సాక్షి, హైదరాబాద్: పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష తుది కీని ఏపీపీఎస్సీ మంగళవారం ప్రకటించింది. ఇందులో పేపరు-1 జనరల్ స్టడీస్ ‘ఎ’ సిరీస్‌లో 39వ ప్రశ్నకు రెండు జవాబులను(3 లేదా 4వ జవాబు) ఆప్షన్లుగా పేర్కొంది. రెండో పేపరు గ్రామీణాభివృద్ధి ‘ఎ’ సిరీస్‌లో 129వ ప్రశ్నను రద్దు చేసింది. 2,677 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి గత నెల 23న నిర్వహించిన పరీక్షకు 71 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షల ప్రాథమిక కీని గత నెలలోనే విడుదల చేసి, దానిపై ఈ నెల 4 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. అభ్యంతరాలపై నిఫుణుల కమిటీ సూచనల మేరకు రెండు పేపర్లలో సవరణలు చేసి ఫైనల్ కీని విడుదల చేసింది. వారంలో కలెక్టర్లకు జిల్లాల వారీగా మెరిట్ జాబితాలను పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.