pudur
-
పుదూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
టాలీవుడ్ నటుడుకి కత్తులు, గన్‌తో బెదిరింపు.. పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఆగడాలు రోజురోజుకూ శ్రుతిమించిపోతున్నాయి. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి.. పూడూరు మండలం కేరవెళ్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 14, 15, 16, 17, 18, 19లలో 29.19 ఎకరాల పొలాన్ని హైదరాబాద్‌కు చెందిన నటుడు రణధీర్‌రెడ్డి కొనుగోలు చేశారు. ఈయన పేరున ధరణి పట్టాదారు పాస్‌బుక్కులు సైతం వచ్చాయి. కొనుగోలు చేసిన పొలంలో పంటలు వేశారు. అందులో చుట్టూ కంచె వేస్తుండగా.. హైదరాబాద్‌కు చెందిన సుల్తాన్ హైమద్ పనులను అడ్డుకున్నాడు. అంతటితో ఆగకుండా తనవద్ద ఉన్న గన్ తీసి బెదిరించాడు. అతనితో పాటు వచ్చిన స్నేహితులు సైతం కత్తులతో రణధీర్‌రెడ్డిని భయబ్రాంతులకు గురిచేశారు. గతంలోనూ హైమద్ రైతులను బెదిరించి ఇక్కడ ఓ షెడ్ నిర్మించాడు. గుంపులుగా గుర్రాలపై తిరుగుతూ తమతో పాటు ఇక్కడ భూములను కొనుగోలు చేసిన వారిని భయపెడుతూ.. కబ్జాలకు పాల్పడుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైమద్ తన అనుచరులతో వచ్చి గన్, కత్తులతో తమను బెదిరించాడని రణధీర్‌రెడ్డి చన్గోముల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గన్ స్వాధీనం.. సుల్తాన్ హైమద్ వద్ద గన్ ఉన్నది వాస్తవమేనని.. అది లైసెన్సుడ్ గన్ అని చన్గోముల్ ఎస్ఐ శ్రీశైలం తెలిపారు. నటుడు రణధీర్‌రెడ్డి 29.19 ఎకరాలు కొనుగోలు చేశాడని, అతని వద్ద పూర్తి రికార్డులు ఉన్నాయని చెప్పారు. హైమద్ మాత్రం తన పూర్వికులకు సంబంధించిన భూమి అని కబ్జాలో ఉన్నాడన్నారు. అతని నుంచి గన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చదవండి: Dhanush: నువ్వు హీరో ఏంట్రా? అంటూ హేళన చేశారు -
బాలికకు మద్యం తాగించి లైంగిక దాడి
సాక్షి, వికారాబాద్: బాలికపై ఒకరు లైంగిక దాడికి పాల్పడగా.. మరొకరు యత్నించారు. ఈ ఘటన పూడూరు మండలంలో చోటుచేసుకుంది. పరిగి సీఐ వెంకటరామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మీర్జాపూర్‌కు చెందిన బాలిక (17) ఇంటి వద్ద ఉండగా అదే గ్రామానికి చెందిన కుర్వ ప్రవీణ్ (19) పొలంలోకి లాక్కెళ్లాడు. బలవంతంగా మద్యం తాగించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇది గమనించిన మరో యువకుడు చాకలి రవి (29) అక్కడికెళ్లడంతో ప్రవీణ్ అక్కడి నుంచి జారుకున్నాడు. అదే అదనుగా భావించిన రవి.. బాలికపై లైంగికదాడికి పాల్పడుతుండగా ప్రతిఘటించి బాలిక ఇంటికి చేరుకుంది. విషయం కుటుంబ సభ్యులకు చెప్పింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: బాలికపై ఏడాదిగా లైంగిక దాడి.. గర్భం దాల్చడంతో -
వికారాబాద్ హత్యాచారం కేసు.. మద్యం మత్తులోనే!
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ విద్యార్థిని కేసులో పురోగతి కనిపిస్తోంది. పదో తరగతి విద్యార్థినిపై ఆమె స్నేహితుడే హత్యాచారానికి పాల్పడినట్లు దాదాపుగా నిర్ధారణ అయ్యింది. ప్రధాన నిందితుడు మహేందర్ అలియాస్ నాని నేరం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తాగిన మైకంలో లైంగిక వాంఛ తీర్చమని సదరు విద్యార్థినిని నిందితుడు బలవంత పెట్టాడు. అయితే ఆమె ఒప్పుకోకపోవడంతో తెల్లవారు ఝామున కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం తలను చెట్టుకు బాది.. ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. కీలక ఆధారాలతో పోలీసులు నేడు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. వికారాబాద్ పూడూర్ మండలం అంగడి చిట్టంపల్లిలో సోమవారం ఉదయం 16 ఏళ్ల విద్యార్థిని అత్యాచారం, హత్య కేసు సంచలన సృష్టించింది. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఇంటి నుంచి 500 మీటర్ల నిర్మానుష్య ప్రాంతంలో విగతజీవిగా పడి ఉంది. నిర్మానుష్య ప్రాంతంలో బాలిక దుస్తులు చెల్లా చెదురుగా పడి ఉండటంతో అత్యాచారం చేసి హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో బాధితురాలి తల్లి పొంతనలేని సమాధానాలు చెప్తుండడంతో.. ఆమెను కూడా ప్రశ్నించారు. నిందితుడు ఒక్కడేనా? లేదా జరిగింది సామూహిక హత్యాచారమా? అన్నది ఇవాళ్టి పోలీసుల ప్రెస్ మీట్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. -
వికారాబాద్ పూడూర్ హత్యాచారం కేసులో ట్విస్ట్
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం అంగడి చిట్టంపల్లి గ్రామంలో పదో తరగతి చదివే అమ్మాయి హత్యాచారం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు. కేవలం ఆరుగురు అనుమానితులను మాత్రమే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం కాలకృత్యాలకు వెళ్లిన అమ్మాయిపై అత్యాచారం, ఆపై హత్యకు పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన సంచలనం సృష్టించగా.. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి ఆమె స్నేహితుడిపైనే కుటుంబ సభ్యులు తొలుత అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ కేసులో విద్యార్థిని ప్రియుడు నోరు మెదపడం లేదంటూ, అలాగే తల్లి పాత్రపై అనుమానాలంటూ కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఆరుగురిని కేవలం అనుమానంతోనే విచారిస్తున్నామని ఎస్పీ తెలిపారు. అయితే విచారణలో బాధితురాలి తల్లి పొంతనలేని సమాధానాలు చెప్తుండడంతో.. ఆమెను కూడా ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకానీ.. ఈ కేసులో ఇంతవరకు ఎవరిని కూడా అధికారికంగా ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇవాళ సాయంత్రానికి ‘టెక్నికల్ ఎవిడెన్స్’ లభ్యమయ్యే అవకాశం ఉందని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. సంబంధిత వార్త: వికారాబాద్‌లో విద్యార్థినిపై అత్యాచారం, ఆపై హత్య -
వికారాబాద్ లో దారుణం..విద్యార్థినిపై అత్యాచారం
-
విద్యార్థిని హత్యాచార ఘటన.. ఆదివారం రాత్రి పార్టీ చేసుకున్న నిందితులు?
సాక్షి, వికారాబాద్: జిల్లాలోని పూడురు మండలం అంగడి చిట్టంపల్లిలో 16 ఏళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. సోమవారం ఉదయం 5.30 నిమిషాల ప్రాంతంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి నుంచి 500 మీటర్ల నిర్మానుష్య ప్రాంతంలో శవమై కనిపించిందన్నారు. నిర్మానుష్య ప్రాంతంలో బాలిక దుస్తులు చెల్లా చెదురుగా పడి ఉండటంతో అత్యాచారం చేసి హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే బాలిక అరుపులు కూడా ఎవరికీ వినిపించలేదని స్థానికులు చెబుతున్నారు. మద్యం మత్తులో సామూహిక అత్యాచారం? కాగా ఈ కేసులో ఇదే గ్రామంలో ఉండే ముగ్గురు యువకులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా నివాసముండే మహేందర్ అలియాస్ నాని అనే యువకుడిపై బాలిక తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్న క్రమంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నానితో పాటు అశోక్ అనే మరో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే నాని నివాసంలో ఆదివారం రాత్రి పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో తెల్లవారుజామున వరకు మద్యం సేవించి మద్యం సేవిస్తూ ఉన్నారని, మద్యం మత్తులోనే యువకులు బాలికపై సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంబంధిత వార్త: వికారాబాద్‌లో విద్యార్థినిపై అత్యాచారం, ఆపై హత్య ఇదిలా ఉండగా హత్యకు గురైన మైనర్ బాలిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. పరిగి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బాలిక మృతదేహాన్ని చిట్టంపల్లి గ్రామానికి తీసుకొని వచ్చి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. దోషులను కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న మహేందర్ అలియాస్‌నాని పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న క్రమంలో ఆయన తండ్రి లక్ష్మయ్య వాదన మరో విధంగా ఉంది. చదవండి: తండ్రి కళ్లెదుటే ఘోరం.. ప్రేమతో కొనిచ్చిన స్పోర్ట్స్ బైక్ మీదే ప్రాణం పోయింది నా కొడుకు అమాయకుడు తన కొడుకు అమాయకుడని తెలిపారు. బాలిక ఇంటికి అప్పుడప్పుడు వెళ్తుండే వాడని, అవసరం ఉన్నపుడు సహాయం కోసం వాళ్ళు పిలుస్తారని పేర్కొన్నారు. ఆ అమ్మాయికి తన కొడుక్కి పరిచయం ఉందని తెలిపిన లక్క్ష్మయ్య.. అయితే వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసిందన్నారు. కానీ ఈ విషయం తనకు ముందు తెలీదన్నారు. ఉదయం సంఘటన జరిగినపుడు కొడుకు తమ ఇంట్లోనే ఉన్నాడని, రాత్రి ఇంట్లో ఫంక్షన్ జరిగిందన్నారు. తన కొడుకు గొడవలు పడే మనిషి కాదని, ఇలాంటి తప్పుడు పనులు చేయడని తెలిపారు. తప్పు ఎవరు చేసినా వాళ్ళకి ఉరిశిక్ష పడాలని తెలిపారు. -
వృద్ధ గోవులకు పింఛను
పూడూరు: గోమాత రక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని దామ గుండం రామలింగేశ్వరాలయాన్ని మంగళవారం సందర్శించారు. అనంతరం పూడూరుకు చెందిన 20 వృద్ధ గోవులకు రూ.500 చొప్పున పింఛను అందజేశారు. అమృంతగమయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్యానందస్వామి సౌజన్యంతో గోవుల రక్షణ కోసం యజమానికి ప్రతినెలా500 చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒక్కో ఆవుకు రూ.375తో బీమా చేయించామని, ఆ గోవు మరణిస్తే రైతుకు రూ.35 వేల బీమా అందుతుందని స్పష్టం చేశారు. -
నేవీరాడార్ ఏర్పాటు చేయొద్దు
సాక్షి, పూడూరు: దామగుండం అటవీ ప్రాంతంలో 2,900 ఎకరాల్లో నిర్మించతలపెట్టిన నేవీరాడార్ కేంద్రం ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ గురువారం పూడూరు మండల జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ధర్నాలో విద్యార్థులు మాట్లాడుతూ.. నేవీ రాడార్ ఏర్పాటు చేసి తమకు అన్యాయం చేయరాదని తమకు బతకాలని ఉందని, తమ కుటుంబాలకు ఆసరాగా ఉండాలని, తమ ఆరోగ్యాలను పాడు చేయరాదని అన్నారు. పర్యావరణాన్ని కాపాడాలని.. కేసీఆర్ తాత, మోదీతాత మాకు న్యాయం చేయలని కోరారు. నేవీరాడార్ ద్వారా విషపూరిత సిగ్నల్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి తమ జీవితాలను నాశనం చేయరాదని వేడుకున్నారు. త్వరలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌కు, హైకోర్టు న్యాయమూర్తికు పోస్టుకార్డు ద్వారా ఉత్తరాలను రాస్తామని విద్యార్థులు తెలిపారు. -
అదుపు తప్పి.. పొలాల్లో 100 మీటర్ల లోపలికి దూసుకెళ్లి..
సాక్షి, చేవెళ్ల: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో అధికారులు ప్రైవేటు డ్రైవర్లను పెట్టి బస్సులను నడిపిస్తున్నారు. అయితే, వీరికి అనుభవం లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం హైదరాబాద్ నుంచి తాండూరు వైపు వెళ్తున్న తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు(ఏపీ 29జడ్3608) పూడూరు మండలం అంగడిచిట్టంపల్లి గేట్ వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డుకిందకు దిగి పంట పొలాల్లోకి వెళ్లింది. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా కేకలు పెట్టారు. సుమారు 100 మీటర్ల లోపలికి వెళ్లి ఆగింది. రోడ్డు పక్కన పొలం చదునుగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా తీవ్ర భయాందోళనతో ఒక్కసారిగా కిందకు దిగారు. కొందరు ప్రయాణికులు కిటికీల నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత వేర్వేరు వాహనాల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. -
‘మీ నాన్నను చంపేశాను’
సాక్షి, పూడూరు: మతిస్థితిమితం కోల్పోయిన ఓ మహిళ తాను కట్టుకున్న భర్తపై గొడ్డలితో దాడి చేసి చంపేసింది. వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ అరుణ్‌కుమార్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని సోమన్గుర్తి గ్రామానికి చెందిన మంగళి యాదమ్మ, వెంకటయ్య(60) దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు, ఓ కూతురు ఉండగా వారి వివాహం జరిగింది. యాదమ్మ, వెంకటయ్య గ్రామంలో వేరుగా నివాసముంటున్నారు. అయితే, మూడేళ్లుగా యాదమ్మ మతిస్థిమితం కోల్పోయి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తోందని కుటుంబీకులు తెలిపారు. పలు ఆస్పత్రుల్లో ఆమెకు వైద్యం చేయించారు. కొంతకాలంగా యాదమ్మ మాత్రలు వాడుతోంది. అయితే, గత 15 రోజులగా వినియోగించడం లేదు. ఇదిలా ఉండగా, బుధవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో యాదమ్మ తన భర్త వెంకటయ్య మెడపై గొడ్డలితో తలపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం రక్తం మరకలు నీటితో కడిగేసింది. ఆ తర్వాత గ్రామంలో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్లిన యాదమ్మ ‘మీ నాన్నను చంపేశాను’ అని తెలిపింది. దీంతో కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పరిగి సీఐ మొగులయ్య సందర్శించి వివరాలు సేకరించారు. తానే గొడ్డలితో నరికి చంపినట్లు యాదమ్మ పోలీసులకు చెప్పింది. అయితే, నిందితురాలు భర్త హత్య అనంతరం రక్తం మరకలను శుభ్రం చేయడంతో ఆమెకు మతిస్థిమితం లేకపోవచ్చని సీఐ మొగులయ్య అనుమానం వ్యక్తం చేశారు. ఈమేరకు మృతుడి కుమారుడు మంగళి బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పూడూరులో భార్యాభర్తల ఆత్మహత్య
పూడూరు: కుటుంబకలహాలతో భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన బుధవారం పూడూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాలు..పూడూరు మండలం పెద్దఉమ్మెత్తల్ గ్రామానికి చెందిన తిరుమలయ్య(30), రమాదేవి(25)లు దంపతులు. కాగా బుధవారం రమాదేవి ఇంటి దగ్గర ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇది తెలిసిన తిరుమలయ్య పక్క ఊర్లోని రాగంచెర్ల లక్ష్మీనరసింహ ఆలయం పక్కనున్న నీటికొలనులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి ఆత్మహత్మకు కారణాలు తెలియరాలేదు. -
ప్రత్యర్ధుల దాడిలో వ్యక్తి దారుణ హత్య
పూడూరు: ప్రత్యర్థుల దాడిలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం మంచన్‌పల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు గ్రామానికి చెందిన రైతు రమేశ్ (25)ను ప్రత్యర్థులు సోమవారం అర్ధరాత్రి దాడిచేశారు. అతడిని చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టడంతో...ఆ దెబ్బలకు తాళలేక రమేశ్ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగు చూడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
వృద్ధ దంపతుల హత్య
పూడూరు, న్యూస్‌లైన్: వృద్ధ దంపతులను హత్య చేసి ముఖాలు గుర్తించకుండా దహనం చేసిన దారుణ సంఘటన పూడూరు మండలంలో శనివారం కలకలం రేపింది. ధారూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన కల్కోడ అంజయ్య (70), లక్ష్మమ్మ(65) దంపతులు. పూడూరు మండలం ఎన్కెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మంగమ్మ (మంగేశ్వరి) ఫాంహౌస్‌లో నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు. ఎప్పటి లాగే శుక్రవారం రాత్రి ఫాంహౌస్‌లో ట్రాక్టర్‌తో పనులు చేయించారు. శనివారం ఉదయం ట్రాక్టర్ డ్రైవర్ వచ్చి చూసే సరికి ఇద్దరూ ఫాంహౌస్‌లోని వంట గదిలో కాలిబూడిదై కనిపించారు. వెంటనే అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. చన్గొముల్ పోలీసులతోపాటు చేవెళ్ల సీఐ గంగారం, ఎస్ఐ శేఖర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్పీ రాజకుమారి, చేవెళ్ల డీఎస్పీ శిల్పవల్లి, సంఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన ప్రదేశాన్ని, పూర్తిగా కాలిపోయిన మృతదేహాలను పరిశీలించారు. వెంటనే క్లూస్ టీం, జాగిలాలను రంగంలోకి దింపారు. క్లూస్ టీం హత్య జరిగిన గదిలో ఆధారాలు సేకరించారు. జాగిలం ఫాంహౌస్ గదుల చుట్టూ తిరిగి నేరుగా రోడ్డుపైకి వెళ్లి ఆగిపోయింది. తల్లిదండ్రుల మృతదేహాలను చూసి కుమారులు వెంకటయ్య, ప్రభాకర్, కూతురు యాదమ్మ బోరున విలపించారు. డబ్బు, నగల కోసమే ఘాతుకం.. ? అంజయ్య, లక్ష్మమ్మ ఉండే ఇంటిపై కప్పు రేకులు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. దీన్ని బట్టి దుండగులు డబ్బులు, లేదంటే నగల కోసం వచ్చి ఉంటారని.. రేకులు పగులగొట్టి ఇంట్లో చొరబడి ఉంటారని.. వృద్ధ దంపతులు దుండగుల మధ్య తోపులాట జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సిమెంట్ ఇటుకలతో మోది చంపి ఆపై వంట గదిలోకి శవాలను తీసుకెళ్లి వంటిపై కిరోసిన్, లేదా పెట్రోల్ పోసి నిప్పంటించి ఉంటారని భావిస్తున్నారు. ఇది తెలిసినవారి పనేనన్న అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.