parliament standing committee
-
నేడు విశాఖ జిల్లాలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పర్యటన
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లాలో 29 మంది ఎంపీలతో కూడిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ శనివారం పర్యటించనుంది. పద్మనాభం మండలం రెడ్డిపల్లి గ్రామ సచివాలయంతో పాటు అదే జిల్లాలోని ఆనందపురం మండలం శొంఠ్యాం, చందక గ్రామాల్లో పర్యటించి అక్కడ చేపడుతోన్న పనులను పరిశీలించనుంది. ఏపీతో పాటు తమిళనాడు, మహారాష్ట్రల్లో క్షేత్రస్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖ చేపడుతోన్న కార్యక్రమాలను పరిశీలించేందుకు శనివారం నుంచి ఈ నెల 31 వరకు ఎంపీల బృందం పర్యటించనుంది. ఇందులో భాగంగా వైఎస్సార్ జగనన్న భూ రక్ష, భూ సర్వే కార్యక్రమంలో గ్రామ కంఠాల పరిధిలోని ఇళ్ల యజ మానులకు కొత్తగా యాజమాన్య హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించనుంది. ఇది కూడా చదవండి: జాతీయ స్థాయిలో సత్తాచాటిన కాకినాడ.. స్మార్ట్ సిటీ అవార్డుల్లో రెండో స్థానం -
పొగరాయుళ్లకు కేంద్రం షాక్! ఇక సిగరెట్లు అలా లభించడం కష్టమే?
పొగరాయుళ్లకు కేంద్రం షాకివ్వనుంది. రానున్న రోజుల్లో విడిగా సిగరెట్ల అమ్మకాల్ని బ్యాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని అరికట్టేలా సింగిల్ సిగరెట్ల అమ్మకాల్ని బ్యాన్ చేయాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. వదులుగా ఉన్న సిగరెట్ల అమ్మకాలు పొగాకు నియంత్రణపై చేస్తున్న ప్రచారాన్ని ప్రభావితం చేస్తున్నాయని కమిటీ సభ్యులు వాదించారు. దీంతో పాటు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్ట్‌లలో స్మోకింగ్ జోన్లను తొలగించాలని కమిటీ సిఫార్స్ చేసింది. స్టాండింగ్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తే, పార్లమెంట్ త్వరలో సింగిల్ సిగరెట్ల అమ్మకాల్ని నిషేధించవచ్చు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు 3 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ఇ-సిగరెట్ల అమ్మకం, వాడకాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. జీఎస్టీ అమలు తర్వాత కూడా పొగాకు ఉత్పత్తులపై పన్నులో పెద్దగా పెరుగుదల లేదని స్టాండింగ్ కమిటీ గుర్తించింది. మద్యం, పొగాకు ఉత్పత్తుల వినియోగం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని కమిటీ హైలైట్ చేసింది.తాజా పన్ను శ్లాబుల ప్రకారం..బీడీలపై 22 శాతం, సిగరెట్లపై 53 శాతం, పొగలేని పొగాకుపై 64 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. మరోవైపు, పొగాకు ఉత్పత్తులపై 75శాతం జీఎస్టీ విధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరింది. ఏడాదికి 3.5లక్షల మందికి మరణం పలు నివేదికల ప్రకారం, మన దేశంలో స్మోకింగ్ కారణంగా ఏడాదికి 3.5 లక్షల మంది మరణిస్తున్నట్లు తేలింది. 2018 లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ నిర్వహించిన ఒక సర్వేలో ధూమపానం చేసే వారిలో 46 శాతం మంది నిరక్షరాస్యులు, 16 శాతం మంది కాలేజీ విద్యార్ధులు ఉన్నారు. ఫౌండేషన్ ఫర్ స్మోక్ ఫ్రీ వరల్డ్ నివేదిక ప్రకారం.. భారత్‌లో ప్రతి సంవత్సరం సుమారు 6.6 కోట్ల మంది సిగరెట్లు తాగుతుండగా, 26 కోట్లకు పైగా ఇతర పొగాకు ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. పొగాకు వాడకం వల్ల భారతదేశంలో సుమారు 21శాతం మందికి క్యాన్సర్ సోకుతున్నట్లు ఓ అధ్యయనం వెలుగులోకి తెచ్చింది. -
ఐటీఐఆర్.. లేదంటే అదనపు ప్రోత్సాహకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లాంటి కొత్త రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) మంత్రిత్వ శాఖ మరింత సాయం అందించాలని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కోరారు. ఐటీఐఆర్ వంటి సమాంతర ప్రాజెక్టు లేదా అదనపు ప్రోత్సాహకాన్ని వెంటనే ప్రకటించే అంశంలో తమకు సహకరించాలన్నారు. రాష్ట్రంలో రెండురోజులుగా పర్యటిస్తున్న పార్లమెంటు సభ్యుడు శశిథరూర్ నేతృత్వంలోని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీతో కేటీఆర్ బుధవారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను కమిటీకి మంత్రి వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూ త్న కార్యక్రమాలు కొనసాగితే హైదరాబాద్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని పార్లమెంటరీ కమిటీ ప్రశంసించింది. తెలంగాణలో అమలవుతున్న విధానాలను ఆయా రాష్ట్రాలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేసే అంశంపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తామని కమిటీ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ గవర్నెన్స్ సేవలు, ఇన్నోవేషన్ రంగంలో ఇంక్యుబేటర్ల ఏర్పాటు, టీ ఫైబర్ ప్రాజెక్టులను కమిటీ ప్రశంసించింది. ఐటీ రంగం అభివృద్ధితో పాటు ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరవేయడంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశానికి ఉపయుక్తంగా ఉంటాయని కమిటీ పేర్కొంది. విధానపర నిర్ణయాల వల్లే పెట్టుబడులు: కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్ఐపాస్తో పాటు ఐటీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాల ద్వారా తెలంగాణకు పెట్టుబడులు వచ్చా యని కేటీఆర్ పార్లమెంటరీ కమిటీకి వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీలు హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేశాయన్నారు. ఐటీ రంగం అభివృద్ధి ద్వారా ఉద్యోగ కల్పనతో పాటు ఐటీ ఎగుమతులు కూడా భారీగా పెరిగాయన్నారు. ఆవిష్కరణల వాతావరణం ప్రోత్సహించేందుకు టీ హబ్, వీ హబ్, అగ్రి హబ్, బీ హబ్, రిచ్, టీ వర్క్స్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు కేటీఆర్ వివరించారు. మీ సేవ ద్వారా ప్రభుత్వ సేవలు, టి వాలెట్ ద్వారా సాధించిన మైలు రాళ్లను వివరించడంతో పాటు, ఇంటింటికీ ఇంటర్నెట్ లక్ష్యంతో చేపట్టిన టీ ఫైబర్ ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డ్రోన్ టెక్నాలజీ వినియోగాన్ని వివరిస్తూ సైబర్ సెక్యూరిటీ కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామన్నారు. భూ పరిపాలన కోసం రూపొందించిన ధరణి ప్రత్యేకతలను వివరించారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు ఐటీ శాఖ ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్‌తో పాటు కమిటీ సభ్యులకు మంత్రి కేటీఆర్ జ్ఞాపికలను అందజేసి సన్మానించారు. -
సీబీఐ కేసు: రఘురామకృష్ణం రాజు ఔట్
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల కాలంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ రఘురామకృష్ణం రాజుపై వేటుపడింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి అతన్ని తప్పించారు. సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్‌గా వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరిని నియమించారు. అక్టోబర్ 9 నుంచే మార్పులు చేర్పులు అమల్లోకి వస్తాయని శుక్రవారం లోక్‌సభ సచివాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రుణాల ఎగవేత కేసులో రాఘురామకృష్ణం రాజుపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. (రఘురామకృష్ణంరాజుపై సీబీఐ కేసు) పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. రూ. 826.17 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఫిర్యాదు అందినట్లు, నిధులను దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డట్టు అభియోగాలు మోపింది. ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నందున అతన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. -
పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల్లో మనోళ్లు
న్యూఢిల్లీ: శాఖల వారీగా మరింత జోరుగా పరిపాలన సాగించేందుకు కేంద్రం సిద్ధమైంది. మంగళవారం స్టాండింగ్ కమిటీలకు సభ్యులను నియమించింది. అన్ని పార్టీల ఎంపీలనూ పరిపాలనలో భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్నిస్తూ... స్టాండింగ్ కమిటీల్లో వివిధ పార్టీల ఎంపీలకు బాధ్యతలు అప్పగించింది. ఈ కమిటీల్లో చాలా వాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఎంపీలను సభ్యులుగా నియమించింది. ఆయా స్టాండింగ్ కమిటీలకు ఎంపికైన తెలుగు రాష్ట్రాల ఎంపీల వివరాలు.. స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆర్థిక శాఖ మిథున్ రెడ్డి, సీఎం. రమేష్, జీవీఎల్ నరసింహారావు పరిశ్రమల శాఖ వైఎస్ అవినాష్ రెడ్డి వాణిజ్య శాఖ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్ఆర్డీ లావు శ్రీకృష్ణదేవరాయలు , గల్లా జయదేవ్ ఆరోగ్యశాఖ టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత న్యాయశాఖ టీఆర్ఎస్ ఎంపీలు సురేష్‌రెడ్డి, వెంకటేష్ నేత ఐటీ శాఖ వైఎస్ఆర్సీ ఎంపీ సత్యనారాయణ, టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి రక్షణ శాఖ రేవంత్ రెడ్డి, కోటగిరి శ్రీధర్, లక్ష్మీకాంత్ ఇంధన శాఖ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్మిక శాఖ టీఆర్ఎస్ ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్ రైల్వే శాఖ రెడ్డప్ప, సంతోష్ కుమార్ పట్టణాభివృద్ధి శాఖ బండి సంజయ్ కెమికల్ అండ్ ఫర్టిలైజర్ శాఖ నందిగం సురేష్ బొగ్గు,ఉక్కు శాఖ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్ గ్రామీణ అభివృద్ధి శాఖ తలారి రంగయ్య -
ఆయుధాల్లో సగానికి పైగా పురాతనమైనవే!
న్యూఢిల్లీ : అమెరికా, చైనా లాంటి దేశాల్లో రక్షణ శాఖకు కేటాయింపులు భారీగా ఉండగా.. మన దేశంలో మాత్రం ఆ కేటాయింపులు కేవలం రూ.25 వేల కోట్లకు మించడం లేదు. ఆయా దేశాల్లో ఆర్మీ మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా వారు ఆయుధ సామాగ్రిని సమకూరుస్తుండగా మన దేశంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మన సైన్యం దగ్గర ఉన్న ఆయుధ సామాగ్రిలో దాదాపు 70 శాతం చాలా పురాతనమైనవేనని ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ శరత్ చంద్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి చెప్పారు. ‘ప్రస్తుతం ఉన్న ఆయుధ సామాగ్రిలో 68శాతం పాతవే ఉన్నాయి. 24 శాతం మాత్రమే ఈ కాలం నాటివి. మిగతా 8 శాతం ఆర్ట్ విభాగానికి చెందినవి. మేకిన్ ఇండియాలో భాగంగా ఆయుధాల ఆధునీకీకరణ కోసం 25 కార్యక్రమాలు ప్రారంభించాం. కానీ సరైన నిధుల కేటాయింపులు లేనందున ప్రస్తుతం వీటన్నింటిని నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌పై మేము చాలా ఆశలు పెట్టుకున్నాం. కానీ చాలా తక్కువ కేటాయింపులు చేశారు’ అన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్లో ఆర్మీ ఆధునీకీకరణ కోసం రూ.31 వేల కోట్లను కోరగా, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కేవలం రూ.21,338 కోట్లను మాత్రమే కేటాయించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 125 ప్రాజెక్టులకే రూ.29 వేల కోట్లు అవసరం ఉండగా, కేంద్రం కేటాయించిన రూ.21 వేల కోట్లు వాటికే సరిపోవని పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం, నూతన ఆయుధాల కొనుగోలు ఇక సాధ్యం కాదని తెలిపారు. ముఖ్యంగా ప్రస్తుతం వినియోగిస్తున్న టీ-72 యుద్ద ట్యాంకులు 1980 నాటివని, వీటి స్థానంలో కొత్త కంబాట్ వాహానాలను కొనుగోలు చేయాలని భావించినట్టు చెప్పారు. కానీ అరకొర బడ్జెట్ కేటాయింపులతో ఇప్పుడు వీటి కొనుగోలుకు మరికొన్ని సంవత్సరాలు వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్తులో రెండు యుద్దాలు వచ్చే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లో ఆర్మీ ఆధునీకీకరణ, లోటుపాట్లను పూరించుకోవడం వంటి వాటిపై దృష్టి సారించాల్సినవసరం ఉందని పార్లమెంటరీ కమిటీకి నివేదించామని లెఫ్టినెంట్ జనరల్ శరత్ చంద్ తెలిపారు. ప్రస్తుతం చాలా పెద్ద సంఖ్యలో చైనా వ్యూహాత్మక రహదారుల నిర్మాణం చేపడుతుందని, ఉత్తర సరిహద్దు వెంట మనం కూడా మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అడిగిన దాని కన్నా తక్కువగా సుమారు రూ. 902 కోట్లు మాత్రమే కేటాయించినట్టు పేర్కొన్నారు. మొత్తం మీద తాము అడిగిన దానికి, కేంద్ర కేటాయింపులకు మధ్య రూ. 12,296 కోట్లు వ్యత్యాసం ఉందని లెఫ్టినెంట్ జనరల్ శరత్ చంద్ అన్నారు. -
‘డిటెన్షన్’ ఉండాల్సిందే!
న్యూఢిల్లీ: దేశంలో ఎనిమిదో తరగతి వరకు డిటెన్షన్ (వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకపోతే విద్యార్థిని తిరిగి అదే తరగతిలో కొనసాగించడం) విధానం అమల్లో లేకపోవడం విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతకరమని పార్లమెంటు స్థాయీ సంఘం స్పష్టం చేసింది. తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలనే నిబంధన లేకపోవడం వల్ల విద్యార్థుల్లో అభ్యసనా నైపుణ్యం, వికాసం, అభివృద్ధి తగ్గిపోతుందని హెచ్చరించింది. విద్యా హక్కు చట్టం ప్రకారం కూడా 8వ తరగతి వరకు ‘డిటెన్షన్’ విధానం లేకపోవడం సరికాదని పేర్కొంటూ పార్లమెంటుకు గురువారం తమ నివేదికను సమర్పించింది. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులు వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలనే నిబంధన లేదు. ఏదైనా తరగతి పూర్తికాగానే విద్యార్థులు పైతరగతికి వెళ్తున్నారు.