కుటుంబకలహాలతో భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన బుధవారం పూడూరు మండలంలో చోటుచేసుకుంది.
పూడూరు: కుటుంబకలహాలతో భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన బుధవారం పూడూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాలు..పూడూరు మండలం పెద్దఉమ్మెత్తల్ గ్రామానికి చెందిన తిరుమలయ్య(30), రమాదేవి(25)లు దంపతులు. కాగా బుధవారం రమాదేవి ఇంటి దగ్గర ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇది తెలిసిన తిరుమలయ్య పక్క ఊర్లోని రాగంచెర్ల లక్ష్మీనరసింహ ఆలయం పక్కనున్న నీటికొలనులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి ఆత్మహత్మకు కారణాలు తెలియరాలేదు.