతో అభివృద్ధి చేసుకున్నారన్నారు. 25 కమిటీలు వేసుకొని ఈ కమిటీల ఆధ్వర్యంలో ఒక్కో పనిని చేసుకుంటున్నారన్నారు. గ్రామ ఆర్థిక స్థితిగ తులు కాని, గ్రామంలో శ్రీమంతులు ఎవరు లేరన్నారు. అయినా సంఘటితంగా ముందుకు సాగి ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచారన్నారు. గ్రామంలో ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి ఉంటుందన్నారు. గుడుంబా తయారి, విక్రయాలు లేవన్నారు. గ్రామంలో ఎక్కడైన చెత్త ఉంటే సమష్టిగా తొలగిస్తారన్నారు. ఈ గ్రామానికి సందర్శకుల తాకిడి అధికంగా ఉందన్నారు. సందర్శకులు రూ.2,500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల్లో ఎవరి ఇష్టానుసారం వారు ఓటు వేస్తారన్నారు. జిల్లాలో మరిన్ని గ్రామాలు గంగదేవిపల్లిగా అభివృద్ధి సాధించాలన్నారు. ఈ దిశగా సర్పంచులు, అధికారులు కృషి చేయాలన్నారు. అభివృద్ధిలో పోటీ పడతాం.. 2011 జనాభా లెక్కల ప్రకారం మానవ వనరుల అభివృద్ధిలో జిల్లా వెనకబడి ఉందన్నారు. కొత్త రాష్ట్రం అనేక సవాళ్లు, సమస్యలు ఎదుర్కొంటుందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అనుకున్న మేరకు అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. చేసే కార్యక్రమాలు ప్రణాళికబద్ధంగా, ప్రాధాన్యత క్రమంలో చేయాలని సూచించారు. జిల్లా అనేక అంశాల్లో వెనకబడి ఉన్నామన్నారు. గుడుంబా తయారి, విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. 25 ఏళ్ల యువతికి పింఛన్ ఇవ్వాల్సిన దారుణ పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ మహబూబాబాద్ నుంచి గుడుంబా నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తలచుకుంటే అభివృద్ధిలో వరంగల్‌ను రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా నిలపవచ్చన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పోటీ పడి పని చేద్దామన్నారు. ఎవరు మందు స్థానంలో ఉంటారో చూద్దామన్నారు. ప్రజలకు చేరువుగా పథకాలు తీసుకెళ్లాలన్నారు. వ్యక్తిగత ఇబ్బందులంటే ముందుగానే తప్పుకోవాలని, ఇష్టం లేని పనులు చేసి అప్రతిష్ట తీసుకురావద్దని అధికారులకు సూచించారు. గ్రామజ్యోతిలో ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో డంపింగ్‌కు ఎకరం నుంచి ఎకరంన్నర వరకు, స్మశాన వాటికకు అర ఎకరం స్థలం గుర్తించాలన్నారు. ప్రభుత్వ స్థలం లేకుంటే ప్రైవేటు స్థలాన్ని గుర్తించాలన్నారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద కొనుగోలు చేద్దామన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులు మిగిలిపోతే గుర్తించి వారి వివరాలు కలెక్టర్‌కు అందించాలని సూచించారు. గ్రామాలను దత్తత తీసుకోవాలి.. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు గ్రామాలను దత్తత తీసుకోవాలని సూచించారు. గ్రామజ్యోతిలో శానిటేషన్‌కు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. తాను పది నియోజకవర్గాల్లో పది గ్రామాలను దత్తత తీసుకోనున్నట్లు చెప్పారు. దత్తత తీసుకొన్న గ్రామాల వివరాలు అధికారులు కలెక్టర్‌కు అందించాలని సూచించారు. గ్రామాలకు సంబంధించిన పూర్తి వివరాలు నోడల్ అధికారుల వద్ద ఉండాలన్నారు. రెండవ గ్రామజ్యోతిలో అక్షరాస్యతకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. జాతీయ సగటు అక్షరాస్యతను మించి అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా పెట్టుకోనున్నట్లు చెప్పారు. ఈనెల 16వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో గ్రామజ్యోతి సమావేశాలు నిర్వహించాలన్నారు. ఇందులో ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, అధికారులు భాగస్వాములను చేయాలన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ధర్మాసాగర్ మండలంలోని మల్లికుదుర్ల, షోడాషపల్లి, గుండ్ల సాగరం గ్రామాలను దత్తత తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ వాకాటి కరుణ, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, కమిషనర్ సుధీర్‌బాబు, జేసీ ప్రశాంత్ పాటిల్ పాల్గొన్నారు. -
కోటాలో కోత వద్దు
- అర్హులందరికీ రేషన్ ఇవ్వాలి - గ్రామీణాభివృద్ధి స్థాయూసంఘ సమావేశ తీర్మానం ఇందూరు: కుటుంబంలో ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ అందేలా చూడాలని, ఇక ముందు కోటాలో కోత లేకుండా సరఫరా చేయాలని కోరుతూ గ్రామీణాభివృద్ధి స్థాయూసంఘ సమావేశం తీర్మానించింది. గ్రామీణాభివృద్ధి స్థాయూసంఘ సమావేశం శుక్రవారం జిల్లాపరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ దఫేదారు రాజు అధ్యక్షతన జరిగింది. డీఆర్డీఏ, ఐకేపీ, పరిశ్రమలు, హౌసింగ్, సహకార, నెడ్‌క్యాప్, సివిల్ సప్లయ్, స్టెప్, ఆర్టీసీ, గనులు, భూగర్భ, డ్వామా శాఖలు చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలపై చర్చించింది. పలువురు సభ్యులు పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రేషన్ అక్రమాలు రేషన్ డీలర్ల అక్రమాలను సభ్యులు ప్రస్తావించారు. కుటుంబ సభ్యులందరికీ ఒక నెల రేషన్ కోటా వస్తే.. తదుపరి నెలలొ ఒకరిద్దరికి డీలర్లు కోత పెడుతున్నారని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి(డీఎస్ఓ)తో సభ్యులు చెప్పారు. ఆధార్ అనుసంధానం కాలేదని డీలర్ చెప్పడంతో ప్రజలు మండల కార్యాలయాల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రేషన్ కోటా వచ్చినప్పటికీ రాలేదని కొందరు డీలర్లు చెబుతున్నారని, సరుకులను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఫిర్యాదు చేశారు. షాపులపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో దాడులు చేయిస్తే అక్రమాలు వెలుగులోకి వస్తాయన్నారు. అంత్యోదయ కార్డులు డీలర్ల వద్దనే ఉన్నాయని అన్నారు. వాటిని వెనక్కి తీసుకోవాలని కోరుతూ సమావేశం తీర్మానించింది. జీవన భృతి చెల్లింపులో కూడా... బీడీ కార్మికులకు జీవన భృతిపై ఈ సమావేశం చర్చించింది. భృతి చెల్లింపులోనూ అక్రమాలు జరుగుతున్నాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి జాబితాలో పేరుండి, రెండవ జాబితాలో లేకపోవడంతో బీడీ కార్మికులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. బీడీ భృతి చెల్లింపులోనూ అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. దీనిపై సోషల్ ఆడిట్ చేయించాలని కోరుతూ సమావేశం తీర్మానించింది. నందిపేట్, నవీపేట్, వర్ని ప్రాంతాల్లోని జోగినులకు భృతి వచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతూ మరో తీర్మాం చేసింది. బ్యాంకర్లతో ఇబ్బందులు నిరుద్యోగ యువతకు రుణాలు ఇచ్చే విషయంలో అనుమతుల పేరిట బ్యాంకర్లు ఇబ్బందులపాలు చేస్తున్నారని సభ్యులు చెప్పారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సభ్యులు కోరారు. హరితహారం గుంతలపై... హరితహారం కార్యక్రమంపై కూడా ఈ సమావేశం చర్చించింది. పక్క పక్కనే గుంతలు తీసి మొక్కలు నాటుతున్నారని, అవి ఎలా ఎదుగుతాయని డ్వామా పీడీని సభ్యులు ప్రశ్నించారు. హరితహారంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కళాజాత బృందాలను ఏర్పాటు చేయూలని కోరారు. ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్థిక స్థాయూసంఘం సమావేశం జరిగింది. జడ్పీ సీఈఓ మోహన్‌లాల్, జడ్పీటీసీ సభ్యులు తానాజీ రావు, మాధవ రావు దేశాయి, స్వాతి, అధికారులు పాల్గొన్నారు. -
దారిమళ్లిన ‘ఉపాధి’ నిధులు
గ్రామీణప్రాంతాల్లో నిలిచిపోయిన పనులు రూ.85.77 కోట్లు వెనక్కి తీసుకున్న గ్రామీణాభివృద్ధి శాఖ ఏడాదైనా విడుదల చేయని వైనం హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు చేరాల్సిన ఉపాధి హామీ నిధులు దారిమళ్లాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద గ్రామ పంచాయతీల్లో సిమెంటు రోడ్లు, కల్వర్టులు, సైడ్ డ్రైయిన్లు, పంచాయితీ భవనాలు, కమ్యూనిటీహాళ్ల నిర్మాణం.. తదితర అభివృద్ధి పనుల నిమిత్తం గ్రామీణాభివృద్ధి విభాగం నిధులు మంజూరు చేసింది. మంజూరు చేసిన నిధుల్లో పదిశాతం నిధులను ఏడాది క్రితం గ్రామీణాభివృద్ధి విభాగం వెనక్కి తీసుకుంది. తొమ్మిది జిల్లాల్లోని 25 పంచాయితీరాజ్ డివిజన్ల నుంచి తీసుకున్న మొత్తం సుమారు రూ.85.77 కోట్లను ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదు. పాత బకాయిలు విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయతీల్లో సర్పంచుల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆయా జిల్లాల్లో పనులు చే సి న కాంట్రాక్టర్లు నిధులు రాకపోవడంతో కూలీలకు వేతనాలు చెల్లించడం లేదు. ఈ విషయమై స్థానికంగా ఉండే ఇంజనీర్లను సంప్రదిస్తే గ్రామీణాభివృద్ధిశాఖ నిధులు ఇవ్వడం లేదంటున్నారని సర్పంచులు వాపోతున్నారు. వెనక్కి తీసుకున్న నిధులను గ్రామీణాభివృద్ధి విభాగం అధికారులు దేనికి వినియోగించారో ఎవరికీ అంతుబట్టడం లేదు. క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన ఉన్నతాధికారులే వాటిని దారి మళ్లిం చేందుకు పూనుకోవడం పట్ల సర్పంచుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఏం జరిగింది..? ఉపాధి హామీ పథకం కింద గ్రామ పంచాయ తీల్లో చేపట్టిన పనులకు 90 శాతం నిధులను వివిధ దశల్లో కాంట్రాక్టర్లకు డివిజన్ స్థాయిలో పంచాయతీరాజ్ ఇంజనీర్ చెల్లిస్తారు. ఆపై ఆయా పనులను క్వాలిటీ సెల్, సోషల్ ఆడిట్ బృందాలు పరిశీలించి సంతృప్తికర నివేదికలు ఇస్తేనే మిగిలిన మొత్తాన్ని విడుదల చేస్తారు. అయితే ఏపీ పునర్విభజన ప్రక్రియ సందర్భం లో.. అన్ని డివిజన్ల నుంచి ఇంజనీర్ల ఖాతాల్లో ఉన్న నిధులను గ్రామీణాభివృద్ధి విభాగం వెనక్కి తీసుకుంది. సకాలంలో క్వాలిటీ బృం దాన్ని పనుల పరిశీలనకు అధికారులు పంపకపోవడం, సోషల్ ఆడిట్ బృందాలు పనులను సందర్శించకపోవడంతో కొంత జాప్యమైంది. ఆపై ఆయా బృందాలు పంచాయతీల్లో పర్యటించి సంతృప్తికరమైన నివేదికలు ఇచ్చినా, గ్రామీణాభివృద్ధి విభాగం మాత్రం ఎందుకోగానీ నిధులను తిరిగి వెనక్కి ఇవ ్వలేదు. ఉపాధి హామీ నిధులను దారిమళ్లించి ఉంటారని సర్పంచులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అవమానపడాల్సి వస్తోంది.. ఉపాధి హామీ పథకం కింద గ్రామ పంచాయితీల ద్వారా వివిధ రకాల అభివృద్ధి పనులను చిన్నచిన్న కాంట్రాక్టర్లు, కూలీలతో చేయించాం. పనులు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా.. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు వేరే పనులు చేపట్టేందుకు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సొమ్ము వచ్చి నా.. తాము దాచుకొని ఇవ్వట్లేదేమోనని కాంట్రాక్టర్లు, కూలీలు అపనిందలు వేస్తున్నారు. కొన్ని గ్రామాల్లోనైతే సర్పం చులకు అవమానాలు తప్పడం లేదు. ప్రభుత్వం తక్షణం నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. - పురుషోత్తం, మెంటెపల్లి సర్పంచ్, మహబూబ్‌నగర్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు. -
అధికార సంవర్థకం
టీఆర్ఎస్ నాయకులే లబ్ధిదారులు జాబితా గోప్యంపై అనుమానాలు అధికారుల తీరుపై విమర్శలు వరంగల్ : అర్హులైన పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అధికార పార్టీ వారికే బాగా అక్కరకొస్తున్నాయి. సాధారణ ప్రజల కంటే ముందే రాజకీయ నాయకులు, వారి అనుచరులు ఈ పథకాలకు లబ్ధిదారులుగా మారుతున్నారు. గ్రామీణ అభివృద్ధిలో కీలకమైన వ్యవసాయ అనుబంధ రంగాల పథకాల్లో అధికార పార్టీ నాయకుల హవా నడుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే మొదట అమలు చేసిన సబ్సిడీ ట్రాక్టర్లు పూర్తిగా అధికార పార్టీ వారికే దక్కా యి. పశుసంవర్థక శాఖ అమలు చేస్తోన్న సబ్సి డీ గొర్రెల పంపిణీ పథకంలోనూ ఇలాగే జరుగుతోంది. కరువు పరిస్థితుల్లో గ్రామీణ పేదలకు అసరాగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం సబ్సిడీ గొర్రెల పథకాన్ని అమలు చేస్తోం ది. వర్షాభావంతో వ్యవసాయం నష్టాలు మిగి ల్చిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఆర్థికంగా ఆసరా నిలిచేందుకు ఈ పథకం ఉపయోగంగా ఉండనుంది. అధికారులు పారదర్శకతకు పట్టించుకోకపోవడంతో ఈ పథకం అమలులో మాత్రం ప్రభుత్వ స్ఫూర్తి నెరవేరేలా కనిపించడంలేదు. ఒక్కో యూనిట్‌కు రూ.30 వేలు సబ్సిడీపై పేదలకు గొర్రెలు పంపిణీ చేసే పథకం కింద జిల్లాకు 417 మినీ షీప్ యూని ట్లు మంజూరయ్యాయి. ఒక్కో యూనిట్ విలువ రూ.30 వేలు. పథకానికి ఎంపికైన లబ్ధిదారుడు రూ.15 వేలు చెల్లించాలి. మిగిలిన రూ.15 వేలు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. ఒక్కో యూనిట్ కింద ఐదు గొర్రెలు, ఒక గొర్రెపోతును పంపిణీ చేస్తారు. లబ్ధిదారుడు తనకు నచ్చిన చోట వీటిని కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. పశుసంవర్ధక శాఖకు సంబంధించి జిల్లాలో వరంగల్, జనగామ, నర్సంపేట డివిజన్లు ఉన్నాయి. 417 యూని ట్లను మూడు డివిజన్లకు సమానంగా కేటాయించారు. ఈ పథకం అమ లు కోసం జిల్లాకు రూ.62.55 లక్షలు మం జూరయ్యాయి. గొర్రెల పెంపకదారులైన పేదలు(బీపీఎల్) కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. పశుసంవర్థక శాఖ మండల అధికారి, గొర్రెల పెంపకం దారుల సొసైటీ అధ్యక్షుడు కలిసి లబ్ధిదారులను ఎంపిక చేయాలి. అధికార పార్టీ నేతల జోక్యం, అధికారుల ఉదాసీనతతో పథకం అమలులో పాదర్శకత లోపిం చింది. ప్రతి గామంలో అధికార పార్టీకి చెందిన నాయకులనే లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఈ జాబి తాలను మూడు డివిజన్ల పశుసంవర్ధక సహా య సంచాలకులు జిల్లా కార్యాలయానికి పంపించారు. వారం క్రితమే ఈ జాబితా ఆమో దం పొందింది. లబ్ధిదారులుగా ఎంపికైన వారి వివరాల జాబితాను పశుసంవర్ధక శాఖ అధికారులు ఎంతకీ వెల్లడించడం లేదు. లబ్ధిదారుల జాబితా ఇవ్వాలని ‘సాక్షి ప్రతి నిధి’ పశుసంవర్థక శాఖ జిల్లా అధికారిని కోరగా.. ఆయన ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ జాబితాను పూర్తిగా రహస్యంగా పెడుతున్నారు. జాబితా ను గోప్యంగా పెడుతున్న అధికారులు అంతే గుట్టుగా పంపిణీ చేసే ఉద్దేశంతోనే పశుసంవర్థక శాఖ ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అర్హులకు పథకం అందుతుందా... లేదా... అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిష్పక్ష పాతంగా ఎంపిక మినీ షిప్ యూనిట్ల లబ్ధిదారుల ఎంపిక నిష్పక్షపాతంగా జరిగింది. వారం క్రితమే కలెక్టర్ ఆమోదం కూడా తెలిపారు. అధికారికంగా రూపొందించిన జాబితా కాబట్టి వెల్లడించలేము. - వెంకయ్య నాయుడు, పశుసంవర్థక శాఖ జిల్లా అధికారి -
పల్లెవికాసాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
జిల్లా కలెక్టర్ శ్రీదేవి మహబూబ్‌నగర్ టౌన్: ప్రతి వారం నిర్వహించే పల్లెవికాసం కార్యక్రమాన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి ప్రత్యేకాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ప్రత్యేకాధికారులతో వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు విధిగా పాల్గొని ఏ శాఖకు చెందిన సమస్యలను వారే గుర్తించాలన్నారు. గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాలను సందర్శించేటప్పుడు రెగ్యులర్‌గా అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి వాటిని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పౌష్టికాహారం, ఇతరత్రా వాటిని సక్రమంగా అందిస్తున్నారా లేదా అనేది తనిఖీ చేయాలని చెప్పారు. పీహెచ్సీలలోనే కాన్పులు అయ్యేలా గ్రామీణ ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఉపాధి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి వేసవిలో కూలీలు వలసలు వెళ్లకుండా ఉపాధి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ చెప్పారు. కూలి చేసేందుకు ముందుకు వచ్చే ప్రతి కూలీకి పని కల్పించాలని సూచించారు. నిబంధనల ప్రకారం రోజుకు రూ.169కూలి వచ్చేలా పనులు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పనిచేసిన వారికి సకాలంలో డబ్బులు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఏజేసీ డాక్టర్ రాజారాం, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, డ్వామా పీడీ సునందరాణి తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్ని పిండుకోండి
-
పల్లెల్ని పిండుకోండి
అభివృద్ధి పనుల నిధుల కోసం గ్రామ కార్యదర్శులకు ఏపీ ప్రభుత్వం ఆదేశం సాక్షి, హైదరాబాద్: గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు నేరుగా ఇచ్చే 13వ ఆర్థిక సంఘం నిధులను.. కరెంటు బకాయిల పేరుతో తమ ఖాతాకే మళ్లించుకోవాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పుడు గ్రామాలకు నిధుల అవసరాల కోసం ఆయా గ్రామాల్లో తప్పనిసరిగా ఇంటి పన్నులు వసూలు చేసుకోవాలని సూచిస్తోంది. స్థానిక రాజకీయ కారణాలతో గ్రామాల్లో అంతంత మాత్రంగా ఉండే పన్నుల వసూళ్లను ఇక బలవంతంగా చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. గ్రామ కార్యదర్శులందరూ ఫిబ్రవరి నెలాఖరు నాటికి వారి గ్రామాల్లో బకాయిలతో సహా వంద శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని.. లేదంటే వారిపై కఠిన చర్యలు చేపడతామని కూడా హెచ్చరించింది. కేంద్ర నిధులు విద్యుత్ బకాయిలకు జమ.. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అందజేసే నిధుల ఆధారంగా గ్రామాల సర్పంచ్‌లు తమ తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడతారు. అయితే.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గ్రామ పంచాయతీలు తమకు రూ. 850 కోట్ల మేర విద్యుత్ బిల్లుల బకాయి పడ్డాయని ట్రాన్స్‌కో సర్కారుకు నివేదించింది. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పంచాయతీలకు ఇచ్చే 13వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల విద్యుత్ బకాయిల కింద జమ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సీఎం స్థాయిలోనే నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కరెంటు బకాయిలకు తప్ప మిగతా అవసరాలకు గ్రామ సర్పంచ్‌లు రాసే చెక్కులకు డబ్బులు చెల్లించవద్దంటూ కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ట్రెజరీలకు ఆదేశాలిచ్చారు. జనవరి 20కల్లా వసూళ్లు పూర్తి చేయాలి... రెగ్యులర్ గ్రామ కార్యదర్శులు ఉండే పంచాయతీల్లో జనవరి 20వ తేదీ నాటికే పన్నుల వసూలు పూర్తిచేయాలని.. కార్యదర్శులు లేని వాటిలో ఫిబ్రవరి నెలాఖరు కల్లా వసూలు లక్ష్యం పూర్తి చేయాలని గడువు కూడా నిర్దేశించింది. ఇంటి పన్నుతో సహా ఆయా గ్రామాల్లో షాపుల అద్దె వంటి ఇతర పన్ను బకాయిలను కూడా రాబట్టుకోవాలని ఆదేశించింది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని సూచించింది. జనవరి 20 లోగా వంద శాతం వసూలు చేసిన గ్రామ కార్యదర్శులకు గణతంత్ర దినోత్సవం రోజు అవార్డు ఇస్తామని ప్రకటించింది. నిర్ణీత గడువులోగా ఇంటి పన్ను వసూలు చేయని గ్రామ కార్యదర్శులపై చర్యలు చేపడతామనీ హెచ్చరించింది. అలాంటి వసూలు చేయని గ్రామ కార్యదర్శుల జాబితాను తమకు పంపాలని పంచాయతీరాజ్ కమిషనర్, జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఈ నెల 18వ తేదీన మెమో (నెం. 9999) జారీ చేసింది. పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా ఐదు రోజులు పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సి.హెచ్.అయ్యన్నపాత్రుడు ఇటీవల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, గ్రామాల్లో ఇంటి పన్నుల వసూలుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. -
సంసద్ సంకల్పం
‘గ్రామాభివృద్ధి విషయంలో మహాత్మాగాంధీ సిద్ధాంతమే తనకు స్ఫూర్తి.. విలువలు, సామాజిక స్ఫూర్తి, మంచి విద్యను ప్రోత్సహించడం ద్వారా గ్రామాలు వెలుగులీనుతారుు.. వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లి, గుజరాత్ రాష్ట్రంలోని పన్సారీ గ్రామాలను ఆదర్శంగా తీసుకుని ప్రతీ పల్లె అభివృద్ధి సాధించాలి.. - పథకం ప్రారంభ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన(ఎస్ఏజీవై) పథకాన్ని ప్రవేశ పెట్టింది. మహాత్ముడి మాటను స్ఫూర్తిగా తీసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలోని గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తారు. 2019 వరకు మూడు గ్రామాలను తీసుకుని అభివృద్ధి చేయూల్సి ఉంటుంది. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పచ్చదనం, సౌహార్థ్ర సంబంధాలు పెంచడమే ఈ పథకం ఉద్దేశం. మైదాన ప్రాంతాల్లో 3 వేల నుంచి 5 వేల జనాభా, గిరిజన ప్రాంతాల్లో 1000 నుంచి 3 వేల జనాభా ఉంటే చాలు. ముందుగా 2016 నాటికి ఒక్కో ఎంపీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయూలి. ఒక గ్రామం అభివృద్ధి చెందితే చుట్టుపక్కల గ్రామాలు కూడా అభివృద్ధి బాట పడతాయనేది లక్ష్యం. ఈ పథకంతో పల్లెల రూపురేఖలు మారనున్నారుు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వివిధ పథకాలకు సంబంధించిన నిధులను సమీకరించడం, తమ ఎంపీ నిధులను వీటికి జోడించి అభివృద్ధి చేయడమే లక్ష్యం. దీనికి జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ కూడా తోడ్పాటునందిస్తుంది. జిల్లాకు సంబంధించి ఇద్దరు లోక్‌సభ సభ్యులు, ముగ్గురు రాజ్యసభ సభ్యులు గ్రామాలను దత్తత తీసుకున్నారు. వరంగల్ లోకసభ సభ్యుడు కడియం శ్రీహరి వర్ధన్నపేట మండలం ఐనవోలు గ్రామాన్ని, మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ నెల్లికుదురు మండలం నారాయణపురం, రాజ్యసభ సభ్యులు గుండు సుధారాణి ఆత్మకూరు మండలం నీరుకుల్ల, గరికపాటి మోహన్‌రావు గోవిందరావుపేట, రాపోలు ఆనందభాస్కర్ కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాలను ‘సాక్షి’ సందర్శించింది. అక్కడి ప్రజల మనోభావాలను తెలుసుకుంది. అక్కడి సమస్యలు, ప్రజలు కోరుకుంటున్న వివరాలు మీకోసం.. ఏడునూతుల కొడకండ్ల : సంసద్ ఆదర్శ యోజన పథకంలో భాగంగా ఏడునూతుల గ్రామాన్ని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ దత్తత తీసుకున్నారు. అన్ని రంగాల్లో వెనుకబడిన గ్రామా న్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి బాట పట్టించనున్నారు. దీంతో తమ గ్రామం ప్రగతి పథంలో పయనిస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి జమ్మికుంటతండా ఆవాస ప్రాంతంగా ఉంది. ఇక్కడ నామమాత్రం గా మరుగు కాల్వలు, సీసీ రోడ్లు నిర్మించారు. మురుగు కాల్వ లు లేకపోవడంతో వ్యర్థపు నీరంతా వీధుల్లోనే ప్రవహిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెయిన్ రోడ్డు నుంచి గ్రామంలోకి వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. భవనాలు కరువు.. గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలు నాలుగు ఉన్నాయి. వీటిలో ఒక్క కేంద్రానికి మాత్రమే సొంత భవనం ఉంది. మిగతావి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరింది. గ్రంథాలయం లేకపోవడంతో పాఠకులు ఇబ్బంది పడుతున్నారు. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం లేకపోవడంతో మహిళా, కుల, యువజన సంఘాల వారు సమావేశాలు నిర్వహించుకోవడానికి ప్రైవేటు భవనాలు ఆశ్రయించాల్సి వస్తోం ది. మంచినీ టి వసతి కూడా అం తంత మాత్రం గానే ఉంది. డీఫ్లోరైడ్ ప్రాజెక్ట్ పనులు పదేళ్ల క్రితం ప్రారంభమైనా నేటికీ పూర్తి కాలేదు. గ్రామం నుంచి వావిలా ల, పాకాల, నారబోయినగూడెంకు అంతర్గత రోడ్లు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎస్సీ కాలనీలో మురుగు కాల్వలు, సీసీ రోడ్లు లేవు. నారాయణపురం నారాయణపురం(నెల్లికుదురు) : నారాయణపురం గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలవనుంది. సంసద్ పథకంలో భాగంగా మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. 68 ఏళ్ల క్రితం ఏర్పడిన గ్రామంలో 762 కుటుంబాలు నివసిస్తున్నాయి. శివారులోని 15 గిరిజన తండాల్లో 93 శాతం గిరిజనులు ఉన్నారు. వీరంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. రికార్డుల్లో అక్షరాస్యత 90 శాతం ఉన్నప్పటికీ.. కేవలం 10 శాతమే ఉందని గ్రామస్తులు అంటున్నారు. అయితే గ్రామానికి చేరుకునేందుకు తారాసింగ్ బావి నుంచి రోడ్డు సౌకర్యం లేదు. ప్రధాన సమస్యలు.. విద్య, వైద్యం, విద్యుత్, తాగు, సాగునీరు, అంతర్గత రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేదు. 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్లు శిథిలావస్థకు చేరుకొని తీగలు తెగిపోతున్నాయి. తాగునీరు లేకపోవడంతో తండావాసులు అవస్థలు పడుతున్నారు. గ్రామం, తండాలో మరుగుదొడ్లు కేవ లం 21 శాతం నిర్మించుకున్నారు. అయితే గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ డాక్టర్ ఊకంటి యాకూబ్‌రెడ్డి 44 అభివృద్ధి కమిటీలు వేశారు. ఇందులో 33 కమిటీలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. గ్రామంలో 462 పనులను గుర్తించి.. రూ.128కోట్లతో నివేదికను ప్రభుత్వానికి పంపించారు. మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో వైద్యం అందక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. గ్రాామం ఏర్పడినప్పటి నుంచి కాస్తులో ఉన్న వారికి ఇప్పటివరకు హక్కు పత్రాలు ఇవ్వలేదు. రైతులు ధాన్యం నిల్వ చేసుకోవడానికి గోదాంలు, ఆరోగ్య కేంద్రం నిర్మించాలి. విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
నిఘా, పర్యవేక్షణ కమిటీ చైర్మన్‌గా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నిఘా, పర్యవేక్షణ కమిటీ జిల్లా చైర్మన్‌గా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు. కో చైర్మన్లుగా భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డిలను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణాభివృద్ధి ద్వారా అమలయ్యే కార్యక్రమాలపై ఈ కమిటీ సమీక్షించి తదుపరి చర్యలు తీసుకుంటుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా నీటియాజమాన్య సంస్థల పరిధిలో కేంద్ర ప్రభుత్వం అమలుచేసే కార్యక్రమాలను కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నిర్ణయాలు తీసుకోనుంది. గతంలో ఈ కమిటీకి చైర్మన్‌గా సర్వే సత్యనారాయణ కొనసాగారు. అయితే కేంద్ర మంత్రిగా విధులు నిర్వహించిన నేపథ్యంలో ఈ కమిటీ భేటీ అరుదుగా జరిగింది. ఈ క్రమంలో పర్యవేక్షణ లోపించడంతో ఉపాధిహామీ పథకంలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. తాజాగా కొత్త కమిటీ ఏర్పాటు కావడంతో ఈ అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందో లేదో చూడాలి. -
‘ఉపాధి’.. ఇక పకడ్బందీ..
* పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షణకు ఉత్తర్వులు జారీ * పారదర్శకంగా పనులు, నిధుల ఖర్చు మంచిర్యాల రూరల్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పనుల పర్యవేక్షణ, వేతనాల చెల్లింపు ప్రక్రియ, పనుల కేటాయింపు బాధ్యతలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఎంపీడీవోలకు అప్పగిస్తూ ప్రభుత్వం గత శుక్రవారం జీవో 15 జారీ చేసింది. ఇన్నాళ్లు కాంట్రాక్టు ఉద్యోగులే ఉపాధి పనుల ఎంపిక, వాటి నిర్వహణ బాధ్యతలు చూడడం, కొలతలను బట్టి కూలీలకు వేతనాలు అందించడం వంటి పనులు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతీ మండలానికి ఒక ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. ప్రతీ ఏడాది సామాజిక తనిఖీ బృందం చేసిన పనులు, చెల్లించిన వేతనాలపై తనిఖీ చేపట్టగా.. రూ.లక్షల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయి. దీంతో చేసిన పనులతో అంతగా ప్రయోజనం లేకుండా పోయినట్లు గుర్తించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించడంతో ‘ఉపాధి’ కాంట్రాక్టు సిబ్బంది ఇక నుంచి ఎంపీడీవోల ఆదేశాల మేరకు పని చేయాల్సి ఉంటుంది. దుర్వినియోగం తగ్గేనా..? జిల్లాలో 31,618 శ్రమశక్తి సంఘాల్లో 5,80,577 మంది కూలీలు ఉన్నారు. వీరిలో ఏడాదికి కనీసం 4 లక్షల మంది ఉపాధి పని సద్వినియోగం చేసుకుంటున్నారు. చాలా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు చేసేందుకు కూలీలు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వ్యవసాయ పనులు కాలంలో పనులు తక్కువగా ఉండడంతో ఇతర పనులకు వెళ్తున్నారు. సీజన్ ముగిసిన తర్వాత ఉపాధి పనులు చేస్తేనే పూట గడుస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు సిబ్బంది పనుల కేటాయింపులో అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. గ్రామాల్లో చేసిన పనులు మళ్లీ చేయడం, చేయకున్నా కూలీల మస్టర్లు వేసి వేతనాలు కాజేసినట్లు సామాజిక తనిఖీల్లో వెల్లడైంది. ఎనిమిదేళ్లుగా చేపట్టిన సామాజిక తనిఖీల్లో రూ.12.17 కోట్లు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. వీటిలో ఇంకా సుమారు రూ.9కోట్లకు పైగా రికవరీ చేయాల్సి ఉంది. అక్రమార్కులపై చర్యలు తీసుకునేలోపు వారు ఉద్యోగాలు వదిలి వెళ్తున్నారు. వారి నుంచి నిధులు రికవరీ చేయడం, చర్యలు తీసుకోవడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. దీని దృష్ట్యా పనుల్లో పారదర్శకత, నిధుల ఖర్చులో జవాబుదారీతనం ఉండేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే తీరిక లేకుండా ఉంటున్న మండల పరిషత్ సిబ్బంది.. ఉపాధి పనుల పర్యవేక్షణ, ఎంతమేరకు నిధులు దుర్వినియోగం కాకుండా చూస్తారో వేచి చూడాల్సిందే. బాధ్యతల అప్పగింత.. పనుల పర్యవేక్షణను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆయా మండలాల ఎంపీడీవోలకు అప్పగించారు. ఎంపీడీవోలు జాబ్‌కార్డుల జారీ నుంచి పనుల ఎంపిక, కూలీల బడ్జెట్ తయారీ, గ్రామపంచాయతీల్లో పనుల ప్రణాళిక తయారీ, చేసిన పనులకు సరైన వేతనాలు అందించే ప్రక్రియ పర్యవేక్షించాల్సి ఉంది. పనుల నివేదికలను ఎప్పటికప్పుడు డ్వామా పీడీ, అడిషనల్ పీడీలకు అందించి, పథకం అమలు విషయంలో జవాబుదారీగా ఉండాలి. ప్రతీ పనిని పంచాయతీ కార్యదర్శి, సర్పంచుల ఆమోదం, గ్రామసభలో ప్రజలు సూచించిన పనుల ప్రణాళిక తయారీ, ఫీల్డ్ అసిస్టెంట్లను పర్యవేక్షించడం, గ్రామాల్లో జరిగే పనుల తనిఖీ, కూలీలకు వేతనాలు అందేలా చూడడం వంటి పనులు చేపట్టనున్నారు. ఈవోపీఆర్డీలు మండల ప్రణాళిక తయారీ, మస్టర్లు, పనుల తనిఖీ చేపడుతారు. పంచాయతీ రాజ్ ఏఈలు పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఎంపీడీవోలకు తెలియజేయాల్సి ఉంటుంది. సూపరింటెండెంట్లు ఉపాధి పనుల ఖాతాల పర్యవేక్షణ, వేతనాల చెల్లింపుల రిజిష్టర్, ఆపరేటర్లు తయారు చేసే వేతనాలు పరిశీలిస్తారు. మండల పరిషత్ కార్యాలయ సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు చెల్లింపుల రికార్టులను స్వాధీనం చేసుకుని ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. వీరి పర్యవేక్షణలో అక్రమాలకు అడ్డుపడే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. -
నిధులపై నిఘా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కేంద్రంలో 16వ లోకసభ కొలువుదీరిన నేపథ్యం లో జిల్లాలో విజిలెన్స్, మానిటరింగ్ కమిటీని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై విడుదలయ్యే కేంద్ర ప్రభుత్వ నిధులపై ఈ కమిటీ నిఘా పెట్టనుంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన పథకాలను ఈ కమిటీ పకడ్బందీగా పర్యవేక్షించనుంది. 15వ లోకసభ రద్దు చేయడం ద్వారా గతంలో ఉన్న విజిలెన్స్, మానిటరింగ్ కమిటీకి కాలం చెల్లిం ది. సార్వత్రిక ఎన్నికలు, ప్రభు త్వాల ఏర్పాటు, పదవీ ప్రమాణ స్వీకారాలు పూర్తయి పాలన ఊపందుకుంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఒక్కొక్కటిగా అధికారిక కార్యక్రమాలు, క మిటీల పునరుద్ధరణ జరగుతోంది. సభ్యుల నియామకం జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీని తిరిగి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఇటీవలే ఆదేశించింది. స్పందించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కమిటీలను ఖరా రు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మన జిల్లా కమిటీకి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చైర్‌పర్సన్‌గా నియమితుల య్యారు. కో-చైర్మన్‌గా జహీరాబాద్ ఎంపీ భీంరావు బస్వంత్ రావు పాటిల్ వ్యవహరించనున్నారు. కలెక్టర్ రోనాల్‌రోస్ గౌర వ సభ్యులుగా ఉంటారు. శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్ సింధే, గంప గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్త, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, వేము ల ప్రశాంత్‌రెడ్డి, మహ్మద్ షకీల్ సభ్యులుగా ఉంటారు. ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, వీజీ గౌడ్, పాతూరు సుధాకర్‌రెడ్డి, అరికెల నర్సారెడ్డి తది తరులు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, సీఈఓ రాజారాం, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామకృష్ణారావు, త పాలశాఖ సీనియర్ సూపరింటెం డెంట్‌తోపాటు, జిల్లాలోని 36 మం ది ఎంపీపీలు సైతం ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన రోజు నుంచే కమిటీ పని చేస్తుంది. -
పీఆర్ పరిధిలోకి ‘ఉపాధి హామీ’
గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి కీలకం పీవోలుగా మళ్లీ ఎంపీడీవోలు నూజివీడు : ఇప్పటి వరకు గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో అమలైన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం(ఎన్ఆర్ఈజీఎస్) ఇక నుంచి పంచాయతీరాజ్ శాఖ ఆధీనంలో అమలుకానుంది. ఈ పథకం నిర్వహణపై ప్రభుత్వం ఇటీవల జీవో 139 జారీ చేస్తూ అందులో సిబ్బంది విధివిధానాలను పేర్కొంది. ఈ జీవో ప్రకారం ఈ పథకం అమలులో గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి ఇక నుంచి కీలకపాత్రం వహించనున్నారు. గతంలో జిల్లా స్థాయిలో డ్వామా పీడీ, డివిజన్ స్థాయిలో ఏపీడీ, మండల స్థాయిలో ఎంపీడీవో ప్రొగ్రామింగ్ అధికారి(పీవో)గా ఉండేవారు. అయితే ఎంపీడీవోలు ఈ పథకం నిర్వహణ నుంచి తప్పుకోవడంతో అప్పటి నుంచి అసిస్టెంట్ ప్రొగ్రామింగ్ అధికారి(ఏపీవో)లు ఈ పథకం నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. గ్రామంలో గ్రామసభ ద్వారా ఎంపిక చేసిన పనులను ఈ పథకం కింద కూలీలతో చేయించి, వారి కూలి చెల్లించేవారు. గ్రామస్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల అవకతవకలు ఎక్కువగా చోటుచేసుకునేవి. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. దీనిప్రకారం మళ్లీ ఎంపీడీవోలు ఉపాధిహామీ పథకం నిర్వహణలో మండల స్థాయిలో ప్రధానపాత్ర పోషించనున్నారు. ఏపీవో వీరికి సహాయకారిగా ఉంటారు. ఈసారి ఎంపీడీవో కార్యాలయాల్లోని సిబ్బందిని కూడా ఈ పథకంలో కీలకం చేశారు. గతంలో ఈవోఆర్డీలకు ఈ పథకం నిర్వహణపై ఎలాంటి బాధ్యత ఉండేది కాదు. తాజా జీవోలో మాత్రం వారికి కూడా విధులు కేటాయించారు. మండల పరిషత్ కార్యాలయాలన్నింటికీ నూతన జీవోకు సంబంధించి పలు విధివిధానాలు ఇప్పటికే చేరాయి. వీటిపై అధికారులు, ఏపీవోలు కసరత్తు చేస్తున్నారు. ఎంపీడీవోలు ప్రోగ్రామింగ్ అధికారిగా ఉన్నందుకు గాను ప్రభుత్వం కారు, ఇతర అలవెన్సులు కల్పించింది. కార్యదర్శే కీలకం.. గతంలో ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించని పంచాయతీ కార్యదర్శులకు ఈ నూతన విధానంలో గ్రామస్థాయిలో కీలకపాత్ర పోషించనున్నారు. ఈ పథకాన్ని విజయవంతంగా అమలుచేసే ప్రధాన బాధ్యతను కార్యదర్శులకే అప్పగించారు. గ్రామసభల నిర్వహణ, పనుల గుర్తింపు, నూతన జాబ్‌కార్డుల కోసం పేదల నుంచి దరఖాస్తుల స్వీకరణ తదితర పనులన్నీ కార్యదర్శే చూసుకోవాలి. ఉపాధిహామీలో పనిచేసే క్షేత్ర సహాయకు(ఎఫ్ఏ)లు కార్యదర్శి పర్యవేక్షణలో పనిచేయాల్సి ఉంటుంది. వ్యతిరేకిస్తున్న కార్యదర్శులు.. ఇదిలా ఉండగా ఉపాధిహామీ పథకం పనుల బాధ్యతలను తమకు అప్పగించడంపై చాలాచోట్ల కార్యదర్శులు వ్యతిరేకిస్తున్నారు. అసలే ఒకవైపు రెండు, మూడు పంచాయతీలకు ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న తమకు వర్కులోడ్ అధికంగా ఉండి సతమతమవుతుంటే, మరోవైపు ఉపాధి పనులు అప్పగించడం సమంజసం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పనిభారం పెరగడంతో ఇంటిపన్ను వసూలుకే సమయం చాలక బకాయిలు కోట్లలో పేరుకుపోతున్న పరిస్థితులలో ఉపాధి పనుల బాధ్యతలను కూడా తీసుకుంటే పంచాయతీలను గాలికొదిలేయడమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నేటి నుంచి జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
ఇందూరు : జిల్లా పరిషత్ పాలక వర్గం కొలువుదీరిన నేపథ్యంలో కొత్తగా ఏకగ్రీవంగా ఎన్నికైన జడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు తొలిసారిగా మంగళవారం ప్రారంభం కానున్నాయి. జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు అధ్యక్షతన ఈ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10గంటలకు గ్రామీణాభివృద్ధి శాఖపై జరిగే సమీక్షలో కమిటీ అధ్యక్షులుగా ఉన్న జడ్పీ చైర్మన్‌తో పాటు ఇంకా ఎనిమిది మంది సభ్యులు, శాఖల అధికారులు పాల్గొంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు వ్యవసాయ శాఖపై సమావేశం జరగనుంది. ఈ సమావేశం వ్యవసాయ శాఖ స్థాయీ సంఘానికి చైర్మన్‌గా ఉన్న జడ్పీ వైస్ చైర్ పర్సన్ గడ్డం సుమన రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ రెండు స్థాయీ సంఘాల సమావేశాలకు జడ్పీ చైర్మన్‌తో పాటు జడ్పీ సీఈఓ రాజారాం, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబులతో పాటు ఆ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొంటారు. సభ్యులందరూ శాఖల్లో ఉన్న లొసుగులు, సమస్యలు, అభివృద్ధి పనుల విషయాలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తారు. అందరూ కలిసి వాటికి తీర్మానం చేయగా, త్వరలో జరిగే జడ్పీ సర్వసభ్య సమావేశంలో స్థాయి సంఘాలు చేసిన తీర్మానాలను జడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. ప్రతి కమిటీలో 8 నుంచి 9మంది సభ్యులున్న తరుణంలో సుదీర్ఘ చర్చలు జరిగే ఈ స్థాయీ సంఘాల సమావేశాలకు సంబంధిత సభ్యులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా పరిషత్ అధికారులు సమాచారం అందించారు. 8వ తేదీన ఉదయం 11గంటలకు విద్యా,వైద్య శాఖలపై సంఘ సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం రెండు గంటలకు మహిళా,శిశు సంక్షేమ శాఖలపై సమావేశం జరుగుతుంది. విద్యా,వైద్య స్థాయీ సంఘానికి చైర్మన్‌గా జడ్పీ చైర్మన్ వ్యవహరిస్తారు. ఇటు మహిళా,శిశు సంక్షేమ సంఘానికి అధ్యక్షులుగా మోర్తాడ్ జడ్పీటీసీ ఎనుగందుల అనిత వ్యవహరిస్తారు. 9వ తేదీన ఉదయం 11గంటలకు సాంఘిక సంక్షేమ శాఖపై, మధ్యాహ్నం రెండు గంటలకు ఆర్థిక, ప్రణాళిక శాఖపై సమావేశాలు జరుగుతాయి. సాంఘిక సంక్షేమం స్థాయీ సంఘానికి మాక్లూర్ జడ్పీటీసీ సభ్యురాలు కున్యోత్ లత అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఇటు ఆర్థిక, ప్రణాళిక సంఘానికి జడ్పీ చైర్మన్ దఫేదారు రాజు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. -
అనుమతి తప్పనిసరి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఇకమీదట బోరు బావులను తవ్వాలంటే విధిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హెచ్‌కే. పాటిల్ తెలిపారు. నగరంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 15లోగా రాష్ట్ర వ్యాప్తంగా విఫలమైన బోర్లను పూడ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ నెలాఖరులోగా పూడ్చి వేయాలని గడువు విధించామని చెప్పారు. యుద్ధప్రాతిపదికన ఈ బోర్లను మూసి వేసే పనులు సాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 13,509 నిరుపయోగ బోరు బావులుండగా, ఇప్పటికే 12,385 బావులను పూడ్చి వేశారని వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడైనా విఫలమైన బోర్లను అలాగే వదిలేసి ఉంటే టోల్‌ఫ్రీ నంబరు 18004258666కు ఫోన్ చేసి చెప్పాలని కోరారు. సమాచారం అందినవెంటనే స్థానిక అధికారులు అలాంటి బోర్లను మూసి వేయిస్తారని తెలిపారు. ఇకమీదట బోర్లు విఫలమైతే, అప్పటికప్పుడు బోరు బండ్ల యజమానులే వాటిని పూడ్చి వేయాల్సి ఉంటుందని చెప్పారు. కాగా కేపీఎస్సీ-11 ఎంపిక జాబితాను తిరస్కరించాలని మంత్రి వర్గం ఏకగ్రీవంగా తీర్మానించిందని తెలిపారు. దీనిపై ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరూ రాజకీయాలకు పాల్పడకూడదని ఆయన హితవు పలికారు. మూడు స్థానాలకు జరుగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తాను ఎన్నికల పరిశీలకుడుగా వ్యవహరిస్తున్న బెల్గాం జిల్లా చిక్కోడిలో కాంగ్రెస్ అభ్యర్థి గణేశ్ హుక్కేరి 70 వేల ఓట్ల తేడాతో విజయం సాధిస్తాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు.