
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లాలో 29 మంది ఎంపీలతో కూడిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ శనివారం పర్యటించనుంది. పద్మనాభం మండలం రెడ్డిపల్లి గ్రామ సచివాలయంతో పాటు అదే జిల్లాలోని ఆనందపురం మండలం శొంఠ్యాం, చందక గ్రామాల్లో పర్యటించి అక్కడ చేపడుతోన్న పనులను పరిశీలించనుంది.
ఏపీతో పాటు తమిళనాడు, మహారాష్ట్రల్లో క్షేత్రస్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖ చేపడుతోన్న కార్యక్రమాలను పరిశీలించేందుకు శనివారం నుంచి ఈ నెల 31 వరకు ఎంపీల బృందం పర్యటించనుంది. ఇందులో భాగంగా వైఎస్సార్ జగనన్న భూ రక్ష, భూ సర్వే కార్యక్రమంలో గ్రామ కంఠాల పరిధిలోని ఇళ్ల యజ మానులకు కొత్తగా యాజమాన్య హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించనుంది.
ఇది కూడా చదవండి: జాతీయ స్థాయిలో సత్తాచాటిన కాకినాడ.. స్మార్ట్ సిటీ అవార్డుల్లో రెండో స్థానం
Comments
Please login to add a commentAdd a comment