
సాక్షి, వికారాబాద్: ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన నవ వధువును వాగు బలితీసుకుంది. కాళ్లపారాణి ఆరకముందే ఆమె మృత్యువాత పడింది. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం అలుముకుంది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన మైలారం బాల్‌రెడ్డి కుమారుడు నవాజ్‌రెడ్డికి మోమిన్‌పేట మండల కేంద్రానికి చెందిన ప్రవళ్లికతో శుక్రవారం వివాహం జరిగింది.
విందు కోసం వధూవరులు, బంధువులు ఆదివారం మోమిన్‌పేటకు వెళ్లారు. సాయంత్రం స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ సమీపంలోని వాగు దాటేక్రమంలో ప్రవాహ తీవ్రతను అంచనా వేయని డ్రైవర్ కారును అలాగే ముందుకు తీసుకెళ్లాడు. దీంతో అందులో ఉన్న నవ దంపతులతో పాటు పెళ్లికూతురు సోదరి, వరుడి అక్క, చెల్లి, ఎనిమిదేళ్ల బాలుడు ఇషాంత్‌రెడ్డి గల్లంతయ్యారు. వరదలో గల్లంతైన వారిలో వరుడు, ఆయన సోదరి మాత్రం ప్రాణాలతో బయటపడగా.. వధువు ప్రవళ్లికతో పాటు మరొకరి మృతదేహం సోమవారం లభ్యమైంది. మరో ఇద్దరికి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వికారాబాద్ డిఎస్పీ సంజీవరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment