
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం అంగడి చిట్టంపల్లి గ్రామంలో పదో తరగతి చదివే అమ్మాయి హత్యాచారం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు. కేవలం ఆరుగురు అనుమానితులను మాత్రమే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
సోమవారం ఉదయం కాలకృత్యాలకు వెళ్లిన అమ్మాయిపై అత్యాచారం, ఆపై హత్యకు పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన సంచలనం సృష్టించగా.. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి ఆమె స్నేహితుడిపైనే కుటుంబ సభ్యులు తొలుత అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ కేసులో విద్యార్థిని ప్రియుడు నోరు మెదపడం లేదంటూ, అలాగే తల్లి పాత్రపై అనుమానాలంటూ కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వెల్లడించారు.
ఆరుగురిని కేవలం అనుమానంతోనే విచారిస్తున్నామని ఎస్పీ తెలిపారు. అయితే విచారణలో బాధితురాలి తల్లి పొంతనలేని సమాధానాలు చెప్తుండడంతో.. ఆమెను కూడా ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకానీ.. ఈ కేసులో ఇంతవరకు ఎవరిని కూడా అధికారికంగా ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇవాళ సాయంత్రానికి ‘టెక్నికల్ ఎవిడెన్స్’ లభ్యమయ్యే అవకాశం ఉందని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
సంబంధిత వార్త: వికారాబాద్‌లో విద్యార్థినిపై అత్యాచారం, ఆపై హత్య
Comments
Please login to add a commentAdd a comment