సాక్షి, వికారాబాద్: జిల్లాలోని పూడురు మండలం అంగడి చిట్టంపల్లిలో 16 ఏళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. సోమవారం ఉదయం 5.30 నిమిషాల ప్రాంతంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి నుంచి 500 మీటర్ల నిర్మానుష్య ప్రాంతంలో శవమై కనిపించిందన్నారు. నిర్మానుష్య ప్రాంతంలో బాలిక దుస్తులు చెల్లా చెదురుగా పడి ఉండటంతో అత్యాచారం చేసి హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే బాలిక అరుపులు కూడా ఎవరికీ వినిపించలేదని స్థానికులు చెబుతున్నారు.
మద్యం మత్తులో సామూహిక అత్యాచారం?
కాగా ఈ కేసులో ఇదే గ్రామంలో ఉండే ముగ్గురు యువకులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా నివాసముండే మహేందర్ అలియాస్ నాని అనే యువకుడిపై బాలిక తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్న క్రమంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నానితో పాటు అశోక్ అనే మరో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే నాని నివాసంలో ఆదివారం రాత్రి పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో తెల్లవారుజామున వరకు మద్యం సేవించి మద్యం సేవిస్తూ ఉన్నారని, మద్యం మత్తులోనే యువకులు బాలికపై సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
సంబంధిత వార్త: వికారాబాద్‌లో విద్యార్థినిపై అత్యాచారం, ఆపై హత్య
ఇదిలా ఉండగా హత్యకు గురైన మైనర్ బాలిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. పరిగి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బాలిక మృతదేహాన్ని చిట్టంపల్లి గ్రామానికి తీసుకొని వచ్చి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. దోషులను కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న మహేందర్ అలియాస్‌నాని పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న క్రమంలో ఆయన తండ్రి లక్ష్మయ్య వాదన మరో విధంగా ఉంది.
చదవండి: తండ్రి కళ్లెదుటే ఘోరం.. ప్రేమతో కొనిచ్చిన స్పోర్ట్స్ బైక్ మీదే ప్రాణం పోయింది
నా కొడుకు అమాయకుడు
తన కొడుకు అమాయకుడని తెలిపారు. బాలిక ఇంటికి అప్పుడప్పుడు వెళ్తుండే వాడని, అవసరం ఉన్నపుడు సహాయం కోసం వాళ్ళు పిలుస్తారని పేర్కొన్నారు. ఆ అమ్మాయికి తన కొడుక్కి పరిచయం ఉందని తెలిపిన లక్క్ష్మయ్య.. అయితే వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసిందన్నారు. కానీ ఈ విషయం తనకు ముందు తెలీదన్నారు. ఉదయం సంఘటన జరిగినపుడు కొడుకు తమ ఇంట్లోనే ఉన్నాడని, రాత్రి ఇంట్లో ఫంక్షన్ జరిగిందన్నారు. తన కొడుకు గొడవలు పడే మనిషి కాదని, ఇలాంటి తప్పుడు పనులు చేయడని తెలిపారు. తప్పు ఎవరు చేసినా వాళ్ళకి ఉరిశిక్ష పడాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment