ప్రత్యర్ధుల దాడిలో వ్యక్తి దారుణ హత్య | man murder in rangareddy distirict | Sakshi
Sakshi News home page

ప్రత్యర్ధుల దాడిలో వ్యక్తి దారుణ హత్య

Published Tue, Mar 24 2015 12:51 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

man murder in rangareddy distirict

పూడూరు: ప్రత్యర్థుల దాడిలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఈ సంఘటన  రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం మంచన్‌పల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు గ్రామానికి చెందిన రైతు రమేశ్ (25)ను ప్రత్యర్థులు  సోమవారం అర్ధరాత్రి దాడిచేశారు. అతడిని చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టడంతో...ఆ దెబ్బలకు తాళలేక రమేశ్ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగు చూడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement