మర్పల్లి: రవాణా వ్యవస్థ అభివృద్ధి చెం దినప్పుడే పల్లెసీమలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని పంచలింగాల గ్రామం నుండి వికారాబాద్ వరకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నడిపే ఆర్టీసీ బస్సు సర్వీసును వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావుతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు స్థానిక నాయకులకు విన్నపం మేరకు రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఆర్టీసీ అధికారులను ఆదేశించటంతో ఈ బస్సుసర్వీసును ప్రారంభిం చినట్లు పేర్కొన్నారు. ఈ బస్సు నడుపటంతో పంచలింగాల, నర్సాపూర్, పిల్లిగుండ్లతోపాటు చుట్టు ప్రక్కల గ్రామాలకు, మోమిన్‌పేట్ మండలం కొత్తకోల్‌కుందా, పాత కోల్‌కుందా, అమ్రాదికుర్ధు, వనంపల్లి గ్రామాల ప్రజలకు, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే సం జీవరావు మాట్లాడుతూ తార్‌రోడ్డు, బీటీ రోడ్డు ఉన్న ప్రతి కుగ్రామానికి ఆర్టీసీ బస్సులు నడిపే విషయాన్ని మంత్రి మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకుపోతానన్నారు.
బస్సులో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ప్రయాణం
పంచలింగాల నుండి వికారాబాద్ వరకు వెళ్ళే ఆర్టీసీ బస్సు ప్రారంభించిన ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజీవరావులతో పాటు మర్పల్లి ఎంీ పపీ సుమిత్రమ్మ, వైస్ ఎంపీపీ అంజ య్య, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కొండల్‌రెడ్డి, తుమ్మలపల్లి ఎంపీటీసీ సంజీవరెడ్డి, పార్టీ నాయకులు మోమిన్‌పేట్ వరకు బస్సులో ప్రయాణించారు.
సమయం ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు బస్సుల్లో వెళితే సామాన్య ప్రజలు సైతం ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కొండల్‌రెడ్డి, ఎం. రామేశ్వర్, అనంత్‌రెడ్డి, యాదయ్య, అశోక్, నాయబ్‌గౌడ్, మల్లేశం, నారాయణ్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, నాగేష్, ధరంసింగ్, కిషన్, కిష్టయ్య, అడివయ్య,హన్మయ్య, అడివయ్య, సర్దార్, విజయ్ పాల్గొన్నారు.
రవాణా వ్యవస్థతోనే పల్లెల అభివృద్ధి
Published Tue, Aug 12 2014 12:23 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement