marpalli
-
చెవిలో హియర్ ఫోన్స్ పెట్టుకుని పట్టాలపై వెళ్తుండగా..
సాక్షి, మర్పల్లి(వికారాబాద్): గూడ్స్‌రైలు ఢీకొని బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని కొత్లాపూర్‌లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మండల పరిధిలోని కొత్లాపూర్‌కు చెందిన శానికే రాజిరెడ్డి కుమారుడు వసంత్‌రెడ్డి (16) మోమిన్‌పేట్ మండల కేంద్రంలోని ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్ద నూర్పిడి చేసి కుప్పగా పోసిన మొక్కజొన్నలపై కప్పి ఉన్న ప్లాస్టిక్ కవర్‌ను తీసేందుకు బైక్‌పై వెళ్లాడు. పొలం రైలు పట్టాల పక్కన ఉంది. వసంత్‌రెడ్డి పట్టాల పక్కన తన బైక్‌ను ఆపి చెవిలో హియర్ ఫోన్స్ పెట్టుకుని ఫోన్లో మాట్లాడుతూ పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. బీదర్ నుంచి మర్పల్లి మీదుగా వికారాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ఢీకొంది. దీంతో వసంత్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులు అందజేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వికారాబాద్ రైల్వే పోలీసులు తెలిపారు. -
పెళ్లి దుస్తుల్లోనే విగతజీవిగా ప్రవళిక.. పాడె మోసిన ఎమ్మెల్యే ఆనంద్
సాక్షి, వికారాబాద్: వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయిన సంఘటనతో మోమిన్‌పేట, రావులపల్లిలో విషాదఛాయలు నెలకొన్నాయి. మోమిన్‌పేటకు చెందిన సింగిడి దర్శన్‌రెడ్డి కుమార్తె ప్రవళికను మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన నవాజ్‌రెడ్డికి ఇచ్చి శుక్రవారం వివాహం జరిపించారు. ఆదివారం ఉదయం తమ బంధువులతో కలిసి మోమిన్‌పేటకు వచ్చిన నవాజ్‌రెడ్డి విందు ముగించుకుని సాయంత్రం కారులో స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎంత చెప్పినా వినకుండా కారు డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డి వాహనాన్ని వాగు దాటించే ప్రయ త్నం చేశాడు. నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. ఈ దుర్ఘటనలో నవ వధువుతో పాటు పెళ్లి కొడుకు రెండో సోదరి శ్వేత మృతిచెందారు. బాలుడు శశాంక్‌రెడ్డి ఆచూకీ లభ్యం కాలేదు. చదవండి: బంజారాహిల్స్: బ్యూటీ అండ్ స్పా పేరుతో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్ సహాయక చర్యల్లో ఎమ్మెల్యే.. పెళ్లి కారు వాగులో కొట్టుకుపోయిన సమాచారం తెలుసుకున్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సోమవారం ఉదయమే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పోలీసులతో కలిసి గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. వాగు ప్రవాహం, బురద నీటిలో నాలుగు కిలోమీటర్లు నడిచారు. వధవు ప్రవళిక, పెళ్లి కొడుకు అక్క శ్వేత మృతదేహాలు దొరకడంతో స్వయంగా పాడెకట్టి, ఒడ్డుకు చేర్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మోమిన్‌పేటలో ప్రవళిక అంత్యక్రియలు నిర్వహించారు. అందరితో కలుపుగోలుగా ఉండే ప్రవళిక పెళ్లి దుస్తుల్లోనే విగత జీవిగా కనిపించడం అందరినీ కంటతడి పెట్టించింది. నవ వధువు తల్లిదండ్రులు రోధించిన తీరు కలచివేసింది. మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి సబితా వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయిన కారు ప్రమాదంలో మృతి చెందిన నవ వధువు ప్రవళిక కుటుంబాన్ని, రావులపల్లిలో వరుడు నవాజ్ రెడ్డి కుటుంబాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఆమెతోపాటు చేవెళ్ల ఎంపీ రంజీత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మేతుకు ఆనంద్ ఉన్నారు. అదే విధంగా శంకర్పల్లి మండలం కొత్తపల్లి ఎల్లమ్మ వాగులో కారులో గల్లంతై మృతి చెందిన ఎన్కతల గ్రామానికి చెందిన వెంకటయ్య కుటుంబ సభ్యులను కూడా మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాలు పడే సమయంలో రోడ్లపై, కల్వర్టుల వద్ద వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ చెప్పినట్లు వెల్లడించారు. డ్రైవర్ బతికే ఉండు.. వాగు ఉధృతిలో కొట్టుకుపోయిన కారు డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డి ఆదివారం రాత్రే ప్రమాదం నుంచి బయటపడ్డాడని డీఎస్పీ సంజీవరావు తెలిపారు. మర్పల్లి పీఎస్‌లో సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. వరదలో కొట్టుకుపోయిన కారు కిలోమీటర్ దూరం వెళ్లి, చెట్టు కొమ్మలకు తట్టుకుని ఆగిందన్నారు. ఈ సమయంలో డ్రైవర్ కారులో నుంచి నీటిలో దూకి, ఈదుకుంటూ వెళ్లి రెండు గంటల పాటు చెట్టు కొమ్మలు పట్టుకుని ఉన్నాడన్నారు. వరద తగ్గిన తర్వాత అర్ధరాత్రి ఒడ్డుకు చేరుకున్నట్లు తెలిపారు. ఎవరైనా తనకు ప్రమాదం తలపెట్టే అవకాశం ఉందని భయపడి అదే రాత్రి అంరాద్కుర్దు గ్రామానికి వెళ్లి బంధువుల ఇంట్లో దాక్కున్నట్లు స్పష్టంచేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి రాఘవేందర్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వృద్ధుడి దుర్మరణం మోమిన్‌పేట మండల పరిధిలోని ఏన్కతలకు చెందిన శామల వెంకటయ్య(60) ఆదివారం గ్రామానికి చెందిన శ్రీనివాస్, సాయిలతో కలిసి కారులో కౌకుంట్లకు బయలుదేరారు. తిరిగి వచ్చే క్రమంలో శంకర్పల్లి మండలం కొత్తపల్లి వద్ద కారు వరద నీటిలో కొట్టుకుపోయింది. గ్రామస్తుల సహకారంతో శ్రీనివాస్, సాయి ప్రాణాలతో బయటపడగ వెంకటయ్యమృతి చెందాడు. సోమవారం ఏన్కతలలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. -
తీవ్ర విషాదం: వాగులో కొట్టుకుపోయిన కారు.. నవ వధువు మృతి
సాక్షి, వికారాబాద్: ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన నవ వధువును వాగు బలితీసుకుంది. కాళ్లపారాణి ఆరకముందే ఆమె మృత్యువాత పడింది. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం అలుముకుంది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన మైలారం బాల్‌రెడ్డి కుమారుడు నవాజ్‌రెడ్డికి మోమిన్‌పేట మండల కేంద్రానికి చెందిన ప్రవళ్లికతో శుక్రవారం వివాహం జరిగింది. విందు కోసం వధూవరులు, బంధువులు ఆదివారం మోమిన్‌పేటకు వెళ్లారు. సాయంత్రం స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ సమీపంలోని వాగు దాటేక్రమంలో ప్రవాహ తీవ్రతను అంచనా వేయని డ్రైవర్ కారును అలాగే ముందుకు తీసుకెళ్లాడు. దీంతో అందులో ఉన్న నవ దంపతులతో పాటు పెళ్లికూతురు సోదరి, వరుడి అక్క, చెల్లి, ఎనిమిదేళ్ల బాలుడు ఇషాంత్‌రెడ్డి గల్లంతయ్యారు. వరదలో గల్లంతైన వారిలో వరుడు, ఆయన సోదరి మాత్రం ప్రాణాలతో బయటపడగా.. వధువు ప్రవళ్లికతో పాటు మరొకరి మృతదేహం సోమవారం లభ్యమైంది. మరో ఇద్దరికి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వికారాబాద్ డిఎస్పీ సంజీవరావు తెలిపారు. చదవండి: విషాదం: వరదలో కొట్టుకుపోయిన కారు.. -
రోడ్డు ప్రమాదంలో రాజస్థాన్ వాసి మృతి
సాక్షి, మర్పల్లి: బతుకు దెరువుకోసం వచ్చిన ఓ యువకుడు బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని నర్సాపూర్ పెద్దతండా, పట్లూర్ గ్రామాల మధ్య శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లా జార్‌క్లా గ్రామానికి చెందిన అంజుమ్‌ఖాన్ (32) నర్సాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద మూడేళ్లుగా జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల బక్రీద్ పండగ కోసం ఇంటి వెళ్లివచ్చాడు. తిరిగి రెండు నెలల క్రితం ఇక్కడకు వచ్చాడు. శుక్రవారం సాయంత్రం నర్సాపూర్‌లో నమాజ్ చేసుకుని ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. కంకర మిషన్ సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న 11 కేవీ విద్యుత్ స్తంభానికి ఢీకొన్నాడు. ఈ ఘటనలో అంజుమ్ ఖాన్ తల కు మతమైన గాయాలయ్యాయి. మర్పల్లి జెడ్పీటీసీ పబ్బె మధుకర్, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో మర్పల్లి ఏఎస్ఐ కె.మోహన్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని మర్పల్లి ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటు 6గురు సంతానం ఉన్నట్లు తెలిసింది. -
పోలీస్ స్టేషన్లో అనుమానిత వ్యక్తులు
మర్పల్లి : మర్పల్లి సంతకు వచ్చిన తొమ్మిది మంది బిహార్ యువకులను స్థానికులు మంగళవారం పోలీసులకు పట్టించారు. మర్పల్లి సమీపంలోని వినోద్ ఫాంహౌస్‌లో పని చేసేందుకు వీరు హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మర్పల్లి బస్టేషన్లో దిగారు. ఫాంహౌస్‌కు వెళ్లేకన్నా ముందు తమకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు మర్పల్లి సంతలో తిరిగారు. వీరిపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు యువకులను స్టేషన్‌కు తరలించారు. దొంగల ముఠాలు సంచరిస్తున్నాయనే వదంతుల నేపథ్యంలో వీరిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున పోలీస్టేషన్‌కు తరలివచ్చారు. జనాల సమక్షంలోనే వీరిని తనిఖీ చేసిన పోలీసులు ఆధార్ కార్డులు పరిశీలించి బీహార్‌వాసులుగా గుర్తించారు. ఫాంహౌస్‌లో పని చేసేందుకు వచ్చామని చెప్పడంతో యజమా ని వినోద్‌కు, అందులో పనిచేసే సూపర్వైజర్ రవికి ఫోన్ చేసి పిలిపించారు. పీఎస్‌కు చేరుకున్న వినోద్, రవి ఫాంహౌస్‌లో పనుల నిమిత్తం తామే వారిని పిలిపించామని చెప్పారు. వీరి సొంతపూచీకత్తుపై యువకులను పంపించేశారు. -
'అతను లేని జీవితం నాకొద్దు'
రేగోడ్: చదువుకుని వృద్ధిలోకి రావాల్సిన ఓ బంగారు తల్లి.. 'ఆ యువకుడు లేని జీవితాన్ని ఊహించుకోలేను' అంటూ అఘాయిత్యానికి పాల్పడింది. ప్రేమ అని తను నమ్మిన ఆ భావనే చివరికి ఒంటికి నిప్పంటించుకునేలా పురికొల్పిన ఈ సంఘటన మెదక్ జిల్లాలో చర్చనీయాంశమైంది. జిల్లాలోని రేగోడ్ మండలం మార్పల్లికి చెందిన 13 ఏళ్ల బాలికకు అదే గ్రామానికి చెందిన శివకుమార్ అనే యువకుడికి మధ్య చనువుపెరిగింది. మంచీచెడులు తెలుసుకోలేని వయసులో తనది ప్రేమేనని నమ్మిందా అమ్మాయి. కాగా, గతేడాది సెప్టెంబర్ లో శివకుమార్ పాముకాటుకు బలయ్యాడు. అతను చనిపోయిన దగ్గర్నుంచి దిగాలుగా ఉంటోన్న బాలిక ఈనెల 16న ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా కాలిపోయిన ఆమెను కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ సోమవారం చనిపోయిన ఆ బాలిక ఇచ్చిన మరణవాగ్మూలాన్ని రేగోడ్ ఎస్ఐ రాచకొండ రవీందర్ మీడియాకు తెలిపారు. 'శివకుమార్ ను తాను ప్రేమించానని, అతడు లేని జీవితం ఊహించలేనని, అందుకే ఆత్మహత్య చేసుకున్నా'అని బాలిక చెప్పినట్లు ఎస్సై వెల్లడించారు. -
నీటి కోసం తండావాసుల నిరసన
మర్పల్లి (రంగారెడ్డి జిల్లా) : ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు తమ సమస్యను పట్టించుకోవటం లేదంటూ తండావాసులు ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. పరిష్కారానికి హామీ దక్కించుకున్నారు. రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని నర్సాపూర్ పంచాయతీలోని తండావాసులు గ్రామంలోని బోర్లు పనిచేయక నీటికి ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక నాయకులకు చెప్పినా ఫలితం కానరాక దాదాపు 50 మంది వరకు తరలివెళ్లి శుక్రవారం మధ్యాహ్నం మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులను బయటకు వెళ్లనీయలేదు. శనివారం గ్రామానికి వచ్చి, బోర్లు పనిచేసేలా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు వెనుదిరిగారు. -
రవాణా వ్యవస్థతోనే పల్లెల అభివృద్ధి
మర్పల్లి: రవాణా వ్యవస్థ అభివృద్ధి చెం దినప్పుడే పల్లెసీమలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని పంచలింగాల గ్రామం నుండి వికారాబాద్ వరకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నడిపే ఆర్టీసీ బస్సు సర్వీసును వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు స్థానిక నాయకులకు విన్నపం మేరకు రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఆర్టీసీ అధికారులను ఆదేశించటంతో ఈ బస్సుసర్వీసును ప్రారంభిం చినట్లు పేర్కొన్నారు. ఈ బస్సు నడుపటంతో పంచలింగాల, నర్సాపూర్, పిల్లిగుండ్లతోపాటు చుట్టు ప్రక్కల గ్రామాలకు, మోమిన్‌పేట్ మండలం కొత్తకోల్కుందా, పాత కోల్‌కుందా, అమ్రాదికుర్ధు, వనంపల్లి గ్రామాల ప్రజలకు, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే సం జీవరావు మాట్లాడుతూ తార్రోడ్డు, బీటీ రోడ్డు ఉన్న ప్రతి కుగ్రామానికి ఆర్టీసీ బస్సులు నడిపే విషయాన్ని మంత్రి మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకుపోతానన్నారు. బస్సులో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ప్రయాణం పంచలింగాల నుండి వికారాబాద్ వరకు వెళ్ళే ఆర్టీసీ బస్సు ప్రారంభించిన ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజీవరావులతో పాటు మర్పల్లి ఎంీ పపీ సుమిత్రమ్మ, వైస్ ఎంపీపీ అంజ య్య, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొండల్‌రెడ్డి, తుమ్మలపల్లి ఎంపీటీసీ సంజీవరెడ్డి, పార్టీ నాయకులు మోమిన్‌పేట్ వరకు బస్సులో ప్రయాణించారు. సమయం ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు బస్సుల్లో వెళితే సామాన్య ప్రజలు సైతం ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొండల్‌రెడ్డి, ఎం. రామేశ్వర్, అనంత్‌రెడ్డి, యాదయ్య, అశోక్, నాయబ్‌గౌడ్, మల్లేశం, నారాయణ్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, నాగేష్, ధరంసింగ్, కిషన్, కిష్టయ్య, అడివయ్య,హన్మయ్య, అడివయ్య, సర్దార్, విజయ్ పాల్గొన్నారు. -
నీటి వనరులపై చిన్నచూపు
మర్పల్లి, న్యూస్‌లైన్: ప్రభుత్వం చిన్ననీటి వనరులపై చిన్నచూపు ప్రదర్శిస్తోంది. దీంతో మండలంలోని చెరువుల్లో, కుంటల్లో పుష్కలంగా నీరు ఉన్నా రైతులకు ప్రయోజనం లేకుండాపోతోంది. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయి. కాగా కొన్ని చెరువులు నాసిరకంగా నిర్మాణ పనులు చేపట్టటంతో నీరు లేక కళాహీనంగా దర్శనమిస్తున్నాయి. చెరువులు పూడిక మట్టితో నిండి ఉన్నాయి. మరికొన్ని చెరువుల్లో పిచ్చిమొక్కలు పెరగడంతో పూర్తిస్థాయిలో నీరు చేరటం లేదు. దీంతో ఆయకట్టు భూములకు సాగు నీరందే పరిస్థితి లేకుండాపోతోంది. సరిపడా అందని సాగునీరు మండలంలో 11 చెరువులు, 22 కుంటలు ఉన్నాయి. వీటి లోఅతిపెద్ధ ప్రాజెక్టు కొంషేట్పల్లి. కొంషేట్పల్లి ప్రాజెక్టు కలుపుకోని మండలంలో చెరువుల కింద 4,100 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కానీ 500 ఎకరాలకు మించి సాగునీరు అందించిన దాఖలు లేవు. కొంషేట్పల్లి ప్రాజెక్టు కింద ఖరీఫ్ సాగుగా 1,250 ఎకరాలు, రబీలో 250 ఎకరాలకు సాగునీరు అందించాలి. కానీ ఏనాడూ పూర్తిస్థాయిలో సాగునీరు అందించిన దాఖలు లేవు. ప్రాజెక్టు తూముల నుంచి నీరు వృథాగా పోతోంది. కొంషేట్పల్లి ప్రాజెక్టు కుడి కాల్వ తూము పాడై నాలుగేళ్లవుతుఆన్న ఇంతవరకు మరమ్మతులకు నోచుకోవడంలేదు. దీంతో నీరు వృథాగా పోతోంది. కుడి, ఎడమ కాల్వలు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. దీంతో నీరు ముందుకు వెళ్లని పరిస్థితి. కాల్వలు మరమ్మతులకు నోచుకోకపోవటంతో ప్రాజెక్టు చివరి ప్రాంతంలోని ఆయకట్టుకు నీరందడంలేదు. చెరువుల దుస్థితి చెప్పతరమా.. కొంషేట్పల్లి ప్రాజెక్టు పరిస్థితి ఇలా ఉంటే ఇక చెరువులు మరీ అధ్వానంగా ఉన్నాయి. పంచలింగాల చెరువుద్వారా రబీలో 480 ఎకరాలకు నీరు అందించాల్సి ఉంది. కానీ 100 ఎకరాలకు మించి సాగు కావటంలేదని ఆయకట్టుదారులు అంటున్నారు. చెరువు నుంచి వృథాగా పోతున్న నీటిని తప్పనిసరి పరిస్థితుల్లో ఆయిల్ ఇంజిన్ల ద్వారా నీటిని తోడుకోని పంటలకు నీరందిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. రావులపల్లి చెరువు కింద 329 ఎకరాల ఆయకట్టుదారులకు నీరు అందించాల్సి ఉండగా ఏనాడూ 50 ఎకరాలకు మించి రబీ సాగు కావటంలేదని ఆయకట్టుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్‌ఖోడ చెరువు కింద ఉన్న 568 ఎకరాల ఆయకట్టుకు నీరు అందాలి. కానీ ఏనాడూ కాల్వల ద్వారా నీరు అందించిన దాఖలు లేవు. కల్ఖోడలో కుడి కాల్వ నిర్మాణ పనులు చేపట్టలేదు. ఎడమ కాల్వ నిర్మించినా ఇంతవరకు దానిలోకి నీరు వదలలేదు. మరమ్మతుల పేరుతో మాత్రం ఇప్పటివరకు మూడుసార్లు పనులు చేపట్టి నిధులు కాజేశారు. ఇక పిల్లిగుండ్ల, నర్సాపూర్, ఘనాపూర్, పట్లూర్, వీర్లపల్లి, సిరిపురం, తిమ్మాపూర్, కొంషేట్పల్లి పాత చెరువుల పనులు నాసిరకంగా చేపట్టడంతో తూముల నుంచి నీరు వృథాగా పోతోందని ఆయా గ్రామాల ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. మండలంలోని 22 కుంటలు పూడిక తీతతో నిండిపోయి నిరుపయోగంగా మారాయి.