Telangana | Vikarabad Student Case: Accused Confessed Crime - Sakshi
Sakshi News home page

Vikarabad Student Case: వికారాబాద్‌ హత్యాచారం కేసు.. తాగిన మత్తులో లైంగిక వాంఛ తీర్చమని ఒత్తిడి, నేరం ఒప్పుకున్న నిందితుడు!

Published Wed, Mar 30 2022 8:08 AM | Last Updated on Wed, Mar 30 2022 10:17 AM

Vikarabad Student Case: Accused Confessed Crime - Sakshi

సాక్షి, వికారాబాద్: వికారాబాద్‌ విద్యార్థిని కేసులో పురోగతి కనిపిస్తోంది. పదో తరగతి విద్యార్థినిపై ఆమె స్నేహితుడే హత్యాచారానికి పాల్పడినట్లు దాదాపుగా నిర్ధారణ అయ్యింది. ప్రధాన నిందితుడు మహేందర్‌ అలియాస్‌ నాని నేరం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. 

తాగిన మైకంలో లైంగిక వాంఛ తీర్చమని సదరు విద్యార్థినిని నిందితుడు బలవంత పెట్టాడు. అయితే ఆమె ఒప్పుకోకపోవడంతో తెల్లవారు ఝామున కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం తలను చెట్టుకు బాది.. ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. కీలక ఆధారాలతో పోలీసులు నేడు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. 

వికారాబాద్‌ పూడూర్‌ మండలం అంగడి చిట్టంపల్లిలో సోమవారం ఉదయం 16 ఏళ్ల విద్యార్థిని అత్యాచారం, హత్య కేసు సంచలన సృష్టించింది. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఇంటి నుంచి 500 మీటర్ల నిర్మానుష్య ప్రాంతంలో విగతజీవిగా పడి ఉంది. నిర్మానుష్య ప్రాంతంలో  బాలిక దుస్తులు చెల్లా చెదురుగా పడి ఉండటంతో అత్యాచారం చేసి హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో బాధితురాలి తల్లి పొంతనలేని సమాధానాలు చెప్తుండడంతో.. ఆమెను కూడా ప్రశ్నించారు. నిందితుడు ఒక్కడేనా? లేదా జరిగింది సామూహిక హత్యాచారమా?  అన్నది ఇవాళ్టి పోలీసుల ప్రెస్‌ మీట్‌లో వెల్లడయ్యే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement